Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His poems · 1985
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
124
Keep
మంచి చెడ్డ నడత మనుజులయందుండు
పైకి కానరాదు బయటపడదు
వారివారి నడత వారికేనిచ్చు
మరల జన్మమందు మార్గమిచ్చు.
125
Keep
ఇది నాదు మాతృదేశము
ఇది నా ప్రియ మాతృభాష ఇది నా మతమం
చెదగొట్టి నుడువనేరక
బ్రదికిన జీవి యొకడైన వసుధను గలడా!
126
Keep
మనసునాధారముగగొను మానవుండు
పశువు కంటెను హీనమై పతనమగును
బుద్ధినాధారముగగొను బుధజనుండు
పశుపతిగ మారునని పల్కె పర్తివిభుడు.
127
Keep
చిత్తశద్ధిని చేకూర్చు సేవకొరకు
జీవితము నంకితముజేసి చెలగు నరుడ
పరుల కొసగుచు నీ శక్తి బలము తుదకు
చివరి శ్వాసను వీడుమా సేవలోన.
128
Keep
ఆ గుణంబె గణించి ఆ అమరవంద్యు
డార్త జనుల పాలించ నవతరించె
అనాథనాథ శ్రీనాథ లోకనాథ
సచ్చిదానందమూర్తి పుట్టపర్తి సత్యసాయి
129
Keep
తనదు తప్పు తాను తరచును సుజ్ఞాని
పరుల తప్పులెల్ల పట్టువాడు
తనను తానెరుగడు తన తప్పునెరుగడు
ఇట్టి వాడు భువిని పుట్టనేల?
158
Keep
ఏ హృదయంబునొసగితివొ ఈశ నాకు
మగిడి దానినే యర్పింతు మహితమూర్తి
పరగ వేరేమిదెత్తు నీ అర్చనకును
అంజలి ఘటింతు అందుకోవయ్య నీవు.
Previous
←
1984
Next
1986
→