Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His songs · 1992
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
46
Keep
దయచేత ధన్యులు కావలెరా ఎంతటివారు | |
దయ | |
అసురుడైన భూసురుడైన అఖండ తెలివిగలవాడైన | |
దయ | |
విద్య నేర్చి వాదాడినగాని పద్యములెంతో పాడినగాని
కొండగుహలలో నుండినగాని కూర్చుని జపములు చేసినగాని | |
దయ | |
యోగాభ్యాసము చేసినగాని భాగవతాదులు చదివినగాని
బాగుగ గెడ్డము పెంచినగాని పట్టెనామములు పెట్టినగాని | |
దయ | |
ముక్కుమూసి జపమాచరించిన మొక్కుచు బాగా నిలచియుండిన
వెక్కివెక్కి ఏడ్చినగాని మొరలిడినను నీకు కరుగదు మనసు | |
దయ | |
కాషాయ వస్త్రము వేసినగాని కంఠమాల ధరియించినగాని
గడగడమని జపమాల తిప్పిన కడకు నీయొద్దకు రావలె బాబా | |
దయ | |
భక్తితో మిమ్ము గొలిచినగాని పుట్టపర్తికే వచ్చినగాని
పూజలు బాగా చేసినగాని పుడమియంతయును తిరిగినగాని | |
దయ | |
47
Keep
దినానికి మూడు సినిమాలు, రెండు టీవీ ప్రోగ్రామ్లు
చూడడానికా! కాదు కాదు,
భగవంతుని సుందర రూపాన్ని దర్శించుటకు
48
Keep
పరమేశ్వరుడే యిట్లు తరుణియై పురుషుడై
ధర క్రీడించుచుండగ
నిజముగా జూడ తరుణి జన్మమే ఘనముగా
గర్భధారణ వహియింపవలెనుగా
నవమాసములు మోసి కనిపెంచి
ఘనబుద్ధులను నేర్పి తనయుని
ఒసగెడి తల్లి తక్కువయగునా!
కనుకనే తల్లిదండ్రులందు వెనుకనుంచిరి తండ్రిపేరు
కలదు అన్నింటికి తరుణి నామమె ముందు
49
Keep
కరుణింపుము స్వామీ! నెమ్మదించవదేమి?
నిలువలేము నిను విడిచి నిమిషము స్వామీ!
ఏల యిటుల చేతువు మమ్మిలా యిది మేలా?
కరుణింపుము స్వామీ! నెమ్మదించవదేమి?
ఏమిటా మహా యాగము, కంసుని దుర్యోగము
ఒక్కటే మా ప్రార్థన, ఒక్కటే మా ప్రార్థన
నమ్మినట్టి మమ్ముకూడ రమ్మనవేమి?
స్వామీ! స్వామీ! స్వామీ!
కరుణింపుము స్వామీ! నెమ్మదించవదేమి?
50
Keep
అడుగకువె ఓ మనసా
అడుగు కొలది అది అడుగున పడునని
అడుగకున్న పని వడిగానగునని | |
అడు | |
అడుగని శబరిని ఆదరించడే
అడుగక తనకై మడియు జటాయువు
కడకునేగి సద్గతి కల్గించడే | |
అడు | |
51
Keep
తారకము సూటెరుగవలెనన్నా
సద్గురుని కృపచే తారతమ్యము తరచి కనుమన్నా!
మరపు తెర పడకుండ జాగ్రత నిరతము స్వప్నా సుషుప్తిలో
అరమరలు లేకుండ ఎప్పుడు
తరచుగ జీవాత్మ చదివెడి. |
తారకము |
Previous
←
1991
Next
1995
→