Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His poems · 2001
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
522
Keep
సుఖమునందున దుఃఖంబు జొచ్చియుండు
వీని విడదీయ నెవ్వరివశము కాదు
ఎద్ది సుఖములనిచ్చునో అద్ది దుఃఖ
ములిడు, సుఖదుఃఖము రెండు కలిసియుండు.
523
Keep
చెడు పలుకవద్దు, మంచినే పలకండి
చెడు వినవద్దు, మంచినే వినండి
చెడు చూడవద్దు, మంచినే చూడండి
చెడు తలచవద్దు, మంచినే తలచండి
చెడు చేయవద్దు, మంచినే చేయండి
దివ్యత్వానికి ఇదే రాజమార్గం!
524
Keep
సంస్కారమే లేని చదువెంత ఉండినా
గలిగించునే మీకు గౌరవంబు?
నీతియే లేకున్న నియమంబు లేకున్న
కలుగునే మీకిల గౌరవంబు?
హద్దులు మీరిన అధికారబలమున్న
కలుగునే యిలలోన ఘనత మీకు?
ధర్మమార్గము వీడి ధర్మంబు బోధింప
మర్యాదనిత్తురే మహిని మీకు?
పాపభీతియు లేనట్టి భావమందు
పాప పనులను చేయక ప్రకృతియందు
ఇంకనైనను ఈ సత్యమెరిగి మీరు
భరతపుత్రులమని పేరుబడయరయ్య.
525
Keep
గుండెలోన ప్రేమ పండించుకొనుచున్న
అతడె క్రైస్తవుండు అతడె శిఖ్ఖు
అతడె హైందవుండు ఆతడే ముస్లిము
అతడె మానవుండు అతడె గురువు.
526
Keep
నిద్దురనుండి లేచి మరి నిద్దుర పోయెడుదాక పొట్టకై
హద్దును పద్దు లేక వ్యయమందగ జేయుచు జీవితంబు నీ
విద్దెల ధారపోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ
పద్ద సుఖంబు నొందితివొ ప్రీతిగ యోచనచేయు మానవా!
527
Keep
మంచిమాట వినరు మనసిచ్చి చెప్పిన
చెడ్డమాట ముందు చెవిని పడును
ఇట్టివారు నన్ను ఎరుగంగనేర్తురే
ఎట్టి తెలివియున్న ఏమి ఫలము?
528
Keep
గుండెలదరునట్టి గొప్పసంపదలేల?
కోర్కెలదిమిపట్టు కూలి మేలు
పూర్ణ సుఖము లేదు పూర్ణ దుఃఖము లేదు
ద్వంద్వబద్ధమైన ధరణియందు.
529
Keep
ప్రవహించు నేపురి పరిధిగా పాయలై
చిత్రావతీనది చిత్రగతుల
క్రాలునీ పట్టణ కళ్యాణకరముగా
చుట్టును మేలైన చూతతరువు
కాన్పించు నేపురి కడలివంశమునందు
పార్వతీశ్వరుడెప్డు బాయకుండు
కొలువుండు నేపురి విలసితంబగు మధ్య
మహిమాన్వితుండైన సాయివిభుడు
మండలావని గణుతించు మెండుమహిమ
చిక్కవడియలు కట్టిన చెఱువు తోడ
బుక్కరాయల చిరకీర్తి భువనమెంచ
పొసగ చాటునేపురము పుట్టపురము.
530
Keep
తలచినట్టి పనులు తారుమారైనచో
తొణక వలదు ఎవరు బెణక వలదు
చీకుచింత వీడి చిరునవ్వు నవ్విన
అతని గుండె పండినట్టి గుండె.
531
Keep
దూషణంబు హింస దూరంబుగానెట్టి
ప్రేమభావమును పెంపుజేసి
సర్వమేకమన్న సద్బుద్ధి కల్గిన
జనులె భూమిని స్వర్గముగ మార్చు.
532
Keep
దూషణములనెల్ల దూరంబుగానెట్టి
ప్రేమభావములను పెంపుచేసి
సర్వమేకమన్న సద్బుద్ధి కలిగిన
జనులవలన భూమి స్వర్గమగును.
Previous
←
2000
Next
2002
→