Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His poems · 1980
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
68
Keep
దేవుడనగ వేరు దేశమున లేడు
దేవుడనగ తనదు దేహమందె
పపమనగ వేరు పరదేశమున లేదు
తానుచేయు పనుల తగిలియుండు
69
Keep
ఐకమత్యంబు జ్ఞానంబునందజేసి
జ్ఞాన జ్యోతిని వెలిగించు దేశమిదియె
ఇంతకన్నను వేరెద్ది ఎరుకపరతు
సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార.
70
Keep
క్షమ సత్యము క్షమ ధర్మము
క్షమ యోగము క్షమయహింస క్షమ యజ్ఞమగున్
క్షమయాచారము క్షమ దయ
క్షమయే ఆధారమగును సర్వంబునకున్.
71
Keep
తెలివితేటలు మరి ఎన్ని కలిగియున్న
కర్మ దాటగ జాలిన ఘనుడు లేడు
ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు
సాథు సద్గుణ గణ్యులౌ సభ్యులార!
72
Keep
కర్మమార్గమన్న కమనీయ పుష్పము
భక్తిమార్గమన్న పచ్చికాయ
జ్ఞానమార్గమన్న చవులూరు ఫలమయా!
73
Keep
జన్మమెత్తిన వెనుక జాగ్రత్త కావలె
దుర్మార్గులను జేర దొసగు కల్గు
చెడును జీవితమెల్ల చెడును బుద్దులు భక్తి
చెడు దుష్టుడై తాను చెడును కడకు
చెడక మునుపె మంచి స్నేహంబు లొనరించి
పెడమార్గములనెల్ల వీడియున్న
ఆయురారోగ్యంబులఖిల సంపదలను
ఆధ్యాత్మిక చిత్తమబ్బునప్ప
అంతియేకాదు, మోక్షంబు చెంత నిలుచు
ఇంతకన్నఉ వేరెద్ది ఎరుక పరతు
సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులార!
74
Keep
మేథమేటిక్సును మరువక జపియించు
గణితశాస్త్రము వంకజూడబోడు
అమెరికా మార్గంబునరయజూచునుగాని
కాశికా మార్గంబు కానరాడు
ఆల్జిబ్రాయంతను అరసిజూచునుగాని
ఇంటి వైశాల్యమునెరుగబోడు
అనుదినంబును డ్రిల్లుననుసరించునుగాని
పద్మాసనము వేయ బాధ పడును
వృక్షశాస్త్రమెరుగు సమృద్ధిగను తులసి
ఉపయోగమెరుగడు మానవుండు.
Previous
←
1979
Next
1981
→