Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His poems · 1984
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
112
Keep
తల్లికౌగిలికినై తారాడి తారాడి
ఎలుగెత్తి పసికూన ఏడ్చినట్లు
మంద లోపలనుండి మరలిన దూడకై
ఆవు అంబాయని అరచినట్లు
భర్త బాయగ కాంత విరహవేదన సొక్కి
మూలమూలలొదిగి మూల్గినట్లు
నిరుపేద ఆకట నీరసంబొందుచు
కూటికి అల్లాడి ఏడ్చినట్లు
సర్వము త్యజియించి స్వామి చింత చేసి
సాయి సాయి యంచు హాయి గనుడు
113
Keep
దోషచింతనమున దోషియౌ చిత్తంబు
సద్గుణంపు చింత శాంతి నిచ్చు
దైవచింతనమున దైవంబె యగునయా
ఉన్నమాట తెలుపుచున్న మాట.
114
Keep
సర్వ మృగములందు సామాన్య తెలివుండు
భుక్తిభోగమెల్ల పొందుచుండు
అట్టి నరుడు భువిని వట్టి మృగంబెగా
మనిషి కాడు వాడు మహిని పుత్ర!
115
Keep
నీటియందు పడవ నిలచియుండుట మేలు
నీరు పడవయందు నిలువ కీడు
జగములోన నిలచి జనులుండుటయే మేలు
జగము మదిని నిలువ జనము చెడును.
116
Keep
పాపపుణ్యములన పరదేశమున లేవు
తాను చేయు పనుల దగిలియుండు
వేపవిత్తు నాట వెలగవృక్షము కాదు
కర్మ ఫలము వలన కలుగు జన్మ.
117
Keep
గరిక పోచలు రావె గణనాథు పూజకు
ఇంతకంటెను హీనులైరి జనులు
కావుకావుమటంచు కాకి వేడగ లేదె
ఇంతకంటె నికృష్టులైరి జనులు
అంబఅంబాయని అరవదె లేలేగ
ఇంతకంటెను పల్చనైరి జనులు
రామరామాయంచు కామించదె చిలుక
ఇంతకంటెను తక్కువైరి జనులు
మానవులకంటె మృగములె మంచివేమొ
ఎంత విజ్ఞానముండియు ఏమి ఫలము?
మానవత్వము కోల్పోయి మనిషి నిలచె
ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు
118
Keep
గోపాల నీవు దృగ్గోచరంబవకున్న
గోవులు గరికైన కొరకవంట
నీ దర్మనము లేక నీవు చెంతను లేక
గోప బాలురు కూడుగుడవరంట
నీవగుపించక నీ సేవలును లేక
గోపికల్ నీరంబు గుడువరంట
నీ కథల్ వినకుండ నీ ముచ్చటల్ లేక
గోపకుల్ కంటన్ కునకరంట
నందనందన గోపికానన్యభక్తి
విశ్వ వ్యాప్తంబు దీనికి సాటి కలదె!
ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు
సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!
119
Keep
శిలల పూజలందు శ్రేష్ఠుడు నీవౌచు
ప్రజల మెప్పు కొరకు పాటుపడియు
ఇట్టి పూజలెల్ల ప్రజలు మెచ్చిరిగాని
శివుడు మెచ్చు సేవ చేయరయ్య.
120
Keep
మనసనునాయుధంబు మన మానవ జాతికినిచ్చె తొల్లి యీ
మనసును శిక్షలో నిలుపు మానవుడె విజయుండు భూమిపై
మనసుకు దాసుడైన మహి మానవుడెన్నడు శాంతిసౌఖ్యముల్
కనుగొన జాలినట్లు వినగల్గుట కల్గదు స్వప్నమందునన్.
121
Keep
చెంత చేర్చెననుచు సంతసించెదరన్న
వెంటనే ఎడబాసి చింతగూర్చు
ఏడిపించుట సాయి వేడుకయందురా
కడుపుబ్బ నవ్వించు నడుమ నడుమ
పొగడుచున్నాడని పొంగిపోయెదరేమొ
తప్పకప్పుడె ఎగతాళి చేయు
అభయమిచ్చెనుగాన హాయినుండెదరన్న
పడు బాథలకు అంతుబట్టకుండు
వెనుకకేగనీడు చననీడు ముందుకు
మనసు మరులు గొల్పి మధన పెట్టు
ఇట్టి చిన్ని సాయి చిన్మయమూర్తిని
ఎట్టులెలుగగలరు ఇలను మీరు.
122
Keep
సత్యధర్మప్రేమశాంతులు లేకున్న
విద్యలన్నియు నేర్చి విలువ సున్న
సత్యధర్మప్రేమశాంతులు లేకున్న
దానధర్మాల సార్థకత సున్న
సత్యధర్మప్రేమశాంతులు లేకున్న
పదవులనేలిన ఫలము సున్న
సత్యధర్మప్రేమశాంతులు లేకున్న
బహుళ సత్కార్య లాభంబు సున్న
ఈ సనాతన ధర్మ హర్మ్యంబు నిలువ
గుణములియ్యవి నాలుగు గోడలప్ప
ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు
సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!
123
Keep
ధనము రాసిగా పోసినా కానగరాని
ఆనందమును మీరందుకొనుడి
తీర్థయాత్రలు విల్లు తరిగినన్ కనరాని
ఆనందమును మీరందుకొనుడి
విద్యలన్నియు వల్లెవేసినన్ కనరాని
ఆనందమును మీరందుకొనుడి
ప్రాణముల్ బిగపట్టి నను కనరాని
ఆనందమును మీరందుకొనుడి
కాసు ఖర్చు లేదు కాయకష్టము లేదు
లేదు చదువు సాధనాది బాధ
మనసొకింత యిచ్చి మరి సాయికడనుండి
అందరాని ఫలము పొందరయ్య.
Previous
←
1983
Next
1985
→