Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1996 · Hold on to Truth Under All Circumstances
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Hold on to Truth Under All Circumstances
13 July 1996, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His poems 431
Also in his talks
(2)
25 June 1996
Man's Own Conduct Is the Cause of His Joys and Sorrows
31 May 1998
The Oneness of Mind, Word and Deed Is Humanness
మనసులోనున్న
భావంబు
మంచిదైన
కలిగి
తీరును
ఫలసిద్ధి
కార్యమందు
మనసులో
నున్న
భావంబు
మలినమైన
ఫలము
కూడను
ఆరీతి
మలినమగును.
సాధుజనుల
జూచి
చౌక
చేతురు
వారికేమి
కొదువ
వసుధయందు
కుంజరమును
జూచి
కుక్కలెన్నో
మొరుగు
దానికేమి
కొదువ
ధరణియందు.
విద్యార్థులారా!
ఈనాడు
యావత్ప్రపంచమందు
అసూయ,
అహంకారము
మితిమీరి
పెరిగిపోయినాయి.
క్లాసులో
ఎవరికైనా
1st
class
వస్తే
వారిని
చూచి
మిగిలిన
పిల్లలు
అసూయపడుతుంటారు.
ఎవరైనా
పుష్టిగా
సంతుష్టిగా
ఉండినప్పుడు
వారిని
చూచి
మిగిలినవారు
అసూయపడుతుంటారు.
శ్రీమంతుని
జూచి
దరిద్రులు
అనేక
విధములుగా
ఆపోహలు
పడుతుంటారు.
అదేవిధముగా
పక్షులందు
హంసను
చూచి
కొంగలు
పరిహాసిస్తాయి.
కోకిలకూతను
కాకులు
కర్ణకఠోరముగా
భావిస్తాయి.
లోకులు
కాకులు.
దీనికి
మనము
వెరువక
మన
సత్యముపై
ఆధారపడి
జీవితమును
సరియైన
మార్గములో,
సక్రమమైన
మార్గములో
నడపుకోటానికి
తగిన
కృషి
చేయాలి.
ఏనుగు
తన
గంభీరమైన
నడకలో
దేనిని
లెక్క
చేయక
బజారున
వెడుతూ
ఉంటుంది.
ఎన్ని
కుక్కలు
మొరిగినా
ఏమాత్రము
లెక్కచేయదు.
ఏనుగు
ఎక్కడ
కుక్కలు
ఎక్కడ?
పోలికే
లేదు.
అదేవిధముగా
కోకిల
ఎంతో
సుస్వరముతో
గానము
చేస్తుంది.
కాకుల
కూతలను
వెరచి
కోయిల
తన
గానము
మానుతుందా?
కాని
ఈనాటి
మానవలోకమందు
మన
మంచిని,
మన
అభివృద్ధిని,
మన
సంక్షేమమును,
మన
పవిత్రతను
గుర్తించి
అనేకమంది
అసూయ
పడవచ్చు.
కాని
మనలో
భావములు
మనము
పరిశుద్ధము
చేసుకోవాలి
గానీ
ఇతరుల
భావములకు
ఏవిధముగాను
లొంగకూడదు.
కృంగకూడదు.
‘మనసులో
నున్న
భావంబు
మంచిదైన
కలిగి
తీరును
ఫలస్సిద్ధి
కార్యమందు’.
మన
యందున్న
భావములు
పరిశుద్ధముగా
ఉండేలా
చూచుకోవాలి
గానీ
యితరుల
దానిని
బట్టి
మన
భావములు
ఏమాత్రము
మార్చుకోకూడదు.
2
▾
Meaning
Keep
మన
భావము
ఎట్టిదో
ఫలితము
అట్టిది.
భగవంతుడు
భావప్రియుడు.
లోకము
బాహ్య
ప్రియము.
బాహ్యమును
చూచి
లోకము
హాస్యాస్పదము
చేయవచ్చు.
కాని
భగవంతుడు
భావప్రియుడు
కనుక
అతని
యందు
ఎట్టి
మార్పులు
కనిపించవు.
సర్వత్రా
ఉన్న
దైవత్వము
గుర్తించటానికి
తగిన
చిహ్నము
మన
భావమే.
మన
భావము
మన
చర్యలపై
ఆధారపడి
ఉంటున్నాయి.
చర్యలన్నీ
సంకల్పములపై
ఆధారపడి
ఉంటున్నాయి.
ప్రతి
ఒక్కటి
reflection
of
the
innerbeing.
మన
నుండి
ఆవిర్భవించే
ప్రతి
ధ్వనులే
బాహ్యప్రపంచమందు
చూస్తున్నాం.
మన
భావములను
పరిశుద్ధము
గావించుకునే
విషయములోనే
కాయమును,
కర్మను
సద్వినియోగము
చేయాలి.
ఈనాడు
సాధన
చేస్తున్నాం.
సాధన
అనగా
ఏమిటి?
జపము
చేయటమా
లేక
ధ్యానము
చేయటమా
లేక
భజన
చేయటమా?
ఇవన్నీ
ప్రాకృతకమైన
భక్తికి
సోపానములే.
నిజమైన
సాధన
మనయందున్న
అభావము
దూరము
చేసుకోవాలి.
అనాత్మ
భావమును
దూరము
చేసుకోవాలి.
ప్రాకృతమైన
చర్యలు
దూరము
చేసుకోవాలి.
క్షేత్రజ్ఞుని
దృష్టి
యందుంచుకొని
క్షేత్రమును
విసర్జించాలి.
ప్రాకృత
భావములను
విసర్జించి
దివ్యమైన
భావములు
అభివృద్ధి
పరచుకొని,
ఇది
సరైన
సాధనగా
భావించి,
ప్రవృత్తికి
సంబంధించినవిగా
విశ్వసించి
మనం
ప్రవేశించాలి.
మనము
చూచునది,
వినునది,
తలంచునది,
భుజించునది
ఇవన్నీ
ప్రకృత
లక్షణములే.
వీటన్నింటికంటె
అతీతమైనదే
నిజమైన
భావము.
అదే
నివృత్తి
లక్షణము.
ఈ
నివృత్తి
లక్షణము
చక్కగా
గుర్తించటానికి
పూనుకోవాలి.
ఈ
నివృత్తి
లక్షణము
ఎక్కడనుంచి
ప్రారంభమైంది?
అనేక
పర్యాయములు
విద్యార్థులకు
చెప్పాను
ఆత్మనుండి
అహం
ఆవిర్భవిస్తున్నది.
అహం
అనగా
నేను.
ఇది
భగవంతుని
మొట్టమొదటి
పేరు.
ప్రతి
మానవుడు
ప్రకృతిలో
జన్మించిన
తక్షణమే
నేను
అని
పలుకుతాడు.
ఈ
అహం
నుండే
మనస్సు
ఆవిర్భవిస్తుంది.
ఈ
మనస్సు
నుండే
వాక్కు
ఉద్భవిస్తున్నాది.
కనుక
అహం
కు
మనస్సు
కుమారుని
వంటివాడు
వాకు
grand
son
వంటివాడు.
వాక్కు,
మనసు,
అహం
ఒక
కుటుంబమునకు
చెందినవే.
ఈ
త్రయం
లో
ఒక్కటే.
అదే
సచ్చిదానందము.
ఈ
సచ్చిదానందమం
మనసుకు,
అహమునకు,
వాక్కునకు,
శరీరమునకు
సంబంధించినది.
ఎక్కడ
చూచినా
ఉన్నది
ఈ
సచ్చిదానందమే.
ఈ
సత్
చిత్
ఆనందములే
భగవంతుని
లక్షణములు.
3
▾
Meaning
Keep
భగవంతుడు
సజాతీయుడు.
అయితే
ఈ
ఆనందమైన
స్వరూపాలు
ఎక్కడనుండి
వచ్చాయి.
అగ్నికి
ఎఱ్ఱదనము,
దహనశక్తి,
వేడి
ఈ
మూడు
ఏవిధంగా
సహజమో
సచ్చిదానంద
స్వరూపుడైన
భగవంతునికి
సత్,
చిత్,
ఆనందము
ఈ
మూడు
సహజలక్షణములు.
సత్
నిరంతరము
ఉండే
తత్వము.
అచలము,
నిర్మలము,
నిశ్చలము,
నిస్వార్థము
ఇదియే
సత్.
చిత్
ఇదే
చైతన్యము.
దీనినే
conscience
అన్నారు.
ఈ
ఆనందము
ఎక్కడ
నుండి
వచ్చింది?
ఈ
సత్
చిత్
రెండింటి
ఏకత్వమే
ఆనందము.
ఈ
మూడింటి
ఫలితమే
ఆనందము.
ప్రతి
మానవుడు
పుట్టినది
మొదలు
గిట్టునంత
వరకు
ఆనందమును
అభిలషిస్తున్నాడు.
విద్యార్థులు
తమ
క్లాసులో
ప్యాసుకావాలని
ఆనందమును
అనుభవించాలని
ఆశిస్తున్నారు.
కానీ
ప్యాస్
అయిన
తక్షణమే
ఆనందము
అనుభవిస్తున్నారు.
అంత
మాత్రములో
ఈ
ఆనందము
శాశ్వతము
కావటం
లేదు.
తిరిగి
ఉన్నత
స్థాయికి
పోవాలని
ఆశిస్తున్నాడు.
అందులో
కూడా
ఉన్నతస్థాయి
అతనికి
లభ్యమైంది.
కానీ
ఆనందము
శాశ్వతముగా
లేదు.
తదుపరి
ఉద్యోగము
కావాలని
ఆశిస్తున్నాడు
ఉద్యోగము
చిక్కినప్పుడు
కూడా
ఆనందము
లేదు.
ఈ
విధముగా
జీవితమంతా
అనేక
కోరికలు
కోరుతూ
పోతున్నాడు.
ఈ
కోరికలకు
అంత్యమే
లేదు.
ఆనందమునకు
అంత్యము
లేదు.
లౌకిక
సంబంధమైన
ఆనందములు
క్షణభంగురములు.
‘మాకురు
ధన
జన
యవ్వన
గర్వం
అరతి
నిమేషా
కాలా
సర్వం’
ఇదంతా
క్షణములో
కాలిపోయేది.
క్షణములో
ఊడిపోయేది.
క్షణములో
మారిపోయేది.
ఇట్టి
దానిని
మనము
సత్యమని
భావించి
దీనికి
మన
జీవితమును
అంకితము
చేస్తున్నాము.
ఇవన్నీ
స్వప్న
దృశ్యములే.
‘కలలో
చూచిన
మేడలు
మిద్దెలు
కన్నులు
విప్పిన
లేవు
కదా!’
జాగ్రత్తలో
చూచినది
కలలో
ఏమాత్రము
కనిపించటం
లేదు.
ఇది
పగటికల.
అది
రాత్రికల.
రెండు
కలలే.
రెండింటి
యందున్న
అహం
నేనే.
అదే
omnipresent.
ఇట్టి
నిత్యసత్యమైన
తత్వము
మనయందే
ఉన్నది
గానీ
బయట
ప్రపంచములో
లేదు.
వస్తువుల
వల్ల
లభించే
ఆనందము
శాశ్వతము
కాదు.
విషయముల
వల్ల
లభించే
ఆనందము
శాశ్వతము
కాదు.
వస్త్రాల
చేత
లభించే
ఆనందము
శాశ్వతము
కాదు.
ఇవన్నీ
కదలిపోయే
మేఘముల
వంటివి.
కాని
ఇట్టి
కదలిపోయే
మేఘములు
సత్యము
శాశ్వతమని
భావించి
మానవుడు
దీనిని
పొందే
నిమిత్తమై
అనేక
శ్రమలకు
గురౌతున్నాడు.
ఈ
సత్యమును
గుర్తించే
నిమిత్తమై
ఆధ్యాత్మిక
మార్గములో
ప్రవేశించాలి.
అయితే
ఎన్ని
వేలమందో
ఈ
ఆధ్యాత్మిక
మార్గములో
ప్రవేశిస్తున్నారు.
ఎన్నో
సాధనలు
చేస్తున్నారు.
అయితే
ఎంతమంది
ఈ
ఆనందమును
అనుభవించారు.
4
▾
Meaning
Keep
Also in his talks
(4)
11 July 1996
Lack of Values is the Cause of Violence in the World
25 February 1998
Man is the embodiment of Saccidānanda
28 May 1998
Not the Man in Form: the Man of Conduct Is Needed
12 October 1998
The True Place of God's Pādukās Is the Heart Itself
ఎంతమంది
ఈ
ఆనందమును
పొందినారు.
సంవత్సరములు
దొర్లిపోతున్నాయి.
దేహము
పెరిగిపోతున్నాది.
కడపటికి
కర్తవ్యము
గుర్తించకుండా
కాయమే
కూలిపోతున్నాది.
కాని
ఫలితమును
పొందటం
లేదు.
దేని
కోసం.
మన
విశ్వాసములు
ధృఢమైనవిగా
లేకపోవటమే
మూలకారణము.
ఈ
విశ్వాసము
స్థిరముగా
ఉండినప్పుడే
దాని
ఫలము
కూడా
స్థిరముగా
ఉంటుంది.
Ladder
కు
రెండు
ప్రధాన
స్థానములని
చెప్పాను.
క్రింద
భూమిని
ఆధారము
చేసుకున్నదే
ప్రేమ.
పైన
మిద్దెను
ఆధారము
చేసుకొన్నదే
విశ్వాసము.
ఈ
ప్రేమ
విశ్వాసములు
రెండు
చేరినప్పుడే
ladder
ను
ఉపయోగించి
పైకి
చేరవచ్చు.
ఈనాడు
ప్రేమ
ఉంటే
విశ్వాసము
లేదు.
విశ్వాసముంటే
ప్రేమ
లేదు.
కేవలము
విశ్వాసము
మాత్రమే
చాలదు
ప్రేమ
ఉండాలి.
ఈ
రెండింటి
సంబంధ
బాంధవ్యము
పాజిటివ్,
నెగిటివ్
వంటిది.
ఏమి
లేని
బుఱ్ఱలోన
ఏమైనా
నింపవచ్చు
ఏమేమో
నిండియున్న
తలబుఱ్ఱది
ఖాళీయగునా
తలబుఱ్ఱది
ఖాళీ
కాక
ఇల
సుకృతంబు
నింపనగునా!
మనయందున్న
నెగిటివ్
భావములు
మనం
దూరం
చేసుకోవాలి.
ఏనాటికైనా
ఈ
జగత్తు
వదలక
తప్పదు.
ఈ
కాయము
శాశ్వతము
కాదు.
మనము
చేసే
సర్వకర్మలందు
ఫలితము
శాశ్వతము
కాదు.
అన్ని
కదలిపోయే
మేఘములే.
ఇలాంటి
మేఘముల
నిమిత్తమై
మనము
ఎందుకింత
శ్రమ
పడటం.
నిత్యసత్యమైన
దైవత్వమునకు
మనం
ప్రాకులాడటం
లేదు.
భుక్తి
కోసం
చదివే
చదువులు
శ్రద్ధగా
చదువుతున్నారు.
కాని
ముక్తి
కోసం
చదివే
చదువులపై
శ్రద్ధ
చూపటం
లేదు.
ఈ
చదువులు
ఏనిమిత్తమై?
చదువులన్నీ
లోకసంబంధమైన
స్థానమును
గౌరవమును
అందించవచ్చును.
కాని
ప్రాకృత
జీవితములో
మనం
నిలబెట్టుకోవలసినది
రెండే
రెండు.
సత్యము,
కీర్తి.
అస్థిరం
జీవనం
లోకే
అస్థిరం
యవ్వనం
ధనం.
అస్థిరం
దారా
పుత్రాది
సత్యం
కీర్తి
ద్వయం
స్థిరం.
కీర్తిని
మనం
సాధించాలి.
కీర్తి
దేని
వల్ల
లభ్యమవుతుంది.
సత్యమార్గము
వలనే
కీర్తి
లభ్యమవుతుంది.
మరి
ఏ
ఇతర
మార్గమందు
కీర్తి
లభ్యము
కాదు.
ఈ
కీర్తి
ఎక్కడ
నుండి
వస్తుంది?
సత్యం.
అదే
truth
is
God.
సత్యమే
దైవస్వరూపము.
సత్యమే
సర్వత్ర
ఉన్నది.
సత్యమే
మన
ఆధారము
సత్యమే
మన
ప్రాణము.
5
▾
Meaning
Keep
కనుక
ప్రాచీన
సంస్కృతి
యందు
‘సత్యం
వద
ధర్మం
చర’.
ఈ
రెండింటిని
మనం
ఆధారము
చేసుకొని
జీవితము
గడుపుతూ
రావాలి.
ఈ
ప్రాకృతమైన,
లౌకికమైన
జగత్తునందు
మనము
కీర్తిని
సంపాయించవలెనన్న
మన
చర్యలు
సరియైనవిగా
ఉండాలి.
ధనకనక
వస్తువాహనాదులున్నంతవరకు
లోకము
మనలను
గౌరవిస్తుంది.
ఎవరిని
గౌరవిస్తున్నాది?
నీవు
భ్రమిస్తున్నావు
నిన్ను
గౌరవిస్తున్నారని.
కాదు
కాదు
నీదగ్గర
నున్న
ధనమును
చూచి
గౌరవిస్తున్నారు.
నీకున్న
పదవిని
బట్టి
గౌరవిస్తున్నారు.
నీకున్న
జన
బలము
చూచి
గౌరవిస్తున్నారు.
నీ
బుద్ధి
బలము
చూచి
గౌరవిస్తున్నారు.
గుణ
బలము
చూచి
కాదు
గౌరవించటము.
గుణమే
సరైన
కీర్తి.
వ్యక్తిగత
గుణము.
సామాజిక
సంబంధమైన
గుణము.
వ్యక్తిగతమైన
గుణము
మనయందు
లేనప్పుడు
సామాజికమైన
గుణము
ఏరీతిగా
సంపాయించగలవు?
ఈ
సామాజిక
గుణములు
సంపాయించక
national
character
ఎట్లా
సంపాయించగలవు?
ఈ
national
character
చరిత్ర.
రామ
చరిత్ర,
కృష్ణ
చరిత్ర.
ఇలాంటివి
చరిత్రలుగా
రూపొందినాయి.
కేవలము
మన
చరిత్రలు
మనం
వ్రాసుకుంటే
అవి
చరిత్రలని
చెప్పటానికి
వీలు
లేదు.
అది
మహా
అవమానము.
HIS
STORY
is
HISTORY.
దైవము
యొక్క
గుణగణములను
వర్ణించేదే
story.
అతని
ఆదర్శవంతమైన
గుణములే
మన
story.
ఇట్టి
చరిత్రలు
మనం
అభివృద్ధి
పరచుకోవాలి.
చరిత్రాత్మకుడు
కావాలిగానీ
జీవాత్మకుడు
కాకూడదు.
కదలిపోయే
మేఘముల
వంటి
అశాశ్వతము
అనిత్యము
అయిన
కోర్కెల
గురించి
మనము
ప్రాకులాడకూడదు.
నీ
ఆత్మ
తృప్తి
నిమిత్తమై
నీవు
ప్రాకులాడాలి.
ఎంతమంది
జగత్తులో
విద్యావంతులు
లేరు.
ఎంతమంది
జగత్తులో
మేధావంతులు
లేరు.
ఏకత్వమును
అనేకత్వముగా
విభజించే
మేధావులున్నారుగానీ
అనేకత్వములో
నున్న
ఏకత్వాన్ని
సాధించే
మేధావులు
కనిపించటం
లేదు.
ఏకత్వమును
అనేకత్వముగా
విభజించేవాడు
మేధావి.
అనేకత్వములోని
ఏకత్వము
విశ్వసించేవాడే
చారిత్రకుడు.
అలాంటి
ఏకత్వము
మనం
గుర్తించాలి.
దేహముల
యొక్క
రూపనామములు
ఎన్నైనా
ఉండవచ్చు.
కాని
అందరియందు
సత్యమనే
దైవత్వము
ఒక్కటే
ఉంటున్నాది.
ఇట్టి
సత్యమును
మనం
ఏ
విధంగా
మనం
సాధించాలి.
సత్యము
గురువులవల్ల
బోధింపబడేది
కాదు.
లేక
గ్రంథముల
వల్లకాదు.
మార్కెట్టులో
కొనేది
కాదు.
స్నేహితులు
గిఫ్టుగా
ఇచ్చేది
కాదు.
నీవు
ఆచరణలో
సాధించాలి.
నిత్య
జీవితములో
సత్యముపై
లక్ష్యమునుంచుకోవాలి.
అదే
మన
నిజమైన
మానవత్వము.
త్రికరణశుద్ధితో
కూడినదే
మానవత్వము.
తలంపు,
మాట,
చేత
ఈ
మూడింటి
ఏకత్వము
కావాలి.
6
▾
Meaning
Keep
ఎంతమంది
ఈవిధంగా
త్రికరణ
శుద్ధితో
ఉన్నారిప్పుడు.
ఎంతమంది
ఈ
ఏకత్వము
సాధిస్తున్నారు.
సంవత్సరముల
కొలది
సాధనలు
చేస్తున్నారు.
జగత్తులో
వచ్చిన
అన్ని
ఆధ్యాత్మిక
గ్రంథాలు
చదువుతూనే
ఉన్నారు.
రామాయణము
పారాయణ
చేస్తున్నారు.
భగవద్గీత
భాగవతము
పారాయణ
చేస్తున్నారు.
ఎన్ని
చేసి
ఏమి
ప్రయోజనం.
ఏ
కొంచెమైనా
సాధిస్తున్నామా?
నీవు
హృదయముపై
చేయిపెట్టుకొని
చూడు.
అదే
సత్యము
బోధిస్తుంది.
ఎన్ని
దినములు
ఈ
విధముగా
జీవించి
ప్రయోజనం
ఏమిటి?
మన
హృదయమే
మనకు
సాక్షిగా
ఉంటున్నాది.
ఇంక
సాధనలు
చేసి
ప్రయోజనం
ఏమిటి?
సమావేశములో
పాల్గొని
ప్రయోజనము
ఏమిటి?
పారాయణము
చేసి
ప్రయోజనం
ఏమిటి?
ప్రార్థనలు
చేసి
ప్రయోజనం
ఏమిటి?
ఇవన్నీ
గాలికి
పోయిన
పేలాలవలె
ఉంటున్నాయి.
అది
కాదు
మనం
సాధించవలసింది.
సత్యనిత్యము
ఎట్లా
అనేది
నీ
హృదయము
నుండే
రావాలి.
ఈనాడు
మనము
చేసే
ప్రతి
కార్యము
కృత్రిమముగా
రూపొందుతున్నాది.
విద్యార్థులారా!
మనం
heartful
గా
కావాలి.
ఏ
కార్యము
చేసినా
హృదయపూర్వకముగా
చేయాలి.
art
is
outside.
heart
is
inside.
heart
ను
follow
చేయి.
అంతేగాని
బయట
సంబంధమైన
ప్రజలను
మనం
follow
చేస్తే
ప్రయోజనం
లేదు.
తలలు
వేరువేరు.
తలంపులు
వేరు
వేరు.
కర్మలు
వేరు
వేరు.
ఫలములు
వేరు
వేరు.
ఎందుకు
ఇమిటేషను
చేస్తావు?
నీ
హృదయమును
నీవు
అనుసరించు.
Imitation
is
human
creation
is
Divine.
ఆ
creation
నీ
హృదయము
నుండి
ఆవిర్భవించాలి.
ఎన్ని
విధములైన
సంశయములున్నప్పటికిని
లట్టుకొని
నెట్టుకొని
ముందుకు
సాగుతూ
వస్తుంది.
కారణము
ఏమిటి?
అదే
సత్యస్ఫూర్తి.
సత్యమనే
vibration
లో
మనం
మునిగిపోవాలి.
ఈ
vibration
సర్వత్ర
ఉంటున్నాది.
మనకు
కనిపించటం
లేదు
కనుక
విశ్వసించటం
లేదు.
మన
చుట్టూ
గాలి
ఉంది.
కాని
మన
కంటికి
కనిపించటం
లేదు.
విశ్వసించలేక
పోతున్నావా?
అట్లే
దివ్యమైన
vibration
మన
చుట్టూ
ఉంది.
In
you
around
you.
అట్టి
దివ్యమైన
ఆత్మతత్వము
మనం
కొంతైనా
గుర్తించాలి.
చాలామంది
సాధనలు
చేస్తున్నారు.
మహానీయుల
యొక్క
చరిత్రలు
సమావేశములలో
వింటున్నారు.
ఎన్ని
మనం
హృదయములో
నింపుకుంటున్నాము.
నింపుకోటం
లేదు.
తిన్నది
బయటకు
పోయినట్లుగా,
పీల్చుకున్న
గాలి
తిరిగి
బయటకు
విడిచినట్లుగా
విన్న
విషయములు
కూడా
బయటకు
వదలివేస్తున్నారు.
వదలవలసినవి
ప్రాకృతమైనవిగానీ
దివ్యమైనవి
కాదు.
ఈనాడు
లోకములో
ఏవిధమైన
సాధనలు
చేసినా
కించిత్తైనా
ఆనందము
లభ్యము
కావటం
లేదు.
7
▾
Meaning
Keep
ఈ
లౌకిక
సంపాదనలన్నీ
ఎక్కడికక్కడ
వదలిపెట్టి
పోవలసిందే.
నీవెంట
జంట
కంట
ఇంట
ఉండి
నిన్ను
కాపాడుతూ
వచ్చేది
ఒక్కటే
అదే
సత్యము.
కనుక
అట్టి
పవిత్రమైన
మార్గములో
మనం
ప్రవేశించాలి.
కేవలం
రాంరాంరాం
అని
స్మరించినంత
మాత్రమున
ఉపయోగము
లేదు.
కేవలం
పెదవుల
నుండి
వస్తున్నది
గానీ
హృదయము
నుండి
రావటం
లేదు.
టేపురికార్డు
పాడుతూనే
ఉంటుంది.
కాని
దానివల్ల
ఎంత
ఫలితము
వస్తున్నాది?
గ్రామఫోను
ప్లేటు
పాడుతున్నాది.
దానివల్ల
ఎంత
ఫలము
వస్తున్నాది.
అది
కొంచెము
కనెక్షను
చేయాలి.
అప్పుడు
పాట
సరైన
రీతిగా
వస్తుంది.
అ
కరెంటే
will
power.
దానినే
free
will
అన్నారు.
ఈ
free
will
ఒక్క
భగవంతునికే
ఉంది
వేరు
ఎవ్వరికి
లేదు.
అందరు
చెప్పవచ్చు
free
will.
ఊ.
పదములు
ఉచ్ఛరిస్తున్నారుగాని
ఆ
free
will
నీలో
లేదు.
నీయందున్న
will
power
నీవు
కోల్పోతున్నావు.
ఈ
free
will
ఎక్కడ
పెట్టుకోగలవు?
ఏరీతిగా
కాపాడుకోగలవు
దాన్ని
కాపాడుకొనే
ప్రదేశము
నీ
హృదయమే.
కేవలము
physical
heart
కాదు.
spiritual
heart.
ఎక్కడికి
పోయినా
మన
ఉచ్ఛ్వాస
నిశ్వాసములు
ఏరీతిగా
జరుగుతున్నాయో
అ
చింతన
ఆరీతిగా
ఉండాలి.
మనము
నిద్రపోతున్నా
మన
ఉచ్ఛ్వాస
నిశ్వాసములు
జరుగుతూనే
ఉన్నాయి.
మనము
పనులు
చేస్తున్నా
ఉచ్ఛ్వాస
నిశ్వాసములు
సహజంగా
జరిగిపోతున్నాయి.
ఎవరితోనైనా
పోట్లాడుతున్నా
మన
ఉచ్ఛ్వాస
నిశ్వాసములు
సహజంగా
జరుగుతున్నాయి.
ఈ
ప్రాకృతమైన
దానికి
ఏమాత్రము
అడ్డురాదు.
అదేవిధంగా
ఏ
మార్గములోనైనా
అది
శాశ్వతంగా
ఉంటుంది.
అట్టి
సత్యనిత్యమైన
దానిని
మనము
అనుసరించటానికి
ప్రయత్నం
చేయాలి.
విద్యార్థులారా!
మనము
పెంచుకోవలసినవి
సత్యము,
ధర్మము.
కేవలము
లోకమును
సంరక్షించుట
కోసము
కాదు.
లోకమును
సంరక్షించేవాడు
ఎవడు
లేడు.
ఇక్కడ.
సత్య
ధర్మములే
లోకమును
సంరక్షిస్తాయి.
నీవు
రక్షించవలసినది
సత్యధర్మములనే.
నీవు
ఆ
రెండింటిని
సంరక్షించినప్పుడు
ఆ
రెండే
దేశమును
రక్షిస్తాయి.
కనుక
సత్య
ధర్మములను
మనం
ప్రాణ
సమానంగా
చూసుకోవాలి.
ధర్మో
రక్షతి
రక్షితః,
ధర్మయేవ
హతో
హంతి’
ఈనాడు
ధర్మమంటే
ఏమిటో
తెలియటం
లేదు.
సత్యమంటే
ఏమిటో
తెలియటం
లేదు.
సత్యము
త్రికాల
బాధ్యము.
అప్పటికప్పుడు
మారేది
కాదు
అదంతా
నిజము.
ఇది
ప్రాకృతమైన
సత్యము.
ఇది
మారుతూ
ఉంటుంది.
తెల్లవారి
యోగము,
మధ్యాహ్నము
రోగము,
రాత్రి
భోగము
ఈ
విధంగా
మారుతుంటే
ఎంత
కాలమని.
రామాయణమునకు
కామము
ప్రధానమన్నారు.
8
▾
Meaning
Keep
అదే
రావణుని
పతనమునకు
మూలకారణము.
భాగవతమునకు
క్రోధమే
కారణమన్నారు.
హిరణ్యాకశిపుడు
భగవంతునిపై
క్రోధము
చేత
భగవంతుని
చే
హింసింపబడ్డాడు
భారతములో
లోభత్వము.
రామాయణము
కామము,
భాగవతము
క్రోధము,
భాగవతము
లోభము.
ఒక్కొక్క
దానియందు
ఒక్కొక్క
వ్యక్తి
ఉన్నప్పుడే
ఇంత
పతనమై
పోయింది
దేశము.
ఈనాడు
ఈ
మూడు
గుణములు
ఒకే
వ్యక్తియందుంటున్నాయి.
ఇంక
మానవుని
ఎంత
పతనము
చేస్తుంది.
పవిత్రమైన
దివ్యత్వమునకు
ఆటంకములు
ఈ
మూడే.
నరక
ద్వారములు
ఈ
మూడు
అని
వేదము
బోధించింది.
రామాయణ,
భారత,
భాగవతములందు
ఒక్కొక్క
గుణము
మాత్రమే
ఉంటూ
వచ్చింది.
ఈనాటి
మానవుని
యందు
మూడు
గుణములు
చేరినాయి.
కామము,
క్రోధము,
లోభము.
వీనికి
ఏ
గతి
పట్టాలి.
రూపనామములు
లేకుండా
శిథిలమై
పోతాడు.
కనుక
మొట్టమొదట
కామ
క్రోధ
లోభములను
సంహరించటానికి
ప్రయత్నించాలి.
వాటిని
ఏనాడు
మనము
దూరము
గావించుకొందుమో
ఆనాడే
మనము
జీవించినట్లవుతుంది.
అప్పుడే
మనకు
కీర్తిప్రతిష్టలు
ప్రాప్తిస్తాయి.
లేకపోతే
అపకీర్తి,
అప్రతిష్టల
పాలౌతాము.
చూడటానికి
మేడిపండువలె
ఉంటున్నాము.
పొట్టవిప్పి
చూడ
పురుగులుండు.
మనము
చూడటానికి
ఆనందముగా
ఉన్నట్లు
నటిస్తున్నాము.
నవ్వుతున్నాము.
అంతా
సినిమా
యాక్టింగులైపోతున్నాయి.
మన
హృదయము
నుండి
రావాలి
ఆనందము.
అదే
నీకు
తృప్తి.
అదే
నిజమైన
ఆనందము.
అదే
నిజమైన
ప్రాపరటీ.
who
is
the
poorest
man
in
the
world?
He
who
has
more
desires.
who
is
the
richest
man
in
the
world!
He
who
has
much
satisfaction.
తృప్తి
కలిగినవాడే
నిజమైన
శాంతి
పరుడు.
ఎవరికుంది
తృప్తి.
తృప్తియే
లేదు.
తృష్ణ
ఉంటున్నాదిగానీ
తృప్తి
లేదు.
తృష్ణ
అనగా
నిముష
నిముషమునకు
కోరికలు
అభివృద్ధి
కావటం.
ఈ
తృష్ణను
మనం
అనుసరించవద్దు.
కృష్ణను
అనుసరించండి.
కృష్ణుని
అనుసరించినప్పుడు
అన్ని
లభ్యమవుతాయి.
భగవన్నామాన్ని
మనం
స్మరించాలి.
భగవంతుని
ఆజ్ఞను
మనం
ఆచరించాలి.
ఎన్ని
ఆచరిస్తున్నాము
మనము.
రామాయణములో
పితృవాక్య
పరిపాలనమన్నారు.
కాని
ఎంతమంది
పితృవాక్య
పరిపాలన
ఆచరిస్తున్నారు.
రాముడు
సత్యస్వరూపుడు.
మనము
అంతా
అసత్యమే.
సంవత్సరమునకు
ఒక్కతూరి
సత్యన్నారాయణ
వ్రతము
చేస్తున్నాము.
కాదు.
సతతం
సత్యం.
అట్టి
సత్యమును
మనము
పాటించటానికి
కొంచెమైనా
మనము
ప్రయత్నం
చేయాలి.
కాని
మనము
ఆచరించటం
లేదు.
నోరెత్తితే
అసత్యము.
ఏమి
చెప్పినా
అసత్యమే.
సత్యమంటే
ఏమిటో
గుర్తించటానికే
వీలుకాకుండా
ఉంది.
9
▾
Meaning
Keep
విద్యార్థులారా!
మీరు
ఎలాంటి
పరిస్థితులందైనా,
ప్రాణం
పోయే
పరిస్థితి
వచ్చినా
సత్యమును
మాత్రం
వదలకండి.
సత్యమే
నీ
జంట,
వెంట,
ఇంట
ఉండి
కాపాడుతుంది.
హరిశ్చంద్రుని
రూపము
సత్యహరిశ్చంద్రునిగా
మార్చివేసింది.
ఎన్ని
కష్టములకు
గురయ్యాడు.
ఎన్ని
బాధలకు
గురయ్యాడు.
ఆలుబిడ్డలను
అమ్ముకున్నాడు.
కాటికాపరిగా
తయారయ్యాడు.
కాని
జంకలేదు.
కృంగలేదు.
సత్యమును
వదలక
ఉంటున్నాడు.
కట్టకడపటికి
దైవము
లొంగిపోయాడు.
అప్పుడు
దైవము
ప్రత్యక్షమై
కోల్పోయిన
సర్వస్వమును
అందించి
నీవు
సత్యహరిశ్చంద్రుడు
అని
బిరుదు
అందించాడు.
ప్రతి
మానవుడు
అమృత
పుత్రుడే.
నీవు
అనృత
పుత్రుడు
కాదు.
దైవము
సత్యస్వరూపుడు.
అందరు
దైవము
నుండి
ఆవిర్భవించినవారే.
అన్ని
బుడగలు
నీటినుండి
వచ్చినవే.
ప్రతి
మానవుడు
సచ్చిదానంద
సాగరము
నుండి
ఆవిర్భవించినవారే.
అందరు
సచ్చిదానంద
స్వరూపులే.
ఆ
సత్యమును
గుర్తించి
ప్రతి
మానవుడు
నేను
సచ్చిదానందుడను
అనే
భావము
ధృఢముగా
నాటుకొనిపోతే
మనకు
ఎంత
ఆనందము.
కేవలం
కృత్రిమంగా
భావించకూడదు.
హృదయపూర్వకంగా
భావించాలి.
నేను
సచ్చిదానంద
స్వరూపుడనే.
దేహము
కూలిపోతుంది.
మనసు
రాలిపోతుంది.
బుద్ధి
చలిస్తుంది.
భావాలు
కదలిపోతున్నాయి
మేఘాలవలె.
నేను
ఎప్పుడు
ఉంటున్నవాడనే.
నేను
కదలే
వాడను
కాను.
జారే
వాడను
కాదు.
ఊగే
వాడను
కాదు.
ఏకత్వముగా
ఉండేవాడను.
ఇలాంటి
భావము
మనం
ధృఢం
చేసుకోవాలి.
ఆ
భావము
మనకు
ఎప్పుడొస్తుందో
అప్పుడే
సాక్షాత్కారమై
పోతుంది.
కాని
ఆ
భావముపైన
కూడా
విశ్వాసము
లేదు.
ఎట్లా
వస్తుంది
మనకు.
అందువలనే
మొట్టమొదట
faith
in
you.
faith
in
god.
ఈ
రెండు
ఉంటే
ఎంతైనా
మనము
సాధించవచ్చు.
దేనికి
నీవు
భయపడవద్దు.
దేనికి
భయపడాలి.
సత్యము
నాలో
ఉంటున్నాది.
సత్యము
దేనికి
భయపడదు.
అందువలనే
సత్యమేవ
జయతే.
ఈ
సత్యము
మనము
సాధించాలంటే
ప్రేమతోనే
మనం
సాధించాలి.
నా
ప్రసంగములో
ఏమి
లేకపోయినా
సత్యము
ప్రేమ
ఈ
రెండింటితో
ప్రారంభమవుతుంది.
ఈ
రెండింటితోనే
అంత్యమవుతుంది.
ఈ
రెండు
లేక
నేను
ప్రసంగము
చేయను.
ఎందుకనగా
అందరి
ప్రాణములు
ఈ
రెండే.
ఒకటి
ఉచ్ఛ్వాసము
రెండవది
నిశ్వాసము.
ఈ
రెండు
లేక
జీవితము
ఏవిధంగా
ఉంటుంది.
కనుక
సో-
సత్యము.
హం-
ప్రేమ
ఈ
సత్యము
ప్రేమ
ఉన్నప్పుడే
మన
జీవితము.
విద్యార్థులారా!
ఈ
లేత
వయస్సునందే
సత్యము
ప్రేమ
మీరు
అభివృద్ధి
గావించుకోవాలి.
10
▾
Meaning
Keep
సత్యమును,
ప్రేమను
అపమార్గములో
ప్రవేశపెట్టకండి.
నీ
స్వార్థము,
స్వప్రయోజనము
చేరిపోవటం
చేత
సత్యము
కూడా
మారిపోతున్నాది.
ఆనాడు
ఎంతో
పవిత్రమైన
వాతావరణము
కనుక
సత్యహరిశ్చంద్రుడు
విజయమును
సాధిస్తూ
వచ్చాడు.
ఎవరు
అతనిని
మార్చలేకపోయారు.
ఈనాడు
కలియుగములో
ఆ
హరిశ్చంద్రుడే
ఉంటే
అతని
చేత
కూడా
అసత్యము
చెప్పిస్తారు.
కలి
ప్రభావము
ఇంత
ఇదిగా
ఉంటున్నాది.
ఎంతోమంది
సత్యము
చెప్పాలని
ప్రతిజ్ఞ
చేసుకుంటారు.
కాని
బయటకు
వస్తూనే
అసత్యమైపోతుంది.
మనము
ఈ
కలి
ప్రభావమునకు
ఏమాత్రము
లొంగకూడదు.
మన
ఆనందములోనే
సత్యమును
పొంగింపచేయాలి.
ఏ
సాధనలు
చేయకపోయినా
ఫరవాలేదు.
సత్యమును
ప్రేమను
మీరు
అభివృద్ధి
పరచుకోండి.
సత్యము
దగ్గర
హింస
ఉండదు.
ప్రేమ
దగ్గర
హింస
ఉండదు.
ధర్మము
దగ్గర
హింస
ఉండదు.
శాంతము
దగ్గర
హింస
ఉండదు.
ఈ
సత్య
ధర్మ
శాంతి
ప్రేమ
అహింసల
దగ్గర
అహింస
పూర్ణముగా
ప్రత్యక్షమవుతుంది.
ఈనాడు
అవి
లేకపోవటం
చేత
ప్రపంచము
హింసలో
నిండి
ఉంటున్నాది.
ఇంటిలో
హింస
బయట
హింస,
బజారులో
హింస,
ట్రైనులో
హింస
ఎక్కడ
చూచినా
హింసే.
‘భయం
భయం
బ్రతుకు
భయం
అన్నా
బ్రతుకే
లోకం
పన్నిన
వ్యూహం’
పద్మవ్యూహమిది.
పద్మవ్యూహంలో
భయం.
అంతా
భయమే.
ఎక్కడికి
పోకుండా
ఇంటిలో
ఉన్నా
భయమే.
నడచుకొని
పోదామన్నా
భయమే.
ఎక్కడ
భయము
లేనిది?
దైవము
దగ్గరే
అభయము.
దైవము
దగ్గర
భయమునకు
అవకాశమే
లేదు.
మొట్టమొదట
దైవమును
మన
హృదయములో
ప్రతిష్ట
చేసుకోవాలి.
మన
హృదయము
దైవమును
ప్రతిష్ట
చేసుకోటానికి
ఇచ్చిన
సోపానముగాని
కేవలం
బ్రతికే
కొరకు
ఇచ్చినది
కాదు.
హృదయవాసి
భగవంతుడు.
విద్యార్థులారా!
మీరు
ఎలాంటి
పరిస్థితియందైనా
సత్యము
పలకండి.
ప్రారంభములో
కొంచెం
కష్టంగా
ఉంటుంది.
నిజంగా
చెబుతున్నాను
సత్యం
పలుకుటమే
సులభము.
సత్యము
పలుకుటకు
ఏమాత్రము
శ్రమ
లేదు.
అసత్యము
చెప్పాలంటే
ఎన్నో
ప్లానులు
వెయ్యాలి.
చాలా
యోచన
చేయాలి.
అసత్యమునకు
ఎంత
శ్రమ
ఉంటున్నాది.
ఎందుకు
అంత
శ్రమపడి
అసత్యములో
పాల్గొంటున్నావు.
సులభంగా
నీవు
సత్యములో
పాల్గొనుము.
ఉన్నది
ఉన్నట్లు
చెప్పటం
ఎంత
సులభం.
కంటికి
కనిపించే
దానికి
ఎందుకు
అసత్యము
పలకటము.
ముంజేతి
కంకణమునకు
అద్దమెందుకు.
నీ
కంకణము
నీవు
సులభంగా
చూడవచ్చును.
అయితే
నీవు
నీ
కన్నులను
చూడలేవు.
మూడవ
నేత్రమన్నారు.
అదే
ప్రేమనేత్రము.
సత్యధర్మములలో
ఈ
ప్రేమ
నేత్రము
ఉండినప్పుడు
అన్నింటిని
మనం
చూడవచ్చును.
11
▾
Meaning
Keep
అందువలనే
యోగాభ్యాసములో
పూరక,
కుంభక,
రేచకములుగా
భావిస్తూ
వచ్చారు.
మనము
కుడివైపున
తీసుకునే
గాలికి
ఇళ,
ఎడమవైపున
పింగళ,
భ్రూమధ్య
స్థానమే
సుషుమ్న.
భ్రూమధ్యములో
నీ
దృష్టిని
నిల్పు.
అప్పుడే
ఎట్టి
భావములు
రావటానికి
అవకాశం
ఉండదు.
భావము
అనే
నేత్రమే
త్రినేత్రము.
భగవంతునికి
త్రినేత్రుడని
ఎందుకు
పేరుపెట్టారు?
ప్రతి
మానవునికి
రెండు
నేత్రములుంటున్నాయి.
past
ని
చూడగలడు.
present
ని
చూడగలడు.
భవిష్యత్తును
చూడలేడు.
త్రినేత్ర
స్వరూపుడైన
భగవంతుడు
past,
present,
future
మూడింటిని
చూస్తాడు.
అందుకే
అతనికి
త్రినేత్రుడని
పేరు.
నీవు
future
చూడలేవు.
past
లో
బొంబాయిలో
ఫలాని
ఇంటిలో
ఉండినాను
అంటే
నీవు
ఆ
ఇల్లు
చూడవచ్చు.
present
ని
చూడవచ్చు.
నీకు
రెండు
నేత్రములే
ఉన్నాయి.
భగవంతునికి
మూడు
నేత్రములున్నాయి.
భవిష్యత్తు
కూడా
చూడగలడు.
ఈ
విధమైన
అంతరార్థములతో
కూడినదే
భారతీయ
వేదాంత
సంస్కృతి.
భారతీయ
సంస్కృతి
ఎంత
పవిత్రమైనది.
ఎంత
ఉత్తమమైనది.
ఎంత
విలువైనది.
ఎంత
ప్రాణవంతమైనది.
ఎంత
ఆదర్శవంతమైనది.
దీనిని
మొట్టమొదట
విద్యార్థులు
గుర్తించాలి.
ఈ
సంస్కృతి
అంటే
వారికే
తెలియదు.
ఆ
సంస్కృతియే
మన
గమ్యమునకు
చేర్చే
మార్గము.
అదే
మన
గమ్యము.
అదే
మన
లక్ష్యము.
అదే
మన
దివ్యత్వము
అదే
మన
పవిత్రము.
అదే
మన
చరిత్రము.
ఇలాంటి
పవిత్రమైన
చరిత్రతో
కూడిన
భారతీయుడు
ఎందుకో
చరిత్రను
పాడు
చేసుకుంటున్నాడు.
ఆ
చరిత్రను
నిల్పుకోండి.
ప్రేమచేత
నిల్పుకోండి.
Previous
←
Namasmarana is the Greatest Sadhana in the Kali Yuga
Next
Divine Proximity is the Real Wealth
→