Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1972 · The birthday festival
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The birthday festival
23 November 1972, The forty-seventh birthday, Prasanthi Nilayam
First talk
Second talk
1
▾
Meaning
Keep
దేహమే
ప్రధానం
దేహికాదని
భావించుట
మానవుని
ప్రధమ
అజ్ఞానసూత్రం.
అలలులేక
సముద్రముండవచ్చును:
అయితే,
సముద్రములేక
అలలు
వుండవు.
దేహనిమిత్తము
ఆత్మ
రాలేదు;
ఆత్మనిమిత్తమే
దేహము
ప్రాప్తమయినది.
దీనిని
మానవులు
విస్మరించుట
వారు
చేసే
రెండవ
పొరపాటు.
ఆత్మ
నిర్వికారము;
షడ్వికారములన్నియూ
దేహమునకే.
జన్మించిన
వ్యక్తి
ఒకడే
అయిననూ
నీటిపై
పడిన
నూనెబిందువలె.
ఆ
వ్యక్తి
యేకాకిగా
జీవించుట
కంగీకరించటములేదు.
తన
సంతోషమునకూ
ఇతరులసంతోషమునకూ
చేరిక
(Link)
వుంటే
వుంటుంది.
నేను
అనే
స్థానమునుంచి
మనము
అనే
స్థానమునకు
ప్రయాణము
చేయునదే
ఉత్తమ
జీవితము.
గత్యము
అగత్యము
విధి
విధానము
వీటిని
సద్బుద్ధియొక్క
ప్రకాశనశక్తి
ద్వారా
తెలుసుకొని
అట్టి
వికాసమునకు
మానవుడు
పూనుకోవలెను.
మానవుని
సుఖశాంతి
సౌభాగ్యములన్నియూ,
లోకకల్యాణముకూడ,
వాని
బుద్ధిలోనే
ఆధారపడియున్నవి.
మానవుడు
గాయత్రీ
మంత్రముద్వారా
ధీశక్తిని
ప్రచోదించి
బుద్ధిని
పరిశుద్ధముచేసి
అభివృద్ధిపరచుకొరకే
చైతన్య
స్వరూపుడైన
పరమాత్ముని
ప్రార్థించుచున్నాడు.
2
▾
Meaning
Keep
వేరేమీ
కోరనక్కరలేదు;
బుద్ధి
నిర్మల
నిశ్చల
నిఃస్వార్థమయితే
అన్నియూ
దొరికినట్లే.
మానవుని
బుద్ధిని
గతజన్మల
సంస్కృతి,
ప్రారబ్ధబలము,
అతని
భవిష్యత్తు
ఇవి
మూడూచేరి
రూపొందించును.
స్వార్థమునకై
బుద్ధి
వినియోగింపబడిన,
మోహాపేక్ష
పెరుగును;
పరార్థము
కొరకు
వినియోగింపబడిన,
మోక్షాపేక్ష
పెరుగును.
తనతోపాటు
అందరికీ
మోహక్షయమును
ఆశించాలి;
మనస్సు
ప్రాణము
చిత్తము
ఆత్మ
ఈ
క్షేత్రములను
బుద్ధితో
పరిశీలించి
పరిశుద్ధపరచుటకు
పూనుకోవలెను.
ప్రేమను
దానము
చేయాలి,
అహంకారమును
త్యాగము
చేయాలి,
సమాజసేవలో
శౌర్యమును
ప్రకటించాలి,
దయాస్వరూపమైన
హృదయముతో
సమాజమున
ఐక్యతాభావమును
స్థిరపరచాలి,
అందరిలోనూ
ప్రకాశించుచున్న
ఆత్మతత్వమును
సందర్శించి
సంతోషించాలి.
శరీరధారియైన
ప్రతివ్యక్తి
అవతారస్వరూపుడే:
అయితే,
రామ
కృష్ణ
బుద్ధ
క్రీస్తు
వీళ్ల
ఘనత
యేమిటి?
మీకూ
ఆ
అవతారములకూవున్న
భేదమొక్కటే,
మరపు,
యెరుక.
మానవులకు
ఆత్మస్మృతి
లేదు,
మాధవునికి
సదా
సర్వత్ర
ఆ
యెరుక
వున్నది.
దానివలననే,
ఆ
ప్రకాశము,
ఆ
ప్రతిభ,
ఆ
పరాక్రమము,
ఆ
సర్వశక్తి.
అవతారములు
దేశకాలపాత్రాదులకతీతము,
జాగ్రత్
స్వప్న
సుషుప్తాదులకతీతము,
సత్వ
రజ
స్తమో
గుణములకతీతము.
3
▾
Meaning
Keep
Also in his talks
(4)
20 May 1991
The End Of Education Is Character
28 July 1992
To love God for God's own sake: that alone is true Bhakti
19 July 1994
The duty of shaping tomorrow's citizens
28 April 1998
Knowing Oneself Is What Matters
మానవులకు
సుషుప్తిలో
యే
అనుభవమూ
యే
ఆనందమూ
గోచరించవు.
స్వప్నములోని
అనుభవము
వారికి
సుషుప్తిలో
లేవు;
జాగృతిలోని
అనుభవము
ఆనందము
సుఖదుఃఖములు
స్వప్నములో
లేవు.
అన్నీ
అనిత్యమే,
అసత్యమే:
అయితే,
అవతారములకు
ఈ
అవస్థాత్రయములు
లేవు.
అవతారములు
సచ్చిదానంద
స్వరూపులు.
జీవితముయొక్క
నిజస్వరూపమును
తెలుసుకొని,
ఆ
తెలివికి
తగురీతిగా
ప్రవర్తించువాడే
బుద్ధిమంతుడు.
Life
is
a
Challenge;
meet
it!
Life
is
Love;
enjoy
it!
Life
is
a
dream;
realise
it!
Life
is
a
game;
play
it!
ఇట్ల
జీవించి
జీవితమును
కొనసాగించటమే,
సరైన
దిగ్విజయము.
అరణ్యములో
సింహము
నిర్భయముగా
సంచరించి
విజయమునార్జించురీతి,
మానవుడు
ధీరుడై
నిర్భీతుడై
ఆత్మసామ్రాజ్యమునకు
అభిషిక్తుడు
కావలెను.
సింహగర్జనమును
శ్రవణము
చేసిన
తక్షణమే
మృగములంతా
దూరమునకు
పరుగిడును,
అట్లనే,
ఆత్మతత్వ
ప్రకాశము
అంతఃకరణమును
వెలిగించిన
తక్షణమే
ప్రకృతి
సంబంధమైన
భయభ్రాంతులు
అదృశ్యమగును.
4
▾
Meaning
Keep
ప్రచండ
మారుతమువలె
కాలము
కదలి
పోవుచున్నది;
జీవిత
ప్రమాణము
మంచుగడ్డవలె
కరగి
పోవుచున్నది.
అయిననూ,
జీవితముయొక్క
సత్యమును
సార్థకతను
మానవుడు
గుర్తించటము
జరుగలేదు.
అసతోమా
సద్గమయ
తమసోమా
జ్యోతిర్గమయ.
మృత్యోర్మా
అమృతంగమయ.
అని
నోటితో
కోరుచున్నాడే
కానీ,
ఆ
ప్రార్థనయొక్క
ఫలితమును
ఏమాత్రం
సాధించినాడు,
దానివలన
యెంత
సంతృప్తి
కలిగినది,
అని
పరికించిన,
అందరికీ
నిరాశనే
కలుగును.
అవతార
పురుషుల
జన్మ
దినములందు
వారిని
ప్రత్యేకించి
ఆరాధించిన
ఫలితముండదు.
ఆ
పవిత్ర
పురుషుల
వాక్యరత్నములను
హృదయములలో
దాచికొని
ఆచరణలో
అందుకొని
ఆనందించినపుడే
ఆ
ఆరాధన
సార్థకమగును.
భౌతిక
ఆడంబరములు
ఆర్భాటములు
కేవలము
వ్యర్థమే,
నిరర్థకమే.
ఇకపైన
మీమీ
గృహములలో
జన్మదినమును
జరుపుకొని,
హృదయాలలో
ఆదర్శాలను
భద్రపరచుకొని
ఆచరించండి.
అంతేచాలు.
ఆధ్యాత్మిక
బీజమును
హృదయమందు
నాటుకొని
ఆనంద
ఫలమును
ఆరగించండి
అంతేచాలు.
నిరాశకు
గురికాక,
అశాంతికి
చోటివ్వక
సంస్థల
పెద్దలు
ఆచరణరూపమైన
ప్రబోధ
ప్రచరణల
ద్వారా
ఆనందాభివృద్ధిచేసి
అనుభూతులనందించండి.
5
▾
Meaning
Keep
మరొక
విషయం:
నేను
మీకందించే
వాక్యములనూ
సూక్తులనూ
నేనే
ఆచరించి
బోధించుచున్నాను.
నా
Life
ఏ
నా
Message.
మాతృదేవోభవ,
పితృదేవోభవ,
ఆచార్యదేవోభవ
అతిథిదేవోభవ,
అని
నేను
బోధించుచున్నాను
కదా?
ఆ
సూక్తుల
ఆచరణనే
నాకు
ఆనందము,
తృప్తి.
ఇపుడు
నేను
మాతాపిత్రుల
సమాధికి
వెళ్లి,
తగురీతిగా
గౌరవించి,
తరువాత,
ప్రశాంతి
మందిరముపై
ప్రశాంతి
పతాకను
యెగురవేయుచున్నాను.
అయితే
మీరు
ప్రతిహృదయమునూ
ప్రశాంతిమందిరముగా
మార్చుకొని,
దానిపై
ఆ
పతాకను
యెగురవేసుకోవలెను.
అపుడే
మీకు
ప్రశాంతి,
శాశ్వితానందము.
Previous
←
Why Shivam?
Next
Right understanding for all
→