Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2007 · Only a life that brings joy to many is a true life
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Only a life that brings joy to many is a true life
15 January 2007, Sankrānti, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His poems 540
Also in his talks
(1)
14 January 2005
When the heart is filled with Prema, life is filled with Ānanda
“దినకరుడు
శాంతుడై
తోచె,
దినములింక
కురుచలయ్యెను,
చలిగాలి
చురుకు
హెచ్చె,
పొలములన్
రేయి
గ్రుడ్డివెన్నెలలోన
కుప్పలన్
నూర్చు
కాపులు
గొంతులెత్తి
పదములన్
పాడదొడగిరి
పచ్చపూలు
జనపచేలకు
ముత్యాలసరులు
గూర్చె,
మిరపపండ్లు
కుంకుమ
మెరుపు
దాల్చె
బంతిపువ్వుల
మొగములల్లంత
విప్పి,
మన
గృహంబుల
ధాన్యసంపదలు
నిల్పి
సరసురాలైన
పుష్యమాసంబునందు
పరగనొప్పుచు
సంక్రాంతి
పండుగొచ్చె.”
ప్రజలకు
తిండి,
తీర్థాదులకు
ఎట్టి
ఇబ్బందీ
లేకుండా
కాపాడే
నిమిత్తమై
భగవంతుడు
సంక్రాంతిని
సంకల్పించాడు.
భగవంతుడు
కష్టమునకు
తగిన
సుఖము
నందిస్తాడు.
కనుకనే,
ఈ
సమయంలో
రైతులు,
పనివారు
తమ
ఇళ్ళల్లో
హాయిగా
విశ్రాంతి
తీసుకుంటారు.
వారికిప్పుడు
అంతగా
పనేమీ
ఉండదు.
పగటివేళ
సూర్యుడు
శాంతుడై
కనిపిస్తూ
తక్కువకాలం
ఉంటుంటాడు.
రాత్రివేళ
చంద్రుడు
చల్లదనము
నందిస్తూ
ఎక్కువ
కాలం
ఉంటాడు.
పగలంతా
శ్రమించిన
జనులకు
చంద్రుడు
రాత్రిపూట
సుఖము
నందిస్తాడు.
దేహానికి
‘రెస్టు’
అవసరము.
కనుక,
ప్రతి
మానవుడుకూడను
తగినంత
విశ్రాంతి
తీసుకోవాలి.
Sleep
a
while
after
lunch.
మధ్యాహ్నం
భోజనం
చేసిన
తరువాత
కొద్దిసేపైనా
పరుండాలి.
రాత్రివేళ
చక్కని
గాఢనిద్రలో
ఉండాలి;
ఎక్కువ
టైము
మేలుకొని
ఉండకూడదు.
2
▾
Meaning
Keep
Also in his talks
(3)
25 May 1991
Kenopanishad
23 August 1996
Only He Who Bows to God's Command Can Experience Divinity in Full
28 April 1998
Knowing Oneself Is What Matters
ఇదంతా
దైవముయొక్క
సంకల్పమే!
ప్రతి
ఒక్కటీ
దైవ
సంకల్పముచేతనే
జరుగుతున్నది.
ఒక
మహా
భక్తుడు
చెప్పాడు,
“కదలదు
నీదు
సంకల్పము
లేనిదె
గడ్డిపోచయును
కాని
అది
ఎఱుంగరు
మది
తలంపరు
ముదము
జెందరు
భువిని
కొందరు,
వివేకమున
వర్తించెదమని
కడు
విఱ్ఱవీగుదురు
కాని
చివరకేవేళకేది
సంభవించునో
తెలియజాలరెంతవారలైన.”
భగవంతుడు
ఏది
చేసినప్పటికీ
ప్రజల
మంచికోసమే!
ఎందుకనగా
అందరూ
తన
అంశములే!
కేవలం
మానవులే
కాదు;
పశు,
పక్షి,
మృగాదులు,
క్రిమి
కీటకాదులుకూడను
దైవముయొక్క
స్వరూపములే!
“చీమలో
బ్రహ్మలో
శివకేశవాదులలో
ప్రేమమీర
వెలసియుండే
బిరుదు
వహించిన
రామ
నన్ను
బ్రోవరా!”
అన్నాడు,
త్యాగరాజు.
కాని,
ఈ
సత్యమును
అందరూ
గుర్తించలేరు.
కనుకనే,
జనులు
తమ
వీపుపై
చీమ
పారాడుతుంటే
దాన్ని
కొట్టి
చంపుతారు.
అదే
చీమ
బ్రహ్మస్వరూపంగా
కనిపిస్తే
నమస్కరిస్తారు.
ఈవిధంగా
రూపనామములు
అనేక
భేదములు
కల్పిస్తున్నాయి.
అందరిలో
ఉన్న
‘నేను’
అనే
దివ్యత్వము
ఒక్కటే!
మానవత్వము
చాలా
దివ్యమైనది,
పవిత్ర
మైనది,
సార్థకమైనది.
మానవుడనగా
‘పవిత్రమైన
వాడు’
అని
అర్థము.
ఇట్టి
సత్యాన్ని
గుర్తుచేసి
మనిషిని
మేలుకొల్పే
పర్వదినమే
సంక్రాంతి.
ఎంత
బీదవారైనా
సరే,
ఈరోజు
కనీసం
పాయసమైనా
చేసుకొని
త్రాగుతారు.
ఈ
పవిత్ర
మకర
సంక్రమణమునందు
జనులు
ఆటపాటలతో
ఆనందము
ననుభవిస్తుంటారు.
ఇది
పశువులకుకూడను
పండుగే!
ప్రజలు
తమ
పశువులకు
చక్కగా
అలంకారము
చేసి,
వాటితో
ఆటలాడిస్తూ
ఆనందాన్ననుభవిస్తారు.
గంగిరెద్దుదాసు
ఎద్దుకు
రాముడని,
ఆవుకు
సీత
అని
పేర్లు
పెట్టి,
వాటికి
చక్కగా
తర్ఫీదు
ఇచ్చి
తీసికొని
వస్తాడు.
‘రాముడు
అందంగా
ఉన్నాడామ్మా?’
అని
అడిగితే
ఆవు
‘లేదు,
లేదు’
అన్నట్లు
తల
అడ్డంగా
ఊపుతుంది.
అంటే,
తాను
ఇష్టపడడం
లేదని
అర్థం.
అప్పుడతను
తన
చేతిలో
ఉన్న
కఱ్ఱను
ఊపుతూ,
‘అమ్మా!
రాముడు
నల్లగా,
నీలంగా
ఉన్నాడు.
అయితేనేమి,
చాలా
మంచివాడమ్మా!
3
▾
Meaning
Keep
His songs 37
Also in his talks
(3)
25 January 1990
Journeying toward God
15 January 1992
The Sankrānti festival is the sign of the union of Prakṛti and the Paramātma
14 January 2005
When the heart is filled with Prema, life is filled with Ānanda
చాలా
గొప్ప
రాజు,
బలవంతుడు,
శ్రీమంతుడు’
అంటూ
నచ్చజెప్పేసరికి
“సరే,
నాకు
రాముడంటే
ఇష్టమే”
అన్నట్లు
ఆవు
తల
ఊపుతుంది.
అప్పుడు
గంగిరెద్దుదాసు
రామునికి
సీతనిచ్చి
పెండ్లి
చేస్తాడు.
లోకకల్యాణమును
కాంక్షిస్తూ
సీతారాముల
కల్యాణము
జరిపిస్తాడు.
గ్రామాల్లో
పిల్లలు
ఈ
గంగిరెద్దుల
ఆటను
చూడడానికి
ఎంతో
ఉత్సాహంగా
బయల్దేరుతారు.
“తమ్ముడా!
రమ్ము,
గంగిరెద్దుదాసుడదిగో!
వెండిబిళ్ళయు,
మొలత్రాడు,
దండకడెము
ముక్కునందు
పైడి
కాడయు,
మోమునందు
పంగనామములు,
వెంట
గంగిరెద్దు,
చేత
మునికోల
తన
పేరు
చెప్పుచుండ
ఊరు
నడివీధి
నాడించె
రమ్ము
శ్రీరాములకు
సీతమ్మనిచ్చి
పెండ్లి
గావించు
ఆ
వేడ్క
చూచి
కానుకలిచ్చి
వత్తము
కదలిరమ్ము!”
పశువులకే
కాదు,
పక్షులకుకూడా
ఆనందాన్నిచ్చే
పండుగ,
సంక్రాంతి.
పశువులు,
పక్షులు
మొదలైన
సకల
ప్రాణులనుండి
మనం
నేర్చుకోవలసినది
ఎంతో
ఉన్నది.
మతము
అనగా
ప్రేమయే!
పక్షులు
ఎప్పుడు
చూసినా
ఎక్కువగా
మసీదుల
పైన,
మందిరములపైన
వ్రాలుతుంటాయి;
తద్ద్వారా
అన్ని
మతములవారికి,
అన్ని
ప్రాంతములవారికి
ఒక
గొప్ప
పాఠమును
నేర్పుతున్నాయి.
ఈనాడు
అనేకమందికి
‘రిలిజియన్’
(మతము)
పట్ల
విశ్వాసము
లేదు.
‘మతము’
అనేది
మానవునికి
చక్కని
ఆదర్శాన్ని
నిరూపిస్తుంది.
మా
విద్యాసంస్థలో
అనేకమంది
పిల్లలు
చదువుతున్నారు.
వీళ్ళకు
మతభేదములు
ఏమాత్రము
లేవు.
మత
భేదము
కలిగినవాడు
మనిషే
కాడు.
ఉన్నది
ఒకే
మతము.
అదే
ప్రేమమతము.
అట్టి
మతమును
అనుసరించేవాడే
నిజమైన
మనిషి.
ఎవరు
నిజమైన
హిందువు
(HINDU)?
H
-
Humility
(వినయం),
I
-
Individuality
(వ్యక్తిత్వం),
N
-
Nationality
(జాతీయతా
భావం),
D
-
Devotion
(భక్తి),
U
-
Unity
(ఐకమత్యం).
‘యూనిటీ’
ఉన్నచోటే
‘ప్యూరిటీ’
ఉంటుంది.
4
▾
Meaning
Keep
అక్కడే
‘డివినిటీ’
సాక్షాత్కరిస్తుంది.
‘ఇది
నా
ఇండియా’,
‘ఇది
నా
జపాను’,
‘ఇది
నా
జర్మనీ’
అని
ప్రపంచాన్ని
ముక్కలుముక్కలు
చేయకూడదు.
ఉన్నది
ఒకే
జాతి,
అదే
మానవజాతి.
అన్ని
మతముల
యందున్న
మంచితనాన్ని
మనము
నేర్చుకోవాలి.
‘రిలిజియన్’
(మతము)
అంటే
ప్రేమయే.
ఇప్పుడు
అట్టి
‘రిలిజియన్’
కనిపించడం
లేదు.
ప్రేమయే
లేకపోతే
ఎవరితోనూ
మనకు
సంబంధమే
ఉండదు.
కనుక,
మనము
ప్రేమమతమును
అనుసరించాలి.
ఆధునిక
యుగములో
ప్రజలు
ప్రేమమతమునుగూర్చి
ఏమాత్రం
యోచించడం
లేదు.
మన
ప్రాచీనులు
మతమంటే
ఏమిటో
చక్కగా
గుర్తించి
అనుభవిస్తూ
వచ్చారు.
వాళ్ళు
తమ
పెద్దల్ని
ఆదర్శంగా
తీసుకున్నారు.
ఈరోజుల్లో
కూడా
మీరు
పిల్లల్ని
అడిగి
చూడండి,
‘ఈ
విషయం
నీకెవరు
చెప్పారు
నాయనా?’
అని.
‘మా
అవ్వ
చెప్పింది’
అని,
లేక
‘మా
తాత
చెప్పాడు’
అని
అంటారు.
పెద్దలు
చెప్పిన
మాట
ప్రకారం
మనము
నడుచుకున్నప్పుడు
మనకంతా
మంచే
జరుగుతుంది.
ఈనాటి
యువకులు
పెద్దలు
చెప్పే
మాటలను
హృదయపూర్వకంగా
వినడం
లేదు;
చెప్పిన
మాట
వినరు;
చెప్పనివన్నీ
చేస్తుంటారు.
ఒక
గ్రామఫోను
ప్లేటు
తెచ్చి
సినిమా
పాటలు
వినమంటే
ఎంతో
ఆసక్తిగా
వింటారు.
అది
చెప్పినట్లే
వీళ్ళూ
చెబుతారు;
అది
పాడిందే
వీళ్ళూ
పాడుతారు.
చివరికి,
తాముకూడా
గ్రామఫోనుప్లేటు
మాదిరి
మారిపోతున్నారు!
ఈనాటి
మానవుడు
మానవునిగా
జీవించడం
లేదు;
పెద్దల
మాటను
పెడచెవిన
పెట్టి
మానవత్వానికి
విరుద్ధమైన
చేష్టలకు
పాల్పడుతున్నాడు.
కర్మయే
నరునకు
దైవము
మానవత్వముయొక్క
పవిత్రతను
గుర్తు
చేసే
నిమిత్తమై
సంక్రాంతి
వస్తున్నది.
“ఈశ్వరస్సర్వ
భూతానాం”.
కాబట్టి,
ప్రతి
మనిషి,
ప్రతి
ప్రాణికూడను
దైవముయొక్క
అంశమే!
కాని,
మానవుడు
పవిత్రమైన
భావాలను
విడిచిపెట్టి,
తన
మనస్సును
ఇష్టానుసారం
విడిచిపెట్టడంచేత
అతనియొక్క
ప్రవర్తనలో
దోషము
ఏర్పడుతున్నది.
ఇప్పుడు
మీరు
యువకులు.
ఈ
వయస్సులో
మీకు
దేహము,
మనస్సు,
బుద్ధి
ఇవన్నీ
పుష్టిగా,
భద్రంగా
ఉంటాయి.
5
▾
Meaning
Keep
Also in his talks
(9)
21 May 1979
Niṣkāma Karma
6 October 1986
Serve the Lord of all in the form of society!
5 July 2003
Give up attachment to the body and develop attachment to God
11 April 2005
Develop self-confidence!
22 October 2005
Sāttvic Food and Good Company Are Essential
28 September 2006
No worry troubles those who think of God without ceasing
27 January 2007
Love others, and the Paramātma will love you
7 March 2008
Do the deeds that please God
9 October 2008
That great Viṣṇu Himself is this Viṣṇu on earth
కాబట్టి
ఈ
వయస్సులోనే
మీరు
మీ
శక్తిని
సద్వినియోగపరచుకొని
పవిత్రమైన
భావాలను
ఆచరణలో
పెట్టాలి.
‘ప్యూరిటీ’
(పవిత్రత)
అంటే
ఏమిటి?
దృష్టి
పవిత్రంగా
ఉండాలి;
మాటలు
మధురంగా
ఉండాలి;
చెవులు
మంచి
విషయాలను
మాత్రమే
వినాలి;
నాసికము
సువాసనలను
మాత్రమే
ఆఘ్రాణించాలి.
ఈవిధంగా
ప్రతి
ఇంద్రియమును
మీరు
పవిత్రమైన
మార్గంలో
వినియోగించుకోవాలి.
మానవుడు
కర్మచేతనే
ఉద్భవించాడు.
కర్మయే
మానవుని
ప్రధానమైన
ధర్మము.
కర్మమున
పుట్టు
జంతువు
కర్మమున
వృద్ధి
పొంది
కర్మమున
చనున్
కర్మమె
నరునకు
దైవము
కర్మమె
సుఖదుఃఖములకు
కారణ
మిలలో!
కనుక,
మనం
కర్మను
ఆచరిస్తూనే
ఉండాలి.
కర్మ
అంటే
ఏమిటి?
కేవలం
చదువుకోవడం,
‘వాలి’బాల్
ఆడుకోవడం,
‘సుగ్రీవ’బాల్
ఆడుకోవడం
....
ఇంత
మాత్రమే
కాదు.
మన
ఉచ్ఛ్వాస
నిశ్వాసములుకూడా
కర్మలే!
ఇవి
లేకుండా
కర్మ
జరగడానికి
వీలే
లేదు.
‘టేస్టు’కోసం
జీవితాన్ని
‘వేస్టు’
చేసుకోకండి!
మనము
గాలిని
పీల్చుకునే
సమయంలో
‘సో...’
అనీ,
వదిలే
సమయంలో
‘హం...’
అనీ
శబ్దము
వస్తున్నది.
‘సో....హం’
అనగా
‘ఆ
దైవమే
నేను’
అని
అర్థము.
తినడం,
షోగ్గా
దుస్తులు
ధరించడం,
ఇష్ట
మొచ్చినట్లు
సంచరించడం...
ఇది
కాదు
మనిషి
లక్షణం.
ఎక్కడికి
పోయినప్పటికీ
జనులు
మొట్టమొదట
మన
గుణమును
చూస్తారు.
“అతని
ప్రవర్తన
చాలా
మంచిది.
అతనితో
మాట్లాడితే
ఎంతో
హాయిగా
ఉంటుంది.
అతను
చూస్తే
చాలు,
ఎంతో
ఆనందం
కలుగుతుంది”
అని
జనులు
మీగురించి
చెప్పుకోవాలి.
మంచి
గుణమే
మనకు
ఆనందము
నిస్తుంది.
మన
పంచేంద్రియములను,
పంచభూతములను
మనము
సద్వినియోగ
పరచుకోవాలి.
మనం
భుజించే
ఆహారము
కూడా
సాత్వికమైనదిగా
ఉండాలి.
ఊరికే
కారము
వేసుకొని
తినటం
మంచిది
కాదు.
కొంతమందికి
కారమంటే
ఇష్టం.
ఎప్పుడూ
ఆవకాయ,
గోంగూర...
ఆవకాయ,
గోంగూర!
వాళ్ళకి
రుచిపైన
మనస్సు
పోతుంటుంది.
6
▾
Meaning
Keep
ఆవిధంగా
‘టేస్టు’
(రుచి)కోసం
మనం
ప్రాకులాడ
కూడదు.
అది
మన
‘లైఫ్’
(జీవితము)ను
‘వేస్టు’
(వ్యర్థం)
చేస్తుంది.
‘టేస్టు’ను
దృష్టిలో
పెట్టుకొనక
కడుపు
నిండడానికి
ఏదో
ఒకటి
తినాలి.
ఎవరు
నిజమైన
స్నేహితులు?
“అన్నదానముకన్న
అధిక
దానంబేది?
తల్లి
దండ్రుల
కన్న
దైవమేది?
సుజన
సంగతికన్న
చూడ
లాభంబేమి?”
మంచివారి
సాంగత్యముచేత
నీవుకూడా
మంచివాడవైపోతావు.
ఎవరు
నీకు
స్నేహితులు?
మంచివారే
నీకు
నిజమైన
స్నేహితులు.
నీవు
ఎలాంటి
వారితో
స్నేహము
చేస్తావో
నీవుకూడా
అటువంటి
వానిగా
తయారౌతావు.
కనుక,
నీవు
మంచివారితో
కూడాలి,
మంచివారిని
చూడాలి,
మంచివారితో
మాట్లాడాలి,
మంచివారితో
జీవించాలి.
అప్పుడే
నీవు
మంచివాడవవుతావు;
లేకపోతే
చెడిపోతావు.
నీ
స్నేహితుడు
నీకేమి
ఉపకారం
చేశాడు?
నీవు
నీ
స్నేహితునికి
ఏమి
ఉపకారం
చేశావు?
అతనిని
నీవు
సన్మార్గములోకి
మళ్ళించకపోతే
ప్రయోజనమేమి?
చెడ్డవానితో
చేరినప్పుడు
నీవు
అతనిని
మంచివానిగా
మార్చాలి.
ఒకవేళ
నీవే
చెడ్డవానిగా
ఉంటే,
నీ
స్నేహితుడు
నిన్ను
మంచివానిగా
చేయాలి.
అదే
నిజమైన
స్నేహము.
ఒకరినొకరు
బాగు
చేసుకోవడం,
ఒకరివల్ల
ఒకరు
మంచిపేరు
తెచ్చుకోవడమే
నిజమైన
స్నేహమునకు
గుర్తు.
ఈనాటి
స్నేహితులు
‘హలో,
హలో’
అంటూ
పలుకరించుకుంటారు;
తరువాత
‘గుడ్
బై’
చెప్పి
విడిపోతుంటారు.
ఏమి
ప్రయోజనం?
‘గుడ్
బై’
చెప్పకూడదు;
ఒకరివలన
ఒకరు
‘గుడ్
బాయ్’గా
రూపొందాలి.
నిత్య
జీవితంలో
సత్యమైన
మార్గాన్ని
అనుసరించినప్పుడే
మనము
చక్కని
విద్యావంతులము,
వివేకవంతులము,
ధైర్యవంతులము
కాగలము.
నీవు
మంచివానిగా
ఉంటే,
త్యాగశీలిగా
ఉంటే
నీవెంట
ఎంతమందైనా
వస్తారు.
నీవు
మంచిగా
లేకపోతే,
నీ
ప్రవర్తన
సరిగా
లేకపోతే
ఎవ్వరూ
నీవైపు
చూడనైనా
చూడరు.
నీకు
‘కేరక్టర్’
(సత్శీలము)
లేకపోతే
‘కేరక్టర్’
లేనివారే
నిన్ను
చేరుతారు.
అటువంటి
స్నేహం
తాత్కాలికమైన
తళుకుబెళుకులతో
కూడి
ఉంటుంది.
‘వీడు
నా
గుడ్
ఫ్రెండ్’
అంటావు.
ఎంతవరకు?
కొంతకాలం
మాత్రమే!
తరువాత
అతని
మాట
నీవు
వినకపోతే,
అతను
కోరింది
నీవు
ఇవ్వకపోతే
అతను
నీకు
పరమ
ద్వేషిగా
మారిపోతాడు.
కనుక,
‘ఫ్రెండ్షిప్’
విషయంలో
చాలా
జాగ్రత్త
వహించాలి.
7
▾
Meaning
Keep
అందరినీ
గౌరవించు,
మంచి
పేరు
సంపాదించు
ప్రతి
విషయంలోనూ
మన
ప్రవర్తనే
మనకు
సాక్షిగా
ఉంటుంది.
నీవు
ఎక్కడైనా
ఉండు,
ఏ
దేశమైనా
వెళ్లు;
కాని,
నీ
‘కేరక్టర్’ను
మంచిగా
పెట్టుకో.
అందరినీ
గౌరవించు,
ప్రేమించు;
మంచిపేరు
సంపాదించు.
మనకు
గొప్పతనాన్ని
చేకూర్చేవి
మన
చదువుసంధ్యలు
కావు.
ఈనాడు
లోకంలో
పిహెచ్.డి.లు
చేసిన
వారు
ఎంతమంది
లేరు!
ఐ.ఎ.ఎస్.,
ఐ.పి.ఎస్.లు
చేసిన
వారెంతమంది
లేరు!
వీళ్ళందరివల్ల
లోకమేమైనా
బాగుపడుతున్నదా?!
నిజం
చెప్పాలంటే,
విద్యావంతులవల్లనే
ఈనాడు
దేశము
పాడైపోతున్నది.
అటువంటి
పెద్దతనము
మనకు
వద్దు.
ఎవరైనా
మనలను
చూస్తే
ప్రేమతో,
“అయ్యా!
నమస్కారం.
బాగున్నారా?”
అని
పలుకరిస్తే
చాలు;
అదే
మనకు
గొప్పతనము.
విద్యతోపాటు
వినయ,
విధేయతలను
అలవర్చుకోవాలి.
అటువంటివాడే
నిజమైన
విద్యార్థి.
విద్యావంతులలో
అహంకారము,
ఆడంబరము
ఇత్యాది
దుర్గుణాలు
ఏమాత్రము
కనిపించకూడదు.
నిన్నటి
దినము
నాటకంలో
ప్రహ్లాదుని
పాత్రను
పోషించిన
విద్యార్థి
చాలా
బాగా
చేశాడు.
అతని
కంఠం
చాలా
శ్రావ్యంగా
ఉంది.
అంతేగాక,
అతడు
తనయొక్క
నటననుకూడా
ఆదర్శంగా
చూపించాడు.
ప్రహ్లాదుని
తండ్రియైన
హిరణ్యకశిపుడు
దైవాన్నే
ద్వేషించడంచేత
‘పనిష్మెంట్’
(శిక్ష)కు
గురి
అయ్యాడు.
భగవంతుడు
నరసింహావతారం
దాల్చి
అతనిని
సంహరించాడు.
మనము
మంచిగా
జీవించినప్పుడు
మన
అంత్యముకూడా
మంచిగానే
జరుగుతుంది.
మనము
పుట్టినప్పటినుండి
గతించేంతవరకు
మంచిపేరుతో
బ్రతకాలి.
కాని,
‘మంచిమాట
వినరు
మనసిచ్చి
చెప్పిన,
చెడ్డ
మాట
ముందు
చెవిని
పడును.’
చెడ్డ
మాటలను
చెవిలో
చేర్చుకొని
చెడిపోతున్నారు.
ఎవరు
చెప్పినా
మంచి
మాటలు
వినాలి.
మనము
బస్సులోనో,
ట్రైనులోనో
ప్రయాణమై
వెళుతుంటే
అక్కడ
ఒక
బెగ్గరు
చక్కగా
రామనామాన్ని
గానం
చేస్తుంటాడు.
ప్రయాణికులంతా
కన్నులు
మూసుకొని
హాయిగా
వింటుంటారు.
అతను
తిరిగి
వెళ్ళిపోతుంటే
అందరూ
“అయ్యా,
నీవు
మాకు
చాలా
ఆనందాన్ని
కలిగించావు”,
అంటూ
అతనిని
అభినందిస్తారు.
ఈవిధంగా
పదిమందికి
ఆనందాన్ని
అందించేటటువంటి
జీవితమే
నిజమైన
జీవితము.
8
▾
Meaning
Keep
ఇప్పుడు
పిల్లలంతా
ఇక్కడికి
వచ్చారు.
మీరంతా
ఒకరితో
ఒకరు
చేరి
మంచి
మాటలను
పంచుకోవాలి.
మంచి
తలంపులు,
మంచి
మాటలు,
మంచి
పనులు
ఇవన్నీ
భగవంతునియొక్క
లక్షణాలు.
వాటిని
మీరు
అలవరచుకోవాలి.
ఉదయంపూట
మీరు
సూర్యునికి
అభిముఖంగా
నడుస్తున్నప్పుడు,
మీ
నీడ
మీవెనుక
పడిపోతుంది.
అదేవిధంగా,
మీరు
భగవంతునివైపు
ప్రయాణిస్తున్నప్పుడు
‘మాయ’
అనే
నీడ
మీ
వెనుక
పడిపోతుంది.
మద్రాసుకు
మంచినీటి
పథకం
ఈనాడు
సైన్సును
దుర్వినియోగపరచి
ప్రకృతి
నియమాలను
మార్చడానికి
ప్రయత్నిస్తున్నారు.
ఒక
చెట్టులో
కాయలు
కాయాలంటే
దానికొక
ఇంజెక్షన్
ఇస్తున్నారు.
ఈనాడు
నీరుకూడా
కలుషితమైపోయింది.
ఏ
కాయలో
చూసినప్పటికీ
పురుగులు
కనపడుతుంటాయి.
పూర్వం
‘ఫిగ్స్’
ఎంతో
బాగుండేవి.
ఇప్పుడు
వాటిలోకూడా
పురుగులు
ప్రారంభమైనాయి.
కారణం?
కలుషితమైన
నీరే!
అన్ని
రోగాలకు
మూలకారణం
కలుషితమైన
నీరే!
కాబట్టి,
నీటిని
మనము
మంచిగా
కాచి
పరిశుభ్రపరచి
త్రాగాలి.
మేము
ఇన్నూరు
కోట్లు
పెట్టి
మద్రాసుకు
కృష్ణా
జలము
నందించాము.
చిన్నచిన్న
పిల్లలు
అక్కడి
మురికి
గుంటల్లో
పడి
స్నానాలు
చేస్తూ,
ఆ
నీరు
త్రాగడం
చూస్తే
నాకెంతో
బాధ
కలిగింది.
అప్పుడే
నేను
అనుకున్నాను,
‘వీళ్ళకు
మంచి
నీరు
ఇచ్చేంతవరకు
నేను
మద్రాసుకు
రాను’
అని.
ఇది
పది
సంవత్సరముల
క్రిందటి
మాట.
ఇప్పుడు
నేను
వాళ్ళకు
మంచి
నీరు
అందించాను.
ఈ
మంచి
నీరు
త్రాగి
పిల్లలు
ఆరోగ్యంగా
ఆడుకుంటున్న
సమయంలో
నేను
మళ్ళీ
అక్కడికి
వెళుతున్నాను.
మనము
త్రాగే
నీరు,
తినే
భోజనము
మంచివిగా
ఉన్నప్పుడే
మనము
మంచి
ఆరోగ్యాన్ని
అనుభవించ
గలము.
ఈవిధంగా
మీరు
మీ
ఆరోగ్యాన్ని
కాపాడుకోవాలి.
కాని,
కొంతమంది
పిల్లలు
సరిగా
భోజనం
చేయడం
లేదు.
మీరు
‘టేస్టు’ను
చూడకండి;
ఆ
వస్తువు
ఆరోగ్యానికి
మంచిదా,
కాదా
అని
చూడండి.
అప్పుడే
ఆరోగ్యము,
ఆనందము
మీ
ఇంటనే,
వెంటనే,
జంటనే
ఉంటాయి.
విద్యార్థులారా!
మీరు
మంచిగా
చదువుకోండి.
కాలమును
వ్యర్థం
చేయకండి.
మీకు
సమయం
చిక్కితే
మంచి
పుస్తకాలను
చదవండి.
9
▾
Meaning
Keep
మంచి
మార్గంలో
ప్రయాణించి,
మంచివారుగా
తయారు
కండి.
ఇప్పుడు
ప్రపంచంలో
జనులను
మంచి
మార్గంలోకి
మళ్ళించాలంటే
అది
ఒక్క
సత్యసాయి
కాలేజీ
పిల్లలద్వారానే
సాధ్యమవుతుంది.
మా
విద్యార్థులందరూ
బంగారం
లాంటివారు.
ఎట్టి
గోల్డు?
కల్తీ
గోల్డ్
కాదు;
24
కేరట్ల
బంగారంలాంటివారు.
ఎక్కడికి
వెళ్ళినా
ఆటల్లో,
మాటల్లో,
చదువులో,
ప్రవర్తనలో
మంచిపేరు
తెచ్చుకుంటున్నారు.
‘సాయిబాబా
కాలేజీ
పిల్లలు
చాలా
మంచివారు’
అని
ప్రజలు
మెచ్చుకోవడం
నేను
వింటున్నాను.
మా
పిల్లలను
చూస్తే
చాలు,
వాళ్ళ
మొహంలో
సాయిబాబా
కనిపిస్తాడు.
ఈ
నెల
పంతొమ్మిదవ
తేదీన
మద్రాసులో
అతిరుద్ర
యాగము
ప్రారంభమవుతుంది.
అక్కడి
ప్రజలు
“సాయిబాబా
స్టూడెంట్స్
వస్తారట.
వాళ్ళను
చూడాలి.
వాళ్ళే
మనకు
ఆదర్శము”,
అని
ఎదురు
చూస్తున్నారు.
నిన్న
మీరు
‘భక్త
ప్రహ్లాద’
డ్రామా
చూశారు.
అది
అందరి
మనస్సును
ఎంతో
ప్రభావితం
చేసింది.
ఆ
ప్రహ్లాదుడు
చెప్పినటువంటి
మాటలు
ఎంత
మధురంగా,
ఆనందదాయకంగా
ఉన్నాయో
వర్ణించడానికి
వీలుకాదు.
అవి
నేరుగా
హృదయానికి
హత్తుకొనిపోయాయి.
మీరు
మంచిగా
వుండి,
ఇతరులకు
మంచి
మనస్సును
కలిగించండి.
కామము,
క్రోధము
ఇత్యాది
దుర్గుణాలు
దరిచేరకుండా
చూసుకోండి.
పాండవుల
మనస్సు
చాలా
పవిత్రమైనది
ఈనాడు
మా
పిల్లలు
‘కృష్ణ
రాయబారము’
అనే
నాటకాన్ని
ప్రదర్శించ
బోతున్నారు.
దుర్మార్గులైన
కౌరవులు
పాండవులను
ఎన్ని
విధములుగానో
హింసిస్తూ
వచ్చారు.
కాని,
పాండవుల
మనస్సు
చాలా
పవిత్రమైనది.
వాళ్ళు
కౌరవులకు
మంచి
చేయాలని
ఎంతగానో
ప్రయత్నం
చేశారు.
వాళ్ళ
గుణము
ఎంత
పవిత్రమైనదో
తెలుసుకోవడానికి
ఒక
చిన్న
ఉదాహరణ
తీసుకోండి.
వృద్ధురాలైన
కుంతీదేవి
కృష్ణ
నిర్యాణవార్త
వినగానే
తుదిశ్వాస
విడిచింది.
ఆ
సమయంలో
అక్కడే
ఉన్న
జ్యేష్ఠపుత్రుడైన
ధర్మజుడు
ఆమె
తలను
తన
తొడపై
పెట్టుకున్నాడు.
భీమార్జున
నకుల
సహదేవులు
నలుగురూ
చుట్టూ
చేరారు.
“నాయనలారా!
మనలను
అన్నివిధాలుగా
కాపాడుతూ
వచ్చిన
కృష్ణుడు
ఈ
లోకమును
వదలిపెట్టాడు.
10
▾
Meaning
Keep
మనమింక
ఈ
లోకములో
ఉండకూడదు”,
అని
పలికి
ధర్మజుడు
భీముని
దగ్గరకు
పిలిచి,
తల్లియొక్క
అంత్యక్రియలకు
తగిన
ఏర్పాట్లు
చేయమన్నాడు.
అర్జునుని
పిలిచి,
పరీక్షిత్తుకు
రాజ్య
పట్టాభిషేకం
చేయటానికి
కావలసిన
సన్నాహాలు
చేయమన్నాడు.
నకుల,
సహదేవులను
పిలిచి,
“మనం
హిమవత్
పర్వతములవైపు
వెళ్లాలి.
మీరిద్దరూ
మన
ప్రయాణానికన్నీ
సిద్ధం
చేయండి”,
అని
ఆదేశించాడు.
తల్లి
మరణించింది,
తమ్ముని
మనుమనికి
పట్టాభిషేకం
చేస్తున్నాడు!
అటువంటి
దుఃఖసమయంలో
ఇంకెవరైనా
ఆవిధంగా
చేయగలరా!
పాండవులు
ఉత్తరదిశగా
బయలుదేరారు.
ద్రౌపది,
భీమార్జున
నకులసహదేవులు
మార్గమధ్యంలో
కూలి
పోయారు.
చివరికి,
ధర్మరాజు
ఒంటరిగా
ప్రయాణం
సాగించి
నరకం
చేరుకున్నాడు.
నరకంలో
అనేకమంది
తాము
చేసిన
పాపాలకు
శిక్షలు
అనుభవిస్తున్నారు.
ధర్మరాజు
అక్కడ
అడుగుపెట్టిన
తక్షణమే
వాళ్ళ
బాధలు
తొలగిపోయి
ఎంతో
హాయిని
అనుభవించారు.
అసలు
ధర్మరాజు
నరకంలో
ఎందుకు
ప్రవేశించవలసి
వచ్చింది?
అతను
ఏనాడూ
అసత్యమాడినటువంటి
వాడు
కాదు.
కాని,
యుద్ధసమయంలో
ద్రోణుని
అంతమొందించే
నిమిత్తం,
‘అశ్వత్థామ
హతః’
అని
గట్టిగా
పలికి,
‘కుంజరః’
అనే
పదాన్ని
మెల్లగా
చెప్పాడు.
‘అశ్వత్థామ
అనే
ఏనుగు
చచ్చిపోయింది’,
అని
దీని
అర్థం.
కాని,
‘కుంజరః’
(ఏనుగు)
అనే
మాట
వినిపించక
ద్రోణుడు
తన
కుమారుడే
మరణించాడనుకొని
అస్త్రసన్యాసం
గావించాడు.
ఈవిధంగా
అసత్యం
పలికి
ద్రోణుని
మరణానికి
కారకుడై
పాపానికొడిగట్టడంచేత
ధర్మజుడు
కొద్దిసేపు
నరకంలో
ఉండవలసి
వచ్చింది.
ఆ
తరువాత
ధర్మజుణ్ణి
స్వర్గానికి
తీసుకువెళుతుంటే
నరకలోకవాసులంతా
పోయి
ధర్మజుని
పాదాలపై
పడి,
“అయ్యా,
మీరు
మమ్మల్ని
వదలి
వెళ్ళకండి.
ఇక్కడే
ఉండి
మాకు
ఆనందాన్నివ్వండి”,
అని
ప్రార్థించారు.
అప్పుడు
ధర్మజుడు,
‘నాయనలారా!
నేను
దైవాజ్ఞను
శిరసావహించక
తప్పదు’,
అని
పలికి
స్వర్గానికి
వెళ్ళిపోయాడు.
మీ
ఆనందమే
నా
ఆహారము
విద్యార్థులారా!
మనము
మంచి
చేస్తే
ఎక్కడైనా
సరే
మంచినే
అనుభవిస్తాము.
మంచి
పనులు
మంచి
ఫలితాలనే
అందిస్తాయి.
11
▾
Meaning
Keep
ఇక్కడ
మీరు
పాస్
అయిన
తరువాత
బయటికి
వెళ్ళి
ఇంకా
ఉన్నతమైన
చదువు
లేమైనా
ఉంటే
చదవండి.
దానితోపాటు
అందరికీ
మంచి
నడవడికను
ఆదర్శంగా
అందించండి.
అసత్యమాడకుండా,
అన్యాయాలకు
పాల్పడకుండా,
సత్యమార్గాన్ని
అనుసరించి
అమృతస్వరూపులుగా
మారండి.
‘మమైవాంశో
జీవలోకే
జీవభూతస్సనాతనః’
ఈ
సత్యాన్ని
మనస్సులో
పెట్టుకొని
ఎన్ని
చదువులైనా
చదవండి.
(మీకేమైనా
శ్రమ
ఇస్తున్నానా?
అని
భగవాన్
అడుగగా
పిల్లలంతా
ముక్తకంఠంతో
‘లేదు
స్వామీ’
అన్నారు)
మిమ్మల్నందరినీ
ఆనందపెట్టడం,
అభివృద్ధికి
తెప్పించడం,
మీ
తల్లిదండ్రులకు
సంతోషాన్నివ్వడం....
ఇదే
నా
పని.
మీ
ఆనందమే
నా
ఆహారము.
నాకు
మరో
ఆహారం
అవసరం
లేదు.
కాబట్టి,
మీరందరూ
నిరంతరం
ఆనందంగా
జీవితాన్ని
గడపండి.
ఎన్ని
కష్టములొచ్చినా,
నష్టములొచ్చినా
ప్రక్కకు
నెట్టి
ముందుకు
సాగండి.
మీ
హృదయాన్ని
మీరు
నమ్ముకోండి!
ఈనాడు
కొంతమంది
అసూయతో
‘సాయిబాబాకు
గొప్ప
పేరు
వస్తున్నదే!
సాయిబాబా
విదేశీయులందరినీ
హిందువులుగా
మారుస్తున్నాడే’,
అని
భావించి
దుష్ప్రచారానికి
పాల్పడుతున్నారు.
దానివల్ల
పేపర్లలో
పిచ్చిపిచ్చి
లెటర్లు
వ్రాస్తుంటారు.
ఇవన్నీ
మనము
లక్ష్యపెట్టకూడదు.
మన
హృదయాన్ని
మనము
నమ్ముకోవాలి.
వాళ్ళు
ఏమి
చెప్పినా
‘అదంతా
నాన్సెన్స్!
దానితో
నాకు
సంబంధం
లేదు’,
అని
ప్రక్కకు
నెట్టాలి.
‘నా
మనస్సే
నాకు
సాక్షి’
అనుకోవాలి.
నేను
ఏది
చేసినా
పదిమంది
మంచికోసమే!
ఎవరైనా
మిమ్మల్ని
తిడితే,
‘అతను
నా
దేహాన్ని
తిడుతున్నాడు.
నన్ను
కాదు’
అనుకోవాలి.
గట్టిగా
తిట్టినవి
గాలిలో
కలిసి
పోతాయి.
తనలో
తాను
తిట్టుకుంటే
తనకే
తగులుతాయిగాని,
మీవరకు
రావు.
కనుక,
వాటిని
మీ
హృదయానికి
చేర్చుకోకండి.
మీ
విశ్వాసాన్ని
దృఢంగా
పెట్టుకోండి.
ప్రతి
ఒక్కరియందు
దైవమున్నాడు.
రూప,
నామములు
వేరు
కావచ్చు.
కాని,
దైవము
ఒక్కడే.
ఆయన
మీ
అందరియందు
ఉన్నాడు.
మీరందరూ
దైవస్వరూపులే!
ఆ
భావనను
మీరు
పెట్టుకోండి.
ఒకరు
తక్కువ,
ఒకరు
ఎక్కువ
అనే
భేదాలు
పెట్టుకోకండి.
అందరూ
ఒక్కటే.
దైవపితృత్వము,
మానవ
సోదరత్వము
-
ఈ
రెండింటినీ
విశ్వసించి
మీ
జీవితాన్ని
గడపండి.
12
▾
Meaning
Keep
విద్యార్థులారా!
మీరంతా
పరీక్షలలో
మంచి
మార్కులు
తెచ్చుకొని
ఉన్నత
శ్రేణిలో
ఉత్తీర్ణులు
కావాలని
నేను
ఆశిస్తున్నాను.
Previous
←
Love everyone, serve everyone
Next
All parties must become one for the good of the country
→