Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1996 · Unity Is Great Strength; Practice Alone Is Its Inner Meaning
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Unity Is Great Strength; Practice Alone Is Its Inner Meaning
24 August 1996, Sai Kulwant Hall
1
▾
Meaning
Keep
His poems 467
Also in his talks
(2)
17 April 1998
Desires are the root of unrest
25 December 2006
Love everyone, serve everyone
చిత్తశుద్ధిలేని
రిత్తమానవులకు
ఆత్మతత్త్వమెట్లు
అలవియగును?
ఆత్మతత్త్వ
మబ్బు
అతి
శుద్ధబుద్ధికే
సత్యమైనబాట
సాయిమాట.
విద్యార్థులారా!
మానవత్వమంటే
ఏమిటో,
పశుత్వమంటే
ఏమిటో,
రాక్షసత్వమంటే
ఏమిటో,
దైవత్వమంటే
ఏమిటో
ఈనాటి
మానవులకు
ఏమాత్రము
అర్థముకావటంలేదు.
దైవత్వము,
మానవత్వము,
పశుత్వము,
రాక్షసత్వాన్ని
గుర్తించటము
చాలా
సులభము.
శరీరము,
మనస్సు,
ఆత్మల
సమ్మిళితమైనవాడు
మానవుడు.
పశువు
అంటే
ఏమిటి?
ఆత్మను,
మనస్సును
విస్మరించి
కేవలము
శరీరతత్వమునందు
జీవించేదే
పశుత్వము.
ఆత్మను
విస్మరించి
శరీరము,
మనస్సును
లక్ష్యమునందుంచుకొని
ఈ
రెండింటి
అనుభూతుల
నిమిత్తమై
అర్రులు
చాచేవారు
రాక్షసులు.
దేహతత్వమును,
మనోతత్వమును
విస్మరించి
కేవలము
ఆత్మయందే
ఆనందమును
అనుభూతిగా
తీసుకున్నవాడు
దైవత్వము
అని
వివరణ.
కానీ,
పశుత్వముకాకుండా,
రాక్షసత్వముకాకుండా,
శరీరమనోఆత్మల
సమ్మిళితమైన
స్వరూపమును
సక్రమమైన
మార్గములో
అనుభవించే
మానవులుగానైనా
మనము
తయారుకావాలి.
శరీరముతో
చేసే
సమస్తసాధనలు
అస్థిరములైనవే!
శరీరమే
అస్థిరము.
అస్థిరమైన
దేహముద్వారా
చేసే
సమస్తకర్మలు
అస్థిరములే!
శరీరమును
పనిముట్టుగా
విశ్వసించి
మానసికంగాచేసే
సమస్తసాధనలు
శాశ్వతమైనవి.
2
▾
Meaning
Keep
‘మనోమూలమిదం
జగత్’.
విశ్వమంతా
వ్యాపించినది
ఈ
మనస్సు.
మనస్సుకు
నాశనములేదు.
అట్టి
శరీరమును
ఆధారముగా
తీసుకొని
మానసికతత్వము
అనుభవింపచేసే
స్థితికి
ప్రతివ్యక్తి
ప్రయత్నించాలి.
మనసులేని
స్థానములేదు.
ఈ
మనస్సు
స్వరూపమే
బ్రహ్మస్వరూపంగా
మారుతుంది.
ఇట్టి
ఏకత్వమును
గుర్తించుకునే
విద్యార్థులు
ఈనాడు
లోకములో
వ్యాప్తికావాలి.
విశ్వమంతటా
వ్యాపించియున్న
దివ్యత్వము
అనుభూతికి
మాత్రమే
లభ్యమవుతుంది
ఉద్దాలకుడు
తన
ఏకైక
కుమారుడైన
నచికేతునకు
ఎన్నో
విధములైన
ఆత్మవిద్యలు
బోధించటానికి
ప్రయత్నించాడు.
ఉద్దాలకునికంటె
మించిన
పండితుడు
మరొకడులేడు.
అంత
ఉత్తమ
పండితుడైనా
తనకుమారుని
మరొక
గురువు
దగ్గరకు
విద్యనభ్యసించే
నిమిత్తమై
పంపాడు.
కారణమేమనగా,
పుత్రుడు
తండ్రిని
గురువుగా
విశ్వసించడు.
తండ్రిగా
విశ్వసిస్తాడు.
తండ్రి
భావముండినంతవరకు
గురుత్వము
తనలో
ప్రాప్తించదు.
కనుకనే
తండ్రి
భావమును
విస్మరించి
గురుభావము
అభివృద్ధి
గావించే
నిమిత్తమై
మరొక
గురువు
దగ్గరకు
నచికేతుని
పంపించాడు.
ఈ
విద్యార్థులలోనున్న
బలహీనతలను
కొన్ని
నచికేతునియందు
గుర్తించాడు,
ఉద్దాలకుడు.
బ్రహ్మతత్త్వము
సర్వవ్యాపకమనే
తత్త్వాన్ని
గురువుద్వారా
విన్నాడు.
ఇంటికి
వచ్చిన
తరువాత
‘నాన్నా!
నేను
బ్రహ్మతత్త్వాన్ని
గుర్తించాను’
అన్నాడు.
‘ఏమని
గుర్తించావు?’
అని
ప్రశ్నించాడు,
తండ్రి.
‘బ్రహ్మసర్వవ్యాపకుడు’,
అని
గుర్తించానని
బదులు
చెప్పాడు,
కుమారుడు.
కరవాలము
పట్టగానే
శూరత్వము
కలుగునా?
వీణ
చేతపట్టినంత
స్వరబద్ధుడు
తానగునా?
‘పిచ్చివాడా!
భగవంతుడు
సర్వవ్యాపకుడనే
సత్యాన్ని
మాటలలో
నేర్చుకున్న
చాలదు’
అని
వ్యాఖ్యానించాడు
ఉద్దాలకుడు.
ఈనాడు
ఇది
విద్యార్థియొక్క
బలహీనత.
నేర్చేది
అణుమాత్రము,
చెప్పుకొనేది
అనంతము.
ఇలాంటిది
పనికిరాదని
నచికేతుని
ఉద్దాలకుడు
ఖండించాడు.
‘ఒక
చిన్న
పాత్రతో
నీరు
తీసుకొనిరా’
అన్నాడు.
తండ్రి
దగ్గర
తెచ్చిపెట్టాడు.
మళ్ళీ
‘లోపలకు
వెళ్లి
అమ్మనడిగి
కొంత
చక్కెర
తీసుకురా!’
అన్నాడు.
చక్కెర
తెచ్చి
ఇచ్చాడు.
3
▾
Meaning
Keep
‘నీవు
చూడు
మొట్టమొదట’,
అన్నాడు.
తరువాత
చక్కెర
నీటిలో
చక్కగా
కరిగేటట్టుగా
చేయమన్నాడు.
నచికేతుడు
చేతిలోని
చక్కెరను
నీటిలో
తిప్పితిప్పి
కరిగేటట్టు
చేశాడు.
ఆ
తరువాత
ఉద్దాలకుడు
‘నచికేతా!
ఇప్పుడు
చక్కెర
ఎక్కడ
ఉందో
చూడు’
అని
చెప్పాడు.
నచికేతుడు
బాగా
కన్నులు
తెరచిచూచాడు.
చక్కెర
కనిపించలేదు.
‘చేయిపెట్టి
తీసుకో’
అన్నాడు,
తండ్రి.
చేయిపెడితే
చేతికి
చిక్కలేదు.
‘నాన్నా!
చేతికి
చిక్కలేదు.
కంటికి
కనిపించలేదు’,
అని
చెప్పాడు.
అప్పుడు
ఉద్దాలకుడు
చెప్పాడు.
‘చక్కెర
నీవే
తెచ్చావుకదా!
నీ
చేతితోనే
ఈ
జలమునందు
కలిపావుకదా!
అయితే
యిప్పుడు
నీ
చేతికి
చిక్కటంలేదు.
కంటికి
కనిపించటంలేదు.
ఎక్కడ
ఉన్నదో
చూచుకో’,
అన్నాడు.
‘నాకు
తెలియదన్నాడు’
నచికేతుడు.
రెండు
నీటి
చుక్కలు
నాలుకపై
వేసుకోమన్నాడు.
నాలుకపైన
వేసుకొని
‘నాన్నా!
ఈ
జలములో
చక్కెర
ఉన్నది’
అన్నాడు.
ఈ
చక్కెర
అడుగు
భాగములో
నున్నదా
లేక
పైభాగములోనున్నదా
చుట్టు
ఉన్నాదా?’
అని
ప్రశ్నించాడు
ఉద్దాలకుడు.
‘సర్వత్ర
ఉంటున్నది’
అన్నాడు.
ఇదియే
ఏకత్వము.
ఈ
జగత్తనే
పెద్దభాండములోపల
దివ్యత్వమనే
మాధుర్యము
చేర్చి
ప్రతి
మానవుడు
తాను
ఆచరించే
నిత్యకర్మలద్వారా
దానిని
చక్కగా
కరగింపచేసి
దివ్యత్వమును
అనుభవించాలి.
ఇదే
సాధన.
జగత్తనే
భాండములో
సర్వత్రా
వ్యాపించి
ఉండిన
దైవత్వమును
ఎట్లా
మీరు
చూడగలరు?
చేతికి
చిక్కడు,
కంటికి
కనిపించడు.
అనుభూతికి
మాత్రమే
లభ్యమవుతుంది.
ఈ
పాత్రలోనుండిన
మాధుర్యము
అడుగునా
ఉన్నది,
చుట్టూ
ఉన్నది,
పైన
ఉన్నది.
నాలుగుప్రక్కల
ఉంటున్నది.
అనగా
పాత్ర
పూర్తిగా
యీ
మాధుర్యమే
యిమిడి
ఉంటున్నది.
దివ్యత్వమనే
మాధుర్యము
సర్వత్రా
వ్యాపించియున్నది
విద్యార్థులారా!
చక్కగా
గుర్తించాలి.
అదే
విధముగా
మానవత్వమునందు
ఈ
మాధుర్యమనే
దివ్యత్వము
సర్వత్రా
వ్యాపించి
ఉన్నది.
కనుక
నీవు
చేసే
ప్రతి
పని
మాధుర్యంగా
ఉండాలి.
నీవు
చూచే
ప్రతి
చూపు
మధురమైనదిగా
ఉండాలి.
నీవు
పలికే
ప్రతి
పలుకు
మధురంగా
ఉంటుండాలి.
ఈ
విధంగా
ఏ
ఇంద్రియములద్వారా
వచ్చినా
అది
మధురంగానే
ఉండాలి.
4
▾
Meaning
Keep
Also in his talks
(3)
2 July 1989
The Ātma Principle Is Everywhere
12 September 1990
The body is a temple
11 July 1996
Lack of Values is the Cause of Violence in the World
నయనం
మధురం
వచనం
మధురం
హస్తం
మధురం
పాదం
మధురం
మధురాధిపతే
రఖిలం
మధురం
ఇదియే
ఏకత్వముయొక్క
ప్రధాన
లక్ష్యము.
నిజముగా
నీవు
మనస్సులో
మాట్లాడినప్పుడు
చాలా
కఠినంగా
వస్తుంది.
దీనిని
బట్టి
లోపల
మాధుర్యంలేదు.
వట్టి
జలమే
ఉంటున్నది.
భగవంతుడున్నాడు
అక్కడే.
కానీ
నీవు
సరియైన
రీతిగా
చూడటంలేదు.
కారణం
ఏమిటి?
అహంకారమమకారములనే
రోగము
లోపల
ఉండటంచేత!
మలేరియా
జ్వరము
శరీరములో
చేరినప్పుడు,
తీపు
తిన్నా
చేదుగా
ఉంటుంది.
తీపులో
లేదు
దోషము,
నాలుకలో
ఉన్నది.
అదే
విధముగా
నీ
దేహమందు
దివ్యత్వము
సర్వత్రా
వ్యాపించి
ఉంటున్నది.
కానీ
ఈ
అహంకార,
అభిమానములనే
రోగము
ఉండటంచేత
నీయొక్క
మనస్సు
మాధుర్యమును
కోల్పోయింది.
ఏ
కర్మలు
చేసినా
చిత్తశుద్ధితో
చేయాలి
ఏ
పనిచేసినా
మనం
మనస్ఫూర్తిగా
చేయాలి.
కేవలం
దేహముతో
చేసి
ప్రయోజనంలేదు.
మనస్సుతో
చేయాలి.
నిత్యము
స్వామి
ఉపదేశించే
ఉపదేశములన్నీ
మీ
శరీరములకుకాదు,
మనస్సునకు.
మనస్సుకు
ఉపదేశము
చేసినప్పుడు
శాశ్వతంగా
నిలిచి
ఉంటుంది.
కేవలం
మనిషివన్నంత
మాత్రమున
ఏమవుతుంది?
చెవులతో
వింటారు,
తరువాత
బయటకు
వదిలేస్తారు.
ఏ
కర్మలు
చేసినా
చిత్తశుద్ధిగా
చేయాలి.
‘చిత్తస్య
శుద్ధయే
కర్మః’
పవిత్రమైన
కర్మలలో
మన
జీవితమును
ప్రవేశపెట్టాలి.
పరోపకారసంబంధమైన
కర్మలు
ప్రారంభించాలి.
సమాజమును
సర్వేశ్వరునిగా
భావించి
సమాజ
సేవలో
ప్రవేశించాలి.
వైస్‌చాన్సలర్
సంపత్
జింక
విషయమును
కథలుగా
చెబుతూ
నారాయణుడు,
శివుడు,
కృష్ణుడు,
రాముడు
అని
అనేక
రకములుగా
చెబుతూ
వచ్చారు.
నా
ఉద్దేశ్యములో
వీరందరు
ప్రత్యేకమైనవారుగా
భావించటం
పొరపాటు.
‘ఏకంసత్
విప్రాః
బహుధా
వదంతి’
దైవం
ఒక్కడే!
‘అల్లా’
అని
పిల్చు,
‘జీసస్’
అని
పిల్చు,
‘గురునానక్’
అని
పిల్చు,
‘రామా!’
అని
పిల్చు,
‘కృష్ణా!’
అని
పిల్చు;
ఏ
పేరైనా
పిల్చుకో,
దైవం
ఒక్కడే!
ఎట్లనగా
యివన్నీ
దేహములో
కొన్ని
కొన్ని
అంగముల
వంటివి
మాత్రమే!
5
▾
Meaning
Keep
ఒక
చిన్న
ఉదాహరణ.
మన
దేహములో
ప్రాణమున్నది.
ఒకే
ప్రాణశక్తి,
ఒకే
రక్తము,
దేహములో
సర్వత్రా
సరఫరా
అవుతున్నాది.
ఉన్నది
ఒక
రక్తమే.
ఒకే
గుండే!
ఒకే
ప్రాణమే!
ఒక
లడ్డూ
నీ
చేతిలో
పెట్టుకుంటే
దాని
రుచి
నీకు
తెలుస్తుందా?
లేదు.
నాలుకపైన
పెట్టుకున్నప్పుడు
దాని
తీపిని
నీవు
గుర్తిస్తావు.
రక్తము
చేతియందు,
నాలుకయందు
ఒక్కటే!
కాని
నాలుకపై
మాత్రమే
దీని
మాధుర్యము
తెలుస్తుంది.
చేతిలో
ఎందుకు
తెలియకూడదు?
హస్తములిచ్చినదెందుకోతెలుసా,
మూతికి
ముద్దందించుటకా?
పాదములిచ్చినదెందుకోతెలుసా,
సందుగొందులు
తిరుగుటకా?
చెవులను
ఇచ్చినదెందుకోతెలుసా,
ఊరివారి
సుద్దులు
వినుటకా?
కాదుకాదు.
అదే
విధముగా
ఒక్కొక్క
యింద్రియము
ఒక్కొక్క
విషయమును
గుర్తించి,
ఆ
అన్ని
విషయములను
క్రోడీకరించి,
ఏకత్వంగా
మార్చుకొనే
నిమిత్తము
ఇవన్నీ
చేయబడినాయి.
ఈ
అన్నింటియొక్క
ఏకత్వము
అనుభవించాలి.
అప్పుడే
దివ్యత్వము
అవుతుంది.
రూప,
నామములు
వేరయినప్పటికి
దివ్యత్వము
ఒక్కటే!
చాలామంది
విద్యార్థులకు
హాస్టలులో
అనుభవము
ఉంటుంది.
పచ్చిమిరపకాయలు
తీసుకువస్తారు.
ఉప్పును
తీసుకువస్తారు.
చింతపండు
తీసుకువస్తారు.
కొబ్బరి
తీసుకువస్తారు.
వీటన్నింటిని
అట్లా
కలిపేస్తే
ఏమి
రుచి
ఉంటుంది?
ఏమీ
రుచి
ఉండదు.
అట్లుకాక
ఈ
నాల్గింటిని
వేసి
చక్కగా
రుబ్బినప్పుడు
చట్నీ
అనే
కొత్త
రూపము
ధరిస్తుంది.
అప్పుడే
నూతనమైన
రుచి
వస్తుంది.
తాంబూలములో
ఆకు
పచ్చగా
ఉంటుంది.
వక్క
గోధుమరంగుగా
ఉంటుంది.
సున్నము
తెల్లగా
ఉంటుంది.
ఈ
మూడింటిని
చేర్చి
మనము
నమిలినప్పుడు
ఎరుపురంగు
వస్తుంది.
అదే
విధముగా
మానవత్వములోనున్న
కొన్నికొన్ని
గుణములు
చేరినప్పుడు
కొన్ని
కొన్ని
అవతారములుగా
రూపొందుతూ
వస్తుంది.
సద్గుణములు,
సదాలోచనలు,
సచ్చింతనలు
మూడు
చేరినప్పుడు
సర్వేశ్వరుడుగా,
ఈశ్వరుడుగా
రూపొందుతుంది.
సత్కర్మ,
సచ్చింతన,
సదాలోచన
కలిగినప్పుడు
విష్ణుస్వరూపము
బయలుదేరుతుంది.
6
▾
Meaning
Keep
ఇదే
విధముగా
ఒక్కొక్కటి
ఒక్కొక్క
రూపనామము
ఉండినప్పటికి
అన్నింటియందు
ఉండే
దైవత్వము
ఒక్కటే!
ఇంద్రియములను
నిగ్రహించినప్పుడే
భగవదనుగ్రహము
ప్రాప్తిస్తుంది
చెవులు
వినగలుగుతున్నాయి;
కానీ
చూడలేవు.
కన్నులు
చూడగలుగుతున్నాయి;
కానీ
వినలేవు.
ముక్కు
వాసన
చూస్తుంది,
యింకే
పని
చేయలేదు.
ఈనాటి
మానవుడు
ఈ
యింద్రియములను
దుర్వినియోగము
చేసుకుంటున్నాడు.
నాలుకను
యిచ్చాడు.
‘బిక్షాన్నం
దేహరక్షణార్థం’.
‘నాయనా!
ఈ
దేహరక్షణ
నిమిత్తమై
పవిత్రమైన,
పరిశుద్ధమైన
తినతగిన
ఆహారము
నీవు
తిను.
అంతేగానీ
పొట్ట
ఉంది,
నోరు
ఉంది,
పండ్లు
ఉన్నాయి
అని
యిష్టము
వచ్చినవి
నమిలి
తిని
పొట్టకు
పంపించి
వేస్తే
చెడిపోతుంది’.
ఆరోగ్యము
చేకూర్చే
నిమిత్తమే
ఈ
ఉదరమునందించాడు.
ఏది
తింటే
ఆరోగ్యమో
దానిని
తినటానికి
ప్రయత్నించాలి.
ముక్కు
యిచ్చాడు.
‘నాయనా!
ఉచ్ఛ్వాసనిశ్వాసములచేతనే
ఊపిరితిత్తులు
పని
చేయించి
చక్కగా
జీవించు’,
అని
యిచ్చాడు.
కానీ
సక్రమమైన
పని
అది
చేయటంలేదు.
Snuff
తీసుకొని
పీలుస్తాడు.
ముక్కు
ఎందుకు?
చేసే
పని
ఏమిటి?
ఈ
పనులవల్ల
అనేక
రోగాలు
ప్రారంభమవుతున్నాయి.
ఏఏ
అంగములు
ఏఏ
మార్గములో
ఎప్పుడెప్పుడు
ఎక్కడెక్కడ
ఏ
విధంగా
అనుభవించాలో
ఆ
విధంగా
అనుభవించినప్పుడే
మానవత్వము
సార్థకమవుతుంది.
ఈనాడు
మానవుని
యింద్రియ
నిగ్రహం
పూర్తిగా
నిర్మూలమైపోయింది.
దీనిని
నిగ్రహము
చేసినప్పుడే
అనుగ్రహము
మనకు
ప్రాప్తిస్తుంది.
అనుగ్రహము
కావాలనుకున్నప్పుడు
నిగ్రహాన్ని
సాధించాలి.
‘సాధించెనే
ఓ
మనసా
సాధించెనే’
ఏది
సాధించాడు?
మానవత్వములో
ఉండిన
దివ్యత్వము
సాధించాడు.
త్యాగరాజు
దీనినే
చెబుతూ
‘నేను
సాధించానని
చెప్పుకుంటున్నాడు’.
దేన్ని
సాధించాడు?
‘నేను
రామతత్త్వాన్ని
సాధించాను’
అన్నాడు.
‘రామా!
నిన్ను
చూచిన,
నీతో
ఆడుకున్న,
నీతో
కలసిమెలసి
ఉన్న
దినము,
అదే
సరైన
జీవితము’
అన్నాడుః
శ్రీరామ,
జయరామ,
శృంగారరామయని
నుతించరాదె,
ఓ
మనసా!
దశరథుడు
శ్రీరామ
రారాయని
పిలువ
మును
తపమేమి
చేసెనో,
ఆ
దశరథుడు
తపమేమి
చేసెనో!
తళుకు
చెక్కులమోము
రామా!
తళుకు
చెక్కులమోము
ముద్దిడను
కౌసల్య
తపమేమి
చేసెనో,
ఆమె
తపమేమి
చేసెనో!
7
▾
Meaning
Keep
ఈ
విధంగా
త్యాగరాజు
పాడుకుంటూ
నీ
పాదములు
పట్టి
నెమ్మదిగ
జీవించు
ఈ
త్యాగరాజు
తపమేమి
చేసెనో
ఇదే
చాలు
నాకు
మాధుర్యము,
అని
ఈ
విధంగా
భగవంతునితో
సంబంధబాంధవ్యమును
గురించి
త్యాగరాజు
ప్రచార
ప్రబోధలు
చేస్తూ
వచ్చాడు.
దైవత్వము
సర్వజీవులయందు
ఉంటున్నది.
సర్వమానవులందు
ఉంటున్నది.
అందువలన
‘రామ’,
‘కృష్ణ’,
‘ఈశ్వర’
అని
రూప
భేదములకు
అవకాశము
యివ్వకుండా
మీరందరూ
మాట్లాడండి.
‘బ్రహ్మ
సృష్టించాడు,
విష్ణువు
రక్షించాడు,
శివుడు
శిక్షించాడు’
అని
ఈ
భేదములకు
ఏమాత్రము
అవకాశము
యివ్వకండి!
అందరు
ఒక్కటే!
‘ఇక్కడ,
అక్కడ,
ఎక్కడ
చూచిన
ఒక్కడే
ఆత్మలో
మక్కువ
ఉన్నాడు’
అన్నింటియందు
ఉన్నది
ఒక్కడే!
ఇది
చెవి,
యిది
ముక్కు,
యిది
నోరు,
యిది
చేయి,
యిది
కాలు
అని
చెప్పినంత
మాత్రమున
దేహము
వేరు
వేరు
అవుతుందా?
ఇవన్నీ
చేరినదే
దేహము.
అన్ని
రూపములు
కలసినదే
దైవము!
అన్ని
రూపములు
చేరినదే
దైవము
మీ
కందరికి
తెలుసు.
ఐదుమంది
గుడ్డివారు
ఒక
ఏనుగును
వర్ణించాలనుకున్నారు.
వారి
టీచరు
చెప్పాడు.
‘పిల్లలారా!
ఈ
ఏనుగు
ఎట్లా
ఉందో
మీరు
నిర్ణయించండి’
అని.
ఒకడు
ఏనుగుయొక్క
కడుపునంతా
చేతులతో
తడిమి
‘సార్!
ఏనుగు
ఒక
పెద్దగోడమాదిరిగా
ఉంటున్నాది’
అన్నాడు.
ఇంకొకడు
కాలు
పట్టి
చూచాడు.
‘సార్!
ఏనుగు
పెద్ద
స్తంభము
మాదిరి
ఉంటుంది’
అన్నాడు.
యింకొకడు
చెవులు
పట్టి
చూచాడు,
‘సార్!
ఏనుగు
ఒక
చేట
మాదిరి
ఉంటున్నాది’,
అన్నాడు.
ఒకడు
వెనుకకు
పోయి
తోక
పట్టాడు
‘యిది
ఒక
త్రాడు
మాదిరి
ఉంది’
అన్నాడు.
ఈ
విధంగా
చెప్పారు.
ఎవరు
చూచింది
వారిమటుకు
రైటే!
8
▾
Meaning
Keep
ఏనుగు
గోడమాదిరి
ఉందంటే
నిజమే!
ఇంకోడు
కాలు
స్తంభము
మాదిరి
అంటే
అదీ
నిజమే!
యింకోడు
చేట
మాదిరి
అంటే
అదీ
నిజమే!
అయితే
యిది
మాత్రమే
ఏనుగుకాదు.
ఇవి
అన్నీ
చేరినదే
ఏనుగు.
అదీ
మనము
ఈనాడు
గుర్తించాల్సింది.
రాముడు,
కృష్ణుడు,
అల్లా,
ఈశ్వరుడు,
జీసస్,
జోరాష్ట్రియన్
అన్నీ
విడివిడిగా
చెప్పుతున్నాం.
అన్నీ
చేరినదే
దైవము.
‘నేను
దైవము’
అనే
విశ్వాసమును
పెంచుకోండి
ఈ
ఏకత్వభావము
ప్రతివ్యక్తి
చక్కగా
గుర్తించుటకు
ప్రయత్నించాలి.
ఎక్కడికి
వెళ్లినా
మీరు
ఈ
భేదములకు
అవకాశము
యివ్వకండి.
దైవము
ఒక్కడే.
అతనే
గొప్పవాడు.
ఇంగ్లీషువారు
God
is
great
అంటారు.
దైవమే
గొప్పవాడు.
దీనికంటె
మించినది
మరొకటిలేదు.
గొప్పవాడైన
దైవము
అందరియందు
మెప్పుగానే
ఉంటున్నాడు.
అందరియందు
ఉంటున్నాడు.
కనుక,
ప్రతి
ఒక్కరు
యికపైన
దేహాన్ని
మానవత్వంగా
అనుభవించుకోండి;
కానీ
‘దైవము
నాలోనే
ఉన్నాడు,
నాలోనే
ఉన్నాడు’,
అనే
చక్కని
విశ్వాసము
బలపర్చుకోవాలి.
అదియే
మీరాకూడా
ప్రబోధించింది.
‘కృష్ణా!
మేరా
దిల్
తుమ్హారా
మందిర్’
నా
హృదయమే
నీ
నివాసము.
నా
హృదయములో
ఉన్నది
భగవంతుడు
ఒక్కడే’
అని
చెప్పింది.
నేను
దైవము
I
am
GOD
అనే
విశ్వాసము
క్రమక్రమేణా
మీరు
పెంచుకోండి.
దేహాన్ని
దైవకార్యములో
ప్రవేశపెట్టండి.
ఎందుకంటే
‘దేహో
దేవాలయ
ప్రోక్తో
జీవో
దేవ
స్సనాతనః’.
దేహము
ఒక
మందిరము.
అందులో
హృదయము
గర్భ
గుడి;
not
physical
heart.
హృదయము
కుడి
ప్రక్క
ఉంటున్నాది,
గుండె
ఎడమ
ప్రక్క
ఉంటున్నాది.
అందులో
దైవత్వము
‘నీలతోయద
మధ్యస్థా...’
నల్లటి
మేఘములలో
తెల్లగా
మించు
మించినట్లుగా
spinal
column
లో
ఒక్కతూరి
ఆలా
మించుతుంది,
విద్యులేఖ...
అది
వెన్నుపూసలో
9-12
పూసలమధ్య
ఉంటుంది.
దానివల్లనే
అన్ని
అంగములు
పని
చేస్తున్నాయి.
దైవత్వము
అంతటా
ఉంటున్నాది.
ఈ
సత్యము
గుర్తించి
భగవంతుడు
ఎక్కడోలేడు
నాయందే
ఉన్నాడు’
అనే
విశ్వాసమును
పెంచుకోండి.
అయితే
ఆ
అనుభూతి
వచ్చేంతవరకు
స్వామి
బోధలు
చక్కగా
విని
దానిని
ఆచరణలో
పెట్టి
దానిద్వారా
అనుభవించాలి.
9
▾
Meaning
Keep
తింటే
కడుపు
నిండుతుందిగానీ,
చూస్తే
కడుపునిండదే!
తట్టలో
నున్న
అన్నము
పొట్టలోకి
చేరాలంటే
ఏమి
చేయాలి?
చేతికి,
నోటికి
పని
చెప్పాలి.
అప్పుడే
తట్టలోది
పొట్టలోకి
చేరుతుంది.
అదే
రీతిగా
స్వామి
మీకు
అందిస్తున్నారు,
ఈ
ఆనందమును.
దానిని
మీరు
కేవలము
హృదయమనే
తట్టలో
పెట్టుకుంటున్నారు.
కానీ
బుద్ధితో
అనుభవించి
తినటానికి
ప్రయత్నించాలి.
అప్పుడే
దీని
ఆనందము,
దీని
పటుత్వము,
దీని
శక్తిసామర్థ్యములు
మీరు
అర్థము
చేసుకోటానికి
వీలవుతుంది.
విద్యార్థులారా!
ఇంద్రియములు
కేవలం
మన
స్వాధీనములో
ఉండేవి.
మనము
వాటికి
master
గా
ఉంటుండాలి.
కానీ,
దురదృష్టవశాత్తు
మీరు
యింద్రియములకు
దాసులైపోతున్నారు.
దైవమునకు
తప్ప
ఎవరికి
తలవంచవద్దు
‘దాసానుదాసుడను
కావలెనురా
నేను
నీ
దాసులకు
సేవనే
చేయవలెరా’
అన్నాడొక
కవి.
యింద్రియములు
మనకు
దాసానుదాసులు
కావాలి.
కాని
యింద్రియములకు
నీవు
దాసుడు
కావటం
ఎంత
ప్రమాదము!
తద్వారా
చాలా
ప్రమాదం
సంభవిస్తుంది.
Slave
మాట
నీవు
వినకూడదు.
కైకేయి
చాలా
ప్రియమైన
రాణి,
దశరథ
మహారాజుకు.
ఆమె
గొప్ప
మహారాణి.
కాశ్మీరు
రాజుగారి
బిడ్డ.
దశరథ
మహారాజు
భార్య.
ఇంత
ఉంటుండి
ఆమె
చెలికత్తె
మంథర
మాట
నమ్మటంచేత
ఆమె
పేరు
ఏమైపోయింది?
ఎవరైనా
ఆడవారిలో
‘కైక’
అని
పేరు
పెట్టుకుంటారా?
ఎవరైనా
‘మంథర’
పేరు
పెట్టుకుంటారా?
మంథర
అంటే
చెడ్డను
చెప్పేది.
చెడ్డను
వినేది
కైక.
కనుక,
ఈ
చెడ్డ
పేర్లు
ఎవరూ
పెట్టుకోటంలేదు.
అదే
విధంగా
మన
యింద్రియములు
మనకు
slaves.
వాటిని
మన
ఆధీనంలోకి
తీసుకుని
ఊరకే
కూర్చోమని
చెప్పాలి.
అవి
ఏవైనా
కోరటానికి
వస్తే
shut
up,
sit
down
అని
చెప్పాలి.
ఆ
విధమైన
శిక్షణ
యివ్వటానికి
మనం
తయారుగా
ఉంటుండాలి.
అట్టివాడే
వీరుడు,
ధీరుడు,
గంభీరుడు.
వాడే
నిజమైన
master.
మీరు
అట్టి
master
కావాలి
కానీ
యింద్రియములకు
slaves
కాకూడదు.
ఎవరికి
నీవు
దాసుడు?
దైవమునకు
తప్ప
ఎవ్వరికి
తలవంచవద్దు.
నీవే
దైవము!
నీవే
దైవము!
ఈ
విశ్వాసము
క్రమక్రమేణా
పెంచుకోటానికి
ప్రయత్నించండి.
10
▾
Meaning
Keep
His poems 28
అభిమాన,
అహంకారములనే
అడ్డుగోడలు
తొలగిస్తే
ప్రపంచమంతా
ఒక్కటే!
కొంతకాలములో
యావత్ప్రపంచమంతా
ఒకే
భావముతో
శాంతి
భద్రతలతో
తులతూగుతుంది.
అప్పుడు
‘లోకాస్సమస్తా
సుఖినో
భవంతు’
అని
చెప్పనక్కరలేదు.
లోకము
సుఖంగానే
ఉంటుంది.
ఏ
విధంగా?
మనం
ఈ
భావాన్ని
పెంచుకుంటే
లోకమంతా
సుఖంగానే
ఉంటుంది.
ఏదో
మన
భారతదేశమే
సుఖంగా
ఉండాలని
కోరుకోకూడదు.
యావత్ప్రపంచము
ఒక
పెద్ద
భవనమే!
ఆ
పెద్దభవనములో
భారతదేశము
ఒక
రూము.
అమెరికా
దేశము
ఒక
రూము.
చైనాదేశము
ఒక
రూము.
పాకిస్తాన్
ఒక
రూము.
అన్నిదేశములు
ఒక్కొక్క
రూముగా
ఉంటున్నాయి.
ఎక్కడైనా
5
స్టార్
హోటల్‌కి
వెళ్లి
చూడండి
ఎన్నో
రూములుంటాయి.
ఈ
విశ్వమందు
అన్నిదేశాలు
అన్ని
రూములుగా
ఉంటున్నాయి.
కాని,
అవి
విడివిడిగా
కనబడటానికి
ఏది
కారణము?
మధ్యలో
గోడలే
దీనికి
కారణము.
గోడలు
కొట్టి
వేసేయండి.
అంతా
పెద్ద
హాలుమాదిరి
ఉంటుంది.
ఆ
గోడలే
అభిమానము.
ఆ
గోడలే
అహంకారము.
ఈ
అభిమాన,
అహంకారమనే
గోడలు
కొట్టివేయండి.
అంతా
ఒక్కటే!
నేను
నీవాయెను,
నీవు
నేనాయెను
(నీవు
నేనుకూడి
నిజబోధలాయె)
నీవు
నేను
కూడి
నిజబోధ
సల్పితే
మానాభిమానాలు
మరియు
లేవాయె
క్షరముతానౌను
అక్షరము
తానౌను
క్షరమక్షరముకూడి
శాశ్వత
మెరిగితే
అమనస్కమౌను
అంతా
తానౌను
మాయకులోనౌను,
మాయ
తానౌను
మాయ
యిరువైఐదు
మర్మములగును
మాయ
యిరువైఐదు
మంత్రము
తెలిసితే
మాయ
మాయ
మాయ
మరి
బయలౌను.
రామా!
సీతారామా
11
▾
Meaning
Keep
అన్నాడు,
రామదాసు.
క్షరము
తానేను.
దేహము
తానే,
అక్షరము
తానేను.
ఆత్మ
తానే.
క్షరమక్షరముకూడి
శాశ్వత
మెరిగితే
అంతా
తానేను.
అంతా
తానే
అవుతాడు.
ఈ
సత్యాన్ని
చిన్న
చిన్న
విషయాలలో
మనము
ఎంతగానో
గుర్తించుటకు
వీలవుతుంది.
ఈ
భేదాలు
పెట్టుకోటంవల్ల
దేశముయొక్క
శక్తి
ఎంతవరకు
క్షీణించిపోతున్నాది!
ఈ
దేహములో
ఇన్ని
అంగములంతా
ఉన్నాయి.
యిందో
చేయి
తెగగొడితే
చేయిపోయింది
అని
అనుకుంటాంగానీ
common
property
అయిన
రక్తం
ఎంత
నష్టమై
పోయింది!
ఈ
body
ఎంత
బలహీనమై
పోయింది!
అదే
రీతిలో
దేశాన్ని
భిన్న
భిన్నం
చేయకూడదు.
అంతా
కలసిమెలసి
ఉండాలి.
అప్పుడే
ఎంతో
బలము
వస్తుంది.
అయిదువేళ్లు
కలసి
పనిచేస్తే
ఎంత
త్వరగా
పని
చేయవచ్చు!
ఒక్క
వేలుతో
ఏమైనా
పనిచేయగలవా?
ఏమి
చేయలేవు.
కనుక,
ఐకమత్యమే
మహాబలము.
ఆచరణే
దీని
అంతర్భావము.
ఈ
ఐకమత్యము,
అంతర్భావము
ఈ
రెండింటిని
ఏకముచేసి
జీవితాన్ని
శాంతిభద్రతలతో
జగత్తుకి
చాటటానికి
విద్యార్థులు
సంసిద్ధులు
కావాలని
నేను
ఆశిస్తూ,
ఆశీర్వదిస్తూ,
నా
ప్రసంగము
విరమిస్తున్నాను.
Previous
←
Only He Who Bows to God's Command Can Experience Divinity in Full
Next
‘Always, at All Times, Everywhere, I Alone’
→