Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His poems · 1986
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
130
Keep
ఇంతకన్నను వేరేది యెరుకపరతు.
దేవుడెక్కడంచు దేవులాడెదరేల
హృదయమందు కలడు ఈశ్వరుడు
131
Keep
కన్నీరు తెప్పించు కన్నీరు తప్పించు
చిన్మయమూర్తి ఓ చిన్నిరామా!
పిచ్చిని పట్టించు పిచ్చిని పోగొట్టు
సచ్చిదానందుడు సాయిరామ!
జోగి భోగిగజేయు భోగి జోగిగజేయు
భాగవతాగ్నిని బాలరామ!
132
Keep
బహుళ విద్యలయ్యె వాంఛలు మితిమీరె
పలుకులందు హీరో పనికి జీరో
తెలివితేటలవల్ల కలుగు లాభంబేమి?
కొంచెమైన ఆచరించరయ్య!
133
Keep
కన్నులందు నెప్డు కారుణ్య దృష్టియే
పలుకులెపుడు ప్రీతులొలుకుచుండు
నగుమోము నిత్యమునమృత భావమే
హృదయమెప్పుడు ముదముగూర్చు.
134
Keep
సకలశాస్త్రపురాణ సంగ్రహవేత్తయై
వేదాంతవేద్యుడౌ విభుదుడైన
రక్తి యేపారగ రమ్యహర్మ్యంబుల
రహిమించు రాజచంద్రముడునైన
రణరరగమందు పరాభూతరిపుడౌచు
వెల్గొందు జగదేకవీరుడైన
దారిద్య్రదేవతా దాక్షిణ్యమున కుందు
దౌర్భాగ్య విభుడగు దాసుడైన
భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు
భక్తిలేనట్టి ఆ జగద్భర్త కన్న
భక్తిపరుడగు దాసుడే వంద్యుడగును
ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు
సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!
135
Keep
తల్లిగర్భాననుండి పుట్టినక్షణంబె
కెవ్వుకెవ్వున ఏడ్చెదరు నవ్వకుండ
ఏడ్చుటేలకో తెల్పెదిపుడు మీకు
దినదినమ్మును తెలిపెడి తెరగుచూడ
136
Keep
మాట చెప్పినట్లు మనజుండు నడచిన
మనిషికాడు వాడు మహితుడగును
మాట చెప్పినట్లు మనిషి నడువడేని
మనిషికాడు వాడు మృగమెగాని.
137
Keep
పంకజాక్షుని చింత పలుమారు సేయక
పరుల నిందించుట పాడికాదు
విష్ణుసంకీర్తనల్ వీనుల వినకుండ
పరుల స్తుతులజేయ భ్రాంతికాదె
శేషశయనుజాల చెలగి కీర్తింపక
పరుల కీర్తించుట భావ్యమగునె
దామోదరుని రూపు ధ్యానము చేయక
పరుల దూషించుట పాడియగునె
శ్రీరమానాథునెప్పుడు చిత్తమందు
తలచువారికి మోక్షంబు తధ్యమప్ప
ఇంతకన్నను వేఱెద్ది ఎరుక పఱతు
సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!
138
Keep
గొప్ప చదువుండి స్వల్పగుణంబున్న
ఖ్యాతి యేమి వాని కీర్తి ఏమి?
139
Keep
సకల వేదాంత గ్రంథాల సారమెల
ఒక్క వాక్యాన చెప్పుదు నొక్కసారి
సకల జీవులయందున్న ఆత్మ నేను
ఒక్కటేయని మనమున దలపరయ్య
140
Keep
మేనమామంచని మేలుగానెంచక
కంసభూపాలుని హింసజేసె
స్త్రీయని యింతయు చింతయే లేకను
తాటకి గాత్రంబు తరిగివేసె
బిక్షమడిగిన లేదనకిచ్చె బలియును
అతని పాతాళంబునకణగ ద్రొక్కె
ఏమందు దయలేని హరిని భువిని.
141
Keep
మనస్సుచేత జగము మరి ఉద్భవించును
మనస్సుచేత జగము మాయమాను
మనస్సుచేత ధర్మార్థకామమోక్షంబు చెలరేగు
మనస్సుచేత యోగసిద్ధి లభియించు.
142
Keep
మనసుచేత జీవి మరల జననమొందు
మనసుచేత జీవి మాయమగును
పుడమి మనసుచేత పురుషార్థములనొందు
మనసుచేత యోగ సిద్ధి మహిని పొందు.
143
Keep
వేసుకొందురు మీరు విషమిచ్చు విత్తనములు
ఆశింతురు నేడు అతిరుచ్యఫలములు
కాసిన కడు చేదుకాయలు తినలేక
దోషము తనపైన దోసి వాదింతురు.
144
Keep
జనుడు తనకు తాను నరుడనియే తలచినాడు
ఏదెరిగిన నరజన్మము సార్థకమౌనో తెలియదు
నరజన్మమునందు పుట్టి నరజన్మమునందు పెరిగి
నరసింగములైనవారు తొలి సంగతి మరచినారు
కులమత భేదములు పెంచి అసురత్వము స్వీకరించి
సమరాలను స్వాగతించి శాంతి సభలు జరుపుతారు
తనకొరకై బ్రతుకువాడు మనుజుడెట్లౌనురా?
145
Keep
కాగితంబునందు కల్గినయక్షరాల్
చదివినంత ధరణి చతురుడగున
అక్షరంబులందునర్థంబు నెరుగుచు
చదువునట్టివాడె చతురడగును.
146
Keep
మనసే హేతువు మనుజుని
మనుగడకును బంధమునకు మాన్యతకెల్లన్
మనసే ముఖ్యము ముక్తికి
మనసే దుఃఖమును తెచ్చు మైమరపించున్.
147
Keep
చాతకము కోరునేవేళ చంద్ర కాంతి
తుమ్మెదలు కోరు పూవుల తనివి గ్రోలి
రోగి కాక్షించు మందులు రచికరంబు
పర్తివాసుడు వాంఛించు భక్త జనుల.
148
Keep
అతి మధురమైన పండును చూచినపుడు
పరిమళమైన పుష్పాన్ని ధరించినపుడు
ఒంటరిగా ఒక యువతిని చూచినపుడు
యువకుడు యేరీతిగా యుండగలడు?
149
Keep
మనసునందు మంచి మాటలందున మంచి
నడతలందు మంచి పొడమకున్న
సాయి మిమ్ము మెచ్చి సంతోషమెటులిచ్చు?
శాంతి ప్రేమదాయి సత్యసాయి.
150
Keep
వివిధ శాస్త్రచయము వేదవేదాంగముల్
జీవి మనసు తెరను చీల్చలేవు
తెరకు యివల జీవి దేవుడవ్వల నుండు
కార్యమివలనవల కారణంబు
151
Keep
సత్శీలవంతుడైనటువంటి తండ్రికి
పతివ్రతయైనటువంటి తల్లికి
పుట్టినటువంటి ఏ మానవుడుకూడను
దీనికి చలించడు
152
Keep
సాయి యెట్లు మెచ్చి సంతోషమును యిచ్చు
తెలుపరయ్య మీరె చెప్పరయ్య మీరె
సాయి యెట్లు మెచ్చి సంతోషమును యిచ్చు
చెప్పరయ్య మీరె ఒప్పుకుందు
చెప్పరయ్య మీరె ఒప్పుకుందు
చెప్పరయ్య మీరె ఒప్పుకుందు!
153
Keep
బ్రహ్మాండమంతయు ప్రబలుచుండెడి తనకు
మూడడుగులనిచ్చుట ముఖ్యమగున
154
Keep
దానధర్మము లేక దయయు సత్యము లేక
మానసమున మంచి నీతి లేక
చెడుగుణములతోడ చెలగాడుచున్నట్టి
వానికిహము చెడును పరము చెడును.
దీన శుభము లేదు దివ్యకీర్తియు లేదు
జగతి బుట్టిపుట్టి చచ్చిచచ్చి
పొరలనేల మరల బుట్టని చావని
త్రోవ వెదకికొనుట దొడ్డబుద్ది.
155
Keep
తలచినట్టి పనులు తారుమారైన
చీకుచింతలేక చిరునవ్వుతోడ
వారిగుండెనిండి రసోవైసః
అను సూక్తి రంజిల్లునప్ప
156
Keep
తలపులందు వేరు దైవంబు కలడని
తలచి నరుడు తన్ను తానె మరచు
తలపులన్ని వీడ తానె దైవంబగు
తలపు భ్రాంతి వీడి తరలి రండు.
157
Keep
అన్నములు వేరు, ఆకలి ఒక్కటే
శృంగారములు వేరు, బంగారమొక్కటే
పశుల వన్నెలు వేరు, పాలు ఒక్కటే
జీవజంతులు వేరు, జీవుండు ఒక్కడే
పూలజాతులు వేరు, పూజలొక్కటే
దర్శనంబులు వేరు దైవమొక్కడే!
159
Keep
వాల్మీకి ఎవ్వని వంశమందలివాడు?
నందుండు ఏ పల్లెయందు పుట్టె?
ధర కుచేలుండెంత ధనవంతుడైయుండె?
గజరాజు ఏ విద్యగలిగియుండె?
వసుధ ధ్రువుండెంత వయసు కలిగియుండె?
శబరికినెంతటి శక్తియుండె?
విదురునకెంతటి వితరణమతియుండె?
తిన్ననికెంతటి తెలివియుండె?
భక్తి కలిగిన వారికి వశుడనయ్య
ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు
సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!
160
Keep
కర్మలందు జన్మ కలుగుచునుండును
కర్మమున సుఖము కలుగుచుండు
కర్మచేయుటకె కలిగె ప్రపంచము
సుఖము దుఃఖము యిలలో అస్థిరము
161
Keep
లోని శత్రువులకు లొంగిపోయినవాడు
బయటి రిపులనెట్లు పట్టగలడు?
తత్త్వమెరిగినంత ధన్యుడౌ నరుడిల
ఉన్నమాట తెలుపుచున్న మాట.
162
Keep
ఆత్మతత్వమెరుగ ఆనందమబ్బును
తత్త్వమెరుగకున్న తాపమబ్బు
బ్రహ్మమెరిగినంత బ్రహ్మమే అగునయా
సత్యమైన బాట సాయి మాట.
163
Keep
పాప భయంబు పోయె పరిపాటయిపోయెను దుష్కృతంబిలన్
శ్రీపతి భక్తిపోయె వివరింపగ లేని దురంత కృత్యముల్
దాపురమయ్యె లోకమున తాపసలోక శరణ్యుడైన ఆ
శ్రీపతి నామచింతనయె చేకురచేయు సుఖంబు మానవా!
164
Keep
కామితార్థంబిచ్చు కామధేనువు రాగ
ధనమిచ్చి యావును కొనగనేల?
మించెడి కాంతితో మేరు పర్వతముండ
వెండిబంగారుకై వెతలికేల?
కామిత ఫలమిచ్చు కల్పవృక్షమెయుండ
పెరటి వృక్షమునకై ప్రీతి ఏల?
భక్తిముక్తులనిచ్చు భగవంతుడిందుండ
పాడు సంసారము కోరనేల?
165
Keep
ప్రాచీన ఋషులకు పాఠముల్ నేర్పింప
జాలిన వేదాంత సారమతులు
నిర్జీవ శిలలచే నృత్యమాడించెడి
నేర్పు కల్గిన కళానిపుణమతులు
పరవీరశిరములు బంతులాడించుచు
క్రీడింపగలిగిన వాడిమగలు
సర్వసర్వంసహా చక్రపాలనజేసి
నడిపించగలిగిన నాయకులును
కలరు భారతభువిని పెక్కండ్రు చూడ
ఉండి ఫలమేమి వారిలో ఒక్కరైన
అనుదినంబును వినిపించు ఆర్తరవము
ఆలకింప దలంపరో ఆర్యులార!
166
Keep
వెండి బంగారులకై వెదుక నేల?
భక్తి, భుక్తి, ముక్తి నిచ్చెడి పరమాత్మ నేనుండ
పాడు చదువులనెల్ల కోరనేల?
167
Keep
సద్విద్య చదివించి శాంతిని బోధించి
ధర్మము నేర్పెడి తండ్రి తండ్రి
సన్మార్గమును చూపి సభ్యజీవనమిచ్చి
దైవభక్తిని తెల్పు తండ్రి తండ్రి
స్వార్జితంబులనంత చక్కగా పంచిచ్చి
తత్త్వంబు గరపెడి తండ్రి తండ్రి
సత్కుమారునిజూచి తనలోన సంతృప్తి
పొందు మహాత్ముడౌ తండ్రి తండ్రి
అట్టి తండ్రిని గన్నట్టి అమరసుతుడు
అంకితంబగు ఆత్మకు శంకలేక
ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు
సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!
168
Keep
సాయికున్నట్టి ఐశ్వర్యసంపదలకు
సాటి ఐశ్వర్యమున్నదెచ్చోటనైన
సాయి ఐశ్వర్యమేమన్న స్వార్థరహిత
నిత్యనిర్మల ప్రేమయె నిజము నిజము
169
Keep
అడవిలోననున్న ఆకాశమున నున్న
పట్టణమున నున్న పల్లెనున్న
గుట్టమీద నున్న నట్టేటనున్నను
మదిని సాయి నిన్ను మరువడెపుడు.
170
Keep
తొమ్మిది చిల్లులుండు తోలు తిత్తియెగాని
కాంతి కలుగు వజ్రఘటము కాదు
నిముష నిముషమునకు నీచులూరునెగాని
పునుగు జవ్వాదీలు పుట్టబోవు
171
Keep
అర్థబలము అంగబలము
భక్తిముక్తుల నేర్చేకు పనికిరావు
విద్యాబలము కూడ కానరాదు
172
Keep
మానవాకారముండిన మనుజుడగున
సద్బుద్ధులే మనుజుని సత్యరూపు.
173
Keep
అరువది నాలుగు విద్యలు
అరుదారగ నేర్చినట్టి యా నారదుడే
నిరవధిక శాంతి కనుగొని
పరమానందము నాడు పొందడు గాదే.
174
Keep
కనులుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన
నీ మూర్తి దర్శింపనేరరైరి
చెవులుండి చెవుటులై అతి మనోహరమైన
నీ వాక్కు లాలింపనేరరైరి
పాణిపంకజమందు పర్తీశుడున్నను
పాడు సంసారము కోరుచుంద్రు
మించెడి కాంతితో మేరు పర్వతముండ
వెండిబంగారుకై వెదకుచుంద్రు
విశ్వ హృదయమందు వినిపించు ప్రణవంబు
వినుడు శ్రద్ధతోడ వీనులలర
కామ్యముక్తులనిడ కల్పకంబిదె సుమ్మి
మరువబోకుడిట్టి మంచిమాట.
175
Keep
పెక్కు విద్యలు నేర్చిన ఒక్కడైన
సరస సద్గుణవంతుడై సాధుబుద్ధి
సత్యవర్తనంబు సాధుసత్వగుణము
గడపనేర్చిన విద్యార్థి కలడె యిలను?
Previous
←
1985
Next
1987
→