Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2000 · The Subtleties of Dharma in the Rāmāyaṇa
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The Subtleties of Dharma in the Rāmāyaṇa
12 April 2000, Rāma Navamī, Brindavan
1
▾
Meaning
Keep
దానముకాని,
యజ్ఞ
సముదాయముకాని,
సత్యసంధానముకాని
పావన
విధానముకాని,
తేజిత
సనాతన
ధర్మముకాని,
విజ్ఞానముకాని
మరియేదియైననుకాని
ప్రేమకు
సరితూగవు.
ప్రేమస్వరూపులారా!
రామాయణమును
ఎఱుగనటువంటి
మానవుడు
భారతదేశంలో
లేడు.
ప్రతి
మానవునికి,
ప్రతి
సోదరునికి,
ప్రతి
కుటుంబమునకు
ఆదర్శము
రామాయణమే!
ప్రాచీన
కాలమునుండి
రామచరిత్రను
విన్నటువంటివారు
వేలకు
వేలు
కలరు.
కాని,
రాముని
ఆదర్శాలను
ఆచరణలో
పెట్టినవారు
చాల
తక్కువ.
ఈనాటి
మానవుడు
మానవత్వమంటే
ఏమిటో
విచారించటం
లేదు.
మానవుడు
వివిధ
రంగాలలో
అభివృద్ధి
గాంచుతున్నాడే
గాని,
తన
మనస్సును
మాత్రం
మార్చుకోవటం
లేదు.
తన
గుడ్డలను
మార్చుతున్నాడేగాని,
తన
బుద్ధులను
మార్చుకోవటం
లేదు.
బుద్ధులను
మార్చుకొనక
గుడ్డలు
మార్చినంత
మాత్రమున
వచ్చిన
లాభమేమిటి?
మనస్సు
మారక
మనిషి
మారి
ప్రయోజనమేమిటి?
మొట్టమొదట
మానవుని
మనస్సు
మారాలి.
మనస్సును
మార్చుకొనక
జపతపాది
సాధనలు
ఎన్ని
చేసినప్పటికీ
అవన్నీ
వ్యర్థమైనవే!
మానవుడు
తీర్చుకోవలసిన
మూడు
ఋణములు
ప్రతిమానవుడు
మూడు
విధములైన
ఋణములతో
జన్మిస్తున్నాడు.
మొదటిది
దైవఋణం,
రెండవది
ఋషిఋణం,
మూడవది
పితృఋణం.
భగవంతుడు
మానవదేహంలో
ప్రతి
అణువునందు,
ప్రతి
అంగమునందు
రస
స్వరూపుడై
నివసిస్తూ
క్షణ
క్షణమూ
మానవుణ్ణి
కాపాడుతూ,
పోషిస్తూ
వస్తున్నాడు.
కనుకనే,
భగవంతుణ్ణి
‘అంగీరసుడు’
అన్నారు.
భగవంతునినుండి
ఇట్టి
రక్షణ
పొందటంచేత
మానవుడు
భగవంతునికి
ఋణపడియుంటున్నాడు.
ఈ
ఋణమును
తీర్చుకోవాలంటే
మానవుడు
తన
శక్తికొలది
సత్కర్మల
నాచరించాలి,
తోటి
మానవునికి
తోడ్పడాలి,
సమాజ
సేవలో
పాల్గొనాలి.
అయితే,
సేవ
చేయటం
పరులకు
సహాయపడటం
కోసమని
భావించకూడదు,
తన
ఋణవిముక్తి
కోసమే
అని
గుర్తించాలి.
ఏ
సేవ
చేసినప్పటికీ
దైవఋణం
కొంతవరకు
తగ్గిపోతుంది.
సేవకుడే
నిజమైన
నాయకుడు.
భగవంతుడు
దేహము
నిచ్చినది
సేవ
చేయటానికే
అని
గుర్తించి,
సేవలో
పాల్గొని
దైవ
ఋణమును
తీర్చుకొని
మానవుడు
ధన్యుడు
కావాలి.
2
▾
Meaning
Keep
His poems 324
Also in his talks
(12)
14 January 1988
Strive to recognise the oneness within the many!
31 October 1989
Do Your Duty as an Offering to God
24 May 1990
Hold the Reins
27 May 1991
Prasnopanishad - Answers To The Second And Third Students
5 October 1997
“Śarīramādyaṁ khalu dharmasādhanaṁ”
1 January 2000
Virtue is the adornment of man
2 April 2003
Leave the delusion of the body; think of God
6 May 2003
Easwaramma, the ideal mother
6 May 2004
Satisfying his mother is a son's first duty
6 May 2005
Only a son worthy of his mother's love can win God's grace
6 May 2006
If you love your parents, the whole world will love you
18 August 2006
Cast off the delusion of the body and foster attachment to God
రెండవది
ఋషిఋణము.
ప్రాచీన
ఋషులు
మానవుడు
ఇహ
పరములందు
తరించే
నిమిత్తమై
అనేక
సాధనలను,
ధర్మములను,
నీతులను
బోధించారు.
ఋషులు
నియమించిన
మార్గంలో
మానవుడు
తు.చ
తప్పక
నడుచుకున్నప్పుడే
తాను
ఋషి
ఋణమును
తీర్చుకున్నవాడౌతాడు.
మూడవది
పితృఋణము.
మీ
తల్లిదండ్రులు
అనేక
కష్టనష్టములకు
ఓర్చుకొని
మిమ్మల్ని
పెంచి,
పెద్దచేసి,
మీకు
విద్యాబుద్ధులు
నేర్పి
మీ
అభివృద్ధికి
అనేక
విధాలుగా
తోడ్పడతారు.
మీకు
తల్లియే
ప్రథమ
గురువు.
కనుకనే
వేదము
“మాతృదేవో
భవ,
పితృదేవోభవ”
అని
బోధించింది.
పితృఋణం
తీర్చుకోవాలంటే
తిరిగి
తల్లి
గర్భంలో
జన్మించకుండా
ఉండే
మార్గాన్ని
కనిపెట్టాలి.
జననిగర్భము
నుండి
జన్మించినప్పుడు
కంఠమాలలేవి
కానరావు
మంచిముత్యపు
సరుల్
మచ్చునకును
లేవు
మేల్మి
బంగరు
దండ
మెడకు
లేదు
రత్నాలహారముల్
రంజిల్లగా
లేవు
పచ్చలు,
కెంపులు
పొదగలేదు
వజ్రాల
హారముల్
వర్ధిల్లగా
లేవు
గోమేధికంబులు
తోడు
లేవు
కలదు
కలదొక్క
మాల
మీ
కంఠమందు
ఎన్ని
చేసిన
అవి
యన్ని
ఎంచి
ఎంచి
మంచియైనను
చెడుగైన
త్రుంచకుండ
బ్రహ్మ
మీకిచ్చి
పంపును
బరువుమాల
కర్మలన్నియు
చేర్చిన
కంఠమాల
ఇలాంటి
కంఠమాలను
ధరించి
జన్మించిన
వ్యక్తి
మళ్ళీ
జన్మించాలని
ఆశించకూడదు.
మానవుడు
దైవఋణం,
ఋషిఋణం,
పితృఋణములను
తీర్చుకునే
నిమిత్తం
జన్మించినాడు
గాని,
ధనకనకవస్తు
వాహనాదులను
అభివృద్ధి
పర్చుకుని,
లౌకిక
సుఖాలను
అనుభవించి
జీవితాన్ని
వ్యర్థం
గావించుకునే
నిమిత్తం
కాదు.
3
▾
Meaning
Keep
ఎందరో
మహానుభావులు!
ఒకానొక
సమయంలో
బుద్ధుడు
దేశంలోని
వివిధ
ప్రాంతాలలో
పర్యటిస్తూ,
ప్రజలకు
సత్యబోధలు
సల్పుతూ
వచ్చాడు.
ఒక
రోజున
ఒక
గ్రామం
చేరుకునేసరికి
అతడు
బాగా
అలసిపోయాడు.
అప్పుడు
తన
శిష్యుల్లో
ప్రధానుడైన
నిత్యానందుణ్ణి
పిలిచి
“నాయనా!
ఈరోజు
నేను
కొంత
విశ్రాంతి
తీసుకుంటాను.
ఇక్కడ
చేరిన
భక్తులకు
నీవేదైనా
సద్బోధలు
సల్పు”
అని
చెప్పి,
విశ్రాంతి
తీసుకోవటానికి
లోపలికి
వెళ్ళాడు.
కాని
నిద్ర
రాకపోవటంచేత
నిత్యానందుని
ప్రసంగాన్ని
వినసాగాడు.
నిత్యానందుడు
ఏమని
బోధిస్తున్నాడు?
“ప్రజలారా!
బుద్ధునివంటి
మహనీయుడు
ఇంతకు
పూర్వం
పుట్టలేదు,
ఇంకముందు
పుట్టబోడు.
బుద్ధునికి
సమకాలీనులుగా
పుట్టటం
మీ
అదృష్టం.
ఈ
అవకాశాన్ని
సద్వినియోగం
చేసుకోవటానికి
తగిన
కృషిచేయండి”
అన్నాడు.
ఈ
మాటలు
విని
అక్కడ
గుమిగూడిన
భక్తులు
పెద్ద
ఎత్తున
కరతాళ
ధ్వనులు
చేశారు.
వెంటనే
బుద్ధుడు
లేచి
వచ్చి
నిత్యానందుని
భుజంపై
చేయి
వేసి
“నాయనా!
నిత్యానందా!
నీ
వయస్సెంత?”
అని
ప్రశ్నించాడు.
నిత్యానందుడు
“నలభై
సంవత్సరములు
స్వామీ!”
అన్నాడు.
“ఇంతవరకు
ఎన్ని
పట్టణాలు
చూశావు?”
అని
ప్రశ్నించగా
“రెండు
పట్టణాలను
మాత్రమే
చూశాను.
స్వామీ!”
అన్నాడు.
“ఎంతమంది
మహనీయులను
దర్శించావు?”
అని
మళ్ళీ
ప్రశ్నించగా,
ఎవ్వరినీ
దర్శించలేదని
సమాధానం
చెప్పాడు.
అప్పుడు
బుద్ధుడు
చెప్పాడు,
“పిచ్చివాడా!
నీ
వయస్సు
నలభై
సంవత్సరాలు.
నీవు
రెండు
పట్టణాలను
మాత్రమే
చూశావు.
ఏ
మహనీయులనూ
నీవు
దర్శించలేదు.
అలాంటప్పుడు
బుద్ధునివంటి
మహనీయుడు
ఇంతవరకు
పుట్టలేదు.
ఇకముందు
పుట్టబోడు
అని
చెప్పటానికి
నీకేమి
అధికారం
ఉంది?
నలభై
సంవత్సరములకు
పూర్వం
ఎవరు
పుట్టారో
నీకేమి
తెలుసు?
ఎందరో
మహానుభావులు
పుట్టబోతున్నారు.
మహనీయులే
పుట్టకపోతే
ఈ
జగత్తే
నిలువ
లేదు.
“జగతియందు
పుణ్య
పురుషులు
లేకున్న
జగములెట్లు
వెలుగు
పగలుగాను?”
మహనీయుల
ప్రభావముచేతనే
ఈ
జగత్తు
ప్రకాశిస్తున్నది.
4
▾
Meaning
Keep
రాముని
నిజమైన
జన్మస్థానం
ఈనాడు
మీరు
రాముని
జన్మదినమును
జరుపుకుంటున్నారు.
అయితే
రాముడు
బోధించిన
విషయాలను
ఆచరించకుండా
కేవలం
రాముని
జన్మదినమును
జరుపుకున్నంత
మాత్రమున
ప్రయోజనం
లేదు.
“రామో
విగ్రహవాన్
ధర్మః”
రాముడు
ధర్మస్వరూపుడు.
రామ,
లక్ష్మణ,
భరత,
శతృఘ్నులు
నల్గురూ
దశరథుని
కుమారులని
మీరు
భావిస్తున్నారు.
దశరథుడనగా
ఎవరు?
భౌతికంగా
చూస్తే
అతడు
అయోధ్యా
నగరానికి
రాజు.
అయోధ్య
అనగా
ఏదో
కాశీకి
సమీపంలో
ఉన్న
పట్టణమని,
అక్కడే
శ్రీరామచంద్రుడు
పుట్టాడని
భావించటం
చాల
పొరపాటు.
ఒకరోజు
అశోక్
సింఘాల్
నన్ను
అడిగాడు
“స్వామీ!
రాముని
జన్మస్థానం
గురించి
అనేకమంది
అనేక
అభిప్రాయాలను
వ్యక్తం
చేస్తున్నారు.
రాముని
నిజమైన
జన్మస్థానమేమిటో
దయచేసి
మాకు
తెలియచేయండి”
అని.
అప్పుడు
నేను
చెప్పాను.
“సింఘాల్!
రాముని
యొక్క
జన్మస్థానము
కౌసల్య
గర్భమే.
రాముడు
ఇక్కడ
పుట్టాడు,
అక్కడ
పుట్టాడు
అని
మీరు
కేవలం
ఆకారాన్ని
మాత్రమే
ఆధారం
చేసుకుంటున్నారు.
కాని
రాముడు
సర్వవ్యాపకుడు.”
అయోధ్య
అనగా
ఏమిటి?
విరోధులు
చొరబడలేని
ప్రదేశమే
అయోధ్య.
అదే
హృదయము.
ఈ
దేహము
దశేంద్రియములతో
కూడిన
రథమువంటిది.
కనుక
దేహమే
దశరథుడు.
ఇతనికి
కౌసల్య,
సుమిత్ర,
కైకేయి
అని
ముగ్గురు
భార్యలు.
ఈ
ముగ్గురినీ
వరించినవాడు
దశరథుడు.
దేహధారియైన
ప్రతి
మానవుడు
సత్వరజస్తమో
గుణాలను
వరించాడు.
సాత్త్విక
గుణమే
కౌసల్య,
రజోగుణమే
కైక,
తమోగుణమే
సుమిత్ర.
ఈ
ముగ్గురికీ
నల్గురు
బిడ్డలు
పుట్టారు.
ఆ
నల్గురు
బిడ్డలే
నాల్గు
వేదములు.
ఋగ్వేదమే
రాముడు,
యజుర్వేదమే
లక్ష్మణుడు,
సామవేదమే
భరతుడు,
అథర్వణ
వేదమే
శతృఘ్నుడు.
ఈ
నాలుగు
వేదములే
నల్గురు
పిల్లలుగా
పుట్టి
దశరథుని
ఇంట్లో
ఆడుకున్నాయి.
ఇలాంటి
పవిత్రమైన
అంతరార్థాన్ని
గుర్తించినప్పుడే
మీయందు
భక్తి
ప్రపత్తులు
అభివృద్ధి
అవుతాయి.
సుమిత్ర
ఆదర్శం
సుమిత్ర
గొప్ప
గుణవంతురాలు.
ఆమె
పేరే
సు-మిత్ర,
అనగా,
ఆమె
అందరికీ
మంచి
స్నేహితురాలు.
ఆమె
ఆదర్శము
సాటిలేనిది.
రాముడు
అరణ్యానికి
వెళ్లేముందు
తల్లియైన
కౌసల్యకు
నమస్కరించినప్పుడు
ఆమె
“నాయనా!
నేను
నిన్ను
విడిచి
క్షణమైనా
ఉండలేను”
అని
విలపించింది.
5
▾
Meaning
Keep
అప్పుడు
సుమిత్ర
కౌసల్యను
సమీపించి
“అక్కా!
ఏమిటి
అజ్ఞానము!
సాక్షాత్తు
నారాయణుడే
నీ
గర్భమునందు
శ్రీరామునిగా
జన్మించాడు.
మానవాకారం
ధరించినందుకు
అతడు
కాల,
కర్మ,
కారణ,
కర్తవ్యాలను
పురస్కరించుకొని
ప్రవర్తించాలి.
కాబట్టి
రాముడు
అరణ్యానికి
వెళుతున్నాడని
నీవు
బాధపడవద్దు.
త్వరలోనే
అయోధ్యకు
తిరిగి
రాగలడు”
అని
సమాధాన
పరిచింది.
తన
కుమారుడైన
లక్ష్మణుడు
వచ్చి
తనకు
నమస్కరించినప్పుడు
సుమిత్ర
అతనికి
ఏమని
బోధించింది?
“నాయనా!
నీవు
అరణ్యానికి
వెళుతున్నానని
భావించవద్దు.
సీతారాములు
లేని
అయోధ్యయే
అరణ్యము.
సీతారాములున్న
అరణ్యమే
అయోధ్య.
రాముడే
నీ
తండ్రి,
సీతయే
నీ
తల్లి.
కాబట్టి
వారిని
ప్రేమతో
సేవించటమే
నీ
ప్రధాన
కర్తవ్యం”
అన్నది.
అట్లే
ఆమె
రెండవ
కుమారుడైన
శతృఘ్నుడు
భరతుని
సేవిస్తూ
వచ్చాడు.
లక్ష్మణుడు
రామాంశము,
శతృఘ్నుడు
భరతాంశము
రామలక్ష్మణుల
మధ్య,
భరత
శతృఘ్నుల
మధ్య
అంతటి
సన్నిహిత
సంబంధ
మేర్పడటానికి
గల
కారణమేమిటి?
ఇక్కడొక
ముఖ్యమైన
విషయాన్ని
మీరు
గుర్తించాలి.
దశరథుడు
పుత్రకామేష్టి
యాగ
మాచరించినప్పుడు
యజ్ఞపురుషుడు
ప్రత్యక్షమై
పాయసమును
ప్రసాదించాడు.
అప్పుడు
వశిష్ఠులవారు
“దశరథా!
ఈ
పాయసాన్ని
నీ
ముగ్గురు
రాణులకు
పంచిపెట్టు”
అని
ఆదేశించాడు.
దశరథునికి
తన
ముగ్గురు
రాణుల
పట్ల
సమానమైన
ప్రేమ
ఉన్నది.
అతనికి
ఎవరి
పట్లను
పక్షపాతం
లేదు.
అందుచేత,
అతడాపాయసాన్ని
మూడు
సమాన
మైన
భాగాలుగా
విభజించి,
బంగారు
కప్పులలో
పోసి
తన
రాణులకు
అందచేసి
“మీరు
అభ్యంగన
స్నానమాచరించి,
మన
గురువైన
వశిష్ఠులవారి
ఆశీస్సులను
పొందిన
తరువాత
ఈ
పాయసాన్ని
భుజించండి”
అని
చెప్పాడు.
కౌసల్య,
కైకేయిలు
చాల
ఆనందంగా
ఆ
పాత్రలను
అందుకొని,
వాటిని
ఒకచోట
భద్రపర్చుకొని
అభ్యంగన
స్నానమాచరించారు.
కాని
సుమిత్రకు
ఏమాత్రము
ఆనందం
కల్గలేదు.
“కౌసల్య
పట్టపురాణి
కాబట్టి,
ఆమెకు
పుట్టిన
కుమారుడే
రాజు
కావచ్చు.
లేక,
దశరథుడు
కేకయ
రాజుకు
ఇచ్చినమాట
ప్రకారం
కైకేయికి
పుట్టబోయే
కుమారునికే
పట్టం
కట్టవచ్చు.
6
▾
Meaning
Keep
కాని
నాకు
పుట్టబోయే
కుమారుడు
రాజు
కావటానికి
అవకాశమే
లేదు.
కనుక
ఈ
పాయసాన్ని
నేనెందుకు
భుజించాలి?”
అని
చింతిస్తూ,
అభ్యంగన
స్నానమాచరించింది.
ఆనాడు
ఈనాటివలె
ఫ్యాన్లు,
హెయిర్
డ్రెయర్లు
లేవు
కాబట్టి,
ఆమె
మేడ
పైభాగమునకు
వెళ్ళి,
పాయసపు
గిన్నెను
ఒకచోట
ఉంచి,
కురుల
నార్పుకోవటం
ప్రారంభించింది.
ఇంతలో
ఎక్కడి
నుండో
ఒక
పెద్ద
గద్ద
వచ్చి
ఆ
పాయసపు
గిన్నెను
తన్నుకుపోయింది.
సుమిత్రకు
దిక్కు
తోచలేదు.
పాయసం
పోయిందనే
బాధ
లేదుగాని,
జరిగిన
సంగతి
తెలిస్తే
పతి
బాధపడతాడేమో,
తనపై
కోపిస్తాడేమో
అని
భయపడుతూ
క్రిందికి
దిగి
కౌసల్య,
కైకల
వద్దకువెళ్ళి
జరిగినది
జరిగినట్లు
చెప్పింది.
ముగ్గురూ
పరస్పరం
అమితమైన
ప్రేమతో
అక్కచెల్లెండ్రవలె
మెలగుచుండుటచేత
రాజుకు
కష్టము
కలుగక
సుమిత్రను
నిరాశకు
గురి
కానివ్వకుండుటకై
మరొక
గిన్నెను
తెప్పించి,
కౌసల్య
పాయసమునందు
కొంత
భాగమును,
కైక
పాయసమునందు
కొంతభాగమును
ఆ
గిన్నెలో
వేసి
సుమిత్ర
కందించారు.
అందుచేతనే
సుమిత్రకు
ఇరువురు
పుత్రులు
కలిగారు.
కౌసల్య
ఇచ్చిన
పాయసమునుండి
లక్ష్మణుడు,
కైక
ఇచ్చిన
పాయసమునుండి
శతృఘ్నుడు
జన్మించారు.
అయితే
లక్ష్మణ,
శతృఘ్నులు
పుట్టిననాటినుండి
ఎప్పుడు
చూసినా
ఏడుస్తూ
ఉండేవారు.
లోపల
ఎట్టి
బాధ
కలదో
అని
అనేక
వైద్యములు
చేయించారు.
కాని,
లాభం
లేకపోయింది.
ఈ
బాధ
వైద్యంతో
పోయేది
కాదని
గుర్తించి
ఒకనాడు
సుమిత్ర
వశిష్ఠులవారికి
ఈ
విషయాన్ని
విన్నవించింది.
వశిష్ఠుల
వారు
కొద్దిసేపు
ఆలోచించి
“అమ్మా!
వారి
బాధలు
వేరు,
మీరు
చేయిస్తున్న
వైద్యం
వేరు.
వారి
ఆరాటం
మానవులు
గుర్తించుటకు
వీలుకానిది.
వారికి
దేహసంబంధమైన
బాధలేమీ
లేవు.
నేను
చెప్పినట్లు
చేయుము.
ఆ
క్షణమునుండియే
వారు
ఏడుపుమాని
సుఖంగా
ఆడుకొంటారు.
ఇప్పుడే
నీవు
లక్ష్మణుణ్ణి
తీసుకొనిపోయి
రాముని
ప్రక్కలోను,
శతృఘ్నుణ్ణి
భరతుని
ప్రక్కలోను
పరుండబెట్టు”
అన్నాడు.
సుమిత్ర
ఆవిధంగానే
చేసింది.
ఆ
క్షణమునుండియే
లక్ష్మణ,
శతృఘ్నుల
ఏడుపు
మాయమైంది;
ఆనందంతో
వారు
కాళ్ళు,
చేతులు
ఆడించటం
ప్రారంభించారు.
వారి
ఉత్సాహాన్ని
చూసి
సుమిత్ర
తన
కళ్ళను
తానే
నమ్మలేకపోయింది.
ఇలా
జరగటానికి
కారణమేమిటని
వశిష్ఠులవారిని
ప్రశ్నించింది.
7
▾
Meaning
Keep
అప్పుడాయన
చెప్పాడు
“అమ్మా!
లక్ష్మణుడు
రాముని
అంశమందలివాడు;
శతృఘ్నుడు
భరతుని
అంశమందలివాడు.
ఇంతకు
పూర్వం
నీటికి
దూరమైన
చేపలవలె
తపించిన
లక్ష్మణ,
శతృఘ్నులు
వారి
వారి
అంశములను
చేరుకొనేసరికి
నీటిలో
చేరిన
చేపలవలె
ఆనందాన్ని
అనుభవించారు.”
భగవద్గీతలో
కృష్ణుడు
“మమైవాంశో
జీవలోకే
జీవ
భూతస్సనాతనః”
అన్నాడు.
అనగా,
మానవులందరూ
తన
అంశములే
అని
తెలియచేశాడు.
కనుక,
దైవాంశమైన
మానవుడు
దైవాన్ని
చేరుకున్నప్పుడే
పరిపూర్ణమైన
ఆనందాన్ని
అనుభవించగలడు.
ఈనాటి
మానవుడు
దైవానికి
సమీపంగా
వెళ్ళకపోవటంచేతనే
దుఃఖిస్తున్నాడు,
బాధలు
పడుతున్నాడు.
ఆదర్శ
సోదర
ప్రేమ
రాముని
సన్నిధిని
చేరిన
తరువాత
లక్ష్మణుని
బాధ
మటుమాయమైపోయింది.
అతడు
నిరంతరం
రాముణ్ణి
అనుసరిస్తూ,
రాముని
సేవకే
తన
జీవితాన్ని
అంకితం
చేశాడు.
అదేరీతిగా
శతృఘ్నుడుకూడా
భరతుని
అనుసరిస్తూ,
అతని
సేవలోనే
జీవితాన్ని
గడిపాడు.
రామ,
లక్ష్మణ,
భరత,
శతృఘ్నుల
సోదరప్రేమ
మహోన్నతమైనది.
అలాంటి
సోదరులు
ఈ
జగత్తులోనే
లేరు.
భారతీయులు
సాధారణంగా
కవలపిల్లలకు
రామలక్ష్మణులని
పేర్లు
పెడతారు.
కాని
ఆ
రామలక్ష్మణులే
పెరిగి
పెద్దవారైన
తరువాత
ప్రాపర్టీకోసం
సుప్రీంకోర్టుకు
వెళతారు!
రామాయణంలోని
రామలక్ష్మణులు
మాత్రం
ఐకమత్యంతో
సుప్రీం
స్టేజికి
వెళ్ళారు.
యుద్ధ
సమయంలో
ఇంద్రజిత్తు
వేసిన
బాణముయొక్క
తాకిడికి
లక్ష్మణుడు
మూర్ఛిల్లాడు.
రాముడు
పట్టలేని
దుఃఖంతో
తక్షణమే
అంబులను
పారవేసి,
లక్ష్మణుని
తలను
తన
తొడపై
పెట్టుకొని
“లక్ష్మణా!
నేను
ప్రయత్నిస్తే
ఈ
జగత్తులో
కౌసల్యవంటి
తల్లియైనా
చిక్కవచ్చు.
సీతవంటి
భార్యయైనా
చిక్కవచ్చుగాని,
నీవంటి
సోదరుడు
నాకు
చిక్కడు”
అన్నాడు.
లక్ష్మణునిపట్ల
అంతటి
ప్రేమ
కల్గినవాడు
రాముడు.
వారి
సోదర
ప్రేమ
మానవజాతికే
గొప్ప
ఆదర్శం.
ఇలాంటి
ఆదర్శాలను
విస్మరిస్తే
రామాయణాన్ని
పఠించి
ప్రయోజనం
లేదు.
రాముడు
ఏ
కర్మను
ఎప్పుడు
ఎక్కడ
ఏవిధంగా
చేశాడో
విచారణ
చేసి
ఆ
ఆదర్శాన్ని
తీసుకోవాలి.
రామాయణమంటే
ఏమిటి?
రాముడు
పుట్టాడు,
సీతను
పెండ్లిచేసుకున్నాడు,
రావణుణ్ణి
సంహరించాడు,
పట్టాభిషేకం
చేసుకున్నాడు.
ఇంతమాత్రమేనా?
కాదు,
కాదు,
రాముడు
దేనికోసం
పుట్టాడు?
ధర్మసంస్థాపన
కోసం
పుట్టాడు.
8
▾
Meaning
Keep
ధర్మమనగా
ఏమిటి?
హృదయానికి
సంతృప్తి
కల్గించేదే
ధర్మము.
అధర్మాన్ని
అంతరాత్మ
అంగీకరించదు.
కనుక
ప్రతి
మానవుడు
ధర్మస్వరూపుడే,
ధర్మాచరణ
నిమిత్తం
ఉద్భవించినటువంటివాడే.
కాని,
తాను
విషయవాంఛలలో
మునిగి
పోవటంచేత
దుఃఖానికి
గురి
అవుతున్నాడు.
రాముడు
చంద్రుడు,
సీత
వెన్నెల
రాముడు
అరణ్యానికి
బయలుదేరేముందు
సీతవద్దకు
వెళ్ళి,
పితృవాక్య
పరిపాలన
నిమిత్తం
తాను
అడవికి
వెళుతున్నానని
తెలియచేశాడు.
అప్పుడు
సీత
పతి
అడుగుజాడలను
అనుసరించుటయే
సతికి
ధర్మము
కాబట్టి,
తాను
కూడా
వస్తానన్నది.
“అడవులలో
క్రూరమృగాలుంటాయి;
భయంకరమయిన
రాక్షసులు
నివసిస్తుంటారు.
వారివల్ల
నీకేదైనా
అపాయం
సంభవించవచ్చు.
కాబట్టి
నీ
ఆలోచనను
విరమించుకో”
అని
రాముడు
అడ్డు
చెప్పాడు.
అప్పుడు
సీత
“రామచంద్రా!
జగద్రక్షకుడివైన
నీకు
నన్ను
రక్షించటమేమీ
కష్టం
కాదు”
అని
పలికింది.
రాముడు
ఆమెను
సమాధానపరుస్తూ,
“సీతా!
నేను
అరణ్యమునకు
వెళ్ళిన
సమయంలో
వృద్ధులైన
నా
తల్లిదండ్రులు
నాకొఱకు
దుఃఖిస్తారు.
కనుక,
నీవు
అయోధ్యలోనే
ఉండి
నీ
అత్తమామలకు
తగిన
సేవ
చేస్తూ,
వారికి
ధైర్యం
చేకూర్చటం
నీ
కర్తవ్యం”
అన్నాడు.
అప్పుడు
సీత
“నాథా!
నిన్ను
వదలి
ఉండలేక
తాను
కూడా
అడవికి
వస్తానన్న
నీ
తల్లి
కౌసల్యకు
పతిసేవయే
సతికి
ప్రధాన
కర్తవ్యమని
బోధించావు.
ఇప్పుడు
నాచెంతకు
రాగానే
అత్తమామల
సేవయే
కర్తవ్యమని
బోధిస్తున్నావు.
ఏది
సత్యమో
నీవే
యోచింపుము.
అంతేకాదు,
నీవు
రామచంద్రుడవు.
నేను
సీతను.
అనగా
శీతలమైన
వెన్నెలవంటి
దానను.
చంద్రుడు
అరణ్యమందును,
వెన్నెల
అయోధ్యయందును
ఉండ
వీలుండదు
కదా!
చంద్రుడెక్కడో
అక్కడే
వెన్నెలకూడా
ఉండి
తీరవలసిందే!
కాబట్టి
నేనుకూడా
నీవెంట
వస్తున్నాను.”
అని
దృఢంగా
పలికింది.
ఈవిధంగా
పతియే
సతికి
దైవంగా
భావించి,
పతి
అడుగుజాడల
ననుసరించటానికి
ఎన్ని
కష్టాలనైనా
ఎదుర్కోవటానికి
సిద్ధమై
సీత
గొప్ప
ఆదర్శాన్ని
కనబర్చింది.
హనుమంతుని
భక్తి
ప్రపత్తులు
గద్ద
తన్నుకొనిపోయిన
సుమిత్రయొక్క
పాయసపు
కప్పు
ఎక్కడికి
పోయింది?
గద్ద
ఆ
కప్పును
ఒక
పర్వతంపై
వదలిపెట్టింది.
అది
అంజనీ
దేవికి
చిక్కగా
ఆమె
ఆ
పాయసాన్ని
త్రాగింది.
9
▾
Meaning
Keep
తత్ఫలితంగా
ఆమె
గర్భంలో
హనుమంతుడు
జన్మించాడు.
హనుమంతునికి,
రామలక్ష్మణభరత
శతృఘ్నులకు
గల
ఇట్టి
సన్నిహిత
సంబంధం
ఎవ్వరికీ
తెలియదు.
హనుమంతుడు
కూడా
దశరథునికి
యజ్ఞమునుండి
లభించిన
పాయసముయొక్క
భాగమే.
పట్టాభిషేక
సమయంలో
రాముడు
విభీషణునికి,
సుగ్రీవునికి,
ఇంకా
అనేకమంది
వానర
వీరులకు
బహుమతుల
నందజేశాడు.
కాని,
హనుమంతునికి
మాత్రం
ఏమీ
ఇవ్వలేదు.
సీత
ఈ
విషయాన్ని
గమనించి
“స్వామీ!
హనుమంతునికి
కూడా
ఏదైనా
బహుమతి
ఇస్తే
బాగుంటుంది
కదా!”
అన్నది.
అప్పుడు
రాముడు
“సీతా!
హనుమంతుడు
బహుమతులను
ఆశించడు.
అవి
అతనికి
అక్కర్లేదు.
అలాంటి
గొప్ప
భక్తునికి
ఇవ్వదగిన
బహుమతి
నావద్ద
ఏమీ
లేదు”
అన్నాడు.
అప్పుడు
సీత
తన
మెడలోని
ముత్యాల
హారాన్ని
తీసి
హనుమంతునికి
అందించింది.
హనుమంతుడు
దానిని
అందుకొని
ఒక్కొక్క
ముత్యమును
కొరికి,
చెవి
దగ్గర
పెట్టుకొని
నిరుత్సాహంతో
పారవేయసాగాడు.
ఈ
దృశ్యాన్ని
చూసి
సీత
“హనుమంతా!
ఇంకా
నీ
కోతిబుద్ధిని
పోనిచ్చుకున్నావు
కాదు.
అది
నా
తండ్రి
నాకిచ్చిన
విలువైన
ముత్యాలహారము.
కాని
నీవు
దాని
విలువ
తెలుసుకోకుండా
కొరికి
పారవేస్తున్నావు”
అన్నది.
హనుమంతుడు
“తల్లీ!
క్షమించు.
రామనామం
లేనిది
రత్నమైనా,
ముత్యమైనా
నాకు
రాయితో
సమానం.
నా
రోమరోమమూ
రామనామంతో
నిండియున్నది.
కావాలంటే
చూడు”
అని
పలుకుతూ
తన
చేతి
నుండి
ఒక
రోమమును
తీసి
సీత
చెవి
దగ్గర
పెట్టాడు.
ఆ
రోమమునుండికూడా
రామనామం
వినబడుతూ
ఉండినది!
రామాయణం
జరగటానికి
మూలకారణం
హనుమంతుడే.
హనుమంతుడే
లేకపోతే
రామాయణమే
లేదు.
అతడు
పరమ
పవిత్రమైన
భక్తిస్వరూపుడు.
ఎక్కడ
రామనామం
ఉంటుందో
అక్కడ
హనుమంతుడుంటాడు.
నామ
రూపముల
ఏకత్వాన్ని
దర్శించాడు
హనుమంతుడు.
ఇదే
నిజమైన
అద్వైతము.
ఇట్టి
పవిత్రమైన
హనుమంతుని
ఆదర్శాన్ని
భక్తులెవరైనా
అనుసరిస్తున్నారా?
ఎన్ని
పర్యాయములు
రామాయణాన్ని
పారాయణం
చేసినా
బుద్ధులు
మారకపోతే
ప్రయోజనమేమిటి?
ఈనాడు
అనేకమంది
రామభక్తులమని
చెప్పుకొంటున్నారు
గాని,
నిజమైన
రామభక్తులు
ఎక్కడా
కనిపించడం
లేదు.
ఈనాటి
భక్తులలో
ఆడంబరం
పెరిగిపోయింది,
ఆచరణ
శూన్యమైపోయింది.
ఆడంబరం
భక్తికి
విరుద్ధమైనది.
రాముడు
అహంకారమును,
ఆడంబరమును
ఏనాడూ
అంగీకరించడు;
ఆచరణకే
ప్రాధాన్యత
నిస్తాడు.
10
▾
Meaning
Keep
రాముని
జన్మదినమును
పండుగగా
జరుపుకున్నంత
మాత్రాన
చాలదు,
రామచరిత్రను
హృదయంలో
చిత్రించుకోవాలి.
రాముని
ఆదర్శాలను
ఆచరణలో
నింపుకోవాలి.
రాముడు
సత్యవాక్పరిపాలకుడు,
ధర్మపరాయణుడు.
కాముడున్నచోట
రాముడుండడు
రాముడు
అరణ్యానికి
వెళ్ళేముందు
సర్వసంపదలను
బీదలకు
దానం
చేశాడు.
సీతకూడా
తన
నగలను,
ఆభరణాలను
బీదలకు
దానం
చేసి,
నారవస్త్రములను
ధరించి
రామునివెంట
అరణ్యానికి
బయలుదేరింది.
ఈవిధంగా,
సీత
తన
సర్వసంపదలను
త్యాగం
చేసినప్పుడు
రాముణ్ణి
పొందగల్గింది.
కాని
అరణ్యానికి
వెళ్ళిన
తరువాత
ఏనాడూ
బంగారాన్ని
కోరని
సీత
బంగారు
లేడిని
ఆశించింది.
బంగారులేడిపై
ఆమెకు
ఎప్పుడు
ఆశ
కల్గిందో
అప్పుడు
ఆమె
రామునికి
దూరమైనది.
దీని
అంతరార్థమేమనగా,
వాంఛల
చేతనే
మానవుడు
బంధితుడౌతున్నాడు;
భగవంతునికి
దూరమౌతున్నాడు.
కనుక
భగవంతుడు
లభ్యం
కావాలంటే
వాంఛలను
త్యాగం
చేయాలి.
దీనిని
పురస్కరించుకొనియే
వేదము
“నకర్మణా
నప్రజయా
ధనేన
త్యాగేనైకే
అమృతత్వ
మానశుః”
అన్నది.
రామాయణమునుండి
ముఖ్యంగా
నేర్చుకోవలసింది
త్యాగనిరతి.
రామాయణంలోని
ఇలాంటి
పవిత్రమైన
ధర్మ
సూక్ష్మములను
గ్రహించి
ఆచరణలో
పెట్టినప్పుడే
మీ
జీవితం
సార్థకమౌతుంది.
Previous
←
The Body Is the Temple, the Jīva Is God
Next
Easwaramma: Compassion and Prema in Human Form
→