Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His poems · 2000
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
515
Keep
చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు
ఆదిమధ్యాంత రహితుడనాదివాడు
తాను పుట్టక చావక చంపబడక
ఆత్మరూపుడై అంతట వెలసియుండు.
516
Keep
శ్రీపుట్టపర్తి నిలయుడు
కాపాడును నిన్నునెపుడు కరుణాకరుడై
చేపట్టి నిన్ను బ్రోచును
ఏపట్టున విడువకుండ ఏలును నిన్నున్.
517
Keep
ఐకమత్యమె సుఖమందరి క్షేమంబు
ఎంత కార్యమైన నెగ్గవచ్చు
చిన్న చీమలన్ని సర్పంబునున్బట్టి
చంపుచుండలేదె జగతియందు.
518
Keep
కొన్న కూర బేడ కూలియా పావలా
ఇదియె నాగరికత యిపుడు మనకు
ఎవరి పనులు వారు ఏమరకుండగ
నిర్వహించుకొనుట నేర్వవలయు.
519
Keep
ఏ ప్రేమ శక్తిచే నీ ధారుణీ చక్ర
మిరుసు లేకుండగా తిరుగుచుండు
ఏ ప్రేమ శక్తిచే నెల్ల నక్షత్రాలు
నేల రాలక మింట నిలచియుండు
ఏ ప్రేమ శక్తిచే నీ పుడమి బడక
కడలిరాయడు కాళ్ళు ముడుచుకొనియె
ఏ ప్రేమ శక్తిచే ఏడేడు లోకాలు
గాలి దేవుడు సురిటీలు విసరె
ఆ మహా ప్రేమ శక్తియే ఆత్మ శక్తి
అద్భుతమనంతమద్వితీయమగు శక్తి
నిండియున్నది బ్రంహ్మాండ భాండమెల్ల
ఈ మహా సృష్టియంతయు ప్రేమమయమే.
520
Keep
రమణీ శిరోమణులు రావచ్చు, పోవచ్చు
శాశ్వతమైనది సత్య మొకటె
రాజ్యభోగములన్ని రావచ్చు, పోవచ్చు
శాశ్వతమైనది సత్య మొకటె
భ్రాతలు, బంధువుల్ రావచ్చు, పోవచ్చు
శాశ్వతమైనది సత్య మొకటె
అధికార భోగముల్ రావచ్చు, పోవచ్చు
శాశ్వతమైనది సత్య మొకటె
521
Keep
సత్యమే సరస సన్మార్గ తత్త్వము
సత్యమే సకల సౌభాగ్యదాయకమ్ము
సత్యమే అమృతత్త్వమునకు మార్గము
సత్య మొక్కటె జగతిలో శాశ్వతమ్ము!
Previous
←
1999
Next
2001
→