Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1973 · This World and the Next
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
This World and the Next
6 June 1973, Summer Course, Brindavan
1
▾
Meaning
Keep
పవిత్రాత్మస్వరూపులైన
విద్యార్థులారా!
మానవునియొక్క
స్థితిగతులన్నియు
ధనకనక
వస్తువాహనాదులపైన
ఆధారపడి
ఉండటం
లేదు.
మానవుని
యొక్క
ఉత్తమస్థితి
పవిత్రమైన
గుణముల
పైననే
ఆధారపడి
ఉంటున్నాది.
ఇట్టి
సత్యమును
పురస్కరించుకొనియే,
ధనము,
కనకము
మరియు
వస్తువాహనాదులవలన
మానవత్వమునందు
దివ్యమైన
స్థితి
రానేరదనే
సత్యమును
పురస్కరించుకొనియే
శంకరభగవత్పాదులవారి
శిష్యుల
లోపల
సుమతి
అనే
కడపటి
శిష్యుడు
ఈ
శ్లోకమును
ఉచ్ఛరించాడు.
మానవుని
యొక్క
జీవితము
ఐహిక
ఆముష్మికముల
యొక్క
మిశ్రమము.
ఇట్టి
ఐహిక
ఆముష్మికములందు
మానవుడు
ఐహికమునే
విశ్వసించి
ఆముష్మికమును
విస్మరించి
తన
జీవితమును
ఏదో
ఒక
శాంతి
మార్గములో
గడుపుటకై
ప్రయత్నం
సల్పుతున్నాడు.
చతుర్విధ
పురుషార్ధములైన
ధర్మ,
అర్థ,
కామ,
మోక్షములందు
మొదటిదైన
ధర్మమును
ప్రధానమైన
లక్ష్యమునందుంచుకొని
మోక్షమనేదే
మన
యొక్క
గమ్యముగా
విశ్వసించటం
చేత
అర్థ
కామములు
కూడను
సార్థకమవుతాయి.
ఆధారమును,
ఆధేయమును
విస్మరించి
కేవలము
మధ్యనున్న
అర్థ
కామములకై
మనము
జీవితమును
వ్యర్థము
చేస్తున్నాము.
కనుక
ధర్మార్థ
కామమోక్షములైన
పురుషార్థములను
మనము
రెండు
రూపములుగా
విభజించి
దానిని
ఆధారము
చేసుకున్న
మన
జీవితము
పవిత్రమగుటయేకాక
భారతదేశము
యొక్క
సంస్కృతిని
పునరుద్ధరించటానికి
తగినటువంటి
ప్రయత్నముగా
యిది
సులభమార్గంగా
కనిపిస్తుంది.
ఈనాడు
ఈ
ధర్మార్ధ
కామ
మోక్షములను
మనము
చక్కగా
విచారణ
చేయటానికి
పూనుకున్నప్పుడు,
నాలుగు
పురుషార్ధములయిన
ధర్మ,
అర్ధ,
కామ,
మోక్షములలో.
ధర్మము
పాదము.
మోక్షము
శిరస్సు.
పాదములను,
శిరస్సును
త్రుంచి
వేయటం
వలన
మనము
అర్ధకామములతో
అల్లాడిపోతున్నాము.
ఈ
నాలుగు
మనము
విభజించటంచేత
తబ్బిబ్బు
కావటానికి
కొంత
అవకాశముంటుంది.
ఇట్టి
నాలుగును
రెండుగా
మనము
మరల్చినామంటే
తప్పక
అట్టి
తబ్బిబ్బులకు
అవకాశము
ఉండదని
ఊహించవచ్చు.
2
▾
Meaning
Keep
ధర్మ
అర్ధ
కామ
మోక్షములో
ధర్మ
అర్ధము
ఒకటి,
కామమోక్షము
రెండవది.
రెండుగా
మనము
విభజించుకున్నామా
నిజంగా
మన
జీవితం
ధన్యమౌతుంది.
అర్ధము
ధర్మ
నిమిత్తమని,
కామము
మోక్షనిమిత్తమని
విభాగము
చేసుకున్నప్పుడు
ఎట్టి
తబ్బిబ్బు
కావటానికిగాని,
దారి
తప్పినడవటానికిగాని
అవకాశము
ఉండదు.
అయితే,
ఈనాడు
జీవితమంతయు
అర్ధనిమిత్తము
వ్యర్ధము
చేయటము
మానవునియొక్క
కర్తవ్యముగా
గుర్తిస్తున్నాడు.
కాదుకాదు.
సార్ధకమయ్యే
నిమిత్తమై
ధర్మమార్గములో
అర్ధమును
వినియోగపరచి
మనయొక్క
జన్మజన్మాంతర
పుణ్యమును
కొంతవరకు
అభివృద్ధిపరచుకొని,
పాపమును
మనము
సంహరించుకొని
దివ్యత్వమైన
ఆత్మానుగ్రహానికి
పాత్రులు
కావటానికి
ఒక
అవకాశము
కూడను
ఏర్పడుతుంటుంది.
ఈ
ధనము
అనేది
మోక్ష,
ప్రకృతికి
రెండింటికి
సమన్వయ
మైనది.
ఇహమున
సుఖింపటానికి,
పరమున
సుఖింపటానికి,
అర్ధము
ఆధారమని
మనము
భ్రమిస్తున్నాము.
ఇది
ఉపయోగమునందు
సక్రమమైన
రీతిగా
ఉపయోగపెట్టిన
సరియైన
రీతిగా
ఆనందమునందిస్తుంది.
అదియే
మనము
వక్రమమైన
మార్గమునందు
ప్రవేశపెట్టిన
మన
జీవితమునకు
అశాంతియే
గాక
ప్రమాదాన్ని
కూడా
అందిస్తుంది.
ఈ
ధర్మము
అనే
పదము
ప్రపంచమును
సమత్వమనే
స్థితిలో
యేర్పరచటానికి
ఏర్పడినదేగాని
లేక
సంఘము
యొక్క
అభివృద్ధికిగాని
మనము
భావించకూడదు.
దివ్యత్వమైన
ఆత్మతత్త్వములో
ఏకత్వమైన
సమత్వములో
దీనిని
వినియోగించుకోవటం
సార్థకమని
కూడను
మన
భారతీయ
సంస్కృతిని
పురస్కరించుకొని
ధర్మము
అనేది
ఒకవిధమైన
సమత్వమైన
ఆత్మతత్త్వాన్ని
అందించటానికి
పూనుకుంది.
దీనికి
ఒక
చిన్న
ఉదాహరణము.
ఒక
ప్రదేశములో
లోతైన
గుంతను
మనము
చూస్తుంటాము,
ప్రక్కనే
మట్టి
గుట్టను
చూస్తుంటాము.
అక్కడ
గుంటకు
ఇక్కడ
గుట్టకు
ఎంతో
వ్యత్యాసము
కనిపిస్తుంది.
ఆ
గుట్ట
మట్టిగుంతలో
వేసినప్పుడు
ఆ
గుంతకూడను
సమానత్వమైన
స్థితిలో
ఏర్పడుతుంది.
అదేవిధముగా
ధనవంతుడు
ఎత్తైన
గుట్టవలె
ఉంటాడు.
దరిద్రుడు
లోతైన
గుంతవలె
ఉంటాడు.
కాని
ఆ
గుట్టను
ఈ
గుంతలోపలికి
సరిగా
మార్చినామంటే
సమత్వమనే
మానవత్వము
అభివృద్ధి
కావటానికి
అవకాశము
ఉంటుందనే
ఉద్దేశ్యముతో
దానము,
ధర్మము
అనే
పవిత్రమైన
మార్గమును
మన
భారతీయులు
ప్రవేశపెట్టారు.
మన
భారతసౌధమనే
భవనము,
భూమాత,
వేదమాత,
గోమాత,
దేహమాత
నాలుగు
మాతలపైన
ఆధారపడినటువంటిది.
3
▾
Meaning
Keep
Also in his talks
(10)
27 October 1979
Man and Nārāyaṇa
9 January 1988
God in the heart, work in the hands
1 June 1989
Man is the son of immortality!
25 May 1990
Vagaries of the Mind
2 June 1990
Ascent Of Man
6 May 1992
Only one who lives in the oneness of body, mind and Ātma is a human being
30 September 1998
God's Prema Is Eternal, Everlasting
12 October 1998
The True Place of God's Pādukās Is the Heart Itself
10 February 2000
The Greatness of the Gāyatrī Mantra
25 December 2002
Cast Off Bad Qualities and Foster Prema
ఈ
నాలుగు
మాతలు
భారతదేశమనే
సౌధమునకు
నాలుగు
పిల్లర్స్వలె
ఉంటున్నాయి.
వీటినే
మనం
సత్య,
ధర్మ,
శాంతి,
ప్రేమ
అనేటువంటి
పేర్లతో
పిలుస్తున్నాం.
సత్యముతో
మనము
జగత్తును
కాపాడుకోవాలి.
ధర్మముతో
మన
వేదములను
పునరుద్ధరింపజేయాలి.
శాంతముతో
మన
గోమాతను
కాపాడుకోవాలి.
ప్రేమతో
మన
దేహమాతను
ప్రేమించాలి.
ఈ
నాల్గింటియందు
మనయొక్క
దివ్యత్వమనే
మానవత్వాన్ని
సార్ధకం
గావించుకోవాలి.
సత్యంనాస్తి
పరోధర్మః.
మన
భారత
దేశమునకు
సత్యము,
ధర్మము
ప్రధానమైన
నేత్రములుగా
పెట్టుకొని
భరత
పుత్రులను
కాపాడుతూ
వస్తున్నాది.
ఇట్టి
నేత్రములు
ఉండినప్పుడే
తమ
పుత్రులైన
భారతీయులను,
మాతృదేవిని
కాపాడటానికి
అవకాశము
వుంటుంది
గాని
మాతృదేవియొక్క
నేత్రములను
ఏదోవిధంగా
పొడిచివేయటానికి
పూనుకున్నప్పుడు
మనయొక్క
క్షేమం
కూడను
అవస్థలపాలైపోతుంది.
ఈ
మానవధర్మమనే
స్వరూపాన్ని
ప్రయత్నపూర్వకంగా
ప్రచార
ప్రబోధలు
సల్పటమే
కాకుండా
ఆచరణరూపములో
భారతదేశములో
మనము
అభివృద్ధి
చెందించాలి.
లోకమునందు
దీనులను
చూచి,
లేక
దుఃఖితులను
చూచి,
అసహాయులను
చూచి,
యింకా
అవస్థలపాలైన
వారిని
చూచి
శక్తికొలది
వారికి
తగినటువంటి
తృప్తిగాను,
ఆనందముగను
అనుకూలముగా
సహాయము
చేయటానికి
మనము
సంసిద్ధులమై
ఉంటుండాలి.
ఎందుకనగా,
అందరూ
మానవసోదరులే
కనుక
ఒక్కతల్లిబిడ్డలైన
వారు
కనుక
మాతృదేవియైన
జగన్మాత
ఒక్కటే
కనుక
యిట్టి
పవిత్రమైన
భ్రాతృత్వము
అభివృద్ధి
పరచుకోటానికి
మనము
సంసిద్ధులమై
ఉంటుండాలి.
కాని,
ఈనాడు
దానికి
విరుద్ధమైన
మార్గమునందు
ప్రవేశించి
ధనమువల్ల
మానవుడు
కేవలము
దానవుడుగా
మారటానికి
పూనుకుంటున్నాడు.
దీనినే
వేమన
కూడను
ధనమెచ్చిన
మదమెచ్చును
మదమెచ్చిన
దుర్గుణంబు
మానక
హెచ్చున్
ధనముడిగిన
మదముడుగును
మదముడిగిన
దుర్గుణంబు
మానుర
వేమా!
4
▾
Meaning
Keep
అన్నాడు.
అయితే
ఇది
అందరికి
అన్వయించదు.
ఏదో
కొంతమందికి
మాత్రమే
అన్వయిస్తుంది.
ధనమున్న
పుణ్యాత్ములు
ఎన్ని
ధర్మకార్యములో
చేయటము
మన
భారతదేశములో
కద్దు.
మన
భారతదేశములో
అనేక
పుణ్యక్షేత్రములు,
సరోవరములు,
మండపములు,
దేవాలయములు
యింకా
కొన్ని
రకములైన
బీద
సాదలకు
అన్న
సత్రములు
యిలాంటి
పవిత్రమైనవి
ధనవంతుల
మూలముగానే
జరిగినవి.
అట్టి
సార్ధక
నామమునందుకున్న
మన
భారతదేశమందు
ఈనాడు
ధనమును
సద్వినియోగపరచుకునే
నిమిత్తమై
ప్రతి
వ్యక్తి
కంకణము
కట్టుకోవాలని
ఈ
శంకరుల
శిష్యుడు
ఝుంకారము
ఊదాడు.
సమత్వమును
గుర్తించక
పూర్వము
రామకృష్ణ
పరమహంస
కొంత
ధనమని,
మట్టి
అని
కొంత
భేదమునకు
స్థానమునిచ్చాడు.
ఒకానొక
దినము
తన
ప్రధానమైన
శిష్యుడు
నరేంద్ర
అనగా
వివేకానంద
రామకృష్ణ
పరమహంసను
కొంత
పరీక్షించగోరి
bed
క్రింద
కొన్ని
కాసులను
పెట్టాడు.
తక్షణమే
రామకృష్ణ
పరమహంస
లేచి
తన
వళ్ళంతా
మండినట్లుగా
తాను
అవస్థ
ప్రకటించాడు.
దీనియొక్క
అంతరార్ధము
ఏమనగా
యిది
బంగారమని,
యిది
యేదో
లోహమని,
ప్రత్యేకించిన
మట్టియని
మూడు
భావములు
ఉన్నంతవరకే
యిట్టి
భ్రాంతి
కలుగుతుంది.
ఇట్టి
భ్రాంతి
సమయమందు
యింకా
ఏకత్వము
తాను
పూర్తి
అనుభవించలేదనే
అర్ధము.
ఇట్టి
భేదమును
గుర్తించిన
రామకృష్ణ
పరమహంస
తిరిగి
కొంతకాలము
మట్టిని
ఒక
చేతిలోను,
లోహమును
మరొక
చేతిలోను
పెట్టుకొని,
‘యిది
లోహము
యిది
మట్టి’
బంగారు
మట్టి
అని
రెండింటిని
mix
చేసినప్పుడు
అతనికి
ఏకత్వమనేది
ప్రాప్తించింది.
అప్పుడు
తనకు
పవిత్రమైన
ఆత్మదర్శనము
కనిపించింది.
అయితే
అట్టి
ప్రపంచమునకు
అతీతులైన
వ్యక్తులకు
పరమహంసలకు
ఈ
రెండింటి
తత్వము
ఏకత్వము
వారు
అనుభవించవచ్చును.
ఈ
జగత్తునందు
సంసారులుగా
ఉంటుండి
వారియొక్క
బాధ్యతలు,
వారి
కర్తవ్యములు
నిర్వర్తించుకునే
వ్యక్తులు
ధనమువేరు
మట్టివేరుగా
భావించినప్పటికిని
అంతర
లక్ష్యమునందు
మాత్రము
ఈ
రెండింటి
యొక్క
తత్త్వము
ఒక
భావములోపల
యిముడ్చుకోవటము
అత్యవసరము.
ధనము
వల్ల
కొంతమందికి
కొన్ని
వికారమైన
గుణములు
కూడను
అభివృద్ధి
పొందుతుంటాయి.
మీలో
చరిత్రలు
చదువుకున్న
విద్యార్థులకు
యిది
చక్కగా
అర్ధమవుతుంది.
విక్టోరియా
రాణి
చాలాకాలము
రాజ్యము
ఏలుతూ
వచ్చింది.
ఆమెకు
ఒక
కుమారుడు
ఉండేవాడు.
5
▾
Meaning
Keep
ఎంతకాలమైనా
ఈమెయే
రాజ్యము
ఏలటం
చూచి
కుమారునికి
విసుగు
పుట్టి
ఒకానొక
బహిరంగసభ
లోపల
తనతల్లి
విక్టోరియా
రాణి
కూర్చున్నప్పుడు
దగ్గరకు
వెళ్లి
‘అమ్మా!
ఎంతకాలమునకు
ఛస్తావు.
నీవు
చచ్చిన
తరువాత
కదా
నేను
రాజయ్యేటువంటిది’
అని
ప్రశ్నించాడట.
తక్షణమే
ఆ
విక్టోరియారాణి
కుమారుని
చెరసాలలో
పెట్టించిందట.
అతనే
8th
జార్జిచక్రవర్తి.
కొంతకాలము
మాత్రమే
ఏలాడు.
అటువంటి
ధనవాంఛ
వల్ల
తల్లియందు
ప్రేమకూడా
మార్పు
చేసుకుంటాడు
పుత్రుడైనా.
ఒక
ఉపనిషత్తులో
ధనవంతులకు
కలిగే
గుణమార్పులను
గుర్తించుకొని
ఒక
కథను
కూడా
ఉదహరించారు.
ఒక
తల్లికి
ఏకైక
పుత్రుడుంటాడు.
ఆ
తల్లి
చెంత
చాలా
ధనముంటున్నాది.
తండ్రి
చిన్నతనమునందే
కోల్పోయాడు.
ఈ
ధనం
ఉండటంచేత
ఈ
కుమారుడు
పెరుగుతూ
పెరుగుతూ
దుర్వ్యసనములకు,
దుస్సంగములకు
గురియై
కట్టకడపటికి
ఒక
వెఱ్ఱివానివలే
చేయరాని
చేష్టలకు
దిగజారిపోయి
తన
యొక్క
జీవితమును
అపవిత్ర
జీవితంగా
తీర్చిదిద్దుకుంటూ
వచ్చాడు.
లోకము
కూడను
అట్టి
స్థితిలోనే
వుంటున్నాది
ఈనాడు.
“తెప్పలుగ
చెరువునిండిన
కప్పలు
పదివేలు
చేరు”
అన్నట్లు.
చెరువులో
నీరు
వచ్చి
చేరెనా,
యీ
కప్పలు
ఎన్నో
వచ్చి
చేరిపోతుంటాయి.
నీరు
లేకపోయినా
ఈ
కప్పలు
ఎక్కడికి
పోతాయో
చెప్పి
వెళ్ళవు.
అదేవిధముగా
ధనమున్నంతవరకు
స్నేహితులు
చాలామంది
చేరుతారు.
ధనము
ఏమైనా
తరిగి
పోయెనా
ఫ్రెండ్స్
ఎవరికి
వారు
చెప్పకుండా
వెళ్ళిపోతారు.
ఆవిధముగా
ఈ
ధనవంతుని
కుమారునకు
దుస్సంగము
చేరిపోయారు.
ఇది
క్రమక్రమేణా
మితిమీరి
పోయింది.
చాలామంది
ఈవిధమైన
రీతిగానే
భారతదేశమందు
తమయొక్క
జీవితాన్ని
అర్ధము
చేసుకోలేని
రీతిలో
పోతున్నారు.
సరే
నిత్యము
తల్లి
దగ్గరకు
వచ్చి
తనకు
యింత
ధనముకావాలి,
అంత
ధనము
కావాలని
అడుగుతూ
వచ్చాడు.
క్రమక్రమేణా
తల్లిని
కుమారుడు
ఈవిధంగా
పీడించటంచేత
తల్లికి
కుమారునిపైన
ప్రేమ
తరుగుతూ
ద్వేషము
అధిగమవుతూ
వచ్చింది.
తల్లి
లోలోపల
చింతించుకుంటూ
ఒకవిధమైన
మితిమీరిన
ద్వేషభావము
వచ్చేటప్పటికి
పుత్రభావముకూడను
తల్లిలో
నశించింది.
ఈవిధమైన
తల్లిదండ్రుల
పేరును
చెడిపే
కుమారుడు
ఉండటం
కంటె
పోవటం
మంచిదని
ఒకనాడు
ప్లాను
వేసుకుంది.
అయితే
ఆ
సమయములోనే
కుమారుడు
కూడను
మరొక
ప్లాను
వేసుకున్నాడు.
6
▾
Meaning
Keep
నా
ఆనందమునకు,
స్వేచ్ఛకు
అడ్డువచ్చే
తల్లి
ఉండటంకంటె
పోవటము
మంచిదని
వాడు
కూడను
ప్లాను
వేసుకున్నాడు.
ఒకనాడు
అన్నము
వడ్డించటానికి
వచ్చే
సమయములోపల
చక్కని
యినుపతుంటకఱ్ఱ
దగ్గరపెట్టు
కున్నాడు.
తల్లి
అన్నము
వడ్డించటానికి
వచ్చినప్పుడు
బాగా
తలపైకొట్టి
చంపుదామని
ఒక
ప్లాను
వేసుకున్నాడు.
అదే
దినము
తల్లికి
కూడను
ఈ
కుమారునికి
విషము
కలిపి
పెడదామని
ఒక
భావము
వచ్చింది.
ఆమె
విషము
కలిపి
తెచ్చింది,
వీడు
కఱ్ఱను
దగ్గరపెట్టుకొని
కూర్చున్నాడు.
ఆమె
వంగేటప్పటికి
వీడు
కఱ్ఱతోకొట్టి
ఆమెను
చంపాడు.
కొన్ని
నిముషాలకే
విషము
కలిపిన
అన్నము
భుజించి
మరణించాడు.
ధనము
ఏమి
చేసింది?
విషముతో
కుమారుడు,
వేటుతో
తల్లి
ప్రాణములు
వదిలారు.
ధనము
చేయవలసిన
పని
యిదియా?
అదికాదు.
కనుక,
ధనము
యిలాంటి
దుర్బుద్ధులను
అభివృద్ధి
పరచి
మాతృభావమును,
పుత్ర
వాత్సల్యమును
దూరముచేసేటువంటి
పరిస్థితికి
కూడను
పూనుకుంటుంది.
కనుక,
మనము
ధనమును
ప్రధానముగా
ఆశించక
ధర్మమునే
లక్ష్యముగా
నుంచుకొని
దైవానుగ్రహమునకు
పాత్రులు
కావటానికి
యువకులైన
మీరు
ప్రయత్నం
చేయాలి.
ధనము
అవసరమే
కాని
మన
నిత్యజీవితమునకు
ఎంత
మాత్రమో
అంతనే
పెట్టుకొని
మిగిలినది
దానధర్మాదులకు
వినియోగించుకోవటం
చాలా
అవసరం.
ఈనాడు
విద్యార్ధులయందు
కూడను
ధనము
అధికము
కావటం
వల్ల
చెడిపోయేటువంటి
దృష్టాంతరములు
అనేకంగా
కనిపిస్తున్నాయి.
అది
ప్రప్రధమములో
చాలా
కష్టముగను
చాలా
హింసగా
వుండినప్పటికి
ధనమును
అరికట్టుకోటంచేత
భవిష్యత్తులో
వారు
చాలా
గుణవంతులుగా
రూపొందుతారు.
ఈనాడు
విద్యార్ధులు
తల్లిదండ్రులను
ధనము
అడిగే
సమయములో
తనకు
10
రూపాయలు
అవసరమైతే
తల్లిదండ్రుల
దగ్గర
20
రూపాయలు
అవసరమైందని
అడగటానికి
పూనుకుంటారు.
దానిని
పురస్కరించుకొని
20
రూపాయలు
పిల్లలు
అడిగినప్పుడు
పదిరూపాయలే
తల్లులు
యివ్వటం
చాలా
అవసరం.
ఆ
సమయంలో
కుమారునికి
చాలా
కష్టంగా
వుంటుంది
గాని
తను
భవిష్యత్తులో
చాలా
సుఖపడతాడు.
ఈనాడు
యిరవైరూపాయలు
యివ్వటంవలన
పదిరూపాయలు
తాను
వినియోగించుకొని
మిగిలిన
పదిరూపాయలతో
పదిమంది
స్నేహితులతోచేరి
సినీమాకో
లేక
మిలట్రీ
హోటలుకు
పోవటమో
ఈ
ధనమును
దుర్వినియోగపరచుకొని
దురభ్యాసములకు
తాను
అలవడుతాడు.
7
▾
Meaning
Keep
అయితే
మన
విద్యార్ధులు
అట్లుకాదు
కనుక
అది
మీకు
చెప్పనక్కరలేదు.
దీనికి
ఒక
చిన్న
ఉదాహరణము.
ఒక
తండ్రి
ఒక
శనివారము
తాను
ఏదో
దైవోపాసన
చేస్తూ
‘నాయనా!
ఒక
రూపాయి
యిచ్చి
డజను
అరటిపండ్లు
తెమ్మని
పంపించాడు.
ఆ
కుమారుడు
చాలా
ఉత్తముడైనవాడు
కనుక
మార్కెట్టుకు
వెళ్లాడు
అరటిపళ్లు
తీసుకు
వస్తున్నాడు.
మార్గమధ్యములో
తల్లి,
కుమారుడు
చాలా
ఆకలితో
బాధపడుతూ
నిల్చుకున్నారు.
అప్పుడు
‘నాయనా,
నాయనా’
అరటిపళ్లు
చూచి
కుమారుడు
పరుగెత్తి
వెళ్లాడు,
ఆ
కుమారుని
వెనుకకు
లాగటానికి
తల్లి
పరుగెత్తి
వెళ్లింది.
యిద్దరూ
ఆకలితో
రోడ్డుపై
పడిపోయారు.
ఆ
దృశ్యము
చూచి
కుమారుడు
ఈ
ఆకలితో
అవస్థపడే
వారికి
యివ్వటం
చాలా
ఉత్తమమైన
కర్మ
అనుకొని
ఆ
పండ్లు
వారికి
పెట్టి
కుళాయి
నుండి
నీరు
తెచ్చి
యిచ్చాడు.
వట్టి
చేతులతో
యింటికి
వచ్చాడు
కుమారుడు.
ఆఫలములు
తిని,
నీరు
త్రాగి
ఆ
తల్లి,
పిల్లవాడు
ఈ
కుమారునికి
అనేక
రకములుగా
కృతజ్ఞతలు
తెల్పి
ఆనంద
భాష్పములు
రాల్చారు.
ఆ
దృశ్యమును
ఈ
విద్యార్ధి
చిత్తములోపల
హత్తుకొని
పోయింది.
ఇంటికి
వచ్చిన
తక్షణమే,
‘నాయనా!
ఎక్కడ
అరటిపండ్లు’
అని
అడిగాడు
తండ్రి.
ఆ
కుమారుడు
చెప్పాడు,
‘తెచ్చినాను,
తెచ్చినాను’
అన్నాడు.
ఇక్కడకు
తీసుకునిరా
అన్నాడు.
ఆ
పండ్లు
నీకు
కనిపించవు
అన్నాడు.
నేను
తెచ్చిన
అరటిపండ్లు
ఏనాటికీ
చెడవు.
ఎప్పటికీ
కుళ్లవు.
శిధిలము
కావు.
అట్టి
పవిత్రమైన
అరటిపండ్లు
తెచ్చాను.
ఏమిట్రా
ఆ
పవిత్రమైనవంటే,
‘ఆకలితో
మలమలమాడుతున్న
జఠరమునకు
అరటి
పండ్లు
నింపటం
వల్ల
పవిత్రమైన,
శాశ్వతమైన
ధనమనే
పండ్లను
నేను
తెచ్చుకున్నాను.
ఆ
పవిత్రమైన
కార్యమును
పురస్కరించుకొని
తండ్రి
ఆనందపడి
‘నాయనా!
పూజ
ఈనాడు
సార్ధకమైంది.
ఏ
పవిత్రమైన
కార్యమునకు
నా
కుమారుడు
పవిత్రముగా
ఉపయోగపెట్టాడో
ఆ
ఉపయోగమే
నా
జన్మ
సార్ధకతకు
తగిన
ఆధారము
అనుకున్నాడు
తండ్రి
కుమారులు.
ఆ
విధమైన
సన్నిహిత
భావాన్ని
అలవర్చుకున్నారు.
అట్టి
సన్నిహితమైన
భావములు
అరుదుగా
వుంటున్నవి.
అట్టి
భావములను
మన
విద్యార్ధులు
తిరిగి
అభివృద్ధి
పరచటానికి
తిరిగి
కంకణము
కట్టుకోవాలి.
ఆనాడే
మన
భారతదేశము
ఒక
త్యాగభూమి,
యోగభూమి,
ధర్మభూమి
అనటానికి
సార్ధకమైన
దీనిని
పూర్తిగా
సంపాయిస్తారు.
ఇంక
మాతాపితరుల
సంబంధము
మన
దేశములో
ఎటువంటిదనగా
బర్మాదేశమునుండి
తల్లి,
తండ్రి,
కుమారుడు
చాలా
బాధలు
పడుతూ
మన
భారత
దేశములో
వచ్చి
ప్రవేశించటానికి
చాలా
పరితపిస్తూ
రాత్రింబవళ్లు
నడిచి
వస్తున్నారు.
8
▾
Meaning
Keep
మార్గమధ్యములో
తండ్రి
కొన్ని
అవస్థలకు
గురైపోయి
ఆహారము
లేక
తాను
దేహమును
వదిలాడు.
తల్లి
ఆ
ఎనిమిది
సంవత్సరముల
కుమారుని
వెంట
బెట్టుకుని
భారతదేశములో
ప్రవేశించింది.
కలకత్తాలో
ఒక్కొక్క
దినము
కొన్ని
యిండ్లకు
భిక్షమునకు
వెళ్లటము
కుమారునకు
పెట్టటము,
మిగిలినదే
తాను
తినటము,
మిగలకపోతే
తాను
పస్తువుండి
నీరు
త్రాగి
జీవించటము
ఇలా
జరుగుతూ
వచ్చింది.
ఈ
విధంగా
ఉండుటచేత
దినదినమునకు
భిక్షము
చిక్కటం
తగ్గిపోతూ
వచ్చింది.
ఈ
కుమారునికి
మాత్రమే
పెట్టి
తల్లి
పస్తుండటంచేత
తల్లికి
తీరని
వ్యాధి
ప్రాప్తించింది.
అప్పుడు
తల్లి
లేచి
నడచటానికి
కూడ
చేతకాని
బలహీనత
ఏర్పడింది.
అప్పుడు
ఎనిమిది
సంవత్సరముల
పిల్లవాడు
తల్లి
దగ్గరకు
పోయాడు.
కాళ్లు
పట్టుకున్నాడు.
‘అమ్మా!
నీవు
బిక్షానికి
వెళ్లనక్కరలేదు.
నేను
బిక్షం
తెచ్చి
నీకు
పెడతాను.
నాకు
అనుజ్ఞయియ్యి’
అని
ప్రార్థించాడు.
భారతదేశము
నందు
ఎట్టి
తల్లి
అయినా
కుమారుని
బిక్షమునకు
పంపటమునకు
మనసొప్పదు.
అదే
మాతృదేవి
యొక్క
హృదయము.
కుమారుడు
బిక్షమెత్తుతుంటే
మాతృదేవి
చూడలేదు.
కాని,
విధిలేని
అవస్థయందు
అలాంటి
మాతృదేవి
బిక్షానికి
పంపక
తప్పలేదు.
ఈ
పిల్లవాడు
వెళ్లి
తల్లికి
అన్నము
పెట్టి
తాను
తినక
తల్లికి
తిన్నానని
అబద్ధము
చెప్పటము,
తల్లిని
తృప్తిపరచటం
ఈరకంగా
తన
నిత్యజీవితము
గడుపుతూ
వచ్చాడు.
ఈ
విధముగా
జరుగుతూ
రావటం
చేత
కుమారుని
ఆరోగ్యం
కూడా
దినదినానికి
క్షీణిస్తూ
వచ్చింది.
కాని,
ఒకనాడు
ఒక
పెద్ద
ఆఫీసరు
యింటికి
బిక్షమునకు
వెళ్లాడు.
ఆఫీసరు
వరండాలో
ఈజీ
ఛైర్పైన
పేపరు
చదువుకుంటున్నాడు.
భవతి
బిక్షాందేహి
అన్నాడు.
తన
స్వరము
కూడా
అంతగా
రావటం
లేదు.
చాల
బలహీనమైన
శబ్దముతో
బిక్షమును
అడిగాడు.
సరి.
అతను
చెప్పాడు
‘నాయనా!
నీవు
బలహీనంగా
వున్నావు
ఆకులో
తెచ్చి
వడ్డిస్తాను.
నీవు
యిక్కడే
కూర్చొని
తినమని
చెప్పి
తాను
లోపలకు
పోయి
ఆకులో
అన్నము
పెట్టి
తెచ్చే
లోపలనే
ఈ
పిల్లవాడు
పడ్డాడు.
తక్షణమే
ఏదో
నోటితో
పలుకుతున్నాడు.
ఇది
ఏమిటని
ఆ
ఆఫీసరు
నోటి
దగ్గర
చెవిపెట్టి
వింటుంటే
ఆ
పిల్లవాడు
చెబుతున్నాడు,
‘నాప్రాణం
పోయినా
ఫరవాలేదు.
యీ
అన్నం
అమ్మకు
పంపండి.
అమ్మకు
పంపండి’
అన్నాడు
ప్రాణం
విడిచాడు.
చూడండి.
మాతృదేవి
అయిన
భారతభూమియందు
మాతృప్రేమ
భారతీయుల
రక్తమునందు
చేరటంచేత
ఆ
మాతృభక్తిని
ప్రతివ్యక్తి
ఆవిధంగా
అనుభవిస్తూ
వచ్చినటువంటి
ఆనాటి
భారత
దేశమందు
ఈనాడు
తల్లీబిడ్డలంటే
ఏమి
ప్రేమనో
చెప్పటానికి
వీలుకానటువంటి
పరిస్థితిగా
వికారమార్గము
పట్టింది.
9
▾
Meaning
Keep
దివ్యాత్మస్వరూపులారా!
మాతృదేవోభవ,
పితృదేవోభవ
అన్న
సార్థకమైన
పదములను
మనము
పవిత్రమైన
మార్గములో
ప్రవేశింపజేసి
ఆచరణ
రూపమైన
రీతిక్రింద
మన
భారతదేశ
సంస్కృతిని
పునరుద్ధరించటానికి
కంకణం
కట్టుకోండి.
మొట్టమొదట
తల్లిదండ్రులను
మీరు
సంతృప్తిపరచండి.
తల్లిదండ్రులు
రక్తమునే
కాక
అవసరమైన
సమయమునందు
వారు
పస్తుండి,
అప్పులో
సప్పులో
చేసి,
కొన్ని
కష్టములకు
గురియై
మనకు
తగిన
సుఖాన్ని
అందించటానికి
పూనుకుంటున్నారు.
తల్లిదండ్రులయొక్క
మనస్సును
మనము
నొప్పించితిమా
భవిష్యత్తులో
యేమాత్రము
సుఖశాంతులతో
జీవించలేము.
ఈనాడు
నీవు
తల్లిదండ్రులను
సంతోషపెడితే
రేపటిదినము
నీ
పుత్రులు
నిన్ను
సంతోషపెట్టటానికి
పూనుకుంటారు.
“యద్భావం
తద్భవతి”
మనము
చేసినటువంటిదే
మనకు
ముందు
ఫలిస్తుంది
అని
కూడను
దీనియొక్క
అర్థము.
నీవు
భవిష్యత్తులో
సుఖ
సంతోష
ఆనందములతో
సత్కీర్తిని
ఆర్జించాలని
అనుకున్నప్పుడు
ఈ
వయస్సు
నుండియే
నీవు
మంచి
కార్యాలు
చేయటానికి
పూనుకో.
Be
good,
See
good,
Do
good.
This
is
the
way
to
God.
పెద్దలను
గౌరవించి,
తల్లిదండ్రులను
ప్రేమించి
దేశభక్తిని
అభివృద్ధిపరచుకొని
దైవమును
చేరే
లక్ష్యము
లోపల
మన
జీవితాన్ని
ప్రవేశపెట్టాలి.
దేవుని
మరువద్దు,
మరణమునకు
భయపడవద్దు.
అన్నింటియందు
ధీరుడై,
మహావీరుడై
నీవు
భరతమాత
పుత్రుడవనే
సార్థకనామాన్ని
అందుకోటానికి
సంసిద్ధుడుకా.
అట్టి
ధర్మధనమే
మన
జ్ఞాన
ధనము.
దీనిని
పురస్కరించుకునే
అర్జునుని
ధనుంజయ
అన్నారు.
అనగా
ధనమును
ప్రోగుచేసినవాడని
కాదు.
జ్ఞానధనమే
అర్జునుని
ధనము.
అందువలననే
అర్జునునికి
అర్జున,
ఫల్గుణ,
పార్థ,
కిరీటి,
శ్వేతవాహన,
బీభత్స,
శ్రీకృష్ణ,
సవ్యసాచి,
ధనుంజయ
మొదలగు
సార్ధకమైన
బిరుదులు
లభ్యమైనవి.
పద్మశ్రీ,
పద్మవిభూషణ
అందుకోలేదు.
అందువలననే
work,
worship
and
wisdom
మూడింటియందు
W
మొదటి
అక్షరము.
Work
అనగా
ఏమిటి?
పవిత్రమైన
భగవత్సేవ
నిమిత్తమై
పవిత్రమైన
క్షేత్రమునకు
తగిన
సాధన
మనము
సల్పాలి.
మన
భారతదేశమందు
ఈ
పవిత్రమైన
కర్మాచరణకు
కంకణం
ధరించాలి.
10
▾
Meaning
Keep
దానికోసమే
సత్కర్మలు
ఆచరించు.
సద్భావము
చింతించు.
సచ్చింతనలోపల
జ్ఞానాభివృద్ధిని
పొందుకో.
దానినే
work,
worship
and
wisdom.
ఇవే
మానవుని
ఉత్తమ
స్థితికి
గొనిపోవునవి.
ఇంకో
3
"W"లు
ప్రత్యేకంగా
ఉంటున్నాయి.
యివి
మానవుని
అధమస్థితికి
తీసుకుని
పోతున్నాయి.
ఆ
3
"W"లు
ఏమిటి?
Wealth,
women
and
wine
అని.
ఈ
మూడు
అధఃపతనమునకు,
Work,
worship,
wisdom
ఉత్తమస్థితికి
గొనిపోతాయి.
విద్యార్ధులారా!
ఇట్టి
పవిత్రమైన
మార్గమును
మీరు
ప్రవేశించి,
ఆది
శంకరుల
శిష్యులు
ఏమార్గమునందు
లోకమునకు
సత్య
ప్రచారము
సల్పిరో
ఆవిధంగా
మీరు
కూడను,
ఏ
కొంతమందైనా
అలా
తయారై
భారతీయ
సంస్కృతిని
తిరిగి
మీరు
అభివృద్ధి
పరచటానికి
ఆచరణరూపమైన
దానిలో
ఆనందాన్ని
అనుభవించటానికి
అందించటానికి
మీరు
సంసిద్ధులౌతారని
కూడను
నేను
ఆశిస్తూ
ఆశీర్వదిస్తూ
నా
ప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
Previous
←
Name and Form Belong to the Body, Not to the Ātma
Next
A Life of Morality and Honesty Is the Root of Śānti
→