Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2007 · The path of Prema brings the fruit of every sādhana
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The path of Prema brings the fruit of every sādhana
15 December 2007, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
Also in his talks
(4)
3 November 1989
Ānanda Itself Is the Goal
1 June 1990
Practice and Precept
14 July 1992
God alone is the true Guru
6 March 2008
Those who strive for Satya are the true devotees
ప్రేమస్వరూపులారా!
ఈ
జగత్తులో
ఎన్నో
బాధలు,
కష్టములు,
నష్టములు,
దుఃఖములు
ఉన్నవని
భావించి
జనులు
చాలా
విచారిస్తుంటారు.
కాని
ఇవి
ఏవీ
లేవు;
ఉన్నదంతయు
ఆనందమే!
బ్రహ్మానందం
పరమ
సుఖదం
కేవలం
జ్ఞానమూర్తిం
ద్వంద్వాతీతం
గగన
సదృశం
తత్త్వమస్యాది
లక్ష్యం
ఏకం
నిత్యం
విమల
మచలం
సర్వధీ
సాక్షిభూతం...
జగత్తంతయు
భగవత్
సృష్టియే.
క్రిమికీటకాదులు
మొదలుకొని
పశుపక్షి
మృగాదులు,
మానవులవరకు
అంతా
భగవత్
సృష్టియే!
భగవంతునిచే
సృష్టించబడినవి
కనుక
ఇవన్నియు
ఆనందమునుండియే
ఆవిర్భవించినవి.
బాధలు,
దుఃఖములు,
కష్టములు
ఇవన్నీ
కేవలం
మానవునియొక్క
‘ఇమేజినేషన్’
(ఊహా
జనితములు)!
మనం
వేటినైతే
బాధలు
అని
భావిస్తున్నామో
అవి
నిజానికి
మనకు
ఆనందము
నందించే
నిమిత్తం
ఏర్పడినవేగాని,
దుఃఖము
నందించే
నిమిత్తం
కాదు.
Pleasure
is
an
interval
between
two
pains
(రెండు
బాధల
మధ్య
గల
విరామమే
ఆనందము)
బాధలు
లేకుండా
ఆనందము
మనకు
ప్రాప్తించదు.
కనుక,
మనము
ఏది
వచ్చినా
‘ఇదంతా
భగవత్
ప్రసాదము’
అని
ఆనందంగా
స్వీకరించాలి.
‘ఇది
కష్టము,
బాధ,
నొప్పి’
అని
మనం
భావించరాదు.
కడుపులో
పుట్టిన
బాధను
నివారించే
నిమిత్తం
డాక్టరు
ఆపరేషను
చేస్తాడు.
ఒకవిధంగా
ఆ
డాక్టరు
పెట్టింది
కూడను
బాధనే
కదా!
అయితే,
ఆ
పెట్టిన
బాధవల్లనే
ఈ
పుట్టిన
బాధ
పోతుంది.
2
▾
Meaning
Keep
కనుక,
కష్టములనుంచే
మన
దుఃఖము
నివారణ
అవుతుంది.
లోకంలో
కోట్లాది
ప్రాణులున్నాయి.
ఇవన్నీ
ఒకే
ఆత్మనుంచియే
ఆవిర్భవిస్తున్నాయి.
అందరియందు
ఉన్నది
భగవంతుడు
ఒక్కడే.
రామా,
కృష్ణా,
అల్లా,
జీసస్
అని
వేరువేరు
పేర్లు
పెడుతున్నారుగాని,
ఉన్నది
ఒక్కటే.
అదే
ఆత్మ.
ఈ
ఆత్మకు
నిజమైన
పేరు
ప్రేమ.
ప్రేమ
ఒక్కటి
ఉంటే
అది
ఎన్ని
బాధలనైనా
నివారణ
గావిస్తుంది.
ప్రేమ
గలవానికి
కష్టమనేది
కలుగదు.
మీరందరూ
అమెరికానుంచి
ఇంతదూరం
వచ్చారు.
దేనివల్ల?
నాపైనున్న
ప్రేమవల్ల
వచ్చారు.
ఆ
ఒక్క
ప్రేమను
కలిగి
ఉంటే
సర్వము
మన
వశమవుతుంది.
దేవునికి
ఒక
ప్రత్యేకమైన
పేరు
లేదు;
‘ఆత్మ’
అని
అంటారు.
ఆత్మ
అనగా
ఏమిటి?
ప్రేమయే.
ఆ
ప్రేమయే
అందరినీ
కలుపుతుంది.
ఎప్పుడు
మీరు
‘యూనిటీ’
(ఏకత్వం)తో
ఉంటారో
అప్పుడే
‘ప్యూరిటీ’
(పవిత్రత)
వస్తుంది.
‘ప్యూరిటీ’
ఎప్పుడు
వస్తుందో
అప్పుడే
మీలో
ఆత్మతత్త్వమనే
‘డివినిటీ’
(దివ్యత్వం)
ఆవిర్భవిస్తుంది.
కనుక,
‘డివినిటీ’కి
మొట్టమొదట
‘యూనిటీ’
కావాలి.
I
and
you
are
one.
God
and
you
are
one
(నేను,
నీవు
ఒక్కటే.
దైవము,
నీవు
ఒక్కటే).
‘నేనే
దైవం’
అనే
భావం
స్థిరంగా
పెట్టుకోండి!
భగవంతుడు
మిమ్మల్ని
వదలి
ప్రత్యేకంగా
లేడు.
“నేనే
దేవుడు”
అనే
భావము
మీలో
ఆవిర్భవించాలి.
ప్రతి
ఒక్కరూ
‘నేను,
నేను
...’
అంటారు.
ఈ
‘నేను’
అనేదే
అందరిలో
ఉన్న
ఏకత్వము.
ఆ
ఏకత్వములో
ఉన్నటువంటి
ఆనందము
ఇంతా
అంతా
కాదు.
ప్రేమయే
దైవం,
ప్రేమలో
జీవించాలి.
అదే
ఈనాడు
మనం
నేర్చుకోవలసింది.
అందరూ
దైవముయొక్క
బిడ్డలే!
తల్లి
తన
బిడ్డలను
ప్రేమించినట్లుగా
దైవము
అందరినీ
ప్రేమిస్తున్నాడు.
ఒకరిపైన
ద్వేషము,
మరొకరంటే
ఇష్టము
...
ఈవిధమైన
భేదాలు
దైవానికి
లేవు.
దైవము
ఎవ్వరినీ
కష్టపెట్టడు,
నొప్పించడు.
నీనుంచి
దైవము
ప్రత్యేకంగా
లేడు;
నీవెక్కడున్నావో
అక్కడే
ఉన్నాడు;
నిన్ను
వదలి
క్షణమైనా
ప్రక్కకు
పోడు.
అసలు
దైవము
లేని
స్థానమే
లేదు.
ఎక్కడ
చూసినా
ఉన్నది
దైవమే!
మీరందరూ
దైవస్వరూపులే!
మనకున్నవి
రెండే
రెండు
కన్నులు.
కాని,
అవి
ఇంతమంది
జనులను
చూడగలుగుతున్నాయి
కదా!
3
▾
Meaning
Keep
అదేరీతిగా,
దైవము
ఒక్కడే
అయినప్పటికీ
అందరినీ
చూస్తుంటాడు.
Where
is
God?
He
is
in
you,
with
you,
above
you,
below
you.
(భగవంతుడు
ఎక్కడున్నాడు?
మీలో
ఉన్నాడు,
మీతో
ఉన్నాడు,
మీపై
నున్నాడు,
మీ
క్రింద
ఉన్నాడు).
కనుక,
దైవాన్ని
మనం
ప్రత్యేకంగా
వెతుకనక్కర్లేదు.
మీరు
కేవలం
భౌతిక
దేహంపై
దృష్టిపెట్టడంచేత
ఈ
భేదములంతా
గోచరిస్తున్నాయి.
కాని,
భౌతిక
దేహాన్ని
మీరు
ఆధారం
చేసుకోకూడదు.
Body
is
like
a
water
bubble,
mind
is
like
a
mad
monkey
(దేహమొక
నీటిబుడగ.
మనస్సు
ఒక
పిచ్చికోతి).
పిచ్చి
మనస్సు
తన
ఇష్టమొచ్చినట్లు
తిరుగుతుంది.
అది
ఒక
నిమిషం
ఒకచోట
ఉంటుంది,
రెండవ
నిమిషం
మరోచోటికి
పరుగెత్తుతుంది.
స్థిరమైనది,
శాశ్వతమైనది
ఒక్కటే.
అదే
‘నేను’.
కాబట్టి,
I
am
God,
I
am
God
(నేనే
దైవం,
నేనే
దైవం)
అనే
భావం
మీలో
స్థిరంగా
పెట్టుకోండి.
Where
is
God?
(దేవుడెక్కడ?)
అనే
ప్రశ్నకు
అదే
సరియైన
జవాబు.
ప్రేమలో
జీవించండి,
ఇదే
మీరు
చేయవలసిన
సాధన
ఎన్ని
భజనలు
చేసినా,
ఎన్ని
జపములు
చేసినా,
ఎన్ని
తపములు
చేసినా
మనము
ప్రేమను
ప్రధానంగా
పెట్టుకోవాలి.
ప్రేమ
ఒక్కటి
ఉంటే
ఇంక
ఏ
సాధనా
చేయనక్కర్లేదు.
ప్రేమ
లేనప్పుడు
ఎన్ని
సాధనలు
చేసినా
ప్రయోజనం
లేదు.
కాబట్టి,
మీ
మనస్సులో
ప్రేమను
నింపుకోండి.
ప్రేమలో
జీవించండి.
ఇదే
మీరు
చేయవలసిన
సాధన.
“ప్రేమ
ముదిత
మనసె
కహో
రామ
రామ
రామ్...”
భౌతికమైన
సంబంధ
బాంధవ్యములు
వస్తుంటాయి,
పోతుంటాయి.
ఇవన్నీ
‘పాసింగ్
క్లౌడ్స్’
(కదలిపోయే
మేఘాలు).
ఇవన్నీ
మీ
మానసిక
భావములయొక్క
‘రిఫ్లెక్షన్,
రియాక్షన్,
రీసౌండ్!’లు
మాత్రమే.
(భగవాన్
తమ
రుమాలు
చూపిస్తూ)
ఇది
ఒక
వస్త్రము.
ఇది
వస్త్రము
కాదు,
దారములయొక్క
చేరిక.
ఇవి
దారములు
కావు;
ఇది
ప్రత్తి.
ఇది
దైవంయొక్క
సృష్టి.
ఈ
సృష్టిలో
భగవంతుడు
మీకు
అనేక
‘దారముల’ను
అందించాడు.
వాటిని
మీరు
మీ
ఇష్టమొచ్చినట్లు
అల్లుకుంటున్నారు.
మీ
ఇష్టం
కాదు
ముఖ్యం;
దైవానికి
ఏది
ఇష్టమనేది
ముఖ్యం.
దేహము,
మనస్సు
మార్పుచెందుతాయి.
కాని,
ప్రేమకు
మార్పు
లేదు.
ఏదానికైనను
జనన
మరణములున్నాయిగాని,
ప్రేమకు
‘నో
బర్త్,
నో
డెత్’
(జననమూ
లేదు,
మరణమూ
లేదు).
4
▾
Meaning
Keep
జనన
మరణములు
లేనటువంటిది
ప్రేమ
ఒక్కటే.
భగవంతుడు
ప్రేమస్వరూపుడై
మీలోనే
ఉన్నాడు.
మీ
శ్వాసయే
మీయొక్క
దైవం.
అది
ఎట్లా
వస్తున్నది?
‘సోఽహం’,
‘సోఽహం’
(నేనే
దైవం,
నేనే
దైవం)
అనే
సందేశంతో
వస్తున్నది.
‘సో’
అనగా
‘అది’
(దైవం);
‘హం’
అనగా
నేను.
కాబట్టి,
‘సోఽహం’
అనగా
‘అది
నేనే’.
అదే
ప్రేమ.
కనుక,
ఆ
ప్రేమనే
మనము
ప్రధానంగా
పెట్టుకోవాలి.
మిగిలిన
ఆలోచనలు
వస్తుంటాయి,
పోతుంటాయి.
కాని,
ఎల్లప్పుడు
స్థిరంగా
ఉండేది
ప్రేమనే!
కాబట్టి,
ప్రేమతో
మీరు
ఏ
పనైనా
చేయండి.
మీ
శత్రువు
వచ్చినా
ప్రేమతో
‘హలో,
హలో’
అనండి.
వాడుకూడా
‘హలో’
అంటాడు.
ఇదే
‘రీసౌండ్,
రిఫ్లెక్షన్,
రియాక్షన్’.
మనం
ఏమి
చేస్తున్నామో,
అది
మంచిగాని,
చెడ్డగాని
మనకే
తిరిగి
వస్తుంది.
కనుక,
మనము
నిరంతరం
ప్రేమలో
మునిగి
ఉండాలి.
ప్రేమ
ఒక్కటి
ఉంటే
దేనినైనా
సాధించవచ్చు.
ప్రేమయే
ఎన్ని
ఘనకార్యములైనా
సాధిస్తుంది.
ఈ
ప్రపంచమునంతటినీ
సృష్టించినది
ప్రేమనే;
నడిపించేదీ
ప్రేమనే.
కనుక,
ప్రేమకు
మించినటువంటి
దైవము
మరొకటి
లేదు.
ప్రేమ
లేకుండా
మీరు
ఎంత
సాధన
చేసినప్పటికీ
అది
నిరర్థకం.
కనుక,
హృదయంలో
ప్రేమను
పెట్టుకోండి.
ఆ
ప్రేమయే
అందరినీ
ఆకర్షిస్తుంది.
ప్రేమయే
సర్వమును
సమకూరుస్తుంది.
సృష్టించునదీ
ప్రేమయే;
భస్మము
చేయునదీ
ప్రేమయే;
రక్షించునదీ
ప్రేమయే;
శిక్షించునదీ
ప్రేమయే.
నీవు
భౌతిక
దృష్టితో
చూడటంవల్ల
‘ఇది
సృష్టి’
అని
అనుకుంటున్నావు.
కాని
ఉన్నది
ఒకటే,
అదే
ప్రేమ.
అది
ఏమాత్రము
మార్పు
చెందదు.
ఆ
ప్రేమమార్గాన్ని
అనుసరిస్తే
సర్వసాధనలూ
చేసిన
ఫలితం
లభిస్తుంది.
దైవంయొక్క
అసలైన
పేరు
-
‘ప్రేమ’
భగవంతునికి
అనేక
పేర్లు
పెడుతున్నారు.
కాని,
ఏ
పేరుతో
పిలిచినా
పలికేది
ఒక్కడే!
‘అల్లా’
అని
పిలిచినా
‘యెస్’
అంటాడు;
‘జీసస్’
అని
పిలిచినా
‘యెస్’
అంటాడు;
‘రామా’
అని
పిలిచినా
‘యెస్’
అంటాడు.
ఇవన్నీ
పెట్టిన
పేర్లే
కాని,
పుట్టిన
పేర్లు
కావు.
దైవంయొక్క
‘ఒరిజినల్’
(అసలైన)
పేరు
ఒక్క
‘ప్రేమ’
మాత్రమే.
ఏ
డిక్షనరీలో
అయినా
చూసుకో,
ఉన్నది
ఒకే
ప్రేమ;
రెండు
ప్రేమలు
లేవు.
Love
is
one,
not
two.
దేహాన్ని
బట్టి
‘రిలేషన్షిప్స్’
రెండు,
మూడు
విధాలుగా
ఉండవచ్చు.
5
▾
Meaning
Keep
ఒక
వ్యక్తిని
భర్తగా
భావిస్తావు,
మరొక
వ్యక్తిని
కొడుకుగా
భావిస్తావు,
మూడవ
వ్యక్తిని
తండ్రిగా
చూస్తావు.
కాని,
ఇవన్నీ
కేవలం
శారీరకమైన
సంబంధముతో
ఏర్పడినవి.
ఈ
‘రిలేషన్షిప్స్’
ఎవరు
పెట్టినవి?
మీరు
పెట్టుకున్నవే!
కాబట్టి
అవి
మార్పు
చెందుతాయి.
నిజమైన
ప్రేమకు
మార్పు
లేదు.
అట్టి
ప్రేమతో
‘రామా’
అను;
‘కృష్ణా’
అను;
‘అల్లా’
అను;
‘ఈశ్వరా’
అను;
‘జీసస్’
అను.
ఏ
పేరుతో
పిలిచినా
తాను
పలుకుతాడు.
ఒకరు
‘రామా
ఈజ్
మై
గాడ్’
అంటారు.
‘కృష్ణా
ఈజ్
మై
గాడ్’
అంటారు
మరొకరు.
ఇంకొకరు
‘సాయి
ఈజ్
మై
గాడ్’
అంటారు.
కేవలం
పేర్లు
వేరువేరుగాని,
భగవంతుడు
ఒక్కడే!
బియ్యం
రుబ్బి
దోసెలు
చేస్తాము;
ఇడ్లీలు
చేస్తాము.
దానిలో
కొంచెం
చక్కెర
కలిపి
పాయసం
చేస్తాము.
కాని,
బియ్యం
ఒక్కటే
కదా!
అదేవిధముగనే,
దైవము
ఒక్కడే.
ఆయన
ప్రేమస్వరూపుడు.
ఆ
ప్రేమతో
మీరు
ఏ
కార్యమైనా
చేయండి,
తప్పక
సత్ఫలితాన్ని
పొందుతారు.
భక్తులమని
చెప్పుకునేవారు
భేదదృష్టిని
విడనాడాలి
మీరు
ఒకరినొకరు
‘బ్రదర్స్
అండ్
సిస్టర్స్’
అని
పిలుచుకుంటారు.
ఐతే,
‘బ్రదర్స్’
వేరే
లేరు,
‘సిస్టర్స్’
వేరే
లేరు.
భౌతికంగా
వేరువేరుగా
కనిపించవచ్చు.
అది
మీరు
పెట్టుకున్నటువంటి
‘రిలేషన్షిప్’
మాత్రమే.
అందరూ
ఒక్కటే.
మీరు
‘డైవర్సిటీ’
(భిన్నత్వము)
ఏమాత్రం
చూడకూడదు.
దైవము
ముసలివానిలో
ఉన్నాడు,
చిన్నబిడ్డలోకూడా
ఉన్నాడు.
దైవానికి
వయస్సే
లేదు.
దైవానికి
ఎట్టి
రూపమూ
లేదు.
కేవలం
ప్రేమ,
ప్రేమ,
ప్రేమ...
కనుక,
మీరు
ప్రేమను
హృదయపూర్వకంగా
పెంచుకోండి.
అప్పుడే
మీకు
ఆనందము
కలుగుతుంది.
మనలో
ప్రేమ
ఉండినంతవరకు
మనము
ఆనందానికి
దూరం
కాము.
కాని,
మీరు
భేదములు
పెంచుకుంటున్నారు.
ఏకత్వాన్ని
విశ్వసించండి.
అప్పుడు
మీరు
ఎన్ని
సంబంధ
బాంధవ్యాలు
పెట్టుకున్నప్పటికీ
వాటి
విలువ
పెరుగుతూనే
ఉంటుంది.
ఒకటి
పెట్టి
దాని
తరువాత
జీరో
పెట్టు,
అది
పది
అవుతుంది;
ఇంకొక
జీరో
పెట్టు,
వంద
అవుతుంది;
వేలకొలదీ
జీరోలు
పెట్టు,
దాని
విలువ
పెరుగుతూనే
ఉంటుంది.
కాని,
ఆ
ఒకటి
తీసేస్తే
మిగిలేవి
జీరోలే!
అదేవిధంగా,
దైవం
ఒక్కడే
అనే
సత్యాన్ని
విశ్వసించి
ఏ
పేరుతోనైనా
పిలవండి,
ఎన్ని
నామాలైనా
ఉచ్చరించండి.
6
▾
Meaning
Keep
“ఏకం
సత్
విప్రాః
బహుధా
వదన్తి”
-
ఇది
వేద
ప్రమాణము.
హృదయంలో
ప్రేమను
నింపుకొని
మీరు
ఏ
దేశమైనా
వెళ్ళండి,
ఏ
నామమైనా
తలుచుకోండి,
ఏ
సాధనైనా
చేయండి.
ఎవ్వరినీ
ద్వేషించకండి.
“హెల్ప్
ఎవర్,
హర్ట్
నెవర్”
(ఎల్లప్పుడు
సహాయమే
చేయాలి.
ఎవ్వరినీ
బాధించకూడదు)
-
ఇదే
భక్తులైనవారు
చేయవలసిన
పని.
‘నేను
భక్తుడిని’
అని
చెప్పుకుంటూ,
‘అతను
నావాడు,
నీవు
నావాడవు
కాదు’
అన్నటువంటి
భేదము
పెట్టుకోకూడదు.
ఎవరిని
ద్వేషించినా
దైవాన్నే
ద్వేషించినట్లవుతుంది.
ఎక్కడికి
పోయినా
God
is
in
me,
with
me,
around
me
(భగవంతుడు
నాలోనే
ఉన్నాడు,
నాతోనే
ఉన్నాడు,
నా
చుట్టూతా
ఉన్నాడు)
అని
విశ్వసించాలి.
ఎక్కడ
చూసినా
ఉన్నది
దైవము
ఒక్కడే.
ఆవిధమైన
ఏకత్వ
భావనను
విశ్వసించండి;
మీకు
ఎంతైనా
ఆనందం
కలుగుతుంది.
మీరు
ఎన్నో
దేశములనుండి
వచ్చారు.
మీ
రూపములు
వేరు,
నామములు
వేరు,
దేశములు
వేరు.
కాని,
ఇక్కడ
మాత్రం
అందరూ
ఒక్కటే!
ఇట్టి
ఏకత్వ
భావనతో
మీరందరూ
నేటినుండి
ఆనందంగా
ఉండండి.
భజనే
మన
భోజనము
‘ఈరోజు
నా
పుట్టినరోజు’
అంటావు.
పుట్టిన
రోజు
దేనికి?
అది
కేవలం
దేహము
పుట్టిన
దినము.
దేహము
ఈరోజు
పుడుతుంది,
రేపు
పోతుంది.
కాని,
నీవు
ఎప్పటికీ
ఉన్నావు.
నీవు
పుట్టటం
లేదు,
పోవటం
లేదు.
“బి
ఆల్వేస్
హ్యాపీ”
(ఎల్లప్పుడు
ఆనందంగా
ఉండండి)
ఇదే
నేను
మీనుండి
ఆశించేటటువంటిది.
“నాది,
నీది”
అనే
భేదము
ఏమాత్రం
రానివ్వకండి.
మీరింతసేపు
ఇక్కడ
భజన
చేశారు.
ఇన్ని
కంఠములు
చేరి
ఒక్క
స్వరంగా
పాడడం
ఎంతో
ఆనందాన్ని
కలిగించింది.
ఈ
ఏకత్వమే
దైవత్వము.
కనుక,
‘యూనిటీ’
ఉండాలి.
‘యూనిటీ’
వచ్చినప్పుడే
మీలో
‘ప్యూరిటీ’
వస్తుంది.
‘ప్యూరిటీ’యే
‘డివినిటీ’ని
ఆకర్షిస్తుంది.
మీరు
ధరించిన
తెల్లని
దుస్తులు
పవిత్రతకు
చిహ్నం.
మీరు
వేసుకున్న
డ్రస్సుకు
తగినట్లుగా
మీ
హృదయంకూడా
పవిత్రంగా
ఉండాలి.
తెల్లని
డ్రస్సు
ఏకత్వాన్ని,
పవిత్రతను
ప్రతిబింబిస్తుంది.
అట్లుగాకుండా,
ఒక్కొక్కరు
ఒక్కొక్క
కలర్
డ్రస్సు
వేసుకుంటే
కేవలం
భిన్నత్వం
గోచరిస్తుంది.
మనలో
భిన్నత్వం
రాకూడదు.
డ్రస్సులో
కాని,
మనస్సులోకాని
అందరూ
ఏకత్వంతో
కూడి
ఉండాలి.
అందరూ
ఒక్కటే,
ఒక్కటే,
ఒక్కటే!
కనుక,
మీరందరూ
ఏకత్వంతో,
ప్రేమతో
అన్యోన్యంగా,
ఆనందంగా
జీవించండి.
7
▾
Meaning
Keep
(భగవాన్
‘హరి
భజన
బినా
సుఖ
శాంతి
నహీ...’
అనే
పాట
పాడి
భక్తులచే
పాడించిన
తరువాత
తమ
దివ్యోపన్యాసమును
కొనసాగిస్తూ...)
భజనే
మన
భోజనము.
అది
లేకపోతే
‘ఆకలి’
వేస్తుంది.
కనుక,
మన
ఆధ్యాత్మిక
ఆకలి
తీరాలంటే
నిత్యమూ
క్షణక్షణమూ
భజన
చేయాలి.
తెల్లవారి
లేచినది
మొదలుకొని
రాత్రి
పరుండునంతవరకు,
మనకు
ప్రజ్ఞ
ఉన్నంతవరకు
భజన
చేస్తూ
ఉండాలి.
ఇదే
ఈనాడు
నేను
మీకందించే
సందేశం.
మీరు
ఏ
పని
చేసినా
మనస్సులో
భగవంతుని
నామస్మరణ
చేస్తూ
ఉండండి.
God
is
within
you,
without
you,
beyond
you,
below
you
and
behind
you.
Previous
←
Only one who recognises that all are one is truly educated
Next
Anything In Life Can Be Achieved With Faith In God
→