Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2000 · Easwaramma: Compassion and Prema in Human Form
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Easwaramma: Compassion and Prema in Human Form
6 May 2000, Easwaramma Day, Brindavan
1
▾
Meaning
Keep
His poems 396
Also in his talks
(1)
19 November 1996
No Prema in the World Surpasses the Prema of God
కౌసల్య
వర
శుక్తి
గర్భమౌటను
కదా
రాముడు
దేవుడై
రమణ
గాంచె
సీతా
మహాసాధ్వి
చెలగి
పెంచుట
కదా
కవలు
కుశలవులు
ఘనులు
అగుట
జిజియా
లలామ
చెలగి
పెంచుట
కదా
వీర
శివాజియు
పేరు
గాంచె
పుతలీబాయి
రంజిల్లి
పెంచుట
కదా
గాంధీ
మహాత్ముడై
ఘనత
గాంచె
ఈశ్వరాంబా
సాధ్వి
ఎత్తిపెంచుటకదా
సత్యనారాయణ
ఖ్యాతిచెందె
ప్రాణికోటి
ఈ
రీతి
పరిమళించె
అహరహంబును
బ్రోచెడి
అమ్మ
కంటె
ఆదరంబగు
వస్తువు
అవని
గలదె?
అమ్మ
ప్రథమాక్షరంబె,
ఆద్యక్షరంబు
ప్రేమస్వరూపులారా!
మానవ
జీవిత
గమ్యము
సుఖము
కాదు,
దుఃఖము
కాదు.
ఈ
సుఖదుఃఖములు
రెండూ
ఎక్కడ
ఆవిర్భవించునో
ఆ
స్థానమును
గుర్తించినప్పుడే
మానవుడు
ధన్యుడౌతాడు.
సుఖముకంటే
దుఃఖమునందే
మానవుడు
జ్ఞానమును
అమితంగా
ఆర్జించుకోగల్గుతున్నాడు.
ప్రాచీన
మహర్షులు
జగత్తుకు
ఆదర్శములను
అందించటానికి
అనేక
కష్టనష్టములను
అనుభవించారు.
కనుకనే
ఈ
నాటికీ
వారి
ప్రబోధలు
భారతీయుల
హృదయాలలో
చిరస్థాయిగా
నిలిచిపోయినవి.
అదే
రీతిగా
మానవుడు
సమాజంలో
ఆదర్శవంతమైన
జీవితాన్ని
గడపవలెనన్న
అనేక
కష్టనష్టములకు
గురి
కావలసివస్తుంది.
కేవలం
కష్టనష్టములను
మాత్రమే
కాదు,
అనేక
నిందలను,
నిష్ఠూరములను
కూడా
ఎదుర్కొనవలసివస్తుంది.
2
▾
Meaning
Keep
కాని
మహనీయులు
కష్టములను,
నష్టములను,
నిందలను,
నిష్ఠూరములను
ఏమాత్రము
లెక్కచేయరు.
సమాజానికి
మంచిని
అందించటమే
వారి
లక్ష్యము.
ప్రేమస్వరూపులారా!
మీరు
సుఖమును
ఏ
విధంగా
స్వాగతిస్తారో
అదే
రీతిగా
దుఃఖమునుకూడా
స్వాగతించాలి.
సుఖదుఃఖములపట్ల
సమత్వాన్ని
వహించాలి.
మానవదేహంలో
ముఖము
పవిత్రమైనదని,
పాదములు
అపవిత్రమైనవని
మీరు
భావిస్తున్నారు.
కాని,
ఎవరైనా
అతిధి
మీ
ఇంటికి
వచ్చినప్పుడు
ముఖమునకు
మాత్రమే
స్వాగతం
పలికి
పాదములను
‘గెటౌట్’
(బయటికి
పో)
అనటానికి
వీలౌతుందా?
ముఖమునకు
స్వాగతం
పలికినప్పుడు
పాదములకుకూడా
స్వాగతం
పలకాలి.
అదేరీతిగా
సుఖం
కావాలంటే
దుఃఖమునకు
కూడా
స్వాగతం
పలకాలి.
ప్రేమధనముంటే
ప్రపంచమే
హస్తగతమౌతుంది
మీకు
ఏదైనా
వస్తువు
కావాలంటే
దానిని
కొనటానికి
మీవద్ద
తగిన
ధనముండాలి
కదా!
అదేరీతిగా
మీకు
సత్యము,
ధర్మము,
శాంతి,
అహింస
అనే
మానవతా
విలువలు
కావాలంటే
మీవద్ద
ప్రేమ
అనే
ధనం
ఉండాలి.
ప్రేమను
మించిన
ధనం
లేదు.
ప్రేమధనం
మీ
చేతిలో
ఉంటే
ప్రపంచమే
మీ
హస్తగతం
అవుతుంది.
ప్రేమధనంతో
సత్యమును
కొనవచ్చు,
ధర్మమును
కొనవచ్చు,
శాంతిని
కొనవచ్చు,
అహింసను
కొనవచ్చు.
ఈనాటి
మానవుని
యందు
ప్రేమ
క్షీణించటంచేతనే
తాను
మానవతా
విలువలను
పోషించుకోలేక
పోతున్నాడు.
మానవుడనగా
ఎవరు?
మానవతా
గుణములు
కలిగినవాడే
మానవుడు.
సత్యధర్మముల
ననుసరించని
మానవుడు
అంధుడనే
చెప్పవచ్చు.
భారతీయ
సంస్కృతి
“సత్యం
వద,
ధర్మం
చర”
అని
బోధించింది.
హరిశ్చంద్రుడు
సత్యంకోసం
తన
సర్వస్వాన్ని
త్యాగం
చేశాడు;
కట్టకడపటికి
తన
భార్యాబిడ్డలను
అమ్ముకున్నాడు;
తానుకూడా
అమ్ముడుపోయి
కాటికాపరిగా
పనిచేశాడు.
ఎన్ని
కష్టములు
ఎదురైనప్పటికీ
అతడు
సత్యవ్రతాన్ని
వీడలేదు.
అంతర్వాణిని
ఆలకించండి
కూటిపేద
మొదలుకొని
కోటీశ్వరునివరకు
ప్రతిమానవునికి
ప్రేమయే
నిజమైన
ఆస్తి.
భగవంతుడు
ప్రేమస్వరూపుడు,
అందరియందు
ప్రేమస్వరూపుడై
నిలిచియున్నాడు.
మానవునియందున్న
ప్రేమ
తత్త్వమునకు
వేదము
‘ఆత్మ’
అని
పేరు
పెట్టింది.
ఆత్మతత్త్వంతో
కూడినవాడు
కాబట్టి,
మానవునికి
వేదము
‘ఆత్మవాన్’
అని
పేరు
పెట్టింది.
3
▾
Meaning
Keep
ఆత్మ,
ప్రేమ
అనేవి
బ్రహ్మకు
పర్యాయ
పదములే!
ఆస్తికుడైనా,
నాస్తికుడైనా,
ఆస్తికనాస్తికుడైనా
అందరియందు
బ్రహ్మతత్త్వం
ఉన్నది.
ఈ
సత్యాన్ని
మన
ఉచ్ఛ్వాస,
నిశ్శ్వాసములు
దినమునకు
21,600
పర్యాయములు
‘సో...హం.’
(నేనే
బ్రహ్మ)
అని
ప్రకటిస్తున్నాయి.
ఈ
ఉచ్ఛ్వాస,
నిశ్శ్వాసములు
ఎక్కడినుండి
వస్తున్నాయి?
మానవుని
నాభికమలమునుండియే
ఆవిర్భవిస్తున్నాయి.
కనుకనే,
బ్రహ్మ
అనగా
విష్ణువుయొక్క
నాభికమలమునుండి
ఉద్భవించినవాడని
పురాణములు
వర్ణించాయి.
ఈవిధంగా
దినమునకు
21,600
పర్యాయములు
అంతర్వాణి
“నేనే
దైవం”
అని
బోధిస్తుంటే
మానవుడు
దానిని
వినిపించుకోకుండా
పుస్తకాలను
చదువుతున్నాడు.
వేదశాస్త్రాలను
పఠిస్తున్నాడు.
అంతర్వాణిని
అనుసరించక
ఎన్ని
చదివినప్పటికీ
ఫలితం
శూన్యం.
అంతరాత్మయే
మానవునికి
ప్రధానమైన
గురువు.
అంతరాత్మయే
బ్రహ్మ.
అంతరాత్మయే
దైవం.
భగవత్తత్త్వం
వేదము
భగవంతునికి
‘అమోఘుడు’
అని
పేరు
పెట్టింది.
అమోఘుడనగా
శాశ్వతమైనవాడు,
వర్ణనాతీతమైనవాడు
అని
అర్థం.
“నేను
అమోఘమైన
ఆనందాన్ని
అనుభవించాను”
అంటారు
కొంతమంది.
అమోఘమైన
ఆనందమంటే
అంత్యం
లేని
ఆనందమని
అర్థం.
భక్తుల
మనోభీష్టములను
నెరవేర్చటానికి
తాను
నిరంతరం
సంసిద్ధంగా
ఉంటాడు
కాబట్టి,
భగవంతునికి
‘సిద్ధః’
అని
కూడా
పేరుపెట్టారు.
కాని
భక్తుల
ప్రార్థనలు
సక్రమంగా
లేకపోవటంచేత
ప్రయోజనం
లేకపోతున్నది.
పరిపూర్ణభక్తితో
భగవంతుణ్ణి
ప్రార్థించినప్పుడే
మీ
సర్వాభీష్టములు
నెరవేరగలవు.
భగవంతుడు
సర్వ
జీవులయందు,
సర్వత్ర
ఉంటున్నాడు.
అతనికి
కావలసింది
ఏమీ
లేదు.
అతనికి
ఎలాంటి
కోరికలూ
లేవు.
అతడు
ఏది
కోరినా,
ఏది
సంకల్పించినా
భక్తుల
శ్రేయస్సు
నిమిత్తమే.
భగవంతునికి
నిరుపేద
మొదలు
చక్రవర్తివరకు
అందరూ
సమానమే.
సర్వమానవులకు
నిజమైన
స్నేహితుడు
భగవంతుడొక్కడే.
సర్వమానవులకు
సమానమైన
‘ప్రాపర్టీ’
(ఆస్తి)
భగవంతుడొక్కడే.
దివ్యత్వాన్ని
అనుభవించటానికి
అందరికీ
సమానమైన
హక్కు
ఉంది.
అయితే
అందుకు
తగిన
హృదయ
పవిత్రతను
మానవుడు
అభివృద్ధిపర్చుకోవాలి.
‘కంపేషన్’
(దయ)
తో
నిండినదే
హృదయము.
కాని
ఈనాడు
‘ఫ్యాషన్’
తప్ప
‘కంపేషన్’
అనేది
కనిపించటం
లేదు.
మనస్సున్నవాడే
మానవుడు.
సంకల్పములయొక్క
చేరికయే
మనస్సు.
4
▾
Meaning
Keep
అయితే
సంకల్పములెలా
ఉండాలి?
సత్యసంకల్పములుగా
ఉండాలి.
సత్యసంకల్పములు
లేనివాడు
మానవుడే
కాదు.
ఆదర్శమాత,
ఆదర్శపుత్రుడు
ఈశ్వరచంద్ర
విద్యాసాగర్,
వృద్ధురాలైన
అతని
తల్లి
కలకత్తా
సమీపంలోని
ఒక
చిన్న
గ్రామంలో
నివసించేవారు.
వారు
చాల
బీదవారు
కావటంచేత
వారికి
తినటానికి
సరియైన
తిండికూడా
ఉండేది
కాదు.
తల్లీకొడుకు
లిద్దరూ
అంబలి
త్రాగి
ఆకలి
తీర్చుకునేవారు.
విద్యాసాగర్
చదువుపై
శ్రద్ధ
కల్గినవాడు
కావటంచేత
కష్టపడి
చదివి
న్యాయశాస్త్రంలో
పట్టభద్రుడయ్యాడు.
అతడు
రాత్రిపూట
వీథిదీపాల
వెలుతురులో
చదువుకోవలసివచ్చేది.
“శ్రద్ధావాన్
లభతే
జ్ఞానం”
శ్రద్ధ
ఉన్నవాడు
ఎక్కడున్నా
చదవగలడు,
ఎంతటి
ఘనకార్యమైనా
సాధించగలడు.
కష్టములు
కాని,
సుఖములు
గాని
శాశ్వతంగా
ఉండవు.
కొంతకాలం
జరిగిన
తరువాత
ఈశ్వరచంద్ర
విద్యాసాగర్‌కు
కష్టాలు
తీరి
మంచి
ఉద్యోగం
చిక్కింది.
అతనికి
మంచి
జీతం
వచ్చేది.
ఒకనాడు
అతడు
కొంత
ధనం
తీసుకువచ్చి
“అమ్మా!
ఈ
డబ్బుతో
మీరు
మంచి
చీరలు,
నగలు
కొనుక్కోవాలి”
అని
కోరాడు.
అప్పుడామె
“నాయనా!
నాకిప్పుడేమీ
వద్దు.
సమయం
వచ్చినప్పుడు
నేనే
అడుగుతాను”
అన్నది.
అతడు
తల్లికి
ఎప్పుడూ
ఎదురు
చెప్పేవాడు
కాదు.
అతని
వినయం
అలాంటిది.
మరి
కొంతకాలానికి
అతని
జీతం
బాగా
పెరిగిపోయింది.
ఒకనాడు
అతడు
తల్లిదగ్గర
కూర్చుని
“అమ్మా!
నా
దగ్గర
ధనం
అధికంగా
ఉంది.
మీ
కోరిక
ఏమిటో
ఇప్పుడైనా
చెపుతారా?”
అని
అడిగాడు.
అప్పుడామె
చెప్పింది.
“నాయనా!
నాకు
మూడు
నగలు
కావాలి.
అందులో
మొదటి
నగను
ఈనాడు
నేను
కోరుతున్నాను.
మన
గ్రామంలో
చిన్న
చిన్న
పిల్లలు
చాలమంది
ఉన్నారు.
ఇక్కడ
స్కూలు
లేకపోవటంచేత
వారు
చదువుకోవటానికి
చాల
దూరం
వెళ్ళవలసివస్తోంది.
వారు
ఇంటికి
తిరిగి
వచ్చేంతవరకు
తల్లిదండ్రులకు
బెంగగా
ఉంటోంది.
కాబట్టి
నీవు
మన
గ్రామంలో
ఒక
చిన్న
స్కూలు
కట్టించు.
అదే
నేను
కోరే
మొట్టమొదటి
నగ”
అన్నది.
ఆమె
కోరిక
ప్రకారం
స్కూలు
కట్టించాడు.
కొంతకాలమైన
తరువాత
ఆమె
కుమారునితో
“ఈ
గ్రామంలో
ఒక
చిన్న
ఆసుపత్రి
అయినా
లేకపోవటంచేత
ప్రజలు
చాల
ఇబ్బందికి
గురిఅవుతున్నారు.
కనుక
ఒక
చిన్న
ఆసుపత్రి
కట్టించు
నాయనా!
ఇదే
నేను
కోరే
రెండవ
నగ”
అన్నది.
5
▾
Meaning
Keep
విద్యాసాగర్
ఆసుపత్రినికూడా
కట్టించాడు.
తల్లి
ఎంతో
ఆనందించింది.
ప్రజలు
అతనిని
ఎంతో
మెచ్చుకున్నారు.
అతని
పేరు
ప్రతిష్ఠలు
దినదినాభివృద్ధి
నొందసాగాయి.
మరి
కొంతకాలమైన
తర్వాత
తల్లి
అతనితో
“నాయనా!
మనగ్రామంలో
చేదుడు
బావులు
ఎండిపోయాయి.
చిన్న
చిన్న
పిల్లలు
చెంబులకు
త్రాళ్ళు
కట్టి
బావిలోకి
విడుస్తుంటే
నీరు
ఒక్క
చుక్కైనా
రావటం
లేదు.
కాబట్టి
మన
గ్రామంలో
నీటి
ఎద్దడిని
తీర్చటానికి
ప్రయత్నించు”
అని
చెప్పింది.
తల్లికోరిక
మేరకు
విద్యాసాగర్
తన
గ్రామ
ప్రజలకు
త్రాగునీటి
సౌకర్యం
కల్పించాడు.
ఆ
తల్లి
ఎంతో
ఆనందంతో
తన
కుమారుని
చేతులు
పట్టుకొని
“నాయనా!
సమాజానికి
సహాయం
చేసే
సద్బుద్ధి
కలిగిన
నీవంటి
కుమారుణ్ణి
కన్నందుకు
నేనెంతో
గర్విస్తున్నాను”
అన్నది.
ధర్మాచరణ
క్షీణించటమే
నీటికొరతకు
మూలం
నీటికొరత
ఏర్పడటానికి
కారణమేమిటి?
ప్రజలలో
ధర్మాచరణ
క్షీణించినప్పుడే
భూమిలో
నీరు
తరిగిపోతుంది.
ప్రజలు
సత్యధర్మాలను
అనుసరిస్తే
నీటికి
కొరతే
ఉండదు.
వర్షాలు
కురుస్తున్నాయి,
నదులు
ప్రవహిస్తున్నాయి.
అయినా
నీటికొరత
ఏర్పడటమేమిటి!
ప్రవహించే
నదులన్నీ
సముద్రంలో
కలసిపోతున్నాయి.
కాలమార్పుచేత
వర్షాలు
సరిగా
కురవటంలేదని
ప్రజలు
కాలంపై
నిందలు
వేస్తున్నారు,
దేవునికి
ఆగ్రహం
వచ్చింది
కాబట్టి,
నీరు
చిక్కటంలేదని
అంటున్నారు.
ఇది
కేవలం
అసత్య
ప్రచారం
తప్ప
మరొకటి
కాదు.
ముఖ్యంగా
మానవుని
హృదయంలో
దయ,
ప్రేమలు
సన్నగిల్లటంచేతనే
నీటికి
కొరత
ఏర్పడింది.
దీనికి
మూలకారణం
ప్రజల
దుర్బుద్ధులేగాని,
దేవుని
ఆగ్రహం
కాదు.
ఈనాడు
భారతదేశంలో
కావలసినంతమంది
శ్రీమంతులున్నారు,
విద్యావంతులున్నారు,
పండితులున్నారు.
కాని
వారిలో
ఐకమత్యం
లేదు.
ఒక
విద్యావంతుణ్ణి
చూస్తే
మరొక
విద్యావంతునికి
అసూయ;
ఒక
శ్రీమంతుణ్ణి
చూస్తే
మరొక
శ్రీమంతునికి
అసూయ.
ఇలాంటి
దుర్గుణాలు
కల్గినవాడు
ఎంతటి
శ్రీమంతుడైతే
ప్రయోజనమేమిటి;
ఎంతటి
విద్యావంతుడైతే
ప్రయోజనమేమిటి;
భారతదేశంలో
ఎంతమందో
కోటీశ్వరులున్నారు.
కాని
వారు
ఇంకా
సంపాదించాలనే
దురాశచేత
దుర్గతి
పొందుతున్నారు.
తాము
సంపాదించింది
విదేశాల్లో
పెట్టి
కన్ను
మూస్తున్నారు.
స్వదేశంలో
ప్రజలకు
ఎందుకు
సహాయం
చేయకూడదు?
సమాజాభివృద్ధికి
ఎందుకు
పాటుపడకూడదు?
మాటలు
మాత్రం
తీయగా
మాట్లాడతారు.
మాటలు
చూస్తే
తీపి,
చేతలు
చూస్తే
చేదు!
6
▾
Meaning
Keep
His poems 518
చెబుతారు
కోటి,
చెయ్యరు
ఒక్కటీ!
చేయనప్పుడు
చెప్పటం
ఎందుకు?
ఈనాడు
అనేకమంది
సమాజం
ఈరకంగా
ఉండాలి,
ఆరకంగా
ఉండాలి
అని
వేదికలపై
పెద్ద
పెద్ద
ఉపన్యాసాలిస్తున్నారు;
త్యాగం
గురించి
గొప్పగా
బోధిస్తున్నారు,
కాని
వేదిక
దిగిన
తరువాత
త్యాగం
ఎక్కడికి
పోతుందో,
తామెక్కడికి
పోతారో!
ధనమున్నప్పటికీ
త్యాగం
చేయకపోతే
ప్రయోజనమేమిటి?
ఈశ్వరచంద్ర
విద్యాసాగర్వలె
ఒక
చేత్తో
సంపాదించింది
మరొక
చేత్తో
త్యాగం
చేయాలి.
ప్రతి
మానవునికి
త్యాగగుణం
అత్యవసరం.
వేదము
చెప్పింది,
“నకర్మణా
నప్రజయా
ధనేన
త్యాగేనైకే
అమృతత్వ
మానశుః”
త్యాగం
ద్వారానే
అమృతత్త్వం
ప్రాప్తిస్తుంది.
విద్యకు
వినయమే
భూషణం
ఈశ్వరచంద్ర
విద్యాసాగర్
నిరహంకారి,
నిరాడంబరుడు.
అతడు
గొప్ప
వాగ్ధాటి
కల్గినవాడు.
అతని
ఉపన్యాసాలకు
వినటానికి
వేలాదిమంది
గుమికూడేవారు.
ఒక
పర్యాయం
ఒక
పట్టణంలో
అతని
ఉపన్యాసం
ఏర్పాటు
చేయబడింది.
అక్కడికి
అతడు
రైలులో
ప్రయాణమై
వెళ్తున్నాడు.
అతని
ప్రసంగాన్ని
వినటంకోసం
బయల్దేరిన
ఒక
I.C.S
ఆఫీసర్కూడా
అదే
కంపార్టుమెంటులో
ఎక్కాడు.
దిగవలసిన
స్టేషన్
వచ్చింది.
విద్యాసాగర్
ఒక
చిన్న
పెట్టెతో
దిగాడు.
ఆ
ఆఫీసర్
చేతిలో
కూడా
ఒక
చిన్న
పెట్టె
ఉంది.
పెద్ద
పెద్ద
చదువులు
చదివేటప్పటికి
కొందరికి
అహంకారంతో
కళ్ళు
నెత్తికెక్కుతాయి.
ఈ
చదువులే
అలాంటివి.
కనుకనే
నేను
అప్పుడప్పుడు
చెబుతుంటాను
-
“చదువులన్నియు
చదివి
చావంగనేటికి?
చావులేని
చదువు
చదవవలయు”
అని.
ఆ
ఆఫీసర్
రైలు
దిగుతూనే
“కూలీ
కూలీ”
అని
అరవటం
ప్రారంభించాడు.
విద్యాసాగర్
అతనివద్దకు
వెళ్ళి
“ఈ
పెట్టె
మాత్రమేనా?
ఇంకేమైనా
సామాన్లున్నాయా?”
అని
అడిగాడు.
“ఏమీ
లేదు,
ఈ
చిన్న
సూట్‌కేసు
మాత్రమే
ఉంది”
అన్నాడు.
కొన్నకూర
బేడ,
కూలియా
పావలా
ఇదియె
నాగరికత
ఇపుడు
మనకు
ఎవరి
పనులు
వారు
ఏమరకుండగ
నిర్వహించుకొనుట
నేర్వవలయు
ఆధునిక
విద్యావంతులు
ఆడంబరాలకోసం
ఎంతో
ధనాన్ని
దుర్వినియోగ
పర్చుతున్నారు.
7
▾
Meaning
Keep
అది
తమకు
గౌరవమని
భావిస్తున్నారు.
కాని
అది
గౌరవం
కాదు.
వినయవిధేయతలవల్లనే
గౌరవం
కల్గుతుంది.
“ఈ
చిన్న
పెట్టెను
మోయటానికి
కూలీ
కావలెనా!
వద్దు,
నేను
తీసుకు
వస్తాను”
అని
విద్యాసాగర్
అతని
సూట్‌కేసును
పట్టుకుని
“మీరెక్కడికి
వెళ్ళాలి?”
అని
అడిగాడు.
అతను
ఒక
హోటల్లో
దిగాలని
చెప్పాడు.
విద్యాసాగర్
ఒక
హోటల్
వరకు
ఆ
పెట్టెను
మోసుకుని
వెళ్ళాడు.
ఆ
ఆఫీసర్
విద్యాసాగర్‌ను
ముందెన్నడూ
చూసి
యుండకపోవటంచేత
ఇతనెవరో
కూలీ
అయియుండవచ్చునని
భావించి,
హోటల్వద్దకు
వచ్చిన
తరువాత
డబ్బు
ఇవ్వటానికి
పర్సు
తీశాడు.
“అయ్యా,
నీ
డబ్బు
నాకక్కర్లేదు.
డబ్బుకోసం
నేనీ
పనిచేయలేదు.
ప్రేమకోసం
చేశాను”
అని
పలికి,
విద్యాసాగర్
అక్కడినుండి
వెళ్లిపోయాడు.
తరువాత
ఆ
ఆఫీసర్
విద్యాసాగర్
ప్రసంగాన్ని
వినటానికి
వెళ్ళాడు.
ఆ
రోజు
స్టేషన్లో
తన
పెట్టెను
మోసిన
వ్యక్తికి
వేదికపై
పెద్దలందరూ
పూలదండలు
వేయటం
చూశాడు.
“అరెరే...
ఈశ్వరచంద్రవిద్యాసాగర్
ఇతడేనా!
ఎంతటి
నిరహంకారి!”
అనుకున్నాడు.
తాను
చేసిన
పనికి
సిగ్గుపడ్డాడు.
సభ
ముగిసిన
తరువాత
విద్యాసాగర్
వద్దకు
వెళ్లి
అతని
రెండుచేతులు
పట్టుకొని
క్షమాపణ
కోరుకున్నాడు.
ఈశ్వరుని
అమ్మ
ఈశ్వరమ్మ
ఈనాడు
‘ఈశ్వరమ్మ
డే’
ను
జరుపుకుంటున్నాము.
ఈశ్వరమ్మ
అంటే
ఎవరు?
ఈశ్వరుని
అమ్మ
ఈశ్వరమ్మ.
ఈ
పేరు
ఆమెకు
తల్లిదండ్రులు
పెట్టినది
కాదు,
ఈ
దేహానికి
తాతయైన
కొండమరాజు
పెట్టాడు.
ఆమెకు
తల్లిదండ్రులు
పెట్టిన
పేరు
నామగిరియమ్మ.
కాని,
ఆమెకు
వివాహమైన
తరువాత
ఒకనాడు
కొండమరాజు
“అమ్మా!
నీకు
నామగిరియమ్మ
అనే
పేరు
సరిగా
లేదు.
ఈశ్వరమ్మ
అనేదే
నీకు
తగినపేరు”
అన్నాడు.
ఆనాటినుండి
ఆమెను
ఈశ్వరమ్మ
అని
పిలుస్తూ
వచ్చాడు.
ఎందుకంటే
ఆమె
ఈశ్వరునికి
అమ్మ
కాబోతున్నదని
ఆయనకు
తెలుసు.
ఈశ్వరమ్మ
చాల
బీద
కుటుంబంలో
ఉండేది.
ఏనాడూ
ఆమె
చేతిలో
నయాపైసా
లేదు.
ఆమె
అన్నం
తిని
ఎరుగదు;
నిత్యమూ
రాగిసంకటే.
నా
వాడుకకూడా
అదే!
కర్ణాటకలో
చాలమంది
రాగిసంకటి
తింటారు.
నాకు
అదే
చాల
ఇష్టం.
పిల్లలు
కూర్మాలు,
ఇంకా
ఏవేవో
తింటారు.
కాని
నాకు
అవి
ఇష్టం
లేదు.
సంకటితో
శనక్కాయ
పచ్చడి
అంటే
నాకు
చాల
ఇష్టం.
ఈ
రెండూ
మన
పుట్టపర్తిలో
దొరికేవే.
ఇక్కడకు
వచ్చే
సమయంలో
కూడా
పుట్టపర్తినుండి
రాగిపిండిని
తీసుకొని
వస్తుంటాను.
8
▾
Meaning
Keep
కొడైకెనాల్‌కు
పోయినా
రాగిపిండిని
తీసుకొనిపోతాను.
నా
తిండి
అంతే!
ఈశ్వరమ్మ
చదువుకోలేదు.
ఈనాటి
విద్యావంతుల
నడతను,
ఫ్యాషను
చూస్తే,
ఒకవిధంగా
చదువు
తెలియకపోవటమే
చాల
మంచిదనుకుంటాను.
ఈ
దేహానికి
ఏడున్నర
సంవత్సరాల
ప్రాయంలో
పిల్లలందరికీ
పండరి
భజన
నేర్పించేవాడిని.
ఆ
అడుగులు
వేస్తూ,
ఆ
పాటలు
పాడుతుంటే
ఈశ్వరమ్మ,
సుబ్బమ్మ
ఎంతో
ఆనందించేవారు.
ఒకనాడు
వెంకమరాజు
ఇంటి
ఖర్చులకోసం
ఇచ్చిన
డబ్బులో
ఈశ్వరమ్మ
దగ్గర
రెండణాలు
మిగిలాయి.
వాటికి
రెండుమూటల
బొరుగులు
వచ్చినాయి.
ఈ
బొరుగులను
ఆమె
పిల్లలందరికీ
పంచిపెట్టింది.
ఆమె
చాల
త్యాగభావం
కల్గినది.
ఎవరు
వచ్చినా
ప్రేమతో
పలకరించేది.
స్వామి
చూడలేదని
ఎవరైనా
బాధపడితే
“స్వామి
ఏది
చేసినా
మీ
మంచికోసమే!
మీరేమీ
బాధపడవద్దు”
అని
బోధచేసేది.
చదువుకోసమని
నన్ను
ఉరవకొండకు
తీసుకువెళ్ళినప్పుడు
నేను
పదిమంది
పిల్లలకు
రాత్రిపూట
చదువు
చెప్పేవాడిని.
నేను
అక్కడినుండి
వచ్చేటప్పుడు
ఆ
పిల్లలందరూ
చాల
బాధపడ్డారు.
ఒక్కొక్కరు
ఒక్కొక్క
బొట్టు
గురుదక్షిణగా
తెచ్చి
ఇచ్చారు.
బొట్టు
అంటే
మూడు
పైసలు.
నాల్గు
బొట్లు
కలిపితే
ఒక
అణా
అవుతుంది.
ఆ
పిల్లలు
తెచ్చింది
మొత్తం
కలిపి
రెండున్నర
అణాలైంది.
ఆ
డబ్బును
నేను
ఈశ్వరమ్మ
చేతికిచ్చాను.
నా
చేయి
పట్టుకొని
“నాయనా!
ఈ
చిన్న
వయస్సులో
నీకింత
త్యాగమా!”
అని
కన్నీరు
కార్చింది.
ఆనాటినుండి
తాను
పోయేంతవరకు
ఆ
డబ్బును
మూట
కట్టుకొని
తనదగ్గరే
పెట్టుకుంది.
ఈశ్వరమ్మ
కోరిన
మూడు
కోరికలు
క్రమక్రమేణ
మందిరం
కట్టాము.
ఈశ్వరమ్మ
ఒకనాడు
నేను
భోజనం
చేస్తున్నప్పుడు
పైకి
వచ్చింది.
ఎవరెవరో
వస్తుంటే
‘మీరెవరూ
రాకండి’
అని
చెప్పింది.
పైకి
వచ్చి
నా
రెండు
చేతులను
పట్టుకొని
“స్వామీ!
మన
గ్రామంలో
ఒక
చిన్న
ఆసుపత్రియైనా
లేదు.
బిడ్డలకేమైనా
అనారోగ్యం
కలిగితే
తల్లులు
వాళ్ళను
ఎత్తుకొని
బుక్కపట్నం
వెళ్ళవలసివస్తోంది.
వారి
అవస్థను
నేను
చూడలేకపోతున్నాను.
నా
బిడ్డలెంతో
వారి
బిడ్డలుకూడా
అంతే
కదా?
కాబట్టి
ఇక్కడ
ఒక
చిన్న
ఆసుపత్రిని
కట్టించండి”
అని
కోరింది.
తప్పక
కట్టిస్తానని
మాటిచ్చాను.
తరువాత
పెద్దదే
కట్టించాను;
బెజవాడ
గోపాల్
రెడ్డి
అనే
మంత్రిని
పిలిపించి
ప్రారంభోత్సవం
చేయించాను.
9
▾
Meaning
Keep
ఆనాడు
ఈశ్వరమ్మ
ఆనందంతో
పొంగిపోయింది.
నా
చేతులు
పట్టుకొని
“ఇంతకంటే
నాకేమి
కావాలి
స్వామీ!
నా
మనోభీష్టం
నెరవేరింది”
అంది.
“ఇకపై
ఆనందంగా
ఉండు”
అన్నాను.
“ఇప్పుడే
కాదు,
ఇంకా
ఉంది”
అన్నది.
కొంతకాలమైన
తరువాత
ఈశ్వరమ్మ
“స్వామీ!
మన
ఊరిలో
ఒక
చిన్న
పాఠశాల
కట్టించండి”
అని
కోరింది.
ఆమె
కోరిక
మేరకు
పుట్టపర్తిలో
ఒక
చిన్న
పాఠశాల
కట్టించాను.
క్రమక్రమేణ
దానిని
పెద్ద
బిల్డింగ్‌గా
చేశాను.
ఈశ్వరమ్మ
వెళ్ళి
చూసింది.
అక్కడున్న
చిన్న
చిన్న
పిల్లలను
ముద్దు
పెట్టుకుని
వారిపై
తన
ప్రేమను
కురిపించింది.
ఆమెకు
చాల
సంతోషమైంది.
“స్వామీ!
ఈ
కలియుగంలో
తల్లిదండ్రులను
పీడించే
కొడుకులే
పుడుతున్నారుగాని,
ప్రేమించే
కొడుకులు
పుట్టటం
లేదు.
ఇలాంటి
పరిస్థితిలో
తల్లియొక్క
మనోభీష్టములను
నెరవేర్చే
నీవంటి
కుమారుడు
పుట్టటం
నా
అదృష్టం”
అంది.
తరువాత
మరొకరోజు
వచ్చి
“స్వామీ!
మన
గ్రామప్రజలు
నీటిఎద్దడితో
సతమతమౌతున్నారు.
నీటిసౌకర్యం
కల్పించండి”
అని
కోరింది.
“అవుతుంది,
అవుతుంది,
యోచన
పెట్టుకోకు”
అన్నాను.
ఈరోజుల్లో
చాలమంది
నీళ్ళు
కావాలంటే
బోర్లు
వేస్తున్నారు.
కాని
బోర్లు
వేస్తే
ప్రయోజనం
ఉండదు.
కొంతకాలం
నీళ్లు
వస్తాయి,
తరువాత
అందులో
నీరు
ఒక్క
చుక్కైనా
ఉండదు.
కాబట్టి
నాకు
బోర్లు
వేయించటం
ఇష్టం
లేదు.
పాతమందిరంలోనే
ఒక
బావి
త్రవ్వించాను.
మంచి
మనస్సుతో
ఏది
సంకల్పించినా
ఫలిస్తుంది.
ఏడడుగులు
కూడా
త్రవ్వలేదు.
పెద్ద
నీటి
బుగ్గ
పడింది.
గ్రామ
ప్రజలందరూ
వచ్చి
నీరు
తీసుకువెళ్ళటానికి
వీలుగా
మందిరం
వెనుక
తలుపు
పెట్టించాను.
మీకు
తెలుసు
-
క్రమక్రమేణ
అనంతపురం
జిల్లా
అంతటికీ
తుంగభద్రనుండి
నీరు
తెప్పించి,
ఇప్పించాను.
దానికి
సుమారు
మూడువందల
కోట్ల
రూపాయలు
ఖర్చు
అయింది.
నిజంగా
అధికారులు,
మంత్రులు
మొదలైన
పెద్దలందరూ
తల్చుకుంటే
ఇలాంటి
పనులెన్నైనా
చేయవచ్చును.
కాని,
ఎవ్వరూ
తల్చుకోవడం
లేదు.
సంపాదించింది
దాచి
పెట్టుకోవటమే
తప్ప
త్యాగబుద్ధితో
ఇలాంటి
సత్కార్యాలకు
ఎవ్వరూ
పూనుకోవటం
లేదు.
నిన్న
ఇక్కడికి
ఒక
ప్రముఖ
వ్యక్తి
వచ్చాడు.
“స్వామీ!
మీరు
తప్ప
ఈవిధంగా
చెప్పేవారు
ఎవ్వరూ
లేరు.
మినిష్టర్స్‌కు
కూడ
సమ్మర్క్లాసులు
పెట్టండి”
అన్నాడు.
అతను
కూడా
ఒకప్పుడు
మినిష్టరే!
10
▾
Meaning
Keep
“నిన్న
కోడలుగా
వచ్చి
ఈ
పొద్దు
అత్తగా
మారినట్లు,
ఇప్పుడీ
నీతులు
బాగానే
చెబుతున్నావు.
మరి
నీవు
మినిష్టర్‌గా
ఉన్నప్పుడు
ఇలాంటి
సత్కార్యం
ఎందుకు
చేయలేదు?”
అని
అడిగాను.
“జరిగిందేదో
జరిగిపోయింది.
ఇప్పుడు
కూడా
అదే
చెబుతున్నాను.
విలువైన
జీవన
జలమును
తెప్పించి
అందరికీ
ఇవ్వండి”.
మనిషికి
నీరే
ప్రాణము.
మరణించే
సమయంలో
కూడా
గొంతులో
నీరు
పోస్తారుకదా!
విద్య,
వైద్యము,
జలము
-
ఈమూడూ
ప్రతిమానవునికి
చాల
ప్రధానమైనవి.
ఈశ్వరమ్మ
కోరినట్లుగా,
ఈ
మూడింటినీ
నేను
ఉచితంగా
ఇచ్చాను.
ఇక్కడ
ఎంట్రన్స్
ఫీజు
లేదు.
ఎగ్జామినేషన్
ఫీజు
లేదు.
ఏ
ఫీజు
లేదు.
స్వామి
దగ్గర
విద్య,
వైద్యము
పూర్తి
ఉచితమే!
ఈనాడు
భారతీయులు
విద్యను
అమ్ముకుంటున్నారు,
వైద్యమును
అమ్ముకుంటున్నారు.
భారతీయులు
ఎందుకిట్లా
హీనమైపోతున్నారో
అర్థం
కావటం
లేదు.
భారతదేశం
ఎంతటి
పుణ్యభూమి!
ఎంతటి
త్యాగభూమి!
ఎంతటి
యోగభూమి!
దీనిని
ఈనాడు
భోగభూమిగా
మార్చటానికి
ప్రయత్నం
చేస్తున్నారు.
ఇది
మంచిది
కాదు.
పట్టెడన్నం
తింటే
పొట్ట
నిండుతుంది;
గ్లాసుడు
నీరు
త్రాగితే
దాహం
తీరుతుంది.
దాహం
తీర్చుకోవటానికి
గంగాజలమంతా
కావాలనే
దురాశ
ఎందుకు!
దురాశ,
దుర్భావములు
కల్గినవారికి
దుర్యోధన,
దుశ్శాసనులకు
పట్టిన
గతే
పడుతుంది.
ప్రేమను
పెంచుకోండి
బంగారూ!
పిల్లల్లారా!
మీరు
చాల
చిన్నవారు.
ఈ
లేత
వయస్సునుండియే
మీ
భవిష్యత్తును
చక్కగా
తీర్చిదిద్దుకోండి.
తోటి
స్నేహితులతో
ప్రేమగా
మెలగండి.
మీ
దగ్గర
రెండు
పెన్నులుంటే
లేనివారికి
ఒకటి
ఇచ్చివేయండి.
మీ
దగ్గర
అధికంగా
ఉండటంవల్ల
మీకు
కలిగే
సుఖమేమిటి?
అది
లేనివారికి
ఇస్తే
ఉపయోగపడుతుంది
కదా!
ప్రేమను
పెంచుకోండి
బంగారూ!
ప్రేమను
మించిన
ధనం
లేదు.
ప్రేమ
ఉంటే
మీరు
తప్పక
ఐశ్వర్యవంతులౌతారు;
అధికారులౌతారు.
వేదము
“మాతృదేవోభవ,
పితృదేవోభవ”
అని
బోధించింది.
తల్లిదండ్రులను
గౌరవించండి.
స్కూలుకు
వెళ్లే
ముందు,
రాత్రి
పడుకునేముందు
వారికి
నమస్కారం
చేయండి.
తల్లిదండ్రులను
మించిన
దైవం
లేదు.
వారికి
ఎదురు
చెప్పకండి.
ఒకవేళ
వారు
చేసేది
మీకు
తప్పుగా
తోస్తే
తగిన
సమయం
చూసుకుని
ప్రేమతో
చెప్పండి.
ఈనాడు
మీరు
తల్లిదండ్రులను
గౌరవించినప్పుడే
భవిష్యత్తులో
మీ
పిల్లలు
మిమ్మల్ని
గౌరవిస్తారు.
ఇంటికి
వచ్చిన
అతిథి
అభ్యాగతులను
ఆదరించండి.
11
▾
Meaning
Keep
పెద్దలతో
వినయంగా
మాట్లాడండి.
చదువుతోపాటు
సంస్కారాన్ని
కూడా
పెంచుకోండి.
నోట్బుక్కులను
చదవటం
ముఖ్యం
కాదు,
మీ
నోటినుండి
మంచి
పదములను
రానివ్వండి.
ప్రేమతో
జీవించండి.
Previous
←
The Subtleties of Dharma in the Rāmāyaṇa
Next
Prema Is God, God Is Prema
→