Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His poems · 1993
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
398
Keep
క్రమము తప్పక మింట ప్రతిదినంబును భాను
డుదయాస్తమయముల నొందనేల?
గగనంబునకు కాంతికైసేయు తారలు
పగలు మాత్రము దాగు భంగియేల?
క్షణమైన విశ్రాంతిగొనక తా పవనుండు
జీవకోటుల బ్రోవ వీవనేల?
అనిశంబు కలకల ధ్వనుల నవ్వుచు నది
సలిలమై ప్రవహించు చందమేల?
ప్రకృతిలొనెందు చూచిన భ్రమయె ఏల?
భువిని ధన కుల మత జాతి భేదమేల?
ఎవరియానతి యిది ఎల్లనిట్లు జరుగు
నతడెయితడని యీతడెయతడనుచు
సర్వులకధిపతి యనుచు కాంచరయ్య!
399
Keep
వాన వచ్చినంత వసుధపై పండునె
ఫృధ్వి నాటకున్న విత్తనములు
విత్తనంబు నాట వెలయెంత పెట్టినా
వాన లేకయున్న ఫలము సున్న.
400
Keep
దైవభావంబు హృదయాన తలపనీక
రెండు దోషాలు వెంటాడుచుండు నరుని
తనదు లక్షల దోషాలు దాచుకొనుచు
పరుల దోషంపు నలుసును బయట పెట్టు.
401
Keep
తనదు బాగు కోరి తత్త్వంబు బోధించు
గురుడు తిట్టవచ్చు బాగ కొట్టవచ్చు
తల్లి బుగ్గ గిల్లి త్రాపును మందును
మరువబోకుడిట్టి మంచి మాట.
402
Keep
రేయింబవళ్ళు సాయంపొద్దులు
చలివేసవులు సారెకు మారును
కాలక్రీడల గతిచేనాయువు
అయినా వదలదు ఆశావాయువు.
403
Keep
యోగియైనను మరి భోగియునైనను
సంసారైనను సన్యాసైనను
స్వాంతము సత్యముననుభవించితే
యానందమె ఆనందమునందము.
404
Keep
తామర మొగ్గరంబు బలదర్పిత శాత్రవ గర్వ భంజనో
ద్ధాముడు కుంభజుండు మరి దానిని పన్నిన వాడు భీష్మ సం
గ్రామము భార్య గర్భవతి కాలమెటుండునో చెప్పలేము మీ
మామయు తండ్రి లేరిచట మానుము నీ తలపింక పుత్రకా!
405
Keep
వెఱువక కుంభజాతి కురువీరులపై మృగరాజువోలె
నేనుఱుకుచునుండ ఖండనికరోన్నత దివ్యమహాస్త్రపంక్తి నిం
బఱుపుచు గెల్చి రమ్ము సుత భద్రము నీకగునంచు పల్కకీ
తెఱగున పోకుపోకుమని తీవ్రతనాపుట నీకు పాడియా!
406
Keep
లెమ్ము థనుంజయా! విధి బలీయము ధర్మము గెల్చు
నిల్చు సత్యమ్ము, నశించు స్వార్థము సదా యుగధర్మమిదే కదోయి క
న్గొమ్మిక నంత్యకాలమున నూర్గురు బిడ్డల తండ్రికైన పిం
డమ్మిడు దిక్కుకల్గ రకటా! గ్రహచారము తప్పివచ్చినన్.
407
Keep
నీతినియమాలు నరునకు ఖ్యాతినిచ్చు
బాల్మందున యవియన్ని పట్టుబడును
నీతిబోధలు చేసెడి నిజగురువు
ఆత్మయె బ్రహ్మము బ్రహ్మయె ఆత్మయు.
408
Keep
దానముగాని యజ్ఞసముదాయముగాని
గానముగాని తపంబుగాని విజ్ఞానముగాని
తేజిత సత్యసంధాముగాని మరి యేదైనన్
దమంబుకు పురుడు రాదు విచారించి చూచినన్
చర్చించి చూచినన్ శోధించి చూచినన్.
Previous
←
1992
Next
1994
→