The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 533

Poem 533

మౌళిగుల్కెడు చంద్రమఃఖండ కళతోడబెడగారు గుల్కెడు జడలతోడజడలలో ప్రవహించు చదలేటి జిగితోడడంబైన ఫాలనేత్రంబుతోడనల్లనేరెడువంటి నల్లని మెడతోడకరమున నాగకంకణముతోడనడుమును చుట్టిన నాగచర్మముతోడమైనిండ నలరు భస్మంబుతోడనుదుట తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతోతాంబూల రాగాధరంబుతోడఆరు శాస్త్రములందున నందగించినల్ల కలువల హసియించి కొల్లలాడుమెరుగు చామనచాయ మేనితోడపర్తివాసుడు నేడు సాక్షాత్కరించె.

In plain words

With the crescent moon gleaming on His crown, with His lovely matted locks that gleam, with the shimmer of the sky's river flowing through those locks, with the glorious eye upon His brow, with a throat as dark as the dark nēreḍu fruit, with the serpent bangle on His wrist, with the serpent's skin wound about His waist, with the holy ash that glows over all His body, with the broad kuṅkuma mark drawn upon His forehead, with lips red with tāmbūla, grown lovely in the six śāstras, outshining the dark water lilies with His laughter, with a body of gleaming dusky hue: He who dwells in Parti has appeared in person today.

Also read

జడలలో ప్రవహించు చదలేటి జిగితోడ డంబైన ఫాలనేత్రంబుతోడ నల్లనేరెడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ నడుమును చుట్టిన నాగచర్మముతోడ మైనిండ నలరు భస్మంబుతోడ నుదుట తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూలరాగాధరంబు తోడ ఆరుశాస్త్రములందున నందగించి నల్లకలువల హసియించి కొల్లలాడు

జడలలో ప్రవహించు చదలేటి జిగితోడ డంబైన ఫాలనేత్రంబు తోడ నల్లనేరేడు వంటి నల్లని మెడతోడ కరమున నాగకంకణము తోడ నడుమును చుట్టిన నాగచర్మము తోడ మైనిండ నలదు భస్మంబు తోడ నుదుట తీర్చిన దొడ్డ కుంకుమబొట్టుతో తాంబూల రాగాధరమ్ము తోడ

మౌళిఁ గుల్కెడు చంద్రమఃఖండ కళతోడ బెడగారు గుల్కెడు జడలతోడ జడలలో ప్రవహించు చదలేటి జిగితోడ డంబైన ఫాలనేత్రంబుతోడ నల్లనేరెడువంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణము తోడ నడుమున చుట్టిన నాగచర్మముతోడ మైనిండ నలదు భస్మంబుతోడ నుదుట దీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాధరంబుతోడ … హేమ మయ వజ్ర తాటంకంబులతోడ … వృష్టితోడ నల్లకలువలు దనుమాడి కొల్లలాడు మెరుగుచామనిచాయ మేనితోడ పర్తిపురీశుడు నేడు ప్రత్యక్షమాయె.

మౌళిగుళ్కెడు చంద్ర మర్ఖండ కళ తోడ, బెడదారు గుంపెడు జడల తోడ, జడలలొ ప్రవహించు చడలేటి జిగు తోడ, డంబైన ఫాల నేత్రంబు తోడ, నల్ల నేరెడు వంటి నల్లని మెడ తోడ, కరమున నాగ కంకణము తోడ, నడుమున చుట్టిన నాగ చర్మంబు తోడ, మైనిండ నలదు భస్మంబు తోడ, కుదురు దీర్చిన దొడ్డ కుంకుమ బొట్టు తోడ, తాంబుల రాగదరంబు తోడ, తట హేమ మయ వజ్ర తాటంకముల తోడ, విక్షస్య వర్ధయా వృష్ఠి తోడ, నల్ల కలవలు దునుమాడి కొల్లలాడు మెరుగు చామనఛాయల మేని తోడ...! పార్వతీశుడు నీదు సాక్షాత్కరించే