Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2004 · The children alone are my property
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The children alone are my property
21 August 2004, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
ఎం.ఏ.లు
బి.ఏ.లు.
ఎం.బి.ఏ.లు
ఎం.ఎఫ్.ఎమ్లు
పాసైవచ్చియు
పేరు
గాంచిన
పెద్దవారలైన
సంపదలుండియు
సద్దానపరులై
పుడమి
కీర్తిని
గన్న
పుణ్యులైన
ఆయురారోగ్యంబు
లనవరతంబుండి
పరిపూర్ణ
బలులగువారలైన
ఎంత
చదువు
చదివి
ఏరీతినున్నను
మనిషియందు
మానవత్వము
లేనిచో
చదువులెన్ని
ఉన్న
ఫలము
సున్న
విద్యార్థులారా!
విద్యార్థినులారా!
విద్యాబోధకులారా!
విద్యాభిమానులారా!
లౌకికమైన
చదువులవల్ల
మానవుడు
ఉన్నత
స్థాయిని
పొందలేడు.
దైవానుగ్రహము
లేక
మానవ
ప్రయత్నములు
ఎన్ని
చేసినప్పటికీ
అవన్నియు
నిరర్థకమైపోతాయి.
ఈనాడు
చదువులు
చదివినవారు
ప్రపంచంలో
ఎందరో
ఉన్నారు.
కాని,
వారేమైనా
దేశానికి
ఉపయోగకరంగా
జీవిస్తున్నారా?
నిజానికి
చదువుకున్నవారికంటే
చదువు
లేనివారే
ఉత్తములుగా
కనిపిస్తున్నారు.
‘చదువులన్ని
చదివి
చాల
వివేకియై
మదిని
తన్నెఱుగడు
మందమతుడు’
ఎంత
తెలివితేటలు
ఉండినప్పటికీ,
ఎన్ని
డిగ్రీలు
పొందినప్పటికీ
మానవతా
విలువలే
లేకుండిన
అన్నీ
వ్యర్థమైపోతాయి.
అయితే
మన
పిల్లలు
చాలా
గుణవంతులు,
సచ్ఛీలసంపన్నులు.
తాము
చక్కగా
చదువుకోవటమేగాక
ఆ
చదువును
జగత్తుకొఱకు
ఉపయోగపెడుతున్నారు.
మా
కాలేజీకి
ఉత్తమమైన
అధ్యాపకులు
చిక్కడం
లేదే
అని
మేము
ఎన్నడూ
విచారించవలసిన
పని
లేదు.
మా
కాలేజీయందు
చదివిన
విద్యార్థులే
తమ
విద్యాభ్యాసం
పూర్తయిన
తరువాత
ఇక్కడ
అధ్యాపకులుగా
పని
చేస్తున్నారు.
సాధారణంగా
ఉన్నత
డిగ్రీలు
పొందిన
పిల్లలు
డబ్బుకోసం
అనేకరకములుగా
ప్రయత్నాలు
చేస్తుంటారు.
2
▾
Meaning
Keep
His poems 58
Also in his talks
(3)
2 June 2003
That is education which liberates
21 October 2004
Do Not Give Up the Remembrance of the Name!
6 May 2005
Only a son worthy of his mother's love can win God's grace
కాని
మా
పిల్లలు
మాత్రం
తాము
చదివిన
చదువును
అందరికీ
పంచుతూ
సద్వినియోగం
చేస్తున్నారు.
అటువంటి
శీలసంపత్తి
గ్రంథాలనుండి
లభించేది
కాదు.
ఈ
గుణములు
వారి
హృదయము
నుండి
ఉప్పొంగి
వస్తున్నవి.
శీలసంపత్తిని
పోషించుకోవటమే
అన్నింటికంటే
ఉత్తమమైన
చదువు.
అట్టి
చదువు
గలవాడు
జగత్తునే
ఏలగలడు.
అది
లేకుండా
ఎన్ని
చదువులు
చదివినా
ప్రయోజనం
లేదు.
బలవంతులు,
గుణవంతులు,
శక్తిమంతులు,
విద్యావంతులైన
ఈ
పిల్లలను
చూస్తుంటే
నాకు
ఎంతో
ఆనందం
కల్గుతుంది.
ఇంతేకాదు
మా
పిల్లలు
అనేక
ఇతర
భాషలను
కూడా
నేర్చుకోగల్గుతున్నారు.
ఇంతటి
ప్రతిభావంతులకు
ఆత్మభాష
ఏమంత
కష్టం
కాదు.
సంస్కృతము
నేర్చుకోవటంతోపాటు
మన
సంస్కృతిని
అనుసరిస్తున్నారు.
ఉత్తమ
సంస్కారాలను
అభివృద్ధిపరచుకొని
ఆదర్శప్రాయులుగా
నిలుస్తున్నారు.
ఈ
పుట్టపర్తిలో
చదివిన
పిల్లలు
అమెరికా,
జపాన్,
జర్మనీ,
ఇటలీ
మొదలైన
అనేక
దేశాలలో
స్వామి
సందేశాన్ని
ప్రచారం
చేస్తున్నారు.
మన
భారతీయసంస్కృతికి
మూలాధారమైన
వేదాలన్నీ
సంస్కృతంలోనే
ఉన్నవి.
ప్రతి
రోజూ
ఉదయం,
సాయంత్రం
మా
పిల్లలు
వేదపఠనం
గావిస్తున్నారు.
మా
కళాశాలలో
పిల్లలు
ఒక్క
కాసైనా
ఖర్చు
లేకుండా
విద్య
నేర్చుకుంటున్నారు.
మేమే
ఇంకా
ఖర్చు
పెట్టి
ఎంతమందినో
చదివిస్తున్నాము.
‘పిల్లలే
నా
ప్రోపర్టీ’.
స్వామిని
చూసుకోవటంగాని
విద్యాసంస్థలు
మరియు
ఇతర
సంస్థల
అభివృద్ధిగాని
అంతా
మా
పిల్లలే
చేస్తున్నారు.
ఇటువంటి
ఆదర్శప్రాయులైన
విద్యార్థులను
తయారు
చేయటానికి
స్వామి
ఎంతో
శ్రమపడుతున్నారని
మీరు
భావించవచ్చును.
కాని
నాకు
ఎట్టి
శ్రమకూడా
లేదు.
పిల్లలే
నాకు
ఎంతో
సహాయంగా
ఉంటున్నారు.
తమ
తల్లిదండ్రుల
సేవలో
కూడా
మొట్టమొదటి
వారుగా
ఉన్నారు.
వారిదగ్గర
డబ్బుగురించిన
ఆశ
ఎక్కడా
కనిపించదు.
స్వామి
ఆజ్ఞలు
శిరసావహించటమే
తమ
లక్ష్యంగా
తీసుకుంటున్నారు.
ఇటువంటి
పిల్లలవలన
ఇంకా
ఎన్నియో
విద్యాసంస్థలను
అభివృద్ధి
చేయవచ్చు.
అసలు
విద్యార్థులు
ఏవిధంగా
మసలుకోవాలి?
కొక్కొరొకోయని
కోడి
కూయగనే
చక్కగా
నిద్రమంచమునుండి
లెమ్ము
పల్దోముకొని
దేహబాధ
దీర్చుకొని
జలకమాడి
దుస్తులు
ధరించి
చల్ది
భుజించు
హితమైన
వస్తువు
ఎంతయు
నమిలి
మితముగ
భుజించిన
మేలగు
నీకు
బడికేగి
శ్రద్ధగా
పాఠముల్
నేర్చి
అణకువగల
బాలుడనిపించుకొనుము
తేమలో
నెప్పుడు
తిరుగంగబోకు
మురికిగుంటల
చెంత
పోబోకుమెపుడు
పరుగుడు
చెడుగుడు
బంతులాటయును
సరియైన
వేళల
సలుపుచునుండు
పైరీతుల
న్నీవు
పరిగణింతువేని
ఆరోగ్యభాగ్యంబు
లనుభవించెదవు
3
▾
Meaning
Keep
మా
పిల్లలు
నిద్ర
లేవటం
బయటి
పిల్లల
మాదిరి
తెల్లవారి
8
గంటలకు
కాదు.
కొక్కొరొకోయని
కోడికూయగనే
నిద్ర
లేస్తారు.
ఆహార
విహారములలో
హితమును,
మితమును
పాటిస్తారు.
పరుగు
పందెములు,
బ్యాడ్మింటన్,
టెన్నీస్,
‘వాలి’బాల్,
(సుగ్రీవబాల్!)
మొదలైన
ఆటలలో
ఉత్సాహంగా
పాల్గొంటూ,
వారి
ఆరోగ్యాన్ని
చక్కగా
చూసుకుంటారు.
ఏ
పిల్లవాడైనా
మంచిగా
దృఢంగా
ఉంటాడుగాని,
మెత్తగా
జబ్బు
చేసినవాని
మాదిరి
ఉండడు.
అటువంటి
పిల్లలు
తమను
తాము
పోషించుకోవటమేగాక
దేశాన్ని
కూడా
సంరక్షించగలరు.
పెద్దలను
చూచినప్పుడు
వినయము...
బంధువులను
చూస్తే
గౌరవ
మర్యాదలు...మృదు
మధురమైన
సంభాషణ...
సత్ప్రవర్తనలను
అలవర్చుకొని
ఆదర్శ
ప్రాయులుగా
నిలుస్తున్నారు.
మా
పిల్లలను
మేము
పొగడుకోవటం
గొప్పతనం
కాదు
కాని,
మా
కాలేజీకి
వచ్చిపోయే
విద్యావేత్తలు,
అధికారులు
మా
పిల్లలను
చూచి
గొప్పగా
వర్ణిస్తుంటే
నాకెంతో
ఆనందము
కల్గుతుంది.
ప్రెసిడెంటు,
ప్రైమ్
మినిష్టరు,
ఛీఫ్
మినిష్టర్లు
వచ్చినప్పుడు
మా
పిల్లలను
ఎంతో
గొప్పగా
వర్ణిస్తూ
ఉంటారు.
నాకు
ఏ
జబ్బూ
లేదు,
రోగము
ఏమాత్రము
లేదు.
క్రిందటి
సంవత్సరం
ఒక
పిల్లవాడు
ఒక
రోజున
వాకిలికి
తోరణం
కడుతున్నాడు.
4
▾
Meaning
Keep
నేను
లోపలినుండి
తలుపు
తెరచుకొని
బయటికి
వచ్చాను.
నన్ను
చూచేటప్పటికి
వానికేదో
భయమేర్పడింది.
వణుకుతూ
అక్కడినుండి
క్రింద
పడ్డాడు.
వాడు
పడేటప్పుడు
ఆ
ఇనుపకుర్చీ
నాపైన
పడింది.
అప్పుడే
ఈ
తుంటి
ఎముక
విరిగింది.
దీనికి
ఏదో
వేసి
సరిచేయాలని
డాక్టర్లు
అన్నివిధాలా
ప్రయత్నించారు.
ఈ
ఎముక
వంటి
ఎముక
ఇంకొకటి
ఎక్కడా
చిక్కదు.
స్వామికి
కాలు
కదపటం
కష్టమనుకొని
డాక్టర్లు
చాలా
బాధపడుతున్నారు.
నేను
చెప్పాను,
ఎవ్వరూ
నాకోసం
ఏవిధంగానూ
బాధపడనక్కర్లేదు.
పిల్లలే
నాకు
డాక్టర్లు,
కాంపౌండర్లు.
వాళ్లే
నాకు
తోడు
నీడగా
ఉండి
అన్నీ
చూసుకోగలరని
చెప్పాను.
పిల్లలవల్లనే
నేను
ఇంత
వరకు
తిరుగగల్గుతున్నాను.
“స్వామీ!
మీరుండగా
మాకేల
భయము?
స్వామి
సేవ
చేసుకుంటూ
ఇక్కడే
ఆనందంగా
ఉంటాము”
అని
చెప్పి
అనేకమంది
పిల్లలు
బయటి
ఉద్యోగాలకు
కూడా
పోకుండా
స్వామిదగ్గరే
ఉండి
అన్ని
పనులూ
చేసుకుంటున్నారు.
మా
పిల్లలు
చేస్తున్న
పనులను
చెబితే
మీకు
నమ్మశక్యం
కాదు.
వేలకొలది
డబ్బులు
వచ్చే
ఉద్యోగాలను
వదలిపెట్టి
ఇక్కడికి
వచ్చారు
కొందరు.
ఒక
పర్యాయం
ఎవరో
ఒకరు
వచ్చి
మా
పిల్లలిరువురిని
తీసుకువెళ్ళి
వాళ్ళ
కంపెనీలో
ఉద్యోగాలిచ్చారు.
నెలకు
యాభై,
అరవైవేల
రూపాయలిస్తూ
వచ్చారు.
ఆ
పిల్లలు
తాము
సంపాదించినది
అక్కడి
బీదపిల్లలకు
పంచారు.
స్వామికి
దూరంగా
ఉండటం
ఇష్టం
లేక
అక్కడ
రిజైన్
చేసి
తిరిగి
నాదగ్గరకే
వచ్చి
చేరిపోయారు.
మా
పిల్లలు
ప్రశాంతినిలయాన్ని
ఒక
పెద్ద
వర్క్షాపు
మాదిరి
చేస్తున్నారు.
(స్వామి
ఆదేశం
మేరకు
ఒక
పిల్లవాడు
లేచి
నిల్చున్నాడు)
ఈ
పిల్లవానిని
చూడండి.
ఇతను
మొట్టమొదట
ఇంజనీరింగ్
పాస్
చేశాడు.
తరువాత
ఎమ్.బి.ఎ.
పాస్
చేశాడు.
గొప్పగొప్పవాళ్ళంతా
వచ్చి
తమ
సంస్థలలో
చేరవలసిందని
వానిని
చేయిపట్టి
అడుక్కున్నారు.
కాని,
తాను
ఎక్కడికీ
వెళ్లలేదు.
ఇక్కడే
ఉండి
పుట్టపర్తిలో
జరిగే
ప్రతి
చిన్న
విషయాన్ని
‘రేడియో
సాయి’
ద్వారా
ప్రపంచానికంతా
వ్యాప్తిచేస్తున్నాడు.
వాని
తల్లిదండ్రులు
కూడా,
“స్వామీ!
వానిని
మాదగ్గరకు
పంపకండి.
మీ
దగ్గరే
పెట్టుకోండి”
అంటున్నారు.
అక్కడ
ఉండినప్పుడు
వాని
తల్లిదండ్రులు
ఎంత
ఒప్పించి
ఏమి
చేసి
పెట్టినప్పటికీ
బక్కపలుచగానే
ఉండేవాడు.
స్వామి
దగ్గరికి
వచ్చిన
తరువాత
వేళ
కాని
వేళలో
భోజనం
చేస్తూ
18
కిలోలు
పెరిగాడు.
5
▾
Meaning
Keep
ఎప్పుడూ
నా
వెంటనే
ఉండి
నా
పనులు
చేస్తుంటాడు.
అట్లని,
తన
పనిని
ఎంతమాత్రం
బాకీ
పెట్టుకోడు;
రాత్రిపూట
పోయి
చేస్తుంటాడు.
(స్వామి
ఆదేశం
మేరకు
మరొక
అబ్బాయి
లేచి
నిల్చున్నాడు)
ఈ
పిల్లవాడు
ఒరిస్సాలో
చాలా
వెనుకబడిన
ప్రాంతంలో
పుట్టాడు.
వీళ్ళ
నాన్నకు
ఇంకా
ముగ్గురు
కుమారులు.
ఇప్పుడు
వాళ్ళు
నలుగురూ
పుట్టపర్తిలోనే
ఉండి
పనిచేస్తున్నారు.
ఎమ్.ఎస్సి.
పాస్
చేశారు.
ఎమ్.బి.ఎ.
పాస్
చేశారు.
అయినా
ఉద్యోగాలకోసం
ఎక్కడికీ
పోవటం
లేదు.
స్వామిసేవ
చేసుకుంటూ
ఉంటామని
అందరూ
ఇక్కడే
ఉంటున్నారు.
వాళ్ళకి
డబ్బుపై
ఆశ
లేదు.
వచ్చే
జీతంతో
తృప్తిపడుతున్నారు.
ఇట్లనే,
ఇక్కడున్న
పిల్లలందరూ
గొప్ప
గుణవంతులై,
త్యాగశీలురై
జీవితాన్ని
గడుపుతున్నారు.
గత
కొద్ది
నెలలుగా
నా
విషయాన్ని
పిల్లలే
చూసుకుంటున్నారు.
నాకు
నొప్పిఏమీ
లేదు.
ఏమాత్రం
వైద్యము
నాకు
అక్కర్లేదు.
ఏ
చిన్నదానికీ
నేను
యోచించనక్కరలేదు.
ప్రతి
ఒక్కటీ
స్వామిని
అడిగి
ఆ
తరువాతనే
ముందు
చేయవలసిన
పనులకు
పునాదులు
వేస్తారు.
ఇలాంటి
పిల్లలు
ప్రశాంతినిలయంలో
నాచుట్టూ
200
మంది
ఉన్నారు.
ఆ
రెండువందలమంది
సోంబేరుల
మాదిరి
కూర్చోవటం
లేదు.
వాళ్ళు
ఎంత
పని
చేస్తున్నారంటే
వర్ణించటానికి
వీలుకాదు.
ఇలాంటి
పిల్లలవలన
దేశము
ఎంతైనా
బాగుపడుతుంది.
ఇవన్నీ
ఈనాడు
ఎందుకు
చెబుతున్నానంటే...మా
పిల్లలు
అంత
విద్యావంతులు,
గుణవంతులు.
అంతేకాదు,
ధనవంతులు
కూడా.
వారికి
వారే
సంపాదించుకుంటున్నారుగాని,
తమ
తల్లిదండ్రులనుండి
నయాపైసా
ముట్టటం
లేదు.
తల్లిదండ్రులు
వచ్చి
‘నాయనా!
నీకేమైనా
కావాలా?’
అని
అడిగితే
‘ఏమీ
అక్కర్లేదు.
అన్నీ
మాకు
స్వామియే
చూసుకుంటున్నారు’
అని
వారికి
చెబుతుంటారు.
మున్ముందు
ఎన్నియో
జరుగబోతున్నాయి.
భారతదేశమునకు
ఎట్టి
భయమూ
లేదు.
భారతదేశము
సౌభాగ్యవంతమైన
దేశముగా
తయారవుతుంది.
మా
పిల్లలవలన
ఈ
దేశము
ఎంతైనా
అభివృద్ధికి
వస్తుంది.
వీరే
దీనికి
నాయకులుగా
నిల్చడానికి
తగిన
అవకాశం
ఏర్పడుతుంది.
Previous
←
If you call ‘Sai!’ with Prema, I answer ‘Here I am!’
Next
Do nāmasmaraṇa for peace of mind!
→