Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1989 · Do Your Duty as an Offering to God
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Do Your Duty as an Offering to God
31 October 1989
1
▾
Meaning
Keep
His poems 324
Also in his talks
(12)
14 January 1988
Strive to recognise the oneness within the many!
24 May 1990
Hold the Reins
27 May 1991
Prasnopanishad - Answers To The Second And Third Students
5 October 1997
“Śarīramādyaṁ khalu dharmasādhanaṁ”
1 January 2000
Virtue is the adornment of man
12 April 2000
The Subtleties of Dharma in the Rāmāyaṇa
2 April 2003
Leave the delusion of the body; think of God
6 May 2003
Easwaramma, the ideal mother
6 May 2004
Satisfying his mother is a son's first duty
6 May 2005
Only a son worthy of his mother's love can win God's grace
6 May 2006
If you love your parents, the whole world will love you
18 August 2006
Cast off the delusion of the body and foster attachment to God
ఈ
ప్రపంచములో
కొన్ని
ఆదర్శములతో
నివసించే
మానవుడు
వానిని
ఆధ్యాత్మికతతో
సమ్మిళితం
గావించాలి.
నిత్యము
తెల్లవారి
మొదలు
మనం
చూస్తున్నాము.
పోస్టల్
పోస్టుమాన్.
అతడు
ఒక
యింటికి
ఒక
కవరు
యిచ్చి
పోతాడు.
రెండవ
యింటికి
వారి
ఎడ్రసుకు
సంబంధించిన
మరొక
కవరు
యిచ్చి
పోతాడు.
ఈ
విధముగా
వారి
వారి
విలాసముల
ననుసరించి
ఒక్కొక్కరికి
ఒక్కొక్క
కవరు
యిచ్చి
పోతుంటాడు.
ఒక
యింటిలో
ఆ
జాబును
చించి
చూసి
అందరు
ఘొల్లున
ఏడుస్తారు.
రెండవ
యింటిలో
అందరు
చూసి
ఫక్కున
నవ్వుతారు.
ఒక
యింటివారు
నవ్వటానికి,
మరొక
యింటి
వారు
ఏడవటానికి
పోస్టు
బంట్రోతా
కారణం.
కాదు.
కాదు.
ఆ
యింటి
వారికి
వచ్చిన
జాబు
యొక్క
ప్రభావమే.
యీ
ఏడుపుకు,
ఆనందమునకు
ముఖ్య
కారణము.
అదే
విధముగా
భగవంతుడు
ఒక
పోస్టలు
బంట్రోతు.
మీ
మీ
కర్మానుసారంగా
వచ్చిన
లెటర్సును
సుఖమూ,
దుఃఖమూ
మీరనుభవిస్తారుగాని
భగవంతునకే
మాత్రం
సంబంధము
లేదు.
దాని
వలనే
'కర్మాను
బందిని
మనుష్యలోకే'
మానవుడు
చేసిన
మంచి
చెడ్డల
యొక్క
కర్మ
ఫలితములు
అనుభవించక
తప్పదు.
అని
భారతీయుల
యొక్క
నమ్మకము.
కాని
తమ
తమ
ధర్మముల
యొక్క
విశిష్టతను
గాని,
విశేషతను
గాని
లేక
విషయాన్ని
గాని
గుర్తించటానికి
ప్రయత్నించక
కేవలం
భగవంతుని
నిందించుతున్నారు.
ఇది
కేవలం
అజ్ఞానము
యొక్క
ప్రథమ
స్థానము.
తన
దోషములు
తాను
గుర్తించటానికి
ప్రయత్నించక
భగవంతునిపై
దోషములు
వేయటానికి
పూనుకోటం
అజ్ఞానము.
నీ
ఎడ్రసుకు
వచ్చిన
జాబు
తెచ్చి
యిచ్చాడు
బంట్రోతు.
అంతే
గాని
వ్రాసిన
వారి
యొక్క
కష్టసుఖములను
నీవు
తలచుకొని
సుఖదుఃఖములకు
లోనవుతున్నావు.
జనని
గర్భము
నుండి
జన్మించినప్పుడు
కంఠమాలలేవి
కానరావు
మంచి
ముత్యపు
సరుల్
మచ్చునకును
లేవు
మేల్మి
బంగరు
దండ
మెడకు
లేదు
రత్నాల
హారముల్
రంజిల్లగా
లేవు
పచ్చలు
కెంపులు
పొదగలేదు
వజ్రాల
హారముల్
వర్థిల్లగా
లేవు
గోమేధికంబులు
తోడ
లేవు
కలదు
కలదొక్క
మాల
మీ
కంఠమందు
పూర్వజన్మల
కర్మలను
పొందుపరచి
బ్రహ్మ
మీకిచ్చి
పంపును
బరువుమాల
కర్మలన్నియు
చేర్చిన
కంఠమాల.
2
▾
Meaning
Keep
కనుక
ఆ
మాలను
మీరు
ధరించి
వస్తున్నారు.
యిక్కడికి.
కనుక
మీరు
మీకు
ధరించిన
హారమే.
కాని
మరొకరు
వేసిన
హారం
కాదు.
కనుక
యిట్టి
మంచి
చెడ్డలను
పరిష్కారం
గావించుకొను
నిమిత్తమై
భగవంతుని
ప్రార్థించటం
కర్తవ్యము.
పూర్వం
త్రేతాయుగములో
రాక్షసులందరు
ఒకవైపున,
దేవతలందరు
ఒక
వైపున
వుండి
జీవిస్తూ
వుండేవారు.
దండకారణ్యము
లోను,
లంకలోను
రాక్షసులుండేవారు.
అయోధ్య
కిష్కింధలో
దేవతలుండేవారు.
వారు
వేరుగా,
వీరు
వేరుగా
వుండటం
చేత
దేవతలకు
సహాయపడే
నిమిత్తమై,
వారి
బాధలు
నివారించే
నిమిత్తమై
రాక్షసుల
బారినుండి
తప్పించే
నిమిత్తమై
భగవంతుడవతరించి
దేవతలకు
సాయంగా
నిలచి
రాక్షసులతో
యుద్ధము
సల్పి
విజయాన్ని
సాధిస్తూ
వచ్చారు.
త్రేతాయుగములో
దేవతలు
వేరు,
రాక్షసులు
వేరుగా
వుండేవారు.
ద్వాపర
యుగమయ్యేటప్పటికి
దేవతలు
రాక్షసులు
ఒకే
యింటిలో
నివసించటానికి
ప్రయత్నించారు.
ఎట్లనగా
దేవకీదేవి
దేవతా
స్వరూపము.
ఆమె
సోదరుడైన
కంసుడు
రాక్షసుడు.
పాండవులు
దేవతా
స్వరూపులు.
కౌరవులు
రాక్షస
స్వరూపులు.
ఈ
విధముగా
ఒకే
కుటుంబములో
యీ
దేవతలు
రాక్షసులు
కలసి
జీవిస్తున్నారు.
అప్పుడు
భగవంతుడు
యుద్ధము
చేయటానికి
వీలుకాదు.
అందువలనే
కృష్ణుడు
కౌరవులకు
సైన్యమిచ్చి
పాండవులకు
తానే
కత్తి
పట్టనటువంటి
సారథ్యం
వహించాడు.
అస్త్రసన్యాసం
చేశాడు.
నాయనా!
మీ
మంచి
చెడ్డలు
మీకు
మీరే
పోరాడి
విజయాన్ని
సాధించుకోండి.
నేను
కేవలం
సాక్షీభూతుడుగా
వుంటాను.
కలియుగము
ప్రారంభమయ్యేటప్పటికి
యీ
దేవతలు,
రాక్షసులు
ఒకే
దేహంలోనే
వుంటూ
వచ్చారు.
త్రేతాయుగములో
వేరు
వేరు
దేశములలో
నివసిస్తూ
వచ్చారు.
ద్వాపర
యుగంలో
ఒక
యింటిలో
నివసిస్తూ
వచ్చారు.
కలియుగములో
ఒక
వంటిలో
నివసిస్తూ
వచ్చారు.
కనుక
ప్రతి
మానవుని
యందు
రాక్షసత్వము
దైవత్వము
రెండూ
కలసి
జీవిస్తూ
వస్తున్నాయి.
కనుక
యిక్కడ
కూడా
భగవంతుడు
కేవలం
సాక్షీభూతుడుగా
వున్నాడు.
ఎవరెవరి
కర్తవ్య
బలాన్ని
పురస్కరించుకొని
వారికి
విజయాన్ని
అందిస్తూ
వుంటాడు.
అదే
విధంగా
పోస్టుమేన్
పని
చేస్తుంటాడు.
ఎవరెవరి
ఎడ్రస్సులకు
వారి
లెటర్సు
యిస్తూ
పోతూ
వుంటాడు.
అతడు
సాక్షీభూతుడే.
ఐతే
మనం
వ్రాసే
జాబులకు
ఒక
నిబంధన
వుంది.
మనము
ఎంత
చక్కని
వ్రాత
వ్రాసి,
అందమైన
అక్షరాలు
వ్రాసి
చక్కని
పేపర్లో
వ్రాసి
కవరులో
పెట్టినా
పైన
ఎడ్రసు
కనుక
వ్రాయకపోతే
అంతా
వ్యర్థమై
పోతుంది.
అట్లు
కాకుండా
మన
అక్షరాలు
చాలా
అసహ్యముగా
వుండి,
చూచుటకు,
చదువుటకు
వీలుకాని
అక్షరాలైనా
కవరుపైన
ఎడ్రసు
వ్రాసే
అది
నేరుగా
అక్కడకు
వెళ్ళిపోతుంది.
3
▾
Meaning
Keep
ఇంకా
కవరుపైన
స్టాంపు
వుండాలి.
స్టాంపు
అతికించి,
ఎడ్రసు
వ్రాసి
పోస్టు
చేస్తే
వేయిమైళ్లయినా,
రెండు
వేల
మైళ్లయినా,
ఐదు
వేల
మైళ్ళయినా
అది
వెళ్ళిపోతుంది.
స్టాంపు
అతికించకపోతే
ప్రక్కింటికి
కూడా
పోయి
చేరదు.
ఈ
స్టాంపు
అంటే
యేమిటి?
చిత్తశుద్ధి.
ఇప్పుడు
యీ
హాలంత
పెద్ద
pure
white
paper
clean
గా
వుంది.
దానిని
నీకిస్తే
టేబులుపైన
మడచి
పెట్టి
పేపర్
వెయిట్
దాని
పైన
పెడతారు.
కాని
3/5
సైజుల
నూరు
రూపాయలనోటు
కనుక
యిస్తే,
చాలా
dirty
గావుంది,
అది
నీకిస్తే
నీవేమి
చేస్తావు.
దానిని
గోద్రెజ్
బీరువాలో
పెట్టి
లాక్
చేస్తావు.
అంతకంటె
వేయింతలు
white
paper
యిచ్చినా
నీవు
లెక్క
చేయలేదు.
దానిని
పారవేస్తున్నావు.
ఈ
dirty
paper,
ఏమేమో
oil
అయిపోంది,
ఏమేమో
లెక్కలు
కూడా
దానిపైన
వ్రాసారు,
యిలాంటి
dirty
paper
ను
తీసుకుపోయి
గోద్రెజ్
లో
పెట్టి
లాక్
చేస్తున్నావు.
వీటి
విలువకు
కారణమేమిటి?
అదే
Reserve
Bank
stamp
వుంది.
దానిపైన
ఆ
stamp
వుండటం
వలనే
అంత
dirty
paper
కు
అంత
విలువ
వచ్చింది.
దీనిపై
ఆ
stamp
లేదు
కనుక
యింత
పవిత్రమైనది,
యింత
పరిశుద్ధమైనది
విశాలమైనది
అయినప్పటికి
విలువ
లేకుండా
ప్రక్కన
పెట్టేస్తున్నావు.
కనుకనే
ఆళ్వార్
చెప్పారు.
భగవంతుడా
నా
చిత్తశుద్ధితో
నిన్ను
పూజ
చేస్తున్నాను.
ఆ
చిత్తశుద్ధి
అనేది
విలువైన
స్టాంపు.
ఆ
ప్యూరిటీ
లేకపోతే
ఎన్ని
చేసినా
ప్రయోజనము
వుండదు.
ఐతే
ఒక్కొక్క
సమయంలో
ఒక్కొక్క
పదార్థము,
ఒక్కొక్క
పరిస్థితి
ప్రభావము
పురస్కరించుకొని
అది
కొన్ని
మంచి
చెడ్డలుగా
మారిపోతుంది.
ఒక
cup
of
cold
water
చాలా
healthy
గా
వున్నవాడు,
దాహం
వేసేవానికి
అందిస్తే
చాలా
హాయిని
ఆనందాన్ని
పొందుతాడు.
వానికది
చాలా
వుపకారము,
ఆనందమును
అందిస్తుంది.
అదే
high
temp
వున్న
patient
కు
cold
water
యిస్తే,
డాక్టరుగారు
యివ్వవద్దని
అడ్డు
చెప్తారు.
దీని
వలన
న్యుమోనియా
రావచ్చు.
ఈ
cup
of
cold
water
ఒకరికి
ఉపకారము
చేస్తుంది,
మరొకరికి
అపకారం
చేస్తుంది.
అదే
విధముగా
వారి
వారి
పరిస్థితుల
ప్రభావాన్ని
చిత్తశుద్ధిని,
చిత్త
మాలిన్యమును
పురస్కరించుకొని
ఆయా
ఫలితము
లందిస్తూ
వుంటాయి.
మానవుడు
నేను
మానవుడనని
అహంకారపడటానికి
ప్రయత్నిస్తున్నాడు.
దేని
వల్ల
నీవు
అహంకారపడుతున్నావు?
దేనిని
ఆధారం
చేసుకుని
నీవు
అహంకారపడుతున్నావు?
నీ
ధనము
చూసి
అహంకార
పడుతున్నావా?
ఆ
ధనము
క్షణభంగురము.
కదలిపోతుంది.
పోనీ
అందాన్ని
చూసి
అహంకార
పడుతున్నావా?
కొంత
వయస్సు
వచ్చాక
యీ
అందమంతా
మంచు
కరగినట్లుగా
కరిగిపోతుంది.
పోనీ
బలం
చూసి
అహంకార
పడుతున్నావా?
తెల్లవారి
పూచిన
పూవు
సాయంకాలం
వాడిపోయినట్లుగా
యిది
వాడిపోతుంది.
పోనీ
నీ
మేధాశక్తిని,
యుక్తిని
చూసి
అహంకారపడుతున్నావా?
నీకంటె
యుక్తిగా
వుంటుంది
fox.
కనుక
దానికంటె
నీవు
చాలా
తక్కువ
వాడివే.
కాని
ఎక్కువ
వాడివి
కాదు
కదా!
ఇంక
అహంకారమెలాపడతావు?
4
▾
Meaning
Keep
Also in his talks
(1)
15 March 1998
Remembrance Alone Is the Way Across
చాలా
దూరంగా
sky
వరకు
ప్రయాణమవుతున్నానని
నీ
దృష్టిని
చూసి
నీవు
అహంకార
పడుతున్నావా?
నీ
కంటె
గ్రద్ద
దృష్టి
చాలా
గొప్పది.
చాలా
దూరం
వెడుతుంది.
ఇంక
దేనిని
చూసి
నీవు
అహంకారపడుతున్నావు.
కనుక
మానవత్వంలో
ఒక్కొక
event
వుంటుంది.
అక్కడ
విచక్షణా
జ్ఞానం
ప్రత్యేకంగా
వుండాలి.
ఒక
పిచ్చివాడో
లేక
చిన్న
పిల్లవాడో
ఒక
యింటిలో
దూరి
ఏమైనా
సామాను
ఎత్తుకుపోతే
ఆ
యింటివాడు
పోలీసు
complaint
చేసి
ఆ
పిల్లవానిని
arrest
చేయిస్తాడు.
ఇది
మానవత్వానికి
విరుద్ధమైనది.
అదే
యింటిలో
బజారుపోయే
కుక్క
వంటయింటిలో
దూరి
అంతా
తినేసి
పాత్రలంతా
చిందర
వందర
చేసి
వస్తుంది.
కాని
ఆ
కుక్కను
పోలీసులు
అరెస్టు
చేయటం
లేదు.
ఎన్ని
విధములైన
అల్లర్లు
చేసి
వచ్చినా
ఆ
కుక్కను
ఎవ్వరూ
అరెస్టు
చేయరు.
ఏ
Law
దానిని
శిక్షించదు.
అనగా
కుక్కకు
అది
సహజము.
మానవునికే
దొంగతనము
చేయటం
అసహజము.
ఈ
అసహజమైన
దానిని
నీవు
చేశావు.
కనుకనే
నీకు
punishment.
ఇది
పశువు.
దానికి
విచక్షణా
జ్ఞానము
శూన్యము.
విచక్షణా
జ్ఞానము
లేనిది
యేమి
చేసినా
తప్పులేదు.
విచక్షణా
జ్ఞానమున్న
మానవుడు
యే
కించిత్
తప్పు
చేసినా
అది
దోషమవుతుంది.
ఒక
డాక్టరు
వుంటాడు.
మంచి
పేరు
పొందిన
డాక్టరు.
ఇతను
ఆపరేషన్
లో
చాలా
ప్రఖ్యాతి
పొందిన
డాక్టరు.
అయ్యా!
నీకు
next
monday
ఫలాని
టైముకి
8
గంటలకు
ఆపరేషన్
చేస్తానని
date
fix
చేస్తాడు.
బంధువులంతా
వస్తారు.
ఆ
8
గంటలకు
ఆపరేషన్
చేస్తాడు.
ఆ
పేషెంట్
పోతాడు.
కాని
పబ్లిగ్గా
చెప్పి
యింతపని
చేసినా
పోలీసులు
ఆ
డాక్టరును
అరెస్టు
చేయరు.
అదే
ఒక
రోడ్డుపై
కిళ్లీ
కొట్ల
వాళ్లు
కొట్లాడుకుంటారు.
ఆ
కొట్లాటలో
ఒక
చిన్న
గాయమైందంటే
వెంటనే
పోలీసులు
వచ్చి
వానిని
అరెస్టు
చేస్తారు.
అనగా
వాడు
కత్తి
పట్టటానికి
గాని,
చిన్న
గాయమైనా
చేయటానికి
గాని
రైట్
లేదు.
డాక్టరుకు
రైట్
వుంది.
అదే
విధముగా
భగవంతుని
అనుగ్రహం
పొందటానికి
రైట్
పొందాలి.
ఆ
రైట్
వుండినప్పుడే
నీవు
ఫైట్
చేయటానికైనా
వీలవుతుంది.
అనన్యాశ్చింతయంతోమాం
యేజనాః
పర్యుపాసతే
తేషాం
నిత్యాభియుక్తానాం
యోగక్షేమం
వహామ్యహం.
నిరంతరము
దైవచింతన
చేస్తూ,
ఏ
జనుడైనా
సరే
no
caste,
no
religion.
ఎవరైనా
సరేకాని
ఏ
నామముతో
స్మరించినాగాని
ఆ
నామము
ఎప్పుడూ
చింతిస్తూ
వుండాలి.
అలాంటి
వారి
యోగక్షేమము
నేనే
చూసుకుంటాను.
అలాంటి
అనన్య
భక్తిని
మనం
అభివృద్ధి
చేసుకోవాలి.
కష్టముగాని
నష్టమురానీ,
ఆనంద
మనుభవించనీ
యేది
వచ్చినా
యిదంతా
నీ
యొక్క
ప్రసాదమనే
భావము
రావాలి.
అందువల్లనే
అన్ని
భగవంతునికి
అర్పితము
చెయ్యాలి.
లోకములో
అనేక
ధర్మాలు
వుంటున్నాయి.
ఈ
ధర్మములనేదానికి
ఏమి
కారణం?
హృదయ
పరిశుద్ధత
కారణం.
ఒక
రూపాయకు
ఎన్ని
పైసలు!
నూరు
రూపాయలకెన్ని
నయాపైసలు?
పదివేల
నయాపైసలు.
పదివేల
నయాపైసలు
నువ్వు
తీసుకువెళ్లాలంటే
ఎంత
పెద్ద
bundle
అవుతుంది.
5
▾
Meaning
Keep
అది
మోయాలి.
ఎంత
కష్టమవుతుంది.
దాని
దాచుకోటం
కూడా
కష్టమే.
నీవు
ఆ
పదివేల
నయాపైసలు
నాకందించు.
నూరు
రూపాయలనోటు
తీసుకో.
ఈ
పదివేల
నయాపైసలు,
నూరు
రూపాయలనోటు
రెండు
ఒకే
value.
నూరు
రూపాయల
నోటు
దాచుకోటము
easy.
అది
లైట్
గా
వుంటుంది
కనుక.
పదివేల
నయాపైసలు
వెయిట్.
దాచుకోటం
సాధ్యం
కాదు.
అది
చాలా
బరువు.
రెండు
విధాలా
బాధలు
పెడుతుంది.
కనుకనే
సర్వధర్మాన్
పరిత్యజ్య
నీవు
అనేక
ధర్మములనే
యీ
పదివేల
నయాపైసలు
నాకిచ్చివేయి.
యోగక్షేమం
వహామ్యహమ్.
నూరు
రూపాయల
నోటు
నీకిస్తాను.
అని
భగవంతుడెంతో
ప్రేమతో
చెప్తే
మూర్ఖులు
యీ
పదివేల
నయాపైసలు
మోసుకుని
పోతుంటారు.
కాని
యీ
రీతిగా
స్టడిగా
వుంటే
నూరు
రూపాయల
నోటును
వాడే
మాత్రం
అంగీకరించడు.
ఈ
నూరు
రూపాయల
నోటు
నీ
దగ్గరుంటే
పదివేల
నయాపైసలు
నీ
దగ్గర
వున్నట్లే.
భగవంతునికి
సంపూర్ణముగా
అర్పితము
చేస్తే
అన్నీ
తానే
చూచుకుంటాడు.
కానీ
అది
మానవునికి
చేతకాదు.
కారణమేమిటి?
ఈ
లౌకిక
జగత్తునందు,
ఈ
భౌతికమైన
జీవనంలో
ప్రారంభమైన
ఆనందాన్ని
అనుభవించాలని
అభిలషిస్తున్నాడు.
ఈనాటి
మానవుని
యొక్క
పరిస్థితి
యే
విధంగా
వున్నదంటే
కారులో
కూర్చుంటాడు.
డ్రైవరుకు
surrender
అవుతాడు.
హాయిగా
నిద్రపోతాడు.
వాడు
ఎక్కడకు
తీసుకుపోతాడో,
ఎలా
పోతాడో
తెలీదు.
పూర్తిగా
వానికే
surrender.
నాయనా!
మంచిగా
తీసుకుపో
అంటాడు.
కూర్చుంటాడు.
night
నిద్రపోయే
ముందు
ఘూర్ఖాకు
surrender
అవుతాడు.
తలుపు
వేసుకుని
చక్కగా
పడుకుంటాడు.
ఒక
ఘూర్ఖాకు
surrender
అవుతున్నాడు.
ఒక
driver
కు
surrender
అవుతున్నాడు.
మంచి
విలువైన
వస్త్రాలైనా
చాకలి
వానికి
వేసి
వానికి
surrender
చేస్తున్నాడు.
ఒరేయి
మంచిగా
వుతుక్కొని
రారా
అంటాడు.
కాని
భగవంతునికి
surrender
కావటానికి
ముందుకు
రావటం
లేదు.
ఇదే
ప్రాకృతమైన
మహత్తరమైన
శక్తి
పట్టి
పీడిస్తున్నది.
చూశారా!
లోకములో
ప్రతి
చిన్న
విషయములో
మనము
విచారణ
చేస్తే
ఎంత
తక్కువ
స్థాయికి
దిగజారిపోతున్నామో.
మానవుడు,
మానవుడు
అనుకుంటున్నాము.
దేనిని
బట్టి
నీవు
అహంకారపడుతున్నావు.
ఈ
విచక్షణా
జ్ఞానంలో
ఎవరు
మనకు
రక్షకులు?
ఎవరు
మనకు
శిక్షకులు?
నేనెవరు?
తానెవరు?
నేను
అనేది
ఎక్కడ
నుండి
వచ్చింది?
తాను
లేకపోతే
నేనెక్కడ?
ఈ
విధమైన
విచారణ
చేయటానికి
యేమాత్రం
పూనుకోటం
లేదు.
మానవత్వములో
విజ్ఞానము
క్షీణించి
ప్రాకృత
సుఖములనే
ఆధారం
చేసుకుని
ఈ
జగత్తులో
కాలాన్ని
గడుపుతున్నారు.
ఇది
మానవత్వానికి
సరియైన
లక్షణం
కాదు.
నీవు
జీవించవలసినదే.
కోరికలు
కోరుకోవలసిందే!
యోగక్షేమాన్ని
ఆశించవలసిందే!
ఇవన్నీ
తప్పులు
కావు.
ఐతే
యే
విధముగా
ఆశించాలి.
దానికి
తగినట్లుగా
మనం
విచారణ
చెయ్యాలి.
దానికి
విరుద్ధంగా
మనం
ప్రవర్తించినప్పుడు
మానవత్వమే
క్షీణించి
పోతుంది.
మనము
ఒక
పండు
తింటాము.
6
▾
Meaning
Keep
ఆ
పండు
సరియైన
రుచి
లేకుంటే
మనం
ఏమి
చేస్తాము.
బయట
పారవేస్తాము.
మంచిగా
వుంటే
లోపలకు
పంపిస్తాము.
అదే
విధముగా
యీ
సమాజమునందు
కూడా
సమాజమునకు
తగిన
రీతిగా
నీవు
వుంటే
ఆ
సమాజము
కూడా
నిన్ను
గౌరవిస్తుంది.
ఆ
సమాజమునకు
తగినట్లుగా
నీవు
ప్రవర్తించకపోతే
ఆ
సమాజం
నుండి
నిన్ను
దూరము
చేస్తుంది.
కనక
మానవునికి
యీ
సొసైటీలో
తాను
ఏ
విధమైన
ప్రవర్తనలో
జీవించాలనే
సత్యాన్ని
గుర్తించాలి.
కనుక
సమాజం
లేకుండా
మనము
క్షణమైనా
జీవించలేము.
ఈ
సమాజములో
మనం
జీవిస్తున్నాము.
సమాజ
పౌరునిగా
మనం
బ్రతుకుతున్నాము.
కనుక
మనం
యీ
మానవత్వాన్ని
చక్కగా
పోషించుకోటానికి
ప్రయత్నించాలి.
భగవంతుడు
సాక్షీభూతుడే
కాని
వానికి
ఆగ్రహం
కాని
అనుగ్రహం
కాని
రెండూ
లేవు.
రెండూ
అందించేవాడు
భగవంతుడు.
ఒకటి
వుంటున్నది
ప్రత్యేకంగా
అతనికి.
అదే
grace
marks
అంటారు
చూడండి.
అలా
అతను
ఏదైనా
చేయవచ్చును.
చూడండి
మన
AndhraPradesh
లో
Chief
Minister
grace
marks
అని
కొన్ని
వున్నాయి.
వైస్
ఛాన్సలర్
గ్రేస్
మార్కులని
కొన్ని
వున్నాయి.
ఇంక
చదవనక్కరలేదు.
అన్ని
గ్రేస్
మార్కులే.
ఈ
విధంగా
కాదు
దైవత్వంలో
వుండేది.
తన
ప్రవర్తన
పురస్కరించుకొని
grace
వస్తుంది.
భగవంతుడు
ఆగ్రహించినట్టుగా
నటిస్తాడు.
కానీ
ఆగ్రహము
కూడను
అనుగ్రహమే.
వర్షం
కురుస్తూ
వుంటుంది
వర్షములో
వడగళ్లు
పడతాయి.
ఆ
వడగళ్లు
చాలా
బాధపెడతాయి.
అది
కూడా
వాటరే.
చూశారా.
ఆ
మాటలు,
పనులు
కొంచెం
కఠినంగా
వుంటాయి
గాని.
అది
సరే.
కనుక
దైవానుగ్రహమనేది
ఆగ్రహములో
కూడను
అనుగ్రహమే
వుంటుంది.
కనుక
మానవుడు
చేసే
ప్రయత్నములు
సాధనలు
పురస్కరించుకొని
grace
అనేది
special
గా
వుంటుంది.
మీకందరికి
తెలుసు.
మార్కండేయునకు
భగవంతుడే
16
ఏళ్లు
సత్పుత్రుడుగా
జీవించమని
వరమిచ్చాడు.
మార్కండేయుడు
చింతించాడు.
నా
జీవితము
16
సంవత్సరములు
మాత్రమే.
నేను
సత్పుత్రునిగా
బ్రతకాలి.
అనే
వుద్దేశ్యముతో,
యీ
సన్మార్గము,
సద్భావములు,
సదాచారములు,
సద్గుణములు
యే
విధంగా
అలవడతాయి.
మహా
గుణవంతుడు
భగవంతుడొక్కడే.
కనుక
అతనినే
ఆశ్రయిస్తే
అతను
నాకనుగ్రహిస్తాడు.
భిక్షగాని
దగ్గరకు
పోయి
నాకు
భిక్షము
వేయమంటే
వాడు
యేమి
వేస్తాడు.
కుమ్మరింటికి
పోయి
వెచ్చాలు
కావాలంటే
యేమి
వేస్తాడు.
వాని
దగ్గర
వుండేవి
వట్టి
కుండలే.
కనుక
యీ
గుణవంతుని
పోయి
ఆశ్రయించినప్పుడు
ఆ
గుణములు
మనకు
అందించటానికి
వీలవుతుంది.
ఈ
discrimination
మొట్టమొదట
వుపయోగపెట్టాడు
మార్కండేయుడు.
మాకు
నీవు
తప్ప
అన్యము
లేదు.
అప్పుడు
పోయి
ఈశ్వరుని
ప్రార్థించాడు
తానే
యిచ్చాడు
యీ
పదహారు
సంవత్సరములు
కూడా.
ఆ
మార్కండేయుడు
చేసిన
సాధనలు
పురస్కరించుకొని,
ఉత్తమమైన
చిత్తము
నాధారము
చేసుకొని
తిరిగి
చిరంజీవిగా
తానే
మార్చాడు.
అదే
grace
marks.
భగవంతుని
యొక్క
సంకల్పము
మార్చటానికి
వీలుకాదు
తాను
యిచ్చిన
వరము
తప్పించటానికి
వీలుకాదు.
7
▾
Meaning
Keep
Also in his talks
(2)
11 March 1990
Education should be for life not for living
27 February 1995
Every atom is the form of God
ఎవరికి.
కనుక
కర్మ
తప్పించుకోటానికి
వీలు
కాదని
భావించుకోవచ్చు.
కానీ
ఒక్క
భగవంతునికే
యిది
సాధ్యము.
అట్టి
grace
ను
మనము
సంపాయించుకోటానికి
తగిన
కృషి
చెయ్యాలి.
ఈనాడు
యేమి
చేస్తున్నాము?
అయ్యో
నేను
పూజ
చేస్తున్నాను.
నేను
యెంతో
చింతిస్తున్నాను.
నేను
ప్రేమిస్తున్నాను.
అవి
తనకు
తాను
మాత్రమే
వర్తించుకుంటూ
measure
చేసుకుంటున్నాడు.
నీయొక్క
దానిని
నీవు
measure
వేసుకుంటున్నావు.
దానికొక
reason
వుంటున్నాది.
కాని
భగవంతుని
ప్రేమించటం
దీంట్లో
beyond
reason.
ఆ
reasons
యిక్కడంతా
పనికిరావు.
ఎట్లా
వుందంటే
ఒక
పద్యము
వుంటున్నాది.
అక్కరకు
రాని
చుట్టము
మ్రొక్కిన
వరమీని
వేల్పు
మోహరమున
తా
నెక్కిన
బారని
గుఱ్ఱము
గ్రక్కున
విడువంగవలయు
గదరా
సుమతీ!
అన్నారు.
మ్రొక్కితే
వరమీయని
దైవము,
ఎక్కుతే
పరుగెత్తని
గుఱ్ఱము,
కష్టములో
ఆదుకొనని
బంధుత్వము
గ్రక్కున
విడువమన్నారు.
ఎవరికి
చెప్పివుండేది
యిది.
అది
మనము
యోచించటం
లేదు.
వారు
వచ్చి
నన్ను
ఆదుకోలేదే
అని
బాధ
పడతాము.
మంచిగా
డబ్బిచ్చి
గుఱ్ఱాన్ని
తెచ్చుకుంటే
గుఱ్ఱము
పైన
ఎక్కుతే
యిది
పరుగెత్తటం
లేదే
అని
దానిని
కొడతాం.
కట్టకడపటికి
చెప్పాడు.
సుమతి.
మంచి
మనసు
కలవానికి
యీ
మూడు
పని
చేస్తాయి.
మంచి
మనసు
కలిగినటువంటి
వాడు
తను
చేసేటువంటివి
ఏ
పనులు
మంచి
పనులా
చెడ్డపనులా
అని
తెలుసుకుంటాడు.
చెడ్డ
పనులు
చేసి
బంధువులు
నాకు
సహాయము
చేయలేదంటే
వాడు
అడగలేదు.
మంచి
మనసు
కలవారు
సవారి
తెలియకుండా
గుఱ్ఱాన్ని
ఎక్కరు.
మంచి
మనస్సు
కలవాడు
భగవంతుడు
నన్ను
శిక్ష
వేస్తున్నాడే
అని
అతనిని
వదలిపెట్టడు.
మంచి
మనసు
కలవాడు
దైవమును
యేనాడు
వదలడు.
మంచి
మనసు
కలవాడు
సవారి
తెలియకుండా
గుఱ్ఱమును
ఎక్కడు.
మంచి
బుద్ధిగలవాడు
చెడ్డపని
చేసి
బంధువులంతా
సహాయము
చేయలేదని
వారిని
విసర్జించరు.
మొట్టమొదట
మంచి
మనస్సును
మనము
పెట్టుకోవాలి.
సు-మ-తి-
మంచి
మనస్సు.
కుమతి
కాదు.
కనుక
ఆ
మంచి
మనస్సు
తెచ్చుకోటానికే
దైవత్వమును
కొంతవరకు
ఆశ్రయించాలి.
భగవంతుడు
ఎప్పుడూ
కూడా
సాక్షీభూతముగా
వుంటాడు.
ఒక్కొక్క
తూరి
మీకేమైనా
letter
వచ్చిందంటే
లేక
టెలిగ్రాము
వచ్చిందంటే
చెడ్డ
టెలిగ్రాము
వచ్చింది.
ఆ
post
man
తో
మీరు
మంచి
సంబంధము
పెట్టుకుంటే
మంచిగా
వచ్చి
ఆ
చెడ్డది
కూడను
మంచి
మాటలతో
బోధిస్తాడు.
అట్లు
కాకుండా
మీకు
జాబు
వచ్చింది.
8
▾
Meaning
Keep
అని
యిస్తే
మీరు
ఘొల్లుమని
ఏడుస్తారు.
టెలిగ్రాము
యిచ్చి
సార్
కనుక్కోండి.
టెలిఫోను
చేసి
తెలుసుకోండి.
idea
వాడు
యిస్తాడు.
అదే
విధముగా
దైవము
తగిన
సలహాలు
యిస్తూ
వుంటారు.
ఇది
చేయటము
నీకు
చాలా
తప్పు.
నేరో
మైండులోనే
దీనిని
సత్యమని
భావించుకొని
దానిని
ప్రవర్తిస్తున్నావు.
ఎవరిది
వారికి
correct
గానే
వుంటుంది.
కాని
God
correct
చేస్తూ
వుంటాడు.
అతని
చేతికి
యిస్తేనే
సరియైన
రీతిగా
యిస్తాడు.
కనుక
నీ
అంత
నీవే
నిర్ణయించుకోకూడదు.
దైవార్పిత
మనే
భావముతో
మనం
జీవించటానికి
ప్రయత్నించాలి.
ఒక
చిన్న
ఉదాహరణము.
రామునితో
లక్ష్మణుడు
బయలుదేరి
వెళ్ళాడు.
రామునికి
మాత్రమే
మూడు
ఆజ్ఞలు
యిచ్చాడు.
కైకకు
యిచ్చిన
వరము
కోసము
14
ఏండ్లు
అరణ్యములో
వుండాలి.
నారవస్త్రములు
ధరించి
వెళ్ళాలి
అడవికి.
కాని
లక్ష్మణునకు
యీ
విధమైన
నిబంధనలు
యేమి
లేవు.
అతను
యే
దుస్తులైనా
వేసుకోవచ్చును.
ఇష్టము
వుంటే
పోవచ్చు
లేక
వుండవచ్చు.
కానీ
రాముని
పైన
వుండే
ప్రేమ
చేత
రాముడు
లేని
అయోధ్య
నాకు
కేవలము
అరణ్యమే
అనుకున్నాడు.
రామునితో
వుంటే
అరణ్యమే
నాకు
అయోధ్య
అనుకున్నాడు.
రాముడు
నారవస్త్రములు
ధరించుకుంటే
తాను
పట్టు
వస్త్రములు
ధరించి
పోతాడా
పోడు.
ఆ
స్వామికి
యే
మార్గమో
నాకు
అదే
మార్గము
అనుకున్నాడు.
రాముడు
ఏ
విధంగా
వుంటే
నేను
అదే
విధంగా
పోవాలి.
అతని
యిష్టాన్ని
నేను
అనుసరించాలి.
రాముడు
అంగీకరించలేదు.
నమస్కారము
చేశాడు.
అన్నా
నీవు
లేని
బ్రతుకు
నాకక్కరలేదు.
అన్నాడు.
నాకు
యిల్లాలు
వుంది.
నాకు
రాజ్యము
వుంది.
నాకు
పిల్లలు
వున్నారు.
కానీ
నాకు
నీవే
నా
సర్వస్వము.
కనుక
నే
వెంట
వస్తాను.
నీవు
అంగీకరించకుండా
పోయిన
ప్రాణము
విడుస్తాను
గాని
నేను
అయోధ్యలో
వుండను.
దానిని
పురస్కరించుకొని
రాముడు
అనుమతించాడు.
చిత్రకూట
పర్వతము
పైన
దిగారు.
ఎన్నడూ
నడవని
రాజకుమార్తె
సీత
నడచి
నడచి
అలసి
పోయారు.
రాముడు
లక్ష్మణుని
పిలిచాడు.
సోదరా!
సీత
అలసిపోయినట్లుగా
వుంది.
పర్ణశాల
నిర్మించు.
ఆమె
విశ్రాంతి
తీసుకుంటుంది.
లక్ష్మణుడు
అడిగాడు.
అన్నా
ఎక్కడ
నిర్మించాలి.
నీకు
ఎక్కడ
యిష్టమో
అక్కడ
నిర్మించు
అన్నాడు.
ఒక్క
తూరి
కూలిపోయాడు
లక్ష్మణుడు.
నేనెంత
పాపము
చేశాను
అని
తలకొట్టుకున్నాడు.
ఆశ్చర్యపడింది
సీత.
ఏమన్నాడు
రాముడు.
ఏమి
చెప్పలేదే
నీకు.
'యిష్టమైన
చోట
నీవు
నిర్మించమన్నారేగాని
నీవు
ఎందుకింత
బాధపడుతున్నావు
లక్ష్మణా'.
అని
అడిగింది.
ఈ
మాట
చాలదా!
నాకు
యిష్టము
వుంటుండాదా!
నాకు
యిష్టమే
లేదు.
నీ
యిష్టమే
నా
యిష్టము.
కాబట్టి
నాకొక
యిష్టమున్నదని
రాముని
నోటి
నుండి
వచ్చిందంటే
నేను
ఎంత
పాపము
చేశానో.
నేను
ఏ
రీతిగా
శరణార్థిని
అవుతాను.
నాకు
యిష్టము
వుంటే
శరణాగతే
కాదు.
నాకు
యిష్టము
లేదు.
నీ
యిష్టమే
నా
యిష్టము.
ఆ
భావమును
పురస్కరించుకొని
రాముడు
దగ్గరకు
పిలిచి
లక్ష్మణా
పొరపాటై
పోయింది.
తప్పు
నాది.
9
▾
Meaning
Keep
నన్ను
క్షమించమని
కోరాడు.
అంత
భగవత్
భక్తుని
తత్వము
చక్కగా
తెలుసుకున్న
భగవంతుడు
తప్పక
తానే
వశమైపోతాడు.
ఎక్కడ
అహంకారము,
ఆడంబరము
వుంటుందో
అక్కడ
తాను
కూడ
అదే
విధముగా
వుంటాడు.
కనుక
యద్భావం
తద్భవతి.
ఎంత
మాత్రమున
ఎవ్వరు
తలచిన
అంత
మాత్రమే
నేను
అన్నాడు
అన్నమాచార్య.
కనుక
నీ
తలంపు
మీద
ఆధారపడి
వుంటున్నదిగాని
భగవంతుని
యొక్క
సంకల్పముపైన
కాదు.
ప్రపంచమంతా
నిలువుటద్దము
వంటిది.
నిలువుటద్దము
ముందు
నాలుగు
తూర్లు
యిట్లే
అను
అదికూడా
అంటుంది.
నీవు
నిలువుటద్దము
ముందు
పోయి
నమస్కారము
చేయి
నమస్కారము
తిరిగి
నీకే
అందిస్తుంది.
కనుక
ప్రపంచమనే
అద్దము
లోపల
నీవు
యేమి
చేస్తున్నావో
అది
Resound
reflection.
నీది
నీకే
వస్తున్నాయి.
నీవు
మంచిని
చేసి,
మంచిని
చూచి,
మంచిని
తలచి,
మంచిని
చెప్పి
మంచిగా
వుండు.
ఇదే
మానవత్వానికి
సరైన
అర్థము.
ఈ
విధమైన
శరణాగతి
తత్వము
లోపల
మానవత్వము
కొంతవరకు
అధికారముంటుండాది.
ఐతే
యేది
చేసినా
సర్వకర్మ
భగవత్ప్రీత్యర్థము
అనే
భావములో
చేయి.
అట్లు
కాకుండా
మంచి
జరిగింది
అది
నాశక్తి
ప్రభావము,
చెడిపోయింది
అది
దేవునిది.
తెలుగులో
చెప్పుతూ
వుంటారు.
పెళ్లిపందిరి
వేస్తున్నాడు
లోభి.
సరే
దానికి
కట్టటానికి
త్రాడు
పెద్దపెద్దవైతే
ఖర్చవుతుందని
చిన్నచిన్న
త్రాళ్లతో
కట్టించాడు.
చాలా
చిన్న
చిన్న
త్రాళ్లతో
పెండాలు
కట్టారు.
గాలి
వచ్చింది.
అది
పడిపోయింది.
ఈ
పెండాలు
పడిపోయింది.
పంచాంగము
వానిని
పడగొట్టరా
అన్నాడుట.
పంచాంగము
వానిది
తప్పయిపోయింది.
ముహూర్తము
పెట్టింది
తప్పైపోయింది.
తల్లి
బిడ్డ
మీద
ప్రేమతో
బిడ్డను
ముద్దుపెట్టుకోవాలని
బిడ్డను
కొరికేస్తే.
కనుక
బిడ్డను
ముద్దుపెట్టుకోటానికి
ప్రమాదము
కలగకుండా
వుండే
రీతిగా
చూచుకోవాలి.
అదే
విధముగా
శ్రమ
కలిగించేది,
బాధ
కలిగించేది
ప్రేమ
ఎట్లా
అవుతుంది.
I
Love
I
Love
అని
గ్రామఫోను
ప్లేటులా
రిపిటీషను
చేస్తే
ఏమి
లాభము.
ప్రాక్టికల్
లో
నిరూపించాలి.
లేకపోతే
నిరుపయోగమై
పోతుంది.
గ్రామఫోను
ప్లేటు
లోపల
ఒకామె
ఏడుస్తూ
పాడుతుంది.
కానీ
వినేవానికి
కూడా
కండ్లలో
నీరు
వస్తుంది.
కాని
గ్రామఫోను
ప్లేటు
ఏడ్వదు.
అదే
రీతిగా
మన
ప్రేమ
కూడను
I
Love
అంటే
words
మాత్రము
గ్రామఫోను
మాదిరి.
దీనికి
యే
మాత్రము
Love
లేదు.
Practical
లో
చూపించాలి.
అప్పుడే
మానవత్వము
చక్కగా
తగిన
ఆదర్శము
నందిస్తుంది.
కనుక
విద్యార్థులు
స్వామి
మమ్ములను
శిక్షిస్తున్నాడనిగాని,
ఆగ్రహించాడనిగాని,
అనుగ్రహించాడనిగాని
మీరు
యే
విధముగా
చింతించరాదు.
మీ
దోషాలను
మీరు
వెతుక్కోటానికి,
ఆ
దోషములు
లేకుండా
వుండటానికి
మీరు
చూచుకోండి.
ఈ
పిచ్చిగుణాలు
నాలో
లేవు.
ఎప్పుడూ
నాకు
ప్రేమ
ఒక్కటే.
ఐతే
reaction.
మీ
దానిని
బట్టి
నేను
ఆ
action
చేయవలసి
వస్తుంది.
ఆ
reaction
కు
మీరే
కారకులు.
10
▾
Meaning
Keep
మీ
action
చక్కగా
వుంటే
reaction
చక్కగా
వుంటుంది.
మొట్టమొదట
మీ
action
సరైన
రీతిలో
వుంచుకోవాలి.
మీ
thoughts
సరైన
దీంట్లో
తీర్చి
దిద్దుకోండి.
ప్రతి
దానిని
మన
దుఃఖమునకు,
మన
ఆనందమునకు
అన్నింటికి
మూలకారణము
మన
మనస్సే.
అంతా
కూడను
reflection
of
inner
being.
లోపలి
దాని
యొక్క
reflection
యిదంతా.
కనుక
మీ
గిల్టీ
కాంషస్ను
కంట్రోలు
చేసుకోండి.
దేశకాల
పాత్ర
స్వభావములను
పురస్కరించుకొని
స్వామి
అందిస్తుంటాడు
అప్పటికప్పుడు.
ప్రతిదానికి
ఒక్కొక్క
కారణము
వుండాలి.
కారణము
లేని
కార్యము
స్వామి
చేయడు.
స్వామి
చేసిన
దానికి
reason
వుందని
మీరు
యోచించాలి.
మీరు
దానిని
చూడటం
లేదు.
అదే
పెద్ద
పొరపాటు.
ఎప్పుడు
స్వామిలో
దయ
ప్రేమ
రెండూ
కూడను
సమ్మిళితమై
వుంటున్నాయి.
మీ
thoughts
యొక్క
reactions
మీకు
యీ
విధమైన
పొరపాటు
మార్గమును
చూపిస్తున్నాయి.
భగవంతుడు
ఒక
దోభీ.
clean
చేయటమే
యితని
యొక్క
పని.
అద్దము
ఏమి
చెబుతుంది.
నీ
reflection
చూపుతుంది.
నీ
రూపము
సరిగా
లేకుండా
పోయి
అద్దములో
చూసుకొని
అద్దము
పగలకొడితే.
నీ
భావమును
చూపిందిగాని
దాని
తప్పు
యేమి
లేదు.
తన
దానిని
తాను
చక్క
చేసుకోటం
మానుకొని
అద్దమును
పగలగొట్టటము.
ఈనాడు.
భగవంతుడు
విశేషమైన,
అమూల్యమైన
gift
యిచ్చాడు.
బుద్ధి
అనే
అద్దము
మీకందించాడు.
నీ
ముఖము
నీవు
చూసుకో.
నీవు
ఘోరంగా
వుంటున్నావా
శాంతముగా
వుంటున్నావా,
ఆనందంగా
వుంటున్నావా
అని
నీవు
దాన్ని
చూసుకుంటూ
రావాలి.
అట్లా
చూసుకోకుండ
భగవంతుడిచ్చిన
బుద్ధిని
యింకొకరి
ముఖముపైన
పెడితే
వారి
ముఖము
కనబడుతుందిగాని
నీ
ముఖము
ఎట్లా
కనుపిస్తుంది.
ఇతరుల
దోషములను
వెదుకుతూ
వస్తున్నారు.
ఆ
విధముగా
యితరుల
ముఖము
కనుపిస్తున్నాది.
ఇతరుల
ముఖముపై
పెట్టవద్దు
ఆ
బుద్ధి
అనే
అద్దమును.
నీ
ముఖముపైన
పెట్టు.
అప్పుడు
నీ
దోషము
నీకు
కనుపిస్తుంది.
అప్పుడు
నిన్ను
నీవు
శుభ్రము
చేసుకోవచ్చు.
కనుక
మొట్టమొదట
నీ
దోషములు
నీవు
వెతకటానికి
ప్రయత్నించు.
పరుల
దోషము
వెతుకుటే
పాడు
బుద్ధి.
నీ
దోషములను
నీవు
చూసుకో.
జీసస్
కూడా
చెప్పాడు.
ఇతరుల
కంటిలో
వున్న
చిన్న
కణము
కనుపిస్తున్నాదే
నీకు
నీ
కంటిలో
వున్న
పెద్ద
గుండు
నీకు
కనుపించటము
లేదు.
తెలుగులో
కూడా
చెబుతారు.
తన
ఆకులో
గాడిదలు
పడి
భోజనము
తింటే
కనుపించలేదట
యితర
ఆకులో
యీగ
మాత్రం
కనుపించిందట.
ఆ
విధంగా
వుండకూడదు.
మన
దోషాన్ని
మనం
వెతుక్కొని
సరిచూసుకోవాలి.
అంతేగాని
పరుల
దోషములను
వెతకకూడదు.
మన
హృదయము
మనము
పరిశుద్ధము
చేసుకోటానికి
చూసుకోవాలి.
ఉదాహరణ
పిల్లలకు.
నీ
ఏదైనా
పాత
వస్త్రమో
dirty
గా
వున్న
వస్త్రమో
వేసుకొని
యింట్లో
నీవు
శుభ్రము
చేసుకుంటూ
వుంటావు.
ఎవరైనా
యింటికి
వస్తే
తక్షణము
లోపలికి
పోయి
dress
మార్చుకుని
చక్కగా
clean
గా
యింకొక
dress
వేసుకొని
వస్తావు.
11
▾
Meaning
Keep
dirty
గావుంటుంటే
నీవు
సరైన
స్థితిలో
లేకపోతే
friends
చూస్తేనే
నీకు
యింత
అవమాన
మవుతుంది.
అనుకున్నప్పుడు
నీ
dirty
మనస్సుతో
వున్నప్పుడు
ఆ
మనస్సు
భగవంతుడు
చూస్తాడని
భయమెందుకు
రాకూడదు.
నీవు
ఎక్కడైనా
లైనులో
కూర్చోవాలంటే
waste
paper
లేక
ఏదో
ఒకటి
క్రింద
వేసుకు
కూర్చుంటావు.
ఎందుకు
నీకే
మాత్రం
dust
కాకూడదు.
నీవు
కూర్చుని
వుండాలంటేనే
యింత
పరిశుద్ధమును
కోరుతున్నావే
భగవంతుడు
నీ
హృదయములో
కూర్చోవాలంటే
అక్కడ
శుభ్రముగా
వుండవద్దా.
భగవంతుడు
నీ
హృదయంలో
కూర్చోవాలంటే
మొట్టమొదట
అది
శుభ్రం
చెయ్యాలి.
అప్పుడు
అక్కడ
వచ్చి
కూర్చుంటారు.
మైసూరు
మహారాజుకు
రాజ్యమంతా
తనదే.
రాజ్యమంతా
నాదేనని
డ్రైనేజి
వాటర్
లో
కూర్చుంటాడా.
తాను
కూర్చునే
సింహాసనము
వేరేగా
వుంటున్నది.
కాబట్టి
అందరి
హృదయాలు
భగవంతునివే.
అందరి
హృదయాలు
నావేయని
dirty
హృదయంలో
కూర్చోడు.
ఎక్కడ
పరిశుద్ధముగా
వుంటుందో
అక్కడ
కూర్చుంటాడు.
ఎక్కడ
pure
healthy
వుంటాయో
అక్కడ
కూర్చుంటాడు.
మ్యూజికల్
చైర్
లో
లాగ
కూర్చోడు.
అందరి
హృదయాలలో
కూడా
కూర్చుంటాడు.
ఎట్లా
ఒక
వేయి
పాత్రలంతా
నీటిలో
నింపి
పెట్టాము.
కాని
పైన
ఒకే
చంద్రుడు
వున్నాడు.
అన్ని
పాత్రలలోను
కనబడుతున్నాడు.
అన్ని
చంద్రులున్నాయా?
ఒకే
చంద్రుడు.
అదే
రీతిగా
యీ
దేహములంతా
కుండల
వంటివి.
మైండ్
అనే
జలము
అక్కడ
వుంటున్నాది.
ఆత్మ
అనే
తత్వము
అన్నింటిలోనూ
వుంటున్నాది.
కానీ
dirty
water
లో
సరిగా
కనుపించటం
లేదు.
ఈ
వేవరింగ్
లా
వుంటుంది.
చూడండి
దాంట్లో
కదులుతున్నట్లుగా
కనుపిస్తుంది.
Pure
and
steady
గా
వుండే
దాంట్లో
steady
గా
వుంటుంది.
dirty
water
తమోగుణము.
చలించే
మనస్సు
రజోగుణము.
clean
water
సాత్వికగుణము.
అక్కడ
మన
ప్రతిబింబము
చక్కగా
కనుపిస్తుంది.
చూశారా!
మీకు
స్వామి
ప్రత్యేకంగా,
పవిత్రముగా
కనపడాలంటే
clean
గా
వుండాలి.
Jumps
bumps
లేకుండా
చూసుకోండి.
waves
వస్తుంటాయి.
waves
ఏమాత్రం
చోటు
యివ్వకూడదు.
waves
అంతా
కలసి
ocean
అయిపోతుంది.
సంసారం
సాగరం
విషం.
ఒక
నామములో
వుంటే
steady
గా
వుంటుంది.
భగవదర్పితముగా
నీ
కర్తవ్యము
నీవు
చేయి.
నీ
duty
నీవు
చేసుకో.
ఆఫీసుకు
పోవద్దని
చెప్పను.
అన్నం
తినవద్దని
చెప్పను.
dress
వేసుకోవద్దని
చెప్పను.
మంచిగా
భుజించండి.
ఆఫీసుకు
పొండి.
మంచిగా
సంపాయించండి.
కాని
భగవంతుని
మరువకండి.
Do
your
duty
sincerely.
అదే
స్వామి
కోరేది.
honesty
గా
పని
చేయి.
ఎవరు
యేమన్నా
నీవు
భయపడవద్దు.
ఎంత
ఎలాంటి
విచిత్రమైన
పరిస్థితులు
వచ్చాయో
ఏడ్చుకుంటూ
వచ్చింది.
చెప్పాను
don't
worry.
యిదంతా
mental
fear.
స్వామి
వున్నాడు
ధైర్యంగా
fight
చెయ్యి.
అన్నాను.
ఉద్యోగమే
వద్దు
రిజైన్
చేస్తాననింది.
వద్దు
వద్దు.
దీంతో
మనం
పోరాడాలి.
fight
to
the
end
finish
the
game.
ఆ
మాట
పై
విశ్వాసముతోనే
పోయి
చేరింది.
12
▾
Meaning
Keep
ఒక్క
ఆడమనిషి.
కొన్ని
వేల
మంది
మగపిల్లలు
చుట్టుకున్నారు.
ఏమి
చేస్తుందామె.
దుర్మార్గము,
దుష్టులైన
వారి
మధ్యలో
వుంది
ద్రౌపదివలె.
ఎంత
మంది
వుంటే
యేమి?
ఎన్ని
కుక్కలు
చేరినా
ఒక్క
సింహానికి
సమానమవుతుందా.
పురుష
సింహము
వున్నట్లు
కృష్ణుడు
వున్నాడు.
కుక్కలంతా
ఎలా
వుంటాయి.
ఆ
విధంగా
జయించుకుని
వచ్చిందామె.
ఒక
తూరి
Teachers
conference
జరిపింది.
ఆమె
డైరక్టరుగా
వున్నప్పుడు
కర్నాటకలో
teachers
అంతా
వచ్చారు.
నా
పేరు
ఎక్కడ
ఎప్పుడు
చెప్పకండి
ఎందుకంటే
అన్ని
రకాలుగా
వుంటారు
టీచర్సు.
యోగులు,
భోగులు,
విరాగులు
బైరాగులు
అందరూ
వుంటుంటారు
అక్కడ.
నాస్తికులు,
ఆస్తికులు,
యాస్తికులు
అందరు
వుంటుంటారు.
ఆ
టీచర్సుతో.
చెప్పాను.
ఎడ్రస్సు
చేయి
స్వామి
అట్లా
యిట్లా
అని
చెప్పవద్దు.
చెప్పింది.
నా
విశ్వాసమును
నేను
గట్టిగా
చెబుతాను
నేను
భయపడనని
He
is
my
Sai
Govinda.
నేను
ఎవరి
కోసం
భయపడను.
భయపడితే
భక్తే
కాదు.
భయపడితే
భక్తి
వుండదు.
ఎవరైనా
అనుకోనీ
నా
భక్తి
నాది.
నాకు
మైండ్
వుంది.
నాకు
intellect
వుంది.
నాకు
desire
వుంది.
నా
desire
నేను
follow
చేస్తాను.
నా
mind
నేను
follow
చేస్తాను.
ఇంకొకరి
mind
follow
చేయను.
గట్టిగా
చెప్పింది.
ఈ
టీచర్సంతా
సంతోషించారు.
తరువాత
చెప్పారు.
ఇంకో
conference
పెట్టమని
అడిగారు
వాళ్లు.
ఆ
కాన్ఫరెన్సు
ఆమెను
అన్ని
విధములా
రక్షిస్తూ
వచ్చింది.
ఇక్కడ
యించి
యించికి
క్షణక్షణానికి
ఎక్కడ
పోయినా
ధర్వార్,
హుబ్లి
అక్కడ
అంతా
చెబుతారు
సార్
పోవద్దండి
బాబు
అని
చెబుతారు.
నా
సాయి
గోవిందుడు
నా
వెంటవున్నాడు
నేను
పోతాను.
అందరిని
పిలిచి
strike
కారణం
ఏమిటి
చెప్పండి.
ఈ
మగధీరులంతా
వున్నారు.
ఎవరికి
వారే.
మగవారు
ఆడబుద్ధులు
వారివి.
ఆమె
ఆడది
గాని
మగవాని
బుద్ధులు.
ఆ
విధముగా
సాధించుకుని
వచ్చింది.
రూపాల
బట్టి
కాదు
స్త్రీ
పురుషులు.
అందరు
actors.
ఒక
girls
college
లో
ఒక
డ్రామా
వేస్తారు.
రాజు
కూడను
అమ్మాయే
వేస్తుంది.
మినిష్టరు
కూడా
అమ్మాయే
వేస్తుంది.
అందరూ
అమ్మాయిలే
వేస్తారు.
కాని
stage
కి
మాత్రమే
అక్కడ
రాజూ
రాణీ.
తెరవెనుక
అందరు
రాణులే.
అందరు
ఆత్మ
స్వరూపులే.
ఉపాధి
భేదములు
పురస్కరించుకొని
స్త్రీ
పురుషులు
గాని
అందరు
ప్రకృతి
యొక్క
స్వరూపములే.
ఏడుపు
వస్తే
వారు
ఏడుస్తారు
వీరూ
ఏడుస్తారు.
ఆకలి
వేస్తే
వారు
తింటారు.
వీరూ
తింటారు.
కోపము
వస్తే
ఆయన
కోప్పడతారు.
ఈమె
కోప్పడుతుంది.
difference
ఏమిటి?
అందరికీ
weakness
వుంది.
అందరు
అబలలే.
ఎవరు
బలులు
లేరిక్కడ.
బలుడు
ఒక్కడే.
అతనే
భగవంతుడు.
కాబట్టి
సర్వబలములు
అనుగ్రహించే
స్వరూపుని
ప్రార్థించండి.
బుద్ధిబలము,
భుజబలము,
జ్ఞానబలము
వైరాగ్యబలము,
సర్వబలములు
అక్కడే
వుంటున్నాయి.
అందువల్లే
ఈశ్వర
అన్నారు.
ఈశ్వర
అనగా
సకలైశ్వర్య
స్వరూపుడు.
అన్ని
బలములు
అతనిలో
వున్నాయి.
కనుక
భగవంతుని
ప్రార్థించి
మీ
బాధలు
నివారణ
చేసుకొని
శాంతి
సౌఖ్యాలతో
సంతోషంగా
జీవించండి.
Previous
←
Prema Itself Is God
Next
See the Embodiment of Prema with Prema Alone
→