Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1992 · If we can raise the value of man, the value of things comes down
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
If we can raise the value of man, the value of things comes down
27 December 1992, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
దివ్యాత్మ
స్వరూపులారా!
మీరు
జ్ఞానస్వరూపులై
ఉన్నారు.
జ్ఞానాన్ని
వెతకడానికి
మరొక
జ్ఞానాన్ని
మనం
సంపాదించనక్కర
లేదు.
అయితే
మనలో
దివ్యమైన
ఆత్మజ్యోతి
వెల్గుతున్నప్పటికి
దానిపైన
అభిమానం,
మమకారం
అనే
దట్టమైన
నివురు
కప్పుకోవటంచేత
ఆ
జ్యోతి
మనకు
కన్పించటం
లేదు.
నమ్మదగినవాడు
భగవంతుడు
ఒక్కడే!
కామికాని
మానవుడు
లోకములో
కన్పించడు.
కామము
అనగా
కోరిక.
‘క’
అనగా
వాంఛ,
‘మ’
అనగా
క్షణము.
అనగా
క్షణభంగురమైన
వాంఛలే
కామములు.
‘మ’
అనగా
క్షణికమైనది,
అనిత్యమైనది,
అసత్యమైనది.
‘క’
అనగా
సుఖము.
ఎట్టి
సుఖము?
అనిత్యమైన
సుఖము.
క్షణభంగురమైన
సుఖము.
అశాశ్వతమైన
సుఖము.
ఇదే
మన
కామము.
ఈనాడు
మనం
కోరేటువంటివన్నీకూడా
క్షణభంగురాలే!
ఏదీ
శాశ్వతంకాదు.
శాశ్వతమైనది
ఆత్మ
ఒక్కటే!
మానవుని
మనం
ప్రేమించవలసినదే!
కాని,
విశ్వసించరాదు,
నమ్మరాదు.
ఎందుకంటే
నమ్మకమైనటువంటివాడు
కాడు,
మానవుడు.
కొంత
కాలము
అయ్యాక
కనుమరుగైపోతాడు.
నమ్మదగినవాడు
భగవంతుడు
ఒక్కడే!
మిగతా
వారినందరినీ
మనం
ప్రేమించవచ్చును.
ప్రేమకు,
నమ్మకానికి
చాలా
వ్యత్యాసముంది.
తల్లితండ్రులని,
బిడ్డలని,
భర్తలని
వారిని
అందరినీ
నమ్మి
మనం
ప్రేమిస్తుంటాము.
కాని
యీ
నమ్మకం
ఎంతకాలం
ఉంటుంది?
కొంతకాలమే!
ఏనాటికైనా
ఒకనాటికి
ఆ
నమ్మకం
పోయేటువంటిదే!
దీనినే
‘మోహము’
అంటారు.
‘మ’
అనగా
అశాశ్వతం,
క్షణభంగురము.
‘ఓహ’
అనగా
వాంఛ.
2
▾
Meaning
Keep
ఈ
వాంఛకూడా
క్షణభంగురమైనదే!
ఇలాంటి
మోహంలో
పడి
జీవితంలో
అనేక
అశాంతులకు,
అసంతృప్తులకు,
కష్టములకు,
నష్టములకు
గురైపోతున్నాడు,
మానవుడు.
ఇవన్నీ
సాధించవలసిందే!
కాని
నమ్మకం
భగవంతునిపైన
ఉంచాలి.
దైవవిశ్వాసాన్ని
హృదయంలో
దృఢంగా
ఉంచుకుని
లౌకికమైన,
భౌతికమైన,
ప్రాకృతమైన
యీ
జీవితాన్ని
మనం
గడపటంలో
తప్పులేదు.
కాని
ప్రాకృతమే
సత్యమని,
భౌతికమే
నిత్యమని,
అశాశ్వతమైన
యీ
లోకమే
మనకు
ఆధారమని
విశ్వసించరాదు.
ఎందుకంటే
ఏ
నిమిషమో,
ఎప్పుడో,
ఎక్కడో!
“శతవర్షములదాక
మితము
చెప్పిరి
కాని
నమ్మరాదా
మాట
నెమ్మనంబున
బాల్యమందో
లేక
ప్రాయమందో
లేక
ముదిమియందో
ఎప్పుడో
వానికి.”
భగవంతుడు
ఎప్పుడూ
అనుగ్రహమునే
అందిస్తాడు
మానవ
జీవితము
నీటి
బుడగవంటిది.
ఆ
నీటి
బుడగవంటి
భవనమును
మనము
ఎక్కడ
నిర్మించుకుంటున్నాము?
కేవలము
‘వాంఛ’
అనే
దానిపైన
మనము
నిర్మించుకుంటున్నాము.
నీటి
బుడగ
ఎంతసేపు
ఉంటుంది?
అయితే
ఉండవలసినంతకాలము
ఉండవలసిందే!
కానీ
దైవముపైన
విశ్వాసము
పెట్టుకొని
మన
కార్యములను
మనము
చేస్తూ
జీవితాన్ని
ఆనందముగా
గడపాలి.
నేను,
నాది
అనే
అభిమానమమకారములే
మానవునకు
సుఖదుఃఖాలు
అందిస్తున్నాయి.
భగవంతుడు
కాదు,
సుఖదుఃఖాలనందించేది.
భగవంతుడు
కాదు,
మీకు
నష్టాలు,
కష్టాలు
అందించేది.
భగవంతుడు
ఎప్పుడూ
యే
విధమైన
శిక్ష
యివ్వడు.
భగవంతుడు
ఎప్పుడూ
అనుగ్రహమునే
అందిస్తాడు.
కానీ,
మనం
భగవంతుని
ఆగ్రహానికి
గురైనామని
భావిస్తున్నాము.
భగవంతునికి
ఆగ్రహమే
లేదు;
అంతా
అనుగ్రహమే,
అనుగ్రహమే!
ఐతే
యీ
బాధలంతా
ఎందుకు
లభ్యమవుతున్నాయి.
అని
విచారణ
చేస్తే
‘నాది’,
‘నేను
చేస్తున్నాను,’
‘నేను
చేశాను,’
‘నేను
చూశాను,’
‘నేను
అనుభవించాను’
అనుకోడంవల్లనే!
ఈ
‘నేను’
అనేది
ఎక్కడనుండి
వచ్చింది?
అని
విచారణ
చేయాలి.
‘ఈ
భూమి
నాది.
ఈ
భూమి
నాది’
అనుకున్నప్పుడు
ఆ
భూమిలో
పండిన
పంటంతా
నాదే
అవుతుంది
కదా!
సహజంగానే
ఇది
ఉంటున్నది.
అదే
విధంగా
‘యిది
నేను
చేస్తున్నాను’
అనుకుని
ఏ
కార్యమునైనా
చేస్తే
దాని
మంచిచెడ్డలు
నీవే
అనుభవించవలసివస్తుంది.
కనుక,
‘యిది
నాది’
అనుకోటంచేత
దానిలో
లభ్యమయ్యే
ఫలితమునుకూడను
మనము
‘నాది’
గానే
భావించుకొని
అనుభవించవలసివస్తుంది.
3
▾
Meaning
Keep
మన
సంకల్పములే
మన
సుఖదుఃఖములకు
మూలకారణము
నమస్కారము
అన్నారు.
అనగా
నేను
కానిది;
యిదే
నమస్కారము.
‘మమ’
నేను,
నాది;
‘న,
మమ’
అనగా
నేను
కాదు,
నాది
కాదు
అని
అర్థము.
యీ
‘మమ’
అని
పెట్టుకున్నంతవరకు
మనకు
దుఃఖమే!
కర్తృత్వభోక్తృత్వాదులతోకూడి
ఆచరించే
కర్మలన్నీ
మనకు
దుఃఖాన్ని
అందిస్తున్నాయి.
‘నేను’
అనేది
లేకుండా,
నీవు
నీ
కర్తవ్యమును
నెరవేర్చినప్పుడు
నీవు
హాయిగా,
శాంతిగా,
సుఖంగా,
సంతోషముగా
జీవిస్తూ
ఉండు.
నీవు
పట్టుకున్నదాంట్లో
ఉంటున్నాయి,
సుఖదుఃఖములు.
వదలిన
దాంట్లో
ఉంటున్నది,
ఆనందము.
ఈ
వదలటమే
‘త్యాగ’మన్నారు.
పట్టుకోటమే
‘బంధన’
అన్నారు.
ఈ
బంధన
ఎక్కడనుంచి
వస్తుంది?
ఒక
చిన్న
ఉదాహరణము.
మనసును
అనుసరించినవాడు
మానవుడు.
మనసునుంచి
వచ్చినవాడు
కనుకనే
‘మనిషి’
అన్నారు.
మనసు-మనిషి.
మనసునుండి
వచ్చినవాడు
మనిషి.
ఐతే
మనసుననుసరించినవాడు
మానవుడు,
ఆత్మను
అనుసరించినవాడు
దేవుడు.
ముందుది
మానవత్వము,
తరువాతది
దివ్యత్వము.
బంధన
మనకు
ఎక్కడ
వస్తున్నది?
మనసు,
యింద్రియములు
రెండింటిని
అనుసరించి
వాడు
బంధింపబడిపోతున్నాడు.
ఒక
చిన్న
ఉదాహరణము.
మీరు
యిక్కడ
ఉంటున్నారు.
అనంతపురంనుండి
ఒక
ఫోను
వచ్చింది.
అక్కడ
matter
ఉంది.
ఇక్కడ
యింద్రియము
ఉంది.
ఆ
matter
మన
యింద్రియానికి
సోకకుండా
ఉండినంతవరకు
ఆనందముతో
మన
కార్యక్రమములో
మనము
మునిగి
ఉంటున్నాము.
అక్కడనుండి
మంచివార్త
వచ్చిందంటే
ఆనందిస్తాము
లేక
చెడ్డవార్త
మన
చెవులకు
చేరిందంటే
బాధపడతాం!
ఈ
బాధకు,
ఆనందమునకు
యేమి
కారణము?
Matter
అనంతపురంలో
ఉంటున్నాది.
యింద్రియము
పుట్టపర్తిలో
ఉంటున్నాది.
ఆ
matter
ఈ
యింద్రియములు
రెండూ
చేరినప్పుడే
సుఖముకాని
దుఃఖముకాని.
మన
యింటినుండి
‘పెళ్లి
కుదిరింది’
అని
టెలిగ్రామ్
వచ్చిందంటే
ఎంతో
ఆనందిస్తాము.
యీ
ఆనందము
ఎక్కడనుండి
వచ్చింది?
4
▾
Meaning
Keep
తల్లితండ్రులనుండి.
ఈ
matter
ఎక్కడ
జరిగింది?
దూరంగా
ఉన్న
అనంతపురమునుండి.
కానీ,
మన
యింద్రియములకు
సోకింది.
అప్పుడే
ఆనందము
నీకు.
కనుక,
మనస్సు
యింద్రియములు
రెండూ
చేరినప్పుడే
నీకు
బంధన
కాని
విమోచనముకాని.
దీనిని
ఏదో
షాపులో
కొంటానికి
వీలు
కాదు.
స్నేహితులెవరు
బహుమతిగా
యివ్వరు
లేక
ఏదైనా
కంపెనీ
మనకు
సప్లై
చేయదు.
తల్లితండ్రుల
ఆస్తి
మాదిరి
మనకు
భాగాన్ని
పంచరు.
అన్నీ
మన
సంకల్పాలలోనే
ఉంటున్నాయి.
మన
సంకల్పములే
మన
సుఖదుఃఖాలకు
మూలకారణము.
దానినే
చెప్పారు,
‘మనయేవ
మనుష్యాణాం
కారణం
బంధమోక్షయోః’
అని.
మనసే
బంధనమునకు,
మోక్షమునకు
కారణమన్నారు.
మన
యింటి
తలుపుకు
తాళము
వేశాము.
తాళములో
చెవిని
పెట్టాము.
ఎడమవైపు
త్రిప్పితే
ఓపెను
అవుతుంది.
కుడివైపు
త్రిప్పితే
లాక్
అవుతుంది.
ఈ
విధంగా
లాక్కి
కాని
ఓపెనుకు
కాని
యేమి
కారణము?
తాళము
ఒక్కటే,
చెవి
ఒక్కటే!
కాని
త్రిప్పటము
మాత్రమే
తేడా!
మనస్సును
భగవంతునివైపు
త్రిప్పితే
డిటాచ్మెంట్;
ప్రపంచమువైపు
త్రిప్పితే
బంధన
మన
హృదయమే
తాళము,
మనస్సే
చెవి.
భగవంతునివైపు
త్రిప్పితే
డిటాచ్మెంట్.
ప్రపంచమువైపు
త్రిప్పితే
బంధన.
యీ
బంధన
మనకు
ఎక్కడనుంచి
వస్తుంది?
మీరే
యోచన
చేసుకోవచ్చు.
మీరు
యిప్పుడు
రెండు
కాళ్లతో
ఉన్నారు.
స్పీడుగా
నడిచిపోతున్నారు.
పరుగెత్తుతున్నారు
కూడా!
కానీ
అదే
పెండ్లి
అయినదంటే
నాలుగు
కాళ్లు.
నాలుగు
కాళ్లు
వచ్చేటప్పటికి
నీకు
స్వాతంత్ర్యము
తగ్గిపోయింది.
భర్త
కూర్చో
అంటే
కూర్చోవాలి.
ఆఫీసుకు
పోకూడదనుకుంటే
పోకుండా
ఉండాలి.
యీ
విధమైన
బంధన
యేర్పడుతుంది.
యీ
నాలుగు
కాళ్లతోనే
యింత
బంధన
యేర్పడితే
యింక
బిడ్డ
పుడితే
ఆరు
కాళ్లు
అయి
మరింత
బంధన.
వంట
రూములోకికూడ
స్వేచ్ఛగా
పోవటానికి
వీలుకాదు.
పడకగదిలోనికి
కూడను
స్వేచ్ఛగా
పోవటానికి
వీలుకాదు.
కారణం,
బిడ్డ
ఉంది.
ఆ
బిడ్డను
చూసుకోవాలి.
ఈ
విధంగా
కాళ్లు
అధికమయ్యేకొలది
నడవడం
స్పీడు
తగ్గిపోతుంది.
యిదే
బంధన.
యీ
బంధన
ఎక్కడనుంచి
వచ్చింది?
నీకై
నీవు
సంపాయించుకున్నదే
యిది!
5
▾
Meaning
Keep
His poems 384
Also in his talks
(19)
25 March 1980
The four brothers
9 January 1988
God in the heart, work in the hands
3 September 1988
The body itself is a temple!
1 January 1992
Only when the differences of the upādhis are removed does the principle of the one Ātma become our own
4 April 1992
Neither swelling with joy nor sinking in sorrow: winning equanimity is the aim of Ugādi
10 May 1992
Without a base substance no object takes on form and name
29 August 1992
Life is fulfilled only when one born saying ‘Koham’ attains the experience of ‘Soham’
22 September 1996
Though Forms and Names Differ, the Principle of Brahman Is One!
14 September 1997
The ideal of Bali Cakravarti
1 January 1998
Happiness and sorrow cannot be parted
9 July 1998
By God's Grace Anything Can Be Achieved
25 December 1998
Those Who Spread God's Prema Are the True Messengers of God
19 November 2000
Noble Sons Are Born Only When There Are Noble Resolves
18 November 2001
Man is the embodiment of Caitanya
11 April 2003
The ideal figures of the Rāmāyaṇa
13 April 2003
Make Your Parents Happy: That Is My Happiness
21 March 2004
I am you, you are I
23 August 2004
Do nāmasmaraṇa for peace of mind!
14 January 2005
When the heart is filled with Prema, life is filled with Ānanda
పెండ్లి
కావాలి,
పెండ్లి
కావాలి
అనే
నీ
వాంఛయే!
పెండ్లి
అయి
నాలుగు
కాళ్లు
అయినాయి.
అది
అయిన
తరువాత
‘మరి
నాకు
కొడుకు
కావాలి,
కొడుకు
కావాలి’
అనుకుంటే
కొడుకు
పుట్టినాడు.
ఆరు
కాళ్లు
అయినాయి.
యివి
కోరి
తెచ్చుకున్నవేగానీ
ఎవరైనా
తెచ్చి
పెట్టారా?
ఎవరూ
మనకు
యివ్వటం
లేదు,
బంధన.
ఎవరూ
మనల్ని
శిక్ష
పెట్టటం
లేదు.
మనకై
మనం
తెచ్చుకుంటున్నాం.
ఈ
బంధన
అనేది
ప్రాకృతమైనది
కాదు.
మన
వాంఛలే
మన
బంధన.
మన
వాంఛలు
తగ్గించుకోటమే
మనకు
స్వేచ్చ!
ప్రతి
విషయములో
కూడను
మంచి,
చెడ్డ
అనేది
జగత్తుతోకూడి
ఉంటున్నది.
ప్రపంచములో
ఎక్కడగానీ
చెడ్డ
లేకుండా
మంచి,
మంచి
లేకుండా
చెడ్డ
లేదు.
యివి
రెండూ
కలిసే
ఉంటున్నాయి.
కష్టసుఖములు
రెండును
కలసియుండు
వాని
విడదీయ
నెవరికి
వశముగాదు
సుఖము
ప్రత్యేకముగ
నెందు
చూడబోము
కష్టము
ఫలించెనేని
సుఖంబటండ్రు.
ఎప్పుడు
మనం
సుఖమంటున్నాము?
కష్టము
ఫలించేటప్పటికి
‘నేను
సుఖంగా
ఉన్నాను’
అంటున్నాము.
సుఖము
ఎక్కడనుంచి
వచ్చింది?
కష్టము
పోయినప్పుడే
సుఖం
వచ్చింది.
సుఖం
ఎప్పుడు
ప్రారంభమైంది?
కష్టము
పోయినప్పుడే
సుఖం
ప్రారంభమైంది.
సూర్యోదయమైంది,
పగలు
ప్రారంభమైంది.
సూర్యాస్తమయమైంది,
రాత్రి
ప్రారంభమైంది.
కానీ
రాత్రి,
పగలుకు
యిద్దరు
సూర్యులున్నారా?
లేదు.
ఒకే
సూర్యుడు.
ఒకటి
ఉదయము,
ఒకటి
అస్తమయము.
రెండు
బాధలమధ్యలోనే
ఒక
సుఖము
ఉంటున్నది
కష్టము
తీరినప్పుడే
సుఖం
ప్రారంభమవుతుంది.
సుఖం
తీరినప్పుడే
కష్టము
ప్రారంభమవుతుంది.
Pleasure
is
an
interval
between
two
pains.
రెండు
బాధల
మధ్యలోనే
ఒక
సుఖము
ఉంటున్నది.
సుఖము
రెండు
బాధల
మధ్యలో
ఉండినట్లుగా
కష్టముకూడను
రెండు
సుఖముల
మధ్యలో
ఉంటున్నది.
‘మోసంబి’,
‘సాత్కుడి’
అంటారు.
6
▾
Meaning
Keep
సాత్కుడిపైన
చేదు
చర్మము
ఉంటున్నది.
లోపల
పీచు,
విత్తనాలంతా
ఉంటున్నాయి.
ఈ
రెండింటికి
మధ్యలోపలనే
తీపి
రసము.
చూశారా!
పైన
యీ
చెడ్డ
తొక్క
ఎందుకుండాలి?
భగవంతుడు
ఎందుకిలా
చేయాలి?
నిజంగా
చేదు
చర్మమే
పైన
కప్పకపోతే
లోపల
ఉన్న
తీపికి
విలువ
ఉండదు.
తీపి
ప్రసక్తే
లేదు.
పైన
చేదు
చర్మం
కప్పటంచేతనే
తీపికి
రక్షణగా
ఉంటున్నది.
కష్టాలు,
నష్టాలు,
దుఃఖాలు,
నిందలు,
నిష్టూరములు
యివన్నీ
మన
రక్షణకోసం
వచ్చినవే!
యివి
చెడ్డవి
కాదు.
బాధలు
కాదు.
మనం
ఆ
విధంగా
భావించకూడదు.
కష్టము
వచ్చిందంటే
యీ
కష్టంకూడా
సుఖంకోసమనే!
ఏదో
సుఖం
ఉంది
దీంట్లో.
ఆ
విధమైన
ఉత్సాహముతో
సంతోషముతో
వాటిని
ఎదుర్కొనటానికి
మనం
ప్రయత్నించాలి.
‘కష్టం
వచ్చింది,
కష్టం
వచ్చింద’ని
మనం
కుమిలిపోకూడదు.
కష్టం
వెనుక
యింకో
సుఖముంది.
ఏదో
సుఖంకోసమే
ఈ
కష్టం
వచ్చింది.
భగవంతుడు
ముళ్లచెట్టు
యిచ్చాడు.
పళ్లచెట్టు
యిచ్చాడు.
పండ్లచెట్లచుట్టూ
ముళ్లచెట్టును
ఒక
కంచెమాదిరి
కట్టుకుందుకు
యిచ్చాడు.
ముళ్లచెట్టును
కంచె
మాదిరి
కట్టుకుంటే
చుట్టూ
రక్షణ
మాదిరి
ఉంటుంది.
ఈనాడు
ముళ్లచెట్టు
ఏదో,
పళ్లచెట్టు
ఏదో
తెల్సుకోలేక
పళ్ల
చెట్టును
కంచెమాదిరి
పెట్టుకుంటున్నాడు,
మానవుడు.
దానివల్లనే
ముళ్లతో
బాధ
పడుతున్నాడు.
మనం
ముళ్ల
చెట్టును
కంచె
మాదిరి
కట్టుకోవాలి.
దానిని
పళ్ళచెట్టుయొక్క
రక్షణకోసం
ఉపయోగించాలి.
చెఱకు
ఉంటున్నది.
దానిలోపల
తియ్యని
రసం
ఉంది.
ఆ
రసాన్ని
మనం
తీయాలంటే,
రసాన్ని
మనం
గ్రోలాలంటే
ఏమి
చెయ్యాలి?
చెఱకును
బాగా
నమలాలి.
ఆ
నమిలి
పిప్పిని
పారవేసి
జ్యూస్‌ను
త్రాగాలి.
అప్పుడే
ఆ
స్వీట్
జ్యూస్
మనకు
ఆనందాన్ని
యిస్తుంది.
లేకుండా
చెఱకు
గట్టిగా
ఉంది
ఎలా
రసం
తాగేది
అని
నోట్లో
పెట్టుకుంటే
బెండుబారిపోతుంది.
దాన్ని
నమలాలి,
రసం
తియ్యాలి,
త్రాగాలి.
ఈ
బాధలన్నిటికీ
గురి
అయినపుడే
చెఱకునుండి
మనకు
ఆ
స్వీట్
జ్యూస్
లభిస్తుంది.
అలాగే
సంసారమునందు
చేరినవారుకాని,
సంసారమునందు
చేరబోయే
వారుకాని
‘సంసారం
ఒక
బాధ’
అని
భావించకూడదు.
ఇందులో
అనుభవం
కావాలి.
ఇది
ఒక
పరిశోధనా
గ్రంథంగా
తీసుకోవాలి.
సంసారం
అనుభవం.
గ్రంథాన్ని
చదవకపోయినా,
ఆ
సంసారంలో
మనం
అనుభవించే
దానిలో
చక్కని
పాఠం
నేర్చుకోవాలి.
‘అత్తగారితో
ఏ
రీతిగా
ఉండాలి,
ఆడబిడ్డలతో
ఏ
రీతిగా
ఉండాలి?
7
▾
Meaning
Keep
భర్త
దగ్గర
ఏ
రీతిగా
ఉండాలి?
తోటికోడళ్లతో
ఏ
రీతిగా
ఉండాలి?
మరుదులతో
ఎలా
ఉండాలి?’
ఇవన్నీ
ఒక
చదువు
క్రిందనే
ఉండాలి.
ఇదంతా
పరిశోధనలే!
ఈ
పరిశోధనలతో
ఈ
పరమ
పవిత్రమైన
సారం
మనకు
లభ్యమవుతుంది.
కనుక,
సంసారం
కష్టం
కాదు.
బిడ్డలు
కష్టం
కాదు.
బాధలని
అనుకోకూడదు.
ఈ
పరిశోధనలో
మన
లక్ష్యాన్ని
మనం
వదలకూడదు.
దైవలక్ష్యాన్ని
మనసులో
పెట్టుకోవాలి!
మనలో
దైవవిశ్వాసమనే
ఫిలమెంట్
ఎంత
పవర్ఫుల్
వోల్టేజిలో
ఉంటుందో
మన
జీవితం
అంత
బ్రైట్‌గా
ఉంటుంది
లోకంలో
ఎంతమందో
చదువుకున్నవాళ్లుంటారు.
ఒక
చిన్న
ఉదాహరణము.
మీ
భర్త
గొప్ప
విద్యావంతుడై
ఉండచ్చు.
అత్తమామలకు
కావలసినంత
ధనముంది,
ఆస్తి
ఉంది.
తల్లితండ్రులుకూడా
సిరిసంపదలు
కల్గినవారై
ఉంటారు.
కాని,
మీ
బిడ్డకేదైనా
జబ్బు
చేస్తే
అత్తమామలు
రక్షిస్తున్నారా?
భర్త
రక్షిస్తున్నాడా?
ఈ
సైంటిస్టు
రక్షిస్తున్నాడా?
ఈ
అనుభవములు
రక్షిస్తున్నాయా?
అప్పుడు
‘ఓ
దేవుడా?’
అని
దేవుని
ప్రార్థిస్తున్నారు.
కనుక
అందరిని
రక్షించేది
దేవుడే!
ఎంత
ధనవంతులైనా
అత్తమామలు
రక్షించలేరు.
వాళ్లుకూడా
పక్కన
చేరి
ఏడుస్తారు.
అమ్మ,
నాన్న
ఎంత
శ్రీమంతులైనా
వాళ్లుకూడా
పక్కన
వచ్చి
ఏడుస్తారు.
అంతేకాని,
రక్షించేవాడు
భగవంతుడే!
‘నా
భర్త
గొప్ప
విద్యావంతుడులే!
సైంటిస్టులే!
మా
అత్తమామలంతా
గొప్ప
శ్రీమంతులే!’
అని
వారిపైన
ఆధారపడలేవు.
వాళ్లు
శ్రీమంతులు
కావచ్చు.
లౌకిక
సుఖాలివ్వవచ్చునేకాని,
జీవితమును
యివ్వలేరు.
జీవితమును
మనం
ఒక
ఛాలెంజ్‌గా
తీసుకోవాలి.
ఆ
విధంగా
మనం
కష్టాలను,
నష్టాలను
అన్ని
విధాల
ఎదుర్కొని,
చక్కని
రీతిలో
భక్తి
ప్రపత్తులతో
జీవితాన్ని
సాగిస్తూ
పోవాలి.
అప్పుడే
మనం
సరియైన
విద్యను
నేర్చుకున్నవారమవుతాము.
చదువుకున్నాము;
ఏమి
చదువుకున్నాము?
ఏదో
గ్రంథాలు
చదువుకున్నాము.
ఫిజిక్సు,
కెమిస్ట్రీ,
బోటనీ,
జువాలజీ,
మేథమెటిక్సు
యివన్నీ
సబ్జక్ట్సు
కాని,
ఆబ్జక్ట్స్
కాదు.
సబ్జక్ట్,
ఆబ్జక్ట్
రెండూ
చేరినపుడే
దాంట్లో
అనుభవము
మనకొస్తుంది.
నెగెటివ్
ఉంటుంది.
పోజిటివ్
ఉంటుంది.
పోజిటివ్
మంచి
పవర్‌ఫుల్‌గా
ఉంటుంది.
8
▾
Meaning
Keep
కాని
నెగెటివ్
కండిషిన్లో
ఉండకపోవచ్చు.
ఈ
రెండూ
చేరినపుడే
లైట్
వస్తుంది.
మన
జీవితాలన్నీ
బల్బులవంటివి.
కాని
యీ
బల్బులలో
ఫిలమెంటు
అని
ఉంటుంది.
ఇది
ఎంత
పవరు
కలిగి
ఉంటుందో
అంత
వెలుగే
మనకు
కన్పిస్తుంది.
ఏమంటారు?
అది
40,
60,
100,
500
వోల్టులు
ఉండవచ్చు.
అది
బల్బులో
ఉంటుంది.
కరెంటులో
లేదు.
బెడ్రూము
బల్బు
డిమ్‌గా
ఉంటుంది.
డ్రాయింగ్
రూమ్
బల్బు
బ్రైట్‌గా
ఉంటుంది.
ఈ
బ్రైట్నెస్
మరియు
డిమ్నెస్
బల్బులయొక్క
వ్యత్యాసమేకాని,
కరెంటుయొక్క
వ్యత్యాసం
కాదు.
కాబట్టి
మనలో
ఆ
విశ్వాసమనే
ఫిలమెంట్
ఎంత
పవర్ఫుల్
వోల్టేజిలో
ఉంటుందో
మన
జీవితం
అంత
బ్రైట్‌గా
ఉంటుంది.
దైవవిశ్వాసమే
లోకాన్ని
రక్షిస్తుంది
దైవవిశ్వాసమనేదే
లోకాన్ని
రక్షిస్తుంది.
ఎలాంటివారైనా,
నాస్తికులైనా,
ఆస్తికులైనా,
ఆస్తిక
నాస్తికులైనా,
కమ్యూనిష్టులైనా,
అందరికీ
లోపలమాత్రం
లైటు
అనే
భీతి
ఉంటుంది.
ఆ
భీతిలేకుండా
ఎవరూ
జీవించటానికి
లేదు.
మీ
కందరికీ
తెలుసు
70
సం॥లు
ఏకచ్ఛత్రాదిపత్యముగా
ఏలినారు,
కమ్యూనిష్టులు
రష్యాలో!
దేవుడు
లేడు,
అది
లేదు,
యిది
లేదు
అన్నారు.
కాని
కట్టకడపటికేమైపోయింది?
దేశము
ఛిన్నాభిన్నమై
పోయింది.
తినడానికి
తిండిలేక
ఒకరినొకరు
కొట్టుకున్నారు.
కనుక
ఎప్పుడూ
దైవవిశ్వాసం
ఉండాలి.
ప్రతీ
మానవునియందు
ఉత్సాహము
ఉంది.
ఏ
పని
చెయ్యటానికైనా
మనం
సిద్ధంగా
ఉండాలి.
మీకు
తెల్సు.
అమెరికా,
రష్యా,
జర్మనీ,
జపాన్
దేశాలలో
వస్తూత్పత్తి
బాగా
జరిగింది.
ముఖ్యముగా
జపాన్‌లో
వేగిరముగా
ఉత్పత్తి
చేస్తున్నారు.
చాలా
స్పీడుగా
ఉత్పత్తి
చేస్తారు.
కారణం
ఏమిటి?
వాళ్లకు
పని
ఉత్సాహము.
రాత్రింబవళ్లు
కష్టపడి
పని
చేస్తారు.
సాయంకాలం
ఆఫీసునుండి
వచ్చాక
మళ్లీ
యింకో
చోటికి
పోయి
ఎక్కువ
పని
చేస్తారు.
ఆ
పని
ఉత్సాహము
మూలంగా
ఉత్పత్తి
అధికమైపోతుంది.
ఈ
ఉత్పత్తి
అధికమవటంవల్ల
పదార్థముల
ధర
తగ్గిపోతుంది.
ఇది
సహజం
కదా!
మార్కెట్లో
ఏ
పదార్థం
ఎక్కువగా
ఉంటే
దాని
ధర
తగ్గిపోతుంది.
ఈనాడు
భారతదేశములో
ఉత్పత్తి
తక్కువ
కావటంవల్లనే
పదార్థముయొక్క
విలువ
ఎక్కువైపోయింది.
9
▾
Meaning
Keep
ఈ
పదార్థముల
ధరలను
తగ్గించాలంటే
మనం
ఏమి
చేయాలి?
ఉత్పత్తిని
ఎక్కువ
చెయ్యాలి.
మరొక
విషయం.
బంగారాన్ని
ఎవరు
కొంటున్నారు?
మనుషులే
కొంటున్నారు.
రత్నాలని
ఎవరు
కొంటున్నారు?
మనషులే
కొంటున్నారు.
అన్ని
వస్తువులకు
విలువ
యిచ్చే
మనిషియొక్క
విలువ
ఈనాడు
తగ్గిపోయింది
ఈ
రత్నాలకు,
బంగారుకు,
వెండికి
విలువ
ఇచ్చేవారు
ఎవరు?
మనిషి
విలువ
యిస్తున్నాడు.
కాని,
అన్నింటికీ
విలువ
యిచ్చే
మనిషియొక్క
విలువ
యీనాడు
తగ్గిపోయింది.
ఇందుకు
భిన్నంగా
వస్తువుల
విలువ
పెరిగింది.
బాగా
యోచన
చేయండి.
మనిషి
విలువ
మనం
పెంచగలిగితే
పదార్థాల
విలువ
తగ్గుతుంది
మీకంతా
తెలుసు
పిల్లలూ!
‘సీసా’
అని
ఒక
ఆట
ఆడతారు.
అందులో
ఒక
ప్రక్క
పదార్థములు,
ఒక
ప్రక్క
మనిషి
ఉంటే.
మనిషి
విలువ
తగ్గిపోయేటప్పటికి
పదార్థము
విలువ
పెరిగిపోతుంది.
పదార్థం
విలువ
తగ్గిపోయేటప్పటికి
మనిషి
విలువ
పెరుగుతుంది.
కనుక
ఈనాడు
మనిషి
విలువ
పెంచుకోవాలి?
ఎందుకంటే
మనిషే
చాలా
ముఖ్యమైనవాడు.
Men
are
more
valuable
than
all
the
wealth
in
the
world.
ఈ
ప్రశాంతినిలయం
చుట్టూ
జనాలంతా
ఎక్కువగా
ఉండటం
చేత
ఒక
సెంటు
భూమియొక్క
ధర
10,000
రూపాయలు.
చూశారా?
ఒక
ఎకరా
ఒక
కోటి
అవుతుంది.
కారణం
ఏమిటి?
జనాలు
ఎక్కువగా
ఉండటంవల్ల
స్థలం
విలువ
పెరిగిపోయింది.
అదే
యింకో
పల్లె
దగ్గరకు
పోయి
చూస్తే
ఒక
ఎకరా
10
వేల
రూపాయలకిస్తారు.
ఇక్కడ
ఒక
సెంటు
10
వేలు
అయితే,
అక్కడ
ఒక
ఎకరా
10
వేలుకి
తగ్గిపోయింది.
కారణమేమిటి?
మనుషుల్లేరు.
మనుషులెక్కడ
ఉంటారో
అక్కడ
విలువలంతే!
ఆ
విలువలతోపాటు
దాని
నీడ
అంటే
అజ్ఞానంకూడా
పెరిగిపోతుంది.
మనం
ఎక్కడికి
పోయినా
మన
నీడ
మన
వెంటనే
వస్తుంది.
నీడను
ఆపుచేసి
మనం
ముందుకు
పోవడానికి
వీలు
కాదు.
మనం
రియాలిటీ
అయితే
మన
నీడ
రిఫ్లెక్సన్.
మన
వెంటనే
reaction,
reflection,
resound
అన్నీ
వస్తుంటాయి
కనుక,
మనం
మంచి
సౌండ్
చేస్తే
రీసౌండ్కూడా
మంచిది
వస్తుంది.
ఒక
కొండ
దగ్గరకు
పోయి
‘ఓ’
అని
పిలిస్తే
ఆ
కొండకూడా
‘ఓ’
అంటుంది.
రీసౌండ్
మనం
చేసే
సౌండ్మీద
ఆధారపడి
ఉంటుంది.
ఇక
రిఫ్లెక్షన్.
10
▾
Meaning
Keep
మనం
అద్దం
ముందుకు
పోయి
నమస్కారం
చేస్తే
ప్రతిబింబంకూడా
మనకు
నమస్కారం
చేస్తుంది.
ఆ
ప్రతిబింబాన్ని
నీవు
దండిస్తే
అది
కూడా
నిన్ను
దండిస్తుంది.
‘యద్భావం
తద్భవతి’.
మనం
ఆనందంగా,
సుఖంగా,
శాంతిగా
జీవించాలనుకుంటే
ముందుగా
మనం
మనశ్శాంతితో
జీవించాలి
మంచిచెడ్డలంతా
మనలోనే
ఉంటున్నాయి.
మన
నడతలలోనే
ఉంటున్నాయి.
అంతా
మనలోనే
ఉంటుంది.
కనుక
మనం
ఆనందంగా,
సుఖంగా,
శాంతిగా
జీవించాలనుకుంటే
మనం
మొదట
మనశ్శాంతితో
ఉండాలి.
మనలో
అశాంతి
ఉంటే
మనం
యింకొకరికి
ఏ
విధంగా
శాంతి
యివ్వగలం?
ఇవ్వటానికి
వీలు
కాదు.
కనుక
మొట్టమొదట
మనం
శాంతితో
ఉండాలి.
వ్యక్తిగతంగా
ఏవో
కొన్ని
కష్టాలుంటాయి.
‘నా
కష్టాన్నింకా
పదిమందికి
నేనెందుకు
పంచాలి?’
అని
తన
కష్టాన్ని
తనలో
యిముడ్చుకోవాలి.
ఇంతే
కాకుండా
కొంతమంది
పిల్లలకి
చెడ్డ
ఆలోచనలు
వస్తుంటాయి.
ఆ
వయస్సు
అలాంటిది.
చెడ్డ
ఆలోచనలు
వచ్చినప్పుడు
దానినెలా
నేను
కంట్రోల్
చేసుకోవాలి?
అని
బాధపడతారు.
మీరు
కంట్రోల్
చేయనక్కరలేదు.
విచారణ
చేస్తే
చాలు.
అదే
పరుగెత్తి
పోతుంది.
ఎలా
విచారణ
చేయాలి?
‘నాలో
ఈ
చెడ్డ
ఆలోచన
వచ్చింది.
నేను
పశువును
కాను,
మనిషిని.
చెడ్డను
చేర్చుకుందుకు
నేను
పశువును
కాను.
ఇదంతా
పశువుల
ఆలోచన.
నేను
పశువును
కాను,
నేను
మానవుడను,
నేను
మానవుడను’
అని
అనుకుంటే
అవి
పరుగెత్తిపోతాయి.
‘నేను
పశువును
కాను’
అనుకుంటే
యీ
చెడ్డ
భావాలంతా
పరుగెత్తిపోతాయి.
దీన్ని
ఆ
రకంగా
మనం
కంట్రోల్
చెయ్యాలి.
ఆలోచనలు
వచ్చిన
తక్షణమే
క్రియలో
పెడితే
అయిపోయింది.
ఇది
మంచా?
చెడ్డా?
ఇది
తప్పా?
తప్పు
కాదా?
అనే
విచారణకు
చోటివ్వండి.
ఆ
విచారణ
చేస్తుంటే
లోపల
యీ
ఆలోచనయొక్క
తీవ్రత
తగ్గిపోతుంది.
మానవత్వంలో
ఉన్న
బలహీనత,
ఎప్పుడూ
చెడ్డకే
మనం
చోటు
యిస్తుంటాము.
మంచికి
చోటియ్యము.
మనం
హోస్టల్లోకాని,
యింట్లోకాని
భోజనం
చేస్తుంటాము.
ఈ
భోజనం
చేసేటప్పుడు
ఎన్నో
మెతుకులు
లోపలికి
పోయాయి.
11
▾
Meaning
Keep
ఎన్ని
మెతుకులు
లోపలికి
పోయాయి
ఒకటి,
రెండు,
మూడు
అని
లెక్క
వెయ్యము.
కాని,
ఒకటి
రెండు
రాళ్లు
మన
పంటికిందికి
వచ్చాయంటే
‘అన్నంలో
అంతా
రాళ్లున్నాయి’
అని
కంప్లెయింటు
చేస్తాము.
యిది
మన
బలహీనత.
చెడ్డకు
మనం
ఎక్కువ
చోటిస్తున్నాము,
మంచికెక్కువ
చోటివ్వటం
లేదు.
కనుకనే
మనలో
ఏదైనా
చెడ్డ
ఆలోచన
వచ్చినప్పుడు
మనం
యీ
మంచిని
స్మరించుకుని
దానియొక్క
స్పీడు
తగ్గించుకోవాలి.
ఆ
విధంగా
మనం
చేస్తూపోతే
మనం
మన
జీవితాన్ని
ఎంతైనా
ఆదర్శవంతంగా
దిద్దుకోవచ్చు.
ఏదో
మనకు
కష్టాలు
కల్గుతూ
ఉంటాయి.
దానిని
మనం
కేర్
చేయకూడదు.
ఒకవేళ
కేర్
చేసినా
నీలో
నువు
పెట్టుకో!
బయటకు
చెప్పి
యింకొకరికి
నీవు
అశాంతిని
అందించకు.
ఇలాంటివి
నేర్చుకోవాలి
మనం.
మీరున్నారు,
అత్తగారింటికి
పోతారనుకోండి!
అత్తగారింట్లో
ఏదో
కోపం
వచ్చి
అత్త
నిన్ను
తిడుతుందనుకోండి!
ఎందుకంటే
యీనాడు
నీవు
కోడలు.
ఆమె
నీకు
అత్త.
ఇంకా
కొన్ని
సంవత్సరాలవుతే
నీవుకూడా
అత్త
అవుతావు.
ఈనాడు
నిన్ను
తిట్టే
అత్తకూడను
పూర్వం
ఒకింటి
కోడలే!
ఆ
సత్యాన్ని
మనం
గుర్తించాలి.
మరి
యీనాడు
అత్త
నన్ను
తిడుతుంటే
నేనెంతో
బాధపడుతున్నాను.
‘నేను
అత్త
అయినపుడు
నా
కోడలుని
తిడితే
ఆమె
కూడా
అంత
బాధపడ్తుంది
కదా!’
అని
యీ
రకమైన
ఆలోచన
చేసి
చూశారా?
ఆ
విధంగా
అలోచించినప్పుడు
మిమ్మల్ని
మీరు
ఎంతైనా
కంట్రోల్
చేసుకోవచ్చు.
అంతే
కాకుండా
అత్త
మిమ్మల్ని
తిట్టినదని
అలా
తిడ్తోంది,
ఇలా
తిడ్తోంది
అని
ఇంటికి
జాబు
వ్రాయకూడదు.
మీరు
పుట్టింటికి
పోయినపుడుకూడా
తల్లిదండ్రులకు
ఈ
విషయం
చెప్పకూడదు.
ఎందుకంటే,
వాళ్లు
‘ఏదో
నా
బిడ్డ
బాగా
ఆనందంగా
ఉంది’
అని
ఆనందిస్తున్నారు.
నీ
కష్టాన్ని
నువ్వు
పడటమే
కాకుండా,
తల్లితండ్రులకు
చెప్తే
వారుకూడా
బాధపడుతారు.
కనుక,
వారిని
బాధ
పెట్టకూడదు.
ఈనాడు
మనం
మన
తల్లిదండ్రులను
గౌరవిస్తే
రేపటిదినం
మన
పిల్లలు
మనల్ని
గౌరవిస్తారు
‘మాతృదేవో
భవ’
అన్నారు.
మన
కంటికి
కన్పించే
దేవుళ్ళు,
మన
తల్లిదండ్రులు.
మన
కష్టాలను
తీర్చేవారు,
మనను
సాకి
సంరక్షించేవారు,
తల్లిదండ్రులు.
12
▾
Meaning
Keep
భగవంతుడు
మన
కంటికి
కన్పించటం
లేదు.
కన్పించేవారిని
పూజించటంలో
ఉండే
భక్తి
వేరు.
మొట్టమొదట
కనిపించేవారిని
గౌరవించాలి.
రాముడుకూడా
సీతకు
చెప్తాడు,
‘సీతా!
మనను
సాకినవారెవరు?
తల్లిదండ్రులు.
నిన్ను
యీ
పరిస్థితికి
తెచ్చినవారెవరు?
తల్లిదండ్రులు.
కనుక,
మొట్టమొదట
వారే
నీ
దేవుళ్లు.
ఆ
తల్లిదండ్రులు
అనే
దేవతలను
నీవు
పూజిస్తే
కనిపించని
దేవుడుకూడా
నీకు
కన్పిస్తాడు.’
ఈనాడు
కనిపించని
దేవుని
నీవు
పూజిస్తున్నావు,
కనిపించేదానిని
నిర్లక్ష్యం
చేస్తున్నావు.
ఏమి
ప్రయోజనం?
కనుక
కన్పించిన
దానిని
మొట్టమొదట
గౌరవించాలి.
మన
తల్లిదండ్రులు
మనకెంతో
యిచ్చారు.
నీ
blood,
నీ
food,
నీ
head
నీ
parent's
gift.
కనుక,
మొట్టమొదట
తల్లిదండ్రులకు
గౌరవం
యివ్వాలి.
అది
మన
కర్తవ్యం.
ఈనాడు
మనం
మన
తల్లిదండ్రులకు
తగిన
గౌరవాన్ని
యిస్తే
రేపటిదినం
మన
పిల్లలు
మనకు
అదే
గౌరవాన్ని
యిస్తారు.
ఈనాడు
నీ
తల్లిదండ్రులకు
నీవు
కంటినీరు
నింపితే
రేపటిదినం
నీ
బిడ్డలు
నీకు
కంటినీరు
నింపుతారు.
చూశారా!
కనుక,
మంచిగా
తల్లిదండ్రులను
ప్రేమించండి.
తల్లిదండ్రులను
గౌరవించండి.
వారికి
ఆనందాన్ని
అందించండి.
తర్వాత,
కోడళ్ళున్నారు
కదా!
మీ
అత్తమామల్ని
గౌరవించండి.
ఎందుకంటే,
మీ
భర్తలు
వారినుంచి
వచ్చారు.
ఆ
భర్తకోసం
నీవెంతో
బాధపడ్తున్నావు.
కాని
ఆ
భర్త
ఎక్కడినుండి
వచ్చాడో
వారినికూడా
మనం
గౌరవించాలి.
వాళ్ళేమైనా
అనుకోనీ,
నీ
మనసును
హింసించనీ!
వాళ్లను
గౌరవించు.
తప్పక
నీవు
విజయాన్ని
సాధిస్తావు.
తప్పక
నీకు
మంచి
జరుగుతుంది.
ఏనాటికైనా
నిన్ను
బాధించే
అత్తమామలు
నిన్ను
గౌరవిస్తారు.
ముఖ్యంగా
మన
ఇన్స్టిట్యూట్లో
చదివే
పిల్లలు
వివాహం
చేసుకుంటే,
‘అయ్యో!
సత్యసాయి
ఇన్స్టిట్యూట్నుండి
వచ్చిన
పిల్ల!
చాలా
మంచి
పిల్ల!’
అని
ఆ
కట్టుకున్నవారి
నోటినుండి
రావాలి.
అత్తమామలు
కూడా
‘అయ్యో!
ఆ
ఇన్స్టిట్యూట్
బిడ్డలంటే
చాలా
మంచి
పిల్లలు’
అని
పేరు
సంపాదించాలి.
అదే
నాకు
కావాలి.
మాకేమి
వద్దు!
మీరు
మంచి
పేరు
తెచ్చుకోవాలి.
‘మంచి
బిడ్డ’
అని
మీరు
పేరు
తెచ్చుకుంటే
అదే
స్వామికి
సంతోషము.
స్వామికి
మీరేమి
యివ్వనక్కరలేదు.
‘ఈ
ఇన్స్టిట్యూట్లో
చదివే
పిల్లలు
చాలా
మంచి
పిల్లలు’
అనే
పేరు
సంపాదించాలి.
అదే
మీరు
స్వామికి
యివ్వవలసిన
కృతజ్ఞత.
అవకాశం
ఉంటే
సమాజసేవలో
పాల్గొనండి.
13
▾
Meaning
Keep
బాధలేమైనా
కల్గినపుడు
మనసులో
స్మరించుకోండి.
మనసులోనే
మీరు
మంచిని
అభివృద్ధిపరచుకోండి!
ఈ
విధంగా
ఉన్నపుడు
మీ
జీవితం
ఆదర్శజీవితమవుతుంది.
అదే
ముఖ్యము.
మీరందరూ
మంచిపేరు
తెచ్చుకోవాలనేదే
స్వామి
కోరిక!
ఈనాడు
ఆదర్శజీవితము
అనేది
దేశంలో
లేకపోవటంచేత
దేశము
అన్ని
విధాలా
నష్టపోతున్నది.
పెద్ద
పెద్ద
లీడర్లంతా
యూనిటీ,
యూనిటీ
అని
అరుస్తున్నారు,
ఉపన్యాసాలిస్తున్నారు.
ఎక్కడుంది
యూనిటీ?
ఆ
పార్టీపై
యీ
పార్టీ,
యీ
పార్టీపై
ఆ
పార్టీ
ఒకరినొకరు
తిట్టుకోవటం,
కొట్టుకోవటం!
ఇంక
యూనిటీ
ఎక్కడినుండి
వస్తుంది?
మన
వాళ్లంతా
ఎక్కడికి
పోయినా
యూనిటీ
సంపాదించాలి.
మీరు
చూశారు,
ఫ్లూట్
ఉంది
కదా!
కృష్ణుడు
ఊదుతాడు.
ఈ
ఫ్లూట్‌లో
ఏదైనా
అడ్డం
వస్తే
మంచి
స్వరం
యివ్వదు.
రంధ్రం
క్లియర్‌గా
ఉన్నప్పుడే
చక్కగా
మంచి
స్వరం
వస్తుంది.
విషయవాసనలు,
కామ,
క్రోధములు,
అసూయ,
ద్వేషము,
అభిమానము,
మమకారం
యిలాంటివేమైనా
దేహమనే
ఫ్లూట్‌లో
చేరితే
ఆ
ఫ్లూట్
ఏమైపోతుంది?
యీ
శరీరమే
ఒక
ఫ్లూట్.
ఫ్లూట్కి
నవరంధ్రాలున్నట్లుగా
మన
దేహానికికూడా
నవరంధ్రాలున్నాయి.
మన
ఉచ్ఛ్వాస
నిశ్వాసములే
ఆ
కృష్ణునియొక్క
శ్వాస.
సో-హం,
సో-హం.
అదే
భగవత్తత్త్వం.
మనం
చేసే
పనులు
సక్రమమైన
పనులుగా
ఉంటే
మంచి
సుస్వరమైన
గానం
వినిపిస్తుంది.
అలాంటి
గానంతో
ఎలాంటివాడైనా
ఆనందాన్ని
అనుభవిస్తాడు.
మన
శ్వాస
భగవత్
శ్వాసగా
భావించుకోవాలి.
మన
దేహమే
ఒక
ఫ్లూట్‌గా
తీసుకోవాలి.
ఇదే
ఆదర్శజీవితం.
ఈ
గానాన్ని
మనం
విన్పిస్తుంటే
లోకమంతా
తన్మయత్వం
పొందుతుంది.
ఉన్మత్తమైపోతుంది.
పవిత్రమైన
ఆత్మతత్త్వాన్ని
అనుభవిస్తుంది.
కనుక,
మీరంతా
సాధ్యమైనంతవరకూ
చక్కని
పేరు
తెచ్చుకోండి.
కన్న
తల్లిదండ్రులకు,
కట్టుకున్న
భర్తకు,
అత్తమామలకు
మంచి
పేరు
తెండి.
అదే
నా
కోరిక!
నా
కోరిక
అదొక్కటే!
మీరు
మంచి
పేరు
తెచ్చుకోండి!
ఎక్కడైనా
మీరుండండి,
స్వామి
మీ
వెంటనే,
జంటనే
ఉంటున్నాడు.
Previous
←
The divinity all religions teach is one!
Next
Purity - The Path To Divinity
→