Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His poems · 1982
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
84
Keep
సారము లేనియట్టి భవసాగరమందు మునింగి తేలుచున్
దారియుతెన్నుగానకయె తత్తరమందెడి మానవుండ నీ
కోరిమి యించుకంత మదినూనుచు భక్తిని కల్గి చూడు శ్రీ
కారుడు సత్యసాయి నిను కావగ వచ్చిన నావగాంచవే!
85
Keep
తుప్పు పట్టిన దానిని తుడవవచ్చు
పొట్టు విత్తనముల విడగొట్టవచ్చు
కోరి యజ్ఞాన తిమిరంబు తరుమ వచ్చు
కాని మూర్ఖుని రంజింప కాదు సుమ్మి.
86
Keep
ఆకారమే లేని ఆ నిరాకారున
కెట్టి రూపము దిద్దనెవరి తరము!
కరచరణంబులే కలుగని వానికి
ఎట్టి సొంపులు మదినెంచగలరు!
ఇట్టిది అట్టిది ఈ రూపు ఆ రూపు
అని పల్కెడి పల్కు హాస్యదంబు
కోటి సూర్యుల దీప్తి మేటిగల్గినదంచు
పల్కెడి పల్కులు పావనములె
రూపమేలేని శక్తికి రూపుదెల్ప
నెవరి సాధ్యము ఎవరైన ఎరుగగలరె?
శక్తిరూప రహితయై అనాదినుండి
దిగ్దిగంతములందున దీప్తినొందె.
87
Keep
ఇనుము విరిగినంత ఇరుమారు ముమ్మారు
కాల్చియతకగలడు కమ్మరీడు
మనసు విరిగినంత మరి చేర్పగలరయా
ఉన్నమాట తెలుపుచున్న మాట.
88
Keep
మంచివారి పొందు మహిలోన దొరకదు
దుష్టులెందరైన దొరుకుచుంద్రు
కలికి రాళ్లు భువిని కలవెన్నియైనను
వెలనుబోలు వజ్రమెతుకవలయు.
89
Keep
అల్లాయంచు మహమ్మదీయులు జహోవాయంచు సత్క్రైస్తవుల్
ఫుల్లాబ్జాక్షుడటంచు వైష్ణవులు శంభుండంచు శైవుల్ సదా
ఉల్లాసంబున గొల్వనెల్లరకు నాయుర్భోగభాగ్యాది సం
పల్లాభంబులొసంగి బ్రోచు నొకడే భవ్యుండు భావింపుడీ!
90
Keep
ఆశకు దాసుడైన జగమంతటికి
తాను దాసుడే కదా!
ఆశను జయించినవాడు
అనయంబు దాసుడు లోకంబు.
91
Keep
భరతదేశము వేదాల పట్టుగొమ్మ
యజ్ఞయాగాది క్రతువులకాటపట్టు
పెక్కు అవతారములగన్న పెద్ద తల్లి
నీతినియమాలజూపెడి త్యాగభూమి
185
Keep
అదియు పూర్ణము ఇదియు పూర్ణము
పూర్ణమున ఉదయించు పూర్ణము
పూర్ణమున పూర్ణము తీసిన
పూర్ణమే శేషించి యుండు.
245
Keep
కప్పురంబు తెలుపు కామధేనువు తెల్పు
చుక్క తెలుపు హంస రెక్క తెలుపు
అందమైన సాయి మందహాసము తెల్పు
ఉన్నమాట తెలుపుచున్న మాట.
Previous
←
1981
Next
1983
→