Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His poems · 1979
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
60
Keep
దేవ సేవకుండు దేశనాయకుడైన
స్వార్థ రహిత సేవ సలుప గలడు
పదవి కాంక్షవాడు పరశుద్ధ హృదయుడ
ఉన్నమాట తెలుపుచున్న మాట.
61
Keep
పక్వఫలము వృక్షమునుండి పడిన భంగి
జ్ఞాని కడతేరు కర్మశేషంబు వీడి
సంచితానికి వడ్డీని పెంచుకొనుచు
పాపి వర్థిల్లు దినదిన ప్రాభవమున.
62
Keep
భారతవర్ష జంతువుల భాగ్యమదేమని చెప్పవచ్చు నీ
భారత దేశమందు ప్రభవంబయి శ్రీహరి
జీవకోటికిన్, ధారణ యోగ్య విద్యల సదా
వివరించుచుండె,
63
Keep
విద్యయొసగు వినయము
వినయంబువలన కల్గు పాత్రత
పాత్రతవలన ధనము ధనమువలన ధర్మంబు
ధర్మంబువలన ఐహికాముష్మికములనొందు నరుడు
64
Keep
సేవకావృత్తి నీవెప్డు—సేయబోక
దేశసౌభాగ్యమెన్నుచు—దీటులేక
కడపవలయును జీవిత—గరిమమింత
65
Keep
కామితార్థంబులెల్లను కల్పతరువు
వలెను దయచేయు దేవుండు కలడొకండు
దుర్లభంబగు నరజన్మ దొరకు కతన
అతని గాంచుట పరమ లక్ష్యంబు మీకు.
66
Keep
మతములన్ని చేరి మంచినే బోధించె
తెలిసి మెలగ వలయు తెలివితోడ
మతులు మంచివైన మతమేది చెడ్డది
వినుము భారతీయ వీరసుతుడ!
67
Keep
యుగధర్మ పద్ధతుల్ విగళితమైయుండ
నయమార్గమునదిప్పి నడపుకొరకు
లోకంబులెల్ల కల్లోలమై చెడియుంట
నిష్కల్మషముచేసి నిలుపు కొరకు
దుర్మార్గ వర్తనుల్ త్రుళ్ళుచునుండుట
సాధు సంరక్షణ సలుపు కొరకు
కాల సందిగ్ధ విగ్రహసూక్తులైయుంట
భాష్యార్థ గోప్యముల్ పలుకు కొరకు
క్ష్మా భరము బాపి భూదేవి మనుపు కొరకు
త్రేతనొసగిన కోర్కెలదీర్చు కొరకు
అవతరించెను అచ్యుతుడవనియందు
వాసుదేవాఖ్య శ్రీసాయి వసుధశౌరి.
Previous
←
1978
Next
1980
→