Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1980 · The four brothers
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The four brothers
25 March 1980, Rāma Navamī, Brindavan, Whitefield
1
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులారా!
నాలుగు
వేదములు
దశరథ
మహారాజు
ఇంటియందు
నాలుగు
రూపములు
ధరించి
ఆడుకొను
చున్నవి.
ధర్మమునే
ప్రత్యక్షస్వరూపముగా
నిరూపించుచూ,
ఆచరించే
యజుర్వేదమే
రామస్వరూపాన్ని
ధరించింది.
కనుకనే
“రామోవిగ్రహవాన్
ధర్మః”
అని
వాల్మీకి
వర్ణించాడు.
యజుర్వేదము
ధర్మసంస్థాపననిమిత్తము,
ధర్మాచరణ
ధర్మబోధనిమిత్తమై
ఏర్పడిన
వేదం.
రామచంద్రుని
నామమును
నిరంతరము
స్మరించుచూ,
జపించుచూ,
ఉండటమే
యజ్ఞముగా
భావించి,
దాని
తత్త్వమును
నిరంతరము
వల్లెవేయించే
మంత్రస్వరూపమైన
ఋగ్వేదమే
లక్ష్మణుడుగా
జన్మించాడు.
మంత్రస్వరూపమైనది
ఋగ్వేదము.
సర్వమంత్రముల
సారము
రామనామము.
కనుకనే
రామనామమును
స్మరించుచూ
తరింపచేసే
మార్గమును
లోకమునకు
బోధించే
నిమిత్తమై
లక్ష్మణుడు
ఋగ్వేదస్వరూపుడై
అవతరించాడు.
స్మరణచేత
తరింపచేయుటకై
లక్ష్మణుడు
మార్గదర్శకుడిగా
నిలిచి
నప్పటికినీ,
గానముచేత
లోకముయొక్క
హృదయాన్ని
హరించి,
వరించి,
తరించి,
భ్రమింపచేసే
నిమిత్తమై
భరతుడు
సామవేదస్వరూపుడై
అవతరించాడు.
రామనామమును
నిరంతరము
గానము
చేయుచూ,
తన
హృదయములో
తపింపచేసే
తత్త్వమును,
హరింపచేయించుకునే
నిమిత్తమై
భరతుడు
సామవేదస్వరూపుడై
అవతరించాడు.
సర్వభావములు,
సర్వరాగములు,
సమస్త
గీతలు
ఈ
సామవేదమునుండియే
అవతరించినవి.
ఈ
ఋగ్వేద,
యజుర్వేద,
సామవేదతత్త్వముల
ఆజ్ఞానుసారంగా
ప్రవర్తించుచూ,
అంతర్బహిశ్శక్తులను
అరికట్టే
తత్త్వస్వరూపుడై
అవతరించాడు
శత్రుఘ్నుడు,
అధర్వణ
వేదస్వరూపుడై.
2
▾
Meaning
Keep
His poems 384
Also in his talks
(19)
9 January 1988
God in the heart, work in the hands
3 September 1988
The body itself is a temple!
1 January 1992
Only when the differences of the upādhis are removed does the principle of the one Ātma become our own
4 April 1992
Neither swelling with joy nor sinking in sorrow: winning equanimity is the aim of Ugādi
10 May 1992
Without a base substance no object takes on form and name
29 August 1992
Life is fulfilled only when one born saying ‘Koham’ attains the experience of ‘Soham’
27 December 1992
If we can raise the value of man, the value of things comes down
22 September 1996
Though Forms and Names Differ, the Principle of Brahman Is One!
14 September 1997
The ideal of Bali Cakravarti
1 January 1998
Happiness and sorrow cannot be parted
9 July 1998
By God's Grace Anything Can Be Achieved
25 December 1998
Those Who Spread God's Prema Are the True Messengers of God
19 November 2000
Noble Sons Are Born Only When There Are Noble Resolves
18 November 2001
Man is the embodiment of Caitanya
11 April 2003
The ideal figures of the Rāmāyaṇa
13 April 2003
Make Your Parents Happy: That Is My Happiness
21 March 2004
I am you, you are I
23 August 2004
Do nāmasmaraṇa for peace of mind!
14 January 2005
When the heart is filled with Prema, life is filled with Ānanda
ధర్మస్వరూపుడైన
రాముడు
యజుర్వేదంగానూ,
లక్ష్మణుడు
ఋగ్వేదంగానూ.
భరతుడు
సామవేదముగనూ,
అంతర్బహిశ్శక్తులను
అణగద్రొక్కి,
ఆజ్ఞను
శిరసావహించి,
ఆత్మను
అనుసరించే
మార్గమును
అవలంబించిన
శత్రుఘ్నుడు
అధర్వణ
వేదంగానూ
జన్మించారు.
ఈ
చతుర్వేదస్వరూపులు
లోకోద్ధరణనిమిత్తమై,
ధర్మస్థాపననిమిత్తమై
ఆదర్శములను
నిరూపణ
చేస్తూవచ్చారు.
రాముడు
అవతారపురుషుడనియు,
సాక్షాత్
నారాయణమూర్తియనియు,
దైవస్వరూపుడనియు
కేవలము
మనము
విశ్వసిస్తున్నాముకానీ,
అతను
ఆదర్శమూర్తి
అయిన
మానవస్వరూపుడనే
దాన్ని
మనం
విశ్వసించలేక
పోతున్నాము.
ఆదర్శపురుషుడనే
తత్త్వాన్నే
మనము
విశ్వసించ
లేని
బలహీనులము
అవతారతత్త్వాన్ని
ఏ
విధంగా
విశ్వసించగలము?
మానవస్వరూపాన్ని
ధరించి,
మానవ
సంఘములో,
సమాజములో,
జీవించుచూ,
ఆదర్శవంతమైన
నిత్యజీవితాన్ని
అనుభవింప
చేసిన
రామచంద్రమూర్తిని
ఆదర్శమూర్తిగా
విశ్వసించలేనటువంటి
నేటి
మానవుడు
రాముణ్ణి
అవతారమూర్తిగా
పూజించడం
ఇది
కేవలం
హాస్యాస్పదము.
నిత్యజీవితములో
ఆదర్శాన్ని
అందించే
మూర్తిగా
మనం
విశ్వసించినప్పుడే,
అవతారమూర్తిగా
విశ్వసించడంలో
అర్థముంటుంది.
రామాయణము
పూర్తిగా
మానవాదర్శవంతమైన
త్రిమూర్తిస్వరూపకంగా
నిరూపణ
చేసినది.
నిర్గుణనిరాకార
బ్రహ్మస్వరూపుడైన
ఆత్మతత్త్వము,
నరాకారాన్ని
ధరించినప్పుడు
ఆదర్శవంతమైన
జీవితమే
మనకు
అత్యవసరమైనది.
శబ్దస్వరూపమైన
ప్రణవమునందు
అకార,
ఉకార
మకారశబ్దములచే
ఏర్పడినదే
ఓంకారమనే
తత్త్వము.
అకారము
లక్ష్మణుడనియు
ఉకారము
భరతుడనియూ,
మకారము
శత్రుఘ్నుడనియూ,
ఈ
మూడింటియొక్క
చేరికనే
ఓంకారమనే
రామునిగా
నిరూపిస్తూ
వచ్చింది.
అనగా
త్రిమూర్త్యాత్మకస్వరూపం
రామచంద్రమూర్తి.
లోకములో
ఎంతటి
బలవంతుడైననూ,
విద్యావంతుడైననూ,
శ్రీమంతుడైననూ,
కొన్ని
అవాంతరములు
సంభవించినప్పుడు
మానవుడు
బలహీనుడై
దుర్గతులకు
గురి
అవుతుంటాడు.
ప్రతికూలములు
సంభవించినప్పుడు
మానవుడు
బలహీనుడు
కావడము,
లేక
క్రుంగికృశించిపోవడము
ఇది
సామాన్యమైన
లక్షణము.
కానీ
అట్టి
అవాంతరములు
ప్రారంభమైనప్పుడు,
ధైర్యసాహసములచేత
ఎదుర్కొని,
దానిని
సాధించి,
అనేక
విధముల
ఆదర్శాన్ని
అందించిన
మూర్తి
రామచంద్రమూర్తి.
ప్రతిమానవుని
జీవితమునందు
కష్టములు
లేక
సుఖము
లభించుట
కల్ల.
సుఖములను
చూచి
కష్టములు
వెక్కిరిస్తుంటాయి.
ఆనందమును
చూచి
దుఃఖములు
పరిహసిస్తుంటాయి.
ఈ
ఆనందసంతోషములకై
ఈ
దుఃఖవిచారములు
కాచుకొని
ఉంటుంటాయి.
మనసు
ఎత్తుపల్లములతో
చేరినది.
మన
పరిస్థితులు
కూడనూ,
ఎత్తు
పల్లములతో
కూడినవి.
ఇలాంటి
పరిస్థితులయందు
మానవజీవితము
ఎత్తుపల్లములనే
సుఖదుఃఖములు
లేకుండా
జీవించడానికి
ఏవిధముగా
వీలవుతుంది?
నిజముగా
‘నసుఖాల్లభతేసుఖం’
అన్నట్లుగా
కష్టము
లేకుండా
సుఖం
అనుభవించడం,
వీలు
కానటువంటిది?
సుఖము,
దుఃఖము
అనేవి
ప్రత్యక్షమైన
స్వరూపములు
కావనే
సత్యాన్ని
ఈ
నాడు
మనం
గుర్తించాలి.
“కష్టసుఖములు
రెండును
కలసి
యుండు
కష్టమును
విడదీయ
శక్యమ్ము
కాదు.
సుఖము
ప్రత్యేకముగ
నెందుచూడబోము.
కష్టము
ఫలించెనేని
సుఖమని
యంద్రు.”
3
▾
Meaning
Keep
కనుక
మనము
ఈ
నాడు
భౌతికసుఖమే
సుఖమని
భావిస్తూ,
ప్రతిబంధకములు
ఏర్పడినప్పుడు
కష్టమని
దుఃఖిస్తూ
ఉండుట
మానవత్వములో
ఒక
వికారదృశ్యము;
విరుద్ధ
మార్గము.
ఇది
కేవలము
లీలావిభూతియొక్క
తత్త్వము.
లీలావిభూతి
యనేది
తాత్కాలికమైనది.
క్షణభంగురమైనది.
సుఖమునకు
పొంగడం,
దుఃఖమునకు
క్రుంగడం
మానవుని
సహజగుణము
కానేరదు.
రెండింటియందు
సమత్వమును
అనుభవించేస్థితిని
అందుకునే
శక్తిసామర్థ్యములు
కలిగి
యుండవలెను.
అసంపూర్ణమైన
తత్త్వాన్ని
త్యాగం
చేసి,
పూర్ణత్వమనేదాన్ని
నిత్యవిభూతిని
అనుభవించుకోవడానికి
తగిన
కృషి
చేయాలి.
ఇట్టి
సమత్వమును,
ఇట్టి
ఏకత్వమును,
ఇట్టి
పవిత్రతను,
ఆదర్శవంతముగా
లోకానికి
అందిస్తూవచ్చాడు
రామచంద్రమూర్తి.
ప్రతిజీవితమునకూ,
ప్రతిగృహమునకూ,
ప్రతికుటుంబమునకూ,
ఒక
ఆదర్శాన్ని
అందించాడు
రామచంద్రుడు.
తండ్రికొమరులు,
భార్యాభర్తలు,
అన్నదమ్ములు
ఏవిధంగా
ఉండాలి
అనే
జీవితాన్ని
కుటుంబస్వరూపుడైన
రామచంద్రుడు
లోకానికి
ఆదర్శంగా
అందిస్తూవచ్చాడు.
జలమునందు
కమలము
పుడుతుంది,
జలగ
పుడుతుంది.
కమలమునకు,
కప్పకు,
జలగకు
జన్మస్థానము
జలమే.
కానీ,
కమలము
మానవుని
హృదయమును
వికసింపచేస్తుంది.
హృదయానందాన్ని
అందిస్తుంది.
జలగ
మానవుని
హింసిస్తుంది.
జన్మస్థానము
ఒకటైనప్పటికినీ,
ఈ
కర్మభేదములు
అనేకంగా
ఉంటున్నాయి.
అమృతము
హాలాహలము
సముద్రమునందే
ఆవిర్భవించినవి.
కానీ,
విషము
మానవుని
నాశనము
చేస్తుంది.
అమృతము
మానవుని
ఉద్ధారపరుస్తుంది.
కనుకనే
జన్మస్థానములు
ఒకటైనప్పటికినీ,
కర్మభేదములు
భిన్నముగా
ఉండటంచేత
అవస్థాత్రయములు
అవస్థాభేదములు
అనేకంగా
మనకు
నిరూపిస్తూ
వస్తుంటాయి.
ఒక
తండ్రికి
ఇరువురు
కుమారులు
పుట్టినప్పుడు,
ఒకడు
మంచివాడుగనూ,
ఒకడు
చెడ్డవాడుగనూ
రూపొందుతుంటాడు.
ఒకడు
కీర్తిని,
మరొకడు
అపకీర్తిని
అందిస్తూంటాడు.
ఇవి
కేవలము
జన్మాంతర
కర్మముల
ప్రతిఫలములే,
తప్ప
వ్యక్తిస్థానములు
కావు.
అదేవిధముగనే
రామచంద్రమూర్తి
అవతారమూర్తిగా
అవతరించి,
మానవుడియందున్న
భిన్నత్వాన్ని,
భేదమును
రూపుమాపి
ఏకత్వమనే
నిత్యవిభూతితత్త్వాన్ని
అందించడానికై
ఆదర్శమూర్తిగా
మెలిగాడు.
‘రామ’
అనే
నామము
కేవలము
రుచినిమిత్తమై,
లేక
తల్లిదండ్రుల
ప్రీతినిమిత్తమై,
లేక
లోకనిమిత్తమై
పెట్టిన
పేరు
కాదు.
వరించే
హృదయమునకు
రమింపజేసే
హృదయమునకే
‘రామ’
అని
పేరు.
కనుక
ఈ
నామమనేది
ఎక్కడ
మనకు
ఆవిర్భవించినది?
ఈ
నాలుగువేదములు
ఎవరియందు
ఆవిర్భవించినవి?
దశరథుని
పుత్రులుగా
అవతరిస్తూ
వచ్చాయి.
దశరథుడనగా
ఎవరు?
కేవలము
ఒక
మహాచక్రవర్తిగా
ఉండి
అయోధ్యాపురమును
ఏలినటువంటి
ఒక
రాజుగా
భావించరాదు.
దశరథుడనగా
ఈ
దేహమే.
ఐదు
కర్మేంద్రియములు,
ఐదు
జ్ఞానేంద్రియములతో
కూడిన
రథముకనుక
దేహమునకు
దశరథము
అని
పేరు.
ఇతడు
అయోధ్యను
పాలిస్తున్నాడన్న
మాట.
‘అయోధ్య’
అనగా
యోధులు
చేరడానికి
వీలుకాని
స్థానము.
లోకసంబంధమైన
శత్రువులు
మన
దేహమునకు
మాత్రమే
సంబంధపడిఉంటారుగానీ
హృదయానికి
ఏమాత్రమూ
సంబంధపడిఉండరు.
దేహాన్ని
జయించవచ్చునుగానీ,
హృదయాన్ని
జయించడం
శత్రువులకు
సాధ్యంకాదు.
కనుక
ఎట్టి
శత్రువులు
కూడ,
ఇందులో
ప్రవేశించడానికి
వీలుకాని
రాజ్యము.
4
▾
Meaning
Keep
అదే
హృదయసామ్రాజ్యము,
అదే
అయోధ్య.
దీనికి
మూడు
ద్వారములు
ఉంటున్నాయి.
అవే
సత్వరజస్తమోగుణములు.
ఈ
మూడు
గుణములతో
చేరి,
దశేంద్రియములతోకూడి
హృదయమనే
రాజ్యమును
పాలించే
దశరథునికి
నలుగురు
కొమరులు
పుట్టారు.
ఆ
నలుగురు
ధర్మ,
అర్థ,
కామ,
మోక్షస్వరూపులు.
ఈ
చతుర్విధపురుషార్థములందు
ధర్మము
మొట్టమొదటిది,
అదియే
రామచంద్రుడు.
ఇంక
రామచంద్రుని
అనుసరించిన
సోదరులు;
అర్థకామమోక్షములు.
ఈ
విధముగా
అనుసరించినప్పుడే
మానవుని
జీవితము
ధన్యమౌతుంది.
కనుక,
ఈ
నలుగురు
అన్నదమ్ములు
రెండుగా
విభజింపబడుతూ
వచ్చారు.
భరతశత్రుఘ్నులు
ఒకవైపునా,
రామలక్ష్మణులు
మరొకవైపునా
చేరిపోయారు.
ధర్మ
అర్థములు
రెండూ
ఒకటైపోయినవి.
కామమోక్షములు
రెండూ
ఒకటైపోయినవి,
ధర్మమును
అనుసరించినదే
అర్థము!
మోక్షమును
కామించిన
వాడే
శత్రుఘ్నుడు.
కానీ
ఈ
నాడు
కలియుగ
ప్రభావముచేత
మానవుడు
ధర్మ,
అర్థ,
కామ,
మోక్షమనే
నాలుగు
మార్గములయందు
ధర్మమును
త్రుంచివేస్తున్నాడు;
మోక్షమును
నిరసిస్తున్నాడు.
అర్థకామములలో
పడి
అల్లాడి
పోతున్నాడు.
మోక్షమక్కరలేదు.
ధర్మములో
జొరబడనక్కరలేదు.
అర్థకామములు
రెండూ
ఉంటే
చాలు.
ఇది
కేవలము
రాక్షస
సంబంధమైన
గుణము.
ఇది
కేవలము
మానవ
ఆకారము
ధరించిన
రాక్షసత్వమనే
చెప్పవచ్చు.
కనుకనే
ఇట్టి
అపవిత్రమైన
మార్గమును
అవలంబింప
చేసికొనకుండేనిమిత్తమై,
రాముడు
తన
ధర్మస్వరూపాన్ని
నిరూపిస్తూ,
తమ
అన్నదమ్ములయొక్క
ప్రవర్తనను
చక్కగా
లోకానికి
అందిస్తూ
వచ్చాడు.
రాముని
తత్త్వము
గుర్తించడానికి
వీలుకానిది.
అతని
లోతుపాతులు
ఏమాత్రమూ
తెలిసికోవడానికి
వీలుకాదు.
కనుకనే
‘యతో
వాచో
నివర్తంతే
అప్రాప్య
మనసా
సహ’
అన్నారు.
మనసునకు
కానీ,
వాక్కునకు
కానీ
అలవికాని
తత్త్వముతో
కూడిన
వాడు
రాముడు.
ఇలాంటి
రామచంద్రమూర్తి
అరణ్యవాసము
పోవలసి
వచ్చింది.
ఎంతమంది
వలదన్నప్పటికినీ,
లక్ష్మణుడు
రామచంద్రుని
అనుసరిస్తూ
వెళ్ళాడు.
కన్న
తల్లిదండ్రులను
వదిలాడు.
కట్టుకున్న
భార్యనుకూడ,
వదిలాడు.
తనయొక్క
లోకసంబంధమైన
భోగములను
త్యజించాడు.
రాముడే
నాకు
ప్రధానము
అనే
లక్ష్యాన్ని
పెట్టుకుని
ప్రయాణం
చేశాడు.
ఈ
విధముగా
సీతారాములను
అనుసరిస్తూ,
వారికి
కింకరుడుగా
సేవలు
సలుపుతూ
తన
జీవితమును
ధన్యము
గావించుకునే
లక్ష్యమే
పరమగమ్యమని
భావిస్తూవచ్చాడు.
రావణునితో
యుద్ధముచేసే
సమయమునందు
లక్ష్మణుడు
ఈ
రామునకు
కుడిభుజముగా
నిలచి
అనేకావస్థలకు
గురి
అయ్యాడు.
కష్టములను
హృదయపూర్వకముగా
స్వాగతం
చేసుకున్నాడు.
నవ్వుతూ,
నవ్వుతూ
కష్టములను
అనుభవించుతూవచ్చాడు.
ఒకానొక
సమయమునందు
సీతాన్వేషణ
సలుపుతూ
వెళ్ళే
సమయములో
కబంధుని
చేతిలో
ఇరువురూ
చిక్కుకున్నారు.
అప్పుడు
లక్ష్మణుడు
చెప్పుతున్నాడు;
“అన్నా!
నా
విషయమై
నీవు
ఏమాత్రము
విచారించనక్కరలేదు.
నన్ను
ఈ
కబంధునకు
ఆహారముగా
అప్పజెప్పి
తమరు
క్షేమముగా
ఉండండి”
అని
ప్రార్థించాడు.
సోదరుని
నిమిత్తమై
ప్రాణమునుకూడా
త్యాగము
చేయడానికి
సంసిద్ధుడైనవాడు
లక్ష్మణుడు.
కనుకనే
ఒకానొక
సమయములో
యుద్ధభూమిలో
లక్ష్మణుడు
మూర్ఛిల్లగా,
రాముడు
లోకరీతిగా
ఆదర్శాన్ని
అందించే
నిమిత్తమై,
పరితపించినట్లుగా
కొంతనటన
చేస్తూవచ్చాడు.
5
▾
Meaning
Keep
వెదకిన
సీతవంటి
భార్య
లోకమందు
చిక్కవచ్చును.
కానీ,
లక్ష్మణునివంటి
తమ్ముడు
నాకింక
చిక్కడని
విచారించాడు.
కనుక
లక్ష్మణుడు
ఎంత
ప్రీతిగా
ఆ
రాముని
అనుసరిస్తూ
వచ్చాడో,
రాముడుకూడా,
లక్ష్మణుని
అంత
ప్రీతిగా
ప్రాణసమానంగా
ప్రేమిస్తూవచ్చాడు.
సోదరప్రేమతత్త్వము,
అన్యోన్యత,
వారి
అనుచరణను
ఎంతైనా
లోకాదర్శముగా
అందించుచున్నవి;
ఇది
ప్రధానఘట్టము.
ఇంక
భరతశత్రుఘ్నులు
తాతగ్రామములో
ఉండినప్పుడు
తండ్రి
మరణవార్త
విన్నంత
మాత్రముననే
అయోధ్యకు
ప్రయాణమై
వచ్చారు.
అయోధ్యను
చేరిన
వెంటనే
వసిష్ఠులవారివల్ల
రామచంద్రున్ని
14సంవత్సరములు
అరణ్యమునకు
పంపిన
విషయము
తెలిసికున్నారు.
తండ్రి
అంత్యక్రియలుచేసి
తమ
పరివారముతో
అరణ్యానికి
ప్రయాణమై
వెళ్ళారు
భరతశత్రుఘ్నాదులు.
భరతుడు
అరణ్యములో
రామలక్ష్మణులను
అనేకవిధములుగా
ప్రార్థించి
అయోధ్యకు
రావలెనని
ఎంతగానో
వేడుకొన్నాడు.
కానీ
పితృవాక్యపరిపాలన
నీకునూ,
నాకునూ
ప్రధానమైన
ప్రమాణమని
రాముడు
బోధిస్తూవచ్చాడు.
అయోధ్యారాజ్యమును
పరిపాలించే
అధికారము
నీకు
మాత్రమే
ఉన్నది.
కానీ,
ఈ
దుష్టునికే
మాత్రమూ
లేదని
పాదములు
పట్టి
ప్రార్థించాడు
భరతుడు.
“తమ్ముడా!
తండ్రి
ఇచ్చినటువంటి
రాజ్యమును
నేను
పరిపాలన
చేస్తాను.
తండ్రి
నీకందించిన
రాజ్యమును
నీవు
పరిపాలన
చేయాలి.”
ఇది
ఇరువురి
కర్తవ్యమని
రాముడు
నిరూపించాడు.
కేవలము
అయోధ్యారాజ్యమును
భరతునకు
మాత్రమే
ఇచ్చినాడు.
కానీ
ఏ
రాజ్యమునూ,
రామునకు
అందించలేదు.
అయోమయస్థితిలో
మునిగాడు
భరతుడు.
“అరణ్యరాజ్యమును
నాకందించాడు.
ఈ
అరణ్యములో
ఋషులు,
తాపసులు
అనేకవిధములుగా
బాధలుపడుచూ,
రాక్షసకృత్యములచేత
హింసలు
పడుతుండటంచేత
ఈ
రాక్షసకృత్యములను
హతమార్చి
ఋషులను
పోషించే
రాజ్యమును
నాకందించాడ”ని
రాముడు
చెప్పాడు.
ఇక్కడ
భరతుడు
అనేకవిధములుగా
రాముని
వేడుకుంటూ
ఉండగా,
వసిష్ఠులవారు
ప్రవేశించి,
“భరతా!
సోదరుని
మనస్సును
బాధించడము
మంచిది
కాదనే
విషయం
నీకు
తెలియదా”
అన్నాడు.
కేవలము
నీవు
‘సోదరుడు
సోదరుడ’ని
ప్రేమిస్తున్నావేకానీ,
నీయొక్క
వాంఛచేత
రాముని
హృదయము
ఎంత
బాధపడుచున్నదో
నీవు
గుర్తించడంలేదు.”
కనుక
అతని
మనస్సును
ఎవ్వరుకూడ,
మార్చుటకు
వీలుకాదు.
ఏకవాక్యమే
శ్రీరామచంద్రుని
వాక్యము.
అట్లయిన
ఈ
14
సంవత్సరములు
నేను,
శత్రుఘ్నుడు
అరణ్యములో
ఉండగలము.
నీవు
లక్ష్మణసమేతుడవై
సీతాదేవితోబాటు
అయోధ్యకు
పోవచ్చును
కదా!
ఈ
ప్రతిజ్ఞ
దశరథమహారాజు
మనకు
ఇచ్చినది.
దీనియందు
నీకు
ఎంత
హక్కు
గలదో
నాకును
అంత
హక్కు
గలదు.
కనుక
ఈ
అరణ్యమును
నేను
పరిపాలిస్తాను,
నీవు
అయోధ్యకు
వెళ్ళుమని
కూడ
మరీ
ప్రార్థించాడు
భరతుడు.
అనగా
సోదరులయొక్క
ప్రేమతత్త్వము
ఈ
నలుగురియందునూ
ఎంత
సమత్వముగా
ఉన్నదనే
సత్యాన్ని
మనం
చక్కగా
గుర్తించాలి.
ఈ
నాటి
సోదరులు
ఏదో
ఒక
నెపముతో
మనకు
రాజ్యము
చిక్కితే
చాలని
చెప్పి,
అర్హతలేని
అధికారమునకుకూడ
అఱ్ఱులు
చాస్తూ
అరుస్తుంటారు.
కానీ,
తనకు
ఆ
రాజ్యమును
రామచంద్రమూర్తి
అందించినప్పటికినీ,
ఆ
రాజ్యమును
తాను
ఏమాత్రమూ
చేపట్టడానికి
శ్రమించలేదు
భరతుడు.
సంకుచిత
చిత్తులైన
స్వార్థపరులైన
సోదరులు
ఈ
నాడు
అధికమవుతూ
వచ్చారు.
వారి
హృదయములు
ఏ
మాత్రముకూడనూ
విశాలమైనవి
కాలేకపోతున్నాయి.
నిరంతరము
రామాయణమును
చదువుతుంటాము.
6
▾
Meaning
Keep
అనేకవిధములుగా
నామస్మరణ
చేస్తుంటాము.
భజనలు
సలుపుతుంటాము.
జపధ్యానములు
చేస్తుంటాము.
కానీ
దైవత్వాన్ని
మనం
ఏం
గుర్తించుకున్నాము?
సామాన్యమైన
సంబంధబాంధవ్యాన్ని
గుర్తించుకోలేని
రాక్షసకృత్యములతో
చేరిన
మానవులము
ఇక
దైవత్వాన్ని
ఏవిధంగా
గుర్తించగలము?
ఒక్క
గర్భములో
పుట్టిన
సోదరులము
అన్న
భావముకూడనూ
వారిలో
లేనప్పుడు
ఇంక
దైవాంశము
ఏరీతిగా
భావించగలరు?
తండ్రియాజ్ఞను
శిరసావహించడము,
పితృవాక్యపరిపాలనే
నాకు
ప్రధానమైన
లక్ష్యమని
బోధించడము
రాముని
యొక్క
ఆదర్శము.
రామనామం
వేదసారం;
క్షీరసాగరము.
ఇలాంటి
పవిత్రమైన
రామతత్త్వాన్ని
తెలిసికోవడంలో
మానవత్వంలో
ఉన్న
ఆదర్శాన్ని
గట్టిగా
మనము
నిరూపించాలి.
మానవత్వముతో
అనుభవించలేని
రామతత్త్వాన్ని
మనము
ఇక
ఏ
సాధనచేత
సాధించగలము.
Previous
←
Education in the Sai era
Next
Discipline
→