Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His songs · 1988
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
27
Keep
రఫుపతి కార్యంబీడేర్చిన కపిరాజ శిఖామణి యితడయ్యా!
అధములు పురిగొని జగముల వెలసిన హనుమత్కరుడు యితడయ్యా!
పరిపరి లంకాపురమునుజొచ్చి పురమరసిన వాడితడయ్యా!
పరిపరి విధముల జానకి వెదకిన అమిత పరాక్రముడితడయ్యా!
28
Keep
నవలిగె ఫించవను బరదెవరు యారు
పవళద లతెగె కెంపిట్టెవరు యారు?
29
Keep
పండితుడని బిరుదొచ్చినగాని - పాపిష్టోడని అన్ననుగాని
దేవుని వదలకురా - ఉన్నది దైవము ఒక్కడురా.
నిందకు లోబడి నిలచినగాని - నిండుచదువులే చదివినగాని
నిండు కుండవై యుండుమురా - నీవు ఎండని కుండగ వుండకురా.
దైవము వదలకురా - ఉన్నది దైవము ఒక్కడురా.
30
Keep
నిను నేమరచితి స్వామి - నీ పదములనే నేమరచితినే
నిను నేమరచితి స్వామి.
పసితనమందున తెలియక కొంత - పెరిగిన పిమ్మట సంసార చింత.
వృధా అగునయ్యా యీ కాలమంతా - నీ పదముల చేరుట నామనోచింత.
31
Keep
నీ పది తలలు వూడే తీరు నీవిప్పుడు చేసె దర్బారు చూడు
యిది కదా నేను చూడవలెనని యింద్రజిత్తు చేత చిక్కితి
పదే పదే నీకేల చెప్పుదు ప్రాణములు నీసొమ్ము కాదురా
32
Keep
బుద్ధి చెప్పెద రావణా! ఈ లంక నీకింక లేదుర దుర్గుణా
బుద్ధి చెప్పెద వినుము నీవిక సద్దుసేయక నాదు పలుకులు
బుద్ధికిని యోచించక చావుకు బద్ధుడైతివి పాపమతివై |
బుద్ధి |
లోకములకు తల్లిరా! ఈ సీతమ్మ నీకు చూడగ తల్లేరా
లోకమాతను తెచ్చి యిప్పుడు పాతకమునకొడిగట్టుకుంటివి
ఏక శరమున నీదు శిరములు ఏకమారుగ త్రుంచు రాముడు |
బుద్ధి |
సీతతొ భాషించితి రాముల చేతి ముద్దుటుంగరమందించితి
పాతకుడ! నీ వనముగాచిన పలు రాక్షసవీరులజంపితి
కోతినంచు నాతో పోరి యమపురి పాలాయె దైత్యులు |
బుద్ధి |
33
Keep
నిన్ను యెందు వెదకుదురా! రామ నిన్నెందు వెదుకుదురా
నిన్ను నేనెందు వెదుకుదురా!
34
Keep
దైవనామమను మిఠాయి యిదిగో రండి భక్తులార!
వేదసారమను గోధుమ పిండితో
వేదవాక్యమను క్షీరము పోసి
ఆధారమైన పెద్ద బాండువ తీసి
ఆదిమునులు దీనిని బాగుగ కలిపిరి. | |
దైవ | |
భక్తియను ఖండచక్కెర తెచ్చి
సుబుద్ధియను ఆవునేయి పోసి
అబద్ధమనియెడి మలినము తీసి
ఆదిమునులు దీనిని బాగుగ పంచిరి. | |
దైవ | |
రకరకమైనది దైవ ప్రసాదము
సకల రోగ నివారణమోయి
ఒక కాసైనను ఖర్ఛు లోదోయి
తకరార్ చేయక పంచుకోండోయి. | |
దైవ | |
Previous
←
1987
Next
1989
→