Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1989 · Everything Is God's Gracious Gift
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Everything Is God's Gracious Gift
29 June 1989, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His poems 269
బ్రహ్మజ్ఞానంబు
నెరుగక
బ్రాహ్మణుండ
సమత
భావము
లేకున్న
సజ్జనుండ
మంచితనమును
లేకున్న
మానవుండ
చెప్పరండయ్య
మీరలె
ఒప్పుకొందు.
విద్యార్థులారా!
ప్రపంచమునందుగల
సమస్త
పదార్థములు
భగవత్
వరప్రసాదములే.
సంకల్ప
స్వరూపములే.
కొన్ని
పదార్థములను
మనము
అతి
జాగ్రత్తగా
వుపయోగపెట్టుకోవలసి
వస్తుంది.
వివేకంతో
విచారణ
జరిపి
వినియోగం
సలుపుకున్నప్పుడు
ఆ
పదార్థములు
మనకు
ప్రాణమిత్రునిగా
తోడుగా
ఆనందాన్నందిస్తాయి.
విచారణ
సలుపక
వివేకరహితమైన
భావముతో
ఆ
పదార్థములను
వినియోగించుకున్న
శత్రువుల
వలె
మనల్ని
హింసిస్తాయి.
కనుక
ప్రతి
పదార్థమును
విచారణ
సల్పి
వివేకముతో
వినియోగించుకొనుటకు
ప్రయత్నించాలి.
మచ్చునకు
అగ్నివుంది.
కత్తివున్నది.
కరెంటు
వున్నది.
వీటిని
సరైన
మార్గములో
వినియోగించుకున్నప్పుడే
వీటి
ఫలితమును
మనము
అందుకోగలుగుతాము.
అగ్ని
అతి
జాగ్రత్తగా
వుపయోగించుకొనకున్న
అది
మనకు
ప్రమాదము
కలిగింప
చేస్తుంది.
కత్తిని
సమయ
స్ఫూర్తిగా
వినియోగించుకున్నప్పుడే
అది
మనకు
సహాయకారిగా
వుంటుంది.
కరెంటు
కూడను
మనకు
అనేక
విధములైన
వుపకారములు
సలుపుతున్నవి.
బల్బులు
తగిలించుకొని
తద్వారా
వెలుతురు
నందుకో
గలుగుతున్నాము.
Fan
అమర్చుకొని
గాలిని
పొందగలుగుతున్నాము.
స్టౌలో
కరెంటు
ప్రవేశపెట్టి
వంటను
చేసుకుంటున్నాము.
ప్రింటింగ్
ప్రెస్లో
దానిని
వుపయోగపెట్టుకొని
అనేక
రకములుగా
సృష్టిని
గావించుకుంటున్నాము.
ఈ
కరెంటు
నాకింత
వుపకారం
చేసిందికదా!
ఈ
కరెంటు
ద్వారా
నేనెన్ని
విధముల
కార్యములనో
సాధింప
గలుగుతున్నాను
అని
ఓ
కరెంటా!
నీవెంత
మంచి
మిత్రుడవు
అని
దానిని
పట్టుకుంటే
కాల్చి
వేస్తుంది.
ఈ
ఉపకారములను
మనము
సరియైన
విచారణ
చేసి
అనుభవించవలసి
వస్తుంది.
ఉపకారము
చేసింది
కదా
అని
కరెంటు
పట్టుకోటానికి
వెళ్ళినప్పుడు
అది
మనకు
ప్రమాదమునే
చేస్తుంది.
అదేవిధముగనే
మానవుని
యింద్రియములన్నీ
కూడను
చాలా
జాగ్రత్తగా
ఉపయోగపెట్టుకోవాలి.
ఈ
యింద్రియములను
సక్రమ
మార్గములో
ప్రవేశపెట్టినప్పుడు
మనకు
సహాయకారులుగా
వుంటుంటాయి.
వక్రమార్గములో
ప్రవేశపెట్టినప్పుడు
అనేక
విధములైన
బాధలు
కలిగిస్తాయి.
ఈ
యింద్రియములలో
జిహ్వ
చాలా
ప్రధానమైనది.
2
▾
Meaning
Keep
Also in his talks
(8)
2 October 1988
Brahman Itself Is the Root Power of the World!
19 January 1989
The whole universe is filled with Hari
23 May 1990
Road to Divinity
25 May 1991
Kenopanishad
29 June 1996
Karma, Bhakti and Jñāna: The Aim of All Three Is One
7 July 1996
Faith Alone Is Man's Eyes
22 February 2001
God's grace comes only through the right use of the senses
5 July 2001
The right use of the senses is the true sādhana
ప్రమాదమైనది.
ఒక్కొక్క
యింద్రియమునకు
ఒక్కొక్క
శక్తి
మాత్రమే
వుంటున్నది.
కాని
ఈ
జిహ్వకు
రెండు
రకములైన
శక్తులుంటున్నాయి.
ఒకటి
మాటాడటం
రెండవది
రుచి
చూడటం.
కనుకనే
జయదేవుడు
జిహ్వేరసజ్ఞే
మధురప్రియత్వం
సత్యం
హితం
త్వాం
పరమం
వదామి
ఆవరణమేకా
మధురాక్షరాణి
గోవింద
దామోదర
మాధవేతి.
అని
దానిని
అనేక
రకములుగా
వర్ణిస్తూ
వచ్చాడు.
ఓరుచి
తెలిసిన
నాలుకా!
మధురమైన
మాటలాడే
నాలుకా!
గౌరవమైన
నాలుకా!
నీయొక్క
దీనిపైన
భగవంతుని
వాక్యములు
తప్ప
అన్యమును
నేను
వుపయోగపెట్టను.
అటువంటి
నాలుకను
అపవిత్రం
గావించటం
నాకిష్టం
లేదు.
సత్యమునకే
వుపయోగించుకోవాలి.
ప్రియమైన
దానిని
నేను
వుపయోగించుకోవాలి.
అదేవిధముగనే
భగవద్గీతయందు
‘అనుద్వేగకరం
వాక్యం
సత్యం
ప్రియ
హితంచ
అన్నారు.
ఈ
సత్యము
కూడను
ఉద్వేగకరంగా
వుండకూడదు.
అన్ని
విధములైన
పవిత్ర
గుణములు
కలిగి
వుంటున్నది.
కనుకనే
నాలుకను
మనము
అతిజాగ్రత్తగా
వుపయోగించుకోవాలి.
ఈ
నాలుక
వలనే
మనకు
బంధమోక్షములు
సంభవిస్తున్నాయి.
శాశ్వత
సుఖమును,
శాశ్వత
ఆనందమును
అందించేది
నాలుకనే.
అన్ని
యింద్రియములకంటె
ఈ
జిహ్వా
చాలా
ప్రధానమైనది,
ప్రమాదమైనది.
కనుకనే
యీ
యింద్రియములను
జాగ్రత్తగా
వుపయోగించుకోవాలి.
ఇట్టి
యింద్రియమును
వుపయోగించుకునే
నిమిత్తమై
ప్రాచీన
ఋషులు
అనేక
విధములైన
నియమములను
పాటిస్తూ
వచ్చారు.
ఈ
జిహ్వకు
అడిగినవన్నీ
అందించరాదు.
జిహ్వా
అడిగినవన్నీ
అందిస్తూ
వస్తే
కట్టకడపట
నిన్నే
మ్రింగి
వేయటానికి
సిద్ధంగా
వుంటుంది.
కనుకనే
యీ
రుచులను
అరికట్టే
నిమిత్తమై
ప్రాచీన
ఋషులు
కొన్ని
నియమాలు
పాటిస్తూ
వచ్చారు.
వాటినే
చాతుర్మాసవ్రతములు
అన్నారు.
నాలుగు
నెలలు
యీ
జిహ్వకు
సరియైన
శిక్షణనిచ్చి
తాను
అడిగినవన్నీ
అందించకుండా
దీనిని
సరియైన
మార్గములో
నిలపాలనే
వుద్దేశ్యముతో
యేర్పడినదే
యీ
చాతుర్మాసవ్రతము.
ఇప్పుడు
వచ్చే
ఆషాఢ
మాసమునుంచి
నాలుగు
నెలలు
యీ
వ్రతమును
పాటిస్తుంటారు.
దీనికి
మరొక
కారణము
కూడ
లేకపోలేదు.
ఇది
వర్షకాలము
కనుక
సన్యాసులు
ఒక
ప్రదేశం
నుండి
మరొక
ప్రదేశమునకు
ప్రయాణము
చేయటం
చాలా
కష్టముగా
వుంటుంది.
వర్షముల
వలన
నదులు
ప్రవహించవచ్చును.
వంకలు
పారవచ్చును.
ప్రయాణమునకు
ఆటంకమవుతుంది.
కనుక
ఒక్క
ప్రదేశములో
వుంటుండి
యీ
నాలుగు
నెలలు
దైవచింతన
చేత
కాలమును
సార్థకము
గావించుకోవాలని
యీ
చాతుర్మాసవ్రతము
ప్రారంభించారు.
అరణ్యమునకేగి
అక్కడే
ఒక
పాక
నిర్మించుకొని
యీ
పాక
లోపల
తపస్సును
గావిస్తూ
వచ్చారు.
అక్కడ
కందమూలాలు
తప్ప
ఎట్టి
రుచిపదార్థములు
లభించవు.
3
▾
Meaning
Keep
కందమూలాదుల
చేతనే
కాలమును
సార్థకము
గావించుకొని
జిహ్వయొక్క
రుచివాసనలను
అణగద్రొక్కుతూ
వచ్చారు.
దురదృష్టవశాత్తు
యీ
కలియుగములోపల
చాతుర్మాసవ్రతములు
ప్రత్యేకమైన
ఆర్భాటమైన
ఒక
విందుగా
చేస్తున్నారు.
నిత్యము
రుచికరములైన
పదార్థములు
కావాలి.
ఒక్కొక్కదినము
ఒక్కొక్క
భక్తుడు
వీరికి
విందునందించాలి.
దీనిని
భిక్ష
అనే
రూపములో
అనుభవిస్తున్నారు.
ఈ
విధముగా
కాలము
మారుకొలది
పవిత్రమైన
భావాలు
కూడను
అపవిత్రమార్గములో
ప్రవేశపెడుతున్నారు.
ఇలాంటి
వ్రతములన్నీ
జిహ్వచాపల్యమును
అణగద్రొక్కే
నిమిత్తమై
ఏర్పడినవనే
సత్యాన్ని
యీనాటి
సన్యాసులు
గుర్తించుకోలేకపోతున్నారు.
ఇంద్రియములను
అరికట్టలేకపోయినప్పుడు
మీరు
యేవిధంగా
దివ్యత్వాన్ని
అందుకోగలరు?
అనుభవించగలరు?
ఇల్లు
కాలుతుంటే
బయటుకు
వచ్చి
దూరంగా
పరుగెత్తవచ్చు.
ఇంటికి
నిప్పంటుకుంటే
మరొక
ప్రదేశమునకైనా
పరుగెత్తవచ్చు.
ఇంద్రియాలకే
నిప్పంటుకుంటే
యింకెక్కడ
పరుగెత్తటానికి
వీలవుతుంది?
ఈనాటి
పరిస్థితిలో
సాధకుల
యింద్రియాలకే
నిప్పంటుకుంటుండాది.
ఇంక
దీన్ని
మనం
యేవిధంగా
నిర్ణయించటానికి
వీలవుతుంది.
మనిషికి
జ్వరం
వచ్చిందంటే
ఎంత
వుందో
ధర్మామీటరు
పెట్టి
నిర్ణయించవచ్చు.
కాని
ధర్మామీటరుకే
జ్వరమొస్తే?
ఈనాటి
సాధువులు,
సన్యాసులు
తమకు
తామే
యింద్రియాలను
వుద్రేకపరచుకుంటున్నారు.
జెరూసలెంలో
ఒక
మందిరంలో
పావురాల
నమ్ముతున్నారు.
జీసస్
అందులో
ప్రవేశించి
పవిత్రమైన
దైవ
మందిరాలలో
యీవిధమైన
వ్యాపారం
జరగకూడదని
ఖండించాడు.
మఠాధిపతులైన
వారందరు
ఒక్కటిగా
చేరిపోయారు.
ధర్మప్రబోధలు
చేయటానికి
నీకెక్కడ
అధికారం
వుంది?
నీ
అధికారమేమిటో
తెల్పమన్నారు.
అప్పుడు
జీసస్
ఒక
కథ
చెప్పాడు.
ఒక
రైతుకు
యిద్దరు
కొడుకులుండేవారు.
ఒకనాడు
పెద్దకొడుకును
పంట
దగ్గరకి
వెళ్లి
దానిని
కాపలా
కాయమని
ఆజ్ఞాపించాడు.
కానీ
పెద్దకొడుకు
నేను
పోను
నాకు
వీలుకాదు
అన్నాడు.
సరే
రెండవ
కొడుకును
ఆజ్ఞాపించాడు.
నీవు
పంటకు
వెళ్లి
పశువులేమైనా
చేరుతాయేమో
కావలి
కాయమన్నాడు.
రెండవ
కొడుకు
వెడతానని
వాగ్దానం
చేశాడు.
కొంతసేపైన
తరువాత
మొదటి
కొడుకు
వెళ్లనని
చెప్పినాడు
గాని
తండ్రి
ఆజ్ఞను
మీరటం
మంచిది
కాదని
తాను
వెళ్లినాడు.
రెండవ
కుమారుడు
వెడతానన్నాడు
గాని
వెళ్లలేదు.
ఎక్కడో
బజారుకు
వెళ్లాడు.
ఐతే
యిందులో
ఎవరు
తండ్రి
ఆజ్ఞను
నడచుకున్నవారు?
మీరు
చెప్పండి
అన్నాడు.
పెద్దవాడు
తండ్రి
ఆజ్ఞను
శిరసావహించాడు.
రెండవ
కుమారుడు
నేను
వెడతానని
చెప్పాడు
గాని
వెళ్లలేదు.
ఈనాటి
పండితులందరు
యిదేస్థితిలో
వుంటున్నారు.
శాస్త్రమనే
తండ్రి
బోధించిన
దానిని
మేము
ఆచరిస్తామని
ప్రోమిస్
చేస్తున్నారు.
ఆచరించకుండా
ఆ
తండ్రియైన
భగవంతుని
వాక్యానికి
విరుద్ధంగా
నడచుకుంటున్నారు.
కనుక
మీరందరు
యిలాంటివారే
అన్నాడు
జీసస్.
4
▾
Meaning
Keep
దీనితో
పండితులందరికి
కోపం
వచ్చింది.
ఇంకా
అనేక
అనేక
కారణాలంతా
కల్పించుకొని
రాజనీతికి
విరుద్ధంగా
నడుస్తున్నాడని
అనేక
రకములైన
పాయింట్లు
అంతా
చూపించి
అతనిని
చెరసాలలో
పెట్టటానికి
ప్రయత్నించారు.
నిజముగా
‘సత్యం
జన
విరోధాయ
అసత్యం
జనరంజనం’
సత్యమనేది
యీనాడు
విరోధంగా
వుంటుండాది
యీలోకానికి.
అసత్యమే
అతిమధురంగా
ఆనందముగా
ఉల్లాసంగా
ఒక
విధమైన
సత్యంగా
కనుపిస్తుండాది.
చెప్పటం
ఒకటి
చేయటము
మరొకటి
ఇది
శాస్త్ర
విరుద్ధమైనది.
చెప్పే
విషయములలో
ఒకటి
రెండైనా
ఆచరించటానికి
ప్రయత్నించేవాడే
ఉత్తముడు.
ఈ
విధమైన
ఆచరణను
అభివృద్ధి
పరచుకునే
నిమిత్తమై
ఆనాటి
సాధువులు,
సన్యాసులు
అరణ్యవాసం
చేస్తూ
వచ్చారు.
అనేక
రకములైన
యోగసాధనలు
సలుపుతూ
వచ్చారు.
ఈ
యోగములు
దేని
నిమిత్తమై
చేస్తున్నాము?
ఈ
యోగమువల్ల
భగవత్ప్రాప్తి
ఏమైనా
లభ్యమవుతుందా?
కాదు.
కాదు.
కేవలము
యింద్రియ
నిగ్రహ
నిమిత్తమై
యోగములు
ప్రారంభిస్తున్నాము.
దీనినే
పతంజలి
యోగః
చిత్తవృత్తి
నిరోధకః
అన్నాడు.
ఈ
చిత్తవృత్తిని
నిరోధించటం
చేత
అధికకాలం
జీవించవచ్చును.
ఎవడు
అధికకాలం
జీవించాలి?
సజ్జనుడు,
సద్గుణములు
కలవాడు,
సదాచార
సంపన్నుడు
పవిత్రహృదయుడు,
అధికకాలం
జీవించిన
జగత్తుకు
ఉపయోగం
వుంటుంటాది.
దుష్టులు,
దుర్మార్గులు,
దురాచారపరులు
అధికకాలం
జీవిస్తే
దీనివల్ల
జగత్తుకు
అపకారమే
జరుగుతుంది
గాని
వుపకారం
జరుగదు.
కనుకనే
సర్వసంగ
పరిత్యాగులైన
సాధకులు
యీవిధమైన
యోగాభ్యాసాన్ని
ఆచరించాలి
అని
ఒక
నిర్ణయానికి
వచ్చారు.
అట్టి
సాధకులు
అధిక
కాలం
జీవించటం
చేత
సమాజమునకెంతైననూ
వుపకారం
వుంటాది.
అప్పుడు
దీనికి
కొన్ని
నియమాలు
పాటిస్తూ
వచ్చారు.
ఇది
పిల్లలు
చాలా
జాగ్రత్తగా
వినాలి.
ఈ
పాంచభౌతిక
దేహమునకు
కొన్ని
నిబంధనలుంటున్నాయి.
మనము
తీసుకునే
గాలి,
విడిచేగాలి
ఎంత
సావధానంగా
తీసుకుంటామో
విడుస్తామో
అంత
అధిక
కాలము
మనము
జీవిస్తాము.
మన
ఒక్కొక్క
ఉచ్ఛ్వాస
నిశ్వాసములు
ఎంత
వేగంగా
తీసుకుంటామో
అంత
త్వరలోనే
మరణం
ప్రాప్తిస్తుంది.
దీనికి
కొన్ని
నియమాలుంటున్నాయి.
ఏనుగు,
మనిషి
ఒక
నిముషమునకు
12
లేక
13
పర్యాయములు
ఉచ్ఛ్వాస
నిశ్వాసములు
జరుపుతుంటాయి.
ఈ
నియమము
అనుసరించటం
చేత
మానవుడు
100
సంవత్సరముల
వరకు
బ్రతకటానికి
వీలుంటుంది.
పాము,
తాబేలు
యిత్యాది
జీవులకు
నిముషమునకు
7,
8
పర్యాయములు
మాత్రమే
ఉచ్ఛ్వాస
నిశ్వాసములు.
కనుకనే
పాము,
తాబేలు
200
సంవత్సరములు,
300
సంవత్సరములు
జీవించటానికి
అవకాశము
వుంటున్నది.
కోతి
కుక్క,
పిల్లి
యివన్నీ
నిముషమునకు
30,
40
పర్యాయములు
ఉచ్ఛ్వాస
నిశ్వాసములు
చేస్తూ
వుంటాయి.
కనుకనే
యివి
చాలా
త్వరగా
12,
13
సంవత్సరముల
లోపలనే
ప్రాణము
విడుస్తాయి.
5
▾
Meaning
Keep
కుందేలు
వుంటుండాది.
ఇది
ఒక
నిముషమునకు
40,
50
పర్యాయములు
ఉచ్ఛ్వాస
నిశ్వాసములు
వదలుతుంది.
ఇది
5
లేక
6
సంవత్సరములు
మాత్రమే
జీవించగలుగుతుంది.
ఉచ్ఛ్వాస
నిశ్వాసములు
ఎంత
వేగంగా
పోతుందో
జీవితం
కూడను
అంత
వేగంగానే
విరమించుకుంటుంది.
ఈ
ఉచ్ఛ్వాస
నిశ్వాసములు
ఎంత
నిదానంగా
జరుగుతూ
వుంటాయో
అంత
ఎక్కువకాలం
మనం
జీవించటానికి
అవకాశము
వుంటుంది.
ఈ
శ్వాస
ఎట్లా
వదలాలి.
మనకు
బలమున్నది
కదా
అని
గట్టిగా
శ్వాస
వదలరాదు.
మనం
చేతిలో
పిండి
పెట్టుకొని
వుంటే
ముక్కు
దగ్గర
పెట్టుకున్నప్పుడు
యీ
ఉచ్ఛ్వాస
నిశ్వాసం
గాలిని
వదలే
సమయంలో
పిండి
కూడనూ
కదలకూడదు.
అంత
నెమ్మదిగా
వదలాలి.
ఇట్టి
శాంతముతో
నిదానములో
ఉచ్ఛ్వాస
నిశ్వాసములు
జరగటానికి
యోగాభ్యాసము
కొంతవరకు
వుపయోగపడుతుంది.
ఇది
సాధించే
నిమిత్తమై
ఆనాటి
ఋషులు
అందరూ
అరణ్యవాసం
చేస్తూ
వచ్చారు.
వాక్శుద్ధి,
యింద్రియ
నిగ్రహము
యీవిధమైనవి
సాధించే
నిమిత్తమై
అరణ్యాలకు
పోయారు
కాని
వేరొక
వుద్దేశ్యములో
పోలేదు.
ఇంక
వీరు
చేస్తున్న
ధ్యానములు
ఎలాంటివి?
మొట్టమొదటిది
ధారణ.
12
ధారణలు
చేస్తే
ఒక
ధ్యానము
అన్నారు.
12
ధ్యానములు
చేస్తే
ఒక
సమాధి
అన్నారు.
ధారణ
అంటే
ఏమిటి?
ఒక
వస్తువును
12
సెకండ్లు
ఎటూ
చలించకుండా
చూడటమే
ధారణ.
ఏదైనా
ఒక
ఫోటోనో,
ఒక
వస్తువునో,
ఒక
విగ్రహమునో
పెట్టుకొని
12
సెకండ్లు
కొంత
టైము
పెట్టుకొని
నీవు
చక్కగా
ప్రాక్టీసు
చెయ్యి.
12
సెకండ్లు
ఎటూపోనివ్వకుండా
దృష్టినంతా
ఆ
వస్తువుపైన
పెట్టుకో.
12
సెకన్లే
ఎక్కువ
కాలం
కాదు.
ఈ
విధంగా
ధారణ
చేయటంచేత
ధ్యానమునకు
అవకాశమేర్పడుతుంది.
12
సెకన్లు
మాత్రమే
మన
దృష్టిని
ఒక
వస్తువుపై
నిలపాలి.
ఇదే
ధారణ.
ధారణ
తరువాత
ధ్యానము.
ఇది
12
ధారణలు
అయినప్పుడు
ఒక
ధ్యానమైపోతుంది.
అనగా
యేమి?
12×12=144
సెకన్లు.
2
నిముషముల
24
సెకండ్లు.
గంటల
కొద్ది
కూర్చోటం
కాదు
ధ్యానము.
సరియైన
ధ్యానమైతే
2
నిముషముల
24
సెకండ్లు
చాలు
ఈ
ధారణను
మనం
చక్కగా
ప్రాక్టీసు
చేస్తూ
వచ్చినప్పుడే
ధ్యానమనే
2
నిముషముల
24
సెకన్లు
చక్కగా
నిల్చటానికి
అవకాశమొస్తుంది.
12
ధ్యానములు
ఒక్క
సమాధి
అన్నారు.
అనగా
144×12=28
నిమిషముల
48
సెకన్లు.
ఇది
సమాధి.
యిది
గంట
కూడా
కాదు.
యింత
మాత్రమే
సమాధి.
ఎక్కువ
కాలమైతే
సమాధే.
పోవటమే.
యింక
తిరిగి
ప్రాణం
రాదు.
ఈ
విధమైన
క్రమశిక్షణను
వారు
పాటిస్తూ
వచ్చారు.
ఈ
క్రమశిక్షణ
శాస్త్రాల్లోగానీ,
ఏ
పండితుడుగాని
ఎక్కడా
చెప్పలేదు.
దీన్ని
సాధించాలంటే
మొట్టమొదట
మనము
ధారణలో
ప్రవేశించాలి.
ఈ
ధారణ
12
సెకన్లు
మాత్రమే
చేస్తూరండి.
ఇది
పిల్లలకు
చాలా
అవసరం.
పూర్వము
అనేకమంది
ఋషులంతా
అరవింద
ఘోష్,
రమణ
మహర్షి
వీరందరు
యీవిధమైన
ప్రాక్టీసు
చేసుకుంటూ
పోయారు.
అరవిందుడటుంచి,
రమణమహర్షి
మాత్రము
రాత్రి
టెర్రస్
మీదకు
పోయేవాడు.
6
▾
Meaning
Keep
ఒక్క
చుక్కపైన
దృష్టి
పెట్టేవాడు.
ఆ
చుక్కనే
12
సెకన్లు
అలా
చూస్తూ
వుండేవాడు.
అప్పుడు
యీ
మనసు
కూడా
అటు
యిటూ
చలించేది
కాదు.
ఎక్కువ
కాలం
కాదు.
12
సెకన్లు.
ఈ
విధంగా
12
సెకన్లు
మనం
ప్రాక్టీసు
చేస్తూ
వస్తే
అలాంటి
12
ధారణలే
ఒక
ధ్యానముగా
మారుతుంది.
అంటే
144
సెకండ్లు
మాత్రమే.
2
నిముషముల
24
సెకండ్లు
మాత్రమే.
ధర్మామీటరు
లోపల
పెట్టుకొని
2
మినిట్సు
వుంటామా
లేదా?
ఈ
దృష్టిని
అంతమాత్రం
ఎందుకు
నిల్పకూడదు?
ఈ
విధముగా
మనము
ప్రాక్టీసు
చేస్తూ
చేస్తూ
తర్ఫీదు
చేస్తూ
చేస్తూ
వస్తుంటే,
నిజమైన
సమాధి
మనకేర్పడుతుంది.
ఈ
సమాధి
అంతరార్థమేమిటి?
అన్కాన్షసో
లేక
యింకేవిధమైన
సూపర్
కాన్షసో
యేదో
ఒక
కాన్షస్
అని
అనుకుంటారు
ఇది
ఏ
కాన్షసూ
కాదు.
సమాధి
అంటే
హిస్టీరియా.
నిజమైన
సమాధి
అంటే
ఏమిటి?
సమాధి
సమత్వాన్ని
పొందే
ధీనే
సమాధి
అన్నారు.
సుఖ
దుఃఖములయందు
కాని
లాభనష్టములయందు
గాని,
నిందాస్తుతులయందుగాని
శీతోష్ణములయందుగాని
సమత్వాన్ని
భావించటమే
సమాధి.
అదే
నిజమైన
ధ్యానము
వలన
లభించే
ఫలితము.
కనుక
యీనాడు,
పిల్లలు,
పవిత్రమైన
దినము.
మీరందరు
యీవిధమైన
ప్రాక్టీసు
చేయ్యండి.
తద్ద్వారా
చదివే
దానిలో
కాని,
యింకేవిధమైన
ఆలోచన
చేసే
దానియందు
కానీ
చక్కని
తీక్షణమైన
శక్తి
మీకు
లభిస్తుంది.
నేను
కూడ
దీనిని
యింత
వరకు
ఎవరికి
చెప్పలేదు.
దీని
సాధన
లోపల
యింకా
కొన్ని
క్రమము
లుంటున్నాయి.
ఈ
మనస్సు
ఏకాగ్రత
12
సెకండ్లు
వస్తువుపైన
నిల్చటానికి
మనం
కూర్చునే
విధానము,
చేసే
విధానములు
కొన్ని
వుంటున్నాయి.
అది
యిష్టమైన
వ్యక్తులకు,
చేయాలని
ఆశించే
విద్యార్థులకు
నేను
ప్రత్యేకంగా
చెప్తాను.
ధ్యానము
చాలా
సులభమైనది.
సమాధి
అంతకంటె
సులభమైనది.
కాని
దాని
క్రమమును
తెలుసుకోలేకపోవటం
చేతనే
యనేక
విధములైన
అవస్థలకు
గురైపోతున్నారు.
ధ్యానమంటే
పద్మాసనం
వేసుకొని
చక్కగా
కూర్చోటం
మాత్రమే
అని
మీరు
తెలుసుకుంటున్నారు.
అది
కాదు
నిజమైన
ధ్యానం.
కూర్చుంటారు.
కదలకుండా
కూర్చుంటారు.
మనస్సు
ఎక్కడ
పోతుండాదో
వాళ్లకే
తెలియదు
పాపం.
ఒక
చిన్న
దోమ
ముక్కుపై
వాలితే
తక్షణమే
యీ
ధ్యానము
చలించిపోతుంది.
ఎప్పుడూ
కూడా
మనిషి
చలించకుండా
కూర్చున్నప్పుడు
యీ
దోమలకు
మరింత
కుట్టేగుణము
లేర్పడుతుంటాయి.
అక్కడే
అవి
ప్రారంభమవుతాయి.
మనం
తోలినప్పుడు
మళ్లీ
అక్కడే
వచ్చి
వాలుతుంటాయి.
మనం
ఒకతూరి
తోల్తాము.
రెండవసారి
కొంచెం
వేగంగా
తోల్తాము.
మూడవసారి
కోపం
వచ్చేస్తుంది.
రెండు
చేతులతో
దాన్ని
చంపటానికి
ప్రయత్నిస్తారు.
ఇది
యీనాటి
ధ్యానములో
వుండే
విశేషము.
యిలాంటివన్నీ
ధ్యానము
కాదు.
ధ్యానమునకు
ఒక
సూక్ష్మమైన
యుక్తి
వుంటుండాది.
అదే
శక్తి.
అదే
యోగం.
ఈ
సమాధి
తత్వమనే
దానికి
ఆ
పిల్లవాడు
చెప్పాడు.
ఉద్రేకాలు
లేకుండా,
శాంతంగా
వుండాలని.
patience
మనం
యీరకంగానే
సంపాయించాలి.
ఈ
patience
ఒక్క
ధారణవల్లనే
మనకు
లభిస్తుంది.
7
▾
Meaning
Keep
Also in his talks
(3)
5 September 1987
Today satsaṅga is what man needs most urgently
7 September 1996
Advaita Is the Principle of the One Ātma
26 February 1998
The power of saṅkalpas
దానివల్ల
యింద్రియ
నిగ్రహము
యేర్పడుతుంది.
పవిత్రమైన
భావనలు
కూడను
అభివృద్ధి
అవుతూ
వుంటాయి.
పవిత్రమైన
భావనల
చేతనే
పరతత్వము
ప్రాప్తిస్తుంది.
కనుకనే
భగవద్గీతలో
శ్రేయోహి
జ్ఞాన
మభ్యాసాత్
జ్ఞానా
ధ్యానం
విశిష్యతే
ధ్యానాత్
కర్మఫల
త్యాగః
త్యాగాచ్ఛాన్తిరనంతరమ్.
శాంతి
శాంతి
శాంతి
యిదే
మనకు
కావలసింది.
ఈనాటి
ధ్యానము
మనకు
కేవలం
పూజరూము
వరకు
మాత్రమే
పరిమితమై
వుంటుండాది.
బయటుకు
వస్తూనే
కసరటం,
బుసరటం
అనేక
రకములైన
వికారాలంతా
పొందుతుంటాము.
కనుక
సతతం
యోగినః
నిరంతరము
యోగస్థితిలో
వుంటుండాలి.
అనగా
లౌకిక
సంబంధమైన
వ్యవహారములు
యిందులో
మానమని
కాదు.
నీ
చదువు
నీవు
చదువుకో.
నీ
కర్తవ్యాలను
నీవు
నిర్వర్తించుకో.
దీనికేమాత్రము
అడ్డుకాదు.
కాని
అన్నింటి
యందు
కూడను
యీ
ధారణాశక్తి
చాలా
అవసరము.
అప్పుడే
యిది
నిజమైన
ధ్యానమవుతుంది.
ధ్యానమనగా
దానిని
చింతించటమే.
మనము
నిత్య
జీవితములో
అనుకుంటుంటాం.
ఏదైనా
చెబుతుంటే
కొంతమంది
వినకుండా
వుంటుంటారు.
ఏమిరా
నీవు
దేనినో
ధ్యానం
చేస్తున్నావే!
ఏ
ధ్యానములో
వున్నావని
అంటాం.
ధ్యానం
అంటే
యేమి?
ఒక
విషయాన్ని
గురించి
చింతించటమే
ధ్యానం.
ఆవిషయాన్నే,
ఆ
వ్యక్తినే,
ఆవిషయమును
మాత్రమే
చింతించాలి.
దానినే
వేదాంతములో
సాలోక్యము
అన్నారు.
ఆలోకములో
వుండటం.
సాలోక్యమనగా
దేనిని
మనం
కావాలని
ఆశిస్తున్నామో
దాన్ని
చింతించటం.
ఏ
విషయము
కావాలంటే
ఆ
విషయాన్నే
మనం
చింతించటం.
ఏవ్యక్తి
నీకు
కావాలో
ఆ
వ్యక్తి
గురించి
చింతించటం.
అదే
సాలోక్యము.
సాలోక్యము.
సా
అనగా
సత్యమైన
తత్వము.
అదే
బ్రహ్మ.
అదే
దైవము.
సకారమనే
సర్వశక్తిమత్త్వమునకు
సంబంధించినది.
కనుక
మానవత్వము
లోపల
అది
యిది
నాది
నీది
అనుకుంటాంగాని
అదియే
మాత్రము
కాదు.
ఏదీ
నీది
కాదు.
కానీ
వున్న
దొక్కటే
నీది.
అదే
ఆత్మ.
అదొక్కటే
నీవు.
అది
నాది
అనటానికి
వీలులేదు.
ఇలాంటి
తత్వము
ఒక్క
ధ్యానము
చేతనే
మనకు
లభ్యమవుతుంది.
ఐతే
యీనాడు
లోకములో
చేసే
అనేక
రకములైన
ధ్యానములంతా
వుంటున్నాయి.
ఇవన్నీ
అల్పమైన
మార్గములు.
దీని
వలన
యేనాటికి
దివ్యత్వాన్ని
పొందలేరు.
మొట్టమొదట
చిత్తవృత్తిని
నిరోధించాలి.
అప్పుడే
నిజమైన
ధ్యానం
మనకు
లభ్యమవుతుంది.
కూర్చోటము,
పద్మాసనం
వేసుకోటం,
కన్నులు
మూసుకోటం
యీనాడు
ధ్యానమనుకుంటారు.
ఇది
ధ్యానమే
కాదు.
ఇది
రోగము.
విద్యార్థులు
మొట్టమొదట
ధారణాశక్తిని
అభివృద్ధి
పరచుకోండి.
ఈ
ధారణకు
ఒకే
వస్తువు
పెట్టుకోండి.
మీకిష్టమైన
రూపాన్ని
పెట్టుకోండి.
లేదు
రూపమే
వద్దు.
ఒక్కటేదైనా
పదార్థమును
పెట్టుకోండి.
ఆపదార్థంపైనే
12
నిముషములు
చలించని
దృష్టితో
చూస్తూరా.
8
▾
Meaning
Keep
నేను
పూర్వం
మీకు
చెప్పాను.
అంతర్ముఖంలో
చూడటానికి
మరొక
మార్గం
కూడా
వుంటుండాది.
మనం
కన్నులు
మూసుకుంటే
ఒక
నల్లని
చుక్క
నిల్చిపోతుండాది.
దానిని
చూడాలనుకుంటే
పరుగెత్తి
పోతుంది.
అది
పరుగెత్తిపోకుండా
నిలబెట్టినప్పుడే
నీకు
ధ్యానం
లభ్యమవుతుంది.
అదే
నిజమైన
ధ్యానము.
ఆ
చుక్కనే
అజ్ఞానంలో
వున్న
ప్రజ్ఞానం,
ప్రజ్ఞానంలో
వున్న
సుజ్ఞానం,
సుజ్ఞానము
నందున్న
పరంజ్యోతి.
అది
ఎక్కడుంటుందంటే
అశాంతిలోనే
ప్రశాంతి,
ప్రశాంతిలోనే
ప్రకాంతి,
ప్రకాంతిలోనే
పరంజ్యోతి.
పరంజ్యోతే
పరమాత్మతత్వమని
అశాంతిలోనే
మనకు
లభ్యమవుతుంది.
అంగము,
జంగము,
సంఘము,
లింగము
యీ
నాల్గింటి
యొక్క
స్థాయి
లోపలనే
ఆత్మతత్వమొస్తుంది.
అంగము
దేహము.
సర్వాంగములతో
కూడినది
యీ
దేహము.
ఈ
అంగములో
ఒక
సంఘముంది.
అది
సొసైటీ.
ఏమిటా
సొసైటీ?
అక్కడ
ఆరు
మంది
మెంబర్సు
వుంటున్నారు.
వారే
కామ,
క్రోధ,
లోభ,
మద,
మోహ,
మాత్సర్యములు.
ఈ
దేహములో
ఆ
ఆరుమంది
చేరుతుంటారు.
ఏ
పనీ
చేయించరు.
ఒకరు
ఒకదాన్ని
ఆశిస్తే
మరొకరు
యింకోదాన్ని
ఆశిస్తుంటారు.
ఈ
మీటింగులో
యే
ఒక్కదాన్ని
కూడా
నిర్ణయం
చేసుకోలేరు.
ఈ
సంఘములో
జంగము
అని
ఒకడున్నాడు.
అతనే
యీ
సంఘాన్నంతా
ఏకం
చేస్తాడు.
అదే
జీవుడు.
ఆ
జీవతత్వము
పరతత్వము
యొక్క
ప్రతిబింబమే.
అతనే
లింగము.
లింగమనగా
ఏమిటి?
లీయతే
గమ్యతే
యితి
లింగః
అన్నారు.
అతనికి
ఆది
అంత్యమే
లేదు
అన్నారు.
లింగము
వుంటున్నాది.
ఏ
ప్రక్కన
పెట్టియైనా
పూజ
చేసుకోవచ్చు.
దానికి
ఆది
లేదు
అంత్యము
లేదు.
అది
లింగము
యొక్క
ఆకారము.
ఏవిధముగా
చేసినప్పటికి
ఫలితము
మీకు
వస్తుంది.
చాలామందికి
తెలిసి
వుంటుంది.
వర్షాకాలము
వచ్చేటప్పటికి
భూమి
దున్ని
విత్తనాలు
వేస్తారు.
ఈ
విత్తనము
ఏ
విధంగా
వేస్తే
మొక్క
వస్తుంది,
ఏ
విధంగా
వేసినా
సరే
మొక్క
వస్తుంది.
కాబట్టి
యీ
ధ్యానము
లోపల
భగవత్తత్వము
ప్రేమతో
నింపుకొని
ఏ
రకంగా
చేసినా
అది
ధ్యానమవుతుంది.
సాలోక్యమే
సామీప్యముగా
వస్తుంది.
సామీప్యమనగా
యేమి?
అతి
సమీపముగా
వస్తుంది.
సమీపముగా
వచ్చినది
సారూప్యముగా
రూపొందుతుంది.
చిన్న
ఉదాహరణము.
ఒక
నది
చక్కగా
వేగంగా
పరుగెత్తుతున్నది.
అది
సారూప్యము.
అనగా
యింత
పెద్ద
సముద్రముగా
కనుపిస్తుంది
కదా
పెద్ద
river
అనుకుంటాము.
కాని
అది
సముద్రము
కాదు.
సముద్రమువలె
కనుపిస్తున్నాది
గాని
సముద్రము
కాదు.
సారూప్యం
దాని
రూపకముగనే
కనుపిస్తున్నాది
ఎప్పుడు
సారూప్యముగా
కనుపిస్తుంది.
సామీప్యం
సముద్రమునకు
దగ్గర
పోయినప్పుడే
కనుపిస్తుంది.
కారణం.
ఈ
సముద్రుడు
ఒప్పుకునేవాడు
కాదు.
ఈ
river
కూడను
నేను
పోను
అని
అంటుంది.
దీనిని
సముద్రము
నెట్టుతుంది.
దీనినే
ఆటుపోటు
అంటారు.
నది
పోయి
సముద్రములో
చేరటానికి
పోతుంది.
సముద్రము
నాలో
చేరవద్దని
గెంటివేస్తుంది.
వెనుకకు
వచ్చి
అది
సముద్రముగా
కనుపిస్తుంది.
దీనికి
దానికి
పన్నెండు
గంటలే
టైము.
9
▾
Meaning
Keep
His songs 5
పన్నెండు
గంటలు
దీనికి
దానికి
పోరాటం
జరుగుతుంది.
రాత్రి
ఆరుగంటలయ్యేటప్పటికి
దాని
యొక్క
భద్రతను,
దీని
యొక్క
విశ్వాసమును,
దీని
యొక్క
ప్రేమను
గురించి
యోచించుకొని
పాపం
నాలో
చేరటానికి
నీవు
యింత
తపిస్తున్నావు
వచ్చి
చేరిపో
అని
అంటాడు.
తాను
పైకి
వస్తాడు
నదిని
లోపలికి
తీసుకుంటాడు.
నది
సముద్రములో
చేరుతున్నప్పుడు
మీరు
చూస్తే
లోపల
తీపి
పైన
వుప్పునీరు.
అదే
జీవునికి
దేవునికి
వుండే
సన్నిహిత
సంబంధము.
వీడు
చేరాలని
పోతాడు.
నీవు
యిప్పుడు
రావటానికి
వీలుకాదంటాడు.
నేను
వుండలేనని
వాడు
ప్రతిజ్ఞ
పట్టేస్తాడు.
ఈ
విధమైన
కఠినమైన
దీక్ష
చేత
మనసు
కరిగి
లోపల
ప్రవేశింప
జేసుకుంటాడు.
ఈ
ప్రవేశించటానికి
మొట్టమొదట
సాలోక్యము.
అతని
చింత
చెయ్యాలి.
అతని
చింత
తప్ప
అన్యచింత
వుండకూడదు.
నీ
పనులు
నీవు
చేసుకో.
ఏ
పనులు
చేసుకున్నా
అతని
చింత
వుండాలి.
అప్పుడే
సామీప్యం
దగ్గరకు
వస్తావు.
దగ్గరకు
వచ్చి
సన్నిహిత
సంబంధ
బాంధవ్యము
పెంచుకుంటాడు.
క్రమక్రమేణా
యేమైపోతుందంటే
సారూప్యము
You
and
I
are
one
అనే
స్థితికి
వస్తాడు.
ఆ
తరువాతనే
సాయుజ్యము.
రెండు
ఒకటైపోతుంది.
ఏ
మతమునందైన,
ఏ
సిద్ధాంతమునందైన
యీ
నాలుగు
ఒకదానికొకటి
సన్నిహిత
సంబంధము
వుంటుండాది.
తత్వములు
వేరుగాని
గమ్యము
ఒక్కటే.
అదే
క్రిస్టియన్స్లో
కూడా.
జీసస్
మొట్టమొదట
అదే
చెప్పాడు.
I
am
the
messenger
of
God
అన్నాడు.
అనగా
God
వేరే
వున్నాడు
నేనొక
messenger.
కాని
యీ
పరితాపము
పెరుగుతూ
పెరుగుతూ
పోయింది.
సాలోక్యములో
చేరాడు.
తదుపరి
God
is
my
father,
I
am
the
son
of
God
అన్నాడు.
అనగా
relationship
పెరిగిపోతూ
వచ్చింది.
అంటే
అతను
తండ్రి
యితను
కొడుకు.
వీరికి
సంబంధము
యేర్పడిపోయింది.
మూడవ
step
వచ్చేటప్పటికి
I
and
my
father
are
one
అన్నాడు.
one
అనే
స్థితికి
సారూప్యానికి
వచ్చేటప్పటికి
Holy
Ghost
అదే
సాయుజ్యము.
మహమ్మదీయులు
దీన్నే
చెప్తూ
వచ్చారు.
I
am
in
the
light.
భగవంతుడు
ఆకాశంలో
వుంటున్నాడన్నారు.
లైట్
అంటే
రెండర్థాలు.
వెలుగని
ఒకటి,
తేలిక
అని
మరొకటి.
అదే
పైన
పోతే
ether
తేలికగా
వుంటుంది.
కనుకనే
I
am
in
the
light
అన్నాడు.
అనేటప్పటికి
తాను
తేలికగా
మారిపోతూ
వచ్చాడు.
మరికొంత
సాధన
చేసేటప్పటికి
Light
is
in
me
అన్నాడు.
ఆ
లైటు
నాలోనే
వుంటున్నది.
యిదే
సామీప్యం.
Third
దీనికొచ్చేటప్పటికి
I
am
the
light
అన్నాడు.
ఇదే
సారూప్యము.
There
is
no
weight
యిదే
సాయుజ్యం.
కనుకనే
అన్ని
మతములు
నిన్నె
చూపును
అన్ని
మూర్తులు
నీదు
రూపులె
భారతీయుల
వేదాంతమునందు
కూడను
అదే
బోధిస్తూ
వచ్చారు.
ద్వైతము,
విశిష్టాద్వైతము
అద్వైతము.
10
▾
Meaning
Keep
ప్రతి
మతమునందు
యీ
మూడు
ఎవ్వరు
విడదీయటానికి
వీలుకాదు.
విద్యార్థులారా!
మనిషి
పవిత్రత
ఎటువంటిది
అనేది
విచారణ
చేసి
మీరు
వినియోగించుకోవాలి.
ఈ
విచారణ
కూడను
వివేకంతో
చేయాలి.
కేవలం
విజ్ఞానాన్ని
ప్రవేశపెట్టకూడదు.
విజ్ఞానం
వేరు.
వివేకం
వేరు.
ఎంతటి
విజ్ఞానమైనను
వివేకం
లేకపోతే
నిరుపయోగమైపోతుంది.
ప్రమాదం
వచ్చేస్తుంది.
కనుక
వివేకం
వుండినప్పుడే
విజ్ఞానం
కూడ
వుపయోగమవుతుంది.
వివేకానికి
వినయం
కావాలి.
ఈ
వినయమే
విద్య
యొక్క
ప్రధానమైన
ప్రాణము.
ఇవన్నీ
ఆధ్యాత్మికం
చేతనే
కట్టుబడి
వుంటుండాయి.
ఇవన్నీ
అర్థం
కావటానికి
మొట్టమొదట
మీరు
ధారణను
ప్రాక్టీసు
చేయండి.
ఇది
ఎప్పుడు
చెయ్యాలి?
కాలములో
కూడను
సత్వరజస్తమో
గుణాలుంటున్నాయి.
భూమిలో
కూడను
సత్వరజోతమో
గుణాలుంటున్నాయి.
చూడండి
గాలి
సాత్వికము.
అది
భూమినుంచి
ఆవిరిగా
పోతుండాది.
ఇంక
రాజసికము.
రాజసిక
మనేది
లిక్విడ్.
రాజసికమనగా
కదులుతూ
వుండటమన్నమాట.
అనేకరకముల
చలించటం.
తామసికము
వుంటుండాది.
తామసికము
జడము.
తామసికమనేది
ఫిజిక్సు
మెటీరియల్.
రాజసికమైనది
కెమిస్ట్రీ.
ఈ
రెండింటి
యొక్క
సంబంధముతో
కూడినదే
సాత్వికము.
అదే
అన్నిటికిని
సృష్టికారకముగా
వుంటుండాది.
అదే
బయోసైన్సు.
ఈ
మూడింటి
యందు
యీవిధములైన
గుణములుంటున్నాయి.
కాలములో
కూడ
మూడు
వుంటున్నాయి.
ఇక్కడ
రాత్రి
8
గంటలు
మొదలుకొని
తెల్లవారుఝామున
4
గంటల
వరకు
ఎనిమిది
గంటలు
తామసికమైన
టైము.
ఇప్పుడు
పశువులు,
పక్షులు
కూడ
నిద్రిస్తాయి.
ఇది
దయ్యాల
కాలమని
అంటారు.
రాక్షసులకిది
చాలా
బలమైనది.
తామసిక
వృత్తులకిది
చాలా
పటుత్వమైనది.
తెల్లవారి
ఎనిమిది
గంటలు
మొదలుకొని
సాయంకాలము
నాలుగు
గంటల
వరకు
రజోగుణ
సంబంధమైన
కాలము.
ప్రతి
ఒక్కరు
కూడను
పనులు
ప్రారంభిస్తారు.
అధికారులు,
ఆఫీసర్లు
8
గంటలనుంచి
4
గంటల
వరకు
ఆఫీసులకు
వెడతారు.
అంతా
పనులు
చేసే
టైము
అది.
ఆ
8
గంటలు
రాజసికము.
తెల్లవారుఝాము
4
గంటలనుండి
8
గంటలవరకు
4
గంటలు,
సాయంకాలము
4
గంటలనుండి
8
గంటలవరకు
4
గంటలు.
ఈ
నాలుగు
ఆ
నాలుగు
8.
సాత్వికము
8.
రాజసికం
8.
తామసికం
8
గంటలు.
8×3=24
గంటలు
కరెక్టుగా
సరిపోయింది.
తెల్లవారి
4
గంటలనుండి
సాత్వికం
ప్రారంభమవుతుంది.
అప్పుడే
మనమంతా
లేచి
వుండాలి.
ఈ
సాత్విక
కాలము
లోపల
మన
సాధనలో,
మన
స్టడీనో
ప్రారంభించాలి.
అప్పుడే
పవిత్రమైన
స్థితి.
అప్పుడు
లేచి
స్నానము
చేసి
యింద్రియములను
లేపి
నీవు
కూడను
గలీజులో
పడి
యీవిధంగా
వుండనక్కరలేదు.
స్నానము
చేయనక్కరలేదు.
ఆ
సమయంలో
చాలా
శాంతంగా
వుంటుంటాయి
యింద్రియాలు.
విశ్రాంతి
తీసుకొని
వుంటాయి.
ఆ
విశ్రాంతి
లోపల
నీవు
దేనిని
చింతించినా
చాలా
సూటిగా
చేరిపోతుంటాది
భగవత్తత్వము.
11
▾
Meaning
Keep
మరచిపోయిన
విషయాలు
అప్పుడే
జ్ఞాపకం
వస్తుంటాయి.
ఆ
సాత్వికమైన
టైము
లోపలనే
మీరు
ప్రార్థనలు
ప్రారంభించాలి.
అబ్బా
4
గంటలకు
5
గంటలకు
లేవటానికి
వీలుకాదని
8
గంటలకంతా
లేస్తారు.
ఇంక
కొంతమంది
పిల్లలు
యిక్కడకు
రాక
మునుపు
9
గంటలకు
లేచి
ఆ
పాచి
ముఖంతోనే
స్కూలుకు
వెళ్లిపోయేవారు.
వీరు
కేవలం
కుంభకర్ణుని
సోదరులు.
4
గంటలకు
లేచి
కాలకృత్యాలు
తీర్చుకోండి.
కాళ్లు
ముఖం
కడుక్కోండి.
కూర్చోండి
ఆనందంగా,
ఎందుకోసం
ముఖం
కడుక్కోవాలంటే
నిద్రరాకుండా
నిమిత్తమే
ముఖం
కడుక్కోమనేది.
ఈ
విధమైన
సూక్ష్మమైన
విషయాలు
గుర్తించుకుంటే
ధ్యానం
అతి
సులువుగా
కుదిరిపోతుంది.
సాయంకాలం
కూడను
అంతే
కాలేజి
నుండి
వస్తావు.
4
గంటలనుంచి
9
గంటలవరకు
టైము
వుంటుండాది.
ఆటలాడుకో,
గేమ్సు
నేర్చుకో.
కాని
6
గంటలకు
నీవు
పోయిన
తరువాత
కాళ్లు
చేతులు
కడుక్కొని
ఒక
ఐదు
నిముషాలైనా
కూర్చో.
రెండు
నిముషములు
24
సెకన్లే
వుంటుండేది
ధ్యానం.
నువ్వేం
పెద్ద
గంటలకొద్దీ
కూర్చోనక్కరలేదు.
ఆ
విధంగా
చేస్తుంటే
ఎంత
పవిత్రంగా
మారుతుంది?
నిజంగా
ఆ
విధంగా
చేసి
చూడండి
మీ
ఆనందము
మీకే
తెలుస్తుంది.
మీ
పవిత్రత
యెంతనో
అభివృద్ధి
అవుతుంది.
ఈనాడు
మీరు
నిరంతరము
పిచ్చిభావాలు,
పిచ్చి
ఊహలలోనే
పోతున్నారు.
కనుక
ఆ
ముఖాలు
చూస్తే
యేదో
ఒకవిధంగా
వుంటుంటాయి.
జబ్బు
వచ్చిన
వారి
ముఖాలుగా
వుంటుంటాయి.
అక్కడ
ఏ
తేజస్సు
వుండదు.
పవిత్రతే
తేజస్సుకు
మూలకారణము.
లోపల
పవిత్రత
వుంటుంటే
ముఖవర్చస్సు
ఎంత
తేజంగా
వుంటుంది.
ఒక
చిన్న
ఉదాహరణ.
చూడండి.
నాకు
64
ఏండ్లు.
నేనెట్లున్నాను.
మీరు
16
ఏండ్ల
పిల్లలు.
ఎట్లున్నారు?
తేజస్సు
లేకుండా
పోవటానికి
కారణం
ఏమిటి?
మీ
థాట్సే.
మీ
అపవిత్రతే
దీనికి
కారణము.
కనుక
పవిత్రతను
మీరు
పోషించుకోండి.
ఈ
పవిత్రత
యెంత
పెరుగుతుందో
అంత
మీరు
యువకులుగా
వుంటారు.
ఏ
రోగములు
మీలో
ప్రవేశించవు.
దానిని
మీరు
సాధించండి.
అన్నింటిని
ప్రేమ
చేతనే
సాధించండి.
అది
లేకపోతే
దేనిని
సాధించటానికి
వీలుండదు.
ఈ
ధారణ,
ధ్యానము,
సమాధి
తత్వాన్ని
తెలుసుకోవాలనేవారు,
లేక
దీనిని
ప్రాక్టీసు
చేయాలని
ఆశించేవారు
తరువాత
మీకందరికి
విడివిడిగా
నేను
చెప్తాను.
ఇది
చాలా
అవసరం
మన
యిన్స్టిట్యూట్లో.
యీ
భౌతిక
విద్యలతో
బాటు
ఆధ్యాత్మిక
అమృతాన్ని
కూడను
మీరు
ఆరగించాలి.
చాలా
వాటిపైన
శ్రద్ధ
భక్తులు
అభివృద్ధి
పరచి
మీ
జీవితములో
ప్రధానమైన
Subject
గా
నిర్ణయించుకోండి.
ప్రతిదినము
యీవిధమైన
సమావేశము
జరపటం
చేత
అనేకమంది
భక్తులకు
కొంత
అననుకూలంగా
వుంటుండాది.
పాపం
తెల్లవారి
మాత్రమే
వాళ్లకు
యింటర్వ్యూలంతా
యిస్తున్నాను.
సాయంకాలం
లేకపోవటం
చేత
చాలామంది
నిరాశతో
వెళ్లిపోతున్నారు.
కనుక
యికపైన
బేస్తవారము,
ఆదివారములు
మాత్రమే
యీ
సమావేశములు
మనం
పెట్టుకుందాం.
నా
కాలమంతా
3
భాగములు
మీకే
యిస్తున్నాను.
ఈ
వున్న
ఒక
భాగము
మీకే
యిస్తే
వాళ్ల
గతి
యేమౌతుంది?
నిజంగా
వారికే
ఎక్కువ
భక్తి
శ్రద్ధలంతా.
12
▾
Meaning
Keep
ఎంతో
దూరంనుంచి
ఎన్నో
వేలు
ఖర్చుపెట్టుకొని
ఎన్నో
శ్రమలకోర్చి,
ఎన్నో
అననుకూలములంతా
అనుభవించి
స్వామికోసమని
కాచుకొని
వుంటుంటారు
పాపం.
కనుక
వారికి
కూడను
ఆనందాన్నందించవలసిన
బాధ్యత
నాకుంది.
ఇంక
మున్ముందు
ఒక
బేస్తవారము,
ఒక
ఆదివారము
మాత్రమే
మన
సమావేశాలు.
Previous
←
All the World Is Filled with Brahman
Next
The Ātma Principle Is Everywhere
→