Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2003 · Take Īśvara's family as your ideal
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Take Īśvara's family as your ideal
2 March 2003, Śivarātri akhaṇḍa bhajan, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
అన్ని
తెలిసినవారు
అవనియందున
లేరు
ఏమి
తెలియనివారు
ఎవరు
లేరు
కొంచెమెరిగినవాడు
కించిజ్ఞుడగునయా
సర్వమెరిగినవాడు
సాంబశివుడే!
ప్రేమస్వరూపులారా!
శివరాత్రియొక్క
సందేశము
సర్వకుటుంబములకు
ఆదర్శమును
అందించడమే!
ఈనాడు
విశ్వకుటుంబమునందు
ఐకమత్యము
సన్నగిల్లింది.
కేవలం
ఇరువురు
సభ్యులున్న
చిన్నకుటుంబములో
కూడా
అనేక
సమస్యలు
తలెత్తుతున్నాయి.
జగత్తునకు
కుటుంబము
చాలా
ప్రధానమైనది.
కుటుంబము
సక్రమముగా
ఉన్నప్పుడే
జగత్తు
సక్రమముగా
నడుస్తుంది.
కుటుంబములో
ఐకమత్యము
క్షీణిస్తే
జగత్తు
అనేక
బాధలకు
గురి
కావలసివస్తుంది.
ఐకమత్యమే
జీవితానికి
బలము.
కనుక,
మానవుడు
ఐకమత్యమును
సాధించాలి,
అన్యోన్యతను
పెంచుకోవాలి.
ఈవిషయంలో
ఈశ్వరకుటుంబము
విశ్వకుటుంబమునకు
ఆదర్శంగా
నిలుస్తోంది.
ఈశ్వర
కుటుంబమును
ఆదర్శంగా
తీసుకున్నప్పుడే
మానవుడు
తన
జీవితములో
శాంతిభద్రతలను
అనుభవించగలడు.
ఈశ్వరకుటుంబములో
ఉన్న
సభ్యులు
నల్గురే
-
పార్వతి,
ఈశ్వరుడు,
గణపతి,
సుబ్రహ్మణ్యం.
ఈ
నల్గురూ
కలిసి
జగత్తునకొక
గొప్ప
ఆదర్శాన్ని
అందిస్తున్నారు.
వీరిలో
ఒకరికొకరికి
మధ్య
ఏ
సమస్యలుగాని,
ఎలాంటి
భేదాభిప్రాయములుగాని
లేవు.
నల్గురూ
చేరి
ఏకోన్ముఖులై
జగత్తును
ఏలుతూ
వస్తున్నారు.
భౌతికదృష్టితో
చూస్తే,
వీరి
వాహనములను
కూడా
మనం
ఆదర్శంగా
తీసుకోవాలి.
2
▾
Meaning
Keep
His poems 533
Also in his talks
(11)
12 June 1973
Dharma and Its Nature
1 October 1979
The Vedapuruṣa Saptāha Jñāna Yajña
2 September 1996
A Man without Purity of Citta Is Not Fit to Teach the Ātmatattva
26 April 1998
All Beings Are Parts of God
13 March 2002
The divine power of attraction
23 November 2002
Satya Is the Paramātma Made Manifest
12 January 2004
Honour your mother and father; take their command upon your head
19 February 2004
Unity is Jñāna, multiplicity is ignorance
23 October 2004
Foster the Spirit of Sacrifice
8 March 2005
Śivatva is the very consciousness in all beings
11 August 2006
Divinity is attained only through Prema for God
ఈశ్వరుని
వాహనము
నంది,
పార్వతీదేవి
వాహనము
సింహము.
సాధారణంగా
వృషభమును
చూస్తే
సింహము
ఊరుకోదు.
సింహమును
చూస్తే
వృషభము
చాలా
భయపడుతుంది.
కాని,
ఈశ్వరుని
వాహనమైన
నంది,
పార్వతి
వాహనమైన
సింహము
అన్యోన్యంగా
ఉంటూ
ఆదర్శమును
అందిస్తున్నాయి.
ఇంతేకాదు.
సుబ్రహ్మణ్యుని
వాహనం
నెమలి,
వినాయకుడు
మూషికవాహనుడు,
ఈశ్వరుని
ఆభరణములు
నాగములు.
సాధారణంగా
నెమలిని
చూస్తే
పాములు
చాలా
బుసకొడతాయి,
ఎలుకను
చూస్తే
పట్టుకొని
మ్రింగడానికి
ప్రయత్నిస్తాయి.
కాని,
సుబ్రహ్మణ్యుని
వాహనమైన
నెమలి,
గణపతి
వాహనమైన
ఎలుక,
ఈశ్వరుని
ఆభరణములైన
పాములు
ఐకమత్యంగా
జీవిస్తున్నాయి.
ఇంక,
ఈశ్వరుని
స్వరూపమెలాంటిది?
శిరమునందు
గంగ...
శిఖపైన
చంద్రుడు...
ఫాలనేత్రంలో
అగ్ని!
నీరు,
అగ్ని
పరస్పరం
విరుద్ధమైనవి.
కాని,
ఇవేమాత్రం
విరుద్ధంగా
ప్రవర్తించక
అన్యోన్యంగా
ఉంటూ
ఆదర్శాన్ని
అందిస్తున్నాయి.
“వ్యక్తులయొక్క
స్వభావములు
పరస్పరం
విరుద్ధంగా
ఉన్నప్పటికీ
ద్వేషానికి
తావీయకుండా
శాంతంగా
జీవించండి.
మా
కుటుంబాన్ని
ఆదర్శంగా
తీసుకోండి”
అని
పార్వతీశ్వరులు
మానవాళికి
బోధిస్తున్నారు.
మౌళి
గుల్కెడు
చంద్రమఃఖండ
కళతోడ
బెడగారు
గుంపెడు
జడలతోడ
జడలలో
ప్రవహించు
చదలేటి
జిగితోడ
డంబైన
ఫాలనేత్రంబుతోడ
నల్ల
నేరెడువంటి
నల్లని
మెడతోడ
కరమున
నాగ
కంకణముతోడ
నడుమున
చుట్టిన
నాగచర్మముతోడ
మైనిండనలదు
భస్మంబుతోడ
నుదుట
దీర్చిన
పెద్ద
కుంకుమ
బొట్టుతో
తాంబూల
రాగాధరంబుతోడ
ఆరు
శాస్త్రములందున
నందగించి
నల్ల
కలువల
హసియించి
కొల్లలాడు
మెరుగుచామన
ఛాయల
మేనితోడ...
3
▾
Meaning
Keep
ప్రపంచానికి
వైరాగ్యాన్ని
ప్రబోధించే
నిమిత్తం
ఈశ్వరుడు
ఇట్టి
స్వరూపాన్ని
ధరించాడు.
“ఇల్లిల్లు
తిరుగుచు
భిక్షమెత్తుటెగాని,
తలదాచుకొనుటకొక
కొంప
లేదు.”
భిక్షమెత్తే
భర్తతో
ఏవిధంగా
జీవించేదని
పార్వతి
విసుగుచెందలేదు.
“ఇట్టి
కాపురంబు
నేనెట్లు
చేతు?”
అని
పారిపోలేదు.
“నీ
ఆనందమే
నా
ఆనందమ”ని
తన
పతిని
అనుసరిస్తూ
వచ్చింది.
ఎవరి
కర్తవ్యాన్ని
వారు
నిర్వర్తిస్తూ
జగత్తునకు
ఆనందాన్ని
అందిస్తూ
వచ్చారు.
దుర్గుణములయొక్క
ప్రతిబింబమే
దుఃఖము
పార్వతీశ్వరుల
కుటుంబము
ప్రపంచానికి
అడుగడుగునా
ఆదర్శము
నందిస్తోంది.
కాని,
ఇట్టి
ఆదర్శము
ఈనాడు
ఏ
కుటుంబములోను
కనిపించడం
లేదు.
తమ్ముని
భార్య
ఏదైనా
మంచి
నగ
వేసుకుంటే
అన్నభార్యకు
అసూయ
కల్గుతుంది.
ఒకరి
మంచిని
చూసి
ఆనందించవలసిందిపోయి
అశాంతిని
పొందుతున్నారు.
ఐకమత్యము,
అన్యోన్యత
ఉన్నచోట
అశాంతిగాని,
భయముగాని
ఏర్పడవు.
ఎక్కడ
దోషముంటుందో
అక్కడే
భయము
ఏర్పడుతుంది.
ఎవరియందూ
ఏవిధమైన
దోషములూ
లేనప్పుడు
భయమే
ఉండదు.
ఈనాటి
మానవుడు
ప్రతి
చిన్న
విషయానికి
భయభ్రాంతులకు
గురి
అవుతున్నాడు.
కారణ
మేమిటి?
తనలోని
దోషములే!
అన్యోన్యత
అభివృద్ధి
కావాలంటే
దోషములు
లేకుండా
చూసుకోవాలి.
తన
దోషములే
తనకు
అశాంతిని
కల్గిస్తున్నాయి,
దుఃఖమును
చేకూర్చుతున్నాయి.
నిజంగా
మానవునికి
దుఃఖమే
లేదు.
ఎక్కడినుండి
వచ్చిందీ
దుఃఖము?
ఎవరిచ్చారీ
దుఃఖము?
ఇది
తనలోని
దుర్గుణములయొక్క
‘రిఫ్లెక్షనే’,
తనలోని
దుర్భావములయొక్క
‘రియాక్షనే’!
ప్రేమస్వరూపులారా!
పవిత్రమైన,
ఆదర్శవంతమైన
మానవత్వాన్ని
పొందిన
మీరు
ఎందుకు
దుఃఖంతో
క్రుంగిపోవాలి?
ఎందుకు
విచారంలో
మునిగిపోవాలి?
మీలో
ఉన్న
దోషములయొక్క
ప్రతిబింబమే
ఇదంతా.
మీరు
తెల్లవారి
లేచిన
తక్షణమే
న్యూస్
పేపరు
చూస్తుంటారు.
ఎక్కడ
చూసినా
అశాంతియే!
ఎక్కడ
చూసినా
ఒకరి
నొకరు
చంపుకోవడము,
ద్వేషము,
క్రోధము...
ఇలాంటివన్నీ
మీ
మనస్సును
అపవిత్రం
గావించి,
మిమ్మల్ని
అశాంతికి
గురిచేస్తున్నాయి.
తెల్లవారి
లేచినది
మొదలు
మీ
మనస్సును
ప్రశాంతంగా
ఉంచుకోవాలి.
ఆనందమును
అనుభవించాలి.
ఏవో
కష్టములు,
విచారములు
ఉండవచ్చును.
4
▾
Meaning
Keep
అవన్నీ
వస్తుంటాయి,
పోతుంటాయి.
వాటిని
లెక్కచేయకూడదు.
వాటిని
పట్టించుకున్నప్పుడే
అవి
మిమ్మల్ని
బాధిస్తాయిగాని,
పట్టించుకోకపోతే
ఏవీ
బాధించవు.
ఆజ్ఞను
విస్మరిస్తే
అనుగ్రహమెలా
లభిస్తుంది?
ఈశ్వరకుటుంబము
ఆదర్శవంతమైనది.
నేటి
కుటుంబపరిస్థితిని
దీనితో
పోల్చుకోవడానికి
వీలే
లేదు.
తల్లీకొడుకుల
మధ్య
ద్వేషము...
భార్యా
భర్తల
మధ్య
ద్వేషము...
అన్నదమ్ముల
మధ్య
ద్వేషము...
అన్ని
రంగములందు
ద్వేషము
ప్రజ్వరిల్లుతోంది.
ద్వేషమునకేమాత్రం
అవకాశ
మీయకూడదని
పార్వతీశ్వరులు
ప్రత్యక్షంగా
ప్రబోధిస్తున్నారు.
కాని,
ఈ
బోధనలను
ఎవరు
వింటున్నారు?
ఎవరు
ఆచరిస్తున్నారు?
భక్తిగా
పూజిస్తున్నారేగాని,
భగవంతుని
ఆదర్శాలనెవరు
అనుసరిస్తున్నారు?
ఆదర్శాలను
అనుసరించకుండా
భగవంతుణ్ణి
పూజిస్తే
ప్రయోజనమేమిటి?
ఈశ్వరనామాన్ని
స్మరిస్తూ,
ఈశ్వరాజ్ఞకు
విరుద్ధంగా
ప్రవర్తించినప్పుడు
ఈశ్వరానుగ్రహము
ఏరీతిగా
లభిస్తుంది?
మొట్టమొదట
మనం
ఐకమత్యాన్ని
పెంచుకోవాలి.
అసూయాద్వేషాలను
అణచివేయాలి.
అసూయాద్వేషాలే
మానవుణ్ణి
హతం
చేస్తున్నాయి.
నిజంగా
మానవుడు
ఎంతో
ఆనందమును
అనుభవించవలసినవాడు,
ఎన్నో
సుఖములను
పొందవలసిన
వాడు.
కాని,
ఏమాత్రం
సుఖమును
పొందలేకపోతున్నాడు.
తనయందే
ఉన్న
ఆనందాన్ని
తాను
మరచిపోతున్నాడు.
నిజంగా
మానవునికి
దుఃఖమనేదే
లేదు.
మానవుడు
ఆనందమయుడు,
ప్రేమస్వరూపుడు.
అలాంటివానికి
దుఃఖమెందుకు
కల్గుతోంది?
దైవాజ్ఞను
ఉల్లంఘించడమే
ఇందుకు
కారణం.
దుఃఖమనేది
తన
దుర్భావములయొక్క
‘రియాక్షనే’.
ఎదురుగా
వచ్చే
వ్యక్తి
నిన్ను
ద్వేషిస్తున్నాడని
నీవు
భావిస్తే,
రోడ్డుమీదే
మీ
ఇద్దరిమధ్య
యుద్ధం
జరుగుతుంది.
అట్లుగాకుండా
అతనిని
చూసిన
తక్షణమే,
‘హలో
బ్రదర్!
హౌ
ఆర్
యు?”
అని
ప్రేమతో
పలుకరించు.
అతను
కూడా
‘బ్రదర్,
హౌ
ఆర్
యు?”
అని
నిన్ను
పలుకరిస్తాడు.
నీవు
ప్రేమను
ప్రదర్శించినప్పుడే
ఆ
ప్రేమ
ఎదుటి
వ్యక్తియందు
ప్రతిబింబిస్తుంది.
నీ
‘యాక్షన్’
ఎలా
ఉంటుందో
‘రియాక్షన్’
కూడా
అలాగే
ఉంటుంది.
ఎదుటి
వ్యక్తి
నిన్ను
దూషిస్తున్నాడంటే,
నిన్ను
దూషించేది
ఆ
వ్యక్తి
కాదు.
నీలోని
దుర్భావములే
ఆవిధమైన
రూపాన్ని
ధరించి
నిన్ను
దూషిస్తున్నాయి.
కనుక,
నీవు
పవిత్రమైన
భావములను
పెంచుకొని
పవిత్రమైన
కర్మలనాచరించాలి.
5
▾
Meaning
Keep
దైవాజ్ఞను
శిరసావహించాలి.
అప్పుడే
నీకు
శాంతిభద్రతలు
చేకూరుతాయి.
నవవిధ
భక్తిమార్గములలో
స్నేహమే
ముఖ్యమైనది
ప్రేమస్వరూపులారా!
మీ
మనస్సునందు
పవిత్రమైన
భావములే
లేకుండిన
మీరెన్ని
పూజలు
చేసినా,
ఎన్ని
భజనలు
చేసినా,
ఎన్ని
వ్రతములు
చేసినా
ప్రయోజనం
లేదు.
“శ్రవణం
కీర్తనం
విష్ణోఃస్మరణం
పాదసేవనం
వందనం
అర్చనం
దాస్యం
స్నేహమాత్మనివేదనం”
అనే
నవవిధ
భక్తి
మార్గములను
బోధించడంలో
గల
అంతరార్థ
మేమిటి?
వీటిలో
మీకు
నచ్చిన
మార్గాన్ని
అనుసరించండి.
ఏ
ఒక్కటీ
అనుసరించకపోతే
మీరు
పెడమార్గం
పట్టే
ప్రమాదముంది.
వీటన్నింటిలోను
అతిముఖ్యమైనది
స్నేహము.
అనగా,
దైవముతో
స్నేహము
పెంచుకోవాలి.
స్నేహము
తరువాతనే
ఆత్మనివేదనము
సాధ్యమౌతుంది.
ఇందునిమిత్తం
మీలో
భక్తి,
ప్రేమలు
రెండూ
ఉండాలి.
అందరినీ
మీరు
ప్రేమించాలి.
ప్రేమను
అందించాలి.
ప్రేమను
అందుకోవాలి.
ఈనాటి
మానవుడు
ప్రేమనందుకోవడానికి
సిద్ధంగా
ఉన్నాడుగాని,
ప్రేమనందించడానికి
సిద్ధంగా
లేడు.
ఇది
‘వన్
వే
ట్రాఫిక్’
కాదు.
ప్రేమనందించినప్పుడే
ప్రేమ
నందుకోవడానికి
వీలౌతుంది.
మీ
హృదయములో
దయాప్రేమలు
ఆవిర్భవించాలి.
దయాప్రేమలు
లేనివాడు
రాక్షసుడనే
చెప్పవచ్చును.
దయతో
నిండినదే
హృదయము.
అట్టి
హృదయము
కల్గినవాడే
మానవుడు.
ప్రతి
వ్యక్తి
తెలుసుకోవలసిన
‘అడ్రస్’లు
పోస్టులో
పంపించే
కవరుమీద
From
అడ్రస్
ఉండాలి,
To
అడ్రస్
ఉండాలి.
ఈ
రెండూ
లేని
కవరును
Dead
letter
box
లో
పడేస్తారు.
మీరుకూడా
మీ
From
అడ్రస్‌ను
మరియు
To
అడ్రస్‌ను
తెలుసుకోవాలి.
అనగా,
“నేనెక్కడినుండి
వచ్చాను?
నేనెక్కడున్నాను?”
అని
విచారణ
చేయాలి.
“నేను
దైవమునుండి
వచ్చాను.
నేను
మానవత్వములో
ఉన్నాను”
అని
గుర్తించాలి.
అప్పుడే
మీలో
మంచి
భావములు
ఆవిర్భవిస్తాయి.
ఈరీతిగా,
మీ
From
అడ్రస్‌ను,
To
అడ్రస్‌ను
నిత్యం
తలచుకుంటూ
ఉన్నప్పుడే
మీరు
నిజమైన
మానవులుగా
జీవించగలరు.
దైవాజ్ఞను
శిరసావహించి
దైవానుగ్రహాన్ని
పొందడానికి
మీరు
కృషి
చేయాలి.
6
▾
Meaning
Keep
సకల
జీవరాశులలో
ఒక్క
మానవునికి
మాత్రమే
ఇట్టి
పవిత్రమైన
అవకాశం
ఉన్నది.
అనాదికాలమునుండి
భారతీయులు
ఇలాంటి
ఆదర్శమును
అందిస్తూ
వచ్చారు.
ఇట్టి
ఆదర్శమును
మీరు
అనుసరించకపోవడంచేతనే
అశాంతికి
గురి
అవుతున్నారు.
భగవంతుడేది
ఇచ్చినప్పటికీ
దానిని
మీరు
ఆనందంగా
అందుకోవాలి.
భగవంతుడు
ఏది
ఇచ్చినా
మీ
క్షేమంకోసమే!
ఒక
చిన్న
ఉదాహరణ:
మీకు
పొట్టలో
ఒక
పెద్ద
పుండు
పుట్టింది.
ఆ
పుండును
తొలగించడానికి
డాక్టరు
ఒక
కత్తితో
మీ
పొట్టను
కోస్తాడు.
మీ
పొట్టను
కోసినంత
మాత్రాన
ఆయనకు
మీపై
ద్వేషమున్నట్లా?
కాదు,
కాదు.
మీ
క్షేమంకోసమే
డాక్టరు
ఆ
పని
చేస్తున్నాడు.
అదేవిధంగా,
భగవంతుడుకూడా
మీ
క్షేమంకోసమే
మీకు
కొన్ని
కష్టాలను
అందించవచ్చు.
భగవంతుడు
ఏది
చేసినా
మీ
మంచికోసమే!
సుఖదుఃఖములు
రెండూ
భగవంతుని
అనుగ్రహప్రసాదములే.
ఏది
ఎందుకు
అందిస్తున్నాడో
ఎవరికీ
అర్థం
కాదు.
ఐకమత్యంతో
చేసే
పని
ఆనందాన్ని
అందిస్తుంది
ప్రేమస్వరూపులారా!
అందరితో
ఐకమత్యంగా
జీవించండి.
ఐకమత్యంచేత
అన్ని
కార్యములూ
విజయవంతమౌతాయి.
నిన్న
ఉదయం
మీరు
భజనలు
చేశారు.
ఆ
భజనలు
ఎంత
శ్రావ్యంగా
ఉన్నాయి!
ఎంత
మధురంగా
ఉన్నాయి!
ఎంత
ఆనందాన్ని
అందించాయి!
కారణమేమిటి?
అందరూ
ఐకమత్యంగా
చేశారు.
నిన్నటి
దినము
ప్రశాంత్
అనే
పిల్లవాడు,
కవికుమారుడు,
రవి
కుమార్....
వీరందరూ
శ్రుతి,
లయ,
తాళములతో
ఐకమత్యంగా
పాడారు.
ఫ్లూటు
వాయించిన
పిల్లవాడు
చక్కగా
శ్రుతి
పెట్టాడు.
ఇవన్నీ
చేరి
ఎంతటి
ఆనందాన్ని
అందించాయి!
మైమరపింపజేశాయి.
ఇలాంటి
ఐకమత్యము,
ఇలాంటి
ఆనందము
జగత్తులో
మరోచోట
కనిపించవు.
బయట
శివరాత్రి
పేరిట
ఎంతో
అల్లరి
జరుగుతుంది.
దేవాలయములకు
పోయినా
అల్లరే!
శివరాత్రి
ఉత్సవం
ప్రశాంతినిలయంలో
జరిగినంత
ప్రశాంతంగా
ఇంకెక్కడా
జరగదు.
ఇక్కడ
అన్ని
కార్యక్రమములూ
ప్రశాంతంగా
జరుగుతాయి.
అన్నీ
ప్రేమమయంగా
ఉంటాయి.
ఐకమత్యంతో
చేసే
పనులన్నీ
ప్రేమమయంగానే
ఉంటాయి.
ప్రేమయే
దైవము,
దైవమే
ప్రేమ.
కనుక,
మీరు
ప్రేమచేత
దైవత్వాన్ని
పొందాలి.
7
▾
Meaning
Keep
మీరందరూ
ప్రేమమయులు
కావాలి.
కేవలం
ఇక్కడే
కాదు,
ఎక్కడికి
పోయినా
అన్యోన్యంగా,
ఐకమత్యంగా
జీవించాలి.
అశాంతిని
నిర్మూలించి,
ప్రశాంతిని
పెంచాలి.
ద్వేషానికి
మీరు
అవకాశమీయకూడదు.
అప్పుడే
మీరు
ప్రశాంతి
నిలయం
భక్తులనిపించుకుంటారు.
మీ
విరోధి
ఎదురైనా
అతనిని
ప్రేమతో
పలుకరించండి.
తప్పక
అతను
కూడా
మిమ్మల్ని
ప్రేమతో
పలుకరిస్తాడు.
మీరతనిని
ద్వేషంతో
చూస్తే
అతనుకూడా
మిమ్మల్ని
ద్వేషంతో
చూస్తాడు.
ఈ
జగత్తంతా
‘రియాక్షన్,
రిఫ్లెక్షన్,
రీసౌండ్’లతో
నిండియున్నది.
మీలో
ఆవిర్భవించే
శాంతికిగాని,
అశాంతికిగాని
మీరే
కారకులు.
కాబట్టి,
ఇంకొకరిపై
నింద
వేయకూడదు.
మీ
దోషాలే
మీకు
అశాంతిని
కల్గిస్తాయి.
మీ
మంచిపనులే
మీకు
ఆనందాన్ని
అందిస్తాయి.
ఐకమత్యమును
పెంపొందించుకోండి
ప్రేమస్వరూపులారా!
మీరు
ఆనందముగా
జీవించాలంటే
ఈశ్వర
కుటుంబమును
ఆదర్శంగా
తీసుకోండి,
ఐకమత్యమును
పోషించుకోండి.
You
may
worship
a
picture
as
God,
but
not
God
as
a
picture.
మీరు
ఐకమత్యాన్ని
పోషించుకున్నప్పుడే
నిజంగా
ఈశ్వర
కుటుంబాన్ని
ఆరాధించినవారౌతారు.
కాని,
ఈనాడు
ఐకమత్యము
క్షీణించిపోయింది.
ఒక
తండ్రికి
ఇద్దరు
కుమారులుంటే,
ఆ
ఇద్దరూ
ఒక
మాటపై
ఉండరు,
ఒక
బాటలో
నడవరు;
పరస్పరం
విరుద్ధమైన
మార్గాలను
అవలంబిస్తారు.
కొంతమంది
ఏమీ
మాట్లాడకుండా
మౌనంగా
ఉంటారు.
అదికూడా
తప్పే.
మంచిమాటలచేత
స్నేహం
చేసుకోవాలి.
అందరితో
ప్రేమగా
మాట్లాడాలి.
ఎలాంటి
పరిస్థితిలోనూ
ఒకరినొకరు
ద్వేషించకూడదు.
మన
చేతికున్న
ఐదు
వ్రేళ్ళు
ఐకమత్యంతో
పని
చేయకపోతే
ఏ
చిన్నపనైనా
మనం
చేయలేము
కదా!
పాండవులు
ఐదుమందేగాని,
ఐకమత్యంచేత
పరమాత్మప్రేమకు
పాత్రులు
కాగలిగారు.
కౌరవులు
నూరుమంది
ఉండినప్పటికీ
ఏమి
సుఖాన్ని
అనుభవించారు?
ఒకరంటే
ఒకరికి
గిట్టదు,
ఒకరి
మాట
ఒకరికి
పట్టదు.
వాలీసుగ్రీవుల
పరిస్థితికూడా
అంతే!
ఎన్ని
కష్టములనైనా
సహించుకొని,
భరించుకొని
మీరు
ఐకమత్యమును
పోషించుకోవాలి.
మీలో
ఐకమత్యమును
పెంపొందించడమే
మహాశివరాత్రియొక్క
లక్ష్యము.
8
▾
Meaning
Keep
విద్యార్థులారా!
భక్తులారా!
మీరీ
పవిత్రమైన
ప్రదేశంలో
ప్రవేశించినందుకు
మీ
హృదయాన్ని
పవిత్రంగా
మార్చుకోండి.
మీ
హృదయం
పవిత్రంగా
ఉన్నప్పుడే
మీరు
పవిత్రమైన
పనులు
చేయగలరు.
పాత్ర
పరిశుద్ధంగా
ఉన్నప్పుడే
అందులో
వేసిన
పదార్థము
పరిశుద్ధంగా
ఉంటుంది.
విషముతోకూడిన
బంగారుపాత్రకంటే
పరిశుద్ధమైన
మట్టిపాత్ర
మేలు.
మీ
హృదయము
ఒక
బంగారుపాత్రవంటిది.
దానిని
పరిశుద్ధంగా
ఉంచుకోండి,
మధురమైన
ప్రేమతో
నింపుకోండి.
విద్యార్థులారా!
మీరందరూ
సాయిసంస్థలో
పెరుగుతున్నారు.
సాయి
మీనుండి
దేనినీ
ఆశించడం
లేదు.
మీకు
ఏది
కావలసినా
నేను
ఫ్రీగా
ఇస్తున్నాను.
ఈనాడు
ప్రపంచంలో
మీరెక్కడైనా
ఇలాంటి
విద్యాసంస్థలను
చూశారా?
వాటిని
గురించి
విన్నారా?
ఈనాడు
బిడ్డ
పుట్టక
పూర్వమే
స్కూల్లో
సీటుకొరకు
‘అడ్వాన్స్
బుకింగ్’
చేస్తున్నారు!
ఫస్ట్
స్టాండర్డ్‌లో
సీటుకొరకు
వేలాది
రూపాయలు
డొనేషన్
కట్టేస్తున్నారు.
కాని,
మన
ప్రశాంతినిలయంలో
దేనికీ
‘అడ్వాన్స్
బుకింగ్’
లేదు.
మీరు
సరియైన
ఆదర్శమునందించడమే
మాకు
కావలసింది.
మీరెక్కడికి
పోయినా
మీరు
చదివిన
చదువును
సార్థకం
గావించుకోవాలి.
మీ
చదువును
పదిమందికి
అందించడానికి
ప్రయత్నించాలి.
ప్రేమయే
మీ
ప్రాపర్టీ.
అదియే
నా
ప్రోపర్టీ.
కనుక,
మీరు
ప్రేమను
ఎంత
పెంచుకుంటే
అంత
పెద్ద
ప్రోపర్టీకి
నేను
అధికారిగా
ఉంటాను.
నాకేదీ
అక్కర్లేదు.
మీరు
ప్రేమగా
జీవించండి,
చాలు.
ప్రశాంతిని
మీవెంట
తీసుకువెళ్ళండి
నిజంగా
ప్రశాంతినిలయంలో
జరిగే
ప్రతి
కార్యక్రమము
చాలా
ప్రశాంతముగానే
ఉంటుంది.
ఇన్ని
వేలమంది
ఈ
ప్రదేశంలో
చేరినప్పుడు
ఏ
కించిత్తైనా
శబ్దము
వస్తోందా?
ఎవరైనా
తుమ్ముతారా?
తుమ్మరు.
దగ్గుతారా?
దగ్గరు.
పసిబిడ్డ
అయినా
ఏడ్వదు.
ఇంతటి
పవిత్రతను,
ప్రశాంతతను
అందిస్తుంది
ప్రశాంతినిలయం.
ఇలాంటి
ప్రశాంతినిలయంలోనే
మీరు
ప్రశాంతిని
పొందకపోతే
ఇంకెక్కడ
పొందగలరు?
ప్రశాంతి
నిలయం
అందరికీ
ఆదర్శవంతమైనది.
భౌతికంగా,
నైతికంగా,
ధార్మికంగా,
ఆధ్యాత్మికంగా
అన్నింటికీ
ప్రశాంతినిలయమే
ప్రధానమైనది.
కనుక,
ఈ
ప్రశాంతినిలయము
నుండి
మీరు
ప్రశాంతిని
తీసుకొనిపోవాలి.
ఈనాడు
కొందరు
భక్తులమని
చెప్పుకుంటూ
దుర్మార్గములో
ప్రవేశిస్తున్నారు.
9
▾
Meaning
Keep
మనస్సులో
ఒకటి
పెట్టుకొని
బయట
మరొక
విధంగా
ప్రవర్తిస్తున్నారు.
‘మనస్యన్యత్
వచస్యన్యత్
కర్మణ్యన్యత్
దురాత్మనాం’
కనుక,
అలాంటి
దుర్మార్గులతో
సహవాసం
చేయకండి.
భక్తులు
ఎలా
ఉండాలి?
‘మనస్యేకం
వచస్యేకం
కర్మణ్యేకం
మహాత్మనాం’.
మనస్సు,
మాట,
ప్రవర్తనలలో
ఏకత్వాన్ని
కల్గియుండాలి.
దేహమే
పార్వతి,
హృదయమే
ఈశ్వరుడు
విద్యార్థులారా!
మీ
మాటలద్వారా,
చేతలద్వారా
మీరు
ప్రశాంతి
నిలయంవారని
గుర్తింపు
పొందాలి.
ఏ
దేశానికి
వెళ్ళినా
మీ
ప్రవర్తనను
బట్టి
“వీళ్ళు
ప్రశాంతినిలయం
పిల్లలు”
అనే
సత్కీర్తిని
సాధించాలి.
ఈవిధంగా
ఎంతోమంది
పిల్లలు
సత్కీర్తిని
తెస్తున్నారు.
మీరు
నాకేదీ
ఇవ్వనక్కర్లేదు.
మీ
ప్రవర్తనను
సక్రమమైనదిగా
తీర్చిదిద్దుకోండి.
అదే
నాకు
ఆనందము.
మీరే
కాదు,
భక్తులైన
ప్రతి
ఒక్కరు
తమ
ప్రవర్తనను
సక్రమమైనదిగా
తీర్చిదిద్దుకోవాలి.
“మేము
విశ్వకుటుంబీకులము.
పార్వతీ
పరమేశ్వరులే
మా
తల్లిదండ్రులు”
అని
విశ్వసించాలి.
పార్వతి
అనగా,
మన
దేహమే!
కనుకనే,
దేహమును
ప్రకృతితో
పోల్చారు.
మన
హృదయమే
ఈశ్వరుడు.
దేహము
-
ప్రవృత్తి,
హృదయము
-
నివృత్తి.
ఈ
రెండింటి
ఏకత్వమే
మానవత్వము.
ఇది
భగవంతుడు
మీకు
ప్రసాదించిన
వరము.
కాబట్టి,
“నేను
చేస్తున్నాను”,
అనే
భావముతో
అహంకార
పడవద్దు.
అహంకారము
ఎక్కడ
చేరితే
అక్కడ
అన్నివిధాలుగా
ప్రమాదాలే
వస్తుంటాయి.
కనుక,
అహంకారమును
వదలి
ప్రేమను
పెంచుకోండి.
ప్రేమచేత
సాధించలేనిది
ఏదీ
లేదు.
(శ్రీవారు
‘ప్రేమ
ముదిత
మనసె
కహో
రామ
రామ
రామ్...”
మరియు
“హే
శివశంకర
నమామి
శంకర...”
అనే
భజనలను
తాము
పాడి
భక్తులచేత
పాడించారు)
ఈనాటి
పవిత్రమైన
నామసంకీర్తన
గాలిలో
చేరి
ప్రతిధ్వనిస్తూ
జగత్తంతా
వ్యాపించి
సర్వులకు
సద్గుణములు,
సదాచారములు,
సత్ప్రవర్తనలను
అనుగ్రహించుగాక,
అని
ఆశీర్వదిస్తూ
నా
ప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
Previous
←
Lasting Ānanda is gained only through satsaṅga
Next
The principle of Prema: the divine power of attraction
→