Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2003 · Lasting Ānanda is gained only through satsaṅga
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Lasting Ānanda is gained only through satsaṅga
1 March 2003, Śivarātri, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
ఓ
సాధకుడా!
తనయందున్న
ఆత్మతత్త్వము,
పరులయందున్న
ఆత్మతత్త్వము
ఒక్కటే
అన్న
సత్యాన్ని
గుర్తించిన
వ్యక్తి
రక్తుడుగాని,
విరక్తుడుగాని,
గృహస్థుడుగాని,
సన్యాసిగాని,
కర్మలు
ఆచరించినా,
ఆచరించకపోయినా
సర్వకాల
సర్వావస్థలయందు
భగవత్సాన్నిధ్యాన్ని
అనుభవిస్తూ
ఆనందంగా
ఉంటాడు.
భక్తుడైనవాడు
తనయందున్న
ఆత్మతత్త్వము,
సర్వజీవులయందున్న
ఆత్మతత్త్వము
ఒక్కటే
అని
గుర్తించాలి.
ఇట్టి
దివ్యమైన
ఏకత్వమును
గుర్తించ
వలెనన్న
సత్సంగము
అత్యవసరము.
సత్సంగమనగా
మంచివారు,
భక్తులు
మరియు
సాధకులయొక్క
సహవాసమని
చాలామంది
భావిస్తుంటారు.
‘సత్’
అనగా
త్రికాలములందు
మార్పు
చెందని
సత్యము.
“ఏకం
సత్
విప్రాః
బహుధా
వదంతి”,
అన్నారు.
అదే
ఆత్మతత్త్వము.
సచ్చిదానందమే
దాని
స్వరూపము.
దీనినే
ఆంగ్లభాషలో
Transcendental
Truth
అన్నారు.
ఇట్టి
సత్యమే
ఆత్మతత్త్వము.
దీనిని
మనం
గుర్తించవలెనన్న
మూడు
మంత్రములను
ఆచరణలో
పెట్టాలి.
ఒకటి,
‘భద్రం
పశ్యంతు’.
రెండవది,
‘భద్రం
శృణ్వంతు’.
మూడవది,
‘భద్రం
కుర్వంతు’.
వీటిని
ఆచరణలో
పెట్టినప్పుడు
మనమింక
ఆత్మ
సాక్షాత్కారముకోసం
వెతుకనక్కర్లేదు.
మనం
ఆత్మకంటే
వేరు
కాదని,
ఈ
జగత్తులో
ఆత్మ
తప్ప
మరొకటి
లేనే
లేదని
విశ్వసించాలి.
మనం
వినే
ప్రతి
శబ్దము
ఆత్మతత్త్వముయొక్క
ప్రతిధ్వనియే
అని,
అందరిలో
ఉన్నది
ఒకే
ఆత్మతత్త్వమని
గుర్తించాలి.
అప్పుడింక
మనము
ఏ
సాధనలూ
చేయనక్కర్లేదు.
ఏకత్వాన్ని
గుర్తించిన
వ్యక్తికి
సాధనలతో
పనేముంది!
సర్వకర్మలయొక్క
సారమే
దైవత్వము.
2
▾
Meaning
Keep
దివ్యమైన
దర్శనము,
దివ్యమైన
సంభాషణము
మరియు
దివ్యమైన
కర్మలన్నీ
ఒక్క
దైవత్వమునందే
ఇమిడి
యున్నవి.
కాబట్టి,
దైవత్వంతో
చేరియుండడమే
నిజమైన
సత్సంగము.
త్రికాలములందు
మార్పు
చెందనటువంటిదే
‘సత్’.
దాని
సాంగత్యమును
మనం
అనుభవించాలి.
ఏరీతిగా?
మన
దృష్టిని
మరల్చుకోకుండా
ఉండాలి.
మన
వాక్కును
మార్చుకోకుండా
ఉండాలి.
మన
కర్మలలో
మార్పులేకుండా
ఉండాలి.
అయితే,
ఈనాటి
యువకులకు
వీటిని
ఆచరణలో
పెట్టడం
చాలా
కష్టం.
వాళ్ళకు
ఒక్క
దృష్టి
ఉండదు,
అనేక
దృష్టులుంటాయి.
ఒక్క
మాటలో
వాళ్ళు
జీవించలేరు;
అనేక
విధములైన
మాటలను
చేర్చుకుంటారు;
అనేకరకములైన
కర్మలను
ఆచరిస్తుంటారు.
‘మనస్యేకం
వచస్యేకం
కర్మణ్యేకం
మహాత్మనాం’,
అన్నారు.
ఏకత్వంతో
కూడిన
కర్మలను
మనం
ఆచరించాలి.
దృష్టి,
మాటలు
మరియు
కర్మలయొక్క
ఏకత్వమే
సత్సంగము.
దీనినే
త్రిగుణములయొక్క
పవిత్రత
అని
అన్నారు.
ఏకాత్మతత్త్వంతో
ఉండడమే
నిజమైన
సత్సంగము.
ఆత్మ
అనేకంగా
ఉన్నదని
భావించరాదు.
ఆత్మ
ఒక్కటే.
అదియే
ఈ
జగత్తునంతా
ఆకర్షిస్తూ
ఉంటుంది.
ప్రకృతి
అనగా
ఏమిటి?
మానవుని
మోహింపజేసే
వస్తువులతో
కూడినదే
ప్రకృతి.
దీనియందు
అన్నీ
అస్థిరమైన
వస్తువులే
ఉన్నాయి;
స్థిరమైన
వస్తువు
ఏ
ఒక్కటీ
కానరాదు.
ఇవన్నీ
మానవుణ్ణి
భ్రమింపజేసేవేగాని,
తరింపజేసేవి
కావు.
ఈ
అనిత్యమైన
వస్తువులు
అనిత్యమైన
ఫలితమునే
అందిస్తాయిగాని,
నిత్యసత్యమైన
ఫలితమునందించలేవు.
ప్రకృతిలోని
అన్ని
పదార్థములూ
మార్పుచెందుతున్నాయి.
కనుక,
మార్పు
చెందని
తత్త్వమును
మనం
గుర్తించాలి.
కంటికి
కనిపించేదంతా
భగవత్స్వరూపమే!
‘నేను
భగవంతుణ్ని
దర్శించేదెట్లా?’
అని
నీవు
ప్రశ్నించవచ్చు.
పిచ్చివాడా!
నీవు
ఎక్కడ
చూసినా
ఉన్నది
భగవంతుడే.
కాని,
నీవు
బాహ్యదృష్టితో
చూడడంచేత
నీకు
భగవంతుడు
గోచరించడం
లేదు.
‘పశ్యతీతి
పశుః’
అన్నారు.
బాహ్యదృష్టి
గలవాడు
పశుసమానుడు.
నీవు
అంతర్దృష్టిని
అభివృద్ధిపరచుకో.
అప్పుడు
నీవు
చూసేది,
అనుభవించేదంతా
దైవత్వమే
అని
గుర్తించగలవు.
నీవు
దైవంకోసం
వెతుకనక్కర్లేదు.
నీవే
దైవము,
దైవమే
నీవు.
దీనిని
పురస్కరించుకొనియే
వేదము,
‘నేనే
దైవము’
అనే
సత్యాన్ని
ప్రబోధిస్తూ
వచ్చింది.
3
▾
Meaning
Keep
లోకంలో
మనం
ఏది
చూసినా
అది
దైవమే;
ఏది
అనుభవించినా
అది
దైవమే;
ఏది
భుజించినా
అది
దైవమే.
కనుకనే,
‘సర్వం
ఖల్విదం
బ్రహ్మ’
అన్నారు.
మన
దృష్టికి
అనేకరకములుగా
గోచరించినప్పటికీ
అది
ఏకత్వంగానే
ఉంటున్నది.
అట్టి
ఆత్మతత్త్వం
నీ
యందే
ఉన్నది.
‘ఏకం
సత్’
అన్నారు.
ఏకత్వాన్ని
అనుభవించడమే
సత్సంగము.
సత్సంగమనగా
ఏకత్వంతో
కూడినదేగాని,
అనేకత్వంతో
కూడినది
కాదు.
ఎక్కడైనా
పదిమంది
ఆధ్యాత్మిక
సాధకులు
చేరితే
అది
సత్సంగమని
భావిస్తున్నారీనాడు.
కాని,
అది
స్థిరమైనది
కాదు,
మార్పుచెందుతుంది.
ఎందుకనగా,
నీవు
ఎవరిని
మంచివారని
భావిస్తున్నావో
వారు
చెడ్డవారుగా
మారిపోవచ్చు.
అందరూ
అస్థిరమైన
జీవులే.
అన్నీ
అశాశ్వతమైన
సంబంధములే.
అస్థిరమైనవి,
అశాశ్వతమైనవి
శాశ్వతానందమునెట్లు
అందించగలవు?
అట్టి
అశాశ్వతమైన
సంబంధమును
సత్సంగముగా
భావించడంచేతనే
ఈనాటివరకు
ఎవ్వరూ
సత్సంగ
ప్రభావమును
గుర్తించుకోలేకపోతున్నారు.
Tell
me
your
company,
I
shall
tell
you
what
you
are.
అనిత్యమైనవారితో
స్నేహం
చేసినప్పుడు
మీకు
అనిత్యమైన
సంబంధమే
ప్రాప్తిస్తుంది.
నిత్యసత్యమైన
దివ్యత్వముతో
మీరు
స్నేహం
చేయాలి.
అప్పుడే
మీకు
నిత్యసత్యమైన
ఆనందం
ప్రాప్తిస్తుంది.
అట్టి
ఆనందం
మీయందే
ఉన్నదిగాని,
బయటి
ప్రపంచంలో
కానరాదు.
అందరూ
దైవమునందే
ఉన్నారు
ఈ
ప్రపంచంలో
ఉన్నవన్నీ
అస్థిరమైన
పదార్థములే,
దృశ్యకల్పితమైన
వస్తువులే.
ఇవన్నీ
అదృశ్యమైన
ఆత్మతత్త్వమునందే
ఇమిడియున్నవి.
దైవ
మెక్కడున్నాడు?
అని
అడిగితే
కొందరు,
‘నాలోనే
ఉన్నాడు’,
అని
అంటారు.
ఇది
సరియైన
జవాబు
కాదు.
‘నేను
దైవములో
ఉన్నాను’
అని
చెప్పాలి.
ఎందుకంటే,
ఈ
జగత్తంతయు
దైవములోనే
ఉన్నది.
‘ఈ
పుష్పము
నా
చేతిలో
ఉంది’,
అన్నప్పుడు,
పుష్పము
నీకంటే
చిన్నదైపోయింది
కదా!
అదేరీతిగా,
‘దైవము
నాలో
ఉన్నాడు’,
అంటే
నీవు
దైవముకంటే
అధికుడవనే
అర్థం
వస్తుంది.
నీవు
దైవములో
ఉన్నావు.
నిజానికి
నీవే
దైవమైయున్నావు.
“నేనే
దైవం.
దైవమే
నేను.
4
▾
Meaning
Keep
నేను
దైవములో
ఉన్నాను”,
అని
నీవు
విశ్వసించాలి.
అందరూ
దైవమునందే
ఉన్నారు.
దైవమే
లేక
జగత్తే
లేదు.
ఇదే
Transcendental
Truth.
ఇదే
మార్పు
చెందని
సత్యము.
ఇదే
‘సత్’.
కాని,
కొంతమంది
దైవచింతన
చేయకుండా
అహంకారముతో
విఱ్ఱవీగుతుంటారు.
అహంకారము
చీడపురుగువంటిది.
అసూయ
వేరుపురుగువంటిది.
ఈ
రెండూ
చేరి
మానవజీవితవృక్షాన్ని
నాశనం
చేస్తున్నాయి.
ఈ
దుర్గుణములను
నశింపజేసుకున్నప్పుడే
మానవుడు
మానవునిగా
జీవించ
గలడు.
ఆనందమే
ఆత్మస్వరూపం
మన
నరసింహమూర్తి
తన
ప్రసంగంలో
ఆత్మతత్త్వమే
దైవత్వమని
చెప్పాడు.
ఆత్మకొక
ప్రత్యేకమైన
రూపము
లేదు.
రూపము
లేనిదానిని
ఏరీతిగా
దర్శించాలి?
ఆనందమే
ఆత్మస్వరూపం.
ఆనందము
సర్వులయందున్నది.
ప్రతి
మానవుడు
ఆనందస్వరూపుడే.
కాని,
భౌతికమైన
ధనకనక
వస్తువాహనాదుల
వ్యామోహములో
మునిగిపోయి
తాను
ఆనందమునకు
దూరమైపోతున్నాడు.
ఈ
భౌతికమైన
వస్తువులు
ఎంతకాలం
ఉంటాయి?
ఇదొక
పుష్పము.
ఈనాడిది
బాగానే
ఉంది.
కాని,
రేపటికి
వాడిపోతుంది.
ఇదేరీతిగా,
భౌతికమైన
పదార్థములన్నీ
మార్పుచెందుతాయి.
మార్పుచెందనిది
ఆత్మ
ఒక్కటే,
ఆనంద
మొక్కటే.
అట్టి
ఆనందము
అనుభూతికి
మాత్రమే
తెలుస్తుంది
గాని,
ఆలకింపుకి
అర్థం
కాదు;
ఒకరు
చెపితే
బోధపడదు.
దీనిని
నీ
అంతట
నీవే
అర్థం
చేసుకోవచ్చును.
ఏవిధంగా?
త్రిగుణములను
ఏకం
గావించు,
తప్పక
నీకు
ఆనందము
ప్రాప్తిస్తుంది.
ఇక్కడ
త్రిగుణములంటే
సత్వరజస్తమోగుణములు
కావు.
నేను
చెప్పినట్లుగా
ఒకే
దృష్టి,
ఒకే
శ్రవణము,
ఒకే
కర్మ...
ఈ
మూడింటి
ఏకత్వాన్ని
అనుభవించినప్పుడే
ఆనందము
ప్రాప్తిస్తుంది.
అదే
నిత్యానందము,
అదే
అద్వైతానందము.
కొంతమంది
కొద్దిసేపు
ధ్యానములో
కూర్చుని,
“నేనెంతో
ఆనందమును
అనుభవించాన”ని
అంటారు.
ఇది
కేవలం
భ్రమయే
తప్ప
సరియైన
ఆనందము
కాదు.
ఆ
ఆనందము
సత్యమైనదైతే
ఎప్పటికీ
ఉండాలి;
జాగ్రత్స్వప్న
సుషుప్త్యవస్థలలో
ఎప్పటికీ
ఒక్కటిగానే
ఉండాలి;
త్రికాలములందు
మార్పు
చెందనిదిగా
ఉండాలి.
5
▾
Meaning
Keep
ప్రేమతత్త్వమే
దైవత్వము
విద్యార్థులారా!
ఈ
లేతవయస్సునుండియే
మీలో
ఆధ్యాత్మిక
చింతన
ప్రారంభము
కావాలి.
మీరు
కోరవలసింది
ఒక్కటే,
అదే
నిజమైన
ఆనందము.
ఒకే
మాటపై
ఉండాలి,
ఒకే
దృష్టి
ఉండాలి,
ఒకే
కర్మలో
లీనము
కావాలి.
నిజమైన
ఆనందము
ఒక్కటే,
నిజమైన
దృష్టి
ఒక్కటే,
నిజమైన
కర్మ
ఒక్కటే,
నిజమైన
అనుభూతి
ఒక్కటే.
దీనినే
మనము
సత్సంగముగా
భావిస్తున్నాము.
ఈ
భౌతికమైన
అనుభూతులను
ఎంతకాలము
అనుభవించినా
మీకు
సత్యమైన
ఆనందము
లభ్యం
కాదు.
ఒక్క
దైవముతోనే
మీకు
నిత్య
సత్యమైన
ఆనందము
ప్రాప్తిస్తుంది.
దైవాన్ని
వదలి
భ్రమలో
మునిగి
లోకాన్ని
అనుసరిస్తే
మీకు
లభించేది
అశాంతియే!
మీరు
ఎన్ని
విధములైన
వ్యాపారములు
చేసినా,
ఎన్ని
కర్మలనాచరించినా
అన్నీ
మార్పు
చెందునవే.
మార్పు
చెందనిది
ఒక్కటే.
దానికే
వేదాంతము
‘ఆత్మ’
అని
పేరు
పెట్టింది.
“ఏకాత్మా
సర్వ
భూతాంతరాత్మా”
బల్బులు
వేర్వేరుగాని,
కరెంటు
ఒక్కటే.
అట్లే,
దేహములు
వేర్వేరుగాని,
అందరియందున్న
ఆత్మ
ఒక్కటే.
ఈ
సత్యాన్ని
గుర్తించి
దేహాభిమానమును
వదలిపెట్టాలి.
కాని,
ఈనాటి
మానవునిలో
ఇట్టి
విశాలమైన
భావము
లోపించింది.
మానవుడు
దైవత్వములో
చేరాలనుకుంటే
తాను
ప్రేమస్వరూపునిగా
మారిపోవాలి.
దైవత్వము,
ప్రేమతత్త్వము
వేరువేరుగా
ఉండడానికి
వీల్లేదు.
ప్రేమతత్త్వమే
దైవత్వము.
మానవత్వములో
అట్టి
దివ్యత్వమున్నది
కనుకనే,
‘జంతూనాం
నరజన్మ
దుర్లభం’
అన్నారు.
గమ్యముయొక్క
రహస్యం
తెలుసుకోవాలి
ఈనాటి
మానవుడు
తన
జన్మనుగూర్చి
విచారణ
చేస్తున్నాడుగాని,
తన
గమ్యమును
వెతకడానికి
ప్రయత్నం
చేయడంలేదు.
జన్మ
రహస్యం
తెలుసుకోవడం
కాదు
ముఖ్యము,
గమ్యముయొక్క
రహస్యం
తెలుసుకోవాలి.
మన
గమ్యమేమిటి?
సత్యమే
మన
గమ్యము.
అదే
ఆత్మతత్త్వము.
మానవుడు
తన
గమ్యాన్ని
వెతుక్కోకుండా
జన్మను
తరింపజేసుకోవడానికి
ప్రయత్నం
చేస్తున్నాడు.
ఎన్ని
జన్మలెత్తినా
ఇది
సాధ్యం
కాదు.
శంకరులవారు
చెప్పారు:
6
▾
Meaning
Keep
From
Bhaja Govindam, verse 21
Also in his talks
(8)
23 May 1973
The Wheel of Birth and Death, and Vimukti
24 June 1996
A Life without Character Is a Lifeless Life
18 August 1996
Man Must Learn to Live as Man
9 September 1996
Satyaṁ Jñānam Anantaṁ Brahma
20 April 1998
Inquiry into the eternal and the transient is essential
15 April 2003
Ancient traditions are the steps to rising higher
23 November 2004
Service to Society Is Itself Life's Supreme Goal
18 August 2006
Cast off the delusion of the body and foster attachment to God
“పునరపి
జననం
పునరపి
మరణం
పునరపి
జననీ
జఠరే
శయనం
ఇహ
సంసారే
బహు
దుస్తారే
కృపయా
పారే
పాహి
మురారే”
మానవుడు
ఎన్ని
జన్మలెత్తినప్పటికీ
చేసిందే
చేస్తున్నాడు,
చూసిందే
చూస్తున్నాడు,
అనుభవించిందే
అనుభవిస్తున్నాడు.
తాను
ఒక్కతూరి
జన్మించిన
తరువాత
మరొకతూరి
జన్మించకూడదు.
దేనిని
దర్శిస్తే,
దేనిని
అనుభవిస్తే
తన
జన్మ
సార్థకమౌతుందో
దానిని
తాను
దర్శించాలి,
అనుభవించాలి.
అదియే
ఆత్మతత్త్వము.
మీరిన్ని
వేలమంది
ఇక్కడ
సమావేశ
మయ్యారు.
మీ
ఆకారములు,
ఆలోచనలు,
ప్రవర్తనలు
వేరువేరుగా
ఉంటున్నాయి.
కాని,
అందరినీ
ప్రకాశింపజేసే
తత్త్వమొక్కటే.
అదే
ఆత్మప్రకాశము.
ఆ
ప్రకాశమును
అనేకమంది
అనేకరీతులుగా
ఉపయోగపెట్టుకోవచ్చు.
ఎవరేవిధంగా
ఉపయోగపెట్టుకున్నా
దానికేమాత్రం
సంబంధము
లేదు.
ఉదాహరణకు,
ఒక
బల్బు
వెలుతురులో
ఒక
విద్యార్థి
తన
హోమ్‌వర్క్
చేసుకోవచ్చు;
మరొక
వ్యక్తి
తప్పుడు
లెక్కలు
వ్రాయవచ్చు;
ఇంకొకరు
దుర్భావములతోకూడిన
జాబు
వ్రాయవచ్చు.
ఎవరేమి
చేసినప్పటికీ
లైటుకేమీ
దోషమంటదు
కదా!
అదేరీతిగా,
బాహ్యమైన
మార్పులు
ఎన్ని
జరిగినప్పటికీ
ఆత్మ
నిత్యమై,
సత్యమై,
సాక్షీభూతమై
ఉంటుంది.
సత్యతత్త్వమును
గుర్తించుటకు
భక్తి
చాలా
ప్రధానం
దైవము
ఒక్కడే.
గమ్యము
ఒక్కటే.
దీనిని
పురస్కరించుకొనియే,
“నేను
వెలుగులో
ఉన్నాను.
వెలుగు
నాలో
ఉన్నది.
నేనే
వెలుగు.
వెలుగే
నేను”
అని
చెప్పడం
జరిగింది.
‘నేను’
అనేది
భక్తిని,
‘వెలుగు’
అనేది
జ్ఞానమును
సూచిస్తున్నాయి.
భక్తి,
జ్ఞానములు
రెండూ
ఏకమైయున్నాయి.
భక్తి
జ్ఞానములో
చేరియున్నది.
జ్ఞానము
భక్తిలో
చేరి
యున్నది.
Love
అనేది
భక్తి,
Light
అనేది
జ్ఞానము.
కాబట్టి,
Light
&
Love
ఈ
రెండింటి
ఏకత్వమును
గుర్తించుటకు
మీరు
ప్రయత్నించాలి.
సత్యతత్త్వమును
గుర్తించడానికి
భక్తి
చాలా
ప్రధానమైనది.
ప్రేమతత్త్వమును
పెంచుకుంటూ
క్రమక్రమేణ
దానిని
జ్ఞానముగా
మార్చుకోవాలి.
ఎన్ని
మార్పులు
కలిగినప్పటికీ
బుద్ధిని
చలింపజేసుకోకుండా
ఆత్మతత్త్వముపై
నిల్పుకోవాలి.
ఇట్టి
ఏకత్వాన్ని
సాధించే
నిమిత్తమై
ఆనాటి
మహర్షులు
కారడవులలో
కఠోరమైన
తపస్సు
ఆచరిస్తూ
వచ్చారు.
7
▾
Meaning
Keep
మీరుకూడా
జపము
చేస్తున్నారు,
ధ్యానము
చేస్తున్నారు,
మంత్రాలు
వల్లిస్తున్నారు.
ఇవన్నీ
కేవలం
మీ
అల్పతృప్తికోసం
చేస్తున్నారు,
అనిత్యమైన
శాంతికోసం
చేస్తున్నారు.
ఈవిధంగా
లభించే
శాంతి
శాశ్వతం
కాదు.
ఇది
Peace
కాదు,
Pieces!
ఒకసారి
జపమాలను
త్రిప్పితే
108
పూసలు
ఒకదాని
తరువాత
ఒకటి
మారిపోతూ
ఉంటాయి.
కాని,
వాటన్నింటిలో
ఉన్నది
ఒకే
దారము.
అదేరీతిగా,
అనేకత్వము
మార్పుచెందుతుందిగాని,
అందులోనున్న
ఏకత్వము
నిత్యముగానే
ఉంటుంది.
అదే
దివ్యత్వము.
ఏకత్వాన్ని
గుర్తింపజేయునదే
సరియైన
సాధన
దివ్యత్వము
ఒక
‘మ్యాగ్నెట్’
వంటిది.
ఈ
‘మ్యాగ్నెట్’
జగత్తునంతా
ఆకర్షిస్తున్నది.
ఈ
ఆకర్షణశక్తి
ఒక్కొక్కచోట
అధికంగా
ఉంటుంది,
ప్రత్యేకంగా
ఉంటుంది.
ఒక
చిన్న
ఉదాహరణ
చూడండి.
ఇన్ని
వేలమంది
ఇక్కడికి
ఎలా
వస్తున్నారు?
ఎవరు
ఆహ్వానించారు
మిమ్మల్ని?
ఈ
‘మ్యాగ్నెట్’
ఒక్కటే
ఇంతమందిని
ఆకర్షిస్తున్నది.
ఇదే
దైవాకర్షణ
శక్తి.
ఈ
శక్తి
ఒకరు
తలిస్తే
వచ్చేది
కాదు,
పిలిస్తే
వచ్చేది
కాదు.
ప్రేమద్వారానే
ఇది
ప్రాప్తిస్తుంది.
ప్రేమ
అనేది
లోపలి
నుండి
ఊరేదేగాని,
బయటినుండి
కూరేది
కాదు.
లౌకికమైన
జ్ఞానమును
బయటినుండి
కూరవచ్చు.
కాని,
ప్రేమతత్త్వము
లోపలినుండి
ఊరాలి.
ప్రేమయే
దైవము.
లౌకికమైన
జ్ఞానము
ఏకత్వంలో
అనేకత్వాన్ని
చూపిస్తుంది.
ప్రేమతత్త్వం
అనేకత్వములో
ఉన్న
ఏకత్వాన్ని
దర్శింపజేస్తుంది.
కనుక,
అందరియందున్న
ఆత్మతత్త్వమే
మనయందున్నదనే
సత్యాన్ని
తెలుసుకోవాలంటే
ప్రేమను
పెంచుకోవాలి.
ఆకలి
అందరికీ
సహజమే.
కాని,
ఒక్కొక్కరు
ఒక్కొక్క
పదార్థమును
భుజించి
తమ
ఆకలి
తీర్చుకుంటారు.
పదార్థములు
వేరువేరుగా
ఉండవచ్చును
గాని,
ఆకలి
ఒక్కటే
కదా!
“అన్నములవి
వేరు,
ఆకలి
ఒక్కటే”.
మీ
సాధనలు,
మీ
భ్రమలు
వేరువేరుగా
ఉండవచ్చునుగాని,
మీ
అందరిలోనున్న
ఆత్మ
ఒక్కటే.
ఇట్టి
ఏకత్వమును
గుర్తించడానికి
ప్రయత్నించడమే
సరియైన
సాధన.
మీలో
ప్రేమతత్త్వమును
నిశ్చలముగా,
నిర్మలముగా
పెట్టుకోవాలి.
కాని,
ఈనాటి
యువకులందు
ప్రేమ
క్షణక్షణమునకూ
మారిపోతూ
ఉంటుంది.
ఈనాడు
పవిత్రంగా
ఉంటుంది,
రేపు
అపవిత్రంగా
మారిపోతుంది.
ఈరీతిగా
మార్పుచెందే
ప్రేమతత్త్వం
భక్తి
కాజాలదు.
8
▾
Meaning
Keep
‘ఏకం
సత్’.
దాన్ని
లక్ష్యంలో
పెట్టుకోవాలి.
‘నేను
వెలుగులో
ఉన్నాను.
వెలుగు
నాలో
ఉన్నది’
అనే
సత్యాన్ని
మరువకుండా
ఉండాలి.
కట్టకడపటికి
‘నేను
నేనే’
అనే
ఏకత్వాన్ని
సాధించాలి.
ఆత్మతత్త్వమును
గుర్తించాలంటే
మనం
అనేకత్వమునకు
తావీయకూడదు.
ఈ
జగత్తులో
మనం
చూసేది,
వినేది,
అనుభవించేది
సత్యము
కాదు.
ఇదంతా
కేవలం
‘రియాక్షన్,
రీసౌండ్,
రిఫ్లెక్షన్’
మాత్రమే!
‘రియాలిటీ’
మనయందే
ఉన్నది.
ఇక్కడ
ఇంతమంది
పిల్లలు
కనిపిస్తున్నారు.
వీళ్ళంతా
ఎక్కడివారు?
నాలో
ఉన్న
ప్రతిబింబాలే!
లేకపోతే,
వీళ్ళంతా
నాకెట్లా
కనిపిస్తారు?
అట్లనే,
ప్రతి
వ్యక్తీ,
ప్రతి
పదార్థమూ
మీయందు
ప్రతిబింబిస్తున్నాయి.
ఆత్మతత్త్వం
ఆద్యంతరహితమైనది
మానవ
జీవితము
సంయోగ,
వియోగములతో
కూడినటువంటిది.
అయితే,
ఈ
రెండింటిపట్ల
సమత్వము
వహించాలి.
నాకు
సంయోగమూ
లేదు,
వియోగమూ
లేదు.
సంయోగముంటే
కదా
వియోగముండేది!
ఇవన్నీ
మన
భ్రమలేగాని,
వేరు
కావు.
నిజంగా
ఆత్మను
గుర్తించదలచినవారు,
‘ఏకం
సత్’,
దానిని
మాత్రమే
దృష్టిలో
పెట్టుకోవాలి.
ఉన్నది
ఒక్కటే,
రెండవది
లేనే
లేదు.
అది
మార్పు
చెందేది
కాదు.
సర్వకాల
సర్వావస్థలయందు
అది
ఏకంగానే
ఉంటుంది.
అట్టి
ఏకత్వాన్ని
గుర్తించాలంటే
సత్సంగములో
ప్రవేశించాలి.
అనగా,
మనం
చూసేది,
మనం
వినేది,
మనం
చేసేది
-
ఈ
మూడింటి
ఏకత్వం
కావాలి.
ఇదే
నిజమైన
సత్సంగము.
ఆత్మతత్త్వమునకు
ఆది,
అంతములు
లేవు.
కనుకనే,
దానిని
‘లింగము’తో
పోల్చారు.
ఎందుకంటే,
లింగమునకు
తల,
కాళ్ళు
రెండూ
ఉండవు.
పూజచేసేటప్పుడు
దానినేవిధంగానైనా
పెట్టుకోవచ్చు.
ఆత్మకు
పేరు
మాత్రమున్నదిగాని,
రూపము
లేదు.
ఆనందమే
దాని
స్వరూపం.
అది
మననుండి
ఆవిర్భవించేదే!
అది
ఎప్పటికీ
మార్పుచెందదు.
కాని,
మీరు
బాహ్యమైన
ఆనందముకోసం
ప్రాకులాడితే,
మీలోపలున్న
ఆనందముకూడా
క్షీణించిపోతుంది.
దైవముతో
చేరి
ఆనందముననుభవించాలి
ప్రేమస్వరూపులారా!
ఈరోజు
పరమ
పవిత్ర
మైన
శివరాత్రి
పర్వదినము.
‘శివం’
అనగా
పవిత్రమైనదని
అర్థం.
9
▾
Meaning
Keep
Also in his talks
(14)
30 July 1987
To nurture sacred feelings in the heart is education
6 October 1989
Do Not Give Up the Name of God
28 May 1990
The Three Gunas
16 September 1990
Discipline is like our very life-breath
20 October 1990
The day that wrought the great change
14 January 1992
All learning that lacks humility and obedience is the learning of a rākṣasa!
22 September 1996
Though Forms and Names Differ, the Principle of Brahman Is One!
14 April 1998
God pervades all
23 April 1998
Human Life Is Most Precious
26 April 1998
All Beings Are Parts of God
11 October 1998
Human Life Is the Fruit of Our Resolves
9 October 2001
God in human form
20 November 2001
Spiritual education is essential alongside worldly education
2 May 2006
The body itself is the temple; you yourself are God
దివ్యత్వము
‘సత్యం,
శివం,
సుందరం’
అని
వర్ణించబడింది.
మీరు
చూసినది,
విన్నది,
ఆచరించినది
మూడింటినీ
దైవానికి
అర్పితం
గావించాలి.
త్రిదళం
త్రిగుణాకారం
త్రినేత్రంచ
త్రియాయుధం
త్రిజన్మ
పాపసంహారం
ఏక
బిల్వం
శివార్పణం
ఈనాడు
అందరూ
కొన్ని
భ్రమలచేత,
భ్రాంతులచేత
ఎవరికి
తోచినరీతిగా
వారు
పూజలు,
సాధనలు
సల్పుతూ
వస్తున్నారు.
పట్టిన
పట్టు
విడువకుండా
ఉండాలి.
దృష్టి
ఒక్కటిగానే
పెట్టుకోవాలి,
శ్రవణం
ఒక్కటిగానే
ఉండాలి,
కర్మ
ఒక్కటిగానే
ఉండాలి.
భగవద్గీత,
“కర్మణ్యే
వాధికార
స్తే
మా
ఫలేషు
కదాచన...”
అని
బోధిస్తోంది.
కర్మాచరణయందు
మాత్రమే
మనకు
అధికారమున్నది.
ఏది
చేసినా
భగవత్ప్రీత్యర్థంగా
చేయాలి.
అప్పుడు
ఎట్టి
దోషములూ
మన
కంటవు.
ఆత్మతత్త్వమును
అనుభవించాలంటే
ఇంతకంటే
సులభమైన
మార్గము
మరొకటి
లేదు.
ఈనాడు
ఎవరికి
తోచినట్లు
వారు
ప్రత్యేకమైన
మార్గాలను
అనుసరించడం
చేతనే
అనేక
కష్టాలు
వస్తున్నాయి.
ఈవిధమైన
భ్రాంతులచేతనే
Confusion
(అయోమయస్థితి)
ఏర్పడుతున్నది.
దానివల్ల
Fuse
పోతున్నది!
అనగా,
భగవంతునికి,
మీకు
మధ్యనున్న
సంబంధము
తెగిపోతున్నది.
అందరూ
భగవత్స్వరూపులే!
ఇట్టి
తత్త్వాన్ని
గుర్తించాలంటే
మానవత్వమునుండి
దివ్యత్వములోకి
ప్రవేశించాలి.
అదియే
‘సత్’.
దానిని
గుర్తిస్తే
అందరూ
ఒక్కటే
అనే
సత్యము
బోధపడుతుంది.
ఆకారములను
చూసి
మీరు
భేదభావములకు
అవకాశమీయకూడదు.
దైవంతో
చేరి
ఆనందముననుభవించాలి.
దైవమే
మీ
నిజమైన
ప్రోపర్టీ.
అందరూ
దైవములోనే
ఉన్నారనే
ఏకత్వమును
పెట్టుకోండి.
భేదభావాలను
దూరం
చేసుకోండి.
రూపనామములను
ఆధారం
చేసుకోవద్దు
విద్యార్థులారా!
మీకీ
వయస్సులో
అనేక
రకములైన
భేదభావములు
కల్గుతుంటాయి.
మీ
చదువులు
మీరు
చదువవచ్చును.
అవి
భౌతికంగా
జరుగవలసినవి.
అయితే,
మానసికంగా
మీరు
ఏకత్వముపై
దృష్టి
పెట్టాలి.
అల్లా
అన్నా,
జీసస్
అన్నా,
రాముడన్నా,
కృష్ణుడన్నా...
పేర్లు
వేరువేరుగాని,
దివ్యత్వము
ఒక్కటే
అనే
సత్యాన్ని
గుర్తించాలి.
ఇట్టి
తత్త్వమును
గుర్తింపజేసే
సాధన
మీరు
చేయాలి.
10
▾
Meaning
Keep
రూపనామములను
ఆధారం
చేసుకుంటే
మీరు
సత్యతత్త్వమును
గుర్తించలేరు.
రూపనామములు
మార్పుచెందుతాయి.
రాముడెవరు?
దశరథుని
కుమారుడు.
కృష్ణుడెవరు?
యశోద
కుమారుడు.
ఈవిధంగా
విచారణ
చేస్తే,
వారి
సంబంధబాంధవ్యములు
జ్ఞాపకం
వస్తుంటాయి.
భగవంతుడు
ఎవరి
కుమారుడు?
భగవంతునికి
తల్లి
ఎవరు?
ఏకత్వాన్ని
మీరు
దృష్టిలో
పెట్టుకుంటే
ఈ
సంబంధాలేవీ
గుర్తుకు
రావు.
దివ్యత్వానికి
లౌకికమైన
సంబంధ
బాంధవ్యాలను
కల్పించడంచేతనే
ఈ
భేదాలు
కల్గుతున్నాయి.
మనం
భేదరహితులం
కావాలి.
“ఈశావాస్యమిదం
జగత్”,
ఈ
జగత్తంతా
భగవంతుడు
వ్యాపించియున్నాడు,
“ఈశ్వరస్సర్వ
భూతానాం”.
సర్వజీవులయందు
భగవంతుడున్నాడు.
ఈ
రెండింటినీ
గుర్తించి
వర్తించినప్పుడు
మనిషికి,
మనిషికి
మధ్య
సన్నిహిత
సంబంధ
బాంధవ్యమేర్పడుతుంది.
ఎట్టి
భేదములూ
ఉండవు.
ప్రాకృతమైన
భ్రాంతులకు
లొంగిపోవద్దు
ప్రాకృతమైన
కష్టాలు
కదలిపోయే
మేఘాలవంటివి.
అవి
వస్తుంటాయి,
పోతుంటాయి.
మీ
దృష్టిని
ఆత్మ
అనే
‘సూర్యుని’పై
పెట్టుకోవాలి.
మేఘాలు
అడ్డువచ్చినప్పుడు
సూర్యుడు
కనిపించడు.
‘అయ్యో,
సూర్యుడు
కనిపించడం
లేదే!’
అని
చింతించనక్కర్లేదు.
కొంతసేపు
ఓపికపడితే
మేఘాలు
వాటంతటవే
కదలిపోతాయి.
అదేవిధంగా,
ప్రాకృతమైన
భ్రాంతులు
మేఘాలవలె
అడ్డు
వచ్చినప్పుడు
మీ
మనస్సును
చలింపజేసుకోకూడదు.
కొంతసేపు
ఓపిక
పట్టుకోవాలి.
ప్రాకృతమైన
భావములకు,
భ్రాంతులకు
మీరు
లొంగిపోవద్దు.
వారి
మాటలు,
వీరి
మాటలు
నమ్మి
మానవత్వాన్ని
నాశనం
చేసుకోవద్దు.
మీరు
మానవత్వమునుండి
దైవత్వమునకు
పోవలెనేగాని,
దానవత్వమునకు
దిగజారి
పోకూడదు.
మానవత్వం
నుండి
దైవత్వానికి
పోవలెనంటే
సత్సంగము
కావాలి.
ఒకే
దృష్టి,
ఒకే
శ్రవణము,
ఒకే
కర్మ...
ఇట్టి
దివ్యమైన
ఏకత్వాన్ని
ప్రబోధించే
నిమిత్తమే
శివరాత్రి
వస్తున్నది.
ఈ
రాత్రంతా
ఎందుకోసం
భజన
చేయాలన్నారు?
మనస్సు
పరిపరివిధాల
మారకుండా,
అటువైపు
ఇటువైపు
భ్రాంతులు
పడకుండా
దానిని
దివ్యత్వముపై
స్థిరంగా
నిలపాలి.
కొంతమంది
భజనలో
కూర్చుని
ప్రాపంచిక
వ్యవహారాలు
మాట్లాడుతుంటారు.
అలాంటివారి
దగ్గరకుకూడా
మీరు
పోకూడదు.
“త్యజ
దుర్జన
సంసర్గం,
భజ
సాధు
సమాగమం,
కురు
పుణ్య
మహోరాత్రం”.
11
▾
Meaning
Keep
విద్యార్థులారా!
మీరు
ఎల్లప్పుడు
ఆత్మతత్త్వమును
స్మరిస్తూ
రావాలి.
మీ
అమ్మానాన్నలు
మీతో
ప్రాపంచికమైన
విషయాలు
చెబుతుంటారు.
వారికైతే
తెలియదు.
తెలుసుకున్న
మీకైనా
బుద్ధి
ఉండవద్దా?
వారేమి
చెప్పినప్పటికీ
మీరు
దివ్యత్వముపైనే
లక్ష్యము
ఉంచుకోవాలి.
‘అమ్మా!
నీ
ఇష్టం
నీది,
నా
ఇష్టం
నాది.
నేను
నీ
కుమారుడను,
నీవు
నా
తల్లివి.
నిజమే.
కాని,
నీ
తలంపులు
నీవే,
నా
తలంపులు
నావే.
నేను
నీకు
సేవ
చేస్తాను,
కృతజ్ఞత
చూపుతాను.
నీకు
ఆనందము
కలిగిస్తాను.
అంతేగాని,
నేను
సత్యమార్గమును
విడిచిపెట్టలేను”
అని
నీ
తల్లికి
నచ్చజెప్పాలి.
ప్రేమస్వరూపులారా!
ఈ
రాత్రి
మరొక
లింగము
ఉద్భవిస్తుంది.
(అంతకు
ముందు
తమ
హస్తచాలనముచే
సృష్టించిన
సువర్ణలింగమును
చూపుతూ...)
ఇది
అతను
(బృందావనం
హాస్టల్
వార్డెన్)
కోరడంవలన
చేతితో
సృష్టించానుగాని,
ఇంకొకటి
లోపలినుండియే
వస్తుంది.
అతని
ప్రార్థనను
పురస్కరించుకొని
సృష్టించిన
లింగమిది.
ఇలాంటి
లింగాలు
ఎన్నైనా
సృష్టించవచ్చును.
అన్నీ
ఈ
చేతిలోనే
ఉన్నాయి.
అంతా
ఒక్కటే.
ఇటువంటి
ఏకత్వాన్ని
గుర్తించడానికి
మీరు
తగిన
కృషి
చేయాలి.
చదువుతోపాటు
ఏకాత్మభావమును
అభివృద్ధి
చేసుకోవాలి.
అప్పుడు
ద్వేషము,
అసూయవంటి
దుర్గుణములు
మీ
దరికిరావు.
ఎన్ని
బాధలు
కల్గినా
మీరు
విచారించరు,
ఏమాత్రం
దుఃఖించరు.
అద్వైతస్థితిలో
ఆనందాన్ని
అనుభవించగలరు.
కనుక,
దైవముపై
మనస్సు
పెట్టండి.
దైవాజ్ఞను
శిరసావహించండి.
అప్పుడే
మీ
జీవితాన్ని
ఉద్ధారం
చేసుకోగలరు.
Previous
←
To satisfy Swami, you must cultivate good qualities
Next
Take Īśvara's family as your ideal
→