Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1998 · The Oneness of Mind, Word and Deed Is Humanness
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The Oneness of Mind, Word and Deed Is Humanness
31 May 1998, Indiranagar, Bangalore
1
▾
Meaning
Keep
His poems 431
Also in his talks
(2)
25 June 1996
Man's Own Conduct Is the Cause of His Joys and Sorrows
13 July 1996
Hold on to Truth Under All Circumstances
మనసులోనున్న
భావంబు
మంచిదైన
కలిగితీరును
ఫలసిద్ది
కార్యమందు
మనసులోనున్న
భావంబు
మలినమైన
ఫలము
కూడను
ఆ
రీతి
మలినమౌను.
ప్రేమస్వరూపులారా!
మానవజీవితము
సంకల్పమయము.
సంకల్పములే
మానవుని
యొక్క
ఆస్తి.
ఎట్టి
సంకల్పములో
అట్టి
ఫలితమే
ప్రాప్తిస్తుంది.
సంకల్పములు
పురస్కరించుకొనియే
మానవుని
మాటలు,
చేష్టలు
జరుగుతూ
ఉంటాయి.
మానవుని
చేష్టలు
గానీ,
మానవుని
యొక్క
మాటలు
గానీ
సరిగా
లేకుండా
పోయినప్పుడు
సంకల్పముల
దోషమే.
సంకల్పములు
సరియైనవి
లేకపోవటం
చేత
ఈ
మాటలయందుగానీ,
చేష్టలయందుగానీ
కొన్ని
తప్పులు
ఏర్పడుతూ
ఉంటాయి.
‘యద్భావం
తద్భవతి.’
మానవుని
భావములు
పురస్కరించుకొనియే
మానవుని
జీవితము
ఆధారపడి
ఉంటున్నది.
మాటలకు
ఖర్చులేదు.
కాని
ఫలము
జాస్తి
ఉన్నది.
ఇట్టి
పవిత్రమైన
మాటలను
సక్రమమైన
మార్గములో
సరియైన
నడతలో
వినియోగించుకోటం
అత్యవసరం.
మాటయందు
పవిత్రమైన
శక్తి
యిమిడి
ఉంటున్నది.
మానవుని
యొక్క
అంతర్ధానతత్వము
మాటలచేతనే
ప్రకటించటానికి
వీలవుతుంది.
మాటలందున్న
ఆనందము,
మాధుర్యము,
మాటలయందున్న
మంచితనము
మరి
దేనియందు
లేదు.
దానిని
పురస్కరించు
కొనియే
మాటలయొక్క
స్వభావము,
మనసు
నుండి
ఏర్పడుతున్నది.
మనసు,
మాట,
చేష్టలు
ఈ
మూడింటి
ఏకత్వమే
మానవత్వమనిపించుకుంటుంది.
అందుకే
The
proper
study
of
mankind
is
man
అని
అన్నారు.
మన
సంకల్పములు
ఎట్టివో
మన
మాటలు
అట్టివి.
మన
మాటలు
ఎట్టివో
మన
పనులు
అట్టివి.
కానీ
ఈనాడు
మానవుని
యొక్క
సంకల్పములు
వేరు,
మాటలు
వేరు,
చేష్టలు
మరొక
రీతిగా
ప్రారంభమవుతున్నాయి.
2
▾
Meaning
Keep
మాటకు
ప్రాణము
సత్యము
మాటలోని
మాధుర్యము
మరిదేనిలోను
లేదు.
ప్రాచీన
కాలమునుండి
మాటల
యొక్క
మాధుర్యాన్ని,
మాటల
యొక్క
సత్యాన్ని,
మాటల
యొక్క
పవిత్రతను
వినియోగించుకుంటూ
రావటం
చేత
ఆనాడు
మాటకు,
నోటికి
తగిన
విలువ
ఉండేది.
ఈనాడు
మానవుని
మాటలు
కేవలం
విలువ
లేనివిగా
మారిపోవటం
చేత
ఈనాటి
నోటికి
కూడా
విలువలేకుండా
పోయింది.
నోటికి
ఈనాడు
విలువ
తగ్గిపోయిందంటే
కారణం
ఏమిటి?
మానవుని
మాటలోని
సత్యము
పతనమవటంచేత
నోటి
విలువకూడా
పతనమౌతుంది.
మాటకు
నోటికి
మధ్య
ఉండిన
సన్నిహిత
సంబంధము
మనము
చక్కగా
గుర్తించాలి.
ప్రాచీనులు
మాటకై
ప్రాణము
త్యాగము
చేసేవారు.
మాటకై
తమ
జీవితమునే
అంకితము
చేసేవారు.
“పలికి
బొంకుట
కంటె
పాపమున్నె”
అన్నట్లు
ఒక్కతూరి
మాటయిస్తే
చచ్చేంతవరకు
ఆ
మాటలోని
సత్యాన్ని
కాపాడుతూ
వచ్చేవారు.
ప్రాచీనులు
ఆ
విధమైన
జీవితం
గడుపుతూ
రావటంచేతనే
భారతదేశము
శాశ్వత
కీర్తి
అందుకుంటూ
వచ్చింది.
ప్రాచీనకాలమునుండి
భారతదేశము
ఎన్నో
ఆదర్శములను
అందిస్తూ
వచ్చింది.
కారణం
ఏమిటి?
వారి
జీవితములే
ఆదర్శ
జీవితములు.
వారి
జీవితములే
ఆనంద
జీవితములు.
కానీ
ఈనాడు
దురదృష్టవశాత్తు
భారతదేశము
స్వాతంత్ర్యము
పొందగలిగింది
గానీ
భారతీయులు
ఐకమత్యమును
పొందలేకపోతున్నారు.
ఈనాడు
ప్రతి
మానవుని
యందు
ఐకమత్యమనేది
ఎక్కడా
కనిపించటం
లేదు.
ఐకమత్యము
లేకపోవటం
చేత
మానవత్వము
విలువ
కోల్పోతూ
వచ్చింది.
ఒక
పార్టీ
అనిగానీ,
ఒకవ్యక్తి
అనిగానీ,
ఒక
సంఘమనిగానీ,
ఒక
సమావేశమనిగానీ
కాదు.
దేశ
గౌరవము
వ్యక్తులపై
ఆధారపడి
ఉంటున్నది.
వ్యక్తుల
యొక్క
భేదాన్ని
మనం
పాటించకుండా
దేశ
గౌరవము
కాపాడుకోటం
ప్రతి
భారతీయుని
కర్తవ్యము.
జీవితము
జరిగితే
చాలని
ఆశపడుతున్నాడే
గానీ
ఈ
జీవితము
ఏవిధంగా
జరగాలి,
ఎలాంటి
విలువలతో
జరగాలి,
ఎలాంటి
పవిత్రతతో
ఉండాలి
అనే
విషయము
యీనాడు
ఎవ్వరూ
విచారించటం
లేదు.
నోటుకున్న
విలువ
మాటకు
లేదు
ఈనాడు,
మాటకున్న
విలువ
నోటుకి
కూడా
లేదు
ఆనాడు.
పవిత్రమైన
మాటలు
ఈనాడు
హృదయము
నుండి
ఆవిర్భవించాలి.
ఈ
హృదయమునుండి
వచ్చిన
ఆనందమే
నిజమైన
ఆనందము.
బయటినుండి
వచ్చిన
ఆనందము
సరైన
ఆనందము
కాదు.
3
▾
Meaning
Keep
హృత్+దయ.
కరుణతో
కూడినది
హృదయము.
దయతో
కూడినది
హృదయము.
దయగల
హృదయమే
దైవమందిరము.
భగవంతుడు
ఎక్కడున్నాడంటే
హృదయమునందే
ఉన్నాడు.
అట్టి
హృదయములో
నివాసము
గావించుకున్నవాడు
భగవంతుడు.
భగవంతుడు
వేరే
ఒక
దేవాలయమునందుగానీ,
ఒక
చర్చిలయందుగానీ,
మసీదులందుగానీ,
క్షేత్రములందుగానీ
కాదు
ఉన్నది.
ప్రతి
ఒక్కరి
హృదయమునందు
భగవంతుడు
ఉన్నాడు.
అటువంటి
హృదయాన్ని
యిప్పుడు
అపవిత్రం
గావించు
కుంటున్నారు.
హృదయాన్ని
మాలిన్యం
గావించుకుంటున్నారు.
కనుక
చేసే
సర్వకర్మలు
కూడా
దుఃఖముతోను,
విచారముతోను,
అశాంతితోను
నిండి
ఉంటున్నాయి.
మానవుడు
ఆనందము
పొందలేకపోవటానికి
కారణం
ఏమిటి?
హృదయాన్ని
సరైన
రీతిలో
ఉపయోగించుకోటం
లేదు.
హృదయము
చాలా
ప్రధానమైనది.
దానికున్న
విలువ
దేనికిని
లేదు.
అలాంటి
హృదయాన్ని
పురస్కరించుకొనియే
మానవత్వము
అభివృద్ధి
పొందుతూ
వచ్చింది.
నీతి
కల్గిన
జాతి
మేలైనది
ఈనాటి
మానవుడు
లౌకికంగా,
వైజ్ఞానికంగా,
ఎంతో
ప్రగతిని
సాధించాడుగానీ
నైతికంగా,
ఆధ్యాత్మికంగా,
ధార్మికంగా
దినదినానికి
దిగజారిపోతున్నాడు
మానవుడు.
నైతిక
విలువలే
లేకుండా
పోతున్నాది.
మానవుడంటే
ఏమిటనే
సత్యాన్ని
కూడా
గుర్తించుకోలేకపోతున్నాడు.
పశువు
వలె
జీవిస్తున్నాడు.
మృగములవలె
సంచరిస్తున్నాడు.
కేవలం
ప్రాణములేని
జీవితంగా
తను
పోషించుకోబడుతున్నాడు.
అదికాదు.
ప్రాణమున్న
జీవితమునకు
నీతియే
ప్రధానము.
నీతియే
నిజాయితీ.
నిజాయతీయే
నిజమైన
జాతి.
కనుకనే
“నీతి
కల్గు
జాతి
నిజమైన
జాతిరా,
నీతిలేకయున్న
జాతి
చెడును”
అన్నారు.
జాతికి
నీతే
ముఖ్యమైనది.
నీతి
అనగా
morality.
ఈ
morality
కే
ప్రాచీనకాలమునుండి
“సత్యంవద”
అన్నారు.
సత్యమునే
చెప్తూ
ఉండటం
చేత
నీతి
నిల్చిపోతూ
వచ్చింది.
తరువాత
“ధర్మంచర”.
ధర్మం
ఆచరిస్తూ
రావాలి.
“సత్యం
బ్రూయాత్”
ఎప్పుడూ
సత్యమునే
పలుకు.
ఇది
నైతికము,
నీతి
యొక్క
సరైన
లక్షణము.
“ప్రియం
బ్రూయాత్”.
ఇది
ధార్మికము.
ఈ
సత్యం
కూడా
ఎట్లా
ఉండాలి?
ప్రియంగా
ఉండాలి.
“అనుద్వేగకరం
వాక్యం
సత్యం
ప్రియ
హితంచయత్”
అనగా
ఈ
సత్యము
ప్రీతిగాను,
హితంగాను,
ఆనందంగానూ
ఉంటుండాలి.
4
▾
Meaning
Keep
ఇదియే
నిజమైన
ధార్మిక
మార్గము.
ఇక
మూడవది
ఏమిటి?
“న
బ్రూయాత్
సత్యమప్రియం”.
ఇదే
ఆధ్యాత్మికము.
నైతికము,
ధార్మికము,
ఆధ్యాత్మికము
మూడు
ప్రాణములుగా
భావిస్తూ
వచ్చారు.
ఒకటి
శరీర
ప్రాణము,
రెండవది
మానసిక
ప్రాణము,
మూడవది
ఆత్మ
ప్రాణము.
The
one
you
think
you
are,
that
is
physical
life.
The
one
others
think
you
are,
the
mental
life.
The
one
you
really
are
i.e.
Atmic
life.
ఈ
మూడే
నైతికము,
ధార్మికము,
ఆధ్యాత్మికము.
ఈ
మూడింటి
యొక్క
జీవితాన్ని
మనము
ఏనాడు
కాపాడుకుందురో
ఆనాడే
మానవత్వము
వికసిస్తుంది,
ప్రకటిస్తుంది.
ఈనాటి
మానవుడు
మానవత్వం
అంటే
ఏమిటో
అర్థము
చేసుకోలేకపోతున్నాడు.
ప్రేమతత్వముతో
హృదయ
ధర్మాన్ని
పాటించు
మాటలందు
తీపి
మనసులో
చేదుండ
మంచికాదిది
మీకు
మచ్చ
గాని
మచ్చలేని
బ్రతుకు
మహిలోన
చెల్లురా
వినుము
భారతీయ
వీరసుతుడా!
కొద్ది
మంది
మాట
తీయగా
ఉన్నప్పటికి,
మనస్సులో
చేదుంటుంది.
మనస్సులో
చేదును
పెట్టుకోకూడదు.
మాటలో
లేకపోయినా
మనసులో
మాధుర్యం
ఉంటుండాలి.
ఇదియే
మానవునికి
ప్రధానమైన
విలువ.
ఈనాడు
ఆవిధంగా
కన్పించటం
లేదు.
మనస్సంతా
కేవలం
చేదుతో
నిండిపోయినది.
ఇలాంటి
మనస్సు
ఏనాడు
మార్పు
చెందుతుంది?
అందువల్లనే
దైవత్వమనేది
అభివృద్ధిపరచుకున్నప్పుడు,
ఐకమత్యమును
పెంచుకున్నప్పుడు
సహనము,
సానుభూతి
పెంచుకున్నప్పుడు
సమాజంలో
ఐకమత్యము
ఏర్పడుతుంది.
ఐకమత్యము
ఏర్పడినప్పుడే
దేశము
యొక్క
గౌరవము,
దేశము
యొక్క
మర్యాద,
లోక
కళ్యాణము
పోషించినవారవుతారు.
ఈనాడు
లోక
కళ్యాణము
గురించి
ఎవరు
విచారించటం
లేదు.
తాను,
తన
కుటుంబము
అంతవరకేపోతే
లోకము
యొక్క
పరిస్థితి
ఏమిటి?
5
▾
Meaning
Keep
Also in his talks
(1)
9 July 1998
By God's Grace Anything Can Be Achieved
మనము
లోక
కళ్యాణమునకు
తగిన
పాటుపడాలి.
అందరు
కలసి
ఏకంగా
కృషిచేయాలి.
అందరి
యొక్క
ఏకత్వమే
సమాజము.
ఈ
సమాజము
యొక్క
సంక్షేమమే
మానవుని
సహజధర్మము.
ధర్మమనగా
గృహస్థ
ధర్మము,
వాన
ప్రస్థ
ధర్మము,
సన్యాస
ధర్మము
ఇలాంటి
ఆశ్రమ
ధర్మాలు
కాదు.
ముఖ్యమైన
హృదయ
ధర్మాన్ని
పాటించాలి.
హృదయధర్మాన్ని
పాటించాలంటే
ప్రేమ
తత్వముతో
ఉండాలి.
ప్రేమకంటే
మించినది
మరొకటి
ఈ
జగత్తులో
కానరాదు.
ప్రేమ
ఉంటే
సర్వము
అక్కడే
ఉంటుంది.
కనుకనే
మాటకానీ,
ఆటకానీ,
ఏ
పనియైనా
ప్రేమద్వారా
ప్రారంభం
కావాలి.
ప్రేమచేత
ప్రారంభమైనప్పుడు
దివ్యత్వమనేది
ఏర్పడుతుంది.
ఈనాడు
మీకందరికి
తెలుసు.
మందిరాలు
కడుతున్నారు,
చర్చిలు
నిర్మిస్తున్నారు.
మసీదులు
కడుతున్నారు.
సమాజములు
ఏర్పరుస్తున్నారు
కానీ
యివన్నీ
ఏరీతిగా
మారిపోతున్నాయి.
అన్నీ
వ్యాపారరంగంగా
తయారైపోతున్నాయి.
మందిరాల్లో
వ్యాపారం.
మసీదుల్లో
వ్యాపారం,
చర్చిల్లో
వ్యాపారం,
సంస్థల్లో
వ్యాపారం,
సంఘములలో
వ్యాపారం.
అంతా
వ్యాపారం.
ఆధ్యాత్మిక
మార్గంలో
వ్యాపారానికి
చోటు
లేదు.
ఆధ్యాత్మికములో
heart
to
heart,
love
to
love.
ఇదే
నిజమైన
వ్యాపారం.
కాని
ఈనాడు
ప్రతిదానియందు
డబ్బు
డబ్బు.
ఈ
డబ్బు
కోసం
జీవితాన్నంతా
అమ్ముకుంటున్నారు.
ఇది
కాదు.
ప్రేమకోసం
అమ్ముకోవాలి.
త్యాగం
కోసం
అమ్ముకోవాలి.
దయకోసం
అమ్ముకోవాలి.
దయయే
మానవుని
ప్రధాన
లక్షణము.
అందుకే
‘దయగల
హృదయమే
దైవమందిరము’
అన్నారు.
అలాంటి
పవిత్రమైన
భావాల్ని
ఈనాడు
అభివృద్ది
పరచుకుంటూ
రావాలి.
ఏదో
చేస్తున్నారు
సేవలు.
అనేక
రకములుగా
సమాజములో
పాటుపడుతున్నారు.
కాని
ఇంత
మాత్రమే
చాలదు.
న
తపాంసి,
న
తీర్థానాం
న
శాస్త్రాణాం
జపానహీ
సంసార
సాగరోద్ధారే
సజ్జనం
సేవనం
వినా
అన్నట్లు
మానవత్వంలోపల
సజ్జనుల
యొక్క
సేవచేయాలి
మనం.
ఈ
సేవకంటే
మించినది
మరొకటి
లేదు.
దీనులను,
దిక్కులేని
వారికి
సాధ్యమైనంత
వరకు
సహాయపడి
వారికి
సహనము,
సహకారము
అందించాలి.
సహనము,
సహకారము
రెండూ
ఉండినప్పుడే
మానవత్వము
సజీవంగా
బ్రతుకుతుంది.
6
▾
Meaning
Keep
ఈనాడు
సహకారము
లేదు,
సహనము
లేదు,
సానుభూతి
లేదు.
కానీ
ప్రపంచములో
సానుభూతి
ఉండినట్లుగా
నటిస్తున్నారే
గానీ
సానుభూతి
కాదు.
మనము
ఒకవైపున
మాటలతో
గౌరవిస్తున్నా
కొన్ని
విధములుగా
మనస్సును
బాధిస్తున్నారు.
నోటితో
మాట్లాడుతున్నారు
గానీ
నొసటితో
సైగ
చేస్తున్నారు.
ఈ
విధమైన
చిల్లరాటలు
మానవులలో
ప్రారంభము
కాకూడదు.
మానవుడు
చాలా
ఉత్తముడు,
మానవుడు
చాలా
అధికుడు.
మానవుడు
చాలా
ఆదర్శవంతుడు.
ఇట్టి
ఆదర్శ
మానవుడు
ఆదర్శ
జీవితమును
అందిస్తూ
రావాలి
గ్రామములో
అనేక
బాధలకు
గురౌతున్నారు.
అనేక
ఇబ్బందులకు
గురౌతున్నారు.
నీరు
లేక
బాధపడుతున్నారు.
అనుకూలాలు
లేక
చాలా
బాధపడుతున్నారు.
ఆరోగ్యము
లేక
బాధపడుతున్నారు.
అన్నము
లేక
బాధ
పడుతున్నారు.
ఇలాంటి
వారికి
సాధ్యమైనంతవరకు
శక్తి
కొలది
సహాయము
చేయాలి.
ఈ
సహాయము
చేసినప్పుడే
నిజమైన
సేవగా
రూపొందుతుంది.
అంతే
గానీ
నా
యింటిలో
నేను
సుఖంగా
ఉండాలంటే
ప్రయోజనం
ఏమిటి?
ఇది
కేవలం
స్వార్థమే.
స్వార్థము
దాటి,
స్వప్రయోజనం
దాటి
పవిత్రమైన
మార్గములో
ప్రవేశించినప్పుడే
నిజమైన
ఆధ్యాత్మికము
అవుతుంది.
ఆధ్యాత్మిక
మనగా
కేవలం
పూజ
చేయటం,
భజన
చేయటం,
యోగం
చేయటం
యిది
మాత్రమే
కాదు.
సేవలలో
పాల్గొనాలి.
సేవ
చేయుట
కంటే
మించిన
జపము,
తపము
మరొకటి
లేదు.
ఏ
సేవచేసినా
నేను
మానవునికి
కాదు
చేసేది
మాధవునికే
చేస్తున్నాను
అనుకోవాలి.
ప్రతి
మానవునియందు
మాధవుడు
ఉంటున్నాడు.
“సర్వజీవ
నమస్కారం
కేశవం
ప్రతిగచ్ఛతి”,
“ఈశ్వరస్సర్వ
భూతానాం”.
అనగా
సర్వభూతములందు
ఉంటున్నది
దైవత్వమే
కనుక
ఎవరికి
సేవ
చేసినా
దైవత్వానికి
చేసినట్లుగా
భావించాలి.
యీనాడు
ఆధ్యాత్మిక
మార్గంలో
ప్రయాణమవుతున్నారు.
కానీ,
ఆధ్యాత్మికమంటే
ఏమిటని
మొట్టమొదట
గుర్తించాలి.
ఆధ్యాత్మికమనగా
విశాలమైన
హృదయం.
విశాలమైన
ప్రేమ.
ఈ
తత్వాన్ని
మనం
పొందాలి.
అంతేగానీ
రాగతాళములతో
భజన
చేసినంత
మాత్రమున
యిది
భజన
కాదు.
కేవలం
జపమాలపట్టి
ధ్యానం
చేసినంత
మాత్రమున
ధ్యానం
కాదు.
హృదయములో
పవిత్రమైన
భావములతో
నిండి
ఉండాలి.
దివ్యమైన
భావాలు,
నవ్యమైన
భావాలు
భవ్యమైన
భావాలతో
జీవితము
గడుపుతూ
రావాలి.
నిత్యజీవితమునకు
యిదే
ప్రధాన
ఆదర్శం.
7
▾
Meaning
Keep
Also in his talks
(5)
21 June 1989
Live as an Ideal
6 November 1989
Faith in Yourself Is Faith in God
27 April 1990
Give up selfishness: Cultivate unity
14 January 1998
Satya is heaven
1 October 1998
Aham, Ātma, Mind, Speech
ఈ
ఆదర్శాన్ని,
ఆశయాన్ని
పెంచుకున్నప్పుడు
ఎంతైనా
అభివృద్ధి
అవుతారు.
ఎన్నియో
దినములనుండి
మీరు
వింటున్నారు.
మీకందరికి
తెలుసు.
కొన్ని
సంవత్సరములనుండి
బెంగుళూరులో
గానీ,
మరి
యితర
ప్రదేశములలో
స్వామి
ప్రసంగాలు
వింటున్నారు.
బాగున్నాయని
అంటున్నారు
కానీ
ఒక్కడైనా,
ఒక్కదానిని
ఆచరణలో
పెట్టడానికి
ప్రయత్నించారా?
ఎవరు
పెట్టటం
లేదు.
ఆచరణలో
పెట్టలేనప్పుడు
విని
ప్రయోజనం
ఏమిటి?
తిన్నందుకు
జీర్ణం
కావాలి.
జీర్ణమైనందుకు
దేహం
పుష్టి
కావాలి.
దేహానికి
బలం
రావాలి.
కానీ
తిన్నది
జీర్ణం
కావటం
లేదు.
అజీర్ణ
రోగంగా
బయలుదేరిపోతున్నది.
ఆచరణలో
ఎక్కడా
కనిపించటం
లేదు.
కానీ
మాటలలో
మాత్రం
మానవుని
యొక్క
ధర్మాలు,
మానవుని
యొక్క
నీతులు
మానవుని
ప్రవర్తనలు
యిట్టివి,
అట్టివి
అని
కావలసినన్ని
లెక్చర్లు
యిస్తున్నారు.
ఇచ్చి
ప్రయోజనం
ఏమిటి?
మానవతా
గుణములు
సత్యము,
ధర్మము,
శాంతి,
ప్రేమ
అని
వర్ణిస్తున్నారు
కానీ
ఏమి
ప్రయోజనం.
మాటలలో
వల్లిస్తున్నారుగానీ
ఆచరణలో
ఒక్కటైనా
నిరూపించటం
లేదు.
నీవు
ఒక్కటైనా
ఆచరించి
నిరూపిస్తే
అంతే
చాలు.
పంటపండని
భూమి
పది
ఎకరములేల?
కొంచమైన
చాలు
మంచి
భూమి.
మార్పు
మూలం
నుండి
రావాలి
పండని
భూమి
ఎన్ని
ఎకరాలుంటే
ప్రయోజనం
ఏమిటి?
పంట
పండే
భూమి
కొన్ని
ఎకరాలున్న
చాలు.
అదేరీతిగా
ఆచరణలో
పెట్టేది
ఒక్కటుంటే
చాలు.
కానీ
ఆచరణ
లేకుండా
ఎన్ని
విధములైన
ఉపన్యాసములు
విని,
ఎంతమంది
పెద్దలను
దర్శించి,
ఎంతమంది
పెద్దలను
స్పర్శించి,
ఎంతమంది
పెద్దల
ఆశీర్వాదాలు
పొందుతున్నారు.
వీటివలన
ప్రయోజనము
ఏమిటి?
ఆ
పోయినందుకు
ఫలితము
ఏమిటని
విచారించుకుంటే
అంతా
జీరో.
ఈవిధమైన
జీరో
లైఫ్‌ను
మనం
పెంచుకోకూడదు.
సాధ్యమైనంతవరకు
అంతో
యింతో
హీరో
లైఫ్‌ను
పెంచుకోవాలి.
ఒక్కటైనా
మనము
ఆచరణలో
పెట్టటానికి
ప్రయత్నం
చేయాలి.
సంవత్సరాలు
జరిగిపోతున్నాయి.
కాలము
కదిలిపోతున్నాది.
జనాభా
పెరిగిపోతున్నాది.
కట్టకడపటికి
లీనమైపోతున్నాది.
ఏమి
దీనిలో
మనం
సాధించాం.
మానవుడు
మారాలి,
మానవుడు
మారాలి
అని
అనేక
రకములుగా
వర్ణిస్తున్నాము.
8
▾
Meaning
Keep
పుట్టినవాడు
పెరుగుతూనే
ఉన్నాడు.
బాలుడు
యువకుడవుతున్నాడు.
యువకుడైనవాడు
ముసలివాడవుతాడు,
కడకు
దేహాన్ని
వదలుతున్నాడు.
పెరుగుతూనే
ఉన్నాడు,
మారుతూనే
ఉన్నాడు.
కానీ
మనిషి
మారటం
కాదు
ముఖ్యము.
మనస్సు
మారాలి.
మనసు
మారినప్పుడే
నిజమైన
మార్పు.
జాతి
మారాలి,
నీతి
మారాలి.
అప్పుడే
మానవత్వం
మారుతుంది.
దేహము
ప్రధానం
కాదు.
దేహము
ఒక
నెగిటివ్.
పాంచభౌతికమైనది
ఈ
దేహము.
దేహము
పెరుగుతుంటే
మారుతూ
ఉంటుంది.
చిన్న
విషయం.
దేహము
జడమైనది.
దేహము
పెరుగుతూనే
ఉంటుంది.
జడమైనది
అయితే
ఎట్లా
పెరుగుతుందని
అనుకోవచ్చును.
పెరుగుతుంది.
దినము
యిల్లు
ఊడ్చి
చెత్తనంతా
గుంతలో
వేస్తుంటే
నెల
రోజులు
అయిన
తరువాత
గుంత
అంతా
పెద్దగా
పెరిగిపోతుంది.
చెత్తనంతా
వేయటం
వలనే
పెరుగుతున్నది.
అదేవిధముగా
మన
దేహానికి
మనము
యిడ్లీ,
దోసె
అన్నీ
వేస్తుంటే
యిది
కూడా
పెరుగుతూనే
ఉన్నది.
ఇదీ
ఒక
దిబ్బవంటిదే.
దీని
పెరుగుదల
ప్రత్యేకం
కాదు.
ఆహారమే
దీనికి
మూలకారణం.
పెరిగిందంటే
దీనికి
కారణం
ప్రాణతత్వం
కాదు.
మంచి
గుణములు
పెరగాలి.
గుణముండినప్పుడే
మనం
ఎంతైనా
సాధించటానికి
వీలవుతుంది.
కనుక
గుణములు
మార్చుకోవాలి.
మనిషి
మనస్సు
మారాలి.
మనస్సు
మారినప్పుడే
మనిషి
మారతాడు.
ఏవిధంగా
రావాలంటే
దైవప్రేమచేత
మనస్సు
తప్పక
పవిత్రమైపోతుంది.
ఈ
పవిత్రమైన
మనస్సువల్ల
పవిత్రమైన
కార్యములో
పాల్గొంటారు.
పవిత్రమైన
కార్యములవల్ల
పవిత్రమైన
ఫలితాన్ని
పొందుతారు.
ఈ
పవిత్రమైన
ఫలితాన్ని
పొందాలంటే
పవిత్రమైన
హృదయాన్ని
పెంచుకుంటూ
రావాలి.
హృదయంలో
పవిత్రత
లేకపోతే
సర్వం
వ్యర్థమైపోతుంది.
ప్రేమస్వరూపులారా!
భజనలు
చేయాలి,
ధ్యానం
చేయాలి.
యోగం
చేయాలి.
వదలకూడదు.
వాటితోబాటు
హృదయం
పవిత్రంగా
ఉన్నప్పుడు
అన్ని
పవిత్రమైపోతాయి.
“బ్రహ్మవిత్
బ్రహ్మైవ
భవతి”
అన్నట్లు
మీరు
చేసే
సాధనలతోబాటు
దైవభావం
కూడా
ఉండినప్పుడే
రెండు
విధాల
ఏకమైపోయి
దివ్యత్వము
పొందుతారు.
మానవుడు
మానవుడుగా
ఉండకూడదు.
మానవుడు
దైవంగా
మారిపోవాలి.
కలియుగ
ప్రభావము
వలన
మానవుడు
పశువుగా
మారుతున్నాడు.
మానవుడు
రాక్షసుడుగా
మారుతున్నాడు.
మానవుడు
దైవంగా
మారటం
లేదు.
దైవంగా
మారినప్పుడే
మానవుడుగా
పుట్టినందుకు
సార్థకము.
మీరు
తెలుసుకున్న
విషయాలను
ఒక
రెండైనా
ఆచరణలో
పెట్టి,
సరైన
మనస్సుతో
ఆనందమునందించి,
ఆనందము
అనుభవించటమే
కాక
పదిమందికి
ఈ
ఆనందమునందించాలి.
అప్పుడే
నిజమైన
త్యాగం
అవుతుంది.
ఈ
త్యాగముచేతనే
యోగం
కుదురుతుంది.
యోగం
లేక
రోగం
వచ్చేస్తుంది.
కనుక
త్యాగమే
యోగము.
యోగమే
భోగము.
9
▾
Meaning
Keep
అదే
నిజమైన
రాగము.
త్యాగము
లేకుండాపోతే,
భావములో
మార్పు
లేకుండాపోతే
జీవితమంతా
వ్యర్థమైపోతుంది.
మందిరాల్లో
నిత్యం
పూజలు,
జపము
జరుగుతూనే
ఉన్నాయి.
సమావేశాలు
జరుగుతూనే
ఉన్నాయి.
దీనితోబాటు
సాధనలు
చేయాలి.
సేవాకర్మలలో
పాల్గొనాలి.
ఎక్కడైనా
మురికివాడలు
ఉంటే
అక్కడికి
పోయి
పరిశుభ్రం
చేయాలి.
అప్పుడే
సరైన
ఆరోగ్యము
పొందినవారవుతారు.
అంతేకాక
సమాజమునకు
ఆరోగ్యము
నందించిన
వారవుతారు.
చేతనైంత
వరకు
ఏ
చిన్న
కార్యములోనైనా
పాల్గొని
సరైన
విలువను
అందించాలని
నేను
ఆశిస్తూ
నా
దీర్ఘ
ప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
ముఖ్యంగా
మందిరాలు
కట్టినందుకు
పరోపకార
సంబంధమైన
మార్గంగా
సేవలు
చేయాలి.
పరోపకారం
అంటే
ఏమిటి?
పర
ఉపకర.
పర-దైవత్వము,
ఉప-సమీపము,
కర-వెళ్ళు.
దేనికి
దగ్గర?
దైవత్వమునకు,
పవిత్రమైన
భావాల
దగ్గరకి
పో.
అదే
పరోపకారం.
ఏదో
ఒక
దానమో
ధర్మమో
చేశామంటే
అది
పరోపకారం
కాదు.
పరతత్వానికి
దగ్గర
పోవాలి.
అదే
నిజమైన
పరోపకారం.
ఈవిధముగా
మానవులు
సరైన
మనస్సు
మార్చుకుని
దివ్యమైన
భావాలు
పెంచుకొని
వయస్సు
పెరిగే
కొలది
భావాలు
కూడా
పెరుగుతూ,
త్యాగాలు
పెంచుకుంటూ,
రోగాన్ని
తగ్గించుకుంటూ
రావటం
మానవత్వానికి
సరైన
సాధన
అని
నేను
ఆశిస్తూ,
ఆశీర్వదిస్తూ
నా
ప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
Previous
←
Not the Man in Form: the Man of Conduct Is Needed
Next
By God's Grace Anything Can Be Achieved
→