Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1973 · A Life of Morality and Honesty Is the Root of Śānti
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
A Life of Morality and Honesty Is the Root of Śānti
7 June 1973, Summer Course, Brindavan
1
▾
Meaning
Keep
His poems 20
నీతి
నియమము
లేక
తిరిగిన
ధాతకైన
అజ్ఞానముడుగదు
జ్యోతి
లేనిది
అంధకారము
భూతలంబున
బాయకుండు.
పవిత్రాత్మ
స్వరూపులైన
విద్యార్థులారా!
జగన్నాటక
రంగమునందు,
జీవుడు
ఆడని
ఆటగాని,
పాడని
పాటగాని
వేయని
వేషముగాని
లేదు.
అనంత
కాలమునుండి
84
లక్షల
వేషములు
వేసినప్పటికి
తనయొక్క
వేషము
పురస్కరించుకొని
భగవంతుని
అనుగ్రహమునకు
పాత్రులగుటకుగాని
లేక
భగవంతుని
హృదయమును
ప్రసన్నతగావించి
తద్వారా
మనము
ఒక
మెప్పును
బడయుటకు
ప్రయత్నము
చేస్తున్నాము.
ఇంతకాలము
వరకు
మనకు
అట్టి
మెప్పుగాని,
పవిత్రమైన
అనుగ్రహమునకుగాని
చిక్కనటువంటి
పరిస్థితియందు
ఉన్నాము
అంటే
మనయొక్క
ఆట,
పాట,
మాటల
యొక్క
ధోరణి
సవ్యముగా
లేదనే
దీని
అంతరార్థము.
లోకమున
మానవుడు
తలపైన
భారమును
వుంచుకున్నప్పుడు
ఎంత
త్వరగా
తను
ఆ
భారము
దింపు
కోవచ్చునా
అనే
ఉద్దేశ్యముతో
తన
గృహమునకు
అతివేగముగా
ప్రయాణము
సల్పటం
కద్దు.
ఇంతేకాదు
తెల్లవారి
9
గంటలకు
ఆఫీసుకు
పోయిన
అధికారి
ఎప్పుడెప్పుడు
5
గంటలు
అవునా
నేను
నా
స్వగృహమునకు
చేరుదునా
అనే
సంకల్పముతో
తన
స్వస్థానమునకు
చేరే
నిమిత్తమై
ఆ
యొక్క
ఆఫీసరు
కూడను
ప్రయత్నము
సల్పుతుంటాడు.
ఇంతియే
కాదు.
ఏవిధమైన
ప్రయాణము
సల్పినప్పటికిని
బస్సు,
ట్రైను
యిలాంటి
వాటిలో
ప్రయాణము
సల్పినప్పుడు
యింకా
ఎంత
టైము
అయింది,
ఎప్పటికి
మనం
స్టేషను
చేరతాం
అని
గమ్యాన్ని
చేరే
లక్ష్యమునందే
మనము
ప్రయాణము
కూడను
సల్పుతూ
ఉంటున్నాం.
2
▾
Meaning
Keep
మానవుడు
ఎన్ని
జన్మలనుండి
యీ
మానవత్వము
అనే
ప్రయాణము
సల్పుతున్నాడో
కనిపెట్టుటకు
సాధ్యము
కాదు.
అయినప్పటికి
గమ్యము
యొక్క
లక్ష్యాన్ని
ఏమాత్రము
విచారించక
లేక
మానవత్వమనే
పవిత్రతను
తాను
తెలుసుకొనుటకు
ప్రయత్నము
చేయక
ఈ
లోకములో
ఎంతకాలమైనా
జీవించటానికి
ఆశపడుతున్నాడంటే
చాలా
ఆశ్చర్యకరమైన
విషయము.
ఈనాడు
జగత్తునందు
విశ్రాంతి
సంబంధమైన
సాధనలు
విరివిగా
అభివృద్ధి
అవుతున్నవి
గాని
శాంతి
సంబంధమైన
సాధనలు
ప్రయత్నపూర్వకంగా
అభివృద్ది
పరచటానికి
పూనుకోవటం
లేదు.
శాంతి
లేని
మానవుడు
విశ్రాంతి
లభించినాకూడను
అది
మహా
అశాంతిగానే
వాని
దృష్టిలో
ఉంటుంటాది.
24
గంటలు
పనిచేసినప్పటికిని
జ్ఞాని
తన
జీవితమును
శాంతిగానే
గడుపుతుంటాడు.
ఎట్టి
పని
లేకపోయినప్పటికిని
అజ్ఞానికి
నిరంతరము
అశాంతిగానే
వుంటుంటాది.
అయితే
శాంతి
వుండే
ప్రదేశమును
గుర్తించటానికి
మనము
ప్రయత్నము
సల్పక,
ఈ
భూలోకములో
శాంతి
లేదని
చంద్రలోకమునకు
కూడను
ప్రయాణము
సల్పటానికి
పూనుకుంటున్నాము.
అయితే
ఆ
చంద్రలోకములోనైనా
శాంతి
లభిస్తుందా
అంటే
ఆ
లభించటమనేది
తరువాత
మాట్లాడుదాం.
35
కోట్ల
డాలర్లు
ఖర్చుపెట్టి
ఆ
చంద్ర
లోకమునకు
పోవటంచేత
లభించినది
ఏమంటే
దేహమునకు
మాత్రమే
చల్లదనము
లభిస్తున్నాది
గాని
మనస్సులో
భయభ్రాంతులతో
తన
జీవితాన్ని
నడుపుతుంటాడు.
కనుక
మనకు
శాంతి
అన్నది
భూలోకములోగాని
లేక
స్వర్గలోకములో
గాని
లేక
చంద్రలోకములోగాని
లేక
ఇంద్రలోకములోగాని
దక్కటము
కల్ల.
అయితే
శాంతి
ఎక్కడ
వున్నదంటే
శాంతి
తన
యొక్క
అంతర్భాగమైన
హృదయస్థానమందే
ఉంటున్నది.
వెలుపల
భాగమున
లేదు.
వెలుపల
ప్రయత్న
పూర్వకంగా
సాధించటానికి
పూనుకోటం
మనకాలమును
వ్యర్థము
చేసిన
వారమే
అయిపోతాం.
శాంతిని
అనుభవించాలనుకుంటున్న
వ్యక్తి
తనయొక్క
అంతర్దృష్టియందు
తన
భావమును
శుద్ధి
చేసుకున్నప్పుడు
పవిత్రమైన
శాంతికి
కొంత
అర్హులైపోతాము.
ఇది
ఎట్లున్నదనగా
పేరు
పెద్ద
-
ఊరు
దిబ్బ
అన్నట్లుగా
ఉన్నది.
అనగా
చంద్రలోకమునకు
వెడుతున్నాము
అని
పేరు
గొప్పదిగా
ఉంటున్నాదిగాని
మనము
అందులో
సాధించిన
ఫలితము
ఏమీ
లేదు.
యిన్ని
కోట్ల
డాలర్లు
భూలోకములో
పెడితే
ఎంతమంది
జీవులకు
శాంతి
సంతోషములు
లభించటానికి
అవకాశము
ఉంటుంది.
3
▾
Meaning
Keep
ఇదేవిధముగా
భూలోక
మందు
ప్రతి
మానవుడు
కూడను
శాంతి
అనుభవించాలనే
సంకల్పముతో
అనేక
రకములైన
ప్రయత్నములకు,
కార్యములకు
పూనుకుంటాడు.
ఎక్కడ
మనకు
ధర్మము
అనే
భావము
ఉన్నదో
అక్కడే
గుణము
అనేది
ప్రకాశిస్తూ
ఉంటుంది.
ఎక్కడ
గుణము
ఉన్నదో
ఆ
యింటిలోపల
ఐకమత్యము
అనేది
అభివృద్ధి
అవుతుంది.
ఎక్కడ
ఐకమత్యము
ఉన్నదో
ఆ
దేశములో
డిసిప్లిన్
ఉంటుంది.
ఎక్కడ
డిసిప్లిన్
వుంటున్నాదో
ప్రపంచములో
మనకు
శాంతి
లభిస్తున్నాది.
కనుక
శాంతి
అనునది
వ్యక్తియొక్క
గుణముపైన
ఆధారపడి
ఉంటున్నది.
ఇట్టి
గుణమును
మనము
అభివృద్ధిపరచుకున్నప్పుడు
శాంతి
మనకు
లభిస్తుంది.
ఆ
గుణద్వారమే
హృదయస్థానము.
ఆ
హృదయస్థానమే
ఆత్మస్థానము
దీనికొక
చిన్న
తమాషా
కధ.
ఒకానొక
సమయమునందు
దేవుడు
ఒక
జీవిని
సృష్టించి
‘ఓ
జీవా!
నీకు
ఏమి
కావాలి
ప్రశ్నించాడుట,
ఏమి
కావాలో
కోరుకో
నేను
యిస్తాను’
అన్నాడు.
తక్షణమే
దేవి
అన్నదట,
‘ఏమిటండీ!
మీరు
యింత
తెలివితక్కువగా
వరమిస్తున్నారు.
ఏమి
కావాలని
కోరుకోమంటే
మానవుడు
కోరనటువంటిది
ఒక్కటీ
లేదు.
కోరికలంటే
అర్థం
కాదు
కాని,
సర్వమును
కోరుతుంటాడు
మానవుడు.
అలాంటి
జీవునకు
నీ
యిష్టము
వచ్చినది
కోరుకోమని
వానికే
స్వతంత్రము
యిస్తున్నారు,
ఆ
స్వతంత్రము
యివ్వటంచేత
కట్టకడపటికి
మన
ముఖమైనా
వాడు
చూడడు’
అని
ఆమె
హెచ్చరించిందట.
అప్పుడు
దేవుడు
చెప్పాడట,
“దేవీ!
నేను
అంత
తెలివితక్కువ
వాడను
కాను.
మానవునికి
సర్వసుఖములు,
వాడు
కోరినవన్నీ
యిస్తుంటాను
అయితే
అన్ని
కోరికలు
కోరతాడుగాని
ఆత్మశాంతిని
మాత్రం
కోరడు.
అది
మన
దగ్గరనే
పెట్టుకొని
వాడు
కోరినవన్నీ
యిస్తాము.
ఆ
శాంతికోసమైనా
మన
దగ్గరకు
వస్తాడు”
అని
దేవుడు
చెప్పాడట.
అప్పుడు
దేవి
ప్రశ్నించిందట.
ఈ
శాంతి
అనేది
మన
దగ్గర
ఎట్లా
లభిస్తుందంటే,
మన
దగ్గరకు
రానక్కరలేదు,
సర్వస్వరూపుల
యందు
ఆత్మ
స్వరూపములుగా
మనము
ఉంటున్నాము.
స్వార్థరహితమైన
పాలనము,
నీతిని
నిజాయితీలతో
కూడిన
జీవనము
ఎక్కడ
జరుగుతుందో
అక్కడ
శాంతి
వారికి
ఉట్టి
పడుతుంది.
కనుక,
ఈనాడు
మానవుడు
ఏరీతిగా
ఉండాలంటే
the
proper
study
of
mankind
is
man
అని.
అనగా
మనస్సు
యొక్క
యోచన,
మాటయొక్క
సూచన,
క్రియ
యొక్క
ఆచరణ.
ఈ
మూడింటి
యొక్క
ఏకత్వము
కేవలము
ఆత్మస్థానమునందు
మాత్రమే
లభిస్తుంది.
4
▾
Meaning
Keep
అట్టి
ఆత్మస్థానము
నందు
మాత్రమే
యోచన,
పలుకు,
మన
కార్యము
మూడింటి
యొక్క
ఏకత్వము
ఎక్కడ
వుంటుందో
అక్కడ
తప్పక
శాంతి
లభిస్తుంది.
అంతేగాని
మనసులో
ఒక
చింతన;
మాటలో
మరొకటి,
క్రియలో
యింకొకటి
ఆచరించినప్పుడు
వానికి
వాడే
అశాంతిని
అభివృద్ధి
పరచుకుంటాడు.
కనుక,
మనము
ఈ
వయస్సునందు
పవిత్రమైన
ఆత్మస్థానమునుంచి
వచ్చే
ప్రతి
అభీష్టమును
కూడను
సత్యమనే
పలుకు
ద్వారా
అందించి,
కర్మాచరణ
అనే
క్రియలో
అంకితము
చేయుటకు
ఇది
సరైన
వయస్సుగా
ఉండటంచేత
ఈనాడే
మీరు
మానవుడు
అనే
సార్థకనామాన్ని
అందుకునేటందుకు
సక్రమమైన
అభివృద్ధిని
మీరు
చేబడతారని
నేను
విశ్వసిస్తున్నాను.
కామక్రోధ
ద్వేషాదులనే
బలవత్తరమైన
గుణములు
అణగద్రొక్కటంచేత
మానవుని
యొక్క
హృదయమందు
నీతి
నిజాయితీల
యొక్క
తత్త్వము
అణగిమణగి
ఉంటున్నది.
ఈ
కామక్రోధ
ద్వేషములనే
గుణములు
ఎంత
వరకు
మన
హృదయములో
తగ్గిపోతుంటుందో
అప్పుడే
ఈ
నీతి
నిజాయితీల
యొక్క
ప్రకాశము
దినదినాభివృద్ధిగాంచుతుంది.
ఒక
చిన్న
ఉదాహరణము.
జ్యోతి
మనకు
కావాలనుకున్నప్పుడు
ఒక
ప్రమిద,
నూనె,
వత్తి
మూడు
వుండాలి.
ఈ
మూడును
చేరినప్పుడు
భగవత్
కటాక్షమనే
జ్ఞానజ్యోతి
వెలుగుతుంటుంది.
ఇక్కడ
వైరాగ్యమనేదే
ఒక
ప్రమిద.
భక్తి
అనేదే
నూనె.
ఇంక
కర్మ
అనేదే
వత్తి.
ఈ
మూడింటిని
చేర్చటంచేత
జ్ఞానము
అనే
వెలుతురు
మనకు
లభిస్తుంది.
ఈ
మూడు
లేకపోయినప్పుడు
దానిని
అంటించే
పరమాత్ముడు
లేకపోతుంటాడు.
ఈ
మూడు
ఉండికూడను
అంటించేవాడు
లేకపోతే
యీ
మూడు
వృధా
అయిపోతాయి.
ప్రమిద,
నూనె,
వత్తి
కలవు
-
దీపపు
వెలుగు
కలుగునా!
పూలు,
సూది,
దారమున్నవి
-
పుష్పమాల
తానగునా!
స్వర్ణము,
రత్నాలు
కలవు
-
సొమ్ములు
నిర్మాణమగునా!
బుద్ధి
కలదు,
విద్య
కలదు
-
గురువులేక
జ్ఞానియగునా!
జీవతత్వం
మరచి
దైవత్వం
లక్ష్యంగా
పెట్టుకోవాలి
నీకు
బుద్ధి
బాగా
ఉన్నది.
Black
board
పై
'A'
అని
వ్రాసారు.
ఆ
రూపమునకు
'A'
అని
పలకాలని
చెప్పే
గురువు
లేకపోతే
నీకు
ఎంత
బుద్ధి
ఉండి
ఏమి
ప్రయోజనము!
5
▾
Meaning
Keep
His poems 19
Also in his talks
(1)
1 January 1992
Only when the differences of the upādhis are removed does the principle of the one Ātma become our own
ఇంక
చక్కని
బంగారము
ఉన్నది,
వజ్రములున్నవి
కాని
కంసాలి
లేకపోతే
సొమ్ములు
నిర్మాణమగునా!
సూది
దారము
ఉంది.
పూలు
గుచ్చే
వ్యక్తి
లేక
హారము
అవుతుందా!
అదేవిధముగా
మన
తెలివితేటలు
ఎంత
ఉండినప్పటికిని,
భక్తి
కర్మ
వైరాగ్యము
ఉండిన
జ్ఞానములేక
మన
జీవితము
వ్యర్ధమైపోతుంది.
కానీ
మనము
ఈ
జగత్తులో
దేవుడు
అనేవాడు
జీవునిలో
లీనమై
ఉంటున్నాడు.
జీవ
తత్త్వమును
కొంతవరకు
మరచి
దైవతత్వమును
లక్ష్యము
నందుంచుకున్నప్పుడు
మనయొక్క
పవిత్రమైన
జీవితానికి
ఎట్టి
అభ్యంతరములు
వాటిల్లవు.
జీవుడుండు
దేహమందు,
హృదయమందు
దేవుడుండు
రెండు
కూడి
ఆటలాడి
ఒకరినొకరు
వీడుచుంద్రు
బొమ్మలాట
లాడించే
సూత్రధారి
ఒకడు
కలడు
మంచి
చెడ్డ
బొమ్మలుండు,
ఒకటిలోనే
రెండు
ఉండు.
ఒక
గింజ
ఉంటున్నాది.
Seed.
దానిని
పగలగొట్టినప్పుడు
రెండు
బద్దలుగా
ఉంటున్నాది.
రెండు
బద్దలు
చేరినటువంటిదే
విత్తనము.
రెండు
బద్దలు
చేరినటు
వంటిదే
మొక్క
మొలుస్తుంది.
గాని,
రెండు
బద్దలను
వేరు
వేరు
చేసినప్పుడు
మొక్క
మొలవటానికి
వీలు
కాదు.
కనుక,
జీవబ్రహ్మ
అనే
రెండు
బద్దలు
చేరినటువంటిదే
మనయొక్క
జీవితము.
మనము
మానవాకారము
ధరించి,
మానవులనే
పేరుతో
పిలువబడుతూ,
మానవత్వములో
దివ్యత్వమనేది
ప్రకటిస్తున్నాదనే
సార్ధకమైన
కీర్తిని
అందుకుంటూ
కూడను
మనము
మానవత్వము
అనేది
ఏమిటో
అర్ధము
చేసుకోలేని
పరిస్థితిలో
మన
జీవితాన్ని
వ్యర్థము
గావిస్తున్నాము.
మానవుడు
మానవుడుగా
జీవించటమే
మాధవునికి
ఆనందము.
కనుక,
మనము
ఈనాడు
మానవుడు
మాధవుడుగా
కావటము
వీలుకాకపోయినప్పటికిని
మానవుడు
అనే
పేరును
నీవు
ధరించటంచేత
మానవుడుగా
జీవించితే
చాలు,
లోకకళ్యాణము
ఏర్పడుతుంది.
నిజముగా
మనము
మనిషి
అనేపేరుతో
పిలవబడుతున్నప్పుడు
మనిషియొక్క
గుణములే
మనము
ప్రకటించాలి.
దీనికి
రామాయణంలో
చిన్న
ఉదాహరణము.
రావణుడు
సీతను
దక్కించుకొనుటకై
అనేక
ప్రయత్నములు
చేయుచు,
అనేక
రకములైన
రూపములంతా
మారుస్తుంటాడు.
అయితే,
ఆ
సీత
రావణునకు
ఏమాత్రము
చిక్కక,
దక్కక
తప్పించుకుంటూ
నిరంతరము
రామ
చింతనలోనే
తన
జీవితమును
అంకితము
చేసుకుంటున్నాది.
ఈ
పరిస్థితిని
గమనించిన
మండోదరి
రావణుని
దగ్గరకు
వెళ్లి
“స్వామీ!
ఆ
సీతను
పొందే
నిమిత్తమై
మీరు
అనేక
రూపములు
ధరిస్తున్నారు.
6
▾
Meaning
Keep
కాని,
ఆ
రూపములకు
సీత
చిక్కేది
కాదు.
సీత
నీకు
చిక్కాలి,
సీత
నీకు
దక్కాలి
అనే
ఉద్దేశ్యమే
ఉంటే,
నీవు
రామ
స్వరూపమునే
ధరించితివంటే
సీతను
సులభంగా
వశము
చేసుకోవచ్చు
కదా!”
అని
ఒక
ప్లాను
చెప్పింది.
అప్పుడు
“
రామ
స్వరూపం
ధరించిన
నాకు
ఈ
అపవిత్రమైన
గుణాలు
ఎందుకు
వస్తాయి’
అన్నాడు
రావణుడు.
కనుక
రామ
స్వరూపము
చెందినప్పుడు
రామ
భావములే
వస్తాయిగాని
రావణ
భావములు
రావు
అన్నాడు.
ఈ
రావణుడు
చెప్పిన
ఆదర్శమును
ఈనాడు
అనుసరించటంలో
బాగా
ఉంటుంది.
అనగా
మనము
మానవులనము
అనేటువంటి
రూపము
ధరించటంచేత
మనకు
మానవ
గుణములే
రావాలిగాని
వానర
గుణములో
లేక
దానవ
గుణములో
మనలో
చేరకూడదు.
మనము
తెలివితేటలు
అధికముగా
ఉన్నవని
మితిమీరి
మాట్లాడటముగాని,
మితిమీరి
ప్రవర్తించటానికి
పోవటంచేతనే
మనయొక్క
విజ్ఞాన
ప్రజ్ఞాన
సుజ్ఞానములు
మూడింటిని
మనము
కోల్పోతున్నాము.
వివేక
విచక్షణలు
మానవునికి
ప్రధానమైన
లక్షణములు.
పాపమన్న
భయము,
పుణ్యమన్న
ప్రేమ,
పెద్దలన్న
గౌరవము
ఈవిధముగా
అణకువ
మెలకువ
ఉన్న
సమయమునందే
మానవత్వానికి
దివ్యత్వమనే
ప్రకాశము
అభివృద్ధి
గాంచుతుంది.
దేశకాలపాత్రలను
పురస్కరించుకొని
మన
మానవత్వాన్ని
కూడాను
ఏఏ
స్థానములందు
ఏఏ
వ్యక్తికి
ఏఏ
రకమైన
గౌరవాన్ని
గాని,
వినయమును
గాని
అందించటానికి,
మానవునిలోనున్న
వివేకము
అతి
పవిత్రముగా
ప్రవేశపెడుతుంది.
దీనిని
పురస్కరించుకునే
ఆహార
నిద్ర
భయ
మైథునాని
సామాన్యమేతత్
పశుభిర్నరాణి
జ్ఞానం
నరాణామధికం
విశేషః
జ్ఞానేన
శూన్యః
పశుభిస్సమానః
కనుక,
అట్టి
పవిత్రమైన
జ్ఞానము
మానవునియందు
ఉండటం
చేత
ప్రవర్తనలో
మానవత్వాన్ని
మనజీవితంలో
ప్రవేశపెట్టాలి.
అదే
రామాయణము
నందు
హనుమంతుని
విశిష్టమైన
ప్రవర్తన
మనకు
చక్కని
ప్రబోధ
జరుపుతున్నాది.
రాముని
చెంతకు
వచ్చినప్పుడు
హనుమంతుడు
విధేయుడైపోయి,
అతని
అడుగు
జాడలను
వత్తుతూ
పోతుంటాడు.
హనుమంతుడు
రాముని
దగ్గర
యింత
వినయ
విధేయుడై
ఉండటానికి
కారణం
ఏమిటి?
రామో
విగ్రహవాన్
ధర్మః.
రాముడు
ధర్మ
స్వరూపుడు
కనుక
రాముని
దగ్గర
హనుమంతుడు
దీనుడై
నిల్చాడు.
అదే
హనుమంతుడు
లంకకు
పోయినప్పుడు
రావణుడు
సింహాసనముపై
కూర్చోని
కోతీ!
నీవు
క్రింద
కూర్చో
అంటే,
రావణునికంటె
యింకా
పదిరెట్లు
అధికముగా
వాలమును
పెంచి
పైన
కూర్చున్నాడు.
7
▾
Meaning
Keep
కారణం
ఏమిటి?
అక్కడ
చెప్పాడు
హనుమంతుడు.
‘ధర్మము
దగ్గర
నేను
దీనుడను,
దర్పము
దగ్గర
నేను
ధీరుడను’
అన్నాడు.
అదేవిధముగా
మీరు
విద్యార్ధులు,
సక్రమమైన
మార్గమని
మీ
హృదయము
ఒప్పుకున్నదా
ధర్మము
యిది
అని
మా
ఆఫీసర్లు
గాని,
మా
డిపార్టుమెంటుగాని,
మా
మినిష్టర్లు
చేసినది
ధర్మము
అనుకున్నప్పుడు
అక్కడ
ధర్మము
దగ్గర
దీనులై
నిల్చాలి.
అధర్మముగా
ఉన్నప్పుడు
మీరు
ధీరత్వముతో
దానిని
సాధించాలి
గాని
కేవలము
అరాచకత్వమును
పెంచటానికి
పూనుకోకూడదు.
ఈనాడు
ఏది
ధర్మమో,
ఏది
అధర్మమో
అని
మనము
విచారణ
చేయక
మనము
ఏదో
పిచ్చి
పట్టిన
కోతులవలె
విచ్చలవిడిగా
తిరగటం
మొదలు
పెట్టి
కట్టకడపటికి
నిరపరాధులైన
వారినికూడను
హింసించటానికి
పూనుకుంటున్నాము.
దీనికి
ఒక
చిన్న
ఉదాహరణము.
ఒక
విద్యార్ధి
ఒక
హోటలుకు
పోయినాడు.
మంచి
మసాలాదోశలు
రెండు
యిప్పించుకున్నాడు.
తిన్నాడు.
ఆ
హోటలు
వానికి
డబ్బులు
యివ్వకుండా
వస్తున్నాడు.
అప్పుడు
హోటలు
కీపరు
అతని
పట్టుకొని
నా
డబ్బు
నాకు
యిమ్మన్నాడు.
కాని,
విద్యార్ధి
చేసినది
తప్పా,
హోటలు
కీపరు
చేసినది
తప్పా
అని
విచారించుకుని
విద్యార్ధి
చేసినది
తప్పు.
మా
విద్యార్ధులకే
యిది
అవమానకరమైన
విషయము
అని
మిగిలిన
విద్యార్థులు
యోచించి
అంత
త్యాగము,
ఆ
విద్యార్థిపైన
అంత
ప్రేమ
ఉంటే
తమ
జేబులో
నుండి
రెండు
దోశలకు
డబ్బు
యిచ్చి
రావటం
ధర్మము.
అది
సరియైన
మార్గముకాని,
మా
విద్యార్ధిని
హోటలువాడు
కొట్టాడని
విద్యార్ధులంతా
హోటలుపైబడి
దానికి
అగ్గిపెట్టటంలోపల
యింత
ఎంత
అధర్మమో
మీరే
యోచన
చేసుకోవచ్చు.
ఇది
పవిత్రమైన
సరస్వతిని
హృదయస్థానమునందు
పెట్టుకొని
అపవిత్రమైన
కార్యాలకు
పూనుకోవటం
విద్యకే
చాలా
అవమానకరమైనటువంటిది.
కనుక,
విద్యార్థులనే
వారు
వివేకమును
అభివృద్ధి
పరచుకుని
విచారణచేసి
న్యాయాన్యాయముల
లోపల
మనము
దానిని
పరిష్కారముచేసే
దానికిపోవాలి.
అంతేగాని
మనము
విద్యార్థులుగాని
విషయార్థులు
కారాదు.
ఈనాడు
హోటల్లో
ఒక
నయాపైసా
ఎక్కువ
చేసినారంటే
కూడను
స్ట్రైకు.
బస్సు
టిక్కెట్టుపైన
ఎక్కువ
చేస్తే
స్ట్రైకు.
విద్యార్థులకు
సంబంధములేని
విషయములలో
విద్యార్థులు
చేరుకోటం
చేత
మన
విద్యను
మనము
చాలా
అవమానకరమైన
పరిస్థితిలో
వినియోగము
చేస్తున్నామనే
భావించాలి.
సమయమును
పురస్కరించుకుని,
స్థానమును
పురస్కరించుకొని
వానరుడైన
హనుమంతుడే
ఆ
రకంగా
ప్రవర్తిస్తే
మానవులైన
మనము
ఎంత
ఉత్తమమైన
దీనిక్రింది
ప్రవర్తించాలి.
8
▾
Meaning
Keep
వానరునకు
మానవునకు
ఉన్న
భేదము
మీరు
సులభముగా
అర్ధము
చేసుకోవచ్చు.
వా-నర.
వానరకు,
నరకు
ఉన్న
వ్యత్యాసము.
వ
అనగా
వాలము.
వాలముతో
చేరినవాడు
వానరుడు.
వాలము
లేని
వాడు
నరుడు.
కాని
చేష్టలు
రెండూ
ఒక్కటిగానే
ఉంటున్నాయి.
వానరునియందు
నరతత్త్వము
లేదు
కాని
నరునియందు
వానర
తత్త్వము
విశేషంగా
ఉంటున్నాది.
ఈనాడు
అట్టి
శేషమును
దూరం
చేసుకోవటానికే
యిట్టి
పవిత్రమైన
మార్గములో
మనం
ప్రవేశించాలి.
ఇట్టి
విచారణ
చేయటము
చేతనే
నీతి
నిజాయితీ
యొక్క
తత్త్వములను
శంకరుల
యొక్క
శిష్యులు
లోకానికి
చక్కగా
చాటినారు.
నీతి
నియమము
లేక
ఎట్టి
పవిత్రమైన
అధికారికిగాని
అజ్ఞానము
పోవటానికి
వీలుకాదు.
ఈ
నీతి
నియమాలను
మనం
చక్కగా
పాటించాలి.
అకారణమైన
ఉద్రేకములకు
గాని,
కొన్ని
అర్ధముకాని
ఉద్రేకములకు
గాని
మనము
గురికారాదు.
కామ,
క్రోధ,
ద్వేషములనే
దుర్మార్గపు
వృత్తులను
కూడను
ఈ
చిన్న
వయస్సునందు
మనం
చక్కగా
అరికట్టుకొనుటకు
ప్రయత్నం
చేయాలి.
అందుకోసమనే
వేమన
చిన్న
పద్యాలలో
చక్కని
అర్థాన్ని
యిమిడ్చాడు.
కుక్క
తిన్నవాడు
గురు
జంగలింగంబు
పంది
తిన్నవాడు
పరమయోగి
ఏనుగు
తిన్నవాడు
ఎంత
సుజ్ఞానియో
విశ్వదాభిరామ
వినుర
వేమ
కుక్క
అనే
దానికి
ఎందుకాపేరు
వచ్చిందంటే
కోపమునకు
కుక్క
అని
పేరు
పెట్టాడు
వేమన.
కోపమును
అణగద్రొక్కినప్పుడు,
చంపినప్పుడు
వాడు
నిజముగా
లింగస్వరూపుడే
అన్నాడు.
పంది
తిన్నవాడు
పరమయోగి.
పందికి
అహంకారము
అని
పెట్టాడు.
ఏనుగు
అనగా
మదము,
పొగరుబోతుతనము.
ఈ
కోపము,
అహంకారము,
మదము
ఈ
మూడింటిని
మనము
జీర్ణించుకొని,
అణగ
ద్రొక్కుకున్నవాడు
మహాయోగి
అని
వేమన
ఉచ్ఛరించాడు.
కనుక,
ఈనాడు
యువకులైన
మీరు,
అహంకారమునకు
గాని
పొగరుబోతు
తనమునకు
గాని
మనము
స్థానము
యివ్వక
చాలా
ఉత్తమమైన
హృదయముతో
పవిత్రమైన
భావముతో
ప్రేమ,
సత్య,
సహనముల
యొక్క
చిత్తములతో
జీవితమును
మున్ముందుకు
జరపటానికి
మనము
ప్రయత్నము
చేయాలి.
ఆరకంగా
చేయటం
చేత
మానవత్వము
సార్థకమవుతుందని
మీరు
అర్థం
చేసుకోవాలి.
ఈవిధమైన
పవిత్రమైన
ప్రబోధలతో
మీ
చిత్తములను
పరిశుద్ధ
పరచుకొని
క్రమక్రమేణా
ఈ
సమ్మర్
క్లాసులు
అయిన
తరువాత
మీమీ
స్వస్థానములకు
చేరి
మీరు
కూడ
ఈ
విధమైన
పవిత్ర
భావములను
మీమిత్రులుగా
చేర్చుకొని,
సహచరులకు
యిలాంటి
వాటినంతా
చేర్చి
చిన్న
చిన్న
కమిటీలుగా
పెట్టుకొని
దీనిద్వారా
మన
భారతదేశ
సంస్కృతిని
అభివృద్ధి
పరుస్తారని
ఆశిస్తూ
ఆశీర్వదిస్తూ
నా
ప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
Previous
←
This World and the Next
Next
Living in the Present Leads to the Good
→