Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1973 · Dharma and Its Nature
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Dharma and Its Nature
12 June 1973, Summer Course, Brindavan
1
▾
Meaning
Keep
His songs 5
చెడ్డపని
చేసి
మేలును
చెందలేరు
మంచిపని
చేసి
కీడును
గాంచలేరు
నిమ్మమును
నాటి
చూతమును
గొనునె
నిమ్మము
గొనునే
చూతఫలము
నాటి
అన్ని
రూపులు,
అన్ని
మతములు
నిన్నె
చూపును
అన్ని
మూర్తులు
నీదు
రూపులే,
అందరందున
నీవెయుందువు
పవిత్రాత్మ
స్వరూపులైన
విద్యార్థులారా!
అనంత
జగత్తునందు,
అఖిలకోటి
జీవరాశులయందు
అన్ని
మార్గము
లందు
మానవుడు
అగ్రగణ్యుడనే
విషయము
ఆత్మజ్ఞులయొక్క
నుడి.
“ధర్మో
హితేషాం
అధికం
విశేషః-
జ్ఞానం
హితేషా
అధికో
విశేషః”
మానవునకు,
మిగిలిన
పశు
పక్షి
మృగాదులకు
ఆహార
నిద్రాభయ
మైథునాదులు
సామాన్యమైన
వృత్తులైనప్పటికిని,
మానవునికి
మిగిలిన
జీవరాసులతో
పోల్చినప్పుడు
ధర్మము,
జ్ఞానము
ప్రత్యేకమైన
విశిష్టతగా
మానవునియందు
యిమిడ్చబడినాయి.
అయితే
ఈ
ధర్మము,
జ్ఞానము
ఈ
మానవునియందు
లేకుండిన
మానవులు
కూడను
మిగిలిన
ప్రాణికోటిలో
చేరినటువంటి
వారుగనే
గుర్తించటానికి
వీలవుతుంది.
ఈ
ధర్మము
అనగా
ఏమిటి
అనే
విషయం
మనము
మొట్టమొదట
గుర్తించాలి.
“దారణాత్
ధర్మ...”
ధరించినటువంటి
అన్ని
ప్రాణులకు
ఒక
విధమైన
నిబంధనలు
నియమించి
తద్వారా
వారిని
కాపాడేదని
కూడను
అని
ధర్మమునకు
ఒక
వ్యాఖ్యానము.
ఇంక
మానవునికి
కొన్ని
నియమ
నిష్ఠలను
బోధించి,
మానవుని
యొక్క
కర్తవ్యాన్ని
గుర్తింపజేసే
వ్యక్తిత్వాన్ని
అందింపజేసేదానికి
ధర్మము
అనిపేరు.
“ధర్మో
ధారయతే
ప్రచార”
అన్నారు.
అనగా
ప్రజలకు,
ధర్మమును
ఏవిధమైన
మార్గమునందు
అవలంబించాలని
కొన్ని
రకములైన
పద్ధతులను,
నియమములను
వారికి
అనుగ్రహించి
తద్వారా
వారి
దివ్యత్వమైన
ఆత్మతత్వమును
కూడను
ప్రబోధింపజేసే
నిమిత్తము
ఏర్పడినదే
ధర్మము
అని
కూడను
మరొక
వ్యాఖ్యానము.
2
▾
Meaning
Keep
ఇంక
కేవలము
రక్షించటము,
మానవులను
తగినటువంటి
మార్గములో
నడిపించటము,
వారి
భవిష్యత్తుకు
తగిన
భద్రతను
అందించటమే
కాకుండా
యింకా
ధర్మాన్ని
కొంత
క్షీణింపచేసే
వారికి
కూడను
ప్రబోధింప
చేసే
నిమిత్తము
ఏర్పడినదే
ధర్మము
అని
కూడను
మరొక్కటి.
‘ధర్మ
యేవ
హతోహంతి’
అనగా
ధర్మమును
హతమార్చటానికి
ఎవరు
పూనుకుంటారో
వారిని
హతమార్చేదే
ధర్మమని,
‘ధర్మోరక్షతి
రక్షితః’
అనగా
ధర్మమును
ఎవరు
రక్షిస్తున్నారో
వారిని
రక్షించటమే
ధర్మము
యొక్క
కర్తవ్యమని
కూడను
ఈ
ధర్మము
యొక్క
విశిష్ఠతను
తెలుపవలసి
వచ్చింది.
‘యతోధర్మః
తతో
విజయః’
అనగా
ఎక్కడ
ధర్మముందో
అక్కడ
విజయము
సిద్ధిస్తుందని
కూడను
ఈ
ధర్మము
యొక్క
పవిత్రతను
తెలపవలసివచ్చింది.
కనుక
ఇట్టి
పవిత్రమైన
ధర్మ
శబ్దమునకు
అనేకమంది
పెద్దలు
అనేకరకములైన
అర్థములను
వ్యక్తీకరింపచేసి
తద్వారా
మన
భారతదేశమును
ధర్మసూత్రమనే
తాటితో
కట్టబడినదిగా
యావత్ప్రపంచమునకు
కూడను
ప్రచార
ప్రబోధలు
సల్పినటువంటి
విశిష్టమైనటువంటి,
దివ్యమైన
తత్త్వము
ఈ
ధర్మము.
అఖండమైన
అర్ధముతో
కూడిన
పవిత్రమైన
ధర్మమునకు
ఈనాడు
ఆధునిక
యుగమునందు
ఒక
duty
అనే
పేరుతో
ఉపయోగపరుస్తూ
వస్తున్నారు.
Duty
అనగా
ఒక
వ్యక్తికి,
ఒక
కాలమునకు,
ఒక
దేశమునకు,
ఒక
పరిస్థితికి,
ఒక
కారణమునకు
కూడను
బంధింపబడినదే
ఈ
duty
యొక్క
అర్ధము.
కాని
ధర్మము
త్రికాల,
త్రిలోక,
త్రిగుణములయందును
మార్పు
చెందనటువంటి
దివ్యత్వమును
అందింపచేసేది.
అంతరాత్మయొక్క
స్వభావమును,
అంతరాత్మ
యొక్క
స్వస్వరూపమును
ప్రకటింప
చేయునటువంటిదే
ధర్మము
అనటానికి
ఒక
అవకాశము
వుంటుంది.
అంతఃకరణమునకు,
మానసిక
వృత్తులకు,
స్థూలదేహమునకు
ఏవిధమైన
భేదములు
తాను
పెట్టుకొనక
మూడింటిని
సమన్వయ
పరచేటువంటి
తత్త్వము
ధర్మము
యొక్క
శక్తితత్త్వము.
హృదయమే
ధర్మము
యొక్క
జన్మస్థానం
ఈ
ధర్మముయొక్క
పుట్టుక
స్థానము
మనయొక్క
హృదయమే.
ఇట్టి
హృదయస్థానమునుండి
వెలువడిన
పరిశుద్ధమైన
భావములతో
ఆచరింప
చేసే
క్రియయే
ధర్మమని
కూడ
చెప్పవచ్చును.
3
▾
Meaning
Keep
హృదయస్థానమునే
యుగస్థానమని
చెప్పటానికి
వీలుంటుంది.
హృదయ
మార్పే
యుగమార్పు
అని
చెప్పవచ్చును.
కనుక,
మన
హృదయములను
నిత్యసత్యమైనవిగను,
నిర్మలమైనవిగను,
స్వార్ధ
రహితమైనవిగను
వుండినప్పుడే
ఈ
ధర్మము
అనేదానికి
తగినటువంటి
కళను
మనము
అందించటానికి
వీలవుతుంది.
మీకు
సులభంగా
అర్ధమయ్యే
రీతిలో
చెప్పాలనుకున్నప్పుడు
ఎవరు
మనలను
బాధించటంచేత
మన
హృదయము
ఎంత
కలత
చెందుతుందో
అలాంటి
బాధలను
మనము
యితరులకు
అందించకుండా
చూచుకోవటమే
ధర్మమని
చెప్పవచ్చును.
ఎవరు
ఏది
చేసితే
యిది
మంచిదని
ఆనందిస్తామో
అట్టి
ఆనందమును
యితరులకు
చేయటానికి
పూనుకోవాలి.
కాని,
ఇతరులు
చేయునట్టిది
తప్పని
మనము
చెప్పటము,
అట్టి
తప్పును
మనమే
చేయటానికి
పూనుకున్నప్పుడు
అదే
అధర్మమని
చెప్పవచ్చు.
ఇతరులు
ఏది
చేస్తే
మనము
బాధపడతామని
చెప్పి
గుర్తిస్తామో,
ఆ
బాధనే
మనము
యితరులకు
కలిగించటము
అధర్మమని
చెప్పవచ్చు.
అయితే
ఈ
రెండింటికి
మధ్యలో
మనము
యింకొక
విషయము
విచారించక
తప్పదు.
ఒక్కొక్క
సమయమును
పురస్కరించుకొని,
ఒక్కొక్క
కార్యమును
పురస్కరించుకొని,
ఒక్కొక్కరికి
ఒక్కొక్కప్పుడు
వారికి
కఠినమైన
పదములతో
చెప్పవలసిన
సమయము
ఏర్పడుతుంటుంది.
ఒక్కొక్కతూరి
వారు
బాధపడతారు
అనే
విషయము
తెలిసి
కూడను,
కఠినమైన
పదములను
ఉపయోగించవలసి
వస్తుంది.
అయితే,
ఇట్టి
కఠిన
పదములుగాని,
ఇట్టివారు
హింసపడతారనే
విషయము
తెలిసికూడనూ
ఉపయోగపెట్టటంలోపల
ఒక
మేలుగానే
ఉంటుంది.
అనగా
వారి
మంచిని
కోరి,
తప్పును
నిరూపించే
నిమిత్తమై
వారి
భవిష్యత్తుకు
ఉత్తమమైన
జీవితమును
అందించే
నిమిత్తమై
ఒక్కొక్క
సమయమునందు
అలాంటి
పదములు
కూడను
ఉపయోగించవలసివస్తుంది.
అది
అధర్మమని
చెప్పటానికి
వీలుకాదు.
కత్తితో
పొడిచిన
వాని
వ్యక్తిత్వము
మహాక్రూరత్వమని
చెప్పటానికి
వీలుకాదు.
అయితే
ఒక్కొక్క
సమయములోపల
డాక్టరుకూడను
తన
పొట్టను
కత్తితో
కోసి
అనేకరకములుగా
ఆపరేషన్
చేస్తాడు.
ఇది
క్రూరత్వమా
లేక
ఉపకారతత్త్వమా
అనేది
కూడా
మనము
అర్థము
చేసుకోవాలి.
కనుక,
ఇది
దేశకాలపాత్రలను
పురస్కరించుకొని
ఒక్కొక్కపదముగాని,
ఒక్కొక్క
విషయముగాని
కొంత
కఠినమైన
రీతిలో
ఉపయోగ
పరచవలసి
వస్తుంటది.
కనుక,
మనసునందు
మంచిని
తలంచి,
వారి
ఉత్తమమైన
భవిష్యత్తును
తలంచి
చెప్పేటువంటి,
చేసేటువంటి
కొన్ని
కర్మలయందు
కొన్ని
రకములుగా
కఠినమైన
శిక్ష
విధించటంచేత
అది
ధర్మము
క్రిందనే
తేలుతుంది
కాని,
అధర్మమని
చెప్పటానికి
వీలుకాదు.
4
▾
Meaning
Keep
అసత్యములో
ప్రవేశింపచేసినప్పుడు
అది
ధర్మవిరుద్ధమే
గావచ్చు.
కాని
ప్రేమతో
చేసే
విషయమునందు
అధర్మమునకే
మాత్రము
కూడను
సంబంధించినదిగా
ఉండదు.
Live
in
love
మన
ధర్మమంతా
love
తో
చూచుకోవాలి.
ఒక
చిన్నపిల్లవాడు
ఉంటాడు.
ఆ
పిల్లవాడు
ఏదో
చేయరాని
పని
చేసినప్పుడు
తల్లి
రెండు
కొట్టి
అతనిని
చక్కని
మార్గానికి
తిప్పుతుంది.
అయితే,
కొట్టినంతమాత్రమున
ఆమెకు
ప్రేమలేదని
కాదు
యిందులో
అర్ధం.
అదేవిధముగా
ధర్మము
లోకధర్మము,
సామాన్య
ధర్మము,
వ్యక్తి
ధర్మము,
హృదయధర్మము,
సనాతనధర్మము
అని
అనేకరకములైన
పేర్లతో
యిది
లోకమునందు
ప్రకటిస్తూ
కొంత
ప్రచారము
సల్పుతూ
వస్తున్నాది.
ఈ
సర్వ
ధర్మముల
సమ్మిళితమైన
ధర్మమే
సనాతనధర్మము.
దానిని
పురస్కరించుకొనియే
‘అన్ని
మతములు
నిన్నె
చూపును.
అన్ని
మూర్తులు
నీదు
రూపులే’
అని
చెప్పటానికి
కొంతవరకు
పూనుకున్నాను.
ఏధర్మమైనాగాని,
తల్లిదండ్రులను
ధిక్కరించమని,
గురువులకు
పంగనామములు
పెట్టమని,
అసత్యములు
ఆడమని,
కఠినమైన
రీతిగా
ఒకరి
ప్రాణములు
తీయమని
ఏ
ధర్మముకూడను
మనకు
బోధించటం
లేదు.
ఎవరి
మతములను
వారు
విశ్వసించి,
ఎవరి
మతముల
వాక్యములను
వారు
చక్కగా
ఆచరించినప్పుడు
ఈవిధమైన
ఒడిదుడుకులుగాని
లేక
భేదాభిప్రాయములకుగాని,
కొన్ని
రకములైన
అసందర్భ
ప్రేలాపములకుగాని
అవకాశము
వుండటానికి
వీలుండదు.
మతముపైన
విశ్వాసము
కలదని
చెప్పుచూ
ఆ
మతమును
విశ్వసించిన
వారిలో
నేను
ఒక
వ్యక్తినని
చెప్పుకొనుచు
తిరిగి
ఆ
మతమునకు
విరుద్ధమైన
కార్యములు
ఆచరిస్తున్నామంటే
నిజముగా
ఆ
మతముపైన
మనకు
ఎంత
విశ్వాసముంటున్నాదో
అర్థమవుతున్నది.
నిజముగా
ఆ
మతముపైన
విశ్వాసమే
ఉంటే,
ఆ
మతముయొక్క
సత్య
సూక్తులను
విశ్వసించి
ఉంటే
దీనికి
విరుద్ధమైన
మార్గములో
నడచుటకు
ఏమాత్రము
వీలుకాదు.
ఈనాడు
మన
విశ్వాసములన్నీ
కూడను
కేవలము
ఒక
బురకావలె
కనిపించుచున్నవి.
విశ్వాసమనే
బురకావేసుకోవటము,
తిరిగి
అంతరార్ధములోపల
విరుద్ధమైన
స్వరూపాన్ని
ధరించుకోవటము,
అదియే
అధర్మమని
చెప్పటానికి
ఒక
ఆధారంగా
వుంటున్నాది.
పరమాత్మ
సర్వవ్యాపకత్వాన్ని
విశ్వసించాలి.
మనయొక్క
భక్తిశ్రద్ధలు,
ప్రపత్తులు
కూడను
ఈనాడు
ప్రదర్శనముగా
కనిపిస్తున్నాయి
గాని
నిదర్శనముగా
కనిపించటం
లేదు.
5
▾
Meaning
Keep
ఏ
క్షేత్రమునకు
వెళ్లినప్పుడో,
ఏ
పవిత్ర
తీర్ధమునకు
వెళ్లినప్పుడో,
ఏ
పెద్దల
యొక్క
దర్శన
స్పర్శన
సంభాషణలు
ఆచరించే
సమయమునందో
భక్తిశ్రద్ధలు
చక్కగా
ప్రకటిస్తూ,
ప్రదర్శిస్తుంటారు.
తిరిగి
ఆ
స్థానము
వదిలితే
ఆ
భక్తి,
ఆ
శ్రద్ధలు
ఆ
స్థానముతోనే
అంతర్ధానమైపోతున్నాయి.
దీనిని
పురస్కరించుకొనియే
భగవద్గీత
యందు
సతతము
యోగినః
అన్నారు.
నిరంతరము
నీవు
యోగి
కావాలి,
నిరంతరము
నీవు
భక్తుడు
కావాలి.
నిరంతరము
నీవు
జ్ఞానిగా
వుండాలి
అంతేగాని
ఒక
సమయములో
ఒకటి,
మరొక
సమయములో
మరొకటిగా
మారటానికి
వీలుకాదన్నారు.
మన
శాంతములు,
మన
సహనములు,
మన
సద్గుణములు
కేవలము
పూజ
రూమునందు
మాత్రమే
లేక
ధ్యాన
సమయమునందు
మాత్రమే
తగిన
విలువనిస్తున్నాము.
తదుపరి
పూజ
రూము
దాటి
వచ్చిన
తక్షణమే
దానికి
స్వస్తి
చెప్పి
తిరిగి
విరుద్ధమైన
గుణములను
అభివృద్ధి
పరచుకుంటున్నాము.
ఈ
విధమైన
సద్గుణములుగాని,
శాంత
స్వభావములుగాని,
ఒక
కాలమునకు
మాత్రమే
నియమింపబడినవి
కానేరదు,
ఒక
హద్దుతో
మాత్రమే
ఉంచదగినవి
కాదు,
జీవిత
పర్యంతము
వాటిని
ఆచరణయందు
వుంచేటువంటి
మార్గమునకు
పూనుకోవటం
పవిత్రమైన
మార్గమని
చెప్పటంలో
ఎట్టి
సందేహము
లేదు.
దీనికి
ఒక
చిన్న
ఉదాహరణము.
ఒక
వ్యక్తి
రాత్రి
సమయములో
ఏదో
తనకు
అవసరము
ఏర్పడి
10
మైళ్లు
దట్టమైన
అడవి
లోపల
ప్రయాణము
సల్పటానికి
పూనుకున్నాడు.
ఒక
హరికెన్
లాంతరు
తీసుకున్నాడు.
దాని
వెలుతురు
నాలుగు
గజములో,
ఐదు
గజములో
మాత్రమే
ప్రసరించింది.
సరే!
అరణ్యములో
వెళ్లి
హరికెన్
లాంతరు
వెలిగించాడు.
తెలివితేటలు
తక్కువైన
ఆ
వ్యక్తి
దీని
వెలుతురు
ఐదారు
గజము
మాత్రమే
వస్తుందని,
ఈ
అడవిలో
ప్రయాణం
ఎలాగా
అని
దీనుడై
కూర్చున్నాడు.
ఈ
సమయములోపల
ఒక
సన్యాసి,
ఆ
మార్గము
లోపలనే
బయలుదేరి
వస్తున్నాడు.
అప్పుడు
‘నాయనా!
ఎక్కడకు
వెడుతున్నావు?
ఎందుకు
విచారపడుతున్నావు?’
అని
ప్రశ్నించాడు
సన్యాసి.
“స్వామీ!
నేను
పదిమైళ్లు
దూరం
ప్రయాణం
చేయాలి.
ఈ
వెలుతురు
నాలుగైదు
గజములు
మాత్రమే
ఉంటున్నాది.
ఈ
పదిమైళ్లు
ఏవిధముగా
ప్రయాణం
చేయగలను?
చాలా
విచారముగా
ఉంటున్నది”
అన్నాడు.
‘ఒరే
పిచ్చివాడా!
ఆవెలుతురు
నాలుగైదు
గజములు
ప్రసరించినప్పటికిని,
నీతోబాటు
ఆ
లైటును
కూడా
ప్రయాణము
సలిపించు.
6
▾
Meaning
Keep
ఎంతదూరము
నీవు
వెళ్లగలవో
అంతదూరము
ఆ
వెలుతురు
అంత
దూరము
రాగలదు.
అదేవిధముగా
మనము
ఉత్తమమైన
భావములను
పవిత్రమైన
సద్గుణములను,
దివ్యమైన
శాంతమును
మన
వెంటనే
పెట్టుకొని
మన
జీవితము
ప్రయాణము
సల్పినప్పుడు
ఎక్కడికి
వెళ్లినప్పటికిని
ఆ
ప్రశాంతత,
ఆ
పవిత్రత,
నిర్మలత్వము
ఆ
సద్గుణములయొక్క
ప్రభావము
కూడను
మన
వెంటనే
వస్తుంటాయి.
పరమాత్ముడు
సర్వవ్యాపకుడు.
అలాంటి
సర్వత్రా
వుండిన
పరమాత్మతత్త్వానికి
ఒక
పూజరూము,
ఒక
ధ్యానము
గది
అని,
దానిని
మాత్రమే
వుంచుకొని,
దానిలో
వున్నంతసేపు
మాత్రమే
ఈ
పవిత్ర
గుణములను
ప్రవేశ
పెట్టుకొని
తదుపరి
పరమాత్ముడు
లేడనే
అనుమానముతోనే
మనము
యితరత్రా
కూడను
దుర్గుణములతో
సంచరిస్తున్నాము.
కనుక,
పరమాత్మ
సర్వ
వ్యాపకతత్త్వాన్ని
నీవు
సంశయించినప్పుడు
నీ
భక్తి
శ్రద్ధలు
ఎంతమాత్రము
అభివృద్ధికాగలవు.
పోనీ
సర్వవ్యాపకత్త్వాన్ని
నీవు
సంశయించినప్పుడు
‘దేహో
దేవాలయ
ప్రోక్తో
జీవోదేవ
స్సనాతనః’
అని
ఈ
దేహమునే
దేవాలయముగా
భావించుకొని
హృదయమును
పీఠముగా
విశ్వసించుకొని
జీవుడే
దేవుడుగా
భావించుకున్నప్పుడు
ఈ
జీవుడు
దేహముతోబాటు
సర్వత్రా
సంచరిస్తున్నాడు
కదా!
దేహము
ఎక్కడో
జీవుడు
అక్కడ.
జీవుడు
ఎక్కడో
దేవుడు
అక్కడ.
దేవుడు
ఎక్కడో
అదే
మన
మెడిటేషన్
రూము.
కనుక,
సర్వత్రా
మెడిటేషన్
రూమే.
సర్వత్రా
మన
పూజా
రూమే.
సర్వత్రా
మనము
సద్భావములను
అలవర్చుకోటానికి
పూనుకోటం
ఉత్తమమైన
సాధన.
కనుక,
సర్వకర్మలయందు
కూడను,
సర్వ
ప్రదేశములయందుకూడను,
సర్వవ్యక్తులయందును
పవిత్రమైన
భావములను,
పవిత్రమైన
చింతలను
మనము
చేయటము
సరియైన
మార్గము.
అయితే
అట్టి
పవిత్రమైన
విశ్వాసము
మనకు
కలగాలనుకున్నప్పుడు
మనము
అనుభవజ్ఞులైన
వారి
యొక్క
ప్రబోధలను,
పెద్దలైనవారియొక్క
మార్గమును
మనము
అనుసరించి,
పవిత్రమైన
భారత,
భాగవత,
రామాయణ,
ఇతిహాసపురాణములు,
బైబిలు,
భగవద్గీత
యిత్యాది
సద్గ్రంధములను
మనము
కొంతవరకునైనా
పఠించి
తద్వారా
మనయొక్క
సత్యాన్ని
గుర్తించుకోవటానికి
ప్రయత్నము
సల్పాలి.
ఇట్టి
సత్సంగము
నకు
మనము
తగినంత
కాలమును
అందించాలి.
మనకున్న
కాలములోపల
ముక్కాలు
భాగము
వృధా
గడుపుతున్నాము.
7
▾
Meaning
Keep
His poems 533
Also in his talks
(11)
1 October 1979
The Vedapuruṣa Saptāha Jñāna Yajña
2 September 1996
A Man without Purity of Citta Is Not Fit to Teach the Ātmatattva
26 April 1998
All Beings Are Parts of God
13 March 2002
The divine power of attraction
23 November 2002
Satya Is the Paramātma Made Manifest
2 March 2003
Take Īśvara's family as your ideal
12 January 2004
Honour your mother and father; take their command upon your head
19 February 2004
Unity is Jñāna, multiplicity is ignorance
23 October 2004
Foster the Spirit of Sacrifice
8 March 2005
Śivatva is the very consciousness in all beings
11 August 2006
Divinity is attained only through Prema for God
మిగిలిన
కాలు
భాగము
మన
స్వార్ధమునకై
ఉపయోగపెడుతున్నాము
కాని
పరార్ధము
చింత
మరచి
పోతున్నాము.
కనుక,
మనము
పరోపకార్ధమైన
కర్మలయందు
ఈ
కాయమును
యిమిడ్చి
తద్వారా
పరమాత్మ
సేవగా
విశ్వసించి
మనము
సార్ధకము
పొందే
నిమిత్తము
యువకులు
సంసిద్ధులుగా
ఉండాలి.
ఈ
వయస్సులో
మనము
యితరులకు
సేవచేసే
లోపల
సిద్ధముగా
వుంటుండాలిగాని
యితరులతో
మనము
చేయించుకోవటానికి
సిద్ధంగా
వుండకూడదు.
ఇది
సోమరత్వము.
ఇతరులకు
సేవ
చేయటము
సోహంతత్త్వము.
కనుక,
యువకులైన
మీరు
సోమరత్వమును
కొంత
వరకు
ప్రక్కకునెట్టి
భగవద్విశ్వాసమును
కొంతవరకు
అభివృద్ధిపరచుకొని,
సర్వ
జీవులయందును
సర్వేశ్వరతత్త్వాన్ని
కొంతవరకు
మీరు
విశ్వసించి,
మీ
యొక్క
సేవను
సార్ధకమొనరించుకోవటానికి
పవిత్రమైన
చరిత్రములు
అర్ధము
చేసుకోవ
టానికి
ప్రయత్నం
చేయండి.
దీనికి
మన
చరిత్రలో
అనేక
అంతరార్ధములు
ఉండటం
కద్దు.
దీనికి
కొన్ని
రకములైన
ప్రయత్నాలు
కూడా
మనం
చేయాలి.
ఒక
చిన్న
ఉదాహరణము.
ఈశ్వరుడనగా
మనము
జటాజూటధారియై,
త్రిశూలధారియై,
త్రినేత్రధారియై,
గజచర్మమును
కట్టుకొని,
తదుపరి
విభూతిని
పూసుకొని
అనేక
స్వరూపములతో
వుండటమనేది
ఈ
లోకరీతిగా
ఒకవిధమైన
అనుభూతి.
దీనినే
మనము
చక్కగా
వర్ణించాలనుకున్నప్పుడు
మౌళిగుల్కెడు
చంద్రమఃఖండకళతోడ
బెడగారు
గుంపెడు
జడలతోడ
జడలలో
ప్రవహించు
చదలేటి
జిగితోడ
డంబైన
ఫాలనేత్రంబుతోడ
నల్లనేరెడు
వంటి
నల్లని
మెడతోడ
కరమున
నాగ
కంకణముతోడ
నడుమును
చుట్టిన
నాగచర్మముతోడ
మైనిండ
నలరు
భస్మంబుతోడ
నుదుట
తీర్చిన
దొడ్డ
కుంకుమ
బొట్టుతో
తాంబూలరాగాధరంబు
తోడ
ఆరుశాస్త్రములందున
నందగించి
నల్లకలువల
హసియించి
కొల్లలాడు
మెరుగుచామన
ఛాయల
మేనితోడ
పర్తివాసుడు
నేడు
సాక్షాత్కరించె.
8
▾
Meaning
Keep
అనగా
ఈశ్వరుని
యొక్క
తత్త్వానికి
యిన్ని
వర్ణనలు
మన
భారతదేశమునందు
భక్తి
పూర్వకమైన
ప్రపత్తిమార్గమునందు
అనుభవిస్తూ
ఉండటం
కూడను
కద్దు.
అయితే
ఈశ్వరత్వమనగా
సకలైశ్వర్యములు
కలిగినవాడే
ఈశ్వరత్వమునకు
సరియైన
అర్ధము.
అయితే
ఇట్టి
ఈశ్వరత్వములో
శ్రేష్టమైనవాడు
మహేశ్వరుడు
అని.
అట్టి
మహేశ్వరుని
సంకల్పముచేతనే
యీ
సృష్టి
స్థితి
లయములు
జరుగుతున్నవని
మన
సంస్కృతి
యొక్క
ప్రమాణము.
ఇట్టి
మహేశ్వరునియొక్క
వామభాగమునే
విష్ణువు
అని,
దక్షిణభాగమునే
శివుడని
ఈ
రెండింటికి
మధ్యభాగమునే
రుద్రుడని
చెప్పటం
కద్దు.
అయితే,
శివుడు
అనగా
మనకు
సుఖములు
కలిగించేవాడు,
మంగళము
అందించేవాడు
కనుక
అతనికి
శివుడని
ఒక
పేరు.
మనకు
అనేక
రకములుగా
మార్గదర్శకుడుగా
నిల్చి
సకలైశ్వర్యములు
మనకు
అందించి,
యిహమునకు
పరమునకు
మార్గమును
నిరూపించి
జ్ఞానైశ్వర్యము,
ధనైశ్వర్యము,
గుణైశ్వర్యము,
బలైశ్వర్యము
యివన్నీ
ఐశ్వర్యములకే
సంబంధించినవి
కనుక
సకలైశ్వర్యములు
మనకు
అందించేవాడు
కనుకనే
అతనిని
శంకరుడు
అని
పిలుస్తూ
వచ్చారు.
శం-కర.
సుఖమును
అందించేవాడు.
చిదానందమును
అందించేవాడు.
సచ్చిదానందమును
అందించేవాడు.
సాధువులయొక్క
హృదయవాసి
అయినవాడు
కనుకనే
అతని
యొక్క
హృదయమునందు
తాను
శయనించు
వాడు
కనుకనే
శివుడు
అని
కూడను
చెబుతూ
వచ్చారు.
ఇట్టి
పవిత్రమైన
అర్ధములను
పురస్కరించుకొనియే
నిన్నటి
దినము
ప్రజ్ఞలు
మూడు
చెప్పాను.
జీవప్రజ్ఞ,
ఈశ్వరప్రజ్ఞ,
ఆత్మ
ప్రజ్ఞ
అని.
జీవప్రజ్ఞ
తనను
తాను
బంధించునని,
ఈశ్వరప్రజ్ఞ
పరులను
బంధించునని,
ఆత్మప్రజ్ఞ
బంధవిమోచన
జరుపుతుందని
తెలిపాను.
అయితే
కొంతమందికి
ఈశ్వరప్రజ్ఞ
అనేది,
యితరులను
ఎట్లా
బంధించును
అనే
సందేహము
బయలుదేరింది.
అనగా
ఐశ్వర్యముచేత,
పరులను
బంధించటానికి
ప్రయత్నము
సలుపవచ్చు.
ఈశ్వరప్రజ్ఞ
లేదా
అతనిచే
ఇవ్వబడిన
ఐశ్వర్యము
వివిధ
రూపాలలో
వుంటుంది.
అది
ధనరూపంలో,
ప్రేమరూపంలో,
బలంరూపంలో
లేదా
తెలివితేటలరూపంలో
వుండవచ్చు.
అనగా
ఈశ్వరప్రజ్ఞ
కలవారు
ప్రేమతో
కొందరిని,
బలంతో
కొందరిని,
ధనంతో
కొందరిని
బంధించవచ్చు.
9
▾
Meaning
Keep
అలా
ఇవన్నియు
ఐశ్వర్యములక్రిందనే
లెక్క.
ఇంతేకాదు
జ్ఞానముచేత
కూడా
బంధించ
వచ్చు.
అందుకోసమే
భగవంతుని
భక్తపరాధీనుడు
అన్నారు.
భక్తిచే
భగవంతుని
బంధించటంచేత
భక్తుని
స్వాధీనుడైపోయాడు.
ఎవరు
జ్ఞానమును
పొంది
జ్ఞాత,
జ్ఞేయ
స్వరూపమును
ధరించినప్పుడు
ఆ
పదముయొక్క
ఆనందములోపల
తన్మయత్వుడై
వుంటుంటాడు.
అట్టివానిని
తదేవత్వం
అనేరీతిగా
చెప్పుతూ
వచ్చారు.
తదేవత్వం
అనగా
అతను
ఒకవిధమైన
ఆనందములోపల
వుండి
జ్ఞానమును
పొంది
తాను
జ్ఞేయస్వరూపుడుగా
ఉంటున్నాడు.
అయితే,
జ్ఞాత
జ్ఞేయమును
చూస్తూ
ఆనందములోపల
కొంతవరకు
కూడను
‘తత్’
అనేదానిని
విచారణ
సల్పుతుంటాడు.
అటువంటివానినే
త్వదేవతత్
అన్నారు.
త్వదేవత్వం,
త్వమేవతత్
అనే
రెండింటియందుండిన
వ్యత్యాసము
మనము
విచారణ
చేసినప్పుడు
ఒక
స్థానము
గురువుది,
రెండవస్థానము
శిష్యునిది.
అనగా
తత్
స్థానము
నందు
కూర్చొని
త్వంను
సరిగా
బోధించేవాడు
గురువు.
త్వం
స్థానమునందు
తాను
కూర్చొని
తత్
స్వభావమును
విచారించేవాడు
శిష్యుడు.
కనుక,
గురువు
తత్
అనే
స్థానములో
నిల్చినవాడు.
ఆ
తత్కు
సమీపములో
నివసించే
వాడు
శిష్యుడు.
కనుక,
సమీపమునందే
సంచరించే
శిష్యునికి
సద్భావములే
రావాలి.
ఆ
సద్భావములు
అభివృద్ధి
పరచుకున్నప్పుడు,
గురువు
తాను
ఏకమయ్యే
పరిస్థితికి
వచ్చి
తద్వారా
నివృత్తిలోపల
లీనమవటానికి
అవకాశము
ఉంటుంది.
దేనియొక్క
సమీపములో
వుంటామో
దానియొక్క
స్వభావము
అలవడాలి.
అప్పుడే
దానికి
సమీపములో
ఉండినందుకు
సరైన
అర్ధము.
ఇంకా
రెండవ
విషయముగా
మీకు
అర్ధము
చెప్పాలనుకున్నప్పుడు
మన
భారతదేశములో
భగవదారాధనలు
సలుపుతూ,
ఉపవాసములు
చేయటము,
ఉపాసనలు
చేయటము
యిలాంటివంతా
జరుగుతుండటం
సహజం.
ఇది
ఉపాసన,
ఉపవాసము
అనే
దానికి
మనము
చక్కగా
అర్ధము
తీసుకోవాలి.
ఉప-సమీపము,
వాసము-నివసించటము.
సమీపములో
నివసించటము
ఉపవాసము.
ఉపాసన
సమీపములో
కూర్చోటము
ఉపాసన.
అయితే
ఈ
దగ్గర
కూర్చోటంచేత
మనకు
వచ్చే
ఫలితము
ఏమిటి?
మనము
ఉడుకుగా
వుండినప్పుడు,
ఎక్కువ
వేడిగా
ఉండినప్పుడు
air
condition
వేసుకోవటమో,
లేక
చల్లదనమైన
ప్రదేశమునకు
వెళ్లటమో
జరుగుతూ
ఉంటుంది.
అయితే
air
condition
సమీపంలో
కూర్చొవటం
వల్ల
వచ్చిన
ఫలితము
యేమంటే
మనలను
బాధించుతున్న
వేడి
దూరమై
మనకు
సుఖమునిచ్చే
చల్లదనమును
అందుకోగలుగుచున్నాము.
10
▾
Meaning
Keep
ఇంక
చలికాలములో
మనచుట్టూ
నిప్పులు
వేసుకొని
కూర్చోవటమో
లేక
హీటరు
పెట్టుకోవటమో
జరుగుతుంది.
దానికి
దగ్గర
కూర్చోటంవలన
యేమైంది?
మనలను
బాధిస్తున్న
చలి
దూరమై
పోయింది.
మనకు
హాయినిచ్చే
వేడి
మనలను
సంతోషపెడుతున్నాది.
అయితే,
ఈనాడు
ఉపవాసములు,
ఉపాసనలు
దేనినిమిత్తమై
చేస్తున్నామంటే
భగవంతుని
నిమిత్తమై
చేస్తున్నాము.
అనగా
భగవంతునికి
దగ్గరకావటానికి
కూర్చొవటము,
భగవంతుని
సమీపానికి
పోవటము
జరుగుతూ
వుంటుంటాది.
అయితే,
భగవంతుని
సమీపంలో
కూర్చోవటంచేత,
భగవంతుని
సమీపంలో
పోవటంచేత
వచ్చిన
ఫలితము
ఏమంటే,
భగవంతుని
సచ్చిదానందము
మనకు
వస్తుంది.
మన
దుర్గుణములు
దూరమైపోతాయి.
కనుక,
భగవంతుని
సమీపములో
పోయే
ప్రయత్నములోపల
దీనిని
ఒక
ఉపవాసమనిగాని,
ఉపాసన
అని
గాని
ఉపయోగించటంలో
అర్థం
వుంది
గాని
అట్లుకాకుండా
ఈనాడు
భగవంతునికోసం
ఉపవాసం
చేస్తున్నామనేది
ఎలావుందంటే
భోజనానికి
బదులు
అరడజను
చపాతీలు,
డజను
అరటి
పండ్లు,
శేరు
పాలు
త్రాగి,
ఉపవాసంగా
దానిని
నిరూపిస్తున్నారు.
ఇది
ఉపవాసము
క్రింద
వస్తుందా?
కనుక,
మనము
పవిత్రమైన
భారతీయ
సంస్కృతియందు
అందించిన
ఆదర్శములకు
సరియైన
అర్ధములు
తీసుకొనక
మనయొక్క
ప్రార్ధనలు
గాని,
మనయొక్క
సాధనలుగాని
కొంతవరకు
వ్యర్థపరచుకొని
నిరాశకు
గురై
పోతున్నాము.
ప్రేమస్వరూపులైన
విద్యార్ధులారా!
ఇట్టి
యధార్థమైన
విషయాన్ని
మీరు
అర్ధము
చేసుకునే
నిమిత్తమై
ఈ
ఒక్క
నెల
ఈ
సమ్మర్
క్లాసులో
చేరారు.
ఈ
క్లాసుల
లోపల
పవిత్రమైన
విషయాలను
చక్కగా
హృదయములో
చేర్చుకొని
మున్ముందు
దీనిని
సక్రమమైన
మార్గములో
అవలంబించి,
దానిని
ప్రవేశపెట్టి,
యింక
మిత్రులైనవారికి,
భవిష్యత్తునందు
భారతదేశమునకు
తగిన
మార్గము
చేబడతారని
దానిని
తీర్చిదిద్దుతారని
నేను
ఆశిస్తూ,
ఆశీర్వదిస్తూ
నా
ప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
Previous
←
Karma Free of Desire for Its Fruit, and Its Practice
Next
The Person, the Karma, the Goal: The Oneness of These Three Is Itself Dhyāna
→