Poem 383
నిలువ నీడలేని బ్రతుకు నీకొరకని మోయుదాన కృష్ణా!నిలువదురా నా మనసు నీ నగవులు దూరమైనకలలో నా కనులకు కానగరాదా కృష్ణా!నిన్ను విడచి నిలువ లేనురా కానగరారా కృష్ణా!కనుపాపవు మాటకు పసిపాపవు మనసుకునిను విడచి అరనిముషము నిలువగలేరా కృష్ణా!
In plain words
This life with no shade to stand under, I bear for Your sake, Kṛṣṇa! My mind will not stay still when Your smiles are far away; will You not come before my eyes in a dream, Kṛṣṇa? I cannot stay apart from You; come to be seen, Kṛṣṇa! In word, You are the pupil of my eye; in heart, a little babe; apart from You I cannot stay even half a moment, Kṛṣṇa!