Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2008 · Those who strive for Satya are the true devotees
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Those who strive for Satya are the true devotees
6 March 2008, Mahāśivarātri, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
నిద్ర
లేచినదాది
నిద్రపోయెడుదాక
కాసుకై
కుస్తీలు
వేస్తారయా!
రూపాయికోసమై
లోపాయికారిగా
అడ్డమైన
గడ్డి
తింటారయా!
ఇతరులెరుగకున్న
ఈశ్వరుండెరుగడా!
తగిన
ఫలితము
ననుభవిస్తారయా!
ఈనాటి
మానవుని
మనస్సు
మదముచేతను,
మితిమీరినటువంటి
ధనాపేక్షచేతను
కలుషితమైనది;
మాధవత్వము
మరుగునపడినది.
లోకములో
ఏనాడు
ధనాపేక్ష
తరిగి
దైవాపేక్ష
పెరుగునో
ఆనాటివరకు
ఈ
కష్టాలు
తప్పవు.
మానవుడు
తన
మనస్సులో
మాధుర్యాన్ని
నింపుకోవాలి;
మాట
తప్పక
మసలుకోవాలి.
అప్పుడే
లోకములో
కలతలు
తొలగి
అందరికీ
శాంతి,
సౌఖ్యములు
కలుగుతాయి.
ప్రేమస్వరూపులారా!
ప్రపంచమంతయు
ఈనాడు
ధనము
చుట్టూ
తిరుగుతున్నది.
విద్యార్థి
మొదలుకొని
కూరగాయలు
అమ్ముకొనేవారివరకు
డబ్బు,
డబ్బు,
డబ్బు!
ధనాపేక్ష
ఒకరికి
తక్కువగా
ఉన్నదని,
మరొకరికి
ఎక్కువగా
ఉన్నదని
చెప్పుటకు
వీలుకాదు.
ప్రపంచంలో
అందరూ
కేవలం
ధనమే
ప్రధానమని
భావిస్తున్నారు.
ధనంకోసం
పడుతున్న
బాధలు
దైవం
కోసం
ఎవ్వరూ
పడటం
లేదు.
దైవమే
సర్వులను
రక్షించునటువంటివాడు.
ఎంత
ధనము
ఉన్నప్పటికీ,
దైవము
లేక
మానవుడు
జీవించలేడు.
కాని,
దైవమే
అన్నింటికీ
ప్రధానమనీ,
దైవమే
సత్యమనీ
నిత్యమనీ
గుర్తించినటువంటివారు,
దైవంకోసం
చింతించేవారు
చాలా
తక్కువ.
అందుకోసమనే
సామూహిక
భజన
అనేది
ప్రారంభించడమైనది.
అందరూ
కలసి
భగవన్నామమును
గానం
చేసినప్పుడు
అందులో
ఏ
కొద్దిమంది
అయినా
నిజంగా
దైవచింతన
చేస్తారు.
2
▾
Meaning
Keep
అలలు
వేర్వేరుగాని,
జలము
ఒక్కటే.
అదేవిధముగనే,
ఎవరు
ఏ
చింత
చేసినప్పటికీ,
“ఏకాత్మా
సర్వ
భూతాంతరాత్మా”,
అందరియందు
దైవం
సమానంగానే
ఉంటున్నాడు.
“ఏకం
సత్
విప్రాః
బహుధా
వదన్తి”,
సత్యం
ఒక్కటే.
అట్టి
సత్యమునకై
పాటుపడే
వ్యక్తులే
నిజమైన
భక్తులు.
అట్టి
సత్యస్వరూపమును
నిరూపించునటువంటిదే
సకల
వేదసారము.
ఐతే,
అట్టి
సత్యాన్ని
గుర్తించినటువంటివారు
ఎక్కడా
కనిపించడం
లేదు.
సత్యాన్ని
మనం
వదలకూడదు.
సత్య,
ధర్మములు
రెండూ
చేరితే
శాంతి
ఏర్పడుతున్నది.
అంతేకాదు.
సత్య,
ధర్మముల
యొక్క
ఏకత్వమే
ప్రేమతత్త్వము.
“సత్యమేవాద్వితీయం
బ్రహ్మ.”
సత్యమే
అన్నింటికీ
ఆధారం.
ప్రేమస్వరూపులారా!
ఈ
ప్రేమ
ఎక్కడినుండియో
వచ్చినది
కాదు.
ఇది
మానవునియొక్క
హృదయమునుండియే
ఆవిర్భవించినటువంటిది.
ప్రేమ
లేకుండా
మానవుడు
బ్రతుకలేడు.
ప్రేమ
అనేక
రూపములను
ధరిస్తున్నది.
ఉదాహరణకు,
భార్యా
భర్తల
ప్రేమ,
తల్లీ
బిడ్డల
ప్రేమ,
స్నేహితుల
మధ్య
ఉన్న
ప్రేమ.
ఐతే,
ఎవరియందు
చూచినప్పటికీ
ప్రేమ
అనేది
ఒక్కటిగానే
ఉన్నది.
భగవంతుడు
ఎక్కడ
ఉన్నాడంటే,
సర్వులయందు
ప్రేమస్వరూపుడై
ఉన్నాడు.
ఆ
ప్రేమతత్త్వమే
సర్వులయందు
ఉన్నటువంటి
ఏకత్వము.
ఆ
ప్రేమతత్త్వములో
ప్రవహించినటువంటి
జీవితమే
నిజమైన
జీవితము.
ప్రేమలేని
జీవితం
జీవితమే
కాదు.
మిగిలిన
విలువలన్నీ
ప్రేమలోనే
లీనమైయున్నవి.
ఈశ్వర
సంకల్పం
వజ్ర
సంకల్పం
ఒకానొక
సమయంలో
పార్వతి
ఈశ్వరునితో,
“ఈశ్వరా!
మనకు
ఉండటానికి
ఒక
ఇల్లు
లేదు.
తమ
దర్శనార్థం
అనేకమంది
ఋషులు
వస్తుంటారు.
కనుక,
ఒక
చిన్న
ఇల్లు
కట్టిస్తే
వారికికూడా
అనుకూలంగా
ఉంటుంది”
అన్నది.
అప్పుడు
ఈశ్వరుడు,
“పార్వతీ!
నీవు
సంకల్పించిన
లగ్నం
సరియైనది
కాదు.
ఎంత
పెద్ద
భవనం
కట్టించినా
దానిని
అగ్నిదేవుడు
వచ్చి
భస్మం
చేస్తాడు”
అన్నాడు.
కాని,
పార్వతి
తన
పట్టు
వీడలేదు.
“ఈశ్వరా!
అగ్నిదేవుడుకూడా
మీ
బంటే
కదా!
కాబట్టి,
నేను
కట్టించే
ఇంటిని
కాల్చవద్దని
అగ్నిని
ఆజ్ఞాపించండి”
అని
కోరింది.
ఆమె
బలవంతంమీద
ఈశ్వరుడు
అగ్నివద్దకు
బయలుదేరాడు.
3
▾
Meaning
Keep
ఈశ్వరుని
మాటకు
తిరుగులేదు
కాబట్టి,
పార్వతి
ఇల్లు
కట్టటం
ప్రారంభించింది.
ఐతే,
ఈశ్వరుడు
అగ్నివద్దకు
వెళ్ళే
సమయంలో
ఆయనతో
ఆమె
ఒక
మాట
చెప్పింది,
“స్వామీ,
నేను
కట్టినటువంటి
గృహాన్ని
అగ్ని
వచ్చి
కాల్చేయటం
నాకు
అవమానకరం.
కాబట్టి,
అగ్ని
ఒప్పుకొనకపోతే
మీరు
వెంటనే
మీ
డమరుకం
వాయించండి.
ఆ
శబ్దం
విని
నేనే
ఈ
ఇంటిని
భస్మం
చేస్తాను.
అగ్నికి
ఈ
అవకాశం
ఇవ్వను.”
ఈశ్వరుడు
అగ్నివద్దకు
వెళ్లి,
“పార్వతి
ఒక
ఇల్లు
కడుతున్నది.
ఆ
ఇంటికి
నీద్వారా
గండం
ఉంది.
కాబట్టి,
నీవు
దానిజోలికి
పోకుండా
ఉంటానని
మాటివ్వు”
అన్నాడు.
అగ్ని
సరేనని
మాటిచ్చి
“స్వామీ!
ఎన్ని
దినములనుండియో
మీ
తాండవ
నృత్యమును
చూడాలని
నాకు
కోరికగా
ఉన్నది.
దయచేసి
నా
కోరిక
తీర్చండి”
అని
ప్రార్థించాడు.
అతనిని
సంతృప్తిపరిచే
నిమిత్తం
శివుడు
తాండవ
నృత్యం
చేశాడు.
తాండవ
కేళి
సల్పెను
పరమేశ్వరుడు
శ్రీ
సాంబశివుడు
తాండవ
కేళి
సల్పెను...
తాండవ
కేళి
సల్పె
కుండలీంద్ర
కంకణుడు
సాలుగ
ఢక్క
చేపట్టి
జణాం
జణాం
జణ
జణతక్కియనుచు
తాండవ
కేళి
సల్పెను...
నారదుడు
తంబుఱ
మీటగ
జటాజూటములు
శిరమున
మెరయగ
త్రిశూలంబును
త్రిప్పుచు
హరుడు
తథిం
తథిం
తథి
తథి
తక్కయనుచు
తాండవ
కేళి
సల్పెను...
సరస్వతీ
వీణా
మీటగ
పురందరుడు
వేణూవూదగ
హరి
మృదంగము
వాయింపగ
ధిమీధిమీ
ధిమిధిమి
తక్కయనుచు
తాండవ
కేళి
సల్పెను...
శిఖలో
మున్నేటి
కన్య
ముఖములో
మూడవ
కన్ను
సొగాసుగ
స్ఫటికాక్ష
మాలలు
నిగానిగా
నిగ
నిగనిగ
మెరయగ
తాండవ
కేళి
సల్పెను...
4
▾
Meaning
Keep
శివుడు
తాండవ
కేళి
సల్పే
సమయంలో
సరస్వతి
వీణ
వాయించింది;
నారదుడు
తంబుఱ
మీటాడు;
హరి
మృదంగం
వాయించాడు;
ఈశ్వరుడు
డమడమ
డమడమ
డమరుకం
వాయించాడు.
దానియొక్క
శబ్దం
ఎంతో
గొప్పది.
అందరూ
అన్ని
వాయిద్యములూ
వాయిస్తుండగా
పార్వతికి
ఆ
ఒక్క
డమరుక
శబ్దం
మాత్రమే
వినబడింది.
తక్షణమే
ఆమె
తాను
నిర్మించిన
ఇంటిని
భస్మం
చేసింది.
ఈశ్వరుడు
తిరిగి
వచ్చి
ఇల్లు
భస్మమైపోవడం
చూసి
పార్వతితో
అన్నాడు,
“ఈ
ఇల్లు
ఉండకూడదనేది
నా
సంకల్పం.
కాని,
నీ
తృప్తికోసం
అగ్నిని
అడగటానికి
వెళ్లాను.
అగ్నిని
సంతృప్తి
పరచాలని
తాండవ
నృత్యం
చేశాను.
తాండవమాడే
సమయంలో
డమరుకం
వాయించాను.
అది
నా
నాట్యములో
ప్రధానమైనది
కదా!”
దీనినిబట్టి
మనం
తెలుసుకోవలసినది
ఏమిటంటే,
ఎన్ని
ఆటంకములు
కలిగినా
ఈశ్వర
సంకల్పము
నెరవేరక
మానదు.
“బ్రహ్మ
సత్యం
జగన్మిథ్య”
మొన్న
శౌరి
గతించినాడు.
అతని
దేహాన్ని
కాల్చే
నిమిత్తమై
అనేకమంది
భక్తులు
చిత్రావతికి
వెళ్ళినారు.
ఆ
దేహంలో
ఉన్న
పంచభూతములు
వాటివాటి
స్వస్థానములో
చేరిపోయినాయి
-
అగ్ని
అగ్నిలో
చేరిపోయింది;
జలము
జలములో
చేరిపోయింది;
గాలి
గాలిలో
చేరిపోయింది.
ఆ
తోలుతిత్తి
భస్మమై
పోయింది.
కాని,
ఆత్మకు
మాత్రం
చావు,
పుట్టుకలు
లేవు.
5
▾
Meaning
Keep
Also in his talks
(4)
3 November 1989
Ānanda Itself Is the Goal
1 June 1990
Practice and Precept
14 July 1992
God alone is the true Guru
15 December 2007
The path of Prema brings the fruit of every sādhana
ఈ
జగత్తులో
అన్నీ
ఒక్క
బ్రహ్మమునందే
ఇమిడి
యున్నవి.
అందుకే
ఎవరైనా
“అయ్యా,
నీ
పేరేమి?”
అని
ప్రశ్నించినప్పుడు
“అహం
బ్రహ్మాస్మి”,
“నేను
బ్రహ్మను”
అని
చెప్పాలి.
భగవంతునికి
గల
పేరు
ఒక్కటే
-
అదే
బ్రహ్మము;
వేరొక
పేరు
లేదు.
కాని,
లోకులు
భగవంతునికి
రాముడు,
కృష్ణుడు,
గోవిందుడు,
నారాయణుడు
అని
వేరువేరు
పేర్లు
పెడుతున్నారు.
ఈ
పేర్లన్నీ
మన
ఇష్టము
ననుసరించి
పెట్టుకున్నవే!
కనుక,
పేర్లను
పట్టుకొని
మనం
ప్రాకులాడకూడదు.
తల్లి
తన
బిడ్డలను
ఒక్కొక్క
పేరుతో
పిలుస్తుంది.
అదేవిధముగనే,
ప్రపంచములో
మనము
ఒక్కొక్కరిని
ఒక్కొక్క
పేరుతో
పిలుస్తున్నాము.
ఎవరిని
ఏ
పేరుతో
పిలిచినప్పటికీ
అందరియందున్న
బ్రహ్మము
ఒక్కటే.
అటువంటి
బ్రహ్మతత్త్వాన్ని
తెలుసుకున్నవాడు
తానే
బ్రహ్మమవుతాడు.
భగవంతునియొక్క
సత్యమును,
భగవంతునియొక్క
ధర్మమును,
భగవంతునియొక్క
శాంతిని,
భగవంతునియొక్క
ప్రేమను
అనుసరించినప్పుడే
మనము
భగవంతునియొక్క
సాన్నిధ్యమును
అనుభవించడానికి
వీలవుతుంది.
అన్నీ
బ్రహ్మములోనే
లీనమైయున్నవి.
కనుక,
మనము
బ్రహ్మనామమును
తలుచుకుంటే
చాలు.
బ్రహ్మము
సర్వులయందు
ఉంటున్నది,
సర్వత్రా
ఉంటున్నది.
ప్రపంచంలో
ఎక్కడ
చూచినప్పటికీ
అదొక్కటే
కనబడుతున్నది.
“బ్రహ్మ
సత్యం
జగన్మిథ్య.”
ఇట్టి
‘రియాలిటీ’
అయినటువంటి
బ్రహ్మమును
మనం
నిరంతరం
స్మరించాలి.
ప్రతి
మానవుడుకూడను
“నమశ్శివాయ,
నమశ్శివాయ,
నమశ్శివాయ”
అని
సదా
స్మరించాలి.
ఈ
పంచాక్షరీ
మంత్రములో
కూడా
బ్రహ్మతత్త్వముంటున్నది.
బ్రహ్మానందం,
పరమ
సుఖదం
కేవలం
జ్ఞానమూర్తిం
ద్వంద్వాతీతం
గగన
సదృశం
తత్త్వమస్యాది
లక్ష్యం
ఏకం
నిత్యం
విమల
మచలం
సర్వధీ
సాక్షిభూతం...
ఇట్టి
బ్రహ్మతత్త్వమును
ఎవరూ
మరువరాదు.
తల్లిదండ్రులను
ఎల్లప్పుడు
కృతజ్ఞతతో
స్మరించాలి
భగవంతునియొక్క
సంకల్పము
భక్తులయొక్క
భావమును,
స్వభావమును
అనుసరించి
ఉంటుంది.
ఐతే,
కష్టములు
వచ్చినప్పుడు
భక్తునియొక్క
భావములు
మారిపోతుంటాయి.
6
▾
Meaning
Keep
ఏదైనా
కష్టము
కలిగితే
‘రామా,
కృష్ణా’
అని
తలుచుకోవడానికి
బదులు
‘అయ్యో,
అయ్యో’
అని
అంటుంటారు.
ఒక
పర్యాయం
పార్వతి,
పరమేశ్వరులు
ఆకాశంలో
ప్రయాణమై
వెళుతున్నారు.
క్రింద
ఒక
చెట్టుకొమ్మ
కొసలో
ఒక
మనిషి
నిల్చున్నాడు.
ఆ
కొమ్మ
గాలికి
విరిగిపోయే
పరిస్థితి
ఏర్పడింది.
అది
గమనించి
పార్వతి,
“ఈశ్వరా!
కొన్ని
క్షణాలలో
ఆ
కొమ్మ
విరిగి
అతను
క్రిందపడి
మరణించవచ్చు.
కరుణించి
అతనిని
రక్షించండి”
అని
ప్రార్థించింది.
“అతను
పడిపోతాడని
చూసింది
నీవే
కాబట్టి,
అతనిని
నీవే
రక్షించు”
అన్నాడు,
ఈశ్వరుడు.
వాడు
క్రింద
పడిపోయే
సమయంలో
‘అమ్మా’
అంటే
వానిని
పార్వతి
రక్షించాలని,
‘అప్పా’
అంటే
ఈశ్వరుడు
రక్షించాలని
నిర్ణయించుకున్నారు.
అయితే,
వాడు
పడిపోయే
సమయంలో
‘అమ్మా’
అనలేదు,
‘అప్పా’
అనలేదు;
‘అయ్యో’
అన్నాడు.
అందుచేత
వానిని
రక్షించడానికి
అమ్మ
రాలేదు,
అప్ప
రాలేదు.
ఈవిధంగానే
ఈనాడు
ప్రపంచంలో
అనేక
మరణాలు
సంభవిస్తున్నాయి.
మనం
అంత్యసమయంలో
అమ్మనో,
అప్పనో
తలుచుకోవాలి.
ఈ
లోకమునకు
తల్లిదండ్రులు
పార్వతి,
ఈశ్వరులే!
కాబట్టి,
మనము
ఈ
ఇద్దరినీ
స్మరించుకుంటే
మనకు
ఎట్టి
బాధలూ
కలుగవు.
అమ్మను
ఎందుకు
తలుచుకోవాలి?
బిడ్డను
నవ
మాసములు
మోసి
కని,
అనేకవిధములుగా
కష్టపడి
కాపాడి,
పెంచి
పెద్దచేస్తుంది.
అటువంటి
తల్లిని
తల్చుకోనటువంటి
మూర్ఖుడు
ఎవడైనా
ఉన్నాడా?
తండ్రి
పిల్లవానిని
గురువువద్ద
చేర్చి
విద్య
నేర్పి,
అనేకవిధములుగా
అభివృద్ధికి
తీసుకు
వస్తాడు.
విద్య
నేర్వక,
గురువులు
లేక
ఎవరైనా
గొప్పవారు
కావడానికి
వీలుంటుందా?
కనుక,
ప్రతి
వ్యక్తీ
తన
తల్లిదండ్రులను
ఎల్లప్పుడు
కృతజ్ఞతతో
స్మరించాలి.
ఈ
ఇరువురినీ
తలుచుకోనివాడు
నిజంగా
మూర్ఖుడే!
ఎవరిని
స్మరించకపోయినప్పటికీ
తల్లిదండ్రులను
మాత్రము
స్మరించాలి.
కాని,
ఈనాటి
జనులు
తల్లిదండ్రులను
స్మరించరు.
కనుకనే,
వారికి
రక్షణ
లేకుండాపోతున్నది.
ఈ
దేహముయొక్క
తల్లి
ఈశ్వరమ్మ;
తండ్రి
పెద్ద
వెంకమరాజు.
నేను
ఒక
నెలనుంచికూడను
వాళ్ళిద్దరి
యొక్క
స్వరూపాలను
చూస్తున్నాను.
ఇప్పుడు
ఇక్కడికి
వచ్చేటప్పుడుకూడను
వాళ్ళిద్దరూ
వచ్చారు.
పెద్ద
వెంకమరాజు
‘యెల్లో’
(పసుపు
పచ్చని)
పంచె
కట్టుకున్నాడు.
ఈశ్వరమ్మ
‘యెల్లో’
చీర
కట్టుకుంది.
ఎందుకంటే,
ఇప్పుడు
వాళ్ళిద్దరూ
వైకుంఠంలో
ఉన్నారు.
7
▾
Meaning
Keep
వైకుంఠంలో
ఉన్నవారు
వేరొక
రకమైన
వస్త్రములు
ధరించరు.
నేను
మాత్రమే
కాదు,
నా
రూమ్‌లో
పడుకునే
పిల్లవాడు
సత్యజిత్కూడను
చూసి,
“ఏమి
స్వామీ,
ఈశ్వరమ్మగారు
‘యెల్లో’
చీర
కట్టుకున్నారు?”
అని
అడిగాడు.
‘యెల్లో’
చీర
కట్టుకున్నవారు
ఎప్పుడుకూడను
సుమంగళులే!
ఈనాడు
నేను
‘యెల్లో’
కలరు
లింగమును
తీయాలని
అనుకున్నాను.
కాని,
నేను
బయల్దేరి
వచ్చే
సమయంలో
పిల్లలు,
ఆశ్రమవాసులు,
భక్తులుకూడను
“స్వామీ,
మీరు
లింగమును
తీయనక్కర్లేదు.
మీ
శ్రమను
మేము
చూడలేము.
మీ
దర్శన
భాగ్యమే
మేము
కోరేది.
మా
ప్రార్థన
మన్నించండి”
అన్నారు.
నాయొక్క
చిత్తము
చాలా
పవిత్రమైనటువంటిది.
నేను
ఏ
సంకల్పము
చేసినప్పటికీ
అది
తప్పక
జరుగుతుంది.
మానవులయొక్క
హృదయాలు
నిరంతరం
మారుతూ
ఉంటాయి.
కాని,
సాయి
హృదయం
ఎప్పటికీ
మారదు.
ఇటువంటి
సత్యనిత్యమైన
దివ్యత్వాన్ని
ఎవ్వరూ
గుర్తించలేరు.
శిరిడీ
సాయి
-
పర్తి
సాయి
-
ప్రేమసాయి
రామాయణమునందుగాని,
భాగవతమునందు
గాని,
భారతమునందుగాని
ఒక్కొక్కరికి
ఒక్కొక్క
సార్థక
నామము
ఉన్నది.
‘సుమిత్ర’
అనగా
‘సు-మిత్ర’,
అందరికీ
మంచి
స్నేహితురాలు.
వైదేహి
అనగా
సీత.
జనక
మహారాజుకు
దేహభ్రాంతి
లేదు.
అతని
పుత్రిక
కనుకనే,
ఆమెకు
‘వైదేహి’
అని
పేరు.
ఈవిధంగానే,
భగవంతునియొక్క
పేర్లు
అనేకరకములుగా
ఏర్పడుతూ
వచ్చాయి.
ఆ
పేర్లను
పెట్టుకొని
మానవుడు
అనేక
రకములైన
సంపాదనలు
చేస్తున్నాడు.
ఈ
దేహము
పేరు
సత్యసాయి.
ఈ
పేరుతో
అనేకమంది
అనేక
విధములుగా
సంపాదన
చేస్తున్నారు.
ఇది
కేవలం
పేరు
కాదు;
సత్యసాయి
అంటే
‘సత్యశాయి’,
సత్యముపై
పవళించినవాడు
అని
అర్థము.
ఈశ్వరమ్మ
అంటే
ఎవరు?
ఈశ్వరుని
అమ్మ
ఈశ్వరమ్మ.
సాయీశ్వరుని
చరిత్రలో
ఈశ్వరమ్మ
సంపూర్ణమైన
ఆదర్శభావమును
అందించినటువంటి
మాతృమూర్తి.
కనుక,
ప్రతి
మానవుడూ
ఆ
తల్లిని
స్మరిస్తూ
రావాలి.
ఇంతియే
కాకుండా,
వెంకమరాజు
ఎవరు?
ఏడుకొండలవాడు.
అతడే
పెద్ద
వెంకమరాజు.
ఈశ్వరుడు,
పార్వతి
ఇరువురూ
ఏకమై
ఈ
రూపాన్ని
ధరించారు.
8
▾
Meaning
Keep
సాయి
అవతార
త్రయంలో
మొట్టమొదటిది
శిరిడీ
సాయి,
రెండవది
పర్తి
సాయి,
రాబోయేటటువంటిది
ప్రేమసాయి.
అదియే
ప్రధానమైనది.
అదియే
అందరినీ
ఏకం
చేయునది.
ప్రేమయే
సర్వమును
ఏకం
చేస్తుంది.
ఇప్పుడు
ఏకత్వమే
లేదు;
అంతా
భిన్నత్వమే...
భిన్నత్వమే...
భిన్నత్వమే!
“మీరు
ఎక్కడి
నుండి
వచ్చారండీ?”
అని
మనం
ఎవరినైనా
ప్రశ్నిస్తే
ఒకరు,
‘మేము
కర్ణాటకనుండి
వచ్చాము’
అంటారు;
‘మాది
ఆంధ్రప్రదేశ్’
అంటారు
మరొకరు;
ఇంకొకరు
‘మాది
తమిళనాడు’
అంటారు.
కాని,
ఎప్పుడు
ప్రేమ
వస్తుందో
అప్పుడు
ఇటువంటి
భేదము
ఉండదు.
అందరూ
ఒక్కటవుతారు.
అప్పుడు
ఉండేది
ఒకే
‘కాస్టు’
(కులం),
ఒకే
‘కల్చరు’
(సంస్కృతి),
ఒకే
‘కంట్రీ’
(దేశము).
భారత
దేశమనేది
అందరి
ఇల్లు.
ఇప్పుడు
మన
పుట్టపర్తి
ప్రశాంతి
నిలయము
సర్వులయొక్క
నిలయమైపోయింది.
మనం
అందరం
ఒక్కటిగా
ఉండాలి.
నేను
ఈస్ట్
ఆఫ్రికా
వెళ్లినప్పుడు
ఇడి
అమీన్‌తో
“నేను
ఆంధ్రప్రదేశ్
నుండి
వచ్చాను”,
లేక
“కర్ణాటకనుండి
వచ్చాను”
అని
చెప్పలేదు;
“నాది
ఇండియా”
అని
చెప్పాను.
ఈవిధంగా
ప్రతి
ఒక్కరూ
తాము
చెప్పినటువంటివి
చేస్తూ
వస్తే
అందరూ
ఎంతైనా
బాగుపడతారు.
అతి
శీఘ్రకాలంలోనే
ఇండియా
అంతా
ఒక్కటవుతుంది.
భేదములన్నీ
సమసిపోతాయి.
వ్యక్తులు
వేరువేరుగా
ఉండవచ్చు,
చదువులు
వేరువేరుగా
ఉండవచ్చు;
మాట్లాడే
భాషలు
వేరువేరుగా
ఉండవచ్చు,
కాని,
ఒకే
‘కంట్రీ’,
ఒకే
‘కాస్టు’,
ఒకే
‘కల్చరు’
-
అంతా
ఒక్కటి
కావాలి.
అప్పుడే
మనమందరమూ
‘బ్రదర్స్
అండ్
సిస్టర్స్’గా
జీవించగల్గుతాము.
ఇట్టి
ఏకత్వమును
అభివృద్ధిపరచుకోవడమే
భారతీయుల
యొక్క
ప్రధాన
లక్ష్యమని
ఈనాటి
పండుగ
బోధిస్తున్నది.
రామాయణమువంటి
మన
పవిత్ర
భారతీయ
చరిత్రలు
ఇట్టి
ఏకత్వాన్నిగురించే
బోధిస్తున్నాయి.
రామాయణమునందు
సుమిత్ర
దశరథ
మహారాజు
తనకిచ్చిన
పాయసపు
గిన్నెను
మిద్దెపైన
పెట్టి
ఎండలో
కురులార్పుకుంటున్న
సమయంలో
ఒక
గరుడపక్షి
వచ్చి
ఆ
గిన్నెను
తీసికొనిపోయింది.
తన
అజాగ్రత్తకు
దశరథుడు,
వసిష్ఠులవారు
ఏమంటారో
అని
భయపడుతూ
ఆమె
క్రిందికి
దిగి
వచ్చి
జరిగిన
సంగతి
కౌసల్య,
కైకేయిలకు
వివరించింది.
ఈనాటి
సవతులవలె
కాక
ఆనాడు
వారు
ముగ్గురూ
స్వంత
అక్కచెల్లెళ్ళవలె
ఎంతో
అన్యోన్యంగా,
ఐకమత్యంగా
ఉండేవారు.
9
▾
Meaning
Keep
కౌసల్య
సుమిత్రను
ఓదార్చుతూ,
“చెల్లీ,
ఇదిగో,
నా
పాయసంలో
కొంత
భాగము
నీకిస్తాను”
అన్నది.
కైకేయికూడా
తన
పాయసంలో
కొంత
భాగమును
ఆ
గిన్నెలో
పోసింది.
కౌసల్య
ఇచ్చిన
పాయసమునుండి
పుట్టినవాడు
లక్ష్మణుడు.
కైకేయి
ఇచ్చినటువంటి
పాయసమునుండి
జన్మించినవాడు
శతృఘ్నుడు.
కాబట్టి,
‘రాముడు
రాజయితే
లక్ష్మణుడు
రామసేవ
చేస్తాడు.
ఒకవేళ
దశరథుడు
తన
వాగ్దానం
ప్రకారం
భరతునికి
రాజ్యమిస్తే,
శతృఘ్నుడు
అతనికి
సేవ
చేయాలి’
అని
సుమిత్ర
తలపోసింది.
అదేవిధముగనే,
కౌసల్య
కుమారుడయిన
రామునికి
లక్ష్మణుడు
సేవ
చేసినాడు;
కైకేయి
కుమారుడైన
భరతునికి
శతృఘ్నుడు
సేవ
చేసినాడు.
ఆవిధంగా
వాళ్ళందరూ
ఐకమత్యంగా,
అన్యోన్యంగా,
ఆనందంగా
జీవితాన్ని
గడుపుతూ
వచ్చారు.
ఈనాడుకూడను
అట్టి
‘యూనిటీ’,
‘బ్రదర్హుడ్’
(ఐకమత్యం,
సోదరత్వం)
రెండూ
ఉంటే
మనము
అందరికీ
మిత్రులమవుతాము.
రామాయణ,
మహాభారతములు
ఏకత్వము,
ఆధ్యాత్మికత
ఈ
రెండింటినీ
చక్కగా
బోధిస్తున్నాయి.
ఐకమత్యంవల్ల
భారతదేశం
ఎంతైనా
అభివృద్ధికి
వస్తుంది.
ప్రేమస్వరూపులారా!
మీరందరుకూడను
ఎక్కడికి
వెళ్లినప్పటికినీ
‘నాది
భారత
దేశము,
నాది
భారతీయ
సంస్కృతి’
అని
సగర్వంగా
చాటుకోవాలి.
ఎల్లప్పుడు
ఆ
మాటమీద
మీరు
నిలవాలి.
ఏకత్వాన్ని
విశ్వసించి
అనుసరించడం
చాలా
మంచిది.
‘కాస్టు’,
‘కల్చర్’,
‘కంట్రీ’
-
ఈ
మూడింటిలో
ఏకత్వం
ఏర్పడినప్పుడే
మన
భారతదేశం
చక్కని
అభివృద్ధికి
వస్తుంది.
‘భా-రతి’.
‘భా’
అనగా
భగవంతుడు.
కనుక,
భగవంతుని
ప్రేమించినటువంటిదే
భారతదేశము.
మీరు
ఈ
సత్యాన్ని
గుర్తించి
ఎల్లప్పుడు
మనస్సులో
నిల్పుకోవాలి.
“హరి
భజన
బినా
సుఖశాంతి
నహీ”.
శాంతి
కావాలని
కోరే
ప్రతి
ఒక్కరూ
భజన
చేయాలి.
అందులోనే
మనకు
నిజమైన
శాంతి
లభిస్తుంది.
Previous
←
Revere your mother as God, your father as God
Next
Do the deeds that please God
→