Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His poems · 1981
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
75
Keep
దుష్టసంకల్పములచేత దుఃఖితుడగును
సత్యసంకల్పముచేత సాధువగును
సకలసంకల్పశూన్యుడే శాంతినొందు
సత్యమును తెల్పు బాట శ్రీసాయి మాట.
76
Keep
దేవుడన్నమాట తెలియునందరికి
మాట తలిసినంత మూటయేమి
దేవుడన్నయట్టి ధన్యుని పూజించి
దేవుడన్నమాట తెలియరయ్య
77
Keep
దేవుడన్నమాట తెలియునందరికిని
మాట తెలిసినంత మూటయేమి!
దేవు పొందునట్టి దివ్యగుణములు లేక
దేవునెట్లు మీరు చూడగలరు!
78
Keep
మనుజుడైనవాడు తన దుర్గుణమ్ముల
వరుసనొకటినొకటి వదల వలయు
పశుగుణంబు వీడి పశుపతి కావలె
సత్యమైన బాట సాయి మాట.
79
Keep
సత్ప్రవర్తన సద్బుద్ధి సత్యనిరతి
భక్తి క్రమశిక్ష కర్తవ్యపాలనంబు
నేర్పునదె విద్య విద్యార్థి నేర్వవలయు
సత్యమును తెల్పు మాట శ్రీసాయి మాట.
80
Keep
మేఘములు మింటిపైనను మెదలుచుండ
వాటి దాపున విద్యుత్తు వరలునట్లు
విద్య వెనుకను జ్ఞానంబు వెలయవలయు
ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు.
81
Keep
పువ్వు లేక కాయ పుట్టదు చెట్టున
కాయలేక ఫలము కలుగబోదు
కర్మనిష్ట లేక కలుగదు భక్తియు
భక్తి లేక జ్ఞాన భరితుడగున!
82
Keep
దేహము పాంచభౌతికము దేహము కూలక తప్పదెప్పుడున్
దేహి నిరామయుండు గణుతింపగ దేహికి చావుపుట్టుకల్
మోహనిబంధ బంధనల ముద్రలు లేవు నిజంబుజూడ యా
దేహియె దేవదేవుడు మదిన్ గణుతింపగ ఆత్మరూపుడౌ!
83
Keep
ఫలములోని మధుర రసం తరువు తానెరుగునా?
పువ్వులోని మకరందము తీగలనుభవించునా?
కావ్యాలలోని మధుర రసము గ్రంథమనుభవించునా?
నివృత్త సారాంశము ప్రవృత్తి పండితుడెట్లెరుంగును?
Previous
←
1980
Next
1982
→