Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1976 · The fortune of health
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The fortune of health
5 December 1976, Bṛndāvan, Whitefield
1
▾
Meaning
Keep
Also in his talks
(9)
26 February 1987
There is no sādhana greater than remembering the Name
28 September 1987
The in-breath and out-breath of the Supreme Person are the Veda
20 July 1988
All learning without practice is useless
15 October 1988
All Things and All Beings in the World Are Forms of the Paramātma!
7 November 1989
The Ātma in All Is One
3 April 1990
Rama, the Indweller
8 September 1996
The Unseen Divinity Is the Basis of the World Fashioned as the Seen
9 September 1996
Satyaṁ Jñānam Anantaṁ Brahma
21 February 2001
‘I’ itself is God
వేదవేదాంగములు
వల్లెవేసియున్న
పద్యగద్యంబులను
కూర్పబడసియున్న
చిత్తశుద్ధిలేనిచో
చెడును
అతడు...
ఇంతకన్నను
వేరెద్ది
ఎరుకపరతు?
పవిత్రాత్మస్వరూపులారా!
‘ధర్మార్థకామమోక్షానాం
ఆరోగ్యం
మూలముత్తమం’.
మానవులు
జగత్తులో
జీవించుటకు
ఆరోగ్యము
అత్యవసరము.
ఆరోగ్యము
లేకున్న
క్షణకాలమైనా,
క్షణికకర్మలైననూ,
చక్కగా
నిర్వహించుటకు
వీలుండదు.
ఈ
భౌతిక
రూపముతో
కర్తవ్యకర్మలాచరించి,
తద్వారా
మానవసేవ
సల్పి,
జన్మ
సార్థకమొనరించుకొనుటకు
మానవులు
అనేకరకములైన
విద్యలను
నేర్చుకుంటున్నారు.
చావులేని
చదువు
చదవవలయునని
వేమన
బోధించాడు.
‘ఆధ్యాత్మవిద్యయే
అన్ని
విద్యలలో
శ్రేష్ఠమైనది’
అని
శ్రీకృష్ణుడు
భగవద్గీతలో
నొక్కి
చెప్పాడు.
మానవునిలో
దివ్యజ్యోతిని
వెలిగించుటకు
తగిన
ప్రయత్నము
చేయుటకే
‘విద్య’
అను
పేరు
సరిపోవును.
ఆ
దివ్యజ్యోతి
ద్వారా
మానవత్వము
ప్రకటమై,
ప్రకాశమై
వికసించును.
అయితే,
విద్యావంతులుకూడా
ఈనాడు
సూర్యుని
ఎదుట
నిలచి
ఏమీ
కనుపించదని
రోదించే
అంధులుగా
నున్నారు.
నిండుగా
ప్రవహించు
నదియందు
నిల్చుకొని
‘దాహము,
దాహము’
అని
బాధపడు
వ్యక్తికంటె
అవివేకి
వుండునా!
తనలోనే
నిత్యసత్యమైన
అనశ్వరమైన
ఆత్మతత్త్వము
ప్రకాశించుచున్ననూ,
దానిపై
విశ్వాసములేక,
తానే
అశాశ్వతమైన
దేహమని
నమ్మి
ఆ
దేహములోనున్న
ఇంద్రియములకు
వశుడై
దానవుడుగా
మారుటకు
ప్రయత్నముచేయుచున్నాడు.
పవిత్రహృదయము,
సచ్ఛీలము,
శ్రద్ధ,
త్యాగము
అను
గుణములను
అభివృద్ధిచేయని
విద్య
కేవలము
నిరుపయోగము.
విద్య,
దైవత్వము,
ఆధ్యాత్మికము
అను
మూడింటియొక్క
ఏకత్వమును
సాధించాలి.
అపుడే
మానవునియందు
దివ్యజ్యోతి
వెలుగును.
ఆ
జ్యోతి
వలన
సర్వక్రియలలోనూ,
సర్వవచనములలోనూ,
సర్వచింతనలలోనూ
జీవితము
ప్రకాశవంతముగా,
తేజోవంతముగా
వుండాలి.
తనను
తాను
తెలిసికొనక
తనలోని
ఆనందమును
అనుభవించక
బయటి
ప్రపంచములో
వెదకి
నిరాశపొందుట
వెఱ్ఱితనము.
అది
అంధత్వమేగాని
వేరుకాదు.
search
in
yourself,
not
outside.
నీ
సత్యమే
జగత్సత్యము.
కాన,
నీ
సత్యమును
తెలిసికొన్న
తక్షణమే
అన్నియును
విశదమగును.
దానిని
తెలిసికొనక,
ఇతరులను
విమర్శించిన
అది
హాస్యాస్పదమగును.
ఆనాటి
విద్యకూ,
ఈనాటి
విద్యకూ
ఉన్న
తారతమ్యమును
గుర్తించుటకు
ప్రయత్నము
చేసిన
,
ఆనాడు
విద్యయొక్క
లక్ష్యము
సచ్ఛీలము,
పూర్ణహృదయము,
ఆత్మవిశ్వాసము
అని
స్పష్టమగును.
ఈనాడు
విద్యారంగములో
శిక్షణక్రమమునందు
మొట్టమొదట
కనిపించేది
అశ్రద్ధ,
ఆత్మవిశ్వాసములేని
బలహీనత,
కామము,
క్రోధము,
ద్వేషము
అనునవి.
ఈ
ఐదు
దోషములతో
కూడిన
మానవులే
నేడు
కనిపించుచున్నారు.
అందరూ
అంధులవలె
సిద్ధమగుచున్నారు.
కానీ,
ఆనందముగల
వారుగా
తయారు
కావటములేదు.
దుర్గుణములను
దూరము
చేయుటకు
పూనుకొన్ననాడే
‘ఆత్మతత్త్వము’
అనే
పరంజ్యోతి
ప్రకాశించును.
క్రోధము
మానవునికి
పెద్ద
శత్రువు.
దానివలన
సర్వనాశనము
కలుగును.
మానవులు
పిశాచులుగా
తయారగుదురు.
ద్వేషముకూడా
అంతే.
రోగశేషముండకూడదంటారు.
ఎందుకనగా
రోగమంతయు
నివారణమైననూ
కాళ్లపై
కొంత
వాపు
శేషించిన
చాలు,
అపథ్యము
చేయుటచే
అది
మరింత
ఘోరముగా
వృద్ధియగును.
అట్లే,
అగ్నిశేషముకూడను.
ఎందుకన,
అంతయూ
ఆరిపోయిననూ,
కొంత
నిప్పు
ఎక్కడైనా
శేషించిన,
గాలివచ్చినప్పుడు
అది
రగుల్కొని
ప్రమాదము
సంభవించును.
ఋణశేషముంచకూడదు.
ఎందుకనగా
వేయిరూపాయలు
అప్పు
తీసుకొని,
999
రూపాయలు
తీర్చి,
ఒక
రూపాయి
మిగిలియుండిన,
వడ్డీకి
వడ్డీ
పెరిగి
తిరిగి
వేయిరూపాయల
అప్పు
యధాస్థితి
బాధించును.
అటులనే,
శత్రుశేషము,
ద్వేషశేషము
వుండకూడదు.
ఎందుకనగా
మనస్సుయొక్క
అట్టడుగులో
అవి
నిలచిపోతాయి.
నానారూపములను
ధరించి,
పెరిగి
పెద్దవై
వికృతముగా
మారి
మానవుని
దానవునిగా
మార్చును.
అసూయకూడ
లోలోన
చేరి
మానవజీవితమునే
నాశనముచేయును.
కామక్రోధాదులను
దూరముచేసిన
ఆరోగ్యము
అభివృద్ధియగును.
వాటివలన,
మానవునకు
చింతలధికమగును.
చింతలేని
వారికే
సరైన
ఆరోగ్యభాగ్యము.
చింతకు
రూపమే
లేదు.
అది
వట్టి
భ్రమ.
దానికి
అస్థిత్వమే
లేదు.
ఎదిరించిన
తక్షణమే
అది
పారిపోవును.
అయిననూ,
అది
మనస్సునందు
ప్రవేశించిన
చాలు,
శక్తిని
నాశనము
చేయును.
సంతోషమును
నిర్మూలనము
చేయును.
ఆరోగ్యమును
పాడుచేయును.
శాంతిని
ధ్వంసము
చేయును.
భగవచ్చింతన
వలన,
ఆత్మవిశ్వాసము
వలన,
చింతను
హతమార్చుటకు
వీలున్నది.
మరే
రీతిగను
సాధ్యము
కాదు.
అత్తగారింటికి
అల్లుడు
వచ్చాడు.
అత్తగారిల్లు
చాలా
బీదరికముతో
కూడినది.
అయిననూ,
పాపము
అత్తగారు
వారిని
వీరిని
అడిగి,
అప్పుసప్పులు
చేసి
మొదటి
దినము
తీపు,
పప్పుచేసి
బాగానే
ఉపచారము
చేసింది.
2
▾
Meaning
Keep
రెండవ
రోజు,
సాంబారు,
పప్పు,
మూడవ
రోజు
పచ్చడి
ఈరీతిగా
పెట్టిననూ,
అల్లుడు
కదలుట
లేదు.
పొమ్మని
చెప్పుట
మర్యాద
కాదు.
ఉండమంటే,
అల్లుని
యెదుట
కూలినాలి
చేసి
జీవించడమెట్లు?
కాబట్టి
అత్త
వేదాంతబోధ
మొదలుపెట్టినది.
‘మనము
తిండితీర్థాదులకోసం
పుట్టామా?
మనకోసం
తిండితీర్థాదులు.
మనము
ముందు,
తిండి
వెనుక.
అట్లు
భావించాలి.
లభించిన
దానితో
సంతృప్తి
పొందాలి.
మనము
నిజముగా
ఈ
పాంచభౌతిక
శరీరమే
కాదు.
మనము
ఆకలిదప్పులు
లేని
ఆత్మస్వరూపులము’
అని
మొదలుపెట్టినది.
అయితే,
అల్లుడు
ఆ
వేదాంతమును
చెవిలో
వేసికొనక
దానికి
విరుద్ధముగా,
‘అత్తగారూ!
మూడు
లోకములలోనూ
అత్తగారింటికి
సమానమైన
సుఖనివాసము
వేరు
లేదు.
దీనిని
పురస్కరించుకొనియే,
శివుడు
హిమాలయమునందే
వున్నాడు.
లక్ష్మి
పుట్టిల్లగు
క్షీరసాగరమునందే
విష్ణుమూర్తి
శయనించియున్నాడు.
కాన,
నేను
అత్తగారింటిలో
కూర్చొనుటయందు
తప్పేమున్నది?’
అని
పలికినాడు.
సరి!
అల్లుడు
కదిలేటట్టుగా
లేడని
భావించి
అత్త
మెత్తగా
ఇంటికి
తాళము
వేసికొని
బయటకు
వెళ్లిపోయింది.
అల్లుడుకూడా
ఎవరికీ
చెప్పకుండా
వచ్చిన
దోవపట్టుకొని
వెళ్ళాడు.
ఈ
కథయొక్క
అంతరార్థమేమి?
బీదరికమందున్న
అత్తగారిల్లు
మానవదేహమే!
అది
దరిద్రపుకొంప.
అసహ్యమైనది,
బలము
లేనిది,
రోగములకాశ్రయమిచ్చే
మలినపుకొంప.
ఆ
ఇంటికి
చింత
అనే
అల్లుడు
వచ్చాడు.
ఏమిచేసిననూ
బయటకు
వెళ్ళుటలేదు.
దానికి
పరిహారమేమి?
దేహముపై
వాంఛను
తగ్గించి,
వైరాగ్యము
పూనిన
చింతయను
అల్లుడు
తానే
వెడలిపోవును.
దేహమును
ఆహారముతో
పోషించవలసినదే.
అయితే,
సక్రమమైనదిగా,
సరైనదిగా
సాత్వికముగా
వుండాలి.
అతి
తిండి
మతిహాని.
మితిండి
అతిహాయి.
దేహభ్రాంతిని
తగ్గించి,
విషయవాసనలు
పెంచకుండా
జీవితమును
జాగ్రత్తగా
గడపాలి.
‘భిక్షాన్నం
దేహపోషణార్థం,
వస్త్రం
శీతనివారణం’
అంతే!
ఆకలికంతులేదు,
ఆహారవిహారములకు
అంతుండాలి.
పరిశుద్ధ
హృదయముతో
మితముగా
ఆహారమును
తీసుకొనిన
దేహపోషణ
బాగుగా
జరుగును.
కారులో
పెట్రోలు
వేయునప్పుడు
‘ట్యాంకు’
పట్టినంత
మాత్రమే
వేస్తాము
కదా!
జిహ్వాచాపల్యముకొరకు
ఆహారమును
మితిమీరి
తీసుకొనకూడదు.
జబ్బు
వచ్చినప్పుడు
ఔషధమెట్లు
సేవింతుమో,
అట్లే
ఆకలి
అనే
జబ్బుకు
ఆహారము
మందు
వంటిది,
అంతే.
నిజముగా,
మానవజీవితము
ఒకే
పుల్ల
వున్న
నిప్పుపెట్టె.
ఒకడు
ఆ
పుల్లతో
సిగరెట్టు
అంటించుకొంటున్నాడు.
ఆ
సమయమునకు
సరిగా
ఎవడో
స్నేహితుడు
వచ్చి,
‘ఏమయ్యా!
ఏమి
సమాచారము?
ఏమి
చేయుచున్నావు?
నాతో
వస్తావా?’
అని
పలుకరించుచున్నాడు.
అయితే,
వాడు
దేనికీ
జవాబీయక,
సిగరెట్
ముట్టించుకొనుటయందే
శ్రద్ధ
వహించి
మౌనము
దాల్చినాడు.
ఎందుకనిన,
అతని
దగ్గరనున్నది
ఒకే
ఒక
అగ్గిపుల్ల.
మాటలలో
బడి
అది
ఆరిపోయిన
యింకొక
పుల్ల
పెట్టెయందు
లేదు.
జీవితముకూడ
అట్టిదే!
జీవితము
ఆరిపోకపూర్వమే
ఆత్మజ్యోతిని
వెలిగించుకొని
తరించవలెను.
అంధకారమే,
అధఃపతనమే.
దేహము
కూలిన
తరువాత
యేమీ
సాధించలేము.
ఆత్మజ్యోతిని
ప్రకాశింపజేయని
బ్రతుకు
వట్టి
తిండికి
చేటు,
భూమికి
బరువు.
ఎన్ని
విద్యలు
నేర్చినా,
ఎన్ని
సాధనలు
చేసినా,
ఎన్ని
ఉన్నత
స్థానములు
అలంకరించినా,
ధనకనకవస్తువాహనాదులు
ఎంతగా
ప్రోగుచేసినా
ఆత్మజ్యోతి
ప్రకాశించని
జీవితము
వ్యర్థమే.
కేవలము
తర్కవితర్కములందే
వినియోగింపబడిన
ఆ
విద్య
వలన
సరస్వతీదేవికి
అపకీర్తి
కలుగునేగాని
వేరు
ప్రయోజనము
లేదు.
విద్యను
దుర్వినియోగ
పరచకూడదు.
ఆచరణలో
పెట్టి
ఆత్మజ్ఞానమును
అందుకోవలెను.
అందులకే,
‘ఎట్టి
విద్యావంతులైననూ
భక్తులకు
సాటి
రారు’
అని
శాస్త్రము
చెప్పుచున్నది.
భక్తులు
భగవంతునే
బంధింతురు
కదా!
భక్తులలో
ఈర్ష్య,
అసూయ,
డంబము,
అహంకారము
యేమాత్రమూ
వుండవు.
ప్రతి
వ్యక్తియు
తమ
మధ్య
సంబంధమును
పెంచుకోవాలి.
‘నేను
సుఖముగా
వుండిన
చాలు,
పరుల
విషయము
నాకెందుకు?’
అనే
భావము
పశుత్వలక్షణం.
పదిమందితోబాటు
సన్నిహిత
సంబంధములను
పెంచుకోవాలి.
ఈనాడు
డిసెంబరు
5వ
తేదీ.
ప్రపంచమందలి
సత్యసాయి
సేవాసంస్థలన్నియూ
అన్నివిధాలా
రోగుల
చికిత్సకు
వలయు
అనుకూలములగావించి,
అంగహీనుల
ఆధ్యాత్మిక
అభివృద్ధికి
తోడ్పడి,
సేవాదీక్షకు
కంకణము
కట్టుకొనుచున్నది.
నిజముగా
ఇది
అత్యవసరమైన
ఒక
సేవాసాధన.
‘నాయమాత్మా
బలహీనేన
లభ్యః’,
అని
శ్రుతి
హెచ్చరించుచున్నది.
బలహీనుని
కోతులు
,
కుక్కలుకూడా
బెదరించును.
అయితే,
ధైర్యముగా
ఒక
కఱ్ఱ
తీసుకొని
నిలచిన
కుక్కకాదు,
నక్క,
పులికూడా
బెదరును.
కాబట్టి,
ఈ
చికిత్స,
ఈ
సేవాకైంకర్యములు
అన్నియు
వాళ్ళకు
ఆత్మబలము
అందించే
కొరకే.
లోకములో
అంగహీనులు,
మూగవారు,
చెవిటివారు,
గ్రుడ్డివారు
లక్షలకొలది
వున్నారు.
‘వీరందరూ
ఈ
రీతిగా
ఎందుకు
పుట్టాలి?’
అనేది
ఒక
పెద్ద
ప్రశ్న.
దానిలోకూడా
ఒక
పవిత్రత
వున్నది.
అన్నియునూ
తెలిసినవానికే
అది
తెలియును.
డాక్టర్లకు
ఇంజనీరింగ్
విషయము
తెలియదు.
వారి
రంగము
వేరు,
వీరి
రంగము
వేరు.
ఆకాశములో
సంచరించే
విమానము
రైలుపట్టాలపై
ప్రయాణము
చేయునా!
ఒకొకదానికి
ఒకొకమార్గము,
నియమము,
క్రమశిక్షణ
కలదు.
దీనిననుసరించినవారే
ధన్యులు.
తన
ధర్మమును
పాటించక,
పరధర్మములనాశ్రయించువారికి
భయము
తప్పినదికాదు.
రోగములు
రాకుండా
ఆరోగ్యమును
కాపాడుకొనుట
మంచిది.
కుక్కలు
జ్వరము
వచ్చిన
ఎంతో
ప్రీతికరమైన
మాంసము
ముట్టదు.
3
▾
Meaning
Keep
పాలు
ఒక
చుక్కైనా
త్రాగదు.
అతి
జాగ్రత్తగా
పథ్యమును
పాటించును.
అయితే,
మానవులు
105
డిగ్రీలు
జ్వరమున్నప్పుడుకూడా
ఇడ్లీ
సాంబార్
కోసం
ప్రాకులాడుదురు.
చెడ్డదాన్ని
చూచుట,
వినుట,
తినుట,
పలుకుట,
చింతించుటవలన
రక్తము
చెడి
గుండెపోటుకు
అవకాశమేర్పడును.
పురాతన
కాలమందు
‘క్యాన్సర్,
హార్ట్ఎటాక్,
బ్లడ్ప్రషర్’
మొదలగు
జబ్బులే
లేవు.
ప్రజలు
ఆరోగ్యవంతులుగా,
దృఢగాత్రులుగా
ఆనందముగా
జీవించుచుండిరి.
ఈనాడు
ఈ
వయస్సునుంచి
విషయచింత,
ధనచింత,
లోకచింత,
సంసారచింత
మొదలగు
దురభ్యాసములకు
లోనగుచున్నారు.
అసహ్యచింతనల
వలన
మానవులు
అనుటకే
సిగ్గుగా
వున్నది.
కనుక,
జబ్బులూ
కొత్తకొత్తగా
వచ్చి
బాధపెట్టుచున్నవి.
డాక్టర్లుకూడా
బెదరించి
రోగములు
అభివృద్ధి
చేస్తారు.
లేనిపోని
జబ్బును
తెప్పింతురు.
ఇది
‘క్యాన్సర్
అయి
వుండవచ్చు’
అని
వారు
చెప్పితే,
అది
‘క్యాన్సర్’
అగును.
మీ
హృదయము
కొంత
బలహీనముగా
వున్నది
అని
వారు
చెప్పుట
వలన,
త్వరలోనే
ఆ
బెదిరింపు
వలన
గుండెపోటు
వస్తున్నది.
అయితే,
ఏదానికీ
భయపడకూడదు.
భగవదనుగ్రహమును
పొంది,
ఆత్మవిశ్వాసమును
దృఢపరచుకొని
వీరుడుగా,
శూరుడుగా
అన్ని
కష్టాలను
ఎదుర్కోవాలి.
ఒక
గ్రామము
సింహద్వారమందే
డాక్టరుగారి
భవనముండినదట.
ఒకనాడు
ఆ
గ్రామమును
కలరాదేవి
ప్రవేశించినది.
ఆయన
ఆమెను
కనుగొని
‘ఎంతమందిని
తీసుకొని
వెళ్ళటకు
సంకల్పించినావు?’
అని
అడిగితే,
‘50మందిని
మాత్రమే’
అని
జవాబిచ్చిందట.
అయితే,
కలరా
వలన
నూరుమంది
గ్రామస్థులు
మరణించినారు.
గ్రామమునుండి
బయటకు
వెళ్ళే
సమయమున
డాక్టరుగారు
కలరాదేవిని
‘నీవుకూడా
అబద్దమాడవచ్చునా?
50మందిని
కొంపోదునని
నాకు
మాట
యిచ్చి
100
మందిని
పొట్ట
పెట్టుకొన్నావే?’
అని
ప్రశ్నించినాడు.
దానికి
ఆమె,
‘
నేను
50
మందిని
మాత్రమే
చంపినాను.
మిగిలిన
50
మంది
భయపడి
చచ్చినారు’
అనినదట.
అటులనే
ఈనాడు
భయముతోనే
రోగాలు
అభివృద్ధియగుచున్నవి.
ఆత్మజ్ఞానమే
అభయప్రాప్తికి
ఆధారము.
దాని
వలన
ఆరోగ్యభాగ్యము,
ఆనందభాగ్యము
సిద్ధించును.
Previous
←
Unbroken bliss
Next
Jesus
→