Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2001 · The right use of the senses is the true sādhana
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The right use of the senses is the true sādhana
5 July 2001, Guru Pūrṇimā, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His poems 525
Also in his talks
(1)
16 July 2001
Immortality is attained through Prema alone
గుండెలోన
ప్రేమ
పండించుకొనుచున్న
అతడె
క్రైస్తవుండు,
అతడె
సిక్కు
అతడె
హైందవుండు,
ఆతడే
ముస్లీము
అతడె
మానవుండు,
అతడె
గురువు
భగవంతుడు
సర్వవ్యాపి,
సర్వభూతాంతరాత్మ.
అదేరీతిగా,
భగవంతుని
శక్తులైన
పంచభూతములు
కూడా
సర్వవ్యాపకమైనవి,
సర్వశక్తిమయమైనవి.
ప్రపంచమంతయు
పంచభూతములతో
నిండి
యున్నది,
పంచభూతములచేతనే
నడుపబడుచున్నది.
పంచభూతములలో
ఏ
ఒక్కటి
తక్కువైనప్పటికీ
జగత్తు
నిలువలేదు.
పంచభూతములు
మానవునికి
పంచప్రాణములవంటివి.
వీటితత్త్వమును
అర్థం
చేసుకొని
వర్తించటం
మానవుని
కర్తవ్యం.
వీటి
తత్త్వమును
గుర్తించి
వర్తించువాడే
ధన్యుడు,
పుణ్యుడు.
అతడే
పురుషార్థములు
సాధించ
గలడు.
మానవుని
సుఖదుఃఖాలకు,
మంచిచెడ్డలకు
పంచభూతాలే
మూల
కారణం.
మానవుడు
పుట్టి,
కొంతకాలం
జీవించి,
తదుపరి
తన
దేహమును
త్యజిస్తున్నాడు.
దీనికంతటికీ
మూలకారణం
పంచభూతములే.
కనుక
వీటి
రహస్యమును
గుర్తించటం
అత్యవసరం.
దీని
నిమిత్తం
బుద్ధుడు
తన
పంచేంద్రియాలను
వశం
గావించుకోవటానికి
ప్రయత్నించాడు.
మొట్టమొదట
తన
దృష్టిని
అరికట్టుకున్నాడు.
పంచేంద్రియాలలో
కన్ను
చాలా
శక్తిమంతమైనది.
దీనియందు
నలభై
లక్షల
కాంతి
కిరణాలున్నాయి.
కాని,
చెడ్డదృష్టివలన
వాటిలో
ఎన్నో
లక్షలు
క్షీణించిపోతున్నాయి.
తద్ద్వారా
మానవునికి
దృష్టిలోపం
కల్గుతున్నది.
దృష్టిలోపం
కల్గినప్పుడు
క్యాటరాక్టు
ఆపరేషన్
చేయించుకోవటం,
మందులు
వేసుకోవటం...
ఈరీతిగా
తన
దృష్టిని
సంరక్షించుకోవటానికి
ప్రయత్నిస్తున్నాడు.
2
▾
Meaning
Keep
Also in his talks
(8)
2 October 1988
Brahman Itself Is the Root Power of the World!
19 January 1989
The whole universe is filled with Hari
29 June 1989
Everything Is God's Gracious Gift
23 May 1990
Road to Divinity
25 May 1991
Kenopanishad
29 June 1996
Karma, Bhakti and Jñāna: The Aim of All Three Is One
7 July 1996
Faith Alone Is Man's Eyes
22 February 2001
God's grace comes only through the right use of the senses
డాక్టరుదృష్టిలో
అది
క్యాటరాక్టు
కావచ్చుగాని,
నిజం
చెప్పాలంటే
అది
చెడ్డదృష్టి
ప్రభావమే.
దృష్టియే
సృష్టి,
నేత్రమే
శాస్త్రము.
కనుక
మొదట
దృష్టిని
అరికట్టుకోవాలి.
జపము,
తపము
ఇత్యాది
సాధనలన్నీ
తాత్కాలికమైన
తృప్తిని
మాత్రమే
అందిస్తాయి.
మానవుడు
ఎన్ని
సాధనలు
చేసినప్పటికీ
తన
దృష్టిని
అరికట్టుకోకపోతే
ఆ
సాధనల
ఫలితమును
ఏమాత్రం
అందుకోలేడు.
దృష్టిని
అరికట్టుకోవటంతో
పాటు
నాలుకనుకూడా
అదుపులో
ఉంచుకోవాలి.
నాలుకలో
లక్షలాది
‘టేస్ట్
బడ్స్’
ఉన్నాయి.
కాని
నేటి
మానవుడు
అనేకములైన
రుచులకు
అలవాటుపడి
తినరాని
తిండి
తింటున్నాడు;
ఇతరుల
హృదయాన్ని
గాయపరచే
మాటలు
మాట్లాడుతున్నాడు.
తత్ఫలితంగా
నాలుకకు
గల
పవిత్రమైన
శక్తిని
కోల్పోతున్నాడు.
ఇంద్రియాల
దుర్వినియోగంవలన
మానవుని
ఆయుఃప్రమాణం
క్షీణించిపోతున్నది.
మానవుడు
మొట్టమొదట
తన
దృష్టిని,
జిహ్వను
అరికట్టుకోవటానికి
ప్రయత్నించాలి.
ఈ
రెండింటినీ
అరికట్టుకున్నప్పుడు
మానవునియందు
ఒక
నూతనమైన
శక్తి
ఆవిర్భవిస్తుంది.
ఎంత
తపస్సు
చేసినప్పటికీ
లభించని
శక్తి
దృష్టిని,
నాలుకను
అదుపులో
పెట్టుకున్నప్పుడు
లభిస్తుంది.
నాలుకతో
అనవసరమైన
మాటలు
మాట్లాడే
బదులు
“రామా!
కృష్ణా!
గోవిందా!”
అని
పవిత్రమైన
నామాన్ని
ఉచ్చరించవచ్చు
కదా!
జిహ్వే
రసజ్ఞే
మధుర
ప్రియత్వం
సత్యం
హితం
త్వాం
పరమం
వదామి
ఆవర్ణ
యేథా
మధురాక్షరాణి
గోవింద
దామోదర
మాధవేతి!
ఎదుటి
వ్యక్తి
పరాయివాడు
కాదు,
అతనిలో
ఉన్నదికూడా
నీవే.
దేహములు
వేరైనా
ఇరువురియందు
ఆత్మ
ఒక్కటిగానే
ఉన్నది.
కాబట్టి,
కఠినమైన
మాటలతో
ఇతరులను
నొప్పించకూడదు.
కనుకనే,
నేను
Talk
less
(తక్కువగా
మాట్లాడండి)
అని
చెబుతుంటాను.
కాని
మీరు
నా
మాటను
అలక్ష్యం
చేస్తున్నారు.
మున్ముందు
దీని
ప్రభావం
మిమ్మల్ని
ఎంత
క్రుంగదీస్తుందో
మీకు
తెలియటంలేదు.
3
▾
Meaning
Keep
ఇంద్రియనిగ్రహం
లేని
సాధన
నిరర్థకం
ఈనాటి
మానవుడు
భౌతికమైన,
ప్రాకృతమైన
సాధనలకు
అలవాటుపడి
తనలోనే
ఉన్న
దివ్యమైన,
భవ్యమైన
శక్తులను
విస్మరిస్తున్నాడు.
ఈ
సాధనల
వల్ల
తానేదో
పొందగల్గుతున్నాననుకుంటున్నాడు.
కాని
వీటివల్ల
తాను
పొందగల్గేదేమీ
లేదు.
మొట్టమొదట
ఇంద్రియాలను
అరికట్టుకోవాలి.
ఇంద్రియాలను
అదుపులో
పెట్టుకున్నప్పుడే
మీరు
చేసే
సాధనలు
సత్ఫలితాలనిస్తాయి.
చెడ్డను
చూడకండి,
మంచినే
చూడండి.
అప్పుడే
మీ
నేత్రములు
పవిత్రమైన
శక్తిని
పొందుతాయి,
విశ్వవిరాట్స్వరూపాన్ని
దర్శించగల్గుతాయి.
చెడ్డమాటలను
వినకండి.
ఒకవేళ
చెడ్డమాటలను
వినవలసిన
పరిస్థితి
ఏర్పడితే
తక్షణమే
ఆ
స్థానమును
వదలిపెట్టాలి.
చెడ్డమాటలు
మాట్లాడవద్దు,
చెడ్డదృశ్యాలు
చూడవద్దు.
ఈరీతిగా,
మీరు
చెడ్డకు
దూరంగా
ఉండటానికి
ప్రయత్నం
చేయాలి.
అప్పుడే
మీలో
సాధనాశక్తి
దినదినాభివృద్ధి
నొందుతుంది.
ప్రాచీన
మహర్షులు
అరణ్యానికి
వెళ్ళి
ఏకాంతంగా
జీవించటంచేతనే
తమ
ఇంద్రియాలను
అదుపులో
ఉంచుకోగల్గారు.
ఇంద్రియనిగ్రహమే
సరియైన
సాధన.
ఇంద్రియనిగ్రహం
లేకుండా
చేసే
సాధనలన్నీ
నిరుపయోగమౌతాయి.
ఇంద్రియాలను
దుర్వినియోగపరచటంచేత
మీరు
అనేకపాపములను
మూటకట్టుకుంటున్నారు.
కాని,
ఆ
మూట
మీకు
కనిపించదు.
అది
మీకు
కనిపించకుండా
వెనుకదాగి
మిమ్మల్ని
అనేక
విధాలుగా
బాధపెడుతున్నది.
“కనిపించనిదే
తినిపించును
నీ
కర్మల
ఫలముల
మర్మము
జీవా!”
ఏది
మీకు
కనిపించకుండా
ఉన్నదో
అదే
మీచేత
కర్మఫలమును
తినిపిస్తున్నది.
మీరు
ఇంద్రియాలను
అరికట్టుకున్నప్పుడే
జీవితంలో
శాంతిని
అనుభవించగలరు.
మీరు
మాట్లాడే
మాటలు
Short
and
Sweet
గా
ఉండాలి.
మితంగానూ,
హితంగానూ
మాట్లాడాలి.
మాటలలో
ఎంతో
శక్తి
ఉన్నది.
కనుక,
వాటిని
పవిత్రంగా
ఉపయోగపెట్టుకోవాలి.
వాల్మీకి,
వ్యాసుడు,
పోతన
మొదలైనవారు
పవిత్రమైన
గ్రంథాలను
రచించి
కాలమును
సార్థకం
గావించుకున్నారు.
అలాంటి
ఆదర్శపురుషులు
రచించిన
పవిత్రమైన
గ్రంథాలను
చదవాలి.
చెడ్డపుస్తకాలను
చదవకూడదు.
మీరు
ఏది
చదివినా,
ఏది
వ్రాసినా,
ఏది
చూసినా,
ఏది
చెప్పినా
అంతా
పవిత్రంగా
ఉండాలి.
4
▾
Meaning
Keep
మీకు
తెలిసినంత
వరకూ
మీలో
ఎలాంటి
దోషమూ
ప్రవేశించకుండా
చూసుకోవాలి.
ఇంద్రియాలను
సన్మార్గంలో
పెట్టటంద్వారా
మీరు
దైవసాక్షాత్కారాన్ని
పొందవచ్చు,
మీరే
దైవంగా
మారవచ్చు.
ఇంతటి
శక్తి
మీయందే
ఉన్నప్పటికీ
దానిని
మీరు
గుర్తించుకోలేక
మీకంటే
వేరే
శక్తి
ఒకటున్నదని
భ్రమించి,
ఆ
శక్తి
నిమిత్తం
మీరు
ప్రాకులాడుతున్నారు.
మిమ్మల్ని
మించిన
శక్తి
మరొకటి
లేనేలేదు.
“ఏకం
సత్
విప్రాః
బహుధా
వదంతి”
ఉన్నది
ఒక్కటే
ఒక్కటి.
రెండవ
పదార్థమున్నదని
వెదకటం
అజ్ఞానమే.
రెండవ
పదార్థమే
లేదీ
ప్రపంచంలో.
“ఏకోహం
బహుశ్యాం”
ఉన్నది
ఒక్కటే.
భిన్నత్వాన్ని
మీరే
కల్పించుకుంటున్నారు.
ఏకత్వాన్ని
గుర్తించాలంటే
ఇంద్రియాలను
అరికట్టుకోవాలి.
కోరికలనరికట్టుకోవటంలోనే
ఆనందమున్నది
కోరికలు
నెరవేరినప్పుడే
ఆనందం
లభిస్తుందనుకోవటం
పొరపాటు.
కోరికలను
అరికట్టినప్పుడే
ఆనందం
చిక్కుతుంది.
కోరికలను
అరికట్టుకున్నవాడే
నిజమైన
ఆనందాన్ని
పొందుతున్నాడు.
కోరికలను
తీర్చుకోవటానికి
ప్రయత్నించేవాడు
తీవ్ర
అశాంతికి
గురి
అవుతున్నాడు.
ఏమిటీ
కోరికలు?
ఈ
కోరికలన్నీ
ప్రాపంచిక
సంబంధమైన
ప్రవృత్తి
లక్షణాలే
కదా!
ఈ
ప్రవృత్తిలో
ఏమాత్రం
సుఖం
లేదు.
ఇందులో
సుఖమున్నదని
భావించి
మీరు
నివృత్తిని
దూరం
చేసుకుంటున్నారు.
బుద్ధుడు
మొట్టమొదట
అనేకమంది
పెద్దలను
దర్శించాడు,
పెద్దపెద్ద
గ్రంథాలను
పఠించాడు,
ఎన్నో
సాధనలు
సల్పాడు.
కాని
ఆశించిన
ఫలితం
కనిపించలేదు.
ఇవన్నీ
ప్రవృత్తికి
సంబంధించినవని
గుర్తించి
ఆ
పుస్తకాలను
ప్రక్కకుపెట్టాడు,
పెద్దలను
దర్శించటం,
వారి
బోధనలను
వినటం
మానివేశాడు.
భగవంతుడు
అనుగ్రహించిన
పంచేంద్రియాలను
సార్థకం
గావించుకోవటానికి
ప్రయత్నించాడు.
భగవంతుడు
ప్రసాదించిన
పంచభూతములను,
పంచేంద్రియాలను
సార్థకం
గావించుకొనకుండా
సాధనలు
చేయటంవలన
ప్రయోజనం
లేదు.
ఈ
దేహం
కూలిపోయేదే,
కాలిపోయేదే,
రాలిపోయేదే.
ఇట్టి
అనిత్యమైన
దేహంతో
చేసే
సాధనలుకూడా
అనిత్యమైన
ఫలితాన్నే
అందిస్తాయి.
నిత్యసత్యమైన
భావనతో
చేసే
సాధనలే
నిత్యసత్యమైన
ఫలితాన్నిస్తాయి.
ఈ
సత్యాన్ని
గుర్తించి
బుద్ధుడు
తన
ఇంద్రియాలను
అరికట్టుకున్నాడు.
5
▾
Meaning
Keep
అప్పుడే
అతనిలో
ఆనందం
దినదినాభివృద్ధి
నొందింది.
ఆ
ఆనందాన్ని
భరించుకోలేక
తన
ప్రక్కనే
ఉన్న
పినతల్లి
కుమారుడైన
ఆనందుణ్ణి
కౌగిలించుకొని
“ఆనందా!
నేనీ
ఆనందాన్ని
భరించుకోలేకపోతున్నాను.
ఇంక
నిర్వాణస్థితికి
సిద్ధంగా
ఉన్నాను”
అన్నాడు.
ఈ
మాటలు
విని
ఆనందుడు
కన్నీరు
కార్చాడు.
అది
చూసి
బుద్ధుడు
“పిచ్చివాడా!
నేను
ఆనందాన్ని
అనుభవిస్తుంటే
దానికి
నీవెందుకు
దుఃఖిస్తున్నావు?”
అన్నాడు.
మానవుడు
ప్రాపంచిక
సంబంధమైన
విషయాల్లో
ఆనందంకోసం
ప్రాకులాడుతున్నాడు.
భగవద్విషయంలో
ఆనందంకోసం
ప్రాకులాడినవాడు
బుద్ధుడు.
అదియే
నిత్యసత్యమైన
ఆనందము.
అదియే
అమృతత్వము.
చేసిన
తప్పుకు
శిక్షననుభవించే
తీరాలి
ఈనాటి
మానవుడు
చేయరాని
పనులు
చేస్తూ
అమృతత్వానికి
దూరమౌతున్నాడు.
అంతేగాక,
తాను
చేసిన
తప్పులను
క్షమించవలసిందిగా
కోరుతున్నాడు.
తప్పులను
క్షమించమని
కోరకూడదు.
చేసిన
తప్పుకు
శిక్షననుభవించే
తీరాలి.
అప్పుడే
దోషం
నివారణ
అవుతుంది.
తప్పు
చేసినందుకు
దొంగ
జైలుశిక్షననుభవిస్తాడు,
ఆ
శిక్ష
పూర్తి
అయిన
తరువాతనే
విడుదల
అవుతాడు.
అదేరీతిగా,
మానవుడు
తన
దోషాలను
పరిహారం
గావించుకున్నప్పుడే
విడుదల
అవుతాడు.
విడుదల
కావాలనుకుంటే
చేసిన
దోషానికి
తగిన
శిక్ష
అనుభవించాలి,
తిరిగి
ఆ
దోషం
చేయకుండా
చూసుకోవాలి.
మానవుడు
పాపం
చేస్తున్నాడుకాని,
దానిని
పాపంగా
తాను
పరిగణించటం
లేదు.
అది
మానవసహజమని
భావిస్తున్నాడు.
“రూపాయి
కోసమై
లోపాయికారిగా
అడ్డమైన
గడ్డి
తింటారయా!
రంగ
లింగాయంచు
దొంగ
మ్రొక్కులు
మ్రొక్కి
పంగనామము
ప్రజకు
పెడతారయా!”
దైవాన్నే
గురువుగా
భావించండి
ప్రేమస్వరూపులారా!
ఈనాడు
గురుపూర్ణిమ.
గురువు
అంటే
ఎవరు?
చెవిలో
మంత్రం
చెప్పి
చేతిలో
డబ్బు
గుంజేవాడు
కాదు.
“గుకారో
గుణాతీతః
రుకారో
రూపవర్జితః”
గుణాతీతమైన,
రూపరహితమైన
తత్త్వాన్ని
గురువుగా
భావించుకోవాలి.
గుణాతీతమైన
తత్త్వాన్ని
గుర్తింపజేయుటకు
గురువు
అవసరం.
6
▾
Meaning
Keep
Also in his talks
(4)
14 July 1992
God alone is the true Guru
9 July 1998
By God's Grace Anything Can Be Achieved
24 July 2002
The Paramāṇu Itself Is the Paramātma
18 July 2008
God alone is the true Guru
కాని
ఈనాడు
అలాంటి
గురువు
చిక్కటం
కష్టం
కనుక,
దైవాన్నే
గురువుగా
భావించండి.
గురుర్బ్రహ్మా
గురుర్విష్ణుః
గురుదేవో
మహేశ్వరః
గురుస్సాక్షాత్
పరంబ్రహ్మా
తస్మై
శ్రీ
గురవే
నమః
గురువే
బ్రహ్మ,
అతనే
విష్ణువు,
అతనే
శివుడు,
అతనే
సర్వము.
ఈ
ప్రపంచంలో
సర్వమూ
భగవత్స్వరూపమే.
“సర్వం
ఖల్విదం
బ్రహ్మ.”
అందరూ
బ్రహ్మస్వరూపులే,
అందరూ
విష్ణుస్వరూపులే.
మనం
చూసేదంతా
విశ్వవిరాట్స్వరూపమే.
దీనిని
పురస్కరించుకొనియే
వేదం
“సహస్రశీర్షా
పురుషః
సహస్రాక్షః
సహస్ర
పాత్”
అన్నది.
ఇప్పుడైతే
జనాభా
కోట్లకు
పెరిగిందిగాని,
“సహస్ర
శీర్షా
పురుషః...”
అని
చెప్పినప్పుడు
జనాభా
వేలలోనే
ఉండేది.
ఆ
కాలంలో
అందరినీ
దైవస్వరూపులుగా
భావించారు.
“ఈశ్వర
స్సర్వభూతానాం”
అనే
భావనతో
అందరికీ
నమస్కరించేవారు.
“సర్వజీవ
నమస్కారం
కేశవం
ప్రతిగచ్ఛతి”
ఎవరికి
నమస్కరించినా
అది
కేశవునికే
చెందుతుంది.
“ఈశావాస్య
మిదం
జగత్”
జగత్తంతా
ఈశ్వరుని
స్వరూపమే.
ఈశ్వరత్వం
ఇక్కడున్నదని,
అక్కడ
లేదని
చెప్పటానికి
వీలుకాదు.
ఇక్కడ,
అక్కడ,
ఎక్కడ
చూసిన
ఒక్కడే
ఉన్నాడు.
ఇలాంటి
ఏకత్వాన్ని
బోధించేవాడే
నిజమైన
గురువు.
కాని
ఈనాడు
అట్టి
ఉత్తమమైన
గురువులు
చిక్కటం
చాలా
కష్టం.
ఉత్తమమైన
శిష్యులైనా
చిక్కుతారుగాని,
ఉత్తమమైన
గురువులు
చిక్కటం
లేదు.
దైవచింతనచేత
దుర్గుణాలను
తగ్గించుకోండి
మన
పిల్లల్లో
ఎంతోమంది
మంచివారున్నారు.
కాని
ఒకరిద్దరు
పెడమార్గం
పట్టినా
పిల్లలందరికీ
చెడ్డపేరు
వస్తుంది.
ఒక
చిన్న
ఉదాహరణ
రాత్రిపూట
మీరు
పడుకున్నప్పుడు
మిమ్మల్ని
రెండు
దోమలు
కుట్టాయి.
మరునాడు
ఫ్లిట్
తెచ్చి
దోమలన్నింటినీ
చంపేశారు.
మిమ్మల్ని
కుట్టిన
దోమలు
రెండే
అయినప్పటికీ
అన్నింటినీ
మీరు
చంపుతున్నారు.
అదేవిధంగా,
చెడ్డవారితోపాటు
వారి
ప్రక్కనున్నవారినికూడా
శిక్షించవలసివస్తుంది.
కనుకనే
“త్యజ
దుర్జన
సంసర్గం,
భజ
సాధు
సమాగమం,
కురు
పుణ్యమహోరాత్రం...”
అన్నారు.
దుస్సంగమునకు
దూరంగా
ఉండాలి,
సత్సంగంలో
ప్రవేశించాలి.
కోపము,
ఈర్ష్య
ఇత్యాది
దుర్గుణాలను
అరికట్టుకొనుటకు
ప్రయత్నించాలి.
7
▾
Meaning
Keep
మీకు
కోపం
వచ్చినప్పుడు
“ఛీ,
ఈ
కోపం
నాకు
హాని
కల్గిస్తుంది,
నాచేత
చెడ్డపని
చేయిస్తుంది.
ఇది
మంచిది
కాదు”
అని
మిమ్మల్ని
మీరు
హెచ్చరించుకోండి.
చల్లని
నీరు
త్రాగి,
ఒక
చోట
కూర్చొని
భగవన్నామాన్ని
స్మరించండి.
కొద్దిసేపటికి
అది
తగ్గిపోతుంది.
అప్పటికీ
కోపం
తగ్గకపోతే
ఏదైనా
ఏకాంత
ప్రదేశానికి
వెళ్ళి
అరమైలు
దూరం
వేగంగా
నడవండి.
అప్పుడు
మీ
కోపం
చల్లారిపోతుంది.
ఈవిధంగా,
కోపాన్ని
తగ్గించుకోవటానికి
ఎన్నో
సులభమైన
మార్గాలున్నాయి.
కాని
ఈనాటి
పిల్లలు
కోపం
వస్తే
దాన్ని
తగ్గించుకోవటానికి
ప్రయత్నించటం
లేదు.
ఇంకా
పెంచుకోవటానికి
ప్రయత్నిస్తున్నారు.
కోపం
వచ్చినప్పుడు
విచక్షణ
నశిస్తుంది.
కనుక
ఆ
సమయంలో
అక్కడినుండి
వెళ్ళిపోవటం
మంచిది.
పాపం
చేసి
తరువాత
దాని
పరిహారంకోసం
బాధపడటంకంటే
పాపమే
చేయకుండా
జాగ్రత్త
పడటం
మేలు
కదా!
మీలోని
దుర్గుణాలను
దైవచింతనచేత,
దైవప్రార్థనచేత
క్రమక్రమేణ
తగ్గించుకోవటానికి
ప్రయత్నం
చేయాలి.
మీరు
చేసే
పాపకార్యాలు
ఇతరులకు
తెలియకపోవచ్చు.
కాని
ఇతరులెఱుగకున్న
ఈశ్వరుడెఱుగడా?
అతనికి
తెలుసు.
కాబట్టి
ఎప్పుడూ
మంచిపనులే
చేయండి.
ఇకపై
పాదనమస్కారాలు
చేయవద్దు
ఈనాడు
మీకు
మరొక
విషయాన్ని
చెప్పదల్చుకున్నాను.
అది
మీకు
వినడానికి
కష్టంగా
ఉండవచ్చునుకాని,
నాకు
ఆనందమే.
ఈనాటినుండి
నేనెవ్వరికీ
పాదనమస్కారాలివ్వకూడదని
నిర్ణయించుకున్నాను.
ఎందుకంటే
మీరు,
నేను
ఒక్కటే.
“ఈశ్వర
స్సర్వ
భూతానాం”
అందరియందున్న
దైవం
ఒక్కడే.
ఈ
సత్యాన్ని
మీరు
గుర్తించండి.
ఎవరికి
నమస్కారం
చేయాలి?
మీ
తల్లిదండ్రులకు
చేసుకోండి.
ఎందుకంటే
వారికీ
సత్యం
తెలియదు,
మీకుకూడా
తెలియదు.
కాని
ఈ
సత్యం
నాకు
తెలుసు
కాబట్టి,
నేను
పాటించాలి.
మీలో
ఉన్నది,
వారిలో
ఉన్నది,
వీరిలో
ఉన్నది
ఒకే
ఆత్మ.
కాబట్టి,
ఎవ్వరూ
ఎవ్వరికీ
నమస్కారం
చేయనక్కర్లేదు.
స్వామి
వస్తూ,
వెళుతూ
ఉన్నప్పుడు
మీరు
స్వామి
పాదాలపై
పడితే
అది
ఇతరులకు
కూడా
ఇబ్బందిగా
ఉంటుంది.
మీకు
నమస్కారం
చేయాలని
ఇష్టముంటే
మనస్సులో
చేసుకోండి.
పది
వ్రేళ్ళను
జోడించి
“స్వామీ!
8
▾
Meaning
Keep
నా
దశేంద్రియాలను
నీకు
అర్పిస్తున్నాను”
అనే
భావంతో
నమస్కారం
చేసుకోండి.
అంతేగాని
పాదములు
ముట్టి
నమస్కారం
చేయనక్కర్లేదు.
భగవంతుడు
మీయందే
ఉన్నాడన్న
సత్యాన్ని
గుర్తించి
వర్తించండి.
అప్పుడు
మీయందే
దైవత్వం
సాక్షాత్కరిస్తుంది.
ఒకరికి
నమస్కారం
ఇస్తే
“వారికిచ్చారు,
నాకివ్వలేదే!”
అని
కొంతమంది
బాధపడుతున్నారు.
ఈవిధమైన
భేదభావాలను
తొలగించే
నిమిత్తం
నేను
పాదనమస్కారాలివ్వటం
మాని
వేస్తున్నాను.
స్వామి
ఈవిధంగా
చెప్పాడని
మీరు
బాధపడకూడదు.
ఇదికూడా
మంచికోసమే
అని
మీరు
భావించాలి.
ఎక్కడున్నా
మనస్సులో
నమస్కారం
చేసుకోండి,
అదే
నాకు
ఆనందము.
మొదటినుండి
నేనీమాట
చెబుతూనే
ఉన్నాను.
కాని,
మీరు
పాటించటం
లేదు.
ఇంద్రియాలను
నిగ్రహించుకోకుండా,
కోపతాపాలను,
ఈర్ష్యాసూయలను
అరికట్టుకోకుండా
నమస్కారాలు
చేయటం,
స్వామిని
గొప్పగా
వర్ణన
చేయటం...
ఇవన్నీ
మంచివి
కావు.
ఈ
గురుపూర్ణిమ
నుండి
ఇలాంటి
బాహ్యమైన
వృత్తులను
అరికట్టుకొని,
పవిత్రమైన
భావాన్ని
అభివృద్ధిపరచుకొని
మీరు
పవిత్రులై
పరమశాంతిని
పొందండి,
బ్రహ్మానందమును
అనుభవించండి.
మంచిభావాలున్నప్పుడే
మంచిపిల్లలు
పుడతారు
ప్రేమస్వరూపులారా!
మీరెటువంటి
దృశ్యాలను
చూస్తారో,
ఎటువంటి
విషయాలను
వింటారో
మీకు
అటువంటి
పిల్లలే
పుడతారు.
తల్లిదండ్రులు
చేసిన
పాపం
పిల్లలకుకూడా
అంటుతుంది.
పూర్వం
గర్భిణీ
స్త్రీలు
చెడ్డదృశ్యాలను
చూడకుండా,
చెడ్డమాటలను
వినకుండా
జాగ్రత్త
పడేవారు.
నిరంతరం
భగవత్కథలను
శ్రవణం
చేసేవారు.
కారణమేమిటి?
మంచిభావాలు
లోపలకు
పోతే
మంచిపిల్లలు
పుడతారు.
సుభద్ర
గర్భవతిగా
ఉన్నప్పుడు
అర్జునుడొకనాడు
ఆమెకు
పద్మవ్యూహం
గురించి
చెబుతున్నాడు.
అందులోకి
ప్రవేశించే
విధానాన్ని
చెప్పటం
పూర్తిచేసి,
తిరిగి
బయటికి
ఎలా
రావచ్చునో
చెప్పబోతుంటే
కృష్ణుడు
వచ్చి
“బావా!
సుభద్రకు
యుద్ధం
గురించి
చెప్పవలసిన
సమయం
కాదిది.
నీవు
చెప్పేది
సుభద్ర
వింటున్నదని
భావిస్తున్నావు.
కాని,
ఊకొట్టేది
సుభద్ర
కాదు,
ఆమె
గర్భంలో
ఉన్న
బిడ్డ
ఊకొడుతున్నది”
అని
చెప్పి
అర్జునుణ్ణి
విరమింపజేశాడు.
గర్భస్థ
శిశువైన
అభిమన్యుడు
పద్మవ్యూహంలోకి
ఎలా
ప్రవేశించవచ్చునో
విన్నాడు
కాబట్టి,
అతనికి
అంతవరకే
తెలిసింది.
పద్మవ్యూహాన్ని
ఛేదించుకొని
వచ్చే
విధానం
తెలియక
పోవటంచేత
అందులో
చిక్కుకొని
మరణించాడు.
9
▾
Meaning
Keep
అగ్నితో
చేరిన
పుల్ల
అగ్నిగా
మారినట్లు...
ప్రతి
మానవుడు
ఆనందమును
ఆశిస్తున్నాడు.
ఎప్పుడు
కల్గుతుంది
ఆనందము?
మానవుడు
అన్నమయ,
ప్రాణమయ,
మనోమయ,
విజ్ఞానమయ,
ఆనందమయకోశములతో
కూడినవాడు.
విజ్ఞానమయకోశము
తరువాతనే
ఆనందమయ
కోశమున్నది.
విజ్ఞానమును
మీరు
పోషించుకున్నప్పుడే
ఆనందము
చిక్కుతుంది.
ఆనందముతో
మీ
జీవితాన్ని
గడిపి,
ఇతరులకుకూడా
ఆనందాన్ని
అందించటానికి
ప్రయత్నించండి.
ఈ
ఆనందము
ఎంత
గొప్పదో
మీకు
అనుభవిస్తేగాని
తెలియదు.
అగ్నితో
చేరినప్పుడు
పుల్లకూడా
అగ్నిగా
మారినట్లు
మీరు
స్వామి
మనోతత్త్వానికి
సమీపమైనప్పుడు
ఆ
మనోతత్త్వం
మీలోకూడా
ప్రవేశించి
అజ్ఞానమనే
అంధకారమును
దూరం
చేసి
మీ
మనస్సును
ప్రకాశవంతంగా
మార్చుతుంది;
మీలో
ఆనందాన్ని
ప్రకాశింపజేస్తుంది.
Previous
←
Study the learning that knows no death
Next
Immortality is attained through Prema alone
→