Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2003 · The principle of Prema: the divine power of attraction
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The principle of Prema: the divine power of attraction
16 March 2003, Brindavan
1
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులారా!
ప్రతి
మానవుడు
చింతను
దూరము
చేసుకొని
సంతోషమును
అందుకోవాలని
అభిలషిస్తున్నాడు.
చింతను
దూరము
చేసుకొనవలెనన్న,
మానవత్వమునుండి
దివ్యత్వమునకు
చేరవలెనన్న
సత్సంగము
అత్యవసరము.
సత్సంగములో
ప్రవేశించని
మానవునియొక్క
జన్మ
నిరర్థకం.
సత్సంగమనగా
ఏమిటి?
సద్భక్తులతో
చేరి
ఆనందమును
అనుభవించడమే
సత్సంగమని
మీరు
భావిస్తున్నారు.
కాదు,
కాదు.
‘సత్’
అనగా
త్రికాలములందు
మార్పుచెందని
తత్త్వము.
ఇట్టి
దివ్యత్వమునకు
సంబంధించిన
తలంపులు
మానవునియందు
నిరంతరము
ఆవిర్భవిస్తూ
ఉండాలి.
అసలు
మానవుడు
పుట్టింది
దేనికోసం?
కేవలం
ప్రాపంచికసుఖాలను
అనుభవించే
నిమిత్తం
కాదు.
“పరోపకారార్థ
మిదం
శరీరమ్”.
పరులకు
ఉపకారం
చేసే
నిమిత్తమే
ఈ
శరీరము
ఆవిర్భవించింది.
కాబట్టి,
మానవుడు
తాను
బ్రతికినంతకాలము
తన
దేహమును
సమాజసేవకు
వినియోగించి,
సమాజానికి
సుఖ
సంతోషాలను
అందిస్తూ
రావాలి.
అందుకు
అవసరమైన
సర్వశక్తులనూ
భగవంతుడు
మానవ
దేహానికి
సమకూర్చాడు.
మానవుడు
మృణ్మయుడు
కాడు,
చిన్మయుడు
మానవ
దేహము
ఇంద్రియములచేత
కట్టబడియున్నది.
మంచిగాని,
చెడ్డగాని
ఇంద్రియములద్వారానే
లభిస్తుంది.
కనుక,
మొట్టమొదట
ఇంద్రియములను
మంచి
మార్గములో
ప్రవేశపెట్టాలి.
భగవద్గీతయందు
కృష్ణుడు
అర్జునునికి
బోధించినది
ఇదే!
ఇంద్రియనిగ్రహమే
మానవుని
ప్రధాన
కర్తవ్యం.
ఇంద్రియ
నిగ్రహము
లేనివాడు
పశువు
కంటే
హీనుడు.
పశువులైనా
కొన్ని
సందర్భాలలో
తమ
ఇంద్రియాలను
అరికట్టుకుంటాయి.
కాని,
మానవుడై
పుట్టి
విజ్ఞాన,
సుజ్ఞాన,
ప్రజ్ఞానములను
కల్గియుండికూడను
ఇంద్రియాలను
అరికట్టుకోలేకపోతే
ప్రయోజనమేమిటి?
అరిషడ్వర్గాలు
మృగ
లక్షణాలు.
ఇట్టి
మృగలక్షణాలను
పోషించుకొని
మానవుడు
తానుకూడా
మృగంగా
తయారౌతున్నాడు.
2
▾
Meaning
Keep
From
the Śrīmad Bhāgavatam, 7.5.23
Also in his talks
(48)
2 October 1986
Restrain Manas, and you will have restrained the world!
6 October 1986
Serve the Lord of all in the form of society!
8 October 1986
Bhakti means perfect Prema fostered for God
23 November 1986
Inquiry into Ātma-jñāna itself is Sanātana Dharma
27 September 1987
Sādhanas without Prema are fruits without juice!
24 November 1987
We must become messengers of Śānti!
29 July 1988
Creation is nothing but the expression of Īśvara's will!
14 January 1989
The man of virtue alone is strong
23 March 1989
Do all actions only to please God
7 April 1989
All this is Vāsudeva
3 September 1989
Fill the Mind with Mādhava
12 September 1989
The Name of God Alone Is the Boat
4 October 1989
Grasp the Supreme Goal of Life
5 November 1989
Ānanda Is Within You Alone
25 May 1990
Vagaries of the Mind
3 June 1990
Vedic Wisdom
14 August 1990
Role of the Avatars
19 November 1990
Service as duty
28 July 1992
To love God for God's own sake: that alone is true Bhakti
22 July 1994
The fullness of Prema
28 February 1995
God, master of the three
15 January 1996
Only one who masters the mind can reach Mādhava
18 February 1996
The Name is the great boat for life
17 June 1996
He Who Reaches God's Presence Is Honoured Everywhere
29 June 1996
Karma, Bhakti and Jñāna: The Aim of All Three Is One
14 July 1996
Divine Proximity is the Real Wealth
27 August 1996
When the Anātma Is Removed, the Ātma Is Seen Everywhere
5 September 1996
Saccidānanda Is Man's Very Nature!
3 October 1996
Man's Aim and Goal Is the Vision of His Own Svarūpa
20 October 1996
When the Heart Is Turned to Prema, the World Turns to Brahman
19 July 1997
Guard your character as dearly as life
28 May 1998
Not the Man in Form: the Man of Conduct Is Needed
14 August 1998
Prema Alone Is the Path, Prema Alone the Goal
26 September 1998
God Is the Very Foundation of the World
11 October 1998
Human Life Is the Fruit of Our Resolves
24 November 1998
The Man Who Has Shed Ahaṅkāra and Mamakāra Is Full of Ānanda
22 February 2001
God's grace comes only through the right use of the senses
24 February 2002
God loves the inner feeling
23 November 2002
Satya Is the Paramātma Made Manifest
14 January 2003
To satisfy Swami, you must cultivate good qualities
5 October 2003
I am not the body; I am the embodiment of Prema
15 September 2004
Pour Out Your Life for the Prema of God
9 October 2005
The Ātma Is the One Bond Among All
11 October 2005
The Paramātma in All Is One
2 May 2006
The body itself is the temple; you yourself are God
13 May 2006
Humanness finds its fulfilment only when steadiness and oneness are both there
27 September 2006
Only one who has the vision of the Ātma is liberated
24 May 2008
Remembering the Name is the way across
మానవుడు
మృగము
కాదు,
మృణ్మయుడు
కాదు.
తాను
చిన్మయుడు,
చిదానందస్వరూపుడు.
కాని,
మృగలక్షణాలను
తనలో
చేర్చుకొని
అపకీర్తి
పాలౌతున్నాడు.
మొట్టమొదట
తన
ఇంద్రియాలను
తాను
నిగ్రహించుకోవాలి.
ఇంద్రియాలను
నిగ్రహించే
నిమిత్తం
నవవిధములైన
మార్గములు
నిర్దేశింపబడినాయి.
శ్రవణం
కీర్తనం
విష్ణోఃస్మరణం
పాదసేవనం
వందనం
అర్చనం
దాస్యం
స్నేహమాత్మనివేదనం
ఇట్టి
రాజమార్గములను
వదలి,
మృగలక్షణాలను
పోషించుకొని
‘అరణ్యము’లో
సంచరించడం
మానవత్వము
కాదు.
మృగలక్షణాలను
దూరం
చేసుకున్నప్పుడే
మానవుడు
మాధవునిగా
రూపొందే
అవకాశముంది.
మంచిచెడ్డలు
మనిషియొక్క
ప్రతిబింబములే!
మనము
ఈ
ప్రపంచములో
ఎన్నియో
విషయాలను
వింటున్నాము,
ఎన్నియో
దృశ్యాలను
చూస్తున్నాము.
అయితే,
ఇవన్నీ
మన
అంతర్
ప్రతిబింబములే.
‘రిఫ్లెక్షన్,
రియాక్షన్,
రీసౌండ్’...
ఈ
మూడింటిద్వారానే
మానవుడీ
ప్రపంచములో
తన
జీవితాన్ని
గడుపుతూ
వస్తున్నాడు.
ఏదో
ఒక
పదార్థమును
నీవు
బయట
చూశావంటే,
ఆ
పదార్థము
నీనుండి
వచ్చినదే!
ఒక
వ్యక్తి
నిన్ను
ద్వేషిస్తున్నాడంటే,
అది
నీనుండి
వచ్చిన
ద్వేషమే.
నీ
ద్వేషమే
ఆ
రూపాన్ని
ధరించి
నిన్ను
ద్వేషిస్తున్నది.
దూషణ,
భూషణ,
తిరస్కార,
పురస్కారములుగాని,
మంచిచెడ్డలుగాని
మనిషియొక్క
ప్రతిబింబములే!
మనం
చూసే
ప్రతి
పదార్థమూ
మననుండి
వచ్చినదేగాని,
బయటినుండి
వచ్చినది
కాదు.
ప్రపంచమనగా
ఏమిటి?
పదార్థములయొక్క
చేరికయే!
ప్రతి
పదార్థమూ
అస్థిరమైనదే!
అస్థిరమైన
పదార్థము
మనకు
శాశ్వతానందమును
ఏరీతిగా
అందించగలదు?
ఆనందము
గాని,
దుఃఖముగాని
ప్రపంచములో
లేవు.
ఇవన్నీ
మననుండి
వచ్చిన
ప్రతిబింబములే,
ప్రతిధ్వనులే!
అసలు
మానవునికి
దుఃఖమనేదే
లేదు.
తనకు
తానే
దుఃఖమును
కల్పించుకొని
ఎదుటివ్యక్తిద్వారా
ఆ
దుఃఖాన్ని
అనుభవిస్తున్నాడు.
మానవునికంటే
ఉన్నతమైన
జీవి,
పవిత్రమైన
జీవి
ఈ
జగత్తులో
కానరాదు.
కనుకనే,
‘జంతూనాం
నరజన్మ
దుర్లభం’
అన్నారు.
కాని,
మానవుడు
భ్రమలో
మునిగియుండడంచేత
ఈ
సత్యాన్ని
గుర్తించుకోలేకపోతున్నాడు.
3
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులారా!
మీరెన్నియో
సేవలు
చేస్తున్నారు,
భజనలు
చేస్తున్నారు,
సాధనలు
చేస్తున్నారు.
కాని,
ఈ
సాధనలయొక్క
ఫలిత
మేమిటి?
ఈ
సేవలయొక్క
ఫలితమేమిటి?
అన్నీ
మనం
ఏర్పరచుకొన్నవే,
అన్నీ
మననుండి
ఆవిర్భవించినవే!
కనుక,
మననుండి
మంచిని
ఆవిర్భవింపజేసుకుంటే
మంచిఫలితములే
మనకు
చిక్కుతాయి.
సంకల్పములు
ఎట్టివో
ఫలితములు
అట్టివి.
వేపవిత్తనము
నాటితే
మామిడిఫలము
లభిస్తుందా?
విత్తనము
ఎట్టిదో
వృక్షము
అట్టిది.
మంచిచెడ్డలు
రెండింటికీ
మన
సంకల్పములే
బీజములు.
కనుక,
మనలో
మంచి
సంకల్పాలను
అభివృద్ధిపరచుకొని
ప్రపంచమంతటా
ప్రేమను
వ్యాపింపజేయాలి.
అందరూ
అన్నదమ్ములే,
అక్కచెల్లెళ్ళే!
దైవము
ఒక్కడే.
దైవత్వమునకు,
జీవత్వమునకు
గల
భేదమేమిటి?
వ్యష్టిస్వరూపుడు
జీవుడు,
సమష్టిస్వరూపుడు
దేవుడు.
చెట్టును
వదలి
కొమ్మ
బ్రతకలేదు.
తల్లిని
విడిచి
బిడ్డ
ఉండలేదు.
నీటిని
వదలి
చేప
నిలువలేదు.
జీవత్వ,
దైవత్వముల
మధ్యగల
సన్నిహిత
సంబంధ
బాంధవ్యముకూడా
అలాంటిదే!
దీనిని
పురస్కరించుకొనియే
శ్రీకృష్ణుడు,
“మమైవాంశో
జీవలోకే
జీవభూతస్సనాతనః”,
అని
చెప్పాడు.
ఈ
జగత్తంతయు
భగవత్స్వరూపమే!
ఈ
ప్రకృతిలో
మంచిచెడ్డలను
గురించి,
పాప
పుణ్యములను
గురించి
మనం
చూస్తున్నాము,
వింటున్నాము.
ఈ
చూసేవన్నీ
ఎక్కడివి?
వినేవన్నీ
ఎక్కడివి?
ఇవన్నీ
మన
సంకల్ప
వికల్పములనుండి
ఆవిర్భవించినవే!
ప్రపంచములో
మంచి
లేదు,
చెడ్డ
లేదు.
మంచిచెడ్డలు
సంకల్ప
వికల్పములయందే
ఉన్నాయి.
సంకల్పములు
పవిత్రంగా
ఉన్నప్పుడే
ప్రకృతి
పవిత్రంగా
కనిపిస్తుంది.
ప్రకృతి
అంతా
ఆకర్షణశక్తితో
నిండియున్నది.
ప్రతి
మానవుణ్ణి
ఈ
ప్రపంచము
ఆకర్షిస్తున్నది.
ఈ
ఆకర్షణశక్తి
దివ్యత్వమునుండియే
వస్తున్నది.
దీనినే
Transcendental
Truth
అన్నారు.
ఇది
త్రికాలములందు
మార్పుచెందనటువంటిది,
త్రిలోకములందు
సంచరించునటువంటిది,
త్రిగుణములందు
ఉన్నటువంటిది.
దీనినే
వేదము,
“ఏకం
సత్
విప్రాః
బహుధా
వదన్తి”,
అని
చెప్పింది.
ఉన్నది
ఒక్కటే.
దానిని
అనేకమంది
అనేక
పేర్లతో
పిలుస్తున్నారు.
ఈ
జగత్తునందు
కనిపించేదంతా
ఒక్కటే,
ఒక్కటే!
4
▾
Meaning
Keep
Also in his talks
(27)
5 September 1987
Today satsaṅga is what man needs most urgently
5 October 1992
What man must seek is real, eternal happiness
23 November 1997
The God who fills everything is ‘I’
5 April 1998
Who can recognise the principle of Śrī Rāma
14 April 1998
God pervades all
26 September 1998
God Is the Very Foundation of the World
28 September 1998
The Five Elements Are the Very Forms of the Paramātma
11 October 1998
Human Life Is the Fruit of Our Resolves
21 November 1999
No sādhana greater than service
26 March 2001
The principle that is the root and base
23 November 2001
Self-confidence is the very stairway to Ānanda
25 December 2001
Though faiths differ, Mādhava is one
21 March 2004
I am you, you are I
11 April 2004
Truth itself is the form of God
15 April 2004
The principle of Prema is Divinity itself
17 October 2004
Develop the Feeling of the One Ātma
22 November 2004
Only When Oneness Is Experienced Does Human Birth Find Its Fulfilment
25 December 2004
Pray for the Sake of God's Prema
8 March 2005
Śivatva is the very consciousness in all beings
23 November 2005
All Are Embodiments of God
26 February 2006
All is full of Brahman
30 March 2006
See only good, do only good, be good
14 April 2006
Fix your mind on Divinity; place your trust in Oneness
2 May 2006
The body itself is the temple; you yourself are God
11 August 2006
Divinity is attained only through Prema for God
13 April 2008
The Name of Rāma is best; the thought of Rāma is enough
24 May 2008
Remembering the Name is the way across
ఈ
జగత్తంతా
భగవత్స్వరూపమే!
కాని,
మూఢుడైనవాడు
తాను
చూసేదంతా
ప్రపంచమని
భావించి,
భగవంతుణ్ణి
చూడాలని
ఆశిస్తున్నాడు;
భగవంతుడనేవాడు
ఎక్కడో
ప్రత్యేకంగా
ఉన్నాడని
భ్రమిస్తున్నాడు.
“పశ్యన్నపిచ
నపశ్యతి
మూఢో”.
భగవంతుణ్ణి
తాను
ప్రత్యక్షంగా
చూస్తూనే
ఉన్నప్పటికీ
ఇంకా
భగవంతుణ్ణి
చూడాలనే
ఆశతో
పిచ్చివాడై
తిరుగుతున్నాడు.
నిజంగా
నీవు
చూసేవారందరూ
భగవత్స్వరూపులే
అని
విశ్వసించు.
తప్పక
నీకు
అందరూ
భగవత్స్వరూపులుగా
కనిపిస్తారు.
సర్వతః
పాణిపాదం
తత్సర్వతోక్షి
శిరోముఖం
సర్వతః
శ్రుతిమల్లోకే
సర్వమావృత్య
తిష్ఠతి
దైవస్వరూపము
కానిది
ఈ
జగత్తులో
కానరాదు.
మీరు
మీ
ఆకారమును
బట్టి
మానవులమని
భ్రమిస్తున్నారుగాని,
మీరుకూడా
దైవస్వరూపులే!
జగత్తులో
దుఃఖమనేదే
లేదు,
అంతా
ఆనందమే!
దైవమునకు
ఆకారమేది?
‘దైవం
మానుష
రూపేణ’.
దైవము
మానవాకారాన్ని
ధరించియున్నాడు.
మనం
చూసేదంతా
దైవస్వరూపమే,
మనం
వినేదంతా
దైవశబ్దమే,
అనుభవించేదంతా
దైవానందమే.
“నిత్యానందం
పరమసుఖదం
కేవలం
జ్ఞానమూర్తిం...”
ఈ
ప్రపంచమునందు
ఉన్నదంతా
ఆనందమే.
దుఃఖమనేది
ఎక్కడా
కనిపించడం
లేదు.
“స్వామీ!
మీకు
కనిపించడం
లేదుగాని,
మాకు
మాత్రం
కనిపిస్తున్నది”
అని
మీరనవచ్చు.
నాకుగాని,
మీకుగాని
కనిపించే
దంతా
ఆనందమే!
కాని,
మీరు
మీ
భావములను
ఆనందమునుండి
దుఃఖమువైపు
మరల్చడంచేత
మీకు
దుఃఖము
కనిపిస్తున్నది.
కాని,
నాకు
దుఃఖమే
కనిపించడం
లేదు.
ఆనందం...
ఆనందం...
ఆనందం...
మనమే
ఆనందమయులమైనప్పుడు
మనకు
కనిపించేదంతా
ఆనందమే
కదా!
మీరు
అనిత్యమైన
వస్తువులను
చూసి
నిత్యసత్యమైనవిగా
భావించుకోవడంచేతనే
మీకు
దుఃఖము
కనిపిస్తున్నది.
మనకు
కనిపించేది,
వినిపించేది,
మనలను
నడిపించేది,
తినిపించేది
అంతా
దైవత్వమే.
ఎవరు
ఎవరిని
దూషించినా
అది
పాపమే.
ఎవరు
ఎవరిని
భూషించినా
అది
పుణ్యమే.
నీవు
ఎవరినో
దూషిస్తున్నానని
అనుకుంటావు.
ఎవరినో
కాదు,
నీ
ఆరాధ్య
దైవాన్నే
నీవు
దూషిస్తున్నావు.
5
▾
Meaning
Keep
ఎందుకంటే,
నీవు
దూషించే
వ్యక్తియందు
కూడా
దైవమున్నాడు.
“ఈశ్వరస్సర్వ
భూతానాం”,
“ఈశావాస్యమిదం
జగత్”,
అందరియందున్నది
భగవంతుడొక్కడే.
ప్రేమస్వరూపులారా!
రానున్న
నూతన
సంవత్సరము
మీకేవిధమైన
సుఖాల
నందిస్తుందో,
ఎన్ని
కష్టాలను
కలిగిస్తుందో
అని
మీరనేక
విధాలుగా
ఊహాగానాలు
చేస్తున్నారు.
ఇప్పటికెన్నో
నూతన
సంవత్సరాలు
గడచిపోయాయి.
కాని,
మానవుని
ప్రవర్తన
ఇంకా
పురాతనమైనదిగానే
ఉన్నది.
తాను
మంచి
ఫలితాలను
కోరుతున్నాడే
గాని,
మంచిపనులేమైనా
చేస్తున్నాడా?
ఇతరులు
తనపట్ల
మంచిగా
ఉండాలని
ఆశిస్తున్నాడేగాని,
తాను
మంచిగా
జీవిస్తున్నాడా?
ఆనందం
కావాలని
ఆశిస్తూ,
దానికి
విరుద్ధమైన
పనుల
నాచరిస్తే,
తనకు
ఆనందమెలా
లభిస్తుంది?
ఇది
అసాధ్యము.
మంచిపనులు
చేసినప్పుడే
తాను
మంచిఫలితాన్ని
పొందగలడు.
మంచి
మనస్సు
గలవాడే
మానవుడు
ఈనాటి
మానవుడు
కేవలం
ఆడంబరములకోసం
జీవిస్తున్నాడేగాని,
ఆనందముకోసం
జీవించడం
లేదు.
ఆడంబరము
అశాంతికి
మూలకారణ
మౌతుంది.
కాబట్టి,
ఆడంబరమును
విడిచిపెట్టి
ఆనందముకోసం
జీవించండి.
నిజమైన
ఆనందము
మన
హృదయమునందే
ఉన్నది.
ఈ
ప్రపంచమంతా
ఆనందమయమే.
ఇందులో
దుఃఖముందనుకోవడం
మీ
భ్రాంతియే
తప్ప
వేరు
కాదు.
మీ
మానసిక
వికారములే
మీకు
దుఃఖాన్ని
కల్గిస్తున్నాయి.
‘మనయేవ
మనుష్యాణాం
కారణం
బంధమోక్షయోః’
కనుక,
మనోనాశనం
గావించుకోవాలి.
మనస్సును
మంచిగా
మార్చుకోవాలి.
అప్పుడే
మీరు
మానవులవుతారు.
మానవు
డనగా
ఎవరు?
మంచిమనస్సు
గలవాడే
మానవుడు.
మనము
మంచి
మనస్సును
పెట్టుకోవాలి.
మంచి
జీవితాన్ని
గడపాలి.
మంచిపనులు
చేయాలి.
మంచి
పలుకులు
పలకాలి.
అప్పుడే
మనం
సరియైనస్థితిని
అనుభవిస్తాము.
ఈ
జగత్తులో
ఏదీ
చెడ్డది
లేదు.
మీరు
మంచిభావాలతో
చూడండి,
మీకంతా
మంచియే
కనిపిస్తుంది.
మనము
ఏది
చేస్తామో
అదే
మనకు
ప్రతిబింబంగా
కనిపిస్తుంది.
మన
ప్రతిబింబమును
మనం
చూసుకొని
అది
చెడ్డగా
ఉందనుకుంటే,
దాని
అర్థమేమిటి?
ఆ
చెడ్డ
మనలోనే
ఉన్నదన్నమాట.
6
▾
Meaning
Keep
కనుక,
చెడ్డ
సంకల్పములకు
మనమేమాత్రం
అవకాశమివ్వకూడదు.
దివ్యమైన
భావములను
అభివృద్ధిపరచుకోవాలి.
తీయని
మనస్సును
పోషించుకోవాలి.
అప్పుడే
మీ
జీవితం
మధురమైన
జీవితంగా
ఉంటుంది.
ప్రేమస్వరూపులారా!
మీరు
భజనలు
చేస్తున్నారు.
ఎవరికోసం?
భగవంతునికోసం
చేస్తున్నామనుకుంటున్నారు.
కాని,
భగవంతుని
కేమీ
అక్కర్లేదు.
మీరు
చేసే
భజనలు
మిమ్మల్నే
ఆనందపరుస్తాయి;
పదిమందికి
ఆనందమును
పంచుతాయి.
భగవంతుడు
ఆనందస్వరూపుడు.
తానే
నిత్యానందమయుడై
ఉండగా
తనకు
వేరే
ఆనందమెందుకు?
ఆనందస్వరూపునికి
కల్పితమైన
ఆనందమెందుకు?
భజనలు
మరియు
పూజలు
చేయడంవల్ల
మీ
హృదయం
పవిత్రమౌతుంది.
భగవంతుణ్ణి
ఆరాధన
చేయడం
భగవంతుని
ఆనందముకోసమని
కాదు,
మీ
ఆనందముకోసమే.
దివ్యాత్మస్వరూపులారా!
మానవుడు
మానవునిగా
బ్రతికితే
చాలు.
మానవుని
యందే
మాధవత్వము
ఇమిడియున్నది.
కాని,
ఈనాటి
మానవుడు
దానవునిగా
బ్రతుకుతున్నాడు.
తన
కాలినుండి
తలవరకు
అన్నీ
దుర్మార్గపు
లక్షణాలే!
అట్టివానికి
ఆనందమెట్లా
లభిస్తుంది?
మీ
హృదయాన్ని
పవిత్రం
గావించుకొని,
మీరు
ఆనందమును
అనుభవించి,
మిమ్మల్ని
ఆశ్రయించినవారికికూడా
ఆనందమును
పంచాలి.
ఒక్కొక్క
పర్యాయము
కోపము,
తాపము,
ఈర్ష్య,
అసూయ
ఇత్యాది
దుర్గుణాలు
మీలో
ఆవిర్భవించవచ్చు.
ఇవన్నీ
కదలిపోయే
మేఘాలవంటివి.
వీటికి
లొంగి
పోవద్దు.
మీ
హృదయంలో
ఆవిర్భవించే
నిత్య
సత్యమైన
భావాలను
అనుసరించండి.
అనేకమంది
విష్ణుసహస్రనామార్చన,
లలితాసహస్రనామార్చనలు
చేస్తుంటారు.
ఎన్ని
సహస్ర
నామాలు
చదివినప్పటికీ
వారియందు
మార్పు
కనిపించడం
లేదు.
ఆ
సహస్రనామాల
సారాన్ని
హృదయంలో
పెట్టుకోవాలి.
నిజంగా
మానవుని
హృదయమునందే
పవిత్రమైన
భావమున్నది.
మానవజన్మ
ఎంత
పవిత్రమైనదో,
ఎంత
సార్థకమైనదో,
ఎంత
మధురమైనదో
చక్కగా
విచారణ
చేయండి.
సత్సంగములో
చేరండి.
‘సత్సంగత్వే
నిస్సంగత్వం’
సత్సంగమనగా
మంచిపనులు
చేసేవారితో
సహవాసం
చేయడమని
మీరు
భావిస్తున్నారు.
కాదు,
కాదు.
‘సత్’
అనగా
త్రికాలములందు
మార్పు
చెందనిది,
చిదానందమయమైనది.
అట్టి
‘సత్’తో
సంగము
ఏర్పర్చుకోవడమే
నిజమైన
సత్సంగము.
7
▾
Meaning
Keep
దివ్యప్రేమ
-
లౌకికప్రేమ
ప్రేమస్వరూపులారా!
సత్సంగములో
ప్రవేశించి
మీలో
చిదానందమును
ఆవిర్భవింపజేసుకోండి.
ప్రేమను
పెంచుకోండి.
ప్రేమయే
ఆనందము,
ఆనందమే
ప్రేమ.
ప్రేమానందములను
అనుభవించినప్పుడే
మానవత్వము
సార్థకమౌతుంది.
ప్రేమనుండియే
సర్వసుఖములు
సంభవిస్తాయి.
ఈ
ప్రేమ
మన
హృదయము
నుండి
ఆవిర్భవించేదేగాని,
బయటినుండి
లభించేది
కాదు.
మీరు
షాపులో
ఏదైనా
ఒక
వస్తువును
కొనవచ్చును.
ఆ
వస్తువుపై
మీకు
ప్రేమ
ఉండవచ్చును.
కాని,
అది
కల్పితమైన
ప్రేమయేగాని,
శాశ్వతమైన
ప్రేమ
కాదు.
అది
మీ
హృదయమునుండి
ఆవిర్భవించిన
ప్రేమ
కాదు.
నిజమైన
ప్రేమ
ఎన్నటికీ
మారదు.
ప్రేమయే
దైవము,
దైవమే
ప్రేమ.
ఇట్టి
ప్రేమను
మీరు
పెంచుకోవాలి.
మీరెన్నో
పండుగలు
జరుపుకుంటున్నారు.
ఈ
పర్వదినములలో
మీకు
పాయస
పరమాన్నములు
చిక్కుతాయిగాని,
నిజమైన
ఆనందము
చిక్కదు.
నిజమైన
ఆనందము
మీ
హృదయమునుండియే
వస్తుంది.
పవిత్రమైన
ప్రేమను
మీరనుభవిస్తే
మీకు
కలిగే
ఆనందము
ఇంత,
అంత
అని
చెప్పడానికి
వీలుకాదు.
పట్టపగ్గాలు
లేని
ఆనందాన్ని
అనుభవిస్తారు.
దివ్యప్రేమకు,
లౌకికప్రేమకు
ఉన్న
వ్యత్యాస
మేమిటి?
పదార్థములపైన,
బంధుమిత్రులపైన
రాగముచేత
కలిగే
ప్రేమను
అనురాగమని
పిలుస్తారు.
అది
నిజమైన
ప్రేమ
కాదు.
హృదయమునుండి
వచ్చినదే
నిజమైన
ప్రేమ.
మీయందు
ప్రేమ
ఉన్నది.
కాని,
ఆ
ప్రేమను
పెడమార్గం
పట్టిస్తున్నారు.
Heart
to
heart
(హృదయమునుండి
హృదయానికి)
ప్రసరించే
ప్రేమయే
నిత్యసత్యమైన
ప్రేమ.
ఇదియే
దైవప్రేమ.
ఈ
ప్రేమకు
అనంతమైన
శక్తి
ఉంది.
ఇది
అన్నింటినీ
ఆకర్షిస్తుంది.
స్వామిలో
పెరిగిపోతున్న
దివ్యాకర్షణశక్తి
ఈనాడు
మీకు
చెప్పవలసింది
ఒకటుంది.
స్వామికేదో
కాళ్ళనొప్పి
ఉండడంచేత
నడవటానికి
ఇబ్బందిగా
ఉందని
కొందరు
అనుకుంటున్నారు.
ఏ
నొప్పులూ
నాకు
లేవు.
స్వామి
శరీరములో
నఖశిఖపర్యంతము
ఆకర్షణశక్తి
ఉంటున్నది.
ఇది
Divine
Magnet
(దివ్యమైన
అయస్కాంతము).
8
▾
Meaning
Keep
సాధారణమైన
అయస్కాంతం
ఇనుపముక్కను
ఆకర్షిస్తుంది.
కాని,
ఈ
దివ్యమైన
అయస్కాంతము
యావత్ప్రపంచమునే
ఆకర్షిస్తుంది.
ఇట్టి
ఆకర్షణ
శక్తి
స్వామియందు
ఎప్పుడూ
ఉంది.
అయితే,
శివరాత్రినుండి
ఇది
దినదినానికీ
పెరిగిపోతున్నది.
దీనివలన
ఒక
కాలు
ముందుకు
పెడితే
ఇంకొక
కాలు
లాగుతూ
ఉన్నది.
భూమికికూడా
ఆకర్షణ
శక్తి
ఉన్నది
కదా!
ఇదంతా
ఆకర్షణశక్తివలన
జరుగుతున్నదేగాని,
బాధను
కలిగించేది
కాదు.
స్వామికెట్టి
బాధలూ
లేవు.
ఈ
శక్తి
దినదినానికీ
పెరిగిపోతున్నది.
చేత్తో
ఏదైనా
ముడితే
అది
చేతికి
కరుచుకొని
వస్తోంది.
ఇట్టి
ఆకర్షణశక్తి
కేవలం
స్వామియందు
మాత్రమే
ఉందని
మీరు
భావించకూడదు.
ఇది
మీయందు
కూడా
ఉన్నది.
ఈ
‘పవర్’ను
మీరు
సరియైనరీతిలో
పెట్టుకుంటే
ఎంతైనా
అభివృద్ధి
అవుతుంది.
ఇంతేకాదు.
మరో
చిన్నవిషయాన్ని
చెబుతున్నాను.
ఈ
ఆకర్షణశక్తి
పెరుగుతున్నకొలదీ
జనాలుకూడా
పెరుగుతూ
వస్తున్నారు.
ఇకపైన
ఈ
జనాల్ని
పట్టడానికి
సాధ్యం
కాదు.
అందరినీ
ఆకర్షించేవాడు
దైవము.
దైవముయొక్క
ఆకర్షణ
ఎంతో
పవిత్రమైనది.
ఇప్పుడు
నేను
మీతో
మాట్లాడుతుంటే
భూమి
నా
కాలును
లాగుతోంది.
ఒక
కాలు
ఎత్తితే
మరొక
కాలు
లాగుతుంది.
ఇది
పెరుగుతూ
పోతుంది.
ఇది
Divine
Magnet.
ఈ
ఆకర్షణ
ఎక్కడినుండి
వస్తున్నది?
Transcendental
Truth
నుండి
వస్తున్నది.
అది
మార్పు
చెందని
సత్యము.
అది
ఎప్పుడూ
ఆకర్షణనే
అందిస్తుంది.
ప్రతి
దినము
పోస్టులో
నాకు
మందుల
బాక్సులు
వస్తున్నాయి.
ఎందరెందరో
ఏమేమో
పంపుతున్నారు.
“స్వామీ!
ఇది
రుద్దుకోండి,
నొప్పి
తగ్గుతుంది”,
అని
వ్రాస్తున్నారు.
ఇది
రుద్దుకుంటే
తగ్గేది
కాదు.
అసలు
నాకు
నొప్పే
లేనప్పుడు
ఎందుకు
రుద్దుకోవాలి?
అల్పబుద్ధి
గలవారు
ఈ
ఆయిల్
రుద్దాలి,
ఆ
ఆయిల్
రుద్దాలి,
అని
చెబుతారు.
కాని,
ఇది
రుద్దేకొలదీ
ఎక్కువవుతుందే
గాని,
తగ్గదు.
మీ
ప్రేమతత్త్వమే
నాకు
కావలసింది.
ఆ
ప్రేమతత్త్వముచేత
ప్రేమ
పెరిగిపోయి
ఈ
జగత్తంతా
ప్రేమమయంగా
మారిపోతుంది.
ఈనాటివరకు
నాకు
కించిత్తైనా
బాధ
లేదు.
నడుస్తూనే
ఉన్నాను,
తిరుగుతూనే
ఉన్నాను.
కాని,
ఈ
భూమి
లాగడంచేత
ఒక
కాలు
పెట్టి
ఇంకొక
కాలును
ఎత్తడం
చాలా
కష్టం.
అందుకనే
నిదానంగా
నడుస్తున్నాను.
ఈవిధంగా
జరుగుతున్నదానికి
మీరు
ఎన్నెన్ని
కథలో
కల్పించుకొని
స్వామికి
ఈ
బాధ,
ఆ
బాధ...
9
▾
Meaning
Keep
Also in his talks
(29)
3 July 1986
The aham-principle arose from the Ātma-principle alone
10 October 1986
A people that has morality is the true people
3 September 1988
The body itself is a temple!
15 October 1988
All Things and All Beings in the World Are Forms of the Paramātma!
7 April 1989
All this is Vāsudeva
23 July 1989
All Religions Together Teach Only the Good
13 August 1989
Good Resolves Are Everlasting
12 September 1989
The Name of God Alone Is the Boat
28 October 1989
Prema Itself Is God
14 August 1990
Role of the Avatars
16 September 1990
Discipline is like our very life-breath
1 January 1992
Only when the differences of the upādhis are removed does the principle of the one Ātma become our own
28 February 1995
God, master of the three
20 August 1996
Every Man Must Cultivate the Vision of Prema
8 September 1996
The Unseen Divinity Is the Basis of the World Fashioned as the Seen
29 April 1998
God Alone Is the Ground of Ānanda
25 August 1998
The Whole World Is Filled with Viṣṇu
10 September 1998
By Sacrifice Some Have Attained Immortality
11 August 2000
Only When There Is Purity of Mind Is There Success
13 March 2002
The divine power of attraction
31 August 2002
God in Human Form
10 October 2002
Earn divine Prema
1 January 2003
Only service done with the feeling of the one Ātma is true service
19 August 2003
The heart alone is Kṛṣṇa's birthplace
15 April 2004
The principle of Prema is Divinity itself
18 April 2005
The wedding of Sītā and Rāma is the union of the Ātma and the Paramātma
21 July 2005
No power is greater than Bhakti for God
11 August 2006
Divinity is attained only through Prema for God
29 September 2006
The basis of human life: ‘Educare’
అని
భావిస్తున్నారు.
స్వామికి
ఎట్టి
బాధలూ
లేవు,
ఎట్టి
విచారమూ
లేదు,
ఎట్టి
కష్టమూ
లేదు.
భగవత్తత్త్వాన్ని
గుర్తించుకోవడం
చాలా
కష్టం
నేను
ఆనందమయుడను.
నా
ఆనందానికి
అడ్డు
తగిలేవారు
ఈ
లోకములో
లేనే
లేరు.
కాని,
మీరు
ప్రాపంచికదృష్టితో
చూడడంవలన
ఈ
సత్యాన్ని
గుర్తించలేకపోతున్నారు.
నాకేదీ
అడ్డు
తగలడానికి
వీలుకాదు.
అసలు
బాధ
ఉంటే
కదా
నివారణ!
నాకు
బాధా
లేదు,
నివారణా
లేదు.
ఈ
ప్రపంచంలో
ప్రతి
విషయానికి
కొన్ని
హద్దులుకూడా
ఉంటాయి.
ఇప్పుడీ
పరిస్థితిలో
ఈ
శరీరము
ఎక్కువగా
ప్రయాణము
చేయడానికి
వీలుకాదు.
దినదినానికి
పెరిగిపోతున్నది.
కాలు
ఎత్తాలంటే
చాలా
కష్టం.
చాలా
బలవంతముగా
ప్రయత్నించినా
అది
భూమిని
వదలిరాదు.
భూమిని
వదలి
రావాలంటే
ఏమి
చేయాలి?
కేవలం
సంకల్పమువల్లనే
అది
సాధ్యమౌతుంది.
ప్రతిదానియందు
సంకల్పమే
ప్రధానమైనది.
కనుక,
భగవత్తత్త్వాన్ని
గుర్తించుకోవడం
చాలా
కష్టం.
భగవత్సంకల్పాన్ని
ఎవరూ
గుర్తించలేరు.
భగవంతునియొక్క
శక్తి
ఇట్టిది,
అట్టిది
అని
ఎవరూ
నిర్ణయించలేరు.
నిర్ణయించలేక
కొందరు
తప్పుడు
నిర్ణయాలు
చేస్తుంటారు.
కాచిన
చెట్టుకే
రాళ్ళ
దెబ్బలు
తగులుతాయి.
కాయని
చెట్టుని
ఎవరూ
కొట్టరు
కదా!
అట్లే,
పవిత్రమైన
భావాలకు
ఎన్నో
అడ్డంకులు
ఎదురవుతుంటాయి.
ఎవరూ
గుర్తించుటకు
వీలుకాని
శక్తి
ఈ
దివ్యశక్తి.
చిత్రంబులు
త్రైలోక్య
ప
విత్రంబులు
భవలతాలవిత్రంబులు
స
న్మిత్రంబులు
మునిజనవన
చైత్రంబులు
విష్ణుదేవు
చారిత్రంబుల్
భగవంతుణ్ణి
ప్రేమించడమే
మీ
ప్రధాన
కర్తవ్యం
ప్రేమస్వరూపులారా!
అందరూ
ప్రేమతో
పెరగండి.
సత్యముతో
జీవించండి.
ఇదియే
మీ
జీవితపరమావధి.
మానవత్వము
కేవలం
తిండి
తీర్థాదులకోసం
ఏర్పడినది
కాదు.
మీ
పనులను
మీరు
చేసుకోవచ్చును,
మీ
కుటుంబాన్ని
మీరు
పోషించుకోవచ్చును,
పరులకు
మీరు
సహాయము
చేయవచ్చును.
10
▾
Meaning
Keep
కాని,
మీ
ప్రధాన
కర్తవ్యమేమిటి?
భగవంతుణ్ణి
ప్రేమించడమే!
ఆ
ప్రేమయే
మీ
ప్రధాన
లక్ష్యము.
ఆ
ప్రేమను
మించిన
ప్రాపర్టీ
మరొకటి
లేదు.
ఆ
ప్రేమచేతనే
మీ
జన్మ
సార్థకమౌతుంది.
కనుక,
ప్రేమను
పెంచుకోండి
బంగారూ!
ప్రతి
మానవుని
యందు
హిరణ్యగర్భుడున్నాడు.
కనుకనే,
నేను
మిమ్మల్ని
‘బంగారూ!’
అని
సంబోధిస్తున్నాను.
ఎక్కడైనా
ఏ
డాక్టర్లనైనా,
సైంటిస్టులనైనా
అడిగి
మీరు
పరీక్ష
చేసుకోండి...
మీ
దేహమునందు
అనేక
లోహములున్నాయి.
ప్రపంచములో
ఏ
ఆకర్షణశక్తి
ఉన్నదో
అది
మీ
దేహములోకూడా
ఉన్నది.
దుర్గుణాలనే
త్రుప్పును
వదిలించుకోండి
కొంతమంది
ఈ
‘డివైన్
మ్యాగ్నెట్
’
యొక్క
శక్తిని
అర్థము
చేసుకోలేక,
“ఇందులో
శక్తి
ఉంటే
మమ్మల్నెందుకు
ఆకర్షించడం
లేదు?”
అంటారు.
త్రుప్పు
పట్టిన
ఇనుమును
అయస్కాంతము
ఆకర్షిస్తుందా?
ఆకర్షించదు.
ఆకర్షించనంత
మాత్రాన
దానికి
శక్తి
లేనట్లా?
కాదు,
కాదు.
ఆ
ఇనుములోనే
దోషమున్నది.
దానికి
‘రస్టు,
డస్టు’
(Rust
&
Dust)
చేరడంచేతనే
దానిని
అయస్కాంతము
ఆకర్షించడం
లేదు.
ఆ
ఇనుమును
శుభ్రం
చేసి
పెడితే
అయస్కాంతము
తక్షణమే
ఆకర్షిస్తుంది.
అదేరీతిగా,
మీ
మనస్సుకు
పట్టిన
దుర్గుణములు,
దుర్భావములనే
త్రుప్పును
వదిలించుకోండి;
ఒక్క
క్షణములో
దివ్యత్వము
మిమ్మల్ని
ఆకర్షిస్తుంది.
మీరు
ఎక్కువ
శ్రమపడనక్కర్లేదు.
భగవంతుణ్ణి
చేరడానికి
ఎన్నో
సాధనలు
చేయనక్కర్లేదు.
హృదయప్రేమను
పెంచుకుంటే
చాలు.
దానిని
మించిన
పవిత్రత
మరొకటి
లేదు.
ఆ
ప్రేమయే
మార్పు
చెందని
సత్యము
(Transcendental
Truth).
త్రికాలములందు,
త్రిలోకములందు,
త్రిగుణములందు
ఎక్కడ
చూసినా
ఉన్నది
అదే.
కొంతమంది
ఏవో
పుస్తకాల్లో
చదివి
Transcendental
Truth
గురించి
చెబుతున్నారేగాని,
అదేమిటో
ఎవరికీ
అర్థం
కావడం
లేదు.
అదియే
దైవశక్తి.
అది
దేనికీ
లొంగదు.
ఎప్పటికీ
మార్పు
చెందదు.
అదియే
నిజమైన
ఆత్మతత్త్వము.
స్వామితత్త్వము
మున్ముందు
తెలుస్తుంది
ప్రేమస్వరూపులారా!
ఇట్టి
పవిత్రమైన
ప్రేమ
ఒక్క
దైవత్వమునుండియే
లభ్యమౌతుంది.
11
▾
Meaning
Keep
ఇంకా
మున్ముందు
చాలా
గొప్ప
విషయాలు
గోచరమౌతాయి.
స్వామితత్త్వము
మీకు
క్రమక్రమేణ
తెలుస్తుంది.
ప్రపంచమంతా
ఆకర్షింపబడుతుంది.
కనీసం
నిల్చుకోవడానికి
కూడా
ఎక్కడా
స్థలం
ఉండదు.
మీకే
తెలుసు
-
ఒక
నెలనుండి
ఇప్పటికి
ఎంత
మార్పు
కల్గుతున్నదో!
స్వామిప్రేమ
అందరినీ
ఆకర్షిస్తోంది.
వదలాలన్నా
వదలుటకు
వీలుకాదు.
చాలామంది
ఎంతో
కాలము
నుండి
స్వామివెంట
తిరుగుతున్నప్పటికీ
కించిత్తైనా
అర్థం
చేసుకోవడం
లేదు.
అర్థము
చేసుకోలేనివారు
ఎంతకాలం
ఉండినా
ఏమి
ప్రయోజనం?
మొట్టమొదట
అర్థం
చేసుకోవాలి.
ఇది
వెండి
ప్లేటు
అని
అర్థం
చేసుకున్నప్పుడే
దీనికి
విలువ
కట్టడానికి
వీలౌతుంది.
అయితే,
దివ్యత్వానికి
విలువ
కట్టేవారే
లేరు.
దివ్యమైన
భావాలవలన
దివ్యమైన
మార్పులు
కలుగుతుంటాయి.
ఇది
జబ్బు
కాదు,
రోగము
కాదు.
ఏవిధమైన
అశాంతికీ
మూలకారణం
కాదు.
ఇది
మందు,
మాకులతో
నివారణ
అయ్యేది
కాదు.
ప్రేమచేతనే
నివారణ
అవుతుంది.
ఆ
ప్రేమ
ఈ
నిత్యమైన
సత్యముతో
చేరాలి.
తప్పక
నివారణ
అవుతుంది.
నివారణ
అంటే
ఏమిటి?
అందరికీ
ఇది
ప్రాకిపోతుంది.
కాని,
కొందరు
‘ఈ
ప్రేమ
నాకక్కర్లేదు’,
అనుకుంటారు.
ఈ
ప్రేమ
నిమిత్తమే
మీరు
జన్మించారు.
కనుక,
ఇది
అక్కర్లేదనుకోవడం
పొరపాటు.
ప్రేమచేత
దైవత్వాన్ని
ప్రాప్తింపజేసుకోవాలి.
ఆ
ప్రాప్తికోసమే
మీరు
మానవత్వాన్ని
ధరించారు.
మిమ్మల్ని
ఎవరు
సృష్టించారు?
మీ
అంతట
మీరు
పుట్టారా?
లేదే!
ఇది
భగవత్సంకల్పమే.
భగవంతుడు
అందించిన
ఈ
దేహాన్ని
భగవదారాధనకే
అంకితం
చేయాలి.
జగత్తునకొక
ఆదర్శాన్ని
అందించాలి.
మంచి
మార్గాన్ని
చూపించాలి.
లోకమంతా
ఆనందమయం
కావడానికి
తగిన
కృషి
చేయాలి.
ఎవరికీ
ఎలాంటి
బాధలూ
లేకుండా
చూడాలి.
మీకెట్టి
బాధ
లేకుండా
ఉండాలని
మీరు
ఆశిస్తున్నారో
అట్టి
బాధ
ఇతరులకుకూడా
లేకుండా
ఉండాలని
కోరుకోవాలి.
మీరు
ఏ
సుఖాన్ని
అనుభవిస్తున్నారో
ఆ
సుఖాన్ని
పరులకు
కూడా
అందించాలి.
అందరూ
సుఖపడాలని
ఆశించాలి.
ప్రేమస్వరూపులారా!
కొన్ని
దినాలలోనే
మీరు
కనుక్కుంటారు...
దినదినానికీ
పెరిగిపోతుంది....
దినదినానికీ
ఆనందము
అధికమౌతుంది.
జగత్తులోని
అశాంతి
నిర్మూలమైపోతుంది.
ఈనాడు
పలుచోట్ల
అనేకవిధములైన
హింసాత్మక
చర్యలు
జరుగుతున్నాయి.
12
▾
Meaning
Keep
ఈ
జరిగే
చెడ్డ
అంతా
మంచికి
మూలకారణమౌతుంది.
అందరియందు
పవిత్రమైన
భావములే
వస్తాయి.
అందరూ
మధురమైన
ఆనందమును
అనుభవిస్తారు.
త్వరలోనే
దేశమంతా
పవిత్రంగా
రూపొందుతుంది.
ఏవిధమైన
కష్టములూ
లేవు.
ఏవిధమైన
దుఃఖమూ
రాదు.
అసలు
దుఃఖమనేదే
లేదు.
అలాంటిదింక
వచ్చేదెక్కడ?
అందరూ
దైవాన్ని
స్మరించండి,
దివ్యమైన
ఆనందాన్ని
అనుభవించండి.
ఇదే
నేను
ఆశించేది.
ప్రతి
వ్యక్తీ
ఆనందమును
అనుభవించాలి.
పుట్టిన
బిడ్డ
కూడా
ఆనందమును
అనుభవించాలి.
ఎవరికీ
దుఃఖము
రాకూడదు.
వస్తుందిగాని,
ఆ
దుఃఖముకూడా
ఆనందముగా
మారిపోతుంది.
అతిశీఘ్రకాలములోనే
ప్రపంచమంతా
ఆదర్శవంతమైన
జీవితాన్ని
అనుభవిస్తుంది.
ప్రేమ
అనేది
Force
వలన
ఏర్పడేది
కాదు.
అది
హృదయమనే
Source
నుండి
ఆవిర్భవిస్తుంది.
Force
చేయడం
వలన
భయం
ఏర్పడుతుంది,
ప్రేమ
నశిస్తుంది.
దివ్యమైన
భావాలు
మీలో
సహజంగా
ఉప్పొంగాలి.
ఆ
ఉప్పొంగిన
ఆనందమును
అందరికీ
పంచాలి.
అందరూ
కలసిమెలసి
ఉండాలి.
ఏదో
ఒక
చిన్న
టంబ్లరును
పట్టుకోవాలన్నా
చేతి
వ్రేళ్ళు
ఐదూ
కలసి
పని
చేయాలి
కదా!
ఐకమత్యము
లేక
ఏ
పనీ
చేయలేము.
అదేవిధంగా,
ఐకమత్యముద్వారానే
దివ్యత్వాన్ని
పొందవచ్చును.
వ్యష్టి
స్వరూపుడే
జీవుడు,
సమష్టిస్వరూపుడే
దేవుడు.
జీవుడు
జీవునిగానే
ఉంటే
ప్రయోజనం
లేదు.
జీవుడు
దేవుడుగా
మారాలి.
తాను
దేవుని
నుండియే
వచ్చాడు,
తిరిగి
దేవునిగానే
మారాలి.
అందుకనే,
‘ఈశ్వరస్సర్వ
భూతానాం’
అన్నారు.
ప్రతి
మానవుడు
దైవస్వరూపుడే.
ఈ
ప్రపంచంలో
ఎవ్వరూ
మంచివారు
లేరు,
ఎవ్వరూ
చెడ్డవారు
లేరు.
మంచిచెడ్డలు
మనుష్యులయొక్క
భావము
లోనే
ఉన్నాయి
తప్ప
బయట
లేవు.
దివ్యాత్మస్వరూపులారా!
ఈనాడు
తలవని
తలంపుగా
నేను
మీతో
మాట్లాడడం
జరిగింది.
అందరూ
ఆనందంగా
ఉంటుండండి.
అందరూ
దివ్యమైన
ప్రేమను
పొందండి.
మీలో
ఉన్న
దైవత్వాన్ని
ఆవిర్భవింపజేసుకోండి.
మీలో
ప్రేమను
పెంచుకుంటే
కంటికెదురుగా
మీరు
దైవత్వాన్ని
చూడగలరు.
‘సర్వతః
పాణిపాదం
తత్సర్వతోక్షి
శిరోముఖం...’
భగవంతుడు
ఎక్కడ
చూసినా
ఉన్నాడు.
అట్టి
సర్వవ్యాపకుడైన
దైవాన్ని
దర్శించి
ఆనందము
ననుభవించకుండా
మీరెందుకు
శ్రమలు
పడుతున్నారు?
13
▾
Meaning
Keep
అతిశీఘ్రకాలములోనే
మీరందరూ
సుఖశాంతులను
పొంది,
దేశసౌభాగ్యముకొరకు,
దేశముయొక్క
ఆనందముకొరకు
పాటుపడగలరని
నేను
ఆశిస్తున్నాను.
Previous
←
Take Īśvara's family as your ideal
Next
Leave the delusion of the body; think of God
→