Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1989 · See the Embodiment of Prema with Prema Alone
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
See the Embodiment of Prema with Prema Alone
1 November 1989, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His poems 126
Also in his talks
(6)
10 July 1986
When we keep the mind under control, life is blessed
31 July 1986
The mind is the cause of bondage and Mokṣa
16 January 1988
The Five D's
16 September 1990
Discipline is like our very life-breath
28 August 1996
That Which Gives Jñāna Alone Is Vidyā
21 August 2002
'I' Itself Is Divinity
అనాది
కాలమునుండి
యీ
విడదీయలేని
సమస్యను
అనేకమంది
మహర్షులు,
శాస్త్రజ్ఞులు
అనేక
విధములైన
పరిశోధనలు
సలుపుతూ
వచ్చారు.
కాని
వున్నదని
చెప్పుటకుగాని
లేదని
చెప్పుటకుగాని
యే
మాత్రము
అధికారము
లేకపోవటం
చేత
వారి
వారి
పరిశోధనలు
క్రమక్రమేణా
మొదలుపెడుతూ
వచ్చారు.
కాని
కొంతమంది
ఆత్మవిశ్వాసము
కలిగినవారు
గట్టి
దీక్షను
బూని
ఏ
విధంగానైనా
దీనిని
సాధించాలనే
పట్టుదలతో
యనేక
విధములుగా
కాలమును
కాయమును
కర్మలను
కూడా
అంకితము
గావించి
పరిశోధనలో
ప్రవేశించారు.
కొంతమంది
పరిశుద్ధ
హృదయులు,
పవిత్రాత్మజ్ఞులు
అన్నపానాదులు
విసర్జించి
యే
విధమైన
ఆశలు
లేక
కేవలం
ఒకే
దీక్ష.
దైవాన్వేషణ.
అనే
దానిలో
తమ
జీవితమును
అంకితము
గావించి
అర్పితం
గావించారు.
'శ్రద్ధావాన్
లభతే
జ్ఞానం'.
ఇట్టి
పవిత్రమైన
కఠినమైన
దీక్షను
బూనినటువంటివారి
శ్రద్ధ
ఒక
జ్ఞానంగా
మారింది.
ఉన్నట్లుండి
మహర్షులు
ఒక
విధమైన
దీక్షను
విసర్జించి
ప్రపంచములో
ప్రవేశించి
ఉపదేశం
గావించటానికి
పూనుకున్నారు.
'ఓ
ప్రజలారా!
మేము
భగవంతుని
చూచాము.
మేము
ఆ
ఆనందాన్ని
అనుభవించాము.
మీరు
కూడా
చూడండి.
మీరు
కూడా
యీ
ఆనందాన్ని
అనుభవించండి.
ఈ
ఆనందాన్ని
తిరిగి
పెంచండి.
పెంచుకున్న
ఆనందాన్ని
తిరిగి
పదిమందికి
పంచండి.
ఇదియే
మానవుని
యొక్క
కర్తవ్యము.
ఇదియే
మన
జీవితము
యొక్క
పరమావధి.
అది
'వేదాహమేతం
పురుషం
మహాన్తం
ఆదిత్యవర్ణం
తమసః
పరస్తాత్
అన్నారు.
భగవంతుని
ఎక్కడ
చూశావు?
ఎక్కడో
ఏ
ప్రదేశంలోనో
కాదు.
బయట
ప్రదేశంలో
కాదు.
మన
దేహమునందే
చూశాము.
ఈ
తమస్సుకు
ఆవల
దేదీప్యమానమైన
తేజస్సుతో
ప్రకాశిస్తున్నాడు.
ఈ
తమస్సును
మనం
నిర్మూలం
గావించినప్పుడు
తేజోవంతముగా
ప్రకాశిస్తుంది.
మీరు
మనసునాధారముగా
చేసుకొని,
మనసును
అనుసరిస్తారు.
కనుక
మీకు
భగవంతుడు
కనుపించటంలేదు.
మనసు
నాధారముగ
గొను
మానవుండు
పశువు
కంటెను
హీనమై
పతనమగును
బుద్ధినాధారముగ
గొను
మానవుండు
పశుపతిగ
మారును...
అన్నారు.
కనుక
బుద్ధిని
విచారణ
శక్తిని
ఆధారం
చేసుకొని,
జ్ఞానతత్వస్వరూపుడైన
భగవంతుని
సందర్శించటానికి
ప్రయత్నంచేయాలి.
అప్పుడు
ఋషులు
చెప్పారు.
మానవ
దేహము
సామాన్యమైనది
కాదు.
భగవంతుని
నివాసస్థానము
అతని
విలాస
కేంద్రము.
అతని
ఆటస్థలము.
ఇట్టి
మానవుని
హృదయమునందు
భగవంతుడు
నిత్య
ప్రకాశుడై,
దేదీప్యమానుడై
ప్రకాశిస్తాడు.
2
▾
Meaning
Keep
ఐతే
ఎప్పుడు
ఏ
రీతిగా
మనము
యీ
తమస్సును
ఛేదించాలి.
ఈ
తమస్సు
పోవాలనుకుంటే
సత్యమైన
తత్వాన్ని
మనం
ప్రకాశింప
జేసుకోవాలి.
చీకటి
పోవాలంటే
దీపం
అంటించాలి.
అదే
రీతిగా
మనయందున్న
అజ్ఞానం
పోవాలంటే
జ్ఞానాన్ని
ప్రకాశింప
చెయ్యాలి.
ఏమిటి
యీ
జ్ఞానము?
ఏ
గ్రంథమునుండి
మనం
దీనిని
అందుకుందుకు
వీలవుతుంది.
జ్ఞానమనేది
కేవలం
గ్రంథ
పరిచయంలో
లభించేది
కాదు.
గురువుయొక్క
బోధల
చేత
లభించేది
కాదు.
ఏ
స్కూలులోనో
మనం
నేర్చుకునేది
కాదు.
ఈ
జ్ఞానం
మనం
కొనేది
కాదు.
ఏ
షాపులోను
దొరకదు.
ఏ
కంపెనీ
సప్లై
చేయదు.
ఏ
friends
యిచ్చేది
కాదు.
అద్వైత
దర్శనం
జ్ఞానం.
సర్వులయందు
వున్న
దివ్యశక్తి
ఒక్కటేయనే
సత్యాన్ని
మనం
గుర్తించినప్పుడు
అదే
నిజమైన
జ్ఞానము.
'ఏకోహం
బహుశ్యాం'
ఒక్క
దివ్యతత్వమే
సర్వత్రా
వ్యాపించి
వున్నది.
మనకు
వజ్రాలు
చిక్కాలంటే,
మాణిక్యాలు
లభించాలంటే
మానులో
దొరకవు.
మాణిక్యాలు
మట్టిలోనే
చిక్కుతాయిగాని
మ్రానులో
చిక్కవు.
కనుక
దైవమనేది
ఎక్కడో
బయట
దేశంలో
వెతుకుతే
మనకు
చిక్కదు.
నీలోనే
వుంటున్నాడు.
దేహో
దేవాలయ
ప్రోక్తో
జీవో
దేవః
స్సనాతనః'
దేహమనేది
ఒక
దేవాలయము.
అందులోనే
ఆత్మ
అనే
దేవుడున్నాడు.
ఈ
దేహమనే
దేవాలయము
ఒక
దగ్గర
ప్రతిష్ఠింపబడినది
కాదు.
moving
temple.
ఎక్కడ
దేహము
పోతుందో
అక్కడంతా
దేవుడున్నాడు.
కనుక
యీ
దేహమనే
దేవాలయా
లోపలనే
దేవుని
చూడటానికి
ప్రయత్నించాలి.
బహిర
దృష్టి
పశువుయొక్క
దృష్టి.
అంతర్దృష్టియే
దివ్యమైనటువంటి
దృష్టి.
కనుక
నీలోపల
నీవు
చూడటానికి
ప్రయత్నించు.
నీవు
ఏ
విధంగా
ప్రయత్నించాలి.
ఒక
పాత్రలో
oil
వుంది.
ఆ
oil
లో
చంద్రునియొక్క
ప్రతిబింబము
కనుపిస్తోంది.
తైలములో
కనుపించే
చంద్ర
ప్రతిబింబాన్ని
మనం
నిర్మూలం
గావించాలంటే
పాత్రను
అగ్నిలో
పెట్టి
కాలిస్తే
ఆ
చంద్రబింబము
కనుపించకుండా
పోదు.
విచారణ
చేయాలి.
ఈ
చంద్రునియొక్క
ప్రతిబింబానికి
మూలకారణం
ఏమిటి?
పాత్రనా
లేక
తైలమా?
ఈ
తైలము
వుండటం
చేతనే
ప్రతిబింబము
కనుపిస్తోంది
కాని
పాత్ర
వలన
కాదు.
తైలమునకు
పాత్ర
ఆధారం.
ప్రతిబింబమునకు
తైలము
ఆధారం.
కనుక
తైలము
మనం
తీసివేస్తే
ప్రతిబింబము
నిర్మూలమై
పోతుంది.
అట్లుకాకుండా
పాత్రను
అగ్నిలో
పెట్టి
కాలుస్తూ
పోతే
ఆ
ప్రతిబింబం
దగ్ధం
కాదు.
నేను
మానవుడనే
భ్రమనే
ప్రతిబింబము.
జన్మాంతర
సంస్కారం
వున్న
యీ
అడ్డే
మన
ఆయువు.
దీనినే
వాసన
అన్నారు.
ఈ
వాసన
అనే
మనసునందు
యీ
మానవత్వమనే
ప్రతిబింబము,
యీ
మానవత్వముతోనే
మనము
ప్రకాశింప
చేసుకుంటున్నాము.
మానవత్వము
పోయి
దివ్యత్వమైన
దైవత్వం
రావాలనుకుంటే
యీ
వాసనలు
మనం
నిర్మూలం
చేయాలి.
మనకు
వచ్చే
సర్వసంకల్పములు
కూడా
వాసనలతో
కూడినవే.
వేదాంతము
యీ
వాసనల
నిర్మూలన
నిమిత్తమై
అనేకరకాల
బోధనలు
చేస్తూ
వచ్చింది.
3
▾
Meaning
Keep
ఈ
బ్రహ్మతత్వాన్ని
సాక్షాత్కరింప
చేసుకోవాలంటే
అనేక
విధములైన
మార్గములను
బోధించాయి.
కాని
నా
భావమేమంటే
ఒక
చిన్న
ముక్కలోపలనే
బ్రహ్మతత్వాన్ని
మనం
ముగించాలి.
సూక్ష్మంలోనే
మోక్షం
వుందంటారు.
భ్రమపోతే
బ్రహ్మ
కనుపిస్తాడు.
భ్రమ
వుండినంతవరకు
బ్రహ్మ
మనకు
కనుపించడు.
భ్రమ
ఏమిటి?
imagination.
ఈ
imagination
ఎక్కడ
నుండి
వస్తోంది?
నిత్య
జీవితములో
మనమనుభవించే
ప్రాకృత
కర్మల
ద్వారా
వస్తున్నాయి.
ఈ
ప్రాకృతమైన
కర్మలు
ఎంతవరకు
మనని
బాధిస్తున్నాయి.
నిద్రవచ్చేంతవరకు
యీ
ప్రాకృత
కర్మలు
మనలను
బాధిస్తున్నాయి.
నిద్రించిన
తక్షణమే
సంకల్పాలు
పోతాయి.
మనస్సు
పోతుంది.
దానితో
పాటు
ప్రపంచమూ
పోతుంది.
ఈ
ప్రపంచముతోబాటు
మన
దుఃఖము
కూడా
పోతుంది.
తిరిగి
లేచేటప్పటికి
సంకల్పాలు
వస్తాయి.
సంకల్పాలతో
బాటు
ప్రపంచము
వస్తుంది.
ఈ
ప్రపంచముతోపాటు
దుఃఖము
వస్తుంది.
మనము
నిద్రయందు
సర్వమును
నిర్మూలము
గావించుకుంటున్నాము.
తిరిగి
జాగ్రత్త
వచ్చేటప్పటికి
అన్నీ
మనము
మేలుకొలుపుతున్నాము.
నిద్రనే
ఒక
మరణము.
జాగ్రత్తనే
ఒక
జననము.
అందువల్లనే
పునరపి
జననం
పునరపి
మరణం.
మరణం
ఒక్కతూరే
వుండాలి.
జననం
ఒక్క
తూరే
వుండాలి.
నిత్యమూ
చచ్చేవానికి
ఏడ్చేవాళ్లు
కూడా
వుండరు.
ఎప్పుడో
ఒకతూరి
చస్తే
అందరూ
ఏడుస్తారు.
కాని
మనమిప్పుడెలా
చస్తున్నామంటే
దినమునకు
21,600
పర్యాయములు
చస్తున్నాము.
ఎవరేడ్చేవాళ్లు
వున్నారు?
ఎవరాశించే
వాళ్లు
వున్నారు?
ఒక
శ్వాసను
తీసుకోటం
బ్రతకటము.
శ్వాసను
వదలటం
చావటం.
ఇది
మానవత్వములో
గుర్తించవలసిన
ప్రధాన
సూత్రము.
కనుక
అన్నీ
కూడా
మనకు
కనుపించేవే
గాని
తిరిగి
కన్పించకుండా
చేస్తోంది.
కనుక
యివన్నీ
పాంచభౌతికమైన
పంచకోశములతో
కూడిన
యీ
దేహమునందే
వుంటున్నవి.
ఈ
పంచకోశములను
పరిశీలన
చేసి
ప్రక్కకు
నెట్టినప్పుడే
యీ
పరబ్రహ్మ
తత్వము
మనకు
లభ్యమవుతుంది.
దివ్యత్వమును
మనం
గుర్తించాలనుకున్నప్పుడు
కొంతవరకు
అంతర్దృష్టి
మనం
అలవరచుకోవాలి.
ప్రాకృతమైన
దానిని
మనం
ఆధారం
చేసుకోరాదు.
ఈ
దేహము
అనిత్యము.
నీకు
ఆనందమునిచ్చే
పదార్థములు
కూడా
అనిత్యమే.
అనిత్యమైన
పదార్థములు
అనిత్యమైన
దేహమునకు
నిత్యమైన
ఆనందమును
ఎలా
యివ్వగలవు?
నిత్యసత్యమైన
దైవత్వము
మాత్రమే
సత్యమైన
ఆనందమునందిస్తుంది.
కనుకనే
యీ
నిత్యసత్యమైన
దానిని
ఆధారము
చేసుకోవాలి.
అట్లు
చేసుకోటానికి
పూర్తి
విశ్వాసము
మనలో
బలపరచుకోవాలి.
ఆ
faith
అనేదానికి
ఏ
reason
కూడా
మనం
వెతకటానికి
వీలులేదు.
కనుక
faith
beyond
reason.
దీనికి
reason
వెతికేవాడు
కేవలం
ఒక
blind
person
లాంటివాడే.
నీ
తల్లిని
నీవు
ప్రేమిస్తున్నావు.
దానికేమి
reason?
She
is
my
mother.
నేను
దేవుని
ప్రేమిస్తున్నాను.
దీనికేమిటి
reason?
He
is
my
God.
ఇంతే
దీనికి
answer.
ఎందుకు
దేవుని
ప్రేమిస్తున్నావంటే
చాలామంది
కంగారుపడిపోతుంటారు.
ఈ
విధమైన
confusion
వుండేవాడు
doubting
Thomas.
4
▾
Meaning
Keep
నిన్నెవరైనా
దేవుని
గురించి
ప్రశ్నించినప్పుడు
నీవు
యే
విధమైన
confusionకు
తావివ్వకూడదు.
He
is
my
God.
ఎక్కడ
వున్నాడు
వాడు
లేడని
చెబుతే
నీ
భావంలో
God
లేడు,
నా
భావంలో
God
వున్నాడు.
నా
భావంలో
వున్న
Godను
లేడనటానికి
who
are
you
నీవెవరు?
నీ
God
నీకు
లేకుండా
పోవచ్చుకాని
నా
God
నాకున్నాడు.
నా
God
లేడనటానికి
నీవెవరు?
ఈ
విధమైన
faith
మనం
develop
చేసుకోవాలి.
అప్పుడే
మనకు
తగిన
answer
దొరుకుతుంది.
ఈ
answer
మనకు
చిక్కనక్కరలేదు.
దీనిలో
ఒక
ఉదాహరణ
మీరు
తీసుకోవచ్చును.
ఇక్కడ
అనిల్
కుమార్
వున్నాడు.
అంటే
అనిల్
కుమార్ను
చూచిన
వారుండాలి.
కాబట్టి
యిక్కడ
అనిల్
కుమార్
వున్నాడు
అనే
వాడు
కూడా
అనిల్
కుమార్ని
చూసి
వుండాలి.
ఇక్కడ
అనిల్
కుమార్
లేడు
అనేవాడు
కూడా
అనిల్
కుమార్ని
చూసి
వుండాలి.
అనిల్
కుమార్ని
చూడకపోతే
యిక్కడ
అనిల్
కుమార్
లేడని
ఎలా
చెప్పగలడు.
అలాగే
దేవుడున్నాడనేవాడు,
దేవుడు
లేడనేవాడు
దేవుని
చూసి
వుంటేనే
దేవుడు
లేడని
చెప్పగలడు.
దేవుని
చూడకుండా
లేడని
ఎలా
చెప్పగలడు?
వాడూ
చూశాడు
వీడూ
చూశాడు.
నాస్తికునియందు,
ఆస్తికునియందు
యీ
విశ్వాసము
వుంది.
కనుక
యీ
విశ్వాసమనేది
అందరియందు
వుంది.
ప్రాకృతమైన
వాతావరణము
కొంతవరకు
వారిని
తప్పు
మార్గాన్ని
పట్టిస్తుంది.
నాస్తికుడంటే
ఎవరు?
ఆస్తికుడంటే
ఎవరు?
నాస్తికుడనేవాడు
పూలమొగ్గ.
ఆస్తికుడనేవాడు
విచ్చిన
పూవు.
మొగ్గలోపల
వాసన
రాదు.
విచ్చిన
పూవులోపల
వాసన
వస్తుంది.
ఆ
వాసనే
భక్తి.
ఈ
మొగ్గ
లోపల
కూడ
వుంది
గాని
వాని
అనుభూతికి
రాలేదు.
కాని
మొగ్గ
లేకుండా
పువ్వు
రాలేదు.
క్రమక్రమేణా
రెండూ
ఒకటే
అయిపోయింది.
మానవత్వము
కేవలము
తన
తత్వాన్ని
అర్థం
చేసుకోలేని
వాడే
దైవత్వాన్ని
కూడా
అర్థం
చేసుకోలేడు.
తనను
తాను
అర్థం
చేసుకున్నవాడు
దైవత్వాన్ని
సులభంగా
అర్థం
చేసుకోగలడు.
తానెవరు
అనే
దానిని
కేవలం
మానవునిగా
భ్రమించటం
చేతనే
దైవాన్ని
కూడను
మానవునిగా
భ్రమిస్తున్నాడు.
నా
వుద్దేశంలో
నీవు
కూడా
దైవమే.
ఉపాధిని
దూరం
చేస్తే
రెండూ
ఒక్కటే.
నీ
ఉపాధిలో
భ్రమిస్తున్నావు.
ఇది
స్వామి
ఉపాధి
రహితంగా
వుంది.
వుండినప్పటికి
ఉపాధిని
లక్ష్యంగా
చేసుకోను.
ఒక
చిన్న
ఉదాహరణ.
నీవు
ఏ
విధంగా
విశ్వసించాలంటే
నీవు
దారిలో
వెడుతూ
వుంటావు.
సర్వము
భగవంతుని
స్వరూపమనే
విశ్వాసాన్ని
మనము
బలపరచుకోవాలి.
నీవు
పోతుంటే
నిన్ను
భక్తుడు
భక్తుడు
అని
చాలామంది
గేలి
చేయవచ్చును.
లేకుంటే
విమర్శించవచ్చును.
అప్పుడు
నీవు
బాధకు
గురికాకూడదు.
లేక
మనసుకు
కష్టం
కలగవచ్చు.
ఇది
భక్తునికి
సరియైన
లక్షణం
కాదు.
అప్పుడు
ఏమనుకోవాలి
ఇదీ
దైవము
యొక్క
శరీరమే.
అదీ
దైవము
యొక్క
శరీరమే.
ఈ
శరీరాన్ని
ఆ
దైవమే
ఆ
శరీరంలోంచి
విమర్శిస్తున్నాడు.
ఇది
వినటానికి
తృప్తి.
అది
అనటానికి
తృప్తి.
భగవంతుడా!
యీ
జగత్తంతా
ఒక
నాటకరంగము.
అందరు
actorsగా
వచ్చారు.
కాని
యీచేసేటువంటి
actors
అందరికి
నీవే
director.
5
▾
Meaning
Keep
నన్ను
యీ
విధంగా
ఆడిస్తున్నావు.
వానిని
ఆ
విధముగా
ఆడిస్తున్నావు.
వాడు
పూజించే
వ్యక్తిగా
చేశావు.
నన్ను
దూషింపబడే
వ్యక్తిగా
చేశావు.
ఉపాధి
భేదములు
దూరం
చేసి
రెండింటిలో
ఏకత్వాన్ని
మనం
అభివృద్ధి
పరచుకోవాలి.
ఉపాధులు
భేదంగా
కనుపించవచ్చు.
ఒక
చిన్న
ఉదాహరణము.
ఒక
విత్తనము
భూమిలో
నాటాము.
అది
ఒక
వారం
అయిన
తరువాత
రెండు
ఆకులుగా
పెరుగుతూ
వచ్చింది.
ఒక
సంవత్సరమయ్యేటప్పటికి
పెద్దదిగా
అయిపోయింది.
ఇంకా
రెండు
సంవత్సరములయ్యేటప్పటికి
కొమ్మలు
రెమ్మలు
వేసింది.
ఇంకా
ఐదు
సంవత్సరములయ్యేటప్పటికి
పూలుపూస్తూ
వచ్చాయి.
ఈ
పూవు
ఒక
నెల
లోపల
కాయగా
మారింది.
ఈ
కాయ
తిరిగి
నెల
లోపల
ఫలంగా
మారింది.
ఇప్పుడు
యోచన
చేస్తే
యీ
వుపాధులు
భేదమే
కాని
యిక్కడ
ఆకులు,
కొమ్మలు,
రెమ్మలు,
పూవులు,
కాయలు
యీ
విధంగా
కనుపిస్తున్నాయి.
కాని
విత్తనం
ఒక్కటే.
ఈ
ఉపాధి
భేదమే
తీసుకుంటే
యీ
పండ్లు
ఎక్కడనుండి
వచ్చాయి.
విత్తనం
నుండి
వచ్చాయి.
ఈ
ఆకు
లెక్కడ
నుండి
వచ్చాయి?
విత్తనం
నుండి
వచ్చాయి.
ఈ
రెమ్మలు,
కొమ్మలు
ఎక్కడనుండి
వచ్చాయి?
విత్తనం
నుండి
వచ్చాయి.
ఈ
ఫలం
ఎక్కడినుండి
వచ్చింది?
విత్తనం
నుండి
వచ్చింది.
కనుక
అన్నింటికి
విత్తనమే
ఆధారం.
అదే
బీజం
మాం
సర్వభూతానాం.
ఇదియే
భగవద్గీత
యొక్క
అర్థం.
తిరిగి
యీ
ఫలం
లోపల
నాటిన
విత్తనమే
వుంది.
కనుక
భగవంతుడే
యీ
విశ్వమునకు
ఒక
విత్తనము.
ఈ
దేహమనే
కొమ్మలు,
రెమ్మలు.
ఈ
కొమ్మలు,
రెమ్మలలో
వున్న
జీవరాసులే
ఫలములు.
ఈ
ఫలములలో
వున్న
విత్తనమే
మొదటి
ఆత్మ
విత్తనం.
ఏ
విత్తనం
నాటావో
ఆ
విత్తనం
తిరిగి
యీ
fruit
లో
వుంది.
కనుక
ఆ
విత్తనమునకు,
యీ
ఫలమునకు
సన్నిహిత
బాంధవ్యము
వుంటున్నది.
ఉపాధి
భేదము
చేత
నీవు
విభజనలుగా
భావిస్తూ
వున్నావు.
ఉపాధిని
వేరు
చేసినప్పుడు
రెండూ
ఒక్కటే.
ఇప్పుడొక
చిన్న
ఉదాహరణ.
వేదాంతములో
పంచశిఖలో
బ్రహ్మసూత్రమునందు
ఒక
చిన్న
question
వుంది.
10
సంవత్సరముల
వయస్సప్పుడు
ఫలానా
వ్యక్తిని
నేను
కలకత్తా
దగ్గర
గంగానది
ఒడ్డున
చూశాను
అంటాడు.
అదే
వ్యక్తిని
15
సంవత్సరముల
తరువాత
కావేరీనది
ఒడ్డున
చూశాను.
గంగ
కావేరి
కాదు.
ఆనాడు
కాదు
యీనాడు
కాదు.
ఆ
వ్యక్తి
స్వరూపం
యీ
వ్యక్తి
స్వరూపం
కాదు.
కాని
వాడే
వీడు.
వీడే
వాడు.
చూశావా!
ఉపాధులేవంటే
గంగ,
కావేరి.
ఇవి
వేరువేరుగా
కన్పించాయి.
ఆ
కాలము,
యీ
కాలము
భిన్నంగా
వుంటాయి.
ఈ
దేహం
ఆ
దేహం
కాదు.
15
సంవత్సరములైన
తరువాత
body
పెరిగిపోయింది.
కాబట్టి
ఆ
కాలమును,
ఆ
స్థానమును,
ఆ
కాయమును
విసర్జిస్తే
వ్యక్తి
ఒక్కడే.
కనుక
ఉపాధి
భేదము
చేతనే
నీవు
యిన్ని
విధాలుగా
వికారపడుతున్నావు.
పుట్టిన
తక్షణమే
child
అన్నావు.
10
సంవత్సరములకు
Boy
అన్నావు.
30
సంవత్సరములకు
Man
అన్నావు.
6
▾
Meaning
Keep
75
సంవత్సరములకు
grand
father
అన్నావు.
కాని
child,
boy,
man,
grandfather
అన్నీ
ఒకే
వ్యక్తి.
కాలము
మారుతుంది.
కాయము
మారుతుంది.
పరిస్థితులు
మార్పు.
వ్యక్తిత్వం
ఒక్కటే.
అదే
ఏకోహం
బహుశ్యాం.
మానవత్వము
ఒక్కటిగానే
వుంటుంది.
ఏకం
సత్
విప్రా
బహుధా
వదంతి.
ఒక్కొక్కరు
ఒక్కొక్క
రకంగా
చెప్తూ
పోతుంటారు.
దేశ
కాల
పరిస్థితుల
ప్రభావాన్ని
పురస్కరించుకొని
ఆ
భాషను
కూడా
వుపయోగపెడుతూ
వచ్చారు.
ఈ
టంబ్లరు
లోపల
నీరుంది.
తెలుగు
వారంతా
నీరు
అన్నారు.
ఇంగ్లీషు
వారంతా
water
అంటారు.
తమిళవారంతా
తన్ని
అంటారు.
సంస్కృతము
వారు
వారి
అంటారు.
హిందీవాడు
పానీ
అంటారు.
ఇవన్నీ
వేరు
వేరు
పేర్లేగాని
పదార్థము
ఒక్కటే.
కనుకనే
యీ
మానసిక
సంబంధమైన
మాటలతో
మనం
అనేకరకాలుగా
confusion
అయిపోతున్నాము.
మానవుని
యొక్క
భావములు
సంస్కారములను
పురస్కరించుకొని
వివిధములుగా
వుంటాయి.
మానవుని
యొక్క
ideas
పైన
మనం
ఆధారపడకూడదు.
వస్తువుయొక్క
యదార్థం
పైన
మనం
ఆధారపడాలి.
ఆ
విశ్వాసం
మనం
బలపరచుకోవాలి.
దైవము
లేక
యేదీ
లేదు.
ఒక
చిన్న
ఉదాహరణ.
మానవత్వములో
ఒక్క
భారతదేశములోనే
80
కోట్ల
ప్రజలున్నారు.
ప్రపంచమంతా
చేరితే
580
కోట్లు
వుంటున్నారు.
ఇంత
మందిలో
ఒకరిని
ఒకరితో
compare
చేయటానికి
వీలవుతుందా?
ఇన్ని
కోట్ల
మందిలో
ఒకరున్నట్లు
వేరొకరు
వున్నాడా?
ఇంత
చిత్ర
విచిత్రంగా
సృష్టించాడు.
ఇంకొకటి.
అనేక
గ్రహముల
గురించి
మనం
వింటున్నాము
ప్రాచీన
కాలము
నుండి.
ఈ
planets
ఎక్కడ
ఎప్పుడు
పుట్టాయి.
ఎవరు
వీటిని
సృష్టించారు?
అనాది
కాలం
నుండి
ఏ
విధమైన
మార్పులు
లేకుండా
నేటి
వరకు
కూడా
అవి
తమ
క్రమాన్ని
అనుసరించిపోతున్నాయి.
ఈనాడు
సైంటిస్టులు
యివన్నీ
మేము
కూడా
చేయగలము
అని
అంటున్నారు.
చేయగలరు.
చేస్తున్నారు.
ఆ
చేసిన
planets
ఎంతవరకు
తిరుగుతున్నాయి.
కొన్ని
వాడున్నంత
వరకు
కూడా
తిరగటం
లేదే.
His
life
time
అలాపోనీ.
ఇంకో
planet
సృష్టించేంత
వరకు
కూడా
అది
వుండటం
లేదే.
మానవుడు
తాను
శక్తిమంతుడనని
తాను
చాటుకుంటున్నాడు.
ఈ
planets
యిలాపోతుంటే
యీ
అనాది
కాలం
నుండి
తిరుగుతున్న
planetsను
చేసిన
వాడింక
ఎంత
గొప్ప
వాడై
వుండాలి.
అంత
మాత్రమైనా
యోచించవచ్చును
కదా!
మరి
నేను
చేస్తే
నేను
గొప్పవాడిగా
వుంటున్నాను.
దీనిని
చేసినవాడు
యింకెంత
గొప్పవాడుగా
వుండాలి
అనే
సూక్ష్మ
భావాన్ని
కూడా
విచారం
చేయటం
లేదు.
కనుక
ప్రతి
ఒక్కటి
మనం
విచారణ
చేస్తూ
పోవాలి.
మనదేహం
లోపల
Blood
cells
వున్నాయి.
నీ
వాచీని
వుపయోగపెట్టుకుంటున్నావు.
ఈ
వాచీ
కరక్టుగా
నడిచే
విధానం
తెలిసినవాడే
చేసాడు.
ఏ
జపాన్
వాడు
చేసినా,
ఏ
స్విస్
వాడు
చేసినా
యీ
గడియారము
సంగతి
పూర్తిగా
తెలిసినవాడే
చేసాడు.
నీవు
వాళ్లను
చూడలేదు.
కాని
చేసినవాడు
ఒకడు
వున్నాడని
నీకు
తెలుసును.
7
▾
Meaning
Keep
నిజంగా
వాడు
చేయకపోతే
అది
automaticగా
రావటం
లేదే.
కనుక
నిర్మించినవారు
ఒకరున్నారు.
వాడెక్కడ
వున్నాడో
యేమోగాని
వున్నాడు
ఒకడు.
అదే
రీతిగా
తెల్లవారి
లేస్తూనే
సూర్యోదయము,
తిరిగి
రాత్రి
సూర్యాస్తమయము
యీ
విధంగా
రాత్రింబవళ్లు
యీ
గడియారం
ముల్లు
తిరుగుతూనే
వుంది.
ఈ
గడియారాన్ని
ఎవరు
చేశారు?
ఈ
సూర్యుడు
యీ
విధంగా
తిరగటాన్ని
ఆధారం
చేసుకుని
కదా
యీ
గడియారం
నీకు
టైమ్
చెప్తోంది.
ఇదే
కనుక
తిరగకుండా
పోతే
నీ
గడియారం
పనికిరాదు.
కాబట్టి
దీనిని
చేసిన
వాడెవడున్నాడు.
ఇంత
మాత్రమైనా
మానవుని
యొక్క
తెలివితేటలు
వుపయోగపెట్టుకోకూడదా!
చాలా
విపరీతమైన
సమస్యలు
నిత్యము
మనకు
కనుపిస్తూనే
వున్నాయి.
కాని
ఎన్ని
చూచినప్పటికి
చూచినప్పుడు
మాత్రమే
విచిత్రము.
తర్వాత
మరి
చిత్రము.
మానవుని
చంచలత్వానికి
యిది
ఒక
విధమైన
గుర్తు.
ఈ
చంచలత్వము
ఎందుకోసం
వస్తున్నాదంటే
పూర్వం
దీనియందు
animal
qualities
అంతా
వున్నాయి.
ఆ
శేషం
యింకా
వీనిలో
మిగిలి
వుంది.
ఎవరికి
చంచలత్వమెక్కువగా
వుంటుందో
వాడు
పూర్వము
కోతి
జన్మ
ఎత్తి
వుంటాడు.
ఆ
కోతి
చంచలత్వం
దానిలో
శేషించి
వుంది.
ఒక్కొక్క
తూరి
మూర్ఖత్వం
కూడా
వుంటుంది.
ఈ
మూర్ఖత్వాన్ని
పురస్కరించుకొని
పూర్వజన్మలో
వీడొక
sheepగా
వుండి
వున్నాడన్నమాట.
దాని
అవశేషం
వీనిలో
యింకా
మిగిలి
వుంది.
ఇంకొకడు
foolishగా
వుంటాడు.
పూర్వజన్మలో
He
buffallowగా
వుంటాడు.
దాని
foolishness
వీనిలో
ప్రవేశిస్తోంది.
కనుక
యీనాటి
మానవునిలో
వున్న
సర్వగుణములు
కూడా
పూర్వజన్మలో
శేషించినటువంటివే.
కనుక
ఆకారం
మానవుడే
గాని,
యీ
వికారబుద్ధులంతా
animal
వికారాలు.
ఈ
animal
వికారాలు
పోవాలనుకున్నప్పుడు
మానవత్వాన్ని
పెంచుకోవాలి.
దైవత్వంలో
నీవు
ప్రవేశిస్తే
యీ
రెండూ
కూడను
పోతాయి.
కనుక
మనం
మనయందే
వున్న
యీ
దివ్యత్వాన్ని
జాగ్రదవస్థకు
తెచ్చుకోవాలి.
నీవు
కేవలం
అజ్ఞానములో
మునుగుతున్నావు.
అంధకారంలో
నిద్రిస్తున్నావు.
లెమ్ము.
లెమ్ము.
ఆత్మను
కనుగొమ్ము.
ఎక్కడో
దూరంగా
లేడు
దేవుడు
నీకు.
నీవే
అయివున్నావు.
నీయందే
వున్నాడు.
ఇంత
సమీపంలో
వున్న
వానిని
నీవు
తెలుసుకోలేకుండా
ఎక్కడో
దూరదూరంగా
నీవు
ప్రయాణం
చేస్తున్నావు.
తల్లికంటె
మిగుల
దైవంబె
దగ్గర.
తల్లి
తల్లి
అంటావు.
తల్లి
కంటె
చాలా
దగ్గర.
అలాంటి
సమీపంలో
వున్నవారిని
ఎవరూ
తెల్సుకోటం
లేదు.
ఈ
తమస్సు
మనసును
ఆవరించింది.
ఈ
తమస్సనే
చీకటి
వల్ల
సమీపములో
వున్న
పదార్థమును
కూడా
మనం
వెతుకుతూ
పోతున్నాము.
లైటు
పోయిందంటే
టంబ్లర్
ప్రక్కనే
వున్నా
మనము
యిలా
వెతుకుతాము.
కాని
దగ్గరనే
వుంది.
చాలామంది
sportsలో
యిలాంటివి
వుంటాయి.
ఒక
పదడుగుల
దూరంలో
కుండలు
పెడతారు.
ఈ
playersకు
కన్నులకు
కట్టేస్తారు.
అటూ
యిటూ
త్రిప్పి
చుట్టూ
కట్టేస్తారు.
వారి
చేతికొక
కఱ్ఱ
యిస్తారు.
ఆ
కుండను
పోయి
కొట్టాలి.
అప్పుడు
ఏం
చేస్తాడు?
వాడు
ముందు
చూశాడు.
కాని
కన్నులు
కట్టేయటం
వలన
ఆ
కుండ
యిక్కడుంటే
వాడు
అక్కడకు
ప్రయాణమై
పోతాడు.
8
▾
Meaning
Keep
మన
eye
close
అయిపోయింది.
Physical
eye
close
అయిపోతేనే
యేమీ
కనుపించదే,
wisdom
eye
close
అయిపోతే
వాడు
పూర్తి
అంధకారంలో
మునిగిపోతాడు.
కనుక
ప్రేమనేత్రాలు
మీరు
తెరుచుకోవాలి.
ఈ
ప్రేమనేత్రం
చేత
ఎక్కడున్నా
మనకు
కనిపిస్తుంది.
కనుక
ప్రేమను
ప్రేమచేతనే
చూడాలి.
చంద్రుడు
ప్రకాశిస్తున్నాడు.
ఆ
ప్రకాశించే
చంద్రుని
చూడాలంటే
ఒక
టార్చిలైటో,
హరికెన్
లైటో,
పెట్రొమాక్సు
లైటో
తీసుకోనక్కరలేదు.
moon
light
ఆధారంతోనే
moon
light
చూడాలి.
అదే
రీతిగా
భగవంతుడు
ప్రేమస్వరూపుడు
ఆ
ప్రేమ
స్వరూపుని
ప్రేమతోనే
చూడాలి.
అన్యనేత్రంతో
చూడటానికి
వీలవదు.
కనుక
ప్రేమను
పెంచుకోండి.
అంధకారాన్ని
దూరం
చేయండి.
దివ్యత్వాన్ని
ఆనందంగా
అనుభవించండి.
పవిత్రమైన
జీవితము
గడపండి.
Previous
←
Do Your Duty as an Offering to God
Next
All That Is Seen Is the Form of God
→