Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His poems · 1988
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
222
Keep
జిడ్డునెవ్విధి జిహ్వను జేరనట్లు
బురదనెవ్విధి కమలము చేరనట్లు
దేనినంటక యుండుటె ఆత్మయగును
223
Keep
మహిని సర్వము ఈశ్వర మయము కనుక
నాదియను మమత్వంబు వ్యర్ధంబుగాదె
అనర్ధంబు గాదె.
224
Keep
పలికి బొంకని వాడె పో పండితుండు
ఆడి తప్పని మనుజుండె అర్చకుండు
ఆశ వదలిన వాడె పో ఆత్మబలుడు
సత్యమును తెల్పు మాట ఈ సాయి మాట.
225
Keep
చీడపురుగు చేరి కొమ్మరెమ్మల నంత చెడగొట్టు
కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా.
226
Keep
బహుళ విద్యలన్ని పాకశాస్త్రముబోలు
వంటకములబోలు భక్తియొకటె
వంటకములు వీడి పాకశాస్త్రమదేల!
వినుము భారతీయ వీరసుతుడ!
227
Keep
వంటకమును బోలు భక్తి ఒకటె
వంటకంబు వదలి పాకశాస్త్రమదేల
భక్తి వదలి వేరు ఆసక్తి యేల
228
Keep
తల్లి కంటె మిగుల దైవంబె దగ్గర
తండ్రి కంటె చాలా సన్నిహితుడు
229
Keep
భానుతేజముకంటె భాసిల్లుచుండును
మంచుతెలుపుకంటె మించియుండు
ఆకసంబునకంటె అతి సూక్ష్మమైయుండు
సర్వ జీవులలోన పర్వియుండు
పరమాత్మ లేనిది పరమాణువును లేదు
అంతటనిండి తానంటకుండు
పరమాత్మ సందర్శ భవ్యవికాసము
నిఖిల లోకాలలో నిండియుండు
బ్రహ్మమందు మీరు మీలోన బ్రహ్మంబు
మీరె బ్రహ్మ బ్రహ్మ మీరెయయ్యు
బ్రహ్మమయులు మీరు బ్రహ్మమేయగుదురు
కాని మోహవశత కానరైరి.
230
Keep
పుట్టునప్పుడు నరుడు గిట్టునపుడు
ధనము ఎచ్చటి కేగు తానేగు నెచ్చటికి
తెలుపరయ్య మీరు తేటముగను.
231
Keep
వెక్కిరింపుకొరకు మొక్కినవారెల్ల భక్తిపాతమునకు బద్ధులౌదురు
దద్దరిల్లిపోవు పలికించినంతనే వుద్భవించు భక్తి వుల్లమందు
ఎవరెవరు నిన్ను విమర్శిస్తున్నారో వారందరు భక్తులుగా మారిపోతారు
232
Keep
తిండికోసము పెక్కు తిప్పలు పడుచుంద్రు
ప్రకతి సుఖములనెల్ల పొందగోరు
చేర దైవముకడ చేయరు యత్నము
ఉన్నమాట తెలుపుచున్న మాట
233
Keep
ఇక్కడ అక్కడ ఎక్కడ చూచిన
ఒక్కడే ఆత్మలో మక్కువ ఉండును.
234
Keep
అతిగ భాషించు శూరత్వమధికమయ్యె
కార్య శూరత శూన్యమై కరగిపోయె
బ్రతుకులాడంబరాలతో భారమాయె
నేటి విద్యార్థి బ్రతుకులీపాటివాయె.
235
Keep
ఆత్మవిద్యలు క్షీణించె అవధిలేక
సత్యధర్మంబు అడుగంటి సమసిపోయె
సంకుచిత హృదయులైరి
ఈనాటి విద్యార్థులంత
236
Keep
ఆధునిక విద్య పెరిగెను అవధి లేక
ఆత్మ తేజము క్షీణించి తరిగిపోయె
బ్రతుకు ఆడంబరాలతో భారమాయె
నేటి విద్యార్థి బ్రతుకు యీపాటిదాయె.
237
Keep
కృారమృగముదెచ్చి కూర్మితోబెంచిన
ఆకలయ్యెనేని అదిమి పట్టు
దుష్టగుణంబులుగల దుర్జన స్నేహంబు
కృారమృగము కంటె ఘోరమగును.
238
Keep
తగదు తగదు ధనదాహము నరుడా
మంచి బుద్ధితో మానుము కోర్కెలు
కర్మ ఫలితమే కదరా విత్తము
కలిగినంతలో కనరా తృప్తిని.
239
Keep
యం.యేలు బియ్యేలు ప్యాసయి వచ్చియు
పేరుగాంచిన పెద్దవారలైన
సంపదలుండియు సద్దాన పరులయి
పుడమి కీర్తి గనిన పుణ్యులైన
ఆయురారోగ్యంబు లనవరతమునుండి
పరిపూర్ణ బలులగు వారలైన
సతతంబు తపములు జపములు సేయుచు
వేదంబులను నేర్పు విప్రులైన
సాటిరారు భక్తులకు నేనాటికైన
దైవమును కొల్వనిదె రాదు భక్తి
దైవ భక్తులు కానిదే రాదు ముక్తి
ఇంతకన్నను వేరెద్ది ఎరుకపరతు
సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!
240
Keep
ఉపకారము చేయని జీవితంబు
కారము లేని వంట
ఆకారము లేని యిల్లు
మమకారము లేని జీవితము
ప్రాకారము లేని మందిరము
ఓంకారము లేని మందిరము
వికారముగానుండు చూడరె!
241
Keep
జగతి జీవించువాడు మనుజుడు కావలె మొదట
దనుజుల దుష్క్రృతములనెల్ల పొడుచుండు వాడె చవట
బ్రహ్మవిద్య నేర్చి యిచట ఆధ్యాత్మను కనుగొనుట
రాజయోగమునకు బాట అదియె శృతులు చెప్పుమాట.
242
Keep
పరుగు జీవితములె పరిపాటి కలిలోన
పరుగులిడకయున్న పనులు చెడును
బస్సులు సినిమాలు పరుగులకే చిక్కు
ఉన్నమాట తెలుపుచున్న మాట.
243
Keep
మనసొకచో నిలువదాయె ఏమి పాపమో
మర్కటమై తిరుగసాగె ఏమి శాపమో
ఇది నాది అది నాదను తాపత్రయమెక్కువాయె
నిలకడన్నదేలేక నిధిపైనే మనసాయె
మనసొకచో నిలువదాయె ఏమి పాపమో
మర్కటమై తిరుగసాగె ఏమి శాపమో
మల్లెపూవులాంటి మనసు నీ పదములకర్పితము
కలకాదు నిజము ఈ జీవితమే సమర్పితము
244
Keep
దిన దినమునకు ఎందెందుకో ఏడ్చుతారు
ధర్మగ్లాని కలుగుచుండ వుద్ధరింప యేడ్చినారా.
అర్థముకాని యేడ్పులంతా యేడ్పుకోసం యేడ్చినార.
246
Keep
పొట్టచూడ మలమూత్రముల గుంత
దేహము చూడ కంపుగొట్టె దిబ్బ
ఆత్మకు యిదియె అద్దెకొంప
247
Keep
తల్లి సేవ మదిని తగిలిన తనయుడు
వాని పాపమెల్ల వదలుచుండు
శివుడు మెచ్చు తనకు చిరకీర్తి నందించు
దుఃఖరాసినెల్ల తొలగచేయు.
248
Keep
పూలమొక్కలు నాటిన పూలు పూయు
ముండ్ల మొక్కలు నాటిన ముండ్లు పొడువు
మంచి చెడ్డలు యివ్విధి వుండె యిలను.
249
Keep
ఎన్ని విద్యలైన ఏపారి చదివిన
పొట్టకూటికైన గిట్టబోవు
మట్టిబొమ్మలోని మర్మంబు తెలుపని
చదువులెల్ల పరము చేర్చగలవ
250
Keep
తత్త్వమడుగంటె సినిమాలు తలకుబట్టె
ఒప్పులన్నియు సంఫూన తప్పులయ్యె
యుక్తి కేంద్రాలుగా మారె భక్తియందు
సత్యమును తెల్పు మాట శ్రీసాయి మాట.
251
Keep
దుష్టగుణములు వదలిన శిష్ఠుడగును
చింత వదలిన దొరకును చిత్తశుద్ధి
త్యాగగుణమున్న స్వచ్ఛందతత్త్వమబ్బు
మరువబోకుడిటువంటి మంచిమాట
252
Keep
భావసంశుద్ధి కలుగుటే భక్తియగును
పుణ్యకార్యాలు చేయుటే పూజయగును
పరులకుపకార మిడుటె తపంబులగును
మరువబోవకుడిటువంటి మంచిమాట.
253
Keep
జీర్ణకోశాలు దేహాన జేర్చునెవరు?
జనన మరణాలు ఎవరిచే కలుగుచుండు?
వారినెరుగంగ నేర్చుటే జ్ఞానమగును
మరువబోకుడిటువంటి మంచి మాట.
254
Keep
మన జాతి ఒక్కటే అది మానవజాతి
మన ఆరాధన ఒక్కటే దైవము
మన కులము ఒక్కటే అదే మానవకులము
మన భాష ఒక్కటే అరీ హృదయభాష
255
Keep
ప్రేమ సేవలు రెండు రెక్కలు మనకు
పక్షమై విహరించు పక్షివోలె
ఆ విహంగ మార్గముననుసరించి
చేరవలయును గమ్యంబు శ్రీఘ్రగతిని
256
Keep
ఆకుపచ్చ పక్షులన్ని చిలుకల వలె పలుకునా?
పూవులపై పారాడెడు పురుగులు తుమ్మెదలగునా?
పులిచర్మముగప్పినట్టి గాడిద తా పులియగునా?
ఏనుగంత బలిసియున్న పంది ఏనుగగునటయ్యా?
257
Keep
నీటియందె పుట్టి నీటనే తేలుచు
నీటియందడంగు నీటి బుడగ
నరుడు బుద్బుదంబు నారాయణుడు నీరు
ఉన్న మాట తెలుపుచున్న మాట.
258
Keep
నేను నేనుగా ఉన్నంత నీవుగావు
నీవునీవుగా ఉన్నంత నేనుగాను
నీకునాకును యిందులో నెలవు లేదు
ఉన్నదొక్కటె హృదయంబు ఎన్నగాను.
259
Keep
బ్రహ్మాండమంతయు బొజ్జలోనుండంగ
భక్ష్యభోజ్యము నాకు పెట్టనగునె
సర్వజీవులయందు సంచరించెడి నాకు
సరియైన పేరిడ సాధ్యమగున
సర్వజలంబుల సంచరించెడి నాకు
స్నానంబు చేయింపనలవియగున
కోటిసూర్యుల కాంతి మేటి కల్గిన నాకు
ప్రమిద దీపమునెట్లు పెట్టగలరు
అజహరాదులకైనను అందనట్టి
ఇట్టి నా రూపు కనుగొన నెవరి తరము
ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు
సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!
260
Keep
భక్ష్య భోజ్యములు పెట్ట తగున
వసుధ తెలుపుచు నున్నది సాయిబాబ యనుచు
వసుధ తెలుపుచు నున్నది శ్రీరామ యనుచు
వసుధ తెలుపుచు నున్నది శ్రీకృష్ణయనుచు
వసుధ తెలుపుచు నున్నది జీసస్సు అనుచు
వసుధ తెలుపుచు నున్నది అల్లా యటంచు
వసుధ తెలుపుచు నున్నది జోరాష్ట్ర యనుచు
వసుధ తెలుపుచున్నది శ్రీ బుద్ధుడనుచు
261
Keep
ముడుపులందుచు ధనమును మూటగట్టి
బిచ్చగానికి మెతుకైన పెట్టకుండ
వెంకటేశుని హుండిలో వేయు లోభి
సత్యమును దెల్పుమాట ఈసాయిమాట.
262
Keep
సేవ చేయునట్టి సేద్యంపు పశువును
చేరి చితక కొట్టు చిత్రముగను
రాతిఎద్దును చూచి రక్తితో పూజించు
ఉన్నమాట తెలుపుచున్న మాట.
263
Keep
నగలు పెట్టిన కోతికి సొగసు రాదు
కన్ను విప్పిన అంధుడు కనగలేడు
భక్తి కలుగదు మూర్ఖునకు యుక్తిచేత
ఉన్నమాట తెలుపుచున్నమాట
Previous
←
1987
Next
1989
→