Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His poems · 1983
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
92
Keep
నిరత సత్యఫ్రౌడి ధరణినేలిన హరి
శ్చంద్రుడీ ధరబాసి చనగలేదె
ఎల్ల లోకములేలె ఎసగ శ్రీనలరాజు
తనవెంట భూమిని గొనుచు చనెనె
కృతయుగంబును నలంకృతి చేయు మాంథాత
సిరి మూటగట్టుక అరగినాడె
జలధి సేతువుగట్టె అలనాడు శ్రీరాము
డుర్విపై నిప్పుడు ఉన్నవాడె
ఎందరెందరు రాజులు ఏగినారొ
ఒక్కరును వెంటగొనిపోరు నుర్వితలము
నీవు మాత్రము రాజ్యంబు భోగములను
తలను కట్టుక పోదువా ధర్మహృదయ!
93
Keep
మనసు మాలిన్యములనెల్ల మట్టుబెట్టి
పరమ పరిశుద్ధ భావముల్ పాదుగొల్పి
జ్ఞానదృష్టియునేర్పడ కాననగును
విశ్వమంతయు బ్రహ్మమై వెలుగు నిండు.
94
Keep
ముక్తి కోరి నరుడు ముక్కోటి దేవతల్
వేడుచుండుగాని వెతలుబోవు
తనదులోని అహము తాజంపగలిగిన
ముక్తి ఏల? తానె ముక్తి కాడె.
95
Keep
పరమాత్మ ప్రేమను ధరణిలో జనులకు
ప్రవహింపజేయుటే పరమ భక్తి
ప్రతి మానవుండును బ్రతికి తానుండుట
స్వార్థంబునకు కాదు సంఘసేవ
చేయుటకే అన్న శ్రేష్ఠభావంబుతో
మెలగుచునుండిన మేలు కలుగు
మరచియు తనుతాను మానవ సేవకు
అంకితమగుటయే ఆత్మతృప్తి
నిష్కళంకపు ప్రేమను నిల్పి హృదిని
సకల జీవుల కుపకృతి సలుపకున్న
పుట్టి ఫలమేమి నరుడుగా పుడమియందు
ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు
సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!
96
Keep
దేవునెరుగునట్టి తెలివి ఒక్కటె చాలు
తత్తరంపు తెలివి తట్టెడేల?
దేవునెరుగనట్టి తెలివేమి తెలివయా?
ఉదర పోషణ కొరకు వట్టి తెలివి.
97
Keep
వాచామగోచరుండవు
నీ చరితములు పొగడ బ్రహ్మాదులకైన తరమా!
హే కృష్టా! కాచుకున్నాను నా మొర ఆలకించి బ్రోవుమయ్య
కాలుడుగొనిపోయిన గురుపుత్రుని తెచ్చి యిచ్చినావు
కాముని మదమణచినావు వసుదేవదేవకీ చెర విడిపించినావు
వెలదియొంటియైన ఆ ద్రౌపది 'హాష్ణా!కృష్ణా!' యని మొరలిడ
బ్రోచినావు మేలు పాండవులను గాచినావు.
కుచేలుని ఆర్తిదీర్చినావు
కురూపియైన కుబ్జ వక్రములను పోగొట్టినావు.
98
Keep
ఇక్షురసము కన్న ద్రాక్షరసము కన్న
పువ్వు కన్న పాప నవ్వు కన్న
మధురమోహనములు మాసాయి పలుకులు
శాంతి ప్రేమదాయి శ్రీసత్యసాయి
99
Keep
ఎట్టి విద్యలు జగతిని ఎరుగనట్టి
పక్షిజాతులు పశువులు పరమమైన
నీమమునుబూని జీవింప నేర్చియుండ
తెలివి కలిగిన మనుజుడే తెలివిదప్పి
బ్రతుకుచున్నాడు మనుజుకీ తెలివి లేదె
ఉన్నమాట తెసుపుచున్నమాట.
100
Keep
ఓంకార రూపుడు ఉపదేశకాయుడు
నవనీత చోరుడు నరసఖుండు
మోహనరూపుడు ముక్తి ప్రదాయుడు
భక్తార్తి శమనుండు భవహరుండు
గర్వాపహారుడు కమనీయ చేలుడు
వనమాలధారుడు భవహితుండు
తేజస్వరూపుడు ప్రేమస్వభావుడు
వారిజ నయనుండు కారణుండు
సుజన మానస చోరుడు సుందరుండు
దేవకీగర్భ రత్నంబు దేవకుండు
వాసుదేవుడు యదువంశ వర్థనుండు
భక్త హృదయాంతరుండు మీ తోడ నుండు.
101
Keep
మనసు, మాట, నడత మనిషికి ఒకటైన
సత్యవంతుడగును సరళితోడ
సత్యవంతు దైవ సాన్నిధ్యమందున
ఉండుచుండు పరమునొందుచుండు.
102
Keep
కోరు కోర్కెలవన్నియు తీరుచున్న
భక్తి దైవముపై హెచ్చు రక్తి పెరుగు
కోరు కోరికలన్నియు తీరకున్న
భక్తి తరుగును దైవ విరక్తి పెరుగు.
103
Keep
మంచి తలపులు మాటలు మంచి చేత
మంచి వినికిడి చూపులు మంచితనము
మంచి ఆరోగ్యమునిచ్చు మానవునకు
సత్యమును తెల్పు మాట ఈ సాయిమాట.
104
Keep
కారణమున కల్గు ఘనమోహ బంధంబు
మోహమందు పెరుగు మూర్ఖ బుద్ధి
మూర్ఖ బుద్ధియందు మురియును కర్మంబు
కర్మ ఫలము వలన కలుగు జన్మ.
105
Keep
మనసు బుద్ధి చిత్తమది అహంకారంబు
ఎందు పుట్టి పరిగె ఎందునణగు
అదియె శివుడు ఆత్మ అరయంగజూడను
మరువబోకుడిట్టి మంచి మాట.
106
Keep
భావమందు తుచ్ఛభావాలు వీడుటే
త్యాగమగును అదియె యోగమగును
ఆస్తి ఆలిని వీడి అడవికేగుట కాదు
సత్యమైన బాట సాయి మాట
107
Keep
ధనము దైవంబయ్యె దర్పంబె మతమయ్యె
స్వార్థమే బుద్ధికి స్థానమయ్యె
అహము ఫ్యాషను అయ్యె ఆశలందంబయ్యె
ధర్మంబు వమ్మయ్యె ధాత్రిలోన
దయయు హీనంబయ్యె నయము శూన్యంబయ్యె
కపటమే జీవుల కాంతులయ్యె
ప్రేమానురాగముల్ రోగాల పాలాయె
కామాంధులుగ జేసె కలిని చదువు
బ్రతుకు బరువయ్యె మతులకు గతులు తప్పె
జాగుచేసిన నేగతి జగతి కానో!
విద్య యందున నైతిక విలువ జేర్చి
భరత సంస్కృతిని మీరు బడయరయ్య.
108
Keep
ఏను దైవంబు తద్భిన్నమేమి కాదు
ఆ అఖండ పరబ్రహ్మమౌదు నేను
వ్యధయు క్లేశముల్ నన్ను స్పృశింపబోవు
సచ్చిదానందమేను తద్భిన్నమేమి కాదు
నిత్య తృప్తుడ భీతినన్ చేరబోదు
ఉల్లమా! పల్కుమోంత్సత్తంచునెపుడు.
109
Keep
పుట్టపైన మర్దించిన పాము మరణమొందునా?
తనువును తా దండించిన విషయభోగములుడుగునా?
ఆకలిదప్పులు మానినంత ఆత్మజ్ఞానియగునా?
తానెవరో తెలియకున్న తత్త్వజ్ఞానమెటులబ్బు?
110
Keep
సకల సద్గుణంబులు చక్కగా లేకున్న
వారు నరులు కారు వస్తవముగ
సదయుడుకాక సచ్చరిత్రుడెట్లగు?
ఉన్నమాట తలుపుచున్నమాట
111
Keep
సర్వ సద్గుణములు చక్కగా లేకున్న
వారు గురులు కారు వాస్తవముగ
సవినయుండు కాక సచ్ఛాత్రుడెట్లగు?
ఉన్నమాట తెలుపుచున్న మాట
562
Keep
ఆనాడె వేణువునై పుట్టియున్నచో
నీ మోవి మధువుల గ్రోలకున్నె
ఆనాడె తోమాలనై యెదనున్నచో
నీ స్పర్శ నన్నోచినేలకున్నె
ఆనాడె గోపినై యలరుచునున్నచో
నీ రూపు నా లోన నిండకున్నె
ఆనాడె గోపార్భకుండనై యున్నచో
నీ మైత్రి భాగ్యంబునొందకున్నె
నాడు కాజాలదింక ఈనాడు స్వామి
నీవు నాడును నేడును నీవె కావ
నాటి ప్రాప్తినియొసగి నన్నేలుకొమ్ము
బాలగోపాల వేణుగోపాలబాల
నన్ను కావుము దేవ శ్రీసాయిదేవ.
Previous
←
1982
Next
1984
→