Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His poems · 1992
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
25
Keep
ఏమిలేని బుఱ్ఱలోన యేమైనను చేర్చవచ్చు
ఏమేమో నిండియున్న బుఱ్ఱ నింప వీలుకాదు
కలి బోధలు నిండియున్న తలబుఱ్ఱది ఖాళియగున
తలబుఱ్ఱది ఖాళికాక యిల సుకృతంబు నింపనగునా!
381
Keep
అత్తవారింటికేగుమో కొత్త పెండ్లి
కొడుక! అందు నీకెక్కువ సుఖముగల్గు
ముద్దు మరదలు నీతోడ ముచ్చటాడు
వదిన మాటికి నీతోడ వరుసలాడు
ఊరివారంత మన్ననలతిగ సల్ప
మామ కూడ నీకు అడుగుల మడుగులొత్తు
పోయి రావయ్య అత్తవారింటికి నీవు.
382
Keep
వానలు వచ్చెనంచు భువి పండునే విత్తులు నాటకున్న ఆ
వానలు రానిచో ఫలము వచ్చునె బీజము నాటియున్ననెం
దైనను రెండు కూడిన మహత్తర సిద్ధి లభించు సుమ్మి దై
వాను గతిన్ లభించు పురుషార్థ విధానము మేలునిచ్చటన్.
383
Keep
నిలువ నీడలేని బ్రతుకు నీకొరకని మోయుదాన కృష్ణా!
నిలువదురా నా మనసు నీ నగవులు దూరమైన
కలలో నా కనులకు కానగరాదా కృష్ణా!
నిన్ను విడచి నిలువ లేనురా కానగరారా కృష్ణా!
కనుపాపవు మాటకు పసిపాపవు మనసుకు
నిను విడచి అరనిముషము నిలువగలేరా కృష్ణా!
384
Keep
కష్టసుఖములు రెండును కలసియుండు
వాని విడదీయనెవరికి వశముగాదు
సుఖము ప్రత్యేకముగనెందు చూడబోము
కష్టము ఫలించెనేని సుఖంబటంద్రు.
385
Keep
నేటి విద్యార్థులందున నూటికొకరు
పాఠ్యగ్రంధాలు చదువంగ పాటు పడరు
పాసు కావలెనంచును పరితపింత్రు
బూటకంబుగ మారెను నేటి విద్య.
386
Keep
భోగభాగ్యంబులివి ఎన్ని పొందియున్న
తృప్తి మనిషికి లేదని తెలియరయ్య
ఆత్మతత్త్వము చేరినయపుడు కాని
తృప్తి శాంతియు మనిషికి ప్రాప్తి రాదు.
387
Keep
తగిన సేవలు చేయు దాసదాసీలున్న
గుణవంతురాలగు కోడలున్న
అమిత ప్రేమగ చూచు అక్కసెల్లెండ్రున్న
తన యాజ్ఞ పాలించు తమ్ములున్న
మైత్రి నిత్యముగోరు మిత్ర బృందమున్న
తగినట్టి అధికార యోగమున్న
విశ్వవ్యాప్తిని గాంచు విద్యలెన్నియొయున్న
చక్రవర్తులకున్న సంపదున్న
దైవ ప్రేమయె లేకున్న ధరణియందు
సర్వ సంపద వ్యర్థమే చనెడు వేళ
ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు
సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులార!
388
Keep
పూర్ణ ప్రేమయందె పుట్టును సౌఖ్యంబు
సత్య త్యాగ శాంతి క్షమలునబ్బు
ప్రేమ లేకయున్న క్షేమంబు లేదయా
సత్యమైన బాట ఈ సాయి మాట
389
Keep
నవనవోజ్వల శిల్పనైపుణ్య ధోరణి
తనరారు లలిత సౌందర్యరాశి
శిల్పకళా పరిచిత్రితంబగు వర్ణ
దీపికల్ చిందెడి దివ్యకీర్తి
కోటి శిల్పుల తోడ కొంగుబంగారైన
భవ్యదివ్య స్ఫూర్తి ప్రాభవంబు
ప్రాచీన మందిర వాస్తుశాస్త్రస్ఫూర్తి
భూనభో వ్యాప్తి సమర్చితంబు
శుభముహూర్తాన మంగళసూచకముగ
తరలి భారతదేశ ప్రధానమంత్రి
విశ్వకళ్యాణ భవనమావిష్కరించె
సర్వజన మాన్య నరసింహ సార్వభౌమ!
390
Keep
ఏమి కాలము వచ్చెనో ఓ జనులారా!
ఏమి కాలము వచ్చెనో......
ఫేసుపౌడరవతరించి మోసగించె పసుపు పోయె
ఏమి కాలంబు వచ్చెనో ఓ జనులారా!
ఏమి కాలంబు వచ్చెనో...
కాసుల దండలు పోయి మోసగించె చైనులొచ్చె
ఏమి కాలంబు వచ్చెనో....
391
Keep
కనులకు కనిపించెనంట నందునియింట గోపాలుడంట
దీపాన కనిపించెనంట ఆ దీపాన కనిపించెనంట
సుగుణకు కనిపించెనంట మన సుగుణకు కనిపించెనంట
నందునియింట గోపాలుడంట దీపాన కనిపించెనంట
అదే వేలికి తగిలిన మంట మన సుగుణకు కనిపించెనంట.
392
Keep
గ్రుడ్డివాడు రవిని గర్తించలేట్లు
ఆహము పెంచుకొన్న ఆడ్డుయుండు
దేవుడైన తనను తలుసుకోలేడయా
ఉన్నమాట తలుపుచున్న మాట.
393
Keep
మానవత్వమున్న మానవులందున
త్రికరణశుద్ధి తెలియుచుండు,
మానవతయే లేని మానవజాతిలో
దానవత్వముండు తథ్యముగను
394
Keep
అవనియంతయు రమ్యమైన ఆలయము
విశ్వమంతయు పరతత్త్వ విష్ణుమయము
ప్రకృతి బోధించు నవరాత్రి పరమతత్త్వము
సాధనంబున కలదోయి సాయి ప్రేమ
395
Keep
మానవత్వమొచ్చె మాధవులోనుండి
మాధవత్వమేల మరుగుపడియె?
మాయ మాయ యిదియె మహిలోన నరుడయ్యె
మాయనరుడె కాదె మానవుండు.
396
Keep
కౌసల్య వరసుక్తి గర్భమౌటను గదా
రాముడు దేవుడై రమణ గాంచె
సీతా మహాసాధ్వి చెలగి పెంచుట కదా
కవలు కుశలవులు ఘనులునైరి
జిజియా లలామయే చెలగి పెంచుట కదా
వీర శివాజీయు పేరుగాంచె
పుతలిబాయియె రంజిల్లి పెంచుట కదా
గాంధి మహాత్ముడై ఘనతగాంచె
ఈశ్వరంబాసాధ్వి యెత్తి పెంచుట కదా
సత్యనారాయణుండు విశ్వశాంతి కెదిగె
ప్రాణికోటి యీ విధి పరిమళించె
అహరంబున బ్రోచెడి అమ్మ కంటె
ఆదరంబగు వస్తువు అవని కలదె
అమ్మ ప్రధమాక్షరంబె ఆద్యక్షరంబు.
397
Keep
పలుకులె మహా రుచి పలుకులు
పలుకులె పరిమళపు పూతలు
పలుకులె అతి మథుర మకరందములు
పలుకులె నాలుగు వేదాలు
పలుకులె శ్రుతిస్మృతి పలుకులు
పలుకులె బంధమోక్ష సుఖదుఃఖ కారణాలు.
Previous
←
1991
Next
1993
→