సత్యధర్మము శాంతిప్రేమలతోనీ నిత్యజీవనయాత్ర సాగించుయత్నప్రయత్నముల్ మానవ ధర్మముజయాపజయములు దైవాధీనము. | |సత్య | |భక్తితోడ భగవంతుని తలచుచు నిత్యకర్మములు నిర్వర్తించినఅట్టి జనకునకు రాజయోగమున అందరాని మోక్షము అందెనే. | |సత్య | |అష్టసిద్ధుల సాధనెందులకు అది వట్టి భ్రమలతొ కట్టివేయునుగాదట్టమైన ఈ జీవితాటవిలో వట్టి నామమె పట్టపగలౌ. | |సత్య | |హృదయభూమిని సాగుచేయండి మీ మనసు వడకగ గుణములే ఎద్దుల్వివేకమను చెలకొలను తీసి విశాలమగు మీ హృదయము దున్నుడు. | |సత్య | |మానవ ధైర్యము మంచి ఎరువుగా ప్రేమధారలె పంట విత్తులుగభక్తే వర్షము భావమె కలుపులు బ్రహ్మానందమె పండెడు పంట. | |సత్య | |ప్రకృతి ధర్మము పట్టు విడకండి కర్మయోగమె జన్మ ధర్మంబుస్మరణే మానవ జన్మ రహస్యము సాధనే భక్తుల సారలక్షణము | |సత్య | |కష్టసుఖములు ఖర్మలనకండి మన ఇష్ట లోపమె కష్టమౌనండిపట్టు విడక ఆ పాదము కొలిచిన గట్టు చేర్చుట తన పట్టేను. | |సత్య | |మొదటి పట్టును విడువబోకండి ఆది పట్టులోనే భక్తి పట్టండిఎన్ని బాధలను పొందిన భగవ చ్చింతన మాత్రము విడకండి. | |సత్య | |ఎదను విడడు ఎడబాయలేడు మిమ్మేలుచుండు ఏవేళలాకరుణే అతడు అతడే కరుణని కరుణకె కాచి పొందండి. | |సత్య | |
In plain words
With Satya, Dharma, Śānti and Prema, carry on your daily journey of life; effort upon effort is man's Dharma; victory and defeat are at God's disposal. (With Satya …) Thinking of the Lord with Bhakti, performing his daily karmas, to that Janaka, through rāja yoga, came Mokṣa, which is so hard to reach. (With Satya …) Why the sādhana of the eight siddhis? It ties you up in mere delusions; in this thick jungle of life, the bare Name is the full light of noon. (With Satya …) Till the field of the heart, your mind as the plough, the guṇas as the oxen; digging the field tank of Viveka, plough your spacious heart. (With Satya …) Let man's courage be the good dung, and the streams of Prema the seed for sowing, Bhakti the very rain, feelings the weeds, and Brahmānanda the harvest that grows ripe. (With Satya …) Do not let go your hold on the Dharma of Prakṛti; karma yoga is the Dharma of birth; remembrance is the secret of human birth; sādhana is the true hallmark of devotees. (With Satya …) Do not call hardship and happiness your karma; the absence of what we wish for is what turns to hardship; if you worship those feet without letting go, to bring you to the shore is His own vow. (With Satya …) Never loosen your first grip; seize Bhakti with that very first grip; whatever pains befall you, only do not abandon the thought of God. (With Satya …) He will not quit your heart; He cannot stay apart from you; He governs you at every hour; 'Compassion is He, He is compassion': keep watch for that compassion and win it. (With Satya …)