Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2000 · The Greatness of the Gāyatrī Mantra
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The Greatness of the Gāyatrī Mantra
10 February 2000, Upanayanam, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
ప్రియమైన
యువకులారా!
జీవితమునకు
చాల
ప్రధానమైన
సమయమిది.
మానవ
జీవితమును
నాల్గంతస్తుల
మేడతో
పోల్చవచ్చును.
ఆ
నాల్గు
అంతస్తులే
బ్రహ్మచర్య,
గృహస్థ,
వానప్రస్థ,
సన్న్యాసాశ్రమములు.
అట్టి
సౌధమునకు
ఈనాడు
మీరు
పునాది
వేస్తున్నారు.
ఈ
పునాది
ఎంత
గట్టిగా
ఉంటుందో
మీ
జీవిత
సౌధము
అంత
భద్రంగా
ఉంటుంది.
ప్రతి
మానవునికి
నాల్గు
విధములైన
జన్మములుంటున్నాయి.
మొదటిది,
తల్లి
గర్భము
నుండి
జన్మించటం.
అది
సహజమైన
జన్మము.
రెండవది
గాయత్రీ
మంత్రోపదేశమును
పొందటం,
తద్వారా
మానవుడు
ద్విజుడౌతాడు.
తరువాత
వేదాధ్యయనంచేత
విప్రుడౌతాడు.
బ్రహ్మతత్త్వాన్ని
గుర్తించిన
తరువాత
బ్రాహ్మణుడౌతాడు.
కేవలం
జన్మచేత
కాదు,
కర్మచేత
బ్రాహ్మణుడు
కావాలి.
బ్రహ్మతత్త్వాన్ని
గుర్తించినవానికే
తాను
బ్రాహ్మణుడనని
చెప్పుకోవటానికి
అధికారముంటుంది.
సర్వదేవతలూ
మానవునియందే
జీవిస్తున్నారు.
మనం
భుజించే
స్థూలమైన
అన్నము
బ్రహ్మ
స్వరూపం.
అన్నముయొక్క
సూక్ష్మస్వరూపమే
విష్ణుస్వరూపం;
అతి
సూక్ష్మస్వరూపమే
ఈశ్వర
స్వరూపం.
అందువల్లనే
“అన్నం
బ్రహ్మ
రసో
విష్ణుః”
అన్నారు.
స్థూలమైన
అన్నము
దేహానికి
పుష్టినందిస్తుంది;
సూక్ష్మమైన
అన్నము
మనస్సునకు
పుష్టి
నందిస్తుంది;
అతి
సూక్ష్మమైన
అన్నము
వాక్శుద్ధి
కల్గిస్తుంది.
కనుక,
దేహపుష్టికి,
మనోపుష్టికి,
వాక్శుద్ధికి
అన్నమే
మూలాధారం.
గాయత్రి,
సావిత్రి,
సరస్వతి
గాయత్రి
సర్వదేవతా
స్వరూపిణి,
సర్వ
మంత్ర
స్వరూపిణి.
“గాయత్రీం
ఛందసాం
మాతా”.
ఈగాయత్రి
వేదములకు
తల్లి.
గాయత్రీమంత్రము
సామాన్యమైనది
కాదు.
మీరు
గాయత్రీ
మంత్రమును
స్మరిస్తే
చాలు,
ఇంక
ఏ
మంత్రమునూ
స్మరించనక్కర్లేదు.
గాయత్రికి
మూడుపేర్లున్నాయి.
మొదటిది
గాయత్రి,
రెండవది
సావిత్రి,
మూడవది
సరస్వతి.
“గాయన్తం
త్రాయతే
ఇతి
గాయత్రి”,
తనను
స్మరించినవారిని
రక్షించేది
గాయత్రి.
ఇంద్రియాలకు
అధిపతి
గాయత్రి;
ప్రాణాలకు
అధిపతి
సావిత్రి.
2
▾
Meaning
Keep
మీకు
తెలుసు
-
సావిత్రి
అనే
మహాసాధ్వి
మరణించిన
తన
భర్త
సత్యవంతుణ్ణి
ప్రార్థనచేత
తిరిగి
బ్రతికించుకుంది.
సత్యమార్గంలో
జీవితాన్ని
గడిపేవారిని
సావిత్రి
కాపాడుతుందని
దీని
అంతరార్థం.
ఇంక
సరస్వతి
వాగ్దేవతా
స్వరూపిణి.
గాయత్రి,
సావిత్రి,
సరస్వతుల
అనుగ్రహాన్ని
పొంది
మానవుడు
తన
జీవితాన్ని
సార్థకం
గావించుకోవాలి.
మొట్టమొదట
మీరు
వాక్శుద్ధిని
పొందాలి.
మాట
మంచిదైనప్పుడే
జీవితం
మంచిదవుతుంది.
“కాలు
జారితే
కలుగదు
నష్టం,
నాలుక
జారితె
నరకమెరా!”
అన్నారు.
కనుకనే
పూర్వం
ఋషులు
మితభాషను
పాటిస్తూ
వచ్చారు.
“అతిభాష
మతిహాని,
మితభాష
అతి
హాయి”.
అతిభాషచేత
అసత్యానికి
పాల్పడే
అవకాశముంది.
కనుక
మాటలను
తగ్గించి,
సత్యాన్ని
పోషించుకొని
కీర్తిని
సంపాదించుకోవాలి.
దేహము
-ప్రాణము
-
ప్రజ్ఞాశక్తి
గాయత్రి,
సావిత్రి,
సరస్వతులు
ప్రతిమానవునియందున్నారు.
గాయత్రి
మంత్రములో
“భూర్భువస్సువః”
అనగా
ఏమిటి?
భూః
అనగా
భూలోకము.
భూలోకమనగా
పదార్థముల
(మెటీరియల్స్)
చేరిక.
ఈ
దేహముకూడా
పదార్థముల
చేరికయే.
కనుక
‘భూః’
అనగా
దేహమే!
అదే
‘మెటీరియలైజేషన్’.
‘భువః’
అనగా
ప్రాణము.
ప్రాణమే
దేహాన్ని
కదిలిస్తుంది.
అదే
‘వైబ్రేషన్’.
ఇంక
‘సువః’
అనగా
ఏమిటి?
ఇదే
ప్రజ్ఞాన
శక్తి.
దీనినే
Constant
Integrated
Awareness
అన్నారు.
దీనినే
‘రేడియేషన్’
అన్నారు.
కనుక,
‘భూర్భువస్సువః’
అనే
మూడు
లోకాలూ
మానవునియందే
ఉన్నాయి.
దేహమునకు,
ప్రాణమునకు,
జ్ఞానమునకు
దేహమే
మూలాధారం.
ఇట్టి
పవిత్రమైన
దేహాన్ని
దుర్వినియోగపర్చుకోకూడదు.
మానవత్వం
చాల
పవిత్రమైనది.
“జంతూనాం
నరజన్మ
దుర్లభం”.
అన్ని
జన్మలకంటే
మానవజన్మ
చాల
ఉత్కృష్టమైనది,
సౌజన్యమైనది,
సౌశీల్యమైనది.
ఈ
శరీరాన్ని
భగవంతుడు
దేనికోసం
అందించాడు?
“శరీర
మాద్యం
ఖలు
ధర్మ
సాధనం”,
ధర్మము
నాచరించటం
కోసమే
ఈ
శరీరం
అందించబడింది.
కనుక,
మానవతా
విలువలను
పోషించుకొని
సత్కర్మల
నాచరించి
జన్మను
సార్థకం
గావించుకోవాలి.
మానవతా
విలువలంటే
ఏమిటి?
వాటిని
మీరు
క్రొత్తగా
సంపాదించనక్కర్లేదు.
అవి
మీతోనే
పుట్టాయి,
మీవెంటనే
ఉన్నాయి.
కాని,
మీరు
వాటిని
ఆచరణలో
పెట్టకపోవటంచేత
అవి
మరుగునపడిపోతున్నాయి.
మీరు
‘టన్నులు,
టన్నులు’
ఉపన్యాసాలు
చెప్పటంకంటే
ఒక్క
‘ఔన్సు’
ఆచరణలో
పెడితే
చాలు.
3
▾
Meaning
Keep
మనస్సును
భగవంతునివైపు
మరల్చండి
ఈశ్వరుడు
హిమాచలమునందు
నివసిస్తున్నాడంటారు.
హిమాచలమనగా
ఏమిటి?
హిమమనగా
మంచు.
అచలమనగా
కదలిక
లేనిది.
మంచు
తెల్లగా,
చల్లగా
ఉంటుంది;
సులభంగా
కరిగిపోతుంది.
తెల్లదనము
పవిత్రతకు,
చల్లదనం
ప్రశాంతతకు
చిహ్నములు.
కనుక,
పవిత్రమైన,
ప్రశాంతమైన,
నిశ్చలమైన,
నిర్మలమైన
హృదయమే
హిమాచలము.
దయతో,
కరుణతో
కరిగిపోవునటువంటిదే
హృదయము.
అలాంటి
హృదయమునందే
ఈశ్వరుడు
నివసిస్తాడు.
కాని,
ఈనాడు
మీ
హృదయం
మితిమీరిన
వాంఛలచేత
చలించిపోతున్నది.
మీరు
వాంఛలను
ఎంత
తగ్గించుకుంటే
అంత
సుఖంగా
జీవించగలరు.
సర్వ
భారములను
దైవార్పితం
చేయండి,
సర్వ
కర్మలను
భగవత్ప్రీత్యర్థం
ఆచరించండి.
మీరు
సూర్యునికి
వీపు
పెట్టి
నిలబడినప్పుడు
మీ
నీడ
మీకంటే
ఎన్నో
రెట్లు
అధికంగా
కనిపిస్తుంది.
ఆవిధంగా
ఎంతసేపు
నడిచినా
మీ
నీడను
మీరు
దాటలేరు.
ఆ
నీడయే
మాయ.
దానిని
దాటాలంటే
ఏమి
చేయాలి?
సూర్యునివైపు
మీ
ముఖం
త్రిప్పాలి.
అప్పుడా
నీడ
మీవెనుకకు
పడిపోతుంది.
అదేవిధంగా,
మీ
మనస్సు
దైవానికి
విరుద్ధంగా
ప్రయాణించినంత
వరకు
మీరు
మాయకు
లోబడియే
ఉంటారు.
మీ
మనస్సును
దైవంవైపు
మరల్చినప్పుడు
మాయ
మిమ్మల్ని
ఏమాత్రము
బాధించదు.
దైవచింతన
లేత
వయస్సునుండియే
చేయాలి
ఈ
కలియుగ
ప్రభావముచేత,
ఆధునిక
చదువులు
మితిమీరి
పోవటంచేత
మానవునిలో
గుణము
తరిగిపోతున్నది.
గుణము
లేక
చదువువల్ల,
పదవివల్ల
ప్రయోజనం
లేదు.
లౌకిక
విద్యలు
గ్రంథపరిచయానికి
మాత్రమే
సంబంధించినవి.
అవి
జీవనోపాధికి
మాత్రమే
ఉపయోగపడతాయి
గాని,
జీవిత
పరమావధికి
ఏమాత్రము
సహాయం
చేయలేవు.
అయితే,
లౌకిక
విద్యలు
అవసరమే!
కాని,
వీటితోపాటు
ఆధ్యాత్మిక
విద్యకూడా
అత్యవసరం.
“అధ్యాత్మ
విద్యా
విద్యానాం”.
ఈ
లౌకిక
విద్యలన్నీ
చిన్న
చిన్న
నదులు,
కాలువల
వంటివి.
ఇవన్నీ
ఆధ్యాత్మికమనే
సముద్రంలో
చేరిపోతున్నాయి.
“నదీనాం
సాగరో
గతిః”
సముద్రమే
లేక
నదులకు
స్థానమే
లేదు.
కనుక,
అన్ని
విద్యలకంటే
ఆధ్యాత్మికవిద్య
చాల
అవసరమైనది.
కాని,
ఈనాడు
కొందరు
విద్యావంతులైన
తల్లిదండ్రులుకూడా
వివేకహీనులుగా
ప్రవర్తిస్తున్నారు.
కొందరు
తల్లిదండ్రులు
తమ
పిల్లలు
దేవుణ్ణి
పూజిస్తుంటే,
భజనలు
చేస్తుంటే
“ఏమిట్రా,
ఈ
చిన్నవయస్సులోనే
నీకు
దైవచింతన
ఎందుకు?
4
▾
Meaning
Keep
నా
మాదిరి
ఉద్యోగం
చేసి
రిటైరైన
తరువాత
నీకు
కావలసినంత
టైమ్
చిక్కుతుంది.
అప్పుడు
స్మరించుకో
దేవుణ్ణి”
అని
అంటున్నారు.
ఇది
చాల
తప్పు.
Start
Early,
Drive
Slowly,
Reach
Safely
అన్నారు.
చిన్నవయస్సునుండియే
దైవచింతన
చేయాలి.
అప్పుడే
వృద్ధాప్యంలో
దైవం
జ్ఞాపకం
వస్తాడు.
కనుక,
లేతవయస్సునుండియే
మీరు
దైవచింతన
ప్రారంభించండి.
ఇది
Golden
age
చాలా
పవిత్రమైన
వయస్సు.
దీన్ని
మీరు
దుర్వినియోగపర్చుకోకూడదు.
ప్రహ్లాదుని
ఆదర్శం
యువకులారా!
మీ
వయస్సు
చాలా
పవిత్రమైనది.
మీరు
గాయత్రీ
మంత్రాన్ని
హృదయపూర్వకంగా
స్మరించినారంటే
దేశంలో
ఎట్టి
బాధలూ
ఉండవు;
మీకు
ఎట్టి
కష్టములు
సంభవించవు.
కనుక
నిరంతరము
దైవచింతన
చేయండి.
ప్రహ్లాదుడు
మీయొక్క
బ్రదరే!
అతడు
హరిప్రియుడు,
అతని
తండ్రియైన
హిరణ్యకశిపుడు
హరిద్వేషి.
అతడు
ప్రహ్లాదుని
మనస్సు
మార్చాలని
ఎంతగానో
ప్రయత్నించాడు.
ప్రహ్లాదుడు
తండ్రి
చెప్పినవన్నీ
నవ్వుకుంటూ
వినేవాడు.
కాని
తన
పద్ధతిని
మార్చుకోలేదు.
హిరణ్యకశిపుడు
ప్రహ్లాదుణ్ణి
ఏనుగులచేత
త్రొక్కించటానికి,
త్రాచుపాములచేత
కరిపించటానికి
ప్రయత్నించాడు.
అతనిని
పర్వత
శిఖరాగ్రములనుండి
క్రిందికి
నెట్టించాడు,
సముద్రాల్లోకి
పడద్రోయించాడు.
కాని
ప్రహ్లాదుడు
హృదయపూర్వకంగా
నారాయణుణ్ణి
స్మరించటంచేత
ఏనుగులు,
త్రాచుపాములుకూడా
నారాయణునిగా
మారిపోయినాయి.
సముద్రంలోకి
పడే
సమయంలోకూడా
ప్రహ్లాదుడు
‘నారాయణ,
నారాయణ’
అని
స్మరించటంచేత
సముద్రమునుండి
నారాయణుడే
వచ్చి
అతనిని
రక్షించాడు.
అదేవిధంగా,
మీ
హృదయంలో
దైవభావాన్ని
నింపుకున్నప్పుడు
మీరు
ఎక్కడున్నా
మీకు
దైవరక్షణ
ఉంటుంది.
అయితే,
ప్రేమతో,
అచంచలమైన
విశ్వాసంతో
దైవాన్ని
స్మరించాలి.
కొందరికి
ఒక్కొక్క
పర్యాయం
దైవంపైకూడా
క్రోధం
వస్తుంటుంది.
క్రోధం
మంచిది
కాదు.
కామ,
క్రోధ,
లోభములు
నరక
ద్వారములు.
రావణుడు
ఎలాంటివాడో
మీకు
తెలుసునా?
గొప్ప
శక్తివంతుడు,
విద్యావంతుడు.
కాని,
ఒక్క
కామానికి
లొంగిపోవటంచేత
తన
కన్న
బిడ్డలను,
తన
రాజ్యాన్నికూడా
భస్మం
గావించుకున్నాడు.
అదేవిధంగా,
క్రోధంవల్ల
హిరణ్యకశిపుడు,
లోభంవల్ల
దుర్యోధనుడు
సర్వనాశనమైపోయారు.
5
▾
Meaning
Keep
పంచపాండవులు
ధర్మమును
ఆశ్రయించటంచేత
సుక్షేమంగా
జీవించారు.
ఎంతటి
ధనవంతుడైనా,
ఎంతటి
విద్యావంతుడైనా
ఎంతటి
బలవంతుడైనా
కామ,
క్రోధ,
లోభములనే
దుర్గుణాలకు
లొంగిపోతే
పతనం
చెందక
తప్పదు.
కనుక
మీ
ధనబలమును,
భుజబలమును,
విద్యాబలమును
చూసుకొని
గర్వించకండి.
ప్రేమబలమును
పెంచుకోండి.
అప్పుడే
మీజీవితం
ధన్యమౌతుంది.
శ్రీరాముని
ఆదర్శం
ఈనాటి
మానవుడు
ఆశలను
పెంచుకుంటున్నాడు.
ఆదర్శాలను
విస్మరిస్తున్నాడు.
మానవుడు
దేహాభిమానమును
తగ్గించుకొని,
దేశాభిమానమును
పెంచుకోవాలి.
మాతృభూమిని
ప్రేమించాలి,
గౌరవించాలి.
రావణ
సంహారం
తరువాత
లక్ష్మణుడు
రామునివద్దకు
వచ్చి
“అన్నా!
ఈ
లంకా
రాజ్యం
ధన,
కనక,
వస్తు
వాహనాదులతో
తులతూగుతున్నది.
కాబట్టి,
అయోధ్యను
భరతునికి
వదిలిపెట్టి
మీరు
ఈ
రాజ్యాన్ని
పరిపాలించవలసింది”
అని
కోరాడు.
విభీషణుడు
కూడా
రాముని
పాదాలపై
పడి
లంకా
రాజ్యాన్ని
పరిపాలించమని
ప్రార్థించాడు.
అన్నీ
విని
రాముడు
ఏమన్నాడు?
“జననీ
జన్మభూమిశ్చ
స్వర్గాదపి
గరీయసి”
“నాకు
జన్మనిచ్చిన
తల్లి,
నేను
పుట్టిన
దేశం
స్వర్గము
కన్న
మిన్నయైనవి.
నా
మాతృదేశాన్ని
వదలి
నేను
పరదేశంలో
ఉండలేను.
కాబట్టి
నాకు
లంకారాజ్యం
అక్కర్లేదు”
అన్నాడు.
ధనం
కాదు,
గుణం
ప్రధానం
కొంతమంది
తల్లిదండ్రులు
పిల్లవాడు
డిగ్రీ
పాసైన
తక్షణమే
విదేశాలకు
వెళ్ళాలని
ఆశిస్తారు.
స్వదేశంలో
లేనిది
విదేశాలలో
ఏముంటుంది.
నిజం
చెప్పాలంటే,
భారతదేశంలో
లేనిది
మరి
ఏదేశంలోను
లేదు.
చాలమంది
విద్యార్థులు
పై
చదువుల
కోసం
విదేశాలకు
వెళుతున్నారు.
కాని,
అక్కడికి
వెళ్ళి
వికారమైన
బుద్ధులను
పెంచుకొని,
వికృతమైన
చేష్టలలో
ప్రవేశిస్తున్నారు.
నేను
చూసినంతవరకు
విదేశాలకు
వెళ్ళినవారెవ్వరూ
సరియైన
గుణంతో
తిరిగి
భారతదేశానికి
చేరుకోలేదు.
తల్లిదండ్రులు
పిల్లలను
విదేశాలకు
దేనికి
పంపుతున్నారు?
వారు
గుణవంతులు
కావాలని
కాదు,
ధనవంతులు
కావాలని
పంపుతున్నారు.
ధనము
లౌకికమైన
సౌకర్యాలను
చేకూర్చగలదుగాని,
మానసిక
శాంతిని
అందించగలదా?
లేదు.
ఒక్క
ఆధ్యాత్మికము
మాత్రమే
మానసికశాంతిని
అందించగలదు.
ఈనాడు
అనేకమంది
భారతీయులు
ధనంకోసం
పిచ్చి
పట్టినట్లుగా
విదేశాలకు
వెళుతుంటే,
విదేశీయులు
మాత్రం
మానసిక
శాంతికోసం
భారతదేశానికి
వస్తున్నారు.
6
▾
Meaning
Keep
Also in his talks
(10)
6 June 1973
This World and the Next
27 October 1979
Man and Nārāyaṇa
9 January 1988
God in the heart, work in the hands
1 June 1989
Man is the son of immortality!
25 May 1990
Vagaries of the Mind
2 June 1990
Ascent Of Man
6 May 1992
Only one who lives in the oneness of body, mind and Ātma is a human being
30 September 1998
God's Prema Is Eternal, Everlasting
12 October 1998
The True Place of God's Pādukās Is the Heart Itself
25 December 2002
Cast Off Bad Qualities and Foster Prema
నిజంగా
విదేశాలలో
సుఖ,
శాంతులుంటే
వారు
ఇక్కడికి
ఎందుకు
వస్తారు?
అక్కడ
సుఖశాంతులు
ఏమాత్రము
లేవు.
అక్కడ
ధనసౌకర్యమున్నదిగాని,
గుణసౌకర్యం
లేదు.
ధనమెచ్చిన
మదమెచ్చును
మదమెచ్చిన
దుర్గుణంబు
మానక
హెచ్చున్
ధనముడిగిన
మదముడుగును
మదముడిగిన
దుర్గుణంబు
మానును
వేమా!
మీరు
సద్గుణాలను
పోషించుకోవాలనుకుంటే
స్వదేశంలోనే
ఉండాలి.
దీనికి
నేనే
ఆదర్శము.
వివిధ
దేశాలకు
చెందిన
అనేక
వేలమంది
భక్తులు
స్వామిని
వారి
వారి
దేశాలకు
రావలసిందని
ప్రార్థిస్తూనే
ఉన్నారు.
కాని,
ఈనాటివరకు
నాలో
ఆ
తలంపే
లేదు.
కారణమేమిటి?
భారతదేశము
సర్వ
ధర్మములకు
మూలాధారమైనది.
భారతీయులు
ఆచరించే
యజ్ఞయాగాది
క్రతువులెంతో
పవిత్రమైనవి.
ట్రైనుకు
ఇంజను
ముందుంటుంది.
దాని
వెనుకనే
పెట్టెలన్నీ
ఉంటాయి.
ఇంజనులోనే
ఇంధనశక్తి
ఉంటుంది.
ఇంజనులోనే
డ్రైవరుంటాడు.
యజ్ఞయాగాది
క్రతువులకు
ఆలవాలమైన
భారతదేశమును
అట్టి
ఇంజనుతో
పోల్చవచ్చును.
ఇతర
దేశములన్నీ
దీనికి
అతికించిన
పెట్టెలవంటివి.
కాని,
కొన్ని
దేశాలకు
ఇంజనుతో
‘లింకు’
సరిగా
లేకపోవటంచేత
పడిపోతున్నాయి.
“మాతృదేవో
భవ,
పితృదేవో
భవ”
విద్యార్థులారా!
మీ
తల్లిదండ్రులను
ప్రేమించండి,
సేవించండి,
వారిని
సంతృప్తి
పర్చండి.
వారి
ఆజ్ఞను
శిరసావహించండి.
మీరు
విదేశాలకు
వెళ్ళి
బాగా
ధనం
సంపాదించాలని
మీ
తల్లిదండ్రులు
చెప్పవచ్చు.
అప్పుడు
మీరు
ధనంకంటే
గుణమే
ప్రధానమని,
గుణమును
పోషించుకునే
నిమిత్తమై
దైవాన్ని
ఆశ్రయించాలని
వారికి
నచ్చజెప్పాలి.
ఈవిధంగా
బోధిస్తే
మీ
తల్లిదండ్రుల
మనస్సుకూడా
మారిపోతుంది.
మీరు
తల్లిదండ్రులు
చెప్పినట్లు
నడుచుకోవలసిందే!
కాని,
మూర్ఖత్వంతో
చెప్పిన
విషయాలను
పాటించనక్కర్లేదు.
ఈ
కలిప్రభావంచేత
కొందరు
తల్లిదండ్రులు
పిల్లలకు
దైవవిరుద్ధమైన
భావాలను
బోధిస్తున్నారు.
7
▾
Meaning
Keep
అది
వారికి
తెలియక
బోధిస్తున్నారే
గాని,
పిల్లలపై
ప్రేమ
లేక
కాదు.
తల్లిదండ్రులకు
పిల్లలపైన
ప్రేమ
మెండుగా
ఉంటుంది.
కాని,
భవిష్యత్తు
వారికి
తెలియదు.
కనుకనే,
వారు
ఆవిధంగా
బోధిస్తుంటారు.
అలాంటప్పుడు
వారికి
ప్రేమతో
నచ్చజెప్పి
వారి
మనస్సును
సంతృప్తి
పర్చాలి.
వేదము
“మాతృదేవోభవ,
పితృదేవో
భవ”
అన్నది.
నేను
అనేక
పర్యాయములు
పిల్లలకు
చెపుతుంటాను
-
మీ
బ్లడ్డు,
ఫుడ్డు,
దుడ్డు,
హెడ్డు
అంతా
తల్లిదండ్రులయొక్క
వరప్రసాదమే!
కనుక,
మొట్టమొదట
తల్లిదండ్రులకు
తగిన
కృతజ్ఞత
చూపండి.
గాయత్రీ
మంత్ర
సారం
గాయత్రీ
మంత్రమును
మీరు
అన్ని
వేళల
స్మరించాలి.
గాయత్రికి
‘పంచముఖి’
అని
పేరు.
అనగా
ఆమెకు
ఐదు
ముఖములున్నాయి.
ఓం
భూర్భువ
స్సువః
తత్సవితుర్వరేణ్యం,
భర్గోదేవస్య
ధీమహి,
ధియోయోనః
ప్రచోదయాత్
-
ఇవే
గాయత్రియొక్క
ఐదు
ముఖములు.
గాయత్రీ
మంత్రమునందు
వర్ణన,
ప్రార్థన,
ధ్యానము
మూడూ
చేరియుంటున్నాయి.
ఓం,
భూః,
భువః,
సువః,
తత్,
సవితుర్,
వరేణ్యం,
భర్గో,
దేవస్య
-
ఈ
తొమ్మిదీ
వర్ణనలు.
‘ధీమహి’
-
ఇది
ధ్యానము.
‘ధియోయోనః
ప్రచోదయాత్’
-
ఇది
ప్రార్థన.
“తల్లీ!
నాయందున్న
అజ్ఞానాంధకారమును
దూరం
చేసి
మంచి
బుద్ధిని
అనుగ్రహించు”
అని
ప్రార్థించాలి.
గాయత్రీ
మంత్ర
సారం
ఇదే!
భక్తి,
జ్ఞాన
వైరాగ్యములను
ప్రసాదిస్తుంది
గాయత్రీమంత్రము.
ఇలాంటి
పవిత్రమైన
గాయత్రీ
మంత్రమును
స్మరించటంచేత
మనస్సు
పవిత్రమౌతుంది.
ముఖ్యంగా
యువకులు,
విద్యార్థులు
గాయత్రీ
మంత్రమును
తప్పక
స్మరించాలి.
ఈ
రోజుల్లో
చాలమందికి
బాగా
వయస్సు
వచ్చిన
తరువాతనే
గాయత్రీ
మంత్రోపదేశం
జరుగుతోంది.
అంతవరకు
వారి
బుద్ధి
వికసించదు.
గాయత్రీమంత్రోచ్చారణ
జరిగిన
తరువాతనే
బుద్ధి
వికసిస్తుంది,
ప్రకాశిస్తుంది.
కనుక,
పిల్లలకు
8
సంవత్సరాల
వయస్సులోనే
గాయత్రీ
మంత్రోపదేశం
చేయటం
మంచిది.
లేత
వయస్సునుండియే
గాయత్రీ
మంత్రాన్ని
స్మరిస్తే
పిల్లలు
మంచి
తెలివితేటలు
గలవారుగా
రూపొందుతారు.
ఎప్పుడైనాసరే
జీవితంలో
గాయత్రీ
మంత్రమును
స్మరించటంచేత
మీరు
ఎంతైనా
ధన్యులౌతారు.
అయితే,
భక్తి
శ్రద్ధలు
చాల
ప్రధానమైనవి.
ఈనాడు
ఎక్కడ
చూసినా
అశాంతి,
భయము
మితిమీరిపోతున్నాయి.
8
▾
Meaning
Keep
కారణమేమిటి?
మానవుడు
దైవచింతన
చేయటం
లేదు.
సర్వభయములను
నివారణ
గావించేది
ఒక్క
దైవనామమే.
నిజమైన
భక్తికి
చిహ్నం
భగవంతునికి
హిరణ్యగర్భుడని
పేరు.
హిరణ్యమనగా
బంగారమని
అర్థం.
కనుక,
భగవంతుడనే
బంగారం
మీవద్ద
ఉన్నప్పుడే
మీరు
సత్యము,
ధర్మము,
శాంతి,
ప్రేమ
అనే
నగలను
పొందడానికి
వీలౌతుంది.
దైవాన్ని
మీ
హృదయము
నందు
ఉంచుకున్నప్పుడు
మీయందు
దైవభావములే
ఆవిర్భవిస్తాయి.
పాయసం
ఉన్న
పాత్రకు
ఎన్ని
రంధ్రములు
కొట్టినా
అన్ని
రంధ్రములనుండి
పాయసమే
బయటికి
వస్తుంది
కదా!
అదేవిధంగా
మీ
హృదయమునందు
దైవభావాన్ని
నింపుకున్నప్పుడు
మీరు
ఆచరించే
సర్వ
కర్మలూ
దైవకర్మలుగానే
ఉంటాయి.
ఈనాటి
మానవునికి
శ్వాస
ఉన్నదికాని,
విశ్వాసము
లేదు.
విశ్వాసము
లేక
శ్వాస
ఉండి
ప్రయోజనమేమిటి?
మంచిని
విశ్వసించాలి.
ఎల్లప్పుడు
ఇతరులకు
సహాయం
చేయాలి;
ఎవ్వరికీ
కీడు
సల్పకుండా
ఉండాలి.
ఇదియే
నిజమైన
భక్తికి
చిహ్నము.
భక్తి
అంటే
పూజలు,
భజనలు,
వ్రతములు
చేయటం
కాదు.
అవన్నీ
కేవలం
బాహ్యమైన
సత్కర్మలు.
ఈ
బాహ్యమైన
సత్కర్మలను
ఎన్ని
చేసినప్పటికీ
అంతశ్శుద్ధియే
లేకుండిన
అంతా
అశుద్ధమైపోతుంది.
అంతశ్శుద్ధి
కలగాలంటే
ప్రేమను
పెంచుకోవాలి.
కనిపించేవన్నీ
భగవత్స్వరూపాలే!
దైవాన్ని
చూడాలని
మీకు
ఆశగా
ఉంటే
స్థిరమైన
విశ్వాసంతో
కొలవండి,
తప్పక
కనిపిస్తాడు.
ఉన్నాడో,
లేడో
అనే
సందేహానికి
అవకాశమివ్వకూడదు.
ఉన్నాడన్నవారికి
ఉన్నాడు.
లేడన్నవారికి
లేడు.
ఎవరిభావములు
ఎలా
ఉంటాయో
వారికి
లభించే
ఫలితంకూడా
అలానే
ఉంటుంది.
కనిపించని
దేవుణ్ణి
నమ్మటం
మూర్ఖత్వం
అని
అనేకమంది
వాదిస్తుంటారు.
ఇది
చాల
పొరపాటు.
మన
కంటికి
కనిపించేవన్నీ
భగవత్స్వరూపములే.
భగవత్స్వరూపమైన
జగత్తును
చూస్తూ
భగవంతుడు
లేడని
ఎట్లా
చెప్పగలరు?
“ఈశ్వర
స్సర్వ
భూతానాం”
అన్నది
వేదము.
సమస్త
జంతువులు,
క్రిమికీటకాదులు
కూడా
భగవత్స్వరూపములే!
మీరు
ప్రకృతిని
ప్రాకృత
దృష్టితో
చూస్తున్నారు
కాబట్టి,
మీకు
భగవంతుడు
కనిపించటం
లేదు.
ప్రాకృత
భావాన్ని
వీడి
ఈ
ప్రకృతిని
భగవద్భావంతో
చూడండి,
తప్పక
భగవంతుడు
సాక్షాత్కరిస్తాడు.
పుష్పంలో
సుగంధాన్ని
ఎవరు
పెట్టారు?
9
▾
Meaning
Keep
Also in his talks
(1)
22 August 2001
Vināyaka is the embodiment of all the gods
అది
దానికి
సహజము.
అదేవిధంగా
దైవత్వం
మానవునిలో
సహజంగానే
ఉన్నది.
తల్లి
బిడ్డను
ప్రేమిస్తుంది.
తల్లికి
రూపం
ఉందికాని,
ప్రేమకు
రూపం
ఉందా?
ఆ
ప్రేమయే
దైవం.
గాయత్రీ
మంత్రాన్ని
నిరంతరం
స్మరించండి
గాయత్రీ
మంత్రము
చాల
పవిత్రమైనది.
సకల
దేవతల
మంత్రసారము
గాయత్రీ
మంత్రమునందు
ఇమిడియున్నది.
దేవతలు
ఎందరైనా
దివ్యశక్తి
ఒక్కటే.
వ్యక్తులు
అనేకంగాని,
పూలదండలోని
దారంవలె
అందరిలోని
ఆత్మతత్త్వం
ఒక్కటే.
ఇట్టి
ఏకత్వాన్ని
గుర్తించినవారికి
ఎట్టి
బాధలు
ఉండవు.
కనుక,
అట్టి
విశ్వాసాన్ని
పెంచుకోండి.
ఇతరుల
మాటలను
అనుసరించకండి,
మీ
అంతరాత్మను
అనుసరించండి.
అప్పుడే
మీకు
క్షేమం
కల్గుతుంది.
దృఢమైన
విశ్వాసంతో
గాయత్రీ
మంత్రాన్ని
నిరంతరం
స్మరించండి.
ఓం
భూర్భువస్సువః
తత్సవితుర్వరేణ్యం
భర్గో
దేవస్య
ధీమహి
ధియో
యోనః
ప్రచోదయాత్
ఈ
మంత్రాన్ని
కేవలం
ఉదయం,
మధ్యాహ్నం,
సాయంత్రం
మాత్రమే
గాక
అన్ని
వేళల
స్మరించండి.
ఉదయం,
మధ్యాహ్నం,
సాయంత్రం
అనేవి
మీకు
ఉన్నాయిగాని,
భగవంతునికి
లేవు.
భగవంతుడు
కాలాతీతుడు.
అలాంటి
భగవంతుణ్ణి
స్మరించటానికి
ఒక
కాలపరిమితిని
నిర్ణయించుకోవటమెందుకు?
కనుక
సర్వదా
సర్వ
కాలేషు
సర్వత్ర
హరి
చింతనం
చేయండి.
Previous
←
Bhakti and Śaraṇāgati
Next
The Ātma: The Five Kośas
→