Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1989 · Be Pure in Thought, Word and Deed
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Be Pure in Thought, Word and Deed
8 October 1989, Dasara, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
Also in his talks
(12)
7 February 1980
Be human
30 July 1987
To nurture sacred feelings in the heart is education
6 March 1989
God is the embodiment of Prema
22 May 1990
Mastery of the Senses
20 May 1991
The End Of Education Is Character
26 June 1996
Forbearance Is a Safe Armour for Man
20 October 1996
When the Heart Is Turned to Prema, the World Turns to Brahman
25 April 1998
Every Person Longs for Śānti
26 September 1998
God Is the Very Foundation of the World
22 November 2001
True education brings the wealth of character
19 January 2002
Hospitals must not become business centres
28 October 2003
Loving the Ātma principle is spirituality itself
సకల
విద్యలు
నేర్చి
సభ
జయించగవచ్చు
శూరుడై
రణమందు
పోరవచ్చు
రాజరాజై
పుట్టి
రాజ్యమేలగవచ్చు
హేమ
గోదానములీయవచ్చు
గగనమందున్న
చుక్కల
లెక్కగొనవచ్చు
జీవరాసుల
పేర్లు
చెప్పవచ్చు
అష్టాంగవిద్యలనభ్యసింపగవచ్చు
చంద్రమండలమైన
చేరవచ్చు
కాని
దేహేంద్రియములరికట్టి
ఎపుడు
మనసు
నిల్పి
యంతర్ముఖముగను
జేసి
నిశ్చల
సమాధి
చిత్తుడై
నిలువలేడు.
రిత్తకోరికలను
మోపు
ఎత్తుకొనుచు
తిరుగుచున్నారు
నిజరూపు
తెలియలేక
తిలలయందున
తైలంబు
వెలయునటుల
దేవుడున్నాడు
నీలోన
తెలియరయ్య.
ప్రేమస్వరూపులారా!
శరీరములో,
గగనాకాశమందు
ఎండనీడలు
వలె,
జీవుడుతో
దేవుడు
నివసించుచున్నాడు.
ఎండనీడలు
ఒకదాని
ప్రక్కన
ఒకటి,
ఒకదానితో
ఒకటి
అవినాభావ
సంబంధమై,
అన్యోన్యాశ్రయమై
వుంటున్నవి.
అటులనే
జీవుడు
దేవుడు
ఒకదానినొకటి
అనుసరించి
అన్యోన్యాశ్రయమై,
అవినాభావ
సంబంధముతో
హృదయములో
నిలిచి
వున్నవి.
నీడలు
వేరు
వేరు
రూపములుగా
వుండినప్పటికిని
ఎండ
ఒక్కటిగానే
వుంటుంది.
అట్టులనే
జీవులు
వేరువేరు
రూపములుగా
కన్పించుచున్నప్పటికిని
దైవము
ఒకటిగానే
వుంటున్నాడు.
జీవులకు
ఉపాధి
పరిమితి.
దేవుడు
సర్వాంతర్యామి.
ఉపాధిరహితుడు.
ఇట్టి
నిజతత్వమును
గుర్తించి
అనుభవించి,
ఆనందించి
జగత్తునకందించే
నిమిత్తమై
ఆనాటి
ప్రజలు
యజ్ఞయాగాది
క్రతువులు
ప్రారంభించారు.
దేహమునకు
యింద్రియములు
ప్రధానము.
ఈ
యింద్రియముల
కంటె
కూడ
యింద్రియ
భావములు
అత్యంత
బలవత్తరమైనవి.
శబ్దస్పర్శరూప
రసగంధాదులు.
ఈ
యింద్రియములన్నింటి
కంటె
వాగింద్రియము
మహాశక్తివంతమైనది.
2
▾
Meaning
Keep
ఈ
యింద్రియములన్నింటికి
అధిపతి
మనస్సు.
మనస్సుకు
అధిపతి
బుద్ధి.
బుద్ధికి
అధిపతి
జీవుడు.
జీవునికి
అధిపతి
దేవుడు.
ఇంద్రియములు
మనస్సుతో
చేర్చి
మనస్సును
బుద్ధితో
కలిపి
బుద్ధిని
జీవముతో
చేర్చినప్పుడే
యీ
జీవబ్రహ్మముల
యొక్క
ఐక్యత
మనకు
అర్థమవుతుంది.
ఇంద్రియములన్నింటి
కంటె
జిహ్వేంద్రియము
మహాశక్తివంతమైనది.
ఒక్క
జిహ్వేంద్రియాన్ని
మనము
వశం
చేసుకుంటే
సర్వేంద్రియములు
కూడా
వశమైపోతాయి.
ఈ
జిహ్వేంద్రియము
తినటము,
మాట్లాడటము.
ఈ
జిహ్వేంద్రియమును
మనస్సుతో
చేర్చినప్పుడు
యీ
మాటలు
నిల్చిపోతాయి.
అప్పటినుండి
మనసు
మాట్లాడటం
ప్రారంభిస్తుంది.
మనసు
మాటలను
నిలిపివేయుటకై
బుద్ధిని
హెచ్చరించాలి.
బుద్ధిని
మేలుకొలిపినప్పుడు
మనసు
మాటలు
నిలిపించి
యీ
మనసు
బుద్ధితో
ఐక్యంగావించుకుంటుంది.
ఇంద్రియములు
మనస్సుతో
మనస్సు
బుద్ధితో
చేరినప్పుడు
బుద్ధికి
బుద్ధి
చెప్పి
యీ
బుద్ధిని
జీవము
వైపుకు
మరల్చే
ప్రయత్నం
మనం
చేయాలి.
ఈ
బుద్ధిని
జీవము
వైపునకు
మరల్చినప్పుడే
యీ
జీవము
బ్రహ్మముతో
ఐక్యమైపోతుంది.
ఇది
సరైన
సాధన.
కాని
యిట్టి
సక్రమమైన
సాధనను
గుర్తించుకొనలేక
నిరంతరము
భోగభాగ్యముల
నిమిత్తము,
ఆశల
నిమిత్తము
బాహ్యమైన
దృష్టిని
అభివృద్ధిగావించుకుంటున్నాడు
మానవుడు.
బహుశ
యిది
వీరి
తప్పు
కాకపోవచ్చు.
ఇంద్రియములన్ని
కూడా
బహిర్ముఖమై
వుంటున్నాయి.
కన్నులు
బహిర్ముఖమే.
చెవులు
బహిర్ముఖమే.
నోరు
బహిర్ముఖమే.
ముక్కు
బహిర్ముఖమే.
ఈ
యింద్రియములన్ని
బహిర్ముఖముగా
వుండటం
చేత
మానవుని
యొక్క
తత్వము
బహిర్ముఖములో
అభివృద్ధిగావించుకుంటున్నది.
ఐతే
యీ
అంతర్బహిర్ముఖములకు
ఒక
అవినాభావ
సంబంధమున్నది.
బాహ్య
ప్రపంచమునకు,
అంతర్లోకమునకు
వున్న
అవినాభావ
సంబంధాన్ని
గుర్తించటానికి
ప్రయత్నించాలి
మానవుడు.
అందాన్ని
చూచి
ఆనందించేది,
ఆహారాన్ని
చూచి
ఆస్వాదించేది
పరిమళాన్ని
చూచి
పరవసించేది
దేహమా
లేక
మనసా?
చక్కగా
విచారణ
సలిపినప్పుడు
ఆత్మనే
యివన్ని
అనుభవించుచున్నది
కాని
దేహము
కాదు.
ఇట్టి
ఆత్మానందమును
అనుభవించటమే
మానవుని
ప్రధాన
కర్తవ్యము.
బాహ్యదృష్టికి
మూలము,
అంతర్దృష్టికి
ఆది
ఆత్మనే.
ఈ
ఆత్మానందమంటే
ఏమిటి?
సర్వసౌకర్యములతో
తులతూగుచు,
దేహసంబంధమైన
పుష్టి,
సంతుష్టి
పురస్కరించుకొని
మానవుడు
ఆనందిస్తూ
వుంటాడు.
ఆ
ఆనందము
మానవునికి
అత్యంత
ఆనందముగా
గోచరిస్తుంది.
కాని
యీ
ఆనందముకంటె
నూరురెట్లు
అధికమైనది
గంధర్వానందము.
ఈ
గంధర్వానందము
కంటె
దేవానందమనేది
మరింత
నూరురెట్లు
ఆనందమైనది.
ఈ
దేవానందముకంటె
దేవేంద్రుని
ఆనందము
మరింతనూరురెట్లు
అధికమైనది.
ఈ
దేవేంద్ర
ఆనందము
కంటె
నూరురెట్లు
అధికమైనది
ఇంద్రానందము.
3
▾
Meaning
Keep
Also in his talks
(2)
20 October 1988
Make Your Life Worthwhile in Nāma-saṅkīrtana!
22 August 1996
You Yourself Are God
ఇంద్రానందముకంటె
నూరురెట్లు
అధికమైనది
ప్రజాపతి
ఆనందము.
ఈ
ప్రజాపతి
ఆనందముకంటె
నూరురెట్లు
అధికమైనది
ఆత్మానందము.
ఇట్టి
మానవానందము
ఆత్మానందమును
పోల్చి
చూచినప్పుడు
యీ
దేవానందము,
లోకానందము,
మానవానందము
ఎంతటిది.
అల్పమైన
విషయములతో,
అల్పమైన
భావములతో
మనము
ఆనందించే
ఆనందమునే
మనం
మైమరచిపోతున్నాము.
ఇట్టి
పవిత్రమైన
ఆత్మానందములో
మనము
మునిగినప్పుడు
యింక
యేమిటి
మనం
జ్ఞప్తియందుంచుకోగలము.
సర్వము
కూడా
మరచి
ఆ
ఆనందములోనే
మన
జీవితము
అంకితమైపోతుంది.
ఈ
ఆత్మానందమే
బ్రహ్మానందము.
ఈ
ఆత్మానందమే
అద్వైతానందము.
ఈ
ఆత్మానందమే
పరమానందము.
ఈ
ఆత్మానందమే
యోగానందము.
కనుక
యీ
ఆనందము
లేని
స్థానము
యీ
లోకములో
కానరాదు.
సమస్త
పదార్థములందు
యీ
ఆనందము
అంతర్భూతమై
వుంటుంది.
దీనినే
త్యాగరాజు
చెప్పాడు.
చీమలో
బ్రహ్మలో
శివకేశవాదులలో
ప్రేమ
మీర
వెలసి
యుండె
బిరుదువహించిన
సీతారామ
నన్నుబ్రోవరా....
చీమనుండి
బ్రహ్మవరకు
వుండినటువంటి
నీ
తత్వాన్ని
ఏరీతిగా
వర్ణించాలి.
అని
సమస్త
జీవులందు
యీ
దైవానందమున్నదని
త్యాగరాజు
తనసాధనా
సంపత్తి
వలన
గుర్తించుకోగలిగాడు.
ఈ
బ్రహ్మతత్వమనేది
మనం
యేరీతిగా
గుర్తించాలి?
ఇక్కడ
మానవత్వమనేది
ప్రకృతికి
సంబంధించినది.
ప్రకృతికి
రసము
జలము.
జలమునకు
ఫలితము
సస్యము.
ఆ
సస్యమునకు
ప్రతిరూపము
పురుషుడు.
ఈ
పురుషుని
యొక్క
రసము
వాక్కు.
వాక్కు
యొక్క
భావము
ఋక్కు.
ఋక్కుయొక్క
సౌందర్యమే
సామము.
సామము
యొక్క
రసస్వరూపమే
ఓం.
ఈ
ఓం
తత్వమనేది
ఎక్కడనుండి
ఆవిర్భవించినది.
విచారణ
చేస్తే
పృధ్వినుండియే
ఆవిర్భవించింది.
ఈ
పృధ్వియందున్న
సమస్త
పదార్థములు
యీ
ఓం
యొక్క
శబ్దముతోనే
నిండి
వుంది.
శబ్దమంతయూ
కూడను
ప్రణవనాదమే.
కనుకనే
ఏ
నామము
చెప్పవలెనన్నను
ఓంను
ప్రథమంగా
వుంచుకొని
తద్వారా
నామమును
వుచ్ఛరిస్తూ
వస్తున్నారు.
ఈ
ప్రణవనాదమే
లేకపోతే
యిందులో
పృధ్వికి
యేమాత్రము
విలువ
లేదు.
ఈ
ఋగ్వేదము
కూడను
యీ
సామవేదమునందే
అంతర్భూతమై
వుంటున్నది.
సా,
మ.
అనే
రెండక్షరములు.
సా
అనగా
పృధ్వి.
అమ
అనగా
అగ్ని.
స+అమ=సామ.
అగ్ని
ఋగ్వేదము
యొక్క
సారము.
పృధ్వి
సామవేదము
యొక్క
సారము.
ఏతావాతా
ఋగ్వేద
సామవేదములు
రెండూ
కూడా
సామవేదములోనే
అంతర్భూతమై
వుంటున్నవి.
ఈ
ఓం
కు
ఉద్గీత
అని
ఒక
పేరు.
ఉది
అనగా
ప్రాణము.
గీ
అనగా
వాక్కు.
త
అనగా
అన్నము.
ఏతావాతా
ఆత్మ,
మనసు,
శరీరము
యీ
మూడింటియందు
అంతర్భూతమైన
తత్వమే
యీ
ఓం.
4
▾
Meaning
Keep
దీనినే
ప్రజ్ఞ
అన్నారు.
ఆత్మ,
మనస్సు,
శరీరము
అందరియొక్క
ఆకారమే.
ఈ
మూడును
లేని
ఆకారము
పృధ్వియందు
కానరాదు.
కనుక
ఓంకారమనేది
మనయొక్క
ఆకారమే
కాని
వికారము
కాదని
గుర్తించి
వర్తించాలి.
ఏకత్వమును
ప్రబోధించే
తత్వమే
వేదము
యొక్క
సారము.
సమస్తము
యీ
ఓం
అనే
బ్రహ్మమునుండే
ఆవిర్భవిస్తూ
వస్తున్నది.
పుట్టుట
పెరుగుట
నశించుట
యీ
అన్నింటికి
కూడా
ఒక్క
బ్రహ్మతత్వమే
మూలాధారము.
'తత్
జలాత్'
అని
వేదములో
ఒక
పదము.
ఇదియే
బ్రహ్మసూత్రము
యొక్క
ప్రధాన
సూత్రము.
తత్
అనగా
దానినుండి,
జ-అనగా
జన్మించటము
-
ల-అనగా
లయమొందటము.
త-అనగా
అభివృద్ధిగాంచటము.
తత్
జలాత్
అనగా
యేమి?
దేనినుండి
పుట్టినదో,
దేనిలో
లయమగుచున్నదో
దానినుండి
యే
అభివృద్ధిగాంచుచున్నది.
ఇట్టి
మహా
పవిత్రమైన
సూత్రములు
వేదమునందు
యిమిడి
వుండినప్పటికి
దీనిని
సరైన
మార్గములో
అందించే
మహనీయులు
లేకపోవటం
చేత,
అర్థము
కాకపోవటం
చేతను
వీటినన్నిటిని
అనర్థములుగా
భావించి
యదార్థములను
మరుగుపరచి
అనర్థాలను
పెంచుతూ
వచ్చారు.
ఏతావాతా
మానవుని
జీవితమంతయు
యజ్ఞమయమే.
మానవుడు
చేసే
సర్వకర్మలకు
మూడు
కాలములుంటున్నాయి.
ప్రాతఃకాలము,
మధ్యాహ్నకాలము,
సాయంకాలము.
మన
జీవితములో
ప్రాతఃకాలమనేది
24
సంవత్సరములుగా
వుంటుంది.
అనగా
కేవలము
ఒక
దేహము
యొక్క
తత్వమునే
గాక,
విద్యావిధానమను
భావములను,
భవిష్యత్తు
యొక్క
విషయములను
తలయందుంచుకొని
తద్వారా
నిరంతరము
కర్మలనాచరించే
ఉత్సాహప్రోత్సాహములే
యీ
ప్రాతః
సమయము
యొక్క
అంతరార్థము.
ఇది
బాల్యస్థితియని
కూడను
చెప్పవచ్చును.
రెండవది
మధ్యాహ్న
సమయము.
అది
44
సంవత్సరములు.
ఇంక
సాయం
సమయమనేది
48
సంవత్సరములు.
అన్నీ
చేరి
116
సంవత్సరములు
మానవుని
యొక్క
జీవితము.
116
సంవత్సరములు
జీవించవలసిన
మానవుడు
యే
కొద్ది
కాలములోనే
మరణిస్తున్నాడంటే
దీనికి
కారణమేమిటి?
మానవుడు
తన
జీవిత
విధానములో
అనుసరించవలసిన
మార్గములు
తప్పి
అపమార్గములు
పట్టి
తన
ఆరోగ్యమును
చెడుపుకొని
జీవితమును
క్షీణింప
చేసుకుంటున్నాడు.
జీవితము
యొక్క
విధానము
మానవుని
యొక్క
హృదయములో
యిమిడి
వుంటున్నది.
ఈనాటి
మానవుని
యొక్క
విచారము,
అపనమ్మకముల
చేతనే
తన
జీవితమును
అంకితము
గావించుకుంటున్నాడు.
ప్రపంచమంతయు
కూడా
భగవంతుని
యొక్క
స్వరూపమే.
ఇలాంటి
ప్రపంచమునందు
వుండినటువంటి
సమస్త
పదార్థములు
కూడా
బ్రహ్మస్వరూపమే.
నిజముగా
నీవు
భగవంతుని
యిష్టపడిన
వాడవైతే,
ప్రేమించినవాడవైతే
యీ
ప్రపంచము
నందుగల
సమస్త
పదార్థములను
ప్రేమించాలి.
దేనినీ
ద్వేషించరాదు.
ఎవరిని
పరిహసించరాదు.
ఎవరినీ
దూషించరాదు.
ఎవరినీ
బాధించరాదు.
ఇవి
భగవంతుని
యొక్క
స్వరూపములే.
5
▾
Meaning
Keep
ఇట్టి
భావముతో
మానవుడు
తన
జీవితమును
గడిపినప్పుడు
పూర్ణాయుష్మంతుడై
పూర్ణత్వాన్ని
కూడా
అనుభవించగలడు.
కాని
యీనాటి
మానవుడు
సంకుచిత
భావములనభివృద్ధిగావించుకొని
నా
నీ
అనే
భేదముల
చేత
జీవితమును
మధ్యకాలములోనే
అంత్యము
గావించుకుంటున్నాడు.
ఐతే
అన్నింటిని
తనదిగా
భావించవచ్చు
కాని
దేనియందు
అభిమానము
పెంచుకొనరాదు.
నా
ఆవు
యీనింది.
నా
దూడకు
దెబ్బ
తగిలిందని
నా
ఆవు,
నా
దూడ
అనే
అభిమానం
చేత
దానిని
పోషిస్తున్నాడు.
కాని
అతనికి
తెలుసు
యిది
నాది
కాదని.
తనది
కానప్పటికి
తనదిగా
భావించి
దానిని
పోషిస్తున్నాడు.
అదేవిధముగానే
యీ
జగత్తునందున్న
సమస్త
పదార్థములు
నీవి
కానప్పటికిని
నీవిగా
భావించి
దాని
యొక్క
పోషణ
నీవు
చేయటానికి
తగిన
కృషి
సల్పాలి.
పోషణ
చేయనక్కరలేదు.
దాని
పోషణకి
అడ్డు
తగలకుండా
వుంటే
అదే
చాలు.
అదియే
18
పురాణములందు
వున్నటువంటి
మహాసారము.
రెండు
వాక్యములు.
Help
ever
Hurt
never.
పరోపకారపుణ్యాయ
పాపాయ
పరపీడనమ్.
నీవు
సాయం
చేయకపోతే
ఫరవాలేదు
కీడు
చేయకపోతే
అదే
పదివేలు.
ఈవిధమైన
భావాలు
భగవద్భావం
చేతనే
అభివృద్ధిగాంచునుగాని
ప్రాకృతమైన
భావం
చేత
పరోపకార
భావములు,
విశాలమైన
భావములు,
సున్నితమైన
భావములు,
పవిత్రమైన
భావములు
మానవునియందు
అభివృద్ధి
అగుటకు
ఏమాత్రము
అవకాశము
లేదు.
కనుక
ప్రతి
మానవునియందు
దివ్య
భావములు,
నవ్యమైన
భావములు
అభివృద్ధిగావించుకోవాలి.
ఇట్టి
దివ్యభావములనభివృద్ధిగావించుకుని
తద్వారా
జగత్తునకు
అందించే
నిమిత్తమై
ప్రాచీన
కాలమునుండి
మహర్షులు
యిలాంటి
యజ్ఞయాగాది
క్రతువులనే
కర్మల
చేత
యీ
పవిత్రమైన
ప్రచార
ప్రబోధలు
సలుపుతూ
వచ్చారు.
ప్రేమస్వరూపులారా!
భగవంతుని
యొక్క
తత్వము
అంతసులభంగా
అర్థమయ్యేది
కాదు.
నిత్య
జీవితములో
మనము
సత్యమైన
విషయాన్ని
లోతునకు
దిగి
విచారించినప్పుడు
ఎవరికి
వారికే
యిది
దోషమని,
యిది
మంచిదని
మన
ఆత్మసాక్షిగా
మనం
నిర్ణయం
చేసుకోవచ్చు.
ఏదో
ఒక
వుద్రేకము
చేతనో
లేక
ఒక
ఆదేశము
చేతనో
ఎవరినైనా
మనము
అనరాని
మాటలు
అనవచ్చు.
తదుపరి
శాంతపడిన
తరువాత
చల్లబడిన
తరువాత
తనయొక్క
హృదయమే
తనను
బాధింపచేస్తుంది.
ఎంతటి
మాటలు
అన్నాను
యిది
నాది
తప్పు
అని
తనకు
తాను
పశ్చాత్తాపపడతాడు.
కాని
ఆ
పశ్చాత్తాపాన్ని
బయటకు
నిరూపించడు.
అది
అప్పటికి
మాత్రమే
అణగద్రొక్కుతాడు.
నిజముగా
శాశ్వతమైన
పశ్చాత్తాపమే
వుంటే
మరొక
తూరి
అలాంటి
మాటలకు
తాను
పూనుకోడు.
దోషములు
చేయటం
పశ్చాత్తాప
పడటం;
పశ్చాత్తాపం
దోషములు
చేయటం
+
-
+
-
=0
ఇంతే
మన
జీవితము.
ఈనాటి
జగత్తునందు
దినమూ
తప్పులు
చేయటం
ఆ
తప్పులు
తప్పులని
భావించటము
తిరిగి
రెండవ
దినము
తప్పులు
చేయటము.
6
▾
Meaning
Keep
His poems 48
Also in his talks
(3)
23 May 1991
Thath Twam Asi - That Thou Art
23 November 1992
Service of the village becomes service of Rāma!
16 August 1996
‘Love all, worship all’
ఈ
తప్పులను
తప్పులుగా
పశ్చాత్తాపపడినటువంటివాడైతే
రెండవదినము
తిరిగి
యీ
తప్పులలో
ఎందుకు
ప్రవేశిస్తున్నాడు.
కనుక
తెలిసో
తెలియకో
ఒకతూరి
దోషములు
చేసినప్పుడు
తిరిగి
అట్టి
దోషములు
రాకుండా
చూసుకోవాలి.
ఇదియే
నిజమైన
మానవత్వము
యొక్క
సత్యతత్వము.
ప్రతి
విషయమునందు
కూడను,
ప్రతి
వాక్కునందు
కూడను,
ప్రతి
చర్యయందు
కూడను
దివ్యత్వమనే
చైతన్యము
అన్నింటియందు
వ్యాప్తియై
వున్నదనే
సత్యాన్ని
మనం
విశ్వసించాలి.
తత్
జలాన్
అనేటువంటి
దానిలో
యీ
దేహము,
మనసు,
ప్రాణము
యీ
మూడింటి
యందు
వున్న
ప్రజ్ఞను
మనం
చక్కగా
విచారించుకోవాలి.
అదియే
ప్రజ్ఞానం
బ్రహ్మ
అన్నారు.
అదే
constant
integrated
awareness.
అలాంటి
ప్రజ్ఞ
మన
వెంటనే
జంటనే
యింటనే
వుండి
కూడను
దానిని
గుర్తించుకోలేకపోవటమనేది
యింతకంటె
గొప్ప
అజ్ఞానము
మరొకటి
లేదు.
ఇది
కేవలం
చదువులతో
లభ్యమయ్యేది
కాదు.
లేక
గ్రంథములతో
మనం
నేర్చుకోవలసినది
కాదు.
నిత్య
జీవితములో
మనయొక్క
అనుభూతుల
ద్వారా
దీనిని
అర్థం
చేసుకోవాలి.
ఎన్ని
విద్యలు
నేర్చియునేమి
ఫలము
తననొసటవ్రాత
తప్పింప
తరము
కాదు
చెడ్డబుద్ధులు
తనతల
చేరెనేని
బండబారును
బుద్ధులు
ఎండబారు.
ఎప్పుడు
చూచినా
యితరులను
దూషించటము,
యితరులను
విమర్శించటము
యిది
మానవునకు
సరైనది
కాదు.
కేవలము
దానవలక్షణము.
ఇలాంటి
గుణములు
వున్న
మానవుడు
యేనాటికిని
శాంతిని
అందుకోలేడు.
తన
తత్వాన్ని
తాను
మార్చుకోవాలి.
తను
మారక
గృహమును
మార్చుకొనక
లోకమును
మార్చుటకు
ప్రయత్నించటమంటే
కేవలము
వెఱ్ఱితనము.
దైవము
సర్వత్ర
వుంటున్నాడనే
విశ్వాసమును
మొదట
పెంచుకోవాలి.
ఒక
సైంటిస్టు
సూర్యుని
చూచి
యిది
కేవలము
హైడ్రోజన్
బాల్
అంటాడు.
కాని
దివ్యమైన
భగవత్
సాధకుడు
ఆహా!
సూర్యుడు
లోకారాధకుడు.
ఇతను
ప్రత్యక్ష
దైవము
సూర్యుడే
లేకపోతే
సృష్టియే
లేదు.
సమస్త
ఋతువులకు,
దిన
చర్యలకు
రాత్రింబవళ్లు
అంతా
సూర్యుడే
మూలకారణము.
సూర్యారాధన
సలుపుతూ
వుంటాడు
భక్తుడు.
సైంటిస్టుకు,
సన్యాసికి
వున్న
వ్యత్యాసమెంతటిదో
చూడండి.
కేవలము
హైడ్రోజన్
బాల్
అనుకొని
యింతటితో
తాను
ముగించుకుంటే
ఎంత
అవివేకి
అతను.
సమస్త
శక్తులు
కూడను
సూర్యుని
నుండియే
ఆవిర్భవిస్తున్నాయి.
ఇది
ఒక
ball
మాదిరి
చూచుకొని
అలక్ష్యపరుస్తున్నాడు.
కృతజ్ఞత
లేని
క్రూరులు
వారు.
సూర్యుడే
లేకపోతే
తానే
లేడు.
సూర్యుడే
లేకపోతే
తమ
యొక్క
పరిశీలనలు,
పరిశోధనలు
యేమాత్రం
చేయలేరు.
7
▾
Meaning
Keep
ఇట్టి
కృతజ్ఞత
లేనివాడే
మానవుడు
అని.
కనుక
ప్రతి
ఒక్కరు
కూడను
తాము
పొందిన
దానిని,
తాము
ఆనందించిన
దానిని,
అనుభవించిన
దానిని
ప్రత్యుపకారముగా
మనం
చేయాలి.
ఒక
పచ్చని
వృక్షమును
చూచినప్పుడో,
పచ్చని
పర్వతములు
చూసినప్పుడో
భక్తుడు,
ఆహా!
ప్రకృతి
యొక్క
సౌందర్యమెంత
గొప్పది!
ఈ
సౌందర్యమంతా
కూడా
భగవంతుని
యొక్క
సౌందర్యమని
God
is
nature
అంటాడు.
ఒక
సైంటిస్టు
వస్తాడు.
దీని
పచ్చదనమంతా
కూడను
క్లోరోఫిల్
వల్ల
వస్తుంది
అనుకుంటాడు.
ఈ
క్లోరోఫిల్కు
భగవంతుని
సౌందర్యమునకు
ఎంత
difference
వుంటున్నదో
చూడండి.
వీళ్లు
అల్ప
భావములందే
పోతున్నారు.
ఆధ్యాత్మిక
భావములు,
ఉన్నత
భావములను
వాడు
అందుకుంటున్నాడు.
గోడకట్టువాడు
దినదినమునకు
పైపైకే
పోతుంటాడు.
బావి
త్రవ్వువాడు
దినదినమునకు
క్రిందకే
పోతుంటాడు.
Saints
గోడకట్టేవారు.
దిన
దినాకి
దిన
దినానికి
వున్నత
భావములభివృద్ధి
పరచుకొని
ఉన్నతస్థాయికి
చేరుతున్నారు.
ప్రతిదానిని
ప్రకృతి
క్రిందకి
దిగజార్చుకుంటూ
కేవలం
బావి
త్రవ్వే
వాని
మాదిరి
పరిశీలన
పరిశోధన
-
పరిశీలన,
పరిశోధన
అని
క్రిందకే
దిగిపోతున్నారు.
సైన్సు
టెక్నాలజీలో
యేమి
దోషం
లేదు.
కాని
మానవుని
యొక్క
మనస్సులోనే
సర్వదోషములు
వుంటున్నాయి.
అనుభవించవలసిన
మార్గంలో
అనుభవించాలి.
చింతించవలసిన
మార్గంలో
చింతించాలి.
అన్నింటిని
అలక్ష్యపరచటం
అహంకారము
యొక్క
స్వరూపము.
సుందరయ్యర్
చెప్పినట్లుగా
అహంకారము,
ఆడంబరము
వుండినంతవరకు
ఆత్మాభిమానమనేది
యేనాటికి
వారికి
చేజిక్కదు.
ప్రేమస్వరూపులారా!
అహంకారమునకేమాత్రం
అవకాశం
లేదు
మనలో.
ఇంతటి
విశాల
ప్రపంచములో
ఎంతటివారము
మనము.
ఆ
భావము
చేత
అహంకారమునకవకాశము
యివ్వకుండా
చూసుకోవాలి.
అందరియందు
వున్న
ఆత్మతత్వం
ఒక్కటే
అనే
సమత్వాన్ని
పెంచుకోవాలి.
నీడలు
వేరు
వేరుగా
వుండినట్లుగా
దేహములు
వేరు
వేరుగా
వుండవచ్చును.
ఈ
నీడకు
ప్రక్కలో
ఎండ
వుంటున్నది.
ఎండనే
లేకపోతే
నీడనే
వుండదు.
నీడలో
కూడను
ఎండ
యొక్క
వెలుతురు
వుంటుంది
కనుక
ప్రతిదానికి
కూడా
side
by
side
యీ
ఆత్మతత్వమనేది
ఉపాధి
భేదము
దూరం
చేసినప్పుడు
రెండూ
ఒక్కటే
అయిపోతాయి.
దీనినే
వేదాంతము
తత్వమసి
అన్నది.
దీనికి
దేహము
వుంది
దానికి
దేహము
లేదు.
ఈ
దేహమనే
ఉపాధి
దూరము
చేస్తే
జీవుడు
దేవుడూ
ఒక్కడే.
దేహము
ఏమాత్రము
కూడా
లేదు.
దివ్యాత్మస్వరూపులారా!
ఉన్నతమైన
భావములను,
ఉత్తమమైన
మార్గములను
అభివృద్ధి
పరచుకొని
అందరూ
అన్యోన్యమైన
దైవసంతతిగా
మనం
జీవించినప్పుడే
లోకము
కూడా
ఎంతైనా
సుఖసంతోషములను
అనుభవిస్తుంది.
8
▾
Meaning
Keep
ప్రాచీన
కాలమునుండి
భారతదేశము
దేశదేశములకు
ఆధ్యాత్మిక
ప్రభావాన్ని,
ప్రబోధలను
అందించిన
దేశము.
కనుకనే
ఆనాటి
మొదలు
నేటి
వరకు
'లోకాస్సమస్తా
సుఖినో
భవంతు'
అందరూ
కూడా
సుఖంగా
వుండాలనేదే
మన
హైందవ
సాంప్రదాయము.
ఎవరియందు
కూడా
మనం
ఎట్టి
దోషభావాన్ని
పెట్టుకోరాదు.
ఇది
ఎవరికి
ప్రమాదం
కలుగుతుంది.
ఈ
దోషములున్నవారికే
ప్రమాదము
కలుగుతుంది.
ఆ
యొక్క
reaction,
resound
తిరిగి
వెనుకకే
కొడుతుంది.
ఇతరుల
మంచిని
మనం
కోరుతూ
వస్తే
తిరిగి
దైవం
మనం
మంచి
కోరుతూ
వస్తుంది.
దీనినే
తెలుగువారు
చెరపకురా
చెడేవు
అంటారు.
ఇతరుల
చెడుపును
మనమేమాత్రం
ఆశించరాదు.
కనుక
అందరి
మంచిని
మనం
ఆశించి
అందరి
క్షేమాన్ని
మనము
కోరి
దివ్యమైన
ఆత్మభావము
చేత
జగత్తును
మనం
అనుభవించటానికి
ప్రయత్నించాలి.
పారమార్థిక
దృష్టితో
ప్రకృతిని
మనం
అనుభవించాలి.
ఇదియే
సర్వవేదముల
యొక్క
సారము.
సర్వశాస్త్రముల
యొక్క
మూలము.
సర్వ
గమ్యముల
యొక్క
కీలకము.
ఇదియే
మానవస్థానము.
ఇట్టి
పవిత్రమైన
స్థానమును
మనమేమాత్రం
దుర్వినియోగం
చేయకూడదు.
మనస్సును,
వాక్కును,
కర్మలను
ఏకంగావించుకొనే
విషయములో
అనేక
విధాలుగా
మనము
ప్రయత్నం
సాగించాలి.
అప్పుడే
మనము
నిజమైన
మానవునిగా
రూపొందుతాము.
మనసులో
ఒకటి,
మాటలో
ఒకటి,
క్రియలో
మరొకటి
ఆచరించటానికి
పోతే
మనం
నిజంగా
దానవులుగా
మారిపోతాము.
బ్రహ్మవిత్
బ్రహ్మైవభవతి.
దేనిని
మనం
ఆశిస్తున్నామో,
దేనిని
మనము
చింతిస్తున్నామో
ఆ
చింత
యొక్క
స్వరూపాన్నే
మనము
పొందుతాము.
కనుక
Be
good.
Do
good.
See
good.
This
is
the
way
to
God.
మంచిగా
వుండాలి.
మంచిని
చూడాలి.
మంచిని
చెప్పాలి.
ఇదే
నిజమైన
భావము,
నిజమైన
భక్తి.
నిజమైన
బ్రహ్మతత్వము.
Previous
←
All Human Life Is the Very Form of Yajña
Next
You Yourself Are God!
→