Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2006 · Love everyone, serve everyone
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Love everyone, serve everyone
25 December 2006, Christmas, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
Also in his talks
(2)
24 August 1996
Unity Is Great Strength; Practice Alone Is Its Inner Meaning
17 April 1998
Desires are the root of unrest
చిత్తశుద్ధి
లేని
రిత్త
మానవులకు
ఆత్మతత్త్వమెట్లు
అబ్బునొక్కొ
ఆత్మతత్త్వ
మబ్బు
అతిశుద్ధ
బుద్ధికే
ఉన్నమాట
తెలుపుచున్న
మాట
ఒక్క
చిత్తశుద్ధియందే
సర్వము
ఇమిడియున్నది.
ఇదొక
పూలబంతి.
చూడటానికి
మాత్రం
ఇది
ఒకే
పుష్పం
మాదిరి
కనిపిస్తుంది.
కాని,
దీనిలో
అనేక
పుష్పాలు
చేరివున్నాయి.
అదేవిధముగా
వ్యక్తులు
వేరు
వేరుగాని,
ప్రపంచమంతా
ఒక్కటే!
ఈ
ప్రపంచమునకు
పంచభూతములు
ప్రధానమైన
ప్రమాణములు.
అందరూ
చేరినదే
ఈ
ప్రపంచము.
పూలబంతిలోని
పుష్పాలవలె
అందరూ
ఏకం
కావాలి.
అందరూ
ఒక్కటే.
‘నీవు
జీవుడు,
నేను
దేవుడు’
అనే
భేదమే
లేదు.
‘నేను,
మీరు
అందరూ
ఒక్కటే.’
ఇట్టి
ఏకత్వమును
మీరు
భిన్నత్వముగా
భావిస్తున్నారు.
ప్రేమస్వరూపులారా!
అందరియందున్నది
ఒకే
ప్రేమే.
అయితే,
వ్యక్తులయొక్క
మతిని,
స్థితిని,
గతిని
పురస్కరించుకొని
ఈ
ప్రేమ
అనేక
రూపాలను
ధరిస్తున్నది.
చిన్న
బిడ్డను
‘పాప’
అంటారు.
ఆమె
పెరిగి
పెద్దదయిన
తరువాత
‘అమ్మాయి’
అని
పిలుస్తారు.
వివాహమైన
తరువాత
ఆమెను
‘కోడలు’
అంటారు.
బిడ్డలు
పుట్టిన
తరువాత
‘మదర్’
అంటారు.
కొన్ని
సంవత్సరాలైన
తరువాత
‘గ్రాండ్
మదర్’
అంటారు.
ఇన్ని
పేర్లతో
పిలువబడే
వ్యక్తి
ఒక్కరే
కదా!
అదేవిధముగనే,
ఈ
ప్రపంచములో
అందరూ
ఒక్కటిగానే
ఉన్నారు.
All
are
one,
be
alike
to
everyone
అని
ప్రబోధించాడు,
జీసస్.
అందరినీ
ప్రేమించాలి.
అందరినీ
మనము
చెంత
చేర్చుకోవాలి.
నాయొక్క
పద్ధతి
అదియే!
అయితే,
కొంతమంది
దీనిని
అంగీకరించరు.
అది
వారివారి
స్థాయిలలో
ఉండే
వ్యత్యాసమే!
కేవలం
వారివారి
భావములయొక్క
ప్రతిబింబమే!
మీ
భావములను
పురస్కరించుకొనియే
బాబా
అనేక
రూపములు
దాలుస్తుంటాడు.
2
▾
Meaning
Keep
ఒకరు
‘తాతా’
అని
పిలుస్తారు;
వారికి
నేను
తాతగానే
కనిపిస్తాను.
ఇంకొకరు
‘నాన్నా’
అని
పిలుస్తారు;
వారికి
నేను
తండ్రిగానే
కనిపిస్తాను.
మరికొంతమంది
‘స్వామీ’
అంటారు;
వారికి
నేను
స్వామిగానే
కనిపిస్తాను.
మానవులు
ఏవిధంగా
తలుస్తుంటారో
దివ్యత్వము
ఆవిధంగానే
రూపొందుతూ
ఉంటుంది.
జగత్తులో
అన్ని
రకములైన
మార్పుకు
మూలం
మనస్సే!
ఈ
కలి
ప్రభావముచేత
మంచికూడను
చెడ్డగా
కనిపిస్తున్నది.
ఒకే
మనిషి
ఒకరిపట్ల
ప్రేమతో,
మరొకరిపట్ల
ద్వేషంతో
ఉంటాడు;
ఒకరిపట్ల
విరోధంతో
ప్రవర్తిస్తాడు;
మరొకరిపట్ల
విశ్వాసంగా
మెలగుతాడు.
ఒకరికి
ఫ్రెండ్‌గా
ఉంటాడు,
మరొకరికి
శత్రువుగా
ఉంటాడు.
మిత్రత్వముగాని,
శత్రుత్వము
గాని
బయట
లేవు;
వారివారి
హృదయాల్లోనే
ఉన్నవి.
‘వీడు
నా
శత్రువు’
అనుకుంటే
వాడు
నీకు
శత్రువుగానే
తయారవుతాడు.
‘వీడు
నా
ఫ్రెండు’
అనుకుంటే
ఫ్రెండుగానే
మారిపోతాడు.
వివాహానికి
పూర్వం
‘ఆమె
ఎవరో
ఒక
కాలేజీ
గర్ల్’
అంటావు.
ఆమెను
నీవు
వివాహము
చేసుకున్న
తరువాత
‘ఈమె
నా
భార్య’
అంటావు.
ఈనాటి
నీ
భార్య,
ఆనాటి
కాలేజీ
అమ్మాయి
ఇరువురూ
ఒక్కటే
కదా!
రూపనామములనుబట్టి
మానవుడు
అనేకవిధములైన
సంబంధ
బాంధవ్యములను
కల్పించుకుంటాడు.
ఈ
జగత్తు
అనేకరకములుగా
మార్పుచెందుటకు
మానవుని
మనస్సే
మూలకారణం.
మానవునియందు
ఏమాత్రం
దోషము
లేదు.
అందరియందున్నది
ప్రేమయే!
కాని,
కొన్నికొన్ని
సమయాల్లో
ద్వేషము,
అసూయ,
ఆడంబరము
ఇలాంటివన్నీ
ఏర్పడుతున్నాయి.
దైవమునందు
ఈవిధమైన
మార్పు
ఉండదు.
భగవంతుడు
గుణాతీతుడు.
గుణములు
కలిగినటువంటివాడు
మానవుడు.
అవి
మంచివి
కావచ్చు,
చెడ్డవి
కావచ్చు.
మంచిచెడ్డలు
మానవునియందే
ఉన్నవిగాని,
పరమాత్మునియందు
కాదు.
ఈ
కలి
యుగమునందు
అనేక
మార్పులు
కలుగుతున్నవి.
ఇదంతా
చూసి
మీరు
‘భగవంతుడే
ఈవిధంగా
మారుస్తున్నాడు’,
అని
అనుకుంటారు.
భగవంతుడు
ఏదికూడను
మార్చడు.
పాలలో
డికాక్షన్
కలిపి
కాఫీ
తయారు
చేయవచ్చు.
అదే
పాలతో
పాయసంకూడా
తయారు
చేయవచ్చు.
భగవంతుడు
పాలవంటివాడు.
మార్పులన్నీకూడను
మానవునియొక్క
గుణములచేతనే
కలుగుతున్నాయి.
మానవునియొక్క
గుణము
ఎన్నో
రకములుగా
మార్పు
చెందుతూ
ఉంటుంది.
3
▾
Meaning
Keep
ఎంతో
కోపంగా
ఉండేవాడు
కొన్ని
సమయాల్లో
అత్యంత
ప్రేమగా
ఉంటాడు.
పాల్
అనే
వ్యక్తి
మొట్టమొదట
జీసస్పట్ల
ద్వేషభావంతో
ఉండేవాడు.
కొంతకాలానికి
అతడే
జీసస్కు
పరమ
భక్తునిగా
మారిపోయాడు.
‘ఆఫ్రికన్ల
భక్తిని
చూస్తే
నా
హృదయం
కరిగింది’
ఇంతకు
ముందు
ప్రసంగించిన
ఆఫ్రికన్
భక్తుడు
నన్ను
చిన్నప్పటినుండి
ఆరాధిస్తూ,
ప్రేమిస్తూ
వచ్చాడు.
అతను
ఇక్కడకు
వచ్చి
స్వామిని
దర్శించుకొని
ఇక్కడే
ఉండిపోవాలని
ఆశించాడు.
నా
ఆదేశము
మేరకు
తన
దేశానికి
తిరిగి
వెళ్లినాడు.
వెళ్లిన
తరువాతకూడా
నిరంతరము
‘బాబా,
బాబా’
అని
స్మరిస్తూ
వచ్చాడు.
నేను
తూర్పు
ఆఫ్రికాలో
పర్యటించినప్పుడు
(1968)
నన్ను
దర్శించుకొనే
నిమిత్తం
అనేకమంది
వచ్చారు.
ప్రతి
ఒక్కరూ
‘స్వామీ,
మాదగ్గర
ఉండండి,
మాదగ్గర
ఉండండి’,
అని
ప్రార్థిస్తూ
వచ్చారు.
కొన్ని
వందలమంది
పిల్లలు
అక్కడ
చేరారు.
వారి
దృష్టి
అంతా
స్వామిపైననే!
మీకు
తెలుసు
-
ఇడి
అమీన్
అనే
వ్యక్తి
ఉగాండా
అధ్యక్షుడిగా
ఉండేవాడు.
అతను
చాలా
గొప్ప
చదువులు
చదివాడు.
వయస్సులో
చిన్నవాడేగాని
అతనికి
అనేకమంది
భార్యలుండేవారు.
అతనుకూడా
నన్ను
ఎంతో
ప్రీతిగా
చూశాడు.
ప్రొద్దున్న,
సాయంకాలముకూడను
నన్ను
చూడనిదే
అతను
ఆఫీసుకు
పోయేవాడు
కాదు.
అతను
చాలా
ఎత్తుగా,
లావుగా
ఒక
ఒంటెమాదిరి
ఉంటే
నేను
జింక
మాదిరి
చిన్నగా
ఉండేవాడిని.
అతనికి
స్వామిపట్ల
గల
భక్తిని,
ప్రేమను
చూసి
అందరూ
ఆశ్చర్యపడుతూ
వచ్చారు.
నేను
బయల్దేరి
వచ్చే
సమయంలో
అతడు
కంటిధారలు
కార్చుతూ,
“స్వామీ,
నేను
పుట్టినప్పటినుండి
ఇంత
వరకు
కంటిధారలు
కార్చలేదు.
కాని,
ఈనాడు
నా
స్వామి
నన్ను
వదలిపెట్టి
వెళ్ళిపోతున్నారే,
అని
చాలా
బాధగా
ఉంది”,
అన్నాడు.
మొహానికి
కర్చీఫ్
అడ్డం
పెట్టుకొని
చాలా
బాధపడ్డాడు.
అతని
చేతులు
చాలా
బలమైనవి.
అతను
నాకు
థ్యాంక్స్
చెబుతూ
నా
చేతులు
పట్టుకున్నాడు;
నా
పాదాలు
పట్టుకున్నాడు.
ఎంత
గట్టిగా
పట్టుకున్నాడంటే,
ఆ
తరువాత
నేను
ఏరోప్లేను
ఎక్కడానికికూడా
కష్టమైంది!
“స్వామీ!
నేను
తప్పకుండా
త్వరలో
మీ
దగ్గరికి
వస్తాను.
లేకపోతే
మీరైనా
త్వరలో
రండి.
లేకపోతే
నేను
ఉండలేను”,
అని
ప్రార్థించాడు.
ఆనాటి
పరిస్థితిలో
అతను
తన
దేశాన్ని
వదలిపెట్టి
వచ్చే
అవకాశం
లేకపోయింది.
4
▾
Meaning
Keep
నేను
ఉగాండాలో
ఉండగా
ఒకనాడు
అమీన్
నన్ను
తన
ఇంటికి
తీసుకువెళ్ళి
విందు
ఏర్పాటు
చేయాలనుకున్నాడు.
ఏవిధమైన
ఏర్పాట్లు
చేయాలో
తెలుసుకోవడానికి
తాను
డా
॥
పటేల్
ఇంటికి
వచ్చాడు.
“ఏమి
చెయ్యాలి?
ఎట్లా
చెయ్యాలి?
ఏమి
పెట్టాలి?”
అని
అన్ని
వివరాలూ
అడిగి
తెలుసుకున్నాడు.
వంటలు
చేయడానికి
బజారునుండి
అన్నీ
క్రొత్త
పాత్రలు
తెప్పించాడు.
చిన్నచిన్న
టంబ్లర్లుకూడా
క్రొత్తవి
తెప్పించాడు.
నేను
వాళ్ళ
ఇంటికి
వెళ్ళినప్పుడు
అతని
భార్యలందరూ
ఇటువైపున,
అటువైపున
వరుసగా
నిల్చున్నారు.
వాళ్ళను
నాకు
పరిచయం
చేశాడు.
ఉగాండా
రాజధాని
కంపాలాలో
నేను
కొద్ది
దినములు
ఉన్నాను.
చివరి
రోజున
గురుపౌర్ణమి
వచ్చింది.
గురుపౌర్ణమికి
బొంబాయి
వస్తానని
నేను
చెప్పాను.
కాని,
అక్కడ
ఆఫ్రికన్లు
నన్ను
కదలనివ్వకుండా
నా
పాదాలపై
పడి
కంటిధారలు
కారుస్తూ,
“భగవాన్!
మాతోనే
ఉండండి”,
అని
ప్రార్థించారు.
వారి
ప్రార్థనల
ఫలితంగా
నేను
గురుపౌర్ణమికి
అక్కడే
ఉన్నాను.
ఆరోజున
వాళ్లు
స్వామితో
ఫోటోలు
తీయించుకోవాలని
ఆశించారు.
‘మీరు
మనస్సులో
ప్రార్థించుకోండి’,
అన్నాను.
అందరి
పాకెట్లలోను
వాళ్ళు
స్వామితో
కలిసి
తీయించుకొన్నట్లుగా
ఫోటోలు
ప్రత్యక్షమైనాయి.
అందరూ
చాలా
ఆనందించారు.
ఆ
ఆఫ్రికన్ల
భక్తి
‘ఇట్టిది,
అట్టిది’
అని
వర్ణించడానికి
వీలుకాదు.
ఈనాటికికూడను
ఆ
భక్తులను
తలుచుకుంటే
ఎంతో
ఆనందం
కలుగుతుంది.
అక్కడినుండి
టాంజానియాకు
వెళ్ళాను.
అక్కడకూడా
అందరూ
ఎంతో
ఆనందించారు.
మగవాళ్ళు,
ఆడవాళ్ళు
తమ
సంస్కృతిని
ప్రతిబింబించే
డ్రస్సులు
ధరించి,
నృత్యం
చేస్తూ
స్వాగతం
పలికారు.
ఆ
పర్యటనలో
నేను
కెన్యా,
ఉగాండా,
టాంజానియా
-
ఈ
మూడు
దేశాలకు
వెళ్ళాను.
అవన్నీ
ఇరుగుపొరుగు
దేశాలు.
నేను
అక్కడినుండి
బయలుదేరే
రోజున
అందరూ
ప్లేను
దగ్గరికి
వచ్చారు.
ప్లేను
బయలుదేరే
సమయానికి
అందరూ
ప్లేనుకు
ఎదురుగా
వచ్చి
నిలుచున్నారు.
“స్వామీ,
మీరు
ఇక్కడినుండి
కదలకూడదు.
ఇక్కడే
ఉండాలి”,
అని
ప్రార్థించారు.
నేను
అక్కడినుండి
కదలకపోతే
ఎలా!
అప్పుడు
పైలట్లు,
ఇతర
అధికారులు
వెళ్ళి
“మీరిలా
స్వామికి
అడ్డు
చేయడం
మంచిది
కాదు”,
అని
వాళ్ళకు
నచ్చజెప్పడంచేత
వాళ్ళు
ప్రక్కకు
తప్పుకున్నారు.
5
▾
Meaning
Keep
నేనిదంతా
కిటికీ
నుండి
చూస్తూనే
ఉన్నాను.
నేను
తిరిగి
బొంబాయి
వచ్చి
చేరేంతవరకు
ఆ
దృశ్యమే
నా
కళ్లలో
మెదుల్తూ
ఉండినది.
ఆ
ఆఫ్రికన్ల
భక్తిని
చూస్తే
నా
హృదయం
కరిగింది.
నేను
వచ్చే
సమయంలో
మా
ఏరోప్లేనంతా
వాళ్ళు
ఇచ్చిన
కానుకలతో
నిండిపోయింది.
ఏమిటా
కానుకలు?
గోల్డ్
కలర్లో
ఉన్న
టీ
సెట్లు,
డిన్నర్
సెట్లు
...
ఇంకా
ఏమిటేమిటో
తెచ్చి
పెట్టారు.
అవి
నాదగ్గర
ఇప్పటికీ
ఉన్నాయి.
ఇక్కడికి
వచ్చే
ప్రైమ్
మినిష్టర్లకు,
గవర్నర్లకు
ఆతిథ్యమిచ్చే
సమయంలో
వాటినే
ఉపయోగిస్తున్నాము.
ఆ
భక్తులకు
స్వామి
అంటే
ఎంతో
ప్రేమ.
ఎంత
ప్రేమ
అంటే
వాళ్ళ
తల్లిదండ్రులపై,
బిడ్డలపైకూడా
వాళ్ళకు
అంత
ప్రేమ
ఉండదు.
నేను
తిరిగి
వచ్చే
సమయంలో
వాళ్ళు
పడిన
బాధ
వర్ణనాతీతం.
అటువంటి
భక్తులను
వదలిపెట్టి
రావలసివచ్చిందని
నాకుకూడా
బాధ
కలిగింది.
అప్పుడే
అనుకున్నాను,
ఇంక
ఎప్పుడూ
నేను
బయటి
దేశానికి
వెళ్ళకూడదని.
అప్పటినుంచి
నేను
ఏ
దేశమూ
వెళ్ళలేదు.
అప్పుడుకూడను
ఆ
దేశానికి
వెళ్ళడానికి
కారణం
ఒకటుంది.
డా
॥
పటేల్
నన్ను
అక్కడికి
రావలసిందిగా
చాలా
ప్రార్థించాడు.
“స్వామీ!
కేవలం
మాకోసమే
కాదు.
అక్కడ
వన్యప్రాణులు
అనేకం
ఉంటున్నాయి.
మీ
దర్శన
భాగ్యం
ప్రసాదించి
వాటిని
కూడా
ఆశీర్వదించండి”,
అని
కోరాడు.
అక్కడికి
వెళ్ళిన
తరువాత
చిన్నచిన్న
ప్లేన్లు
ఏర్పాటు
చేశాడు.
ఒక్కొక్క
ప్లేనులో
ఇద్దరిద్దరిని
మాత్రమే
కూర్చోబెట్టాడు.
ప్లేనులో
స్వేచ్ఛగా
తిరుగాడవచ్చు,
చక్కగా
చూడవచ్చు
అని
అతని
ఉద్దేశ్యం.
మేము
ఆ
చిన్న
ప్లేన్లలో
సంచరిస్తూ
అన్నీ
చూశాము.
విక్టోరియా
సరస్సు
చాలా
పెద్దది.
ఆ
సరస్సును
మేము
ప్లేనులో
దాటడానికి
గంటన్నర
పట్టింది.
దాంట్లో
అనేక
పెద్ద
పెద్ద
మొసళ్లున్నాయి.
స్థలం
చాలక
ఒకదానిమీద
ఒకటి
పడుతున్నాయి.
ఆ
తరువాత
మేము
పడవలో
ప్రయాణమై
వెళుతుంటే
అవన్నీ
నోళ్ళు
పెద్దగా
తెరుచుకొని
మా
పడవవైపే
చూస్తున్నాయి.
వాటన్నింటికీ
మేము
ఆపిల్స్
వేశాము.
మేము
తిరిగి
వచ్చేంతవరకు
ఆ
ఆపిల్స్‌ను
అట్లనే
పెట్టుకున్నాయి.
ఏదీ
మ్రింగలేదు.
అక్కడ
నీటి
గుఱ్ఱములుకూడా
చాలా
ఉన్నాయి.
కొన్నికొన్ని
బిడ్డలకు
పాలిస్తున్నాయి.
ఆ
దృశ్యమంతా
చూస్తుంటే
ఎంతో
ఆనందం
కలిగింది.
మానవులకు
ఎన్ని
ఆశలున్నాయో
అవి
జంతువులకుకూడా
ఉన్నాయి.
ఐతే,
వాటికున్న
ప్రేమ
మనుష్యులకు
కూడా
ఉండదు.
6
▾
Meaning
Keep
మేము
ఆ
సరస్సు
దాటి
గట్టుకు
వచ్చేటప్పటికి
ఎక్కడ
చూసినా
గుంపులు
గుంపులుగా
ఏనుగులు
కనిపించాయి.
వాటి
చెవులు
చాలా
పెద్దవి;
ఒక్కతూరి
అట్లా
విసిరితే
మనిషి
క్రిందపడిపోతాడు.
ఆ
ఏనుగుల
మధ్యలోకి
నేను
వెళ్లాను.
నా
కారు
చూసి
అవి
తొండం
ఎత్తి
నమస్కారం
చేశాయి.
ఈవిధంగా
మనుషుల్లో
కూడా
లేని
మంచి
గుణములు
ఆ
జంతువుల్లో
కనిపించాయి.
వాటిలో
ద్వేషభావమే
లేదు.
అన్నీ
కలసిమెలసి
ఉన్నాయి.
సాధారణంగా
సింహాలను
చూస్తే
ఏనుగులకు
భయం.
కాని,
అక్కడ
సింహాలు,
ఏనుగులు
కలసిమెలసి
ఉన్నాయి.
మేము
ఒక
చిన్న
గుట్టపైకి
వెళ్ళాము.
అక్కడొక
గుండుపైన
పది
సింహాలున్నాయి.
చుట్టూ
ఏనుగులు
తిరుగుతూనే
ఉన్నాయి.
మేముకూడా
వాటిదగ్గరకు
వెళ్ళి
ఫోటోలు
తీసుకున్నాము.
అవి
ఏమాత్రం
కదలలేదు.
మావైపునే
చూస్తూ
ఉన్నాయి.
మనుష్యులలోనైనా
ఒకవిధమైన
భీతి
కలిగే
అవకాశం
ఉంది.
కాని,
అక్కడ
ఏ
జంతువుగాని,
ఏ
మృగముగాని
భయపడలేదు.
కొన్ని
సింహాలు
అక్కడ
పడుకొని
వున్నాయి.
వాటి
తోకల
మీదినుండి
మా
జీపు
వెళ్ళింది.
ఆ
తోకలను
తీసికొని
అవి
ముద్దు
పెట్టుకున్నాయి.
ఇంత
ప్రేమను
చూపినటువంటి
ఆ
మృగాలను
వదలిరావడానికి
నాకు
చాలా
కష్టమనిపించింది.
ఇటువంటి
ప్రేమ
ఈనాడు
మనుష్యులయందు
కనిపించడం
లేదు.
ఒకరిని
చూస్తే
ఒకరికి
ద్వేషము!
తల్లీబిడ్డలమధ్యకూడా
ద్వేషమే!
భార్యాభర్తల
మధ్యకూడా
ద్వేషమే!
కాని,
అక్కడ
ఏవిధమైన
ద్వేషమూ
మాకు
కనిపించలేదు.
ఇంతటి
ప్రేమ,
సమత్వములతో
కూడిన
మృగములను
ఆ
ప్రదేశములో
చూశాను.
అక్కడినుండి
వచ్చిన
తరువాత
వాటి
ప్రేమతత్త్వాన్ని
మనుష్యులకు
బోధించడానికి
ప్రయత్నించాను.
జంతువులలోనే
ఇంత
ప్రేమ
ఉంటే
మనుష్యులలో
ఎందుకుండకూడదు?
వాటికి
ప్రజ్ఞాన,
విజ్ఞాన,
సుజ్ఞానములు
ఏమాత్రము
లేవు.
ప్రజ్ఞాన,
విజ్ఞాన,
సుజ్ఞానములతో
కూడి,
అనేక
గ్రంథాలను
చదివిన
నేటి
మానవునియందు
కించిత్
ప్రేమకూడా
కనిపించడం
లేదు.
కనుక,
మానవులారా!
మీరందరూ
కలసిమెలసి
అన్యోన్యంగా
ఉండాలని
నేను
ఆశిస్తున్నాను.
‘లవ్
ఆల్,
సర్వ్
ఆల్.’
అందరినీ
ప్రేమించండి.
అందరినీ
సేవించండి.
ఇదే
నేను
మీకు
అందించేటటువంటి
ప్రబోధ.
ప్రేమ
ఒక్కటి
ఉంటే
అన్నీ
సాధించవచ్చును.
ప్రేమయే
సర్వము.
ప్రేమయే
జీవితము.
జీవితమే
ప్రేమ.
జీవితమనేది
ప్రేమతో
కూడినదేగాని,
ద్వేషముతో
కూడినది
కాదు.
7
▾
Meaning
Keep
బొంబాయిలో
మున్షీపై
కృపావృష్టి
మా
తూర్పు
ఆఫ్రికా
పర్యటన
ముగించుకొని
మేము
బొంబాయికి
బయలుదేరాము.
మా
ప్లేను
చాలా
ఆలస్యంగా
బొంబాయి
చేరుకుంది.
అయినప్పటికీ
అక్కడ
నాకోసం
మున్షీ
కాచుకొని
ఉండినాడు.
మున్షీ
ఎవరో
మీకు
తెలుసా?
భారతీయ
విద్యాభవన్
ఛైర్మన్.
ఆ
సమయంలో
ఆయనకు
చేయి,
నోరు
రెండూ
పడిపోయాయి.
నేను
అక్కడ
దిగిన
తక్షణమే
చేయి
ఎత్తగలిగాడు.
పట్టలేని
ఆనందంతో
‘భగవాన్కీ
జై’
అన్నాడు.
‘మున్షీ
చేయి
ఎత్తగలిగాడు,
మాట్లాడుతున్నాడు’
అని
అందరూ
ఆశ్చర్యపడ్డారు.
అక్కడినుండి
నన్ను
నేరుగా
భారతీయ
విద్యాభవన్కి
తీసుకు
వెళ్ళాడు.
అక్కడ
సత్యసాయి
సంస్థల
వరల్డ్
కాన్ఫరెన్సు
ఏర్పాటు
చేశారు.
చాలామంది
జనులు
ప్రోగయ్యారు.
ఆ
సందర్భంలో
మున్షీ
చాలా
బాగా
మాట్లాడాడు.
“ఇంతవరకు
కానరానటువంటి
దేవుడు
ఈనాడు
మన
కంటికెదురుగా
వచ్చి
మనల్ని
ఆనందపెడుతున్నాడు”,
అని
అన్నాడు.
అతను
ఒక
కోరిక
కోరాడు,
మూడు
దినములు
వాళ్ళ
ఇంట్లో
ఉండాలని.
అతని
కోరికను
నెరవేర్చాలని
నేను
మూడు
దినములు
వాళ్ళింట్లో
ఉన్నాను.
ఆ
మూడు
దినములు
అతనికి
మూడు
క్షణములుగా
గడచిపోయినాయి.
నీవు
మంచిగా
ప్రవర్తిస్తే
శాంతి
నీనుండియే
ఆవిర్భవిస్తుంది
ఈనాడు
ఎక్కడ
చూసినను
ద్వేషము,
ద్వేషము,
ద్వేషము!
ఇది
మంచిది
కాదు.
మనము
మానవులమై
పుట్టి
మానవత్వాన్ని
వదలిపెట్టి,
మృగ
లక్షణాలను
పెంచుకోవడం
మంచిది
కాదు.
ఒక్కొక్కసారి
మనుష్యులకన్న
మృగములే
మేలనిపిస్తుంది.
మనుష్యుల
కుండవలసిన
గుణాలు
మృగములయందే
కనిపిస్తున్నాయి.
ఈనాడు
జంతువులు
మానవులుగా
మారిపోతున్నాయి,
మానవులు
జంతువులుగా
మారిపోతున్నారు!
మానవులు
మానవులుగా
జీవించాలి.
మానవతా
గుణములను
పోషించుకోవాలి.
ఇంతకు
ముందు
ప్రసంగించిన
ఆఫ్రికన్
దేశస్థుడుకూడా
మానవతా
విలువలనుగురించి
ప్రచార
ప్రబోధలు
సల్పుతున్నాడు.
ఈనాడు
లోకములో
మానవులు
అనేకమంది
ఉన్నారు.
కాని,
మానవతా
విలువలతో
కూడినవారు
చాలా
అరుదుగా
కనిపిస్తారు.
8
▾
Meaning
Keep
కొంతమందికి
మంచిగా
మాట్లాడటం
కూడా
తెలియదు.
‘ఏమండీ
మీరు
ఎక్కడినుంచి
వచ్చారు?’
అని
ప్రేమతో
అడిగితే,
‘ఎక్కడినుంచో
వచ్చాను’,
అని
దురుసుగా
జవాబు
చెబుతారు.
ఏ
మాట
మాట్లాడినప్పటికీ
కఠినంగా
మాట్లాడుతారు.
మానవుడు
మాట్లాడే
మాటలు
మృదుమధురంగా
ఉండాలి.
నెమ్మదిగా,
శాంతంగా,
ప్రేమతో
మాట్లాడాలి.
అప్పుడే
మనకు
శాంతి
లభిస్తుంది.
మన
మాటలు,
నడత
చెడ్డవిగా
ఉన్నప్పుడు
మనకు
శాంతి
ఏరీతిగా
లభిస్తుంది!
శాంతి
అనేది
బయట
లేదు,
మనయందే
ఉన్నది.
బయట
‘పీసెస్’
తప్ప
‘పీస్’
లేదు.
‘నాకు
శాంతి
కావాలి,
శాంతి
కావాలి’
అని
అంటుంటారు.
నీవు
మంచిగా
ప్రవర్తించు;
శాంతి
నీనుండియే
ఆవిర్భవిస్తుంది.
సత్యము
ఎక్కడినుండి
లభిస్తుంది?
గ్రంథములను
చదివినంతమాత్రమున
లభిస్తుందా?
లేదు.
సత్యము
కూడను
నీయందే
ఉన్నది.
సత్యము,
ధర్మము,
శాంతి,
ప్రేమ,
అహింస
-
ఈ
ఐదూ
మానవునియొక్క
సహజ
గుణములు.
ప్రేమ
అనేది
భగవంతునియొక్క
స్వరూపమే!
భగవంతునియొక్క
ప్రేమను
మనము
ప్రేమతోనే
అనుభవించ
వచ్చును.
ముఖ్యంగా
మానవునకు
ప్రేమ,
శాంతి
రెండూ
చాలా
అవసరము.
కోటీశ్వరులు
ఎన్నో
బంగాళాలు
కట్టవచ్చును;
ఎన్నో
కార్లు
కొనవచ్చును.
వాళ్ళకు
ఎన్నో
సౌకర్యాలుండవచ్చును.
కాని,
ఎవరిని
అడిగినా
‘మాకు
శాంతి
లేదు’
అంటారు.
శాంతి
లేనప్పుడు
ఎన్ని
ఉండి
ఏమి
ప్రయోజనం!
మనిషికి
కావలసింది
ఆరడుగులే!
ఇటీవల
ఒక
వ్యక్తి
ఒక
ఎకరం
స్థలాన్ని
నలభై
కోట్లు
పెట్టి
కొన్నాడు.
ఇచ్చినవాడు
ఎటువంటివాడో,
తీసుకున్నవాడు
ఎటువంటివాడో
కాని
ఇద్దరికీ
బుద్ధి
లేదనే
చెప్పవచ్చు.
ఇప్పుడందరూ
భూములను
పెంచుకుంటున్నారు.
భూమి
ఎంతవరకు
అవసరము?
మనిషికి
కావలసింది
ఆరడుగులు.
అంతకంటే
ఎక్కువ
అవసరము
లేదు.
ఒక
జమీందారు
తనకున్న
భూమితోపాటు
ఇంకా
కొంత
భూమిని
సేకరించాలని,
భూమికోసం
వెదకడం
ప్రారంభించాడు.
ఇది
తెలిసిన
ఒక
వ్యక్తి
అతనివద్దకు
వచ్చి,
“అయ్యా!
నీవు
హిమాలయ
ప్రాంతానికి
వెళ్ళు!
నీకు
కావలసినంత
భూమిని
ఉచితంగా
ఇస్తారు”,
అన్నాడు.
ఇతను
ఆశపడి
హిమాలయ
ప్రాంతానికి
వెళ్లి
అక్కడి
రాజును
కలుసుకున్నాడు.
ఆయన,
“మీరు
తెల్లవారినది
మొదలు
సాయంకాలమువరకు
ఎంత
భూమిని
చుట్టి
వస్తారో
ఆ
భూమినంతా
మీకు
ఉచితంగా
ఇస్తాను”,
అన్నాడు.
9
▾
Meaning
Keep
ఈ
జమీందారు
ఎంతో
ఉత్సాహంతో
మరునాడు
ప్రొద్దున్న
లేచి
తన
పనికి
పూనుకున్నాడు.
ఎక్కువ
భూమిని
సంపాదించాలని
పరుగెత్తసాగాడు.
ప్రొద్దుటినుంచి
సాయంకాలము
వరకు
అలా
తాను
పరుగెత్తుతూనే
ఉన్నాడు.
చీకటి
పడింది.
బాగా
అలసి
పోయాడు.
నీరసించిపోయాడు.
అయినా
ఆశ
వదలలేదు.
తాను
నిర్ణయించుకొన్న
గమ్యానికి
ఆరడుగుల
దూరంలో
ఉండగా
కళ్ళు
తిరిగి
గుండె
ఆగి
క్రింద
పడిపోయాడు.
హిమాచలం
రాజు
వచ్చి
చూసి,
“అయ్యో,
ఇప్పుడు
ఈ
మనిషికి
కావలసింది
ఆరడుగులే”,
అన్నాడు.
అందరికీ
కావలసింది
అంతే!
ప్రజలకు
అలెగ్జాండర్
సందేశం
అలెగ్జాండర్
అనేక
రాజ్యాలను
జయించి
భారతదేశానికి
వచ్చాడు.
ఒక
నది
దాటి
వస్తుంటే
అతనికి
గుండెపోటు
వచ్చింది.
వైద్యులు
వచ్చి
పరీక్షించి
అతనికి
అంత్యకాలమాసన్నమైనదని,
ఎన్ని
మందులిచ్చినా
లాభం
లేదని
నిర్ధారించారు.
అప్పుడు
అలెగ్జాండర్,
“నాకు
ఇంత
పెద్ద
రాజ్యమున్నది.
కావలసినంత
బంగారమున్నది.
ఎంతో
గొప్ప
సైన్య
మున్నది.
ఇంతమందిలో
నన్ను
రక్షించేవారు
ఒక్కరూ
లేరా?”
అని
చింతించాడు.
వెంటనే
తన
మంత్రులను
పిలిపించి
చెప్పాడు,
“మంత్రులారా!
నేను
మరణించిన
తరువాత
మీరు
నా
శవాన్ని
మన
దేశానికి
తీసుకు
వెళ్ళండి.
నా
దేహాన్ని
ఒక
తెల్లని
బట్టలో
చుట్టి,
చేతులను
మాత్రం
పైకి
పెట్టి
వీధివీధిలోను
ఊరేగించండి”,
అని.
అతను
కోరినట్లుగానే
అతని
దేహాన్ని
తెల్లని
బట్టలో
చుట్టి,
చేతులను
పైకి
పెట్టి
ఊరేగించారు.
“ఎందుకు
మహారాజు
దేహాన్ని
ఈవిధంగా
చేతులు
పైకి
పెట్టి
ఊరేగిస్తున్నారు?”
అని
జనులు
అడిగారు.
“ఇంత
గొప్ప
సిరిసంపదలు
గల
అలెగ్జాండర్
చక్రవర్తి
కట్టకడపటికి
వట్టి
చేతులతోనే
పోయాడు’,
అని
ప్రజలందరికీ
తెలియజేసే
నిమిత్తం
ఆయన
కోరిక
మేరకే
ఈవిధంగా
చేస్తున్నాము”,
అని
మంత్రులు
జవాబిచ్చారు.
అందరికికూడను
కట్టకడపటికి
జరిగేది
అదే!
ఎంత
రాజ్యమును
సంపాదించినా,
ఎంత
గొప్ప
సైన్యముండినా,
ఎందరు
బంధుమిత్రులున్నా
మనం
పోయే
సమయంలో
ఎవ్వరూ
మన
వెంట
రారు.
ఆనాటి
కాలంలో
ఎందరో
మహనీయులు,
రాజులు
ప్రజలకు
ఈవిధమైన
సత్యాన్ని
చాటి
దేహాభిమానమును
విడిచిపెట్టవలసిందిగా
బోధిస్తూ
వచ్చారు.
10
▾
Meaning
Keep
అట్టి
మహాపురుషుల
చరిత్రలను
మీరు
చదవటం
లేదు;
పిచ్చిపిచ్చి
పుస్తకాలన్నీ
చదువుతున్నారు.
ఈనాడు
మీరు
నేర్చుకుంటున్నది
‘హిస్టరీ’
కాదు,
‘హిస్టీరియా’!
నిజమైన
‘హిస్టరీ’
ఎవ్వరూ
చదవటం
లేదు.
ఏది
నిజమైన
‘హిస్టరీ’?
His
story
is
history.
ఈనాటి
మానవుడు
గొప్పగొప్ప
చదువులు
చదువుతున్నాడు,
సైన్స్
అండ్
టెక్నాలజీని
అభ్యసిస్తున్నాడు,
నోబెల్
బహుమతిని
సాధిస్తున్నాడు.
కాని,
‘టెక్నాలజీ’ని
దుర్వినియోగపరచి
దానిని
కేవలం
‘ట్రిక్-
నాలజీ’గా
మార్చుకుంటున్నాడు.
మనము
చదివినవన్నీ
మన
తలలో
నిలువవు;
కేవలం
ఆచరణలో
పెట్టింది
మాత్రమే
నిలుస్తుంది.
మనం
చదివేవాటిలో
ఒక్కటైనా
ఆచరణలో
పెడితే
చాలు;
అదే
మనకు
అన్ని
విధాలుగా
సహాయం
చేస్తుంది.
ప్రేమస్వరూపులైన
విద్యార్థులారా!
మీరు
ఏదైనను
చదువవచ్చు.
కాని,
మానవతా
విలువలను
మాత్రం
మరువకండి.
సత్యము,
ధర్మము,
శాంతి,
ప్రేమ,
అహింస
-
వీటిని
మీరు
అలవర్చుకొని
ఆచరణలో
పెట్టండి.
మీ
జీవితమంతా
ప్రశాంతంగా
సాగుతుంది.
నేనీనాడు
మీకు
ప్రధానంగా
చెప్పదల్చుకున్నది
ఇదే!
క్షణక్షణము
మనము
కోపము,
తాపము,
అసూయ,
ఈర్ష్య,
డంబము
మొదలైన
దుర్గుణాలకు
లోనవుతూ
ఉంటే
మన
జీవితమంతా
అశాంతిలోనే
మునిగి
పోతుంది.
సత్యము
శాశ్వతమైనది.
సత్యమును
అనుసరించినప్పుడే
మీ
పేరు
శాశ్వతంగా
నిలుస్తుంది.
శాశ్వతమైన
సత్యముతోనే
శాశ్వతమైన
శాంతి
మీకు
దక్కుతుంది.
Previous
←
Teachers alone are the real leaders
Next
Only a life that brings joy to many is a true life
→