Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1989 · Dharma Alone Is the Foundation
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Dharma Alone Is the Foundation
6 August 1989
1
▾
Meaning
Keep
ధర్మయేవ
సదా
మూలం,
ధర్మయేవ
సదా
గుణం.
సమస్తమునకు
ధర్మమే
మూలాధారం.
ధర్మమునకు
మించిన
సద్గుణము
మరొకటి
లేదు.
ఇట్టి
ధర్మము
వ్యక్తి
ధర్మమనియు,
గృహస్థ
ధర్మమనియు,
సామాజిక
ధర్మమనియు,
రాజ్య
ధర్మమనియు
నాలుగు
విధములుగా
వుంటున్నాయి.
ఇవన్నికూడను
ఒక
దానికొకటి
ఆశ్రయించి
అన్యోన్యానురాగము
చేత
అభివృద్ధి
చెందుచున్నవి.
ఇవన్నికూడను
అవినాభావ
సంబంధము
అన్యోన్యాశ్రయము.
వ్యక్తి
ధర్మమే
సరిగా
లేకపోయిన
గృహస్థ
ధర్మము
నశిస్తుంది.
ఈ
గృహస్థ
ధర్మమే
నశించిన
సామాజిక
ధర్మమే
క్షీణిస్తుంది.
సామాజిక
ధర్మమే
క్షీణించిన
రాజ్యము
అధః
పతనమై
పోతుంది.
కనుక
రాజ్యము
యొక్క
క్షేమము
అంతయు
వ్యక్తి
ధర్మముపైనే
ఆధారపడి
వున్నది.
మానవులకు
ధర్మ
అర్థ
కామములనేవి
పురుషార్థములుగా
భావించి
యీ
మూడే
మానవుని
ప్రధాన
సూత్రములుగా
విశ్వసించినది.
ఏ
దేశమునందైనా,
ఏ
కాలమునందైనా,
ఏ
పరిస్థితులందైనా
మానవునకు
యీ
మూడు
ప్రధాన
సూత్రములు.
ఇట్టి
ధర్మ
శాస్త్రములను
వుద్భవింప
చేసి,
పోషించి,
ప్రచారింప
చేసినవాడు
మనువు.
కనుకనే
మనువు
మానవ
రాజ్యమునకు
ప్రధాన
సూత్రధారియై
అతను
ఒక
తండ్రిగా
నిలుస్తూ
వచ్చాడు.
ఈ
ధర్మశాస్త్రమునకు
మనువే
మూలాధారము.
రెండవది
అర్థశాస్త్రము.
ధనము
యేవిధముగా
వుపయోగించాలి.
ఏ
విధముగా
సంపాదించాలి.
ఏ
విధముగా
అనుభవించాలి,
ఏ
విధముగా
దీనిని
వ్యాప్తి
గావించాలి
అనే
విషయమును
చక్కగా
విచారణ
చేసినవాడు
ఒక
వ్యక్తి.
అతనే
చాణిక్యుడు.
అతనికి
మరొక
పేరు
కౌటిల్యుడు.
ఇతనికి
యింకొక
పేరు
విష్ణుగుప్తుడని.
చాణిక్యుడు,
కౌటిల్యుడు,
విష్ణుగుప్తుడు
యీ
మూడు
కూడను
అతని
పేర్లు.
విష్ణుగుప్తుడని
పెట్టిన
పేరు.
కౌటిల్యుడనగా
కౌటిల్య
గోత్రములో
పుట్టినవాడు
కనుక
కౌటిల్యుడని
మరొక
పేరు.
అంతేకాదు
కుటిల
చిత్తుడుగా
వుండుట
చేత
కౌటిల్యుడని
పేరు
వచ్చింది.
చాణిక్యుడనగా
అతను
జన్మించిన
గ్రామము
పేరు
చాణుక్య
గ్రామము.
ఆ
చాణుక్య
అనే
గ్రామము
నుండి
ఆవిర్భవించినవాడు
కనుక
ఆ
గ్రామము
పేరు
బట్టి
చాణిక్యుడని.
పూర్వకాలమందు
ఒకో
వ్యక్తి
తన
గ్రామము
పురస్కరించుకొని
దాని
జ్ఞాపకార్థముగా
వారు
పేరును
పెట్టుకునేవారు.
పూర్వము
vice
chancellor
గోకాక్
మీకు
తెలుసు.
ఆ
గోకాక్
పేరుకు
యేమాత్రము
అర్థము
లేదు.
అతను
పుట్టిన
గ్రామము
పేరు
అది.
అతని
గ్రామము
పేరు
గోకాక్
అని
పెట్టుకున్నాడు.
ఆంధ్రప్రదేశ్
లో
పండితుడు
వుంటున్నాడు
నారాయణాచార్యులు.
అతను
పుట్టపర్తిలో
పుట్టినవాడు
కనుక
అతనికి
పుట్టపర్తి
అని
పేరు.
అదేవిధముగనే
యీ
చాణిక్యుడు
చాణుక్య
పురమునందు
పుట్టినవాడు
కనుక
అతనికి
ఆ
గ్రామము
పేరు
పెట్టారు.
2
▾
Meaning
Keep
అర్థశాస్త్రమునందు
యీ
చాణిక్యుడు
ఆధారము.
ఇంక
కామ
శాస్త్రము.
కామశాస్త్రమనగా
కేవలము
యిచ్ఛాశక్తిని
అభివృద్ధి
పరచుకోటము.
ఏ
విధముగా
యీ
యిచ్ఛను
అభివృద్ధి
గావించుకోవాలి;
ఏ
విధముగా
పవిత్రము
గావించుకోవాలి
అనే
విషయమును
స్థాపించాడు.
ఈ
కామ
శాస్త్రమునకు
వాత్సాయని
దీనికి
కర్త.
ఒక్కొక్క
శాస్త్రమునకు
ఒక్కొక్కడు
ఆధారముగా
నిలుస్తూ
వచ్చారు.
ధర్మశాస్త్రమునకు
మనువు,
అర్థశాస్త్రమునకు
చాణిక్యుడు,
కామశాస్త్రమునకు
వాత్సాయని
యీ
ముగ్గురూ
చాలా
ఆదర్శ
పురుషులు.
ఐతే
యీ
మూడూ
కూడను
ప్రత్యేకించి
ఒకదానికొకటి
ఆశ్రయించి
అన్యోన్య
ఆశ్రయముగా
పోషిస్తూ
వచ్చారు.
ధర్మమును
అనుసరించియే
అర్థము.
ధనమును
ధర్మరూపములో
ఆర్జించాలి.
ధర్మమార్గములో
పోషించాలి.
ధర్మమార్గములో
అనుభవించాలి.
అప్పుడే
యీ
అర్థమునకు
సార్థకత
యేర్పడుతుంది.
కనుక
ధర్మమును
పురస్కరించుకొనియే
అర్థము
అభివృద్ధి
గావించాలి.
అనుభవించాలి.
కామము
అనగా
యిచ్ఛాశక్తి
desire.
ఈ
desires
కూడను
ధర్మార్థము
ననుసరించియే
కోరికలు
అనుభవించాలి.
ధర్మమునకు
విరుద్ధముగా
కాని,
అర్థమునకు
విరుద్ధముగా
కాని
మనము
యీ
కామమును
అనుభవించరాదు.
ధర్మార్థముగా
అనుభవించిన
యిచ్ఛాశక్తియే
సార్థకమవుతుంది.
ఏతావాతా
ధర్మార్థ
కామములు
మానవునికి
ప్రధానమైన
ప్రాణములు.
ప్రాచీన
కాలమునుండి
యీ
విధమైన
దీనిని
అనుసరిస్తూ
మానవులు
తమయొక్క
మానవత్వమును
పోషించుకుంటూ
వచ్చారు.
ఐతే
అర్థకామమనేది
ధర్మమనేది
కాలానుగుణ్యముగా
కొంత
మార్పు
చెందుతూ
వస్తుంటాయి.
ప్రతి
విషయము
కూడను
దేశకాల
పరిస్థితుల
ప్రభావము
పురస్కరించుకొని
మార్పు
చెందుతూ
వుంటుంది.
రెండవ
ప్రపంచ
ప్రపంచ
యుద్ధము
ముగిసి
45
సంవత్సరములైనది.
ఇది
ముగించటం
1945.
ఏతావాతా
ఆ
కాలమునందే
డుక్కర్
అనేవాడు
మేనేజిమెంటు
గురించి
వ్రాస్తూ
వచ్చాడు.
అప్పటి
కాల
పరిస్థితులను
పురస్కరించుకొని
ఆ
మేనేజ్మెంటును
వారు
సరైనదిగా
విశ్వసిస్తూ
వచ్చారు.
డుక్కర్
మేనేజ్మెంటు
లోపల
ఒక
విధమైన
నెగిటివ్
ను
మాత్రమే
డెవలప్
చేస్తూ
వచ్చాడు.
World
war
ముగిసిన
తరువాత
ఒక్కొక్క
దేశములో
పరిస్థితులు
చాలా
మార్పు
చెందుతూ
వచ్చాయి.
అప్పటి
పరిస్థితి
లోపల
యీ
వ్యాపారములన్నికూడను
ఆ
దేశములకు
మాత్రమే
సంబంధించినవిగా
వుండేవి.
క్రమక్రమేణా
దీనిలో
కొంత
మార్పు
గావించుకుంటూ
కొన్ని
మార్పులను
గావించుకుంటూ
క్రైజియర్
కోర్పరేషన్
అనేవాడు
మరొక
మేనేజ్
మెంటు
ప్రారంభించాడు.
ఇతను
ఒక
ప్రొడక్షన్
మాత్రమే
లక్ష్యముగా
పెట్టుకుంటూ
వచ్చాడు.
ఈ
ప్రొడక్షన్
వల్ల
కేవలం
ధనం
సంపాదించాలనేదే
అతను
లక్ష్యంగా
తీసుకున్నాడు.
ఈ
ప్రొడక్షన్
అనేదానిలోగానీ,
యీ
వ్యాపారమనే
దానిలోగాని
మేనేజ్
మెంటులో
గాని
కేవలం
ఒక
lifeless
గా
వారు
భావిస్తున్నారు.
ఈ
వ్యాపారంలో
కొంచెం
అలక్ష్యంగా
ప్రవర్తించటానికి
మూలకారణము
ఏమిటి?
3
▾
Meaning
Keep
ఇది
జడమైనది.
లోక
సంబంధమైన
వ్యవహారములని
మనము
భావిస్తున్నాము.
మానవుడెంత
చిన్నకార్యము
చేసినప్పటికిని
దానిలో
కొన్ని
ప్రాణసమానమైనవి
వుంటున్నాయి
సూత్రములు.
మానవుడు
పైకి
ఆకారముగా
కన్పించినప్పటికిని
అతనిలో
ఐదు
విలువైన
ప్రాణములు
అతన్ని
సంరక్షిస్తూ
వస్తున్నాయి.
ప్రాణ,
అపాన,
వ్యాన,
ఉదాన,
సమాన
అనేటువంటి
ప్రాణములు,
యివి
లేకపోతే,
యిందులో
యే
ఒకటి
క్షీణించినప్పటికి
మానవుని
ఆరోగ్యం
చెడిపోతుంది.
అదేవిధముగనే
వ్యాపారంలో
కూడా
ఐదు
ప్రాణములు
వుంటున్నాయి.
ఇందులో
యే
ప్రాణము
క్షీణించినప్పటికిని
వ్యాపారము
కుంటుపడుతుంది.
ఈ
వ్యాపారములో
మొట్టమొదటిది
ఉత్పత్తి.
పదార్థముల
ఉత్పత్తి.
ఐతే
ఉత్పత్తి
చేసిన
దానిని
కేవలం
అలక్ష్యముగా
వుంచరాదు.
ఈ
ఉత్పత్తియైన
పదార్థములను
క్రోడీకరణ
చేసుకోవాలి.
collection
చేసుకున్న
వస్తువులను
కాపాడుకుంటూ
రావాలి.
ఈ
రక్షింపబడినదానిని
మనము
ఏ
మార్కెట్టుకో
యే
ఏజంట్సుకో
కొంత
సంబంధ
బాంధవ్యము
కల్పించాలి.
ఈ
విధముగా
సప్లై
చేయటానికి
తగిన
విధముగా
మనము
develop
చేసుకోవాలి.
ఈ
విధముగా
యిందులో
యీ
ఐదు
లేకపోతే
వ్యాపారము
కేవలము
క్షీణిస్తుంది.
నష్టపోతుంది.
కనుక
యీ
వ్యాపారమునందు
ఐదు
ప్రాణములు
ఏమిటి?
మొట్టమొదటిది
Production.
Protection
రెండవది.
Collection
మూడవది.
నాల్గవది
connection.
ఐదవది
direction.
ఈ
ఐదు
వ్యాపారమునకు
ప్రాణములు.
ఇందులో
ఏ
ఒక్కటి
లేకపోయినప్పటికిని
వ్యాపారములో
మనము
నష్టము
ననుభవిస్తాము.
కాని
ఒక
ప్రొడక్షన్
మాత్రమే
తీసుకుంటే
ఏ
విధమైన
collection
లేకుండా
వుంటుంది.
ఏ
విధమైన
collection
లేకుండా
పోతే
యేవిధమైన
protection
లేకుండా
వుంటుంది.
కనుక
అన్నికూడను
ఆయా
సమయమునకు
అత్యవసరమే.
వస్తువులు
production
చేసి
collection
చేసి
protection
చేసి
పెట్టుకున్నాము.
దీనికి
మార్కెట్
కో,
ఏ
ఏజంటుకో
connection
లేకపోతే
యిది
కేవలము
క్షీణించి
పోతుంది
యీ
పదార్థము.
రైలుకు
యింజను
ముందు
గార్డు
వెనుక.
కనుక
production
అనేది
యింజను.
Direction
అనేది
గార్డు.
ఈ
Production
కి
direction
కి
మధ్య
collection,
protection
connection
యీ
మూడు
కలిసి
వుంటున్నాయి.
ఈ
ఐదింటిని
లక్ష్యములో
పెట్టుకున్నామంటే
మనము
మేనేజ్మెంటు
యేవిధముగా
దీనిని
అనుభవించాలనే
విషయము
గుర్తించుకోవచ్చును.
ఐతే
యీ
పంచప్రాణములు
nature
of
nation
కి
సంబంధించినదిగా
వుంటుండాలి.
ఏ
ఏ
దేశము
యొక్క
పరిస్థితుల
ప్రభావములు,
ఏ
ఏ
దేశముయొక్క
discipline
ను
అనుసరించి
యీ
వ్యాపారము
సంబంధించినదిగా
వుండాలి.
నేటి
వ్యాపారములన్నికూడను
ఒక్క
nation
కు
మాత్రమే
సంబంధించినది
గా
లేదు.
International
గా
వుంటున్నది
యీ
వ్యాపారమంతా.
మనము
అనేక
మిషన్లు
విదేశములనుండి
తెప్పించుకుంటున్నాము.
4
▾
Meaning
Keep
ఆ
మిషను
యేమైనా
చెడిపోతే
ఆ
parts
విదేశములనుండి
తెప్పించుకుంటున్నాము.
కనుక
యీ
విధమైన
వ్యాపారము
nation
దాటి
International
గా
వ్యాప్తి
అయిపోయింది.
ఒక
చిన్న
example.
కారులో
corporator
వుంటున్నాది.
ఈ
corporator
లోంచి
పెట్రోలు
పోవటానికి
చిన్న
పైపు
వుంటుంది.
దాని
పేరు
జెర్రి.
ఈ
జెర్రి
మన
యిండియాలో
తీసుకుంటే
ఒక
రూపాయి
రెండు
రూపాయలకు
లభిస్తుంది.
దీనినే
అమెరికా
నుండి
తెప్పించుకుంటే
200
లేక
250
రూపాయలు
ఖర్చవుతుంది.
ఇది
పూర్వకాలమునందు
జరిగేది.
ఈ
జెర్రి
అనే
చిన్నపైపును
మనము
యిక్కడ
తయారు
చేసుకోలేకపోయాము.
ఇప్పుడు
కూడను
కొన్ని
వ్యాపారములలో
మీరు
గుర్తించవచ్చు.
మన
భారత
దేశము
లోపల
మారుతీ
కార్లు
production
చేస్తున్నారు.
వాటిని
assemble
చేస్తున్నారుగాని
parts
అంతా
విదేశమునకు
చెందినవి.
దీని
హారన్
జపాన్
నుండి
వస్తుంది.
వారు
సప్లై
చేస్తున్నారు.
ఈ
మారుతీ
కారు
హారన్
మూడు
నెలలలోనే
అది
శిథిలమై
పోతున్నది.
పని
చేయుటం
లేదు.
కారణం
ఏమిటి?
జపాన్
లో
వారు
హారన్
వుపయోగపెట్టనవసరం
లేదు.
వారి
వాతావరణము
బట్టి
ఆ
హారన్
ఆ
విధంగా
production
చేశారు.
భారత
దేశము
యొక్క
పరిస్థితి
బట్టి,
మనము
అడుగడుగుకు
హారన్
యివ్వాలి.
తద్వారా
మూడు
నెలల
లోపలనే
పోతున్నాది.
ఈనాడు
యీ
International
వ్యాపారములో
యీ
విధమైన
అవస్థలు
ఎన్నో
జరుగుతున్నాయి.
కనుక
ఒక
సామాను
ఒక
దేశము
మరొక
సామాను
మరొక
దేశము
యీ
విధముగా
కల్తీ
చేయటము
చేత
ఒక
విధమైన
ప్రమాదము
కూడా
జరుగుతూ
వుంటుంది.
ఇది
సరియైనది
కాదు.
ఏదైన
ఒక
పదార్థమును
మనము
వుత్పత్తి
చేయాలంటే
ఆ
పదార్థమునకు
సంబంధించిన
అంగములు,
వుపాంగములన్నియు
మనకు
మనమే
తయారు
చేసుకొనేటట్టుగా
వుండాలి.
అప్పుడే
మనకు
adjustment,
understand
చేసుకోటానికి
అవకాశము
వుంటుంది.
ఇప్పుడు
చూడండి
car
drive
చేస్తుంటారు.
accelerator
ఒకడు
స్టీరింగు
చేస్తుంటే
ఏక్సిడెంటు
అయిపోతుంది.
కనుక
accelerator,
స్టీరింగు
ఒకరి
control
లోనే
వుండాలి.
అప్పుడే
కారు
సరైన
రీతిలో
డ్రైవ్
చేయవచ్చు.
ఈనాడు
control
ఒకరి
చేతిలో
వుంటున్నాది.
driving
మరొకరి
చేతిలో
వుంటున్నాది.
అందువలన
మన
వ్యాపారములో
చాలా
కష్టములు,
నష్టములు
కడపటికి
మూసివేయటము
జరుగుతున్నాది.
కనుక
వ్యాపార
విషయము
లోపల
కేవలము
ఒక
మేనేజ్
మెంటు
చెప్పినట్టే
కాదు
అనేక
విధములైన
విషయములను
చక్కగా
విచారణ
చేసి
తగినరీతిలో
గుర్తించి
అర్థము
చేసుకోవాలి.
మరికొన్ని
విషయములు
కూడా
మీరు
గుర్తించాలి.
ఈ
వ్యాపార
సంబంధమైన
విషయము
లోపల
మనము
ఒక్కొక్క
పదార్థము
ఎంతవరకు
దీనికి
సరియైన
విలువ
అవుతుంది.
ఒక
పదార్థము
మనము
వుత్పత్తి
చేశామంటే
దీనికయ్యే
ఖర్చెంత?
దీనిపై
profit
ఎంత?
దానిపై
tax
ఎంత?
ఈ
విధమైన
expenses
అంతా
తీసుకొని
దీనికి
ఖర్చులు
తీసుకుంటే
అప్పుడు
దానిపైన
ఎంత
profit
వస్తుంది
ఆ
విషయమునే
చాణిక్యుడు
అర్థశాస్త్రములో
చక్కగా
బోధిస్తూ
వచ్చాడు.
5
▾
Meaning
Keep
వచ్చిన
ఆదాయము
లోపల
ఒక
కాలు
భాగము
భవిష్యత్తుకు
భద్రము
చేయాలి.
మూడు
భాగములు
యీ
ఫ్యాక్టరీ
production,
collection,
protection,
direction
కు
వుపయోగపెట్టాలి.
ఐతే
యీనాటి
పరిస్థితి
లోపల
చాలామంది
లీడర్సుగా
వుంటుంటారు.
Leaders
అనగా
ఎవరంటే
Tata,
Birla,
కిర్లోస్కర్
వీరంతా
లీడర్సు.
వీరు
కూడను
పూర్వము
మేనేజర్సు.
ఇప్పుడు
దండిగా
ధనము
సంపాయించటం
చేత
వీరంతా
లీడర్సుగా
తయారయ్యారు.
ఈ
లీడర్సు
చేసే
అశ్రద్ధ
ఏ
విధముగా
వుంటుందో
చక్కగా
గుర్తించాలి.
ఒక్కొక్క
ఫ్యాక్టరీకి
share
holders
వుంటుంటారు.
ఈ
shareholders
లో
అతను
పదిలక్షలు
ముందు
పెట్టి
వుంటాడు.
తన
share
మొదటి
సంవత్సరములోనే
తాను
తీసుకుంటాడు.
తన
ధనము
తనకు
చిక్కాక
తను
factory
పైన
శ్రద్ధ
వహించడు.
కనుక
యీ
ఫ్యాక్టరీస్
అలక్ష్యముగా
అశ్రద్ధగా
మారిపోతున్నాయి.
కనుక
యీ
లీడర్సులో
వున్న
దుర్గుణమేమంటే
మొట్టమొదట
తన
మొత్తాన్ని
తాను
తీసుకోటానికి
ప్రయత్నిస్తాడు.
ఫ్యాక్టరీ
అభివృద్ధిగాని
దీనిని
సరియైన
రీతిలో
వ్యాప్తి
గావించాలనిగాని
ఆ
విశాల
భావము
చాలావరకు
వారిలో
లేదు.
నా
పెట్టుబడి
నాకు
వచ్చేసింది.
తరువాత
ఏమైనా
అయిపోనీ.
మూడు
భాగములు
మేనేజర్సు
యీ
విధముగానే
వుంటారు.
తద్వారానే
యీ
ఫ్యాక్టరీస్
కొంతవరకు
శిథిలము
కావటానికి
అవకాశమై
పోయింది.
కాని
చాణిక్యుని
తత్వము
లోపల
ఎప్పుడూ
కూడను
యిలాకాదు.
బ్లడ్డు
దుడ్డు
role
అవుతుంటేనే
క్షేమంగా
వుంటుంది.
సర్వత్రా
వ్యాపించినట్లైన
ఆ
ప్రదేశము
క్షేమంగా
వుంటుంది.
Blood
ఏవిధముగా
circulation
కావాలో
దుడ్డు
అదేవిధముగా
circulation
కావాలి.
చాణిక్యుని
అర్థ
శాస్త్రములో
యిది
ప్రధానమైనది.
కొంతవరకు
చాణిక్యుడు
యీ
అర్థశాస్త్రము
అభివృద్ధి
గావించుకుంటూ
రావటం
చేత
నందరాజులు
యీ
రాజ్యముపైన
బయలుదేరి
చంద్రగుప్తుని
ఓడించి
అతనిని
దేశ
బహిష్కరణ
గావించాడు.
చంద్రగుప్తుని
రాజ్యములో
చంద్రగుప్తుని
సహాయముగా
వుండేవాడు
చాణిక్యుడు.
చంద్రగుప్తుడు
ఓడిపోవటం
చేత
యీ
చాణిక్యునికి
చాలా
కష్టమై
పోయింది.
ఇతను
ఓడిపోవటానికి
కారణమేమిటా
యని
ఆ
కారణమును
చక్కగా
పరిశీలన
చేయుటానికి
ప్రయత్నించాడు.
మారువేషము
వేశాడు
గూఢచారిగా
వేషము
ధరించి
దేశమంతా
సంచరించాడు.
చాణిక్యుని
ఎవరూ
గుర్తించుకోలేకపోయారు.
ఐతే
ఆ
కాలములో
ఏ
విధముగా
వుండేదంటే
గృహస్థ
ధర్మము,
ఎవరు
అతిథి,
అభ్యాగతి
యింటికి
వచ్చినప్పుడు
వారిని
ఆదరించి
వారికి
తగిన
భోజన
సౌకర్యములు
చూచి
గౌరవించేవారు.
ఒకనాడు
ఒక
యింటికి
తాను
వెళ్లాడు
చాణిక్యుడు.
ఒక
వృద్ధురాలైన
ఒక
స్త్రీ
లోపలికి
ఆహ్వానించింది.
ఈనాడు
మీరు
మాయింటిలో
భోజనము
చేసి
పొండి
అని
ప్రార్థించింది.
6
▾
Meaning
Keep
ఆమెకు
ఒక
మనుమడు
వుండేవాడు.
ఆనాటి
ఆచారము
యేమంటే
ఎవరైనా
అతిథి
వచ్చినప్పుడు
వారు
యింటివారితో
కూర్చుని
వారితో
భుజించాలి.
వచ్చిన
వారిని
వంటరిగా
తినమనటం
గౌరవము
కాదు.
ఇంటి
వారు
కూడను
కూర్చోవాలి.
అంతరార్థమేమనగా
యింటివారికి
బయటివారికి
యిరువురికి
సమానమైన
భోజనము
వడ్డించటము.
అనేటువంటిది
ధర్మము.
ఇప్పుడు
యేమి
చేస్తారంటే
బంధువులెవరైనా
వచ్చినారంటే
వారికి
మాత్రమే
స్పెషల్
చేసి
పెడతారు.
ఇంటివారు
యేదో
ఒకటి
తింటారు.
ఆనాటి
ధర్మ
శాస్త్రమునకు
యిది
చాలా
విరుద్ధమైనది.
ఇరువురు
సమానముగా
భోజనము
చేయాలి.
ఆ
వృద్ధురాలు
వుడుకు
వుడుకు
దోశలు
వేసింది.
రెండు
తెచ్చి
యిరువురికి
చెరొకటి
వేసింది.
మనుమడు
ఏమి
చేశాడు
ఈ
దోశలు
మధ్యలో
విరుచుకుని
తింటూ
వచ్చాడు.
రెండవ
దోశ
తిరిగి
మధ్యనుండి
ప్రారంభము
చేశాడు.
ఆమెకు
అనుకోకుండానే
నోటినుండి
వచ్చింది.
ఏమిరా
చంద్రగుప్తుని
రాజ్య
పరిపాలన
వలె
నీవు
తింటున్నావు
అంది.
చూశాడు.
ఏమి
చంద్రగుప్తుని
రాజ్య
పరిపాలనము
యీ
పిల్లవాడు
దోశ
తినటానికి
ఏమి
సంబంధము.
ఇంకొక
దోశ
వేయటానికి
వచ్చినప్పుడు
తాను
వినయముగా
ప్రశ్నించాడు.
అవ్వగారూ!
చంద్రగుప్తుని
రాజ్యపాలనకు,
యీ
కుఱ్ఱవాడు
దోశ
తినటానికి
సంబంధము
వుందా
అన్నాడు.
చంద్రగుప్తుడు
ఓడి
పోటానికి
కారణం
తెలుసా
నీకు.
అని
అడిగింది
వృద్ధురాలు.
రాజ్యమునకు
చుట్టూ
సైన్యమును
పెట్టి
కాపాడకుండా
కేవలం
తన
కేంద్రములో
సైన్యము
పెట్టుకొని
కాపాడుతూండటం
వలనే
ఓడిపోయాడు.
రాజ్యమును
అన్నివైపులా
రక్షిస్తూ
రావాలిగాని
సైనికులు
కేవలము
capital
లో
పెట్టుకుంటే
తాను
ఏ
విధముగా
గెలుస్తాడు.
అందరూ
అందులో
ప్రవేశించారు.
చంద్రగుప్తుని
ఓడించారు.
అదేవిధముగనే
నా
మనుమడు
దోశ
మధ్యనుండి
తింటున్నాడు.
చుట్టూ
వున్న
దానిని
తినటానికి
ప్రయత్నించటం
లేదు.
అలక్ష్యం
చేస్తున్నాడు.
ఒక్క
దోశతో
చాణిక్యుడు
ఎంతో
అర్థాన్ని
గ్రహించాడు.
చాణిక్యుని
యొక్క
తెలివితేటలు.
అతను
కౌటిల్యుడు
కూడను.
చిన్నచిన్న
విషయముల
లోపల
ఏది
right
ఏది
wrong
ఏది
సత్యము
ఏది
అసత్యము,
ఏది
అనుభవించవలసినది,
ఏది
విసర్జించవలసినది
అని
యీ
విధముగా
చక్కగా
గుర్తిస్తూ
వచ్చినటువంటి
వాడు.
ఈ
విధముగా
గూఢచారియై
రాజ్యమంతా
సంచరించి
యీ
చంద్రగుప్తుని
అపజయమునకు
కారణమేమిటో
అన్ని
కనుకున్నాడు.
దానికి
తగిన
పద్ధతులంతా
చేసుకున్నాడు.
ఎట్లైనా
చంద్రగుప్తుని
రాజుగా
చేయాలని
పట్టుపట్టాడు.
కట్టకడపటికి
తన
సంకల్పము
నెరవేరి
చంద్రగుప్తుని
రాజుగా
చేశాడు.
అప్పటినుండి
యీ
అర్థశాస్త్రమును
ఏ
విధముగా
వుపయోగించాలి.
పంటలుగానీ,
పదార్థములుగానీ
ఏది
వుత్పత్తి
చేసినా
భవిష్యత్తుకు
అర్థభాగము
పెట్టాలి.
7
▾
Meaning
Keep
క్షామము
రావచ్చు.
అప్పుడు
పదార్థములను
యితర
దేశములనుండి
మనము
తెచ్చుకోకూడదు.
మనము
దాచిపెట్టిన
దానిని
యీ
క్షామ
పరిస్థితిలో
వుపయోగపెట్టాలి.
మిగిలిన
అర్థభాగము
లోపల
అర్థమును
రాజ్యక్షేమమునకు
వుపయోగపెట్టాలి.
ఇంక
కాలు
భాగము
దేశము
యొక్క
సంరక్షణకు
వుపయోగపెట్టాలి.
అనగా
మిలట్రీ.
ఈ
విధముగా
రాజ్యపాలనలో
తగిన
భద్రతను
చూచుకోవాలని
నిర్దేశించాడు.
వ్యాపార
సంబంధమైన
దానిలో
కూడను
చక్కని
ఆదర్శము
నందిస్తూ
వచ్చాడు.
ఈనాటి
బ్యాంకులు
ఎట్లా
వున్నాయంటే
మనకు
యిచ్చేది
10%,
వారు
తీసుకునేది
15%
మనము
ఒక
లక్ష
రూపాయలు
బ్యాంకులో
పెట్టామంటే
సంవత్సరమునకు
10%
వడ్డీ
యిస్తారు.
business
వారు
పోయి
బ్యాంకులో
అప్పు
తీసుకుంటే
వాని
నుండి
15%
తీసుకుంటారు.
చాణిక్యుడు
ఆ
పద్ధతి
తప్పన్నాడు.
ఒక
నూరు
రూపాయలు
ఒక
వ్యక్తికి
అప్పు
యివ్వటం,
వాడు
సంవత్సరమునకో,
నెలనెలకో
వడ్డీ
చెల్లించనక్కరలేదు.
పది
సంవత్సరములయ్యేటప్పటికి
రెండు
వందల
రూపాయలు
యిచ్చేస్తే
వడ్డీ
వద్దు
అసలు
వద్దు.
యిచ్చిన
బాకీ
చెల్లిపోతుంది.
ఈ
విధమైన
పద్ధతులు
ప్రజలకు
అనుకూలము.
దీనితో
ఒక
చిన్న
విషయాన్ని
గుర్తించాలి.
ఈ
పది
సంవత్సరముల
లోపల
యీ
నూరు
రూపాయలు
తీసుకున్న
వ్యక్తియే
మరణిస్తే
తిరిగి
తన
కుమారులు
తీర్చనక్కరలేదు.
దానితో
ముగిసి
పోవాలి.
ఈనాడు
అప్పు
తీసుకున్న
వాడు
మరణిస్తే
వాని
యింటిపైన,
వారి
బిడ్డలపైన
అంతా
కూడను
సవారి
చేస్తారు.
ఇది
చాలా
తప్పు
అన్నాడు.
ఇది
కేవలము
ఒక
వ్యక్తికి
సంబంధించినదిగాని
వ్యక్తినుండి
తీసుకున్న
దానిని
family
కి
యేమాత్రము
connect
చేయకూడదు
అన్నాడు.
చాణిక్యుడు
అర్థశాస్త్రమును
సరియైన
రీతిలో
వుపయోగపెడుతూ
వచ్చాడు.
ఈనాడు
అన్నీ
తారుమారై
పోతూ
వస్తున్నాయి.
మేనేజిమెంటు
అనగా
కేవలము
మానవత్వాన్ని
గుర్తించాలి.
అదే
మొట్టమొదట
చెప్పాను.
mind
of
man.
నన్ను
యితరులు
బాధించినప్పుడు
నేను
ఏ
విధంగా
బాధపడతాను
యితరులను
బాధించినప్పుడు
వారు
కూడను
ఆ
విధముగా
బాధపడతారు
అనేది
గుర్తించాలి.
సమత్వాన్ని
గుర్తించాలి.
అదే
mind
of
man.
నాది
నేను
అని
పెట్టుకున్నప్పుడు
అది
animal
mind
గా
వస్తుంది.
అందరిలో
వున్న
మైండ్
తత్వము
ఏకత్వముగా
భావించాలి.
మేనేజరు
నిన్ను
తిట్టాడంటే
నీవు
ఎంత
కష్టపడతావు.
నీవు
యింకొక
వర్కరును
ఆ
విధముగా
తిడితే
వాడు
కూడను
ఎంత
కష్టపడతాడు
అనేది
మేనేజరు
గుర్తించుకోవాలి.
నేను
మేనేజరును
అనే
అధికారము
అక్కడ
చలాయించరాదు.
ఈ
అధికారము
వినియోగించుకోవాలంటే
వర్కు
లో
మాత్రమే
వినియోగించుకోవాలి.
వ్యక్తి
పైన
వినియోగించకూడదు.
ఇది
mind
of
man
అని.
అన్నింటియందు
మొట్టమొదట
ఒక్క
దానిని
గుర్తించుకుంటే
అన్నికూడను
సమన్వయమై
పోతాయి.
అదే
ఆత్మతత్వము.
ఆ
ఆత్మ
తత్వము
మనం
గుర్తించుకుంటే
యిక
అన్నికూడా
అందులో
ఏకమై
పోతాయి.
8
▾
Meaning
Keep
ఒక్కొక్క
రూములో
ఒక్కొక్క
బల్బు
వేస్తారు
మీ
హాస్టలులో.
ఒక్కొక్క
రూముకు
ఒక్కొక్క
స్విచ్
వుంటుంది.
కాని
అన్నింటికి
కలిపి
ఒక
main
switch
వుంటుంది.
main
switch
off
చేసి
రూములో
switch
లు
ఆన్
చేసినా
బల్బులు
వెలగవు.
main
switch
ఆన్
చేసి
రూములో
స్విచ్
ని
off
చేసినా
ఫరవాలేదు.
అదేవిధముగా
ఆత్మ
అనేది
main
switch.
దానిని
మనం
వదలి
యింక
మిగిలిన
స్విచ్
లను
ఆన్
చేసినా
లైటు
రాదు.
కనుక
మొట్టమొదట
మనము
ఆత్మతత్వమును
అర్థము
చేసుకోవాలి.
ప్రతి
ఒక్కరియందు
వుండినది
అదియే.
వేరువేరు
గుణములు
వేరువేరు
వ్యక్తులయందు
వుంటున్నాయిగానీ
అందరియందు
సమానముగా
వున్నది
అదే.
ఆత్మతత్వమంటే
ఏమిటి
దీనినే
conscience.
ఈ
conscience
తృప్తి
లేకుండా
ఏమి
చేసినా
ప్రయోజనము
వుండదు.
నీ
దోషాన్నిగానీ,
నీ
మంచిని
గాని
అంగీకరించటము
లేకపోవటము
నీ
conscience
మీద
ఆధారపడి
వుంటుంది.
నీ
దోషాన్ని
మూసిపెట్టి
నీవు
యితరులకు
దోషము
లేదని
వాదించినప్పటికిని
నీ
conscience
ఒప్పుకోదు.
నీ
conscience
ఒప్పుకోకుండా
మాత్రము
నీవు
ఎన్ని
విధాల
మూసిపెట్టినా
లాభము
లేదు.
conscience
అనేది
ఎప్పుడూ
సత్యాన్ని
చెబుతుంది.
అది
పరులకు
కాదు
నీకే
చెబుతుంది.
అదే
internal
talk
అనేది.
అదే
internal
connection.
దేహమునకు
దేహము
బాహ్యరీతిలో
దూరముగా
వుండవచ్చును.
కాని
అంతర
సంబంధమైన
connection
ఎంత
దూరములో
వున్నాగానీ
అది
నిన్ను
వదలిపెట్టదు.
దీనికొక
చిన్న
ఉదాహరణము.
నీవు
ఒక
యింటిలో
రూములో
నివసిస్తున్నావు.
ఆ
రూములో
ఎన్ని
ఎలుకలు
వుంటున్నాయో.
ఎన్నో
చీమలు
వుంటున్నాయి.
అన్ని
రూములోనే
వుంటున్నాయి.
కాని
నీవు
పట్టించుకోవు.
ప్రేమించవు.
నీ
ప్రక్కయింటిలో
ఎంతోమంది
వుంటుంటారు.
వారి
గురించి
నీవు
పట్టించుకోవు.
నీ
brother
లేక
నీ
కుమారుడో
అమెరికాలో
వుంటున్నాడు
చాలాదూరం.
వారినుండి
ఒక
వారం
కవరు
లేకుండా
పోతే
చాలా
పరితపిస్తూ
వుంటావు.
కారణం
ఏమిటి?
అది
అంతర
సంబంధమైనది.
అంతర
సంబంధమైనది
అవటం
చేత
దేహము
ఎంతదూరములో
వుండినప్పటికిని
బంధము
దగ్గర
చేస్తుంది.
కేవలము
అంతర
సంబంధమైన
యీ
విధమైన
సంబంధమును
కట్టుకుంటుంది.
బాహ్య
సంబంధము
ఏమాత్రము
నీవు
లక్ష్యము
చేయవు.
అదే
యిష్ట
అయిష్టములపైన
ఆధారపడి
వుంటుంది.
నీ
ప్రక్కింటిలో
ఎవరున్నారో
లేదో
అనేది
కూడా
నీవు
అంత
గుర్తించవు
యిష్టం
లేకపోతే.
ఏదో
ఒక
బొంబాయిలో
సినీమా
యాక్టరు
మనోజ్
కుమార్
ఎక్కడున్నాడంటే
వాని
ఎడ్రస్సు
అంతా
నీకు
తెలుసు.
కారణం
ఏమిటి?
అతనిపై
వుండే
అభిమానం
చేత
ఆ
details
అన్ని
నీవు
తెలుసుకుంటున్నావు.
నీ
ప్రక్కయింటిలో
సమీపములో
వున్న
వాని
గురించి
నీవు
తెలుసుకోవు.
ఐతే
బహిర్ముఖముగా,
అంతర్ముఖముగా
connection
వుండినప్పుడు
యిది
రెండు
విధాలా
అభివృద్ధిగాంచుతుంది.
9
▾
Meaning
Keep
మీరు
చిన్నపిల్లలు.
మీకు
బాగా
తెలుసు.
మీకు
పెండ్లికాక
పూర్వము
మీ
ప్రక్కయింటిలో
ఒక
అమ్మాయి
వుందనుకోండి.
ఆ
అమ్మాయికి
జబ్బు
చేయవచ్చు.
చాలా
ప్రమాద
పరిస్థితి
కూడా
సంభవించవచ్చు.
ఇంటిలో
వున్నవారంతా
యేడుస్తున్నా
నీవు
అది
లక్ష్యం
చేయవు.
వాళ్లంతా
ప్రక్కనే
వుండి
యేడుస్తారు
నాకు
చాలా
disturbance
అని
నీవు
చాలా
విసుక్కుంటావు.
కాని
కొంతకాలమైన
తరువాత
ఆ
అమ్మాయే
నీకు
wife
కావచ్చు.
ఆ
అమ్మాయి
wife
ఐన
తరువాత
ఆ
అమ్మాయికి
కొంచెం
కడుపునొప్పి
వచ్చిందంటే
నీవు
ఆఫీసుకు
leave
letter
వ్రాసేస్తావు.
ఇంతకు
పూర్వం
ఎంతో
ప్రమాదస్థితి
వచ్చినప్పుడు,
యిల్లంతా
ఏడుస్తుంటే
నీవు
disturbance
అనుకున్నావు.
ఇప్పుడు
చిన్న
కడుపునొప్పి
వస్తే
నీవెందుకు
ఆఫీసుకు
leave
letter
వ్రాయటం.
ఇదే
అంతర
సంబంధము
యేర్పడింది.
ఇది
మానసికంగా
హృదయ
సంబంధమైన
సంబంధము.
మానసికంగా
ఆమె
నా
wife.
ఆమె
నా
wife
అనే
ముద్ర
పడేటప్పటికి
హృదయము
విశాలమవుతుంది.
ఇక్కడ
negative,
positive
రెండూ
ఏకమైపోతున్నాయి.
అదేవిధముగా
business
లోపల
డ్రుక్కర్
negative
కింద
తీసుకుపోయాడు.
ఈ
negative
business
క్రమక్రమేణా
క్షీణిస్తూ
వచ్చింది.
ఆ
డ్రుక్కర్
తిరిగి
యింకొక
బుక్కు
వ్రాస్తూ
వచ్చాడు.
అతనికి
యించుమించు
83
సంవత్సరములు.
పూర్వము
వ్రాసిన
బుక్కు
ఆనాటి
పరిస్థితుల
ప్రభావము
పురస్కరించుకొని
వ్రాసినది.
ఇప్పుడు
చాలా
మార్పు
రావాలని
తానే
గుర్తించాడు.
Positive
లేక
negative
ప్రయోజనము
లేదు.
Positive
అంటే
ఏమిటి?
శ్రద్ధ.
దేనిపైన
శ్రద్ధ.
ధనము
సంపాయించటము
పైన
శ్రద్ధ.
కాదు.
కాదు.
నీ
work
పైన
శ్రద్ధ.
ఈనాడు
work
పైన
శ్రద్ధ
క్షీణించి
పోవటము
చేతనే
ఫ్యాక్టరీస్
మూతపడిపోతున్నాయి.
ఈ
పదార్థముల
యొక్క
విలువ
అధికము
కావటానికి
కారణము
ఏమిటి?
విద్యార్థులు
చక్కగా
గుర్తించాలి.
జపాన్
లో
వుండిన
వ్యక్తులందరు
వారికి
దేశాభిమానము
వుంది.
తన
దేశము
యొక్క
అభివృద్ధి
తాను
ప్రధానంగా
చూచుకోవాలనే
విశ్వాసము
వుండాలి.
చాలా
తక్కువ
జీతము.
వారు
జీతమును
యేమాత్రము
లక్ష్యము
చేయరు.
జీతము
తక్కువ
వుండుట
వలనే
పదార్థముల
విలువ
కూడా
తక్కువగా
వుంటుంది.
ఈ
workers
లో
వుండిన
ప్రాధాన్యత
ఏమిటి?
Spirit
of
work.
ఇది
వారిలో
చాలా
అధికముగా
వుంటుంది.
work
మనము
బాగా
చెయ్యాలి.
అది
ఘనత.
ఈనాడు
మన
భారత
దేశములో
spirit
of
work
క్షీణించింది.
work
తక్కువ
చెయ్యాలి
జీతము
ఎక్కువ
రావాలి.
అందువలనే
పదార్థముల
విలువ
అధికమైపోతూ
వచ్చింది.
నీవు
ఎక్కడైనా
పోయి
watch
తీసుకోండి,
యింకేమైనా
బొమ్మలు
తీసుకోండి
జపాన్
లోనే
చాలా
cheap.
ఎందుకోసం
ఆ
workers
జీతం
తక్కువ
కనుక.
ఈనాడు
workers
జీతం
ఎక్కువ
కావటం
వలన
పదార్థము
విలువ
కూడా
ఎక్కువై
పోయింది.
10
▾
Meaning
Keep
ఇంకొక
విషయము
గుర్తించాలి.
నీకు
నెలకు
ఐదు
వందల
రూపాయలు
జీతము
వస్తున్నది.
నీకింకా
promotion
కావాలి.
నీకింకా
జీతము
increase
చెయ్యాలి
అని
నీవు
మొండి
పడతావు.
ఆరు
వందలు
చేస్తారు.
ఎక్కువ
వచ్చిందని
సంతోష
పడుతున్నావేగాని
నీ
ప్రొడక్షన్
చేసిన
పదార్థము
విలువ
పెరిగిపోతుంది.
ఆ
పదార్థము
కొనాలంటే
ఎక్కువ
యివ్వవలసి
వస్తుంది.
తిరిగి
ఐదు
వందలే
మిగులుతుంది.
extra
యిచ్చిన
నూరు
రూపాయలు
పదార్థము
పై
వినియోగించవలసి
వస్తుంది.
జీతము
పెరిగిందని
సంతోషిస్తున్నావు
గాని
ఆ
పదార్థము
పొందాలనుకున్నప్పుడు
తిరిగి
ఆ
జీతము
యివ్వవలసి
వస్తుంది.
అంతవరకు
పోనక్కర
లేదు.
నీకు
500
రూపాయలు
జీతము
వచ్చినప్పుడు
నీ
యింటివారు
బాడుగ
రెండు
వందలని
తీసుకుంటున్నారు.
నీకు
ఆరువందలైందంటే
వారు
యింకో
నూరు
ఎక్కిస్తారు.
ఈ
విధమైన
balance
మొదటినుండి
develop
చేసుకుంటూ
వచ్చేసింది.
మొట్టమొదట
మనిషికి
balance
అత్యవసరము.
నీకు
knowledge
వుందని
విఱ్ఱవీగవచ్చు.
knowledge
కి
తగిన
పోషణ
వుండినప్పుడే
అది
balance
గా
వుంటుంది.
మొట్టమొదటిది
knowledge.
అది
top
level
లో
వుంటుంది.
knowledge
ని
మనము
skill
చెయ్యాలి.
knowledge
ని
skill
చేస్తే
అప్పుడు
balance
గా
వుంటుంది.
కాని
యీనాడు
knowledge
ని
skill
చేయటం
లేదు
kill
చేస్తున్నారు.
ఈ
knowledge
ని
kill
చేయటం
వలన
balance
తప్పిపోతున్నాది.
ఈనాడు
మీరు
ఒక్క
knowledge
ని
మాత్రమే
మీరు
ఆధారము
చేసుకుంటున్నారు.
Balance
తప్పిపోతున్నాది
అని
మీరు
గుర్తించటం
లేదు.
life
అంతా
balance
పైనే
వుంటున్నాది.
వ్యాపారము
లోగాని,
మేనేజిమెంటులోగాని
balance
సరిగా
వుండాలి.
workers,
market,
transport,
production,
raw
material,
current,
water
యివన్నీ
వేటికవి
సరైన
స్థితిలో
వుందా
అనే
balance
మీరు
చక్కగా
గుర్తించాలి.
అన్నింటి
యొక్క
సమతను
మనము
భావించినప్పుడే
మనము
ఆశించిన
ఫలితము
లభిస్తుంది.
ఈ
విధముగా
వ్యాపార
సంబంధమైన
విషయము
లోగాక
మన
జీవిత
సంబంధమైన
విషయములో
కూడ
యీ
balance
చాలా
అత్యవసరము.
మానవ
జీవితములో
అనేక
కష్టములు,
నష్టములు,
దుఃఖములు,
విచారములు
సంభవిస్తూ
వుంటాయి.
అన్నిటికి
ఒక
విధమైన
balance
వుండాలి.
ఒక్క
నిమిషములో
ఆనందించటము,
ఒక్క
నిమిషములో
యేడ్చటము
యీ
విధముగా
వుంటుంటే
మనలో
balance
పూర్తిగా
క్షీణిస్తుంది.
దుఃఖము
సంభవించింది
దుఃఖమునకు
ఫలితము
వుంటుందని
కొంతవరకు
దానిని
నిగ్రహించాలి.
ప్రపంచములో
ఒక
చోట
మిట్ట
వుంటే
మరొక
చోట
పల్లము
వుంటుంటాది.
రెండింటి
సమత్వము
ఎప్పుడు
కూడను
ఏకత్వముగా
వుంటుంది.
ఒకడు
బావి
త్రవ్వుతూ
వుంటాడు.
11
▾
Meaning
Keep
ఆ
బావిని
త్రవ్వుతున్నప్పుడు
ఆ
మట్టి
అంతా
గుట్టమాదిరి
అవుతుంది.
గుట్టకు
ప్రక్కనే
గుంత
వుంటుంది.
గుంటను
చూచేవాడు
క్రిందికి
చూస్తాడు.
గుట్టను
చూచేవాడు
పైకి
చూస్తాడు.
గుట్టను
ఎక్కాలి.
గుంత
దిగాలి.
ఐతే
గుట్ట
ఏమిటి,
గుంత
ఏమిటి?
గుంత
మట్టే
గుట్టమట్టి
గుట్టమట్టే
గుంత
మట్టి.
ఆ
గుట్ట
మట్టి
గుంతలో
వేస్తే
సమానమవుతుంది.
ఇప్పుడు
కొంతమంది
దగ్గర
డబ్బు
దండిగా
చేరింది.
ఒకని
దగ్గర
దండిగా
కోట్లు
చేరిందంటే
ఎక్కడో
వాడు
గుంత
తవ్వాడు.
గుంత
లేక
యింత
చేరటానికి
వీలు
లేదు.
ఆ
గుట్ట
మట్టి
తీసి
గుంతలను
పూడ్చాలి.
ఇది
balance.
ఈ
విధమైన
balance
ఆధారము
చేసుకుంటూ
వచ్చాడు
చాణిక్యుడు.
ఆర్థిక
శాస్త్రమునందు
చాణిక్య
శాస్త్రము
గొప్పది.
నిత్యజీవితమునకు
ధర్మశాస్త్రము
అత్యవసరము.
అర్థ
ధర్మములను
రెండింటిని
యేకము
చేసినప్పుడు
కామము
పవిత్రముగా
మారిపోతుంది.
ఒక
desire
వచ్చింది.
ఆ
desire
వచ్చిన
తక్షణమే
ఆచరణలో
పెట్టకూడదు.
ఇది
ధర్మ
సంబంధమైనదా
కాదా
అని
విచారించాలి.
నా
శక్తి
ఏమిటి?
దాని
శక్తి
ఏమిటి?
దానికి
నాకు
సరైన
సంబంధము
కుదురుతుందా?
చిన్న
ఉదాహరణము
తీసుకోండి.
మీకు
ఆ
వయస్సులో
హత్తుకునే
సరైన
example
చెప్పినప్పుడే
అర్థమవుతుంది.
నీవు
ఒక
manager
గా
ఒక
company
కి
వెడతావు.
చదువుకున్నావు.
manager
గా
వచ్చావు
అంతే
గాని
నీ
కుటుంబము
బీద
కుటుంబము.
నీ
కంపెనీ
leader
గా
వుండిన
అతనికి
ఒక
బిడ్డ
వుంది.
ఆ
బిడ్డను
నీవు
పెండ్లి
చేసుకోవాలని
అనుకుంటావు.
అప్పుడు
నీ
అర్థశాస్త్రమును
విచారణ
చెయ్యాలి.
నా
అర్థము
ఏ
స్థాయిలో
వుంది.
వాని
అర్థము
యే
స్థాయిలో
వుంది.
దీనికి
సంబంధము
కుదురుతుందా
లేదా?
యిలాంటి
వాటికి
భ్రాంతి
పెట్టుకోటం
చాలా
తప్పు.
అక్కడ
ధర్మమేర్పడుతుంది.
ఈ
విచారణ
చేయకపోతే
నీవు
ఒక
mad
గా
మారిపోతావు.
mad
కాదు
bad
గా
కూడా
మారిపోతావు.
mangement
కూడా
వూడిపోతుంది.
కనుక
అర్థాన్ని,
ధర్మాన్ని
చక్కగా
విచారణ
చేయకుండా
నీ
desire
ను
మాత్రమే
కోరితే
తప్పక
నీ
భవిష్యత్తుకే
ప్రమాదము
యేర్పడుతుంది.
కనుక
చిన్నచిన్న
విషయములందు
కూడా
ఆనాడు
ధర్మశాస్త్రము,
అర్థశాస్త్రము
ఆనాడు
ఆదర్శము
నందించింది.
ఇంకా
మీరు
మేనేజర్సు
కావలసినవారు.
జీతము
నందు
లక్ష్యము
పెట్టుకోకండి.
work
ను
మనము
సాధించాలి.
Factory
ని
మనము
అభివృద్ధి
చేయాలి.
ఇది
యే
విధంగా
అభివృద్ధి
చేయాలి
అనే
లక్ష్యము
పెట్టుకుంటే
తప్పక
మీ
భవిష్యత్తు
కూడను
అభివృద్ధి
అవుతుంది.
మొట్టమొదట
appointment
లో
1500
వస్తుంది
అనుకోండి.
BA
pass
చేసి
MBA
pass
చేస్తే
1500
రూపాయలేనా
అని
compare
చేసుకోవద్దు.
మొదట
నీవు
చేరు.
నీవు
పనులంతా
సంతృప్తికరంగా
అందించు.
అప్పుడే
వారికి
satisfaction
అవుతుంది.
నీ
salary
ఎక్కువ
చేస్తారు.
నీ
desire
ను
సరియైన
మార్గములో
ప్రవేశపెట్టాలి.
12
▾
Meaning
Keep
ఈనాడు
desires
పెరిగిపోతున్నాయి.
less
luggage
more
comfort
make
travel
a
pleasure.
desires
ను
తక్కువ
చేసుకోటమే
ఉత్తమ
మార్గమని
బోధిస్తుంది.
ఈ
విషయంలో
workers
కావాలి.
work
చేయాలి.
అప్పుడే
మీ
విలువ
కూడా
అధికమైపోతుంది.
మీకందరికి
తెలుసు
జపానువారు
మొట్టమొదట
అమెరికాలో
అన్ని
విధాలా
సంబంధము
పెట్టుకున్నారు.
అన్ని
విషయాలు
అమెరికావారి
దగ్గర
నుండే
నేర్చుకున్నారు.
ఈనాడు
అమెరికా
వారిని
మించి
వుంటున్నారు.
అమెరికా
ఏడుస్తూ
వుంటున్నాది.
నా
శిష్యులే
నాకు
పోటీగా
అయిపోతున్నారు
కారణం
ఏమిటి?
అమెరికా
వారికి
అహంకారము
వీరికి
వినయము.
ఈ
humility
వచ్చినప్పుడు
ఆ
work
పైన
concentrate
చేస్తారు.
అంతేకాదు
spirit
of
work.
వారు
ఏదైనా
work
తీసుకున్నారంటే
ఆ
work
పూర్తయ్యేదాకా
రాత్రి
ఏడు
గంటలైనా
యింటికి
వెళ్లరు.
మనవారు
అలాకాదు.
ఇంకా
కాలు
భాగము
work
వున్నా
సరే
4-30
గంటలకు
ఎక్కడిదక్కడ
వదిలేసి
యింటికి
వెళ్లి
పోతారు.
మేనేజర్సు
వచ్చేసి
ఏమి
నాయనా
బెల్
కొట్టారు.
లేదు
సార్
It
is
my
duty
అంటారు.
వాళ్ల
duty
చేస్తుంటారు.
అది
పూర్తి
చేసినప్పుడే
వాళ్లకు
self
satisfaction.
అదే
తృప్తి.
కనుక
self
satisfaction
కావాలి.
confidence
అంటున్నారు.
ఆత్మతృప్తి
అంటున్నారు.
ఈ
confidence
ఎక్కడనుండి
వచ్చింది.
ఈ
confidence
consciousness
నుండి
వచ్చింది.
conscience
అనేది
నీలోపల
వుంటుంది.
consciousness
is
every
where.
సర్వత్రా
వుంటున్నది.
సర్వత్రా
వుండిన
యీ
consciousness
ను
నీలో
కొంతవరకు
యిముడ్చుకున్నావు.
నీలో
యిముడ్చుకున్న
యీ
conscience
ను
సర్వత్రా
వున్నటువంటి
consciousness
లో
ఏకం
చేయాలి.
ఈ
విధంగా
ఏకం
చేయటానికి
ఏమి
చేయాలి!
sports
కోసమని
బెలూన్లు
అంతా
వూదుతుంటారు.
ఊది
దానిని
బాగా
కట్టివేశాము.
కానీ
సర్వత్ర
వుండిన
air
యీ
బెలూన్
లో
వుంది.
కాని
సర్వత్రా
వున్న
air
లోపల
యీ
బెలూన్
లో
వున్న
air
చేరటానికి
వీలు
లేదు.
ఇది
ప్రత్యేకంగా
నిలిచిపోతుంది.
సర్వత్రా
వుండి
స్వేచ్ఛగా
సంచరించే
air,
consciousness.
ఈ
బెలూన్
లో
కట్టివేయబడిన
air
conscience.
ఈ
conscience
అనేది
consciousness
లో
ఎప్పుడు
చేరుతుంది?
ఈ
బెలూన్
వూది,
వూది,
వూదేటప్పటికి
ఒక్కసారి
burst
అయిపోతుంది.
ఈ
burst
అయ్యేటప్పటికి
సర్వత్రా
వున్న
air
లో
యీ
బెలూన్
లో
వున్న
air
కూడా
కలిసి
పోతుంది.
కనుక
యీ
బెలూన్
లో
వున్న
హృదయాన్ని
విశాలం
విశాలం
చేసుకుంటూ
పోతే
యిది
కట్టకడపటికి
భిన్నత్వమనేది
పోయి
ఏకత్వమనేది
యేర్పడుతుంది.
కనుక
యీ
consciousness
లోపల
మీలో
వున్న
conscience
చేరాలి.
ఇదికూడా
మూడు
స్థాయిలు.
conscious,
conscience,
consciousness.
conscious
అనేది
through
senses.
conscience
అనేది
through
heart.
13
▾
Meaning
Keep
కనుక
యీ
senses
నుండి
heart
కు
పోవాలి.
కనుక
నీవు
నీ
heart
ను
పెద్దదిగా
చేసుకుంటే
అది
జబ్బు
అయిపోతుంది.
Heart
enlargement
అంటారు.
అది
కాదు.
physical
heart
కాదు.
spiritual
heart.
ఈ
spiritual
heart
ను
విశాలం
చేసుకోవాలంటే
అంతా
ఒక్కటే
అనే
ఏకత్వానికి
రావాలి.
ఆకలి
నాకూ
ఒకటే
నీకూ
ఒకటే.
నా
ఆకలికి
నేను
రెండు
చపాతీలు
తినవచ్చు.
నీ
ఆకలికి
నీవు
ఆరు
యిడ్లీలు
తినవచ్చు.
ఇంకొకరు
అతని
ఆకలికి
అరకిలో
rice
తినవచ్చు.
అన్నము
వేరు
ఆకలొక్కటే.
అన్నారు.
అందరియందు
వున్న
సమత్వాన్ని
మనం
తీసుకోవాలి.
వ్యక్తులు
వేరువేరుగా
వుండవచ్చు.
pain
గాని
pleasure
గాని
అందరికి
ఒక్కటే.
ఒకరు
control
చేసుకోలేకపోవచ్చు.
ఒకరు
control
చేసుకోవచ్చు.
అది
వారి
వారి
will
power
పైన
ఆధారపడి
వుంటుంది.
కాని
pain
and
pleasure
ఒక్కటే.
ఐతే
pain
లేకుండా
pleasure,
pleasure
లేకుండా
pain
వుండటానికి
వీలు
లేదు.
ఈ
రెండూ
ఒకదానికొకటి
చేరి
వుంటాయి.
దీనికొక
చిన్న
ఉదాహరణము.
నీడలోనే
ఎండ
వుంది.
ఎండలోనే
నీడ
వుంది.
ఇది
మీరు
అంగీకరించక
తప్పదు.
ఒక
చెట్టు
పైన
సూర్యుడు
పడ్డాడు.
ఆ
చెట్టు
నీడలో
కొంత
మేర
నీడ
వున్నది.
కొంత
మేర
ఎండ
వుంటున్నది.
ఈ
shade
కు
కారణం
ఏమిటి?
పైనున్న
ఎండనే
కారణం.
అక్కడ
ఎండ
వున్నది
అని
తెలుసుకోటానికి
కారణం
ఏమిటి?
ప్రక్కనున్న
shade
కారణం.
కాబట్టి
ఎండను
shadow
గుర్తింపచేస్తున్నది.
ఎండ
నీడలు
రెండునూ
ఒకదానికొకటి
సంబంధము.
అదే
విధముగా
మనకు
pain
and
pleasure
రెండు
సంబంధమున్నవే.
pain
లో
pleasure
వుంది.
pleasure
లో
pain
వుంది.
ఐతే
pain
లేక
pleasure
రాదు.
దీనికొక
చిన్న
ఉదాహరణ.
నీ
కడుపులో
నొప్పి
వచ్చింది.
డాక్టరు
వచ్చిన
తక్షణమే
ఆపరేషన్
చేయాలంటాడు.
కత్తి
తీసుకుంటాడు.
నీ
కడుపును
కోసేస్తాడు
దోసకాయ
కోసినట్లు.
కాని
ఆ
కోయటం
చేత
నీ
నొప్పి
నివారణ
అవుతుంది.
ఇక్కడ
మీరు
చక్కగా
గుర్తించాలి.
పుట్టిన
pain
పోవాలంటే
పెట్టిన
pain
ను
అనుభవించాలి.
నీ
కడుపు
నొప్పి
పుట్టిన
pain.
డాక్టరు
కోసినది
పెట్టిన
pain.
డాక్టరు
పెట్టిన
pain
నీవు
అనుభవిస్తేనే
నీలో
పుట్టిన
pain
నివారణవుతుంది.
కనుకనే
ఒక
దానికొకటి
సన్నిహిత
సంబంధ
బాంధవ్యము
వుంటున్నది.
కనుక
వ్యాపార
సంబంధమైన
మేనేజిమెంటులో
కూడా
యిదే
విధమైన
విషయాలు
మనము
చక్కగా
plan
వేసుకుంటూ
పోవాలి.
ఈ
planning
కంతా
ఒక
ఆత్మతత్వము
Awareness
of
atma
దీనిని
చక్కగా
మనం
గుర్తించుకుంటే
చాలు.
దీనిని
మన
పూర్వీకులు
ఎలా
అనుభవించారు!
వారు
ఎన్ని
బాధలకో
గురియైనారు.
సత్యంకోసమని
హరిశ్చంద్రుడు
ఎన్ని
బాధలు
పడ్డాడు.
కట్టకడపటికి
భార్యాబిడ్డలను
కూడా
అమ్ముకున్నాడు.
కాటికాపరిగా
తాను
జీవిస్తూ
వచ్చాడు.
ఒకనాడు
కాటికాపరిగా
పని
చేస్తున్నాడు.
ఒక
కోటీశ్వరుడు
మరణించాడు.
కోటీశ్వరుడైతే
వానిని
కొంపలో
పెట్టుకుంటారా
వీలు
కాదు
చచ్చిన
తరువాత.
14
▾
Meaning
Keep
కొన్ని
వందల
మంది
శ్మశానానికి
తీసుకువచ్చారు.
అతని
స్థానం
అదే.
కావలసినంత
మంది
వచ్చారు.
అక్కడ
పెట్టారు.
అగ్ని
పెట్టారు.
వెళ్లిపోయారు.
ఇక్కడ
పాపం
హరిశ్చంద్రుడు.
చక్రవర్తి.
ఏనాడూ
యిటువంటి
దృశ్యము
చూడలేదు.
క్రింద
పడిపోయిన
కలపనంతా
ఎత్తి
వేస్తున్నాడు
పాపం.
ఆ
శవం
పూర్తిగా
కాలిపోవాలి.
తర్వాత
ఒక
పెద్ద
కఱ్ఱ
పెడతారు
శవంపైన.
ఎందువల్లనంటే
spinal
chord
కంతా
నిప్పు
తగులుతే
లేచి
కూర్చుంటుంది
యీ
శవం.
కనుక
అది
లేవకుండా
వుండటానికే
పెద్ద
కఱ్ఱ
పెడతారు.
ఈ
వచ్చినవారంతా
పెద్ద
షాహుకార్లు
కదా!
ఏమిటి
యీ
పెద్ద
కఱ్ఱ
వాని
గుండె
పైన
పెడుతున్నారు
తీసివేయండన్నారు.
కాసేపయ్యేసరికి
అది
లేచి
కూర్చుంది.
చూశాడు
పాపం
తిరిగి
యితను
మేల్కొన్నాడు
ప్రాణం
వచ్చింది.
తిరిగి
పడిపోయింది.
అప్పుడు
హరిశ్చంద్రుడు
అనుకున్నాడు
మాయామేయ
జగంబె
నిత్యమని
సంభావించి
మోహంబునన్
నా
యిల్లాలని
నాకుమారుడని
ప్రాణంబుండునందాక
ఎం
తో
యల్లాడిన
నీ
శరీరమిపుడిందుం
కట్టెలన్
గాలుచో
ఆ
యిల్లాలును
రాదు
పుత్రుడును
తోడై
రాడు
తప్పింపగన్.
అని
ఎంతో
చింతించాడు.
ఈ
సత్యాన్ని
గుర్తించాడు
హరిశ్చంద్రుడు.
ఎట్టివానికైనా
తప్పునది
కాదు.
కోటీశ్వరుడు
కాదు
కూటిపేద
కాదు.
నా
జీవితమూ
అంతే
అనుకున్నాడు.
ఈ
సత్యాన్ని
గుర్తించుకోకుండా
ఎలాంటి
వారు
ఎన్నిరకములైన
ఆదర్శాలు
ఆచరిస్తూ
వచ్చారు.
అదే
హరిశ్చంద్రుడు
చేసిన
పని.
ఎంతమంది
ఆదర్శంగా
తీసుకుంటున్నారు.
వారు
కాశీకి
పోతున్నారు
రాజ్యాన్ని
అంతా
వదలిపెట్టి.
కారణమేమిటి?
విశ్వామిత్రుని
అప్పు
చెల్లించటం
కోసం.
చంద్రమతి
వెనుకనే
వస్తోంది
పాపం.
ఇంక
యీ
నక్షత్రకుడు
వుంటున్నాడు.
వాడు
మాటిమాటికి
హింసిస్తున్నాడు.
ఇంకా
ఎప్పుడిస్తారు
యింకా
ఎప్పుడిస్తారని.
అప్పుడు
భార్య
చెబుతుంది.
ఒకరికొకరు
సన్నిహిత
సంబంధ
బాంధవ్యముతో
వుండేవారు.
ఈ
దుఃఖ
సముద్రములో
మనం
పడ్డాము.
ఎదురీదుతే
గట్టు
చేరుతాము.
అలసిపోతే
మునిగిపోతాము.
మనం
యీదివెడితే
గట్టు
చేరతాము.
దీనిని
సాధిస్తాము.
అలసిపోతే
మునిగిపోతాము.
మనం
యీదాలి.
ఒకరికొకరు
యీ
ధైర్యం
అనేదానిని
అందించటం
చేతనే
హరిశ్చంద్రుడంత
సత్యాన్ని
పాలిస్తూ
వచ్చాడు.
కనుక
ఒకరికొకరు
ధైర్యాన్ని
యిచ్చే
సలహాలు
నేర్చుకోవాలి.
ఇవన్నికూడా
యితిహాసం.
జాబాలి
కూడా
వాదించాడు
రామునితో.
రామా!
నీవు
పిచ్చివాడవు.
దశరథుడిచ్చిన
మాటను
దశరథుడు
దక్కించుకోవాలి
గాని
నీవెందుకు
యీ
విధంగా
చేస్తున్నావు.
ఈ
ఇక్ష్వాకుల
వంశములో
ఆడిన
మాట
తప్పరాదు.
తండ్రి
తప్పినా,
నేను
తప్పినా
యిద్దరం
ఒకటే.
మా
కులం
ఒక్కటే.
కులానికి
ఎలాంటి
అపకీర్తి
రాకూడదు.
మా
వంశానికి
ఏ
విధమైన
కళంకం
తెప్పించకూడదు.
ఎవరు
తప్పినా
నా
యొక్క
వంశమునకు
వస్తుంది.
15
▾
Meaning
Keep
Also in his talks
(2)
22 July 1994
The fullness of Prema
18 June 1996
No Sādhana Surpasses Prema for God
అపకీర్తి.
కనుక
ఆ
వంశములో
పుట్టినందుకు
నేను
యిది
కాపాడాలి
అన్నాడు.
కులములో
ఒకండు
గుణవంతుడుండిన
కులము
వెలయు
వాని
గుణము
వెలయు
వెలయు
వనములోన
మలయజంబున్నట్లు.
ఒక
పెద్ద
అడవిలో
మంచి
జాస్మిన్
ట్రీ
వుంటే
ఆ
అడవికంతా
మంచి
సువాసన
అందిస్తుంది.
అదే
రీతిగా
కులములో
ఒక
వ్యక్తి
మంచి
గుణవంతుడుంటే
ఆ
కులానికంతా
మంచి
మంచిపేరు
వస్తుంది.
ఆ
కులములో
ఒక
చెడ్డవాడు
వుంటే
ఆ
కులానికంతా
చెడ్డపేరు
వస్తుంది.
రాక్షస
కులములో
పుట్టాడు
ప్రహ్లాదుడు.
కాని
అడవిలో
మల్లె
తీగవలె
వుంటున్నాడు.
కనుకనే
ప్రహ్లాదుని
యొక్క
మనుమడు
భగవంతుని
యొక్క
అనుగ్రహానికి
పాత్రుడయ్యాడు.
అతనే
బలిచక్రవర్తి.
బలిచక్రవర్తికి
భగవంతుడే
వచ్చి
మోక్షాన్ని
ప్రసాదించాడు.
కనుక
కులములో
ఒక్క
గుణవంతుడున్న
చాలు
వాని
కులమునకే
మంచి
పేరు.
చెడ్డపేరును
తెచ్చుకోకూడదు.
మూడు
నెలలుగాని
మూడు
సంవత్సరములుగాని
కాలేజిలో
మంచిపేరు
తెచ్చుకోవాలి.
అలాంటి
పిల్లవాడు
యీ
కాలేజిని
వదలి
పోయాడని
అందరికి
ఒక
విధమైన
feeling
రావాలి.
అది
లేకుండా
కాలేజినుండి
వీడెప్పుడు
పోతాడా
అనే
feeling
రాకూడదు.
అలానే
మనం
మేనేజరుగా
వున్నామంటే
workers
కి
అంతా
వీడు
ఎప్పుడు
వెళ్లిపోతాడా
అనే
భావము
రాకూడదు.
workers
పైన
సరియైన
ప్రమాణములు
మనం
వినియోగించినప్పుడు
workers
అంతా
యీ
మేనేజరు
పోకూడదని
బ్రతిమాలి
అక్కడే
వుంచుకుంటారు.
ధనముపైనగాని,
salaries
పైనగాని,
ఇంక్రిమెంటుపైనగాని,
income
పైనగాని
మీరు
యే
విధమైన
ఆలోచన
పెట్టుకోరాదు.
work
work.
work
ని
బట్టి
ఆ
యజమానికే
ఒక
విధమైన
భావం
బయలు
దేరుతుంది.
ఈనాడు
భారత
దేశంలో
యీ
weakness
ఎక్కువై
పోయింది.
పని
చేసేది
తక్కువ.
జీతము
అడిగేది
ఎక్కువ.
ఎంత
యిస్తున్నాగాని
యింకా
యివ్వమని
ప్రతి
సంవత్సరము
strike.
జీతాలు
పెరిగే
కొలది
పదార్థముల
ధరలు
పెరిగిపోతున్నాయి.
ఇంక
prices
ఏ
విధముగా
down
అవుతాయి.
కావటానికి
వీల్లేదు.
ఈ
salary
తగ్గితేనే
గాని
price
తగ్గిపోదు.
ఇది
business
లో
చాలా
ప్రధానమైన
విషయము.
సరియైన
స్థితిలో
balance
గా
రావాలి.
profit
and
loss
యీ
రెండింటి
యొక్క
సమన్వయాన్ని
మనము
చూసుకోవాలి.
ఎక్కువ
profit
వచ్చిందంటే
మన
సంస్థలో
యేదో
ద్రోహము
జరిగింది
అని
విచారణ
చేయాలి.
కాని
యీనాడు
ఆ
విధంగా
ఆలోచన
చేయటం
లేదు.
profit
ఎక్కువ
వచ్చిందంటే
ఆహా
అని
మీకు
యింక్రిమెంటు
యిస్తాడు.
చెడ్డను
పురికొల్పుతున్నారేగాని
మంచిని
పురికొల్పటం
లేదు.
ఈనాడు
చెడ్డే
చాలా
attraction
గా
వుంది.
సత్యము,
మంచి
వెతికినా
కనుపించటం
లేదు.
ఏదో
పిచ్చి
పిచ్చి
మాటలతో
కాలాన్ని
వ్యర్థం
చేస్తే
ఆహా!
16
▾
Meaning
Keep
వాడు
నాతో
చక్కగా
మాట్లాడాడు
అని
ఆ
మాటలకంతా
ఎక్కువ
విలువనిస్తావు.
పవిత్రమైన
బ్రహ్మముహూర్తములో
సుప్రభాతం
చెప్పాలంటే
ఎందుకు
సుప్రభాతం
చెప్పాలి
ఒక
ప్రశ్న.
ఇది
కేవలం
ఎన్ని
జన్మల
ఖర్మమో
యీ
పదాలు
రావటం.
సుప్రభాతమంటే
ఏమిటి
తనలో
వున్న
దైవత్వమును
తాను
మేలుకొల్పటమే.
తనలో
నున్న
మంచి
తాను
మేలుకొల్పటమే.
బ్రహ్మముహూర్తము
లోపల
అనేక
సద్భావములు
వస్తాయి.
కేవలము
సోమరిపోతులకే
యిలాంటి
భావము.
మానవత్వము
మేల్కొలపాలంటే
ఆ
బ్రహ్మముహూర్తము
లోపల
పవిత్రమైన
నాభినుంచి
యీ
ప్రణవతత్వము
వలన
ఎంతైనా
ఆత్మతత్వము
మేల్కొంటుంది.
అలాంటి
బ్రహ్మ
ముహూర్తము
చాలా
అరుదు.
బ్రహ్మముహూర్తములో
మనలో
వున్న
spirit
మనం
మేల్కొలపాలి.
ఆ
పలుకు
సార్థకమవుతుంది.
భావము
సార్థకమవుతుంది.
హృదయము
పరిశుద్ధమై
పోతుంది.
అప్పుడే
తెల్లవారి
పనిచేసే
వారికి
చాలా
వుల్లాసముగా
వుంటుంది.
ఈ
సుప్రభాతము
కోసము
లేవవలసి
వచ్చిందే
అని
వారు
గొణుక్కుంటూ
గొణుక్కుంటూ
వుంటే
ఆనాడంతా
ఏడ్చుకుంటూనే
జీవితము
గడపవలసి
వస్తుంది.
ఈనాడు
పరిస్థితి
ఎలా
వుందంటే
మీకు
బాగా
తెలుసు.
ఇంటిలో
లేచేటప్పటికి
తల్లితండ్రులు
పోట్లాడుకుంటారు.
పిల్లలు
లేచేటప్పటికి
తిట్టుకుంటూ
వుంటారు
తల్లితండ్రులు.
ఆ
తిట్టుకుంటూ
లేచే
తల్లితండ్రుల
పిల్లలు
కొట్టుకుంటూ
లేస్తారు.
చూశారా!
తిట్టుకుంటూ
వుండే
తల్లితండ్రులకు
కొట్టుకుంటూ
వుండే
పిల్లలు
పుడతారు.
ఇది
దీనిలో
అంతరార్థము.
మహా
భారతము
లోపల
సుభద్రగర్భములో
అభిమన్యుడు
వుంటున్నాడు.
ఆమె
ఉపశాంతి
నిమిత్తమై
అర్జునుడు
పద్మవ్యూహాన్ని
గురించి
చెబుతున్నాడు.
ఆమె
వింటూ
వింటూ
నిద్రపోయింది.
కాని
ఆ
లోపల
వున్న
బిడ్డ
ఊ
కొడుతూ
వున్నది.
తక్షణమే
వచ్చాడు
కృష్ణుడు.
అర్జునా!
నీవు.
పద్మవ్యూహాన్ని
గురించి
ఎవరికి
చెబుతున్నావు.
సుభద్రకు
చెబుతున్నావా
కాదు
కాదు
లోపల
వున్న
శిశువు
వింటున్నాడు.
నీవు
చెప్పకూడదు.
పద్మవ్యూహంలో
ప్రవేశించటం
వరకూ
చెప్పాడు
కృష్ణుడు
వచ్చి
అడ్డం
చేసేటప్పటికి
వెలుపలకు
వచ్చే
విషయం
తెలియలేదు.
అభిమన్యుడు
పద్మవ్యూహం
లోకి
వెళ్లాడుగాని
ఎట్లా
రావాలో
తెలియలేదు.
చనిపోయాడు.
లోపలి
వున్న
బిడ్డ
కూడా
యీ
విషయాలు
శ్రవణం
చేస్తున్నాడు.
కనుక
మన
హృదయంలో
వున్న
తత్వము
ప్రతిదానిని
వింటుంది.
అదే
ఆత్మసాక్షి
అంటారు.
అన్ని
వింటూ
వుంటుంది.
యద్భావం
తద్భవతి.
మనము
ఎలాంటి
భావముతో
చేస్తామో
అలాంటి
ఫలితమే
మనకు
చిక్కుతుంది.
మంచి
భావముతో
పవిత్రమైన
భావముతో
మనము
చెయ్యాలి.
సంస్కృతములో
మీరు
విన్నారు
యద్భావం
తద్భవతి
అని.
దీనిని
చైనావారు
అనుభవిస్తూ
వచ్చారు.
వారు
కమ్యూనిష్టులు.
Think
at
the
man
so
as
the
man.
కమ్యూనిష్టులు
కూడను
యద్భావం
తద్భవతి
అని
ఒప్పుకున్నారు.
కనుక
మంచి
భావములతో
లేచినప్పుడు
మంచి
దినముగా
మనము
గడుపుతాము.
17
▾
Meaning
Keep
లేకపోతే
ఆనాడు
తిట్టించుకోటమో,
దుర్భాషలో
మనకు
వస్తూ
వుంటాయి.
లేచిన
తక్షణమే
పరిశుద్ధమైన
భావముతో
భగవత్ప్రార్థన
చేయటం
అత్యవసరము.
తన
conscious
ను
తాను
మేలుకొలపాలి.
అప్పుడే
అన్ని
విధములా
ఆనందము
అనుభవిస్తాము.
విద్యార్థులందరు
కూడను
మన
work
మనం
చెయ్యాలి.
మన
బాధ్యత
మనం
అనుభవించాలి.
మన
క్రమశిక్షణ
మనం
అనుభవించాలి.
ఈ
విషయములు
మీరు
గుర్తించాలి.
మీరనుకోవచ్చును.
సాయిబాబా
వ్యాపారము
గురించి,
మేనేజిమెంటు
గురించి
చెబుతున్నారు
చాలా
పొరపాటు.
ఒక్క
మేనేజిమెంటు
కాదు
నైతిక,
భౌతిక,
ధార్మిక
ఆధ్యాత్మిక,
కర్షక
అన్ని
సంగతులు
స్వామికి
తెలుసు.
అదే
divinity.
ఇంజనీరింగులో
చాలా
ప్రావీణ్యత
వుంది.
మీరు
చూస్తున్నారు.
ఎక్కడా
map
లో
లేదు.
నీవు
అన్ని
యిల్లాయిల్లా
చేయమని
జోగారావుకి
యిచ్చాను.
అదంతా
స్వామి
చేసింది.
ఎంత
సిమ్మెంటు
వేశారు
ఎంత
మెటలు
వేయాలి
ఎన్నింటికి
ఎన్ని
కలపాలి
యివన్ని
స్వయంగా
చూడటం.
ఏదైనా
జబ్బు
చేస్తే
ఫలాని
ఔషధము
వేయమని
నేను
అల్
రజాకు
చెబుతాను.
స్వామికి
మందుల
సంగతి
ఎట్లా
తెలుసని
అనుకుంటాడు.
మొన్న
మధ్యాహ్నం
రెండు
గంటలు.
పాపం
క్రింద
తూగుతున్నాడు
ఖయాల్
దాస్.
అల్
రజాను
పిలుచుకు
రమ్మన్నాను.
తక్షణమే
రమ్మనమనేటప్పటికి
పాపం
నిద్ర
పోతున్నాడు
పైజమా
వేసుకుని.
ఒక
జట్కావాని
మాదిరిలా
వచ్చాడు
స్వామికేమైందోనని
భయపడ్డాడు.
చాలా
మంచివాడు.
కుమార్
తల్లికి
heart
attack
వచ్చింది
నీవు
తక్షణమే
పోయి
ఫలాని
యింజక్షను
చేయమన్నాను.
అక్కడ
పోయి
చూస్తే
no
పల్స్.
ఏమిటి
పల్సు
లేదు
ఏమీ
లేదు
పడిపోయింది.
ఈ
యింజక్షను
మన
దగ్గర
లేదే
అన్నాడు.
నీ
bag
లో
వెతుకు
చిక్కుతుంది
అన్నాను.
ఎందుకంటే
రెండు
గంటల
సమయములో
ఆస్పత్రికి
పోవటానికి
వీలు
లేదు.
వెతికాడు.
పైనే
చిక్కింది.
తక్షణమే
ఆ
యింజక్షను
యిచ్చాడు.
ఆ
డాక్టరుకే
చాలా
ఆశ్చర్యము.
ఈ
మందుల్లో
కూడా
నేను
expertని.
దానికే
యిప్పుడు
అల్
రజా
సాయిరాం
మెడిసిన్
అని
పేరు
పెట్టాడు.
అర్థము
సోడా
బైకార్బొనేట్,
సగము
మెగసల్ఫు,
రెండూ
కలిపివేస్తే
పూర్తి
గ్యాస్
పోతుంది.
ఆశ్చర్యము
వేస్తుంది
స్వామికి
ఎలా
తెలుసని.
ఒక్క
మందుల
విషయమే
కాదు.
education,
యింజనీరింగు,
law
ఏదైనా
కాని
అన్ని
స్వామికి
తెలుసు.
ఒక్క
ఆధ్యాత్మిక
తత్వమే
స్వామికి
తెలుసు
అంటారు.
నేను
ఆధ్యాత్మికవేత్తనే
కాను.
ఇంజనీరింగ్
కాని,
మెడిసిన్
గాని,
ఆధ్యాత్మికము
గాని
నేను
యేనాడు
ఒక్క
బుక్
చదవలేదు.
వీళ్లంతా
చూస్తుంటారు.
రాధాకృష్ణ
వీళ్లంతా
చూస్తారు.
ఒక్క
సనాతన
సారథి
మటుకు
తీసుకు
వస్తే
చూస్తాను.
అది
కూడా
ఎందుకు
చూస్తానంటే
మన
నరసింహన్
తప్పులు
వ్రాస్తూ
వుంటాడు.
ఆ
తప్పులు
చెప్పే
కోసం
ఆ
పుస్తకం
చూస్తాను.
ఇంక
యే
బుక్
ముట్టను.
చాలమందికి
చెబుతాను
బుక్కుల
పిచ్చి
నీకెందుకు
వచ్చింది?
దానిని
చదివే
కొలది
confusion
అయిపోతుంది.
వుండే
భావాలంతా
చెదిరిపోతుంది.
18
▾
Meaning
Keep
ఎవరి
బెడ్
రూములో
ఎక్కువ
పుస్తకాలుంటాయో
వారికి
బుద్ధి
తగ్గి
రోగమెక్కువ
అని
తెలుస్తుంది.
ఐతే
విద్యార్థి
చదువవలసిందే.
చదవటానికే
వచ్చారు
మీరు.
కనుక
ఆధ్యాత్మికములో
మాత్రమే
కాకుండా
అన్నింటిలో
master.
అదే
divinity.
దానిలో
వున్న
ప్రధానమైన
ప్రాణసూత్రాలను
కూడా
గుర్తించాలి.
మీకు
చెప్పాను
యింతకు
ముందు.
ఈ
కోర్పరేటరు
లోపల
జర్రీ
అనే
వైరు
అది.
స్వామి
ఎప్పుడూ
చూడలేదు.
పెట్రోలు
పోయేటందుకు
వుపయోగిస్తారు.
అది
చాలా
important.
ప్రతి
విషయం
కారుకు
గాని
యింకే
విషయంగాని
తెలుసుకొని
వుండాలి.
కనుక
మీరు
కేవలం
ఏదో
యీ
ఆధ్యాత్మిక
విషయమే
కాకుండా
general
విషయంలో
కూడా
మీరు
తగిన
జాగ్రత్త
వహించాలి.
విద్యార్థులారా!
మన
సంస్థలో
వున్న
నిబంధనలు
ఒక
ఫలితం
నిమిత్తమైనటువంటివే
గాని
నిరుపయోగంగా
నిర్మించినవి
కావు.
వీటిని
చక్కగా
పాటించిన
వారికి
భవిష్యత్తులో
దాని
విలువ
మీకు
తెలుస్తుంది.
తాత్కాలికంగా
మీ
యొక్క
సుఖముకోసం
మీరు
వీటిని
విసర్జిస్తే
భవిష్యత్తులో
మీరు
చాలా
బాధపడవలసి
వస్తుంది.
హాస్టలుయందుగాని,
మందిరమునందుగాని
యింకెక్కడైనాగాని
మీ
యొక్క
క్రమశిక్షణను
చక్కగా
పోషిస్తూ
రండి.
క్రమశిక్షణ
లేకపోతే
మానవత్వమే
క్షీణించిపోతుంది.
కనుక
డిసిప్లిన్
ను
బాధతోనైనా
పాటిస్తే
తర్వాత
ఎంతో
సుఖాన్ని
అనుభవిస్తారు.
మొట్టమొదట
పిల్లవానికి
తల్లి
అన్నం
పెట్టినప్పుడు
అంతా
వుమ్మివేస్తూ
వుంటాడు.
కాని
తల్లి
వదలిపెట్టదు.
బలవంతముగానైనా
తినిపిస్తుంది.
తరువాత
వాడు
ముద్దలు
ముద్దలు
మింగేస్తాడు.
ఆ
అభ్యాసమే
కనుక
నీవు
చేయకుండా
పోతే
వాడు
జీవితాన్ని
ఏ
విధంగా
చూడగలడు.
కనుక
క్రమశిక్షణను
మీరు
బాధతోనైనా
సరే
తప్పనిసరిగా
నేను
సుప్రభాతానికి
పోవాలి,
తప్పనిసరిగా
ఓంకారమునకు
పోవాలి,
తప్పనిసరిగా
భజనకు
పోవాలి
అని
కఠినముగా
చెప్పటములో
భవిష్యత్తులో
మీరు
ఆనందాన్ని
అనుభవిస్తారు.
లేకపోతే
మీరు
జీవితమంతా
కూడా
దున్నపోతు
జీవితముగా
గడచిపోతుంది.
కేవలం
మానవత్వమే
వుండదు
అక్కడ.
దున్నపోతు
అంటే
మీకు
తెలుసు
కదా!
ఎంత
వర్షము
కురుస్తున్నా
అది
తోక
కూడా
అల్లాడించదు.
అంత
insensitive.
అది.
అదే
ఆవు
కనుక
అయితే
తక్షణం
పరుగెత్తి
పోతుంది.
కనుక
పవిత్రమైన
గోవులుగా
జీవించాలి
గాని
దున్నపోతులుగా
జీవించకూడదు.
మూడు
దినములనుండి
నేను
ఒక
కప్పు
butter
milk
మాత్రమే
తీసుకుంటున్నాను.
ఏదో
శరీరానికి
బాధలు
వస్తూ
వుంటాయి.
పోతూ
వుంటాయి.
దానివల్ల
కారుణ్యానంద
పోవద్దని
అన్నాడు.
వెళ్లక
పోవటం
భావ్యము
కాదు.
పిల్లలకి
మాట
యిచ్చాను.
వారు
చాలా
బాధపడతారు.
స్వామి
యొక్క
ప్రతిజ్ఞ
కాని,
పనులు
గాని
తుచ
తప్పకుండా
నడుచుకుంటూ
వస్తుంటారు.
స్వామి
బయలుదేరే
ముందు
రాధాకృష్ణ
butter
milk
యిచ్చాడు.
స్వామి
కాలేజిలో
చదివే
వారు
పాటించినా
పాటించకపోయినా
యిచ్చిన
మాటను
దక్కించుకోటానికి
ప్రయత్నం
చేయాలి
అది
నేర్చుకోవాలి
మొట్టమొదట.
19
▾
Meaning
Keep
నా
కార్యక్రమము
ఏ
ఒక్కటి
కూడ
నేను
తప్పను.
ఒక
తూరి
నేను
రాజమండ్రిలో
ఒక
ప్రోగ్రాము
యిచ్చాను.
అక్కడకు
సరిగ్గా
వెళ్లాను.
అప్పుడు
యీ
బ్రిడ్జి
లేదు.
పడవలో
పోవాలి.
ఆ
బోటులో
పోయేటప్పుడు
గోదావరి
బ్రిడ్జి
చాలా
పైకి
ప్రవహిస్తోంది.
రైల్వే
బ్రిడ్జి
తాకుతుంది.
బోటు
పోవాలంటే
బ్రిడ్జి
క్రిందుగా
పోవాలి.
అక్కడికి
కలక్టరు,
S.P.
అంతా
వచ్చేశారు.
బోటు
మీద
రావటానికి
వీలు
లేదని.
నేను
తొమ్మిది
గంటలకు
అక్కడకు
పోయి
యిల్లు
open
చేయాలి.
రామకృష్ణ
అని
I.C.S
officer
వుండేవాడు.
వారి
యిల్లు
open
చెయ్యాలి.
అప్పుడు
నేను
చెప్పాను.
తొమ్మిది
గంటలకు
నేను
అక్కడికి
పోయి
చేరాలి.
చాలా
danger
గా
వుంది.
ఎవరి
పడవలు
పోవటానికి
వీలు
లేకుండా
నీళ్లు
సుళ్లు
తిరిగి
పోతుంది
అన్నారు.
అప్పుడు
మద్రాసు
ఆంధ్ర
ఒకే
రాష్ట్రముగా
వుండేది.
అప్పుడు
హనుమంతరావు
ట్రాన్స్
పోర్టు
కమిషనరుగా
వుండేవాడు.
ట్రాన్స్
పోర్టు
మినిష్టరు
గోపాలరెడ్డి.
అందరూ
స్వామితో
వెళ్లాలి.
అక్కడ
వారు
చెప్పారు
ఏదైనా
గ్యారంటీ
యివ్వాలి
అన్నారు.
మేము
చెప్పాము.
కలెక్టరు
గారు
మేము
వినకుండా
వెడుతున్నాము
ఏమి
జరిగినా
మా
బాధ్యత
అని.
హనుమంతరావుని
undertaking
యివ్వమన్నాను.
నేను
ఆఫీసరుగా
వున్నాను
ఎట్లా
రాసి
యిచ్చేది
అన్నాడు.
కాగితము
తీసుకుని
నేనే
రాసి
యిచ్చాను.
నాకు
ఏ
విధమైన
danger
జరుగదు.
వెళ్లినాము.
బ్రిడ్జి
దగ్గరకు
పోయేటప్పటికి
బ్రిడ్జికి
తగులుతున్నాది
బోటు.
తగిలితే
బోటు
పడిపోతుంది.
రాజమండ్రి
ప్రజలంతా
గట్టుపైనుండి
చూస్తున్నారు.
సాయిబాబా
వస్తారు
ఎట్లా
వస్తారని.
ఆ
బ్రిడ్జి
దగ్గరకు
పోయాము
బోటు
వంగింది
అవతలకు
వెళ్లింది.
బ్రిడ్జి
ఎట్లా
దాటిందో
ఎవరికి
తెలియదు.
పోయి
తొమ్మిది
గంటలకు
correct
గా
అక్కడ
open
చేశాను.
ఈ
పొద్దు
కూడా
8'o
clock
అన్నాను.
8
o'clock
అయ్యేసరికి
కారు
దిగాను.
ఎప్పుడైనా
ఒకటి
రెండు
నిముషాలు
లేటు
అవుతే
నా
వెంట
వచ్చిన
నరసింహన్
వల్ల.
స్వామి
మాట
సత్యము.
సత్యమును
పాటిస్తాను.
మీరు
కూడా
అంతో
యింతో
పాటించటానికి
ప్రయత్నించండి.
మీరు
ఎక్కడికి
వెళ్లినప్పటికిని
సత్యసాయి
కాలేజిలో
చదివిన
పిల్లలంటే
ఆదర్శము
నిరూపించాలి.
Previous
←
Foster Humanness
Next
Good Resolves Are Everlasting
→