Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2004 · If you call ‘Sai!’ with Prema, I answer ‘Here I am!’
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
If you call ‘Sai!’ with Prema, I answer ‘Here I am!’
2 July 2004, Guru Pūrṇimā, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His poems 374
Also in his talks
(26)
21 May 1973
The Opening Message
10 October 1986
A people that has morality is the true people
21 November 1986
We must regard service to man as service to Mādhava
2 January 1987
Sanātana Dharma is the essence of all the wisdom of the Vedas
2 June 1990
Ascent Of Man
23 November 1990
Restore the glory of Bharat
2 June 1991
Vijnana and Dharma
18 August 1996
Man Must Learn to Live as Man
19 October 1996
When the Home Is Set Right, the World Is Set Right
19 October 1998
Dīpāvali: Its Inner Meaning
22 November 1998
The Education of Bhārata Is What Develops the Divine Human Principle
10 September 2000
God is within you
22 November 2001
True education brings the wealth of character
19 January 2002
Hospitals must not become business centres
19 November 2002
Setting the Home in Order: The Housewife's First Duty
14 April 2003
Remember the Name with Prema
20 October 2003
Restore the ancient culture!
23 October 2004
Foster the Spirit of Sacrifice
8 March 2005
Man is a child of immortality
6 May 2006
If you love your parents, the whole world will love you
14 August 2006
Follow the Ātma within you
21 January 2007
All parties must become one for the good of the country
15 August 2007
Win the svātantrya of the heart!
15 January 2008
Revere your mother as God, your father as God
6 August 2008
‘Education’ finds its fulfilment only when it is joined with ‘Educare’
23 November 2008
Foster the feeling of the one Ātma, and unity!
పరమ
పావనమైన
భారతావనియందు
సహనమన్నదె
మనకు
చక్కదనము
వ్రతములన్నింటను
వన్నెగాంచినయట్టి
ఘనసత్యశీలమే
కఠిన
తపము
మధుర
భావంబేది
మన
దేశమందన్న
మాతృభావము
కంటె
మాన్యమెద్ది
ప్రాణంబు
కంటెను
మానంబె
ఘనమను
మన
దేశ
నీతిని
మంటగలిపి
నేటికిచ్చిరి
పరదేశ
నీతులరసి
వెస
విచిత్ర
స్వేచ్ఛయను
విచ్చుకత్తి
ఔర!
ఏమందు
భరత
పాలనంబు
ఏనుగెట్టుల
తన
బలమెరుగలేదొ
అట్టులైనారు
భారతీయులు
నేడు.
ప్రేమస్వరూపులారా!
ఈనాటి
మానవునకు
సహనమంటే
ఏమిటో
తెలియక
పోవుచున్నది
‘పరమ
పావనమైన
భారతావనియందు
సహనమన్నదె
మనకు
చక్కదనము.’
ఈ
సత్యాన్ని
మానవుడు
గుర్తించుకోలేకపోతున్నాడు.
దీనులు,
వికలాంగులపట్ల
తాను
సహన
సానుభూతులను
చూపించవలసిందిపోయి
వారిని
అసహ్యించుకుంటున్నాడు.
సహనము
లేని
మానవుడు
మానవుడే
కాదు.
నిజముగా
మన
భారతీయులకు
సహనమనేది
గొప్ప
విలువైన
మంత్రము.
2
▾
Meaning
Keep
ఇటువంటి
పవిత్రమైన
మంత్రమును
వదిలి,
యంత్రతంత్రములను
విశ్వసించి
మానవుడు
అమాయకత్వంలో,
అజ్ఞానంలో
మునిగిపోతున్నాడు.
భక్తి,
భక్తి,
భక్తి..
ఏమిటి
దీని
అర్థము?
ఏవో
పూజలు
చేయటము,
వ్రతములు
ఆచరించటం
ఇత్యాది
సత్కర్మలను
భక్తికి
చిహ్నములుగా
భావిస్తున్నారు.
భక్తులకు
ముఖ్యంగా
కావలసినది
సహనమే!
సహనమును
ఆచరణలో
పెట్టటమే
భారతీయులయొక్క
ప్రధాన
కర్తవ్యము.
సహనము
చాలా
ఉత్తేజకరమైనది.
ఉల్లాసకరమైనది;
మనం
ఆచరించి
ఇతరులకు
బోధించవలసినది.
“వ్రతములన్నిటి
యందు
వన్నెగాంచినయట్టి
ఘన
సత్యశీలమే
కఠినతపము”
సత్యశీలమే
నిజమైన
తపస్సని
ఈనాటి
మానవుడు
మరచిపోయాడు.
“మధురభావంబేది
మనదేశమందన్న
మాతృభావముకంటె
మాన్యమెద్ది?”
ఈనాడు
మాతృభావమును
మరచిపోతున్నారు.
మాతృభావము
కంటే
మధురమైనది
ఈ
జగత్తులో
ఎక్కడనూ
కానరాదు.
మధురమైన
మాతృప్రేమను
సంపాదించుకున్నవాడు
మహా
అదృష్టవంతుడు.
ఈ
మధురభావము
ఎక్కడో
వెతికితే
మనకు
లభించేది
కాదు;
డబ్బుతో
కొనేది
కాదు
బాడుగకు
తీసుకునేది
కాదు.
మధురభావము
మధురప్రేమనుంచే
వస్తుంది.
ప్రేమగల
మానవునికి
ఎట్టి
లోటూ
కలుగదు
ప్రేమస్వరూపులారా!
ప్రేమకు
మించిన
పవిత్రమైన
గుణము
ఈ
జగత్తులో
ఎందు
వెతికినా
కానరాదు.
లౌకికమైన,
భౌతికమైన
ప్రేమ
ఈనాడు
ఎక్కడైనా
చిక్కుతుందిగాని,
ఆత్మానందముతో
కూడిన
ప్రేమ
మనకు
లభించటము
చాలా
కష్టము.
ప్రేమ
అంటే
ఒకరి
నొకరు
ప్రేమించుకోవటం
కాదు.
హృదయాన్ని
ఇచ్చి
హృదయాన్ని
పుచ్చుకునేది
ప్రేమ.
కాని,
అలాంటి
పవిత్రమైన
భావమును
ఈనాడు
భారతీయులు
మరచిపోతున్నారు.
అనాదికాలమునుండి
పవిత్రమైన
మన
భారతదేశమునందు
మనలను
కంటికిరెప్పవలె
అన్నివిధాలుగా
కాపాడుతూ
వచ్చింది
దైవప్రేమ.
అట్టి
దైవప్రేమను
ఈనాడు
మనం
ఎక్కడ
పెట్టేమో
ఏమో
గ్రహించుకోలేకపోతున్నాము.
ఇందు
కలదని,
అందు
లేదని
చెప్పటానికి
వీలుకాదు.
ఎందు
చూసిన
అందే
కనిపించుచున్నది.
ఈ
జగత్తులో
దైవప్రేమ
తప్ప
ఏ
ప్రేమకూడా
సత్యము
కాదు.
ఈ
కనిపించే
ప్రేమలన్నీ
బూటకములు.
నిజమైన
ప్రేమ
మన
నాభినుండి
ఆవిర్భవిస్తుంది.
అదియే
నాకు
చాలా
ఇష్టము.
లౌకికమైన,
భౌతికమైన
ప్రేమలు
కావలసినన్ని
లభిస్తాయి
మనకు.
వీటన్నింటినీ
ప్రేమ
అని
పిల్చుటకు
అర్హత
లేదు.
3
▾
Meaning
Keep
Also in his talks
(6)
15 September 1986
The inner meaning and greatness of the festival of Onam
27 February 1995
Every atom is the form of God
26 June 1996
Forbearance Is a Safe Armour for Man
25 August 1998
The Whole World Is Filled with Viṣṇu
14 January 2000
Bhakti and Śaraṇāgati
30 March 2006
See only good, do only good, be good
ప్రేమ
హృదయమునుండి
రావాలి.
అట్టి
ప్రేమను
మీరు
బలపరచుకోండి.
ప్రేమగల
మానవునకు
ఎట్టి
లోటూ
కలుగదు.
ఇట్టి
ప్రేమను
మీరు
సంపాదించుకున్నప్పుడే
ప్రేమస్వరూపులనే
బిరుదు
మీకు
సార్థకమవుతుంది.
నీలోనే
ఉన్న
దైవాన్ని
నీవు
మరచిపోవద్దు
దైవము
సర్వత్రా
ఉన్నాడు.
దైవము
ఎవరు?
నీవే
దైవము.
ఇట్టి
అనుభూతిని
మనం
పొందాలి.
దైవము
ఎందు
చూచిన
అందే
ఉన్నాడు.
నీలోనే
ఉన్న
దైవాన్ని
నీవు
మరచిపోవద్దు.
దైవము
ప్రత్యేకించి
ఉన్నాడని
భావిస్తుంటారు
చాలామంది.
“ఇందు
గలడందు
లేడని
సందేహము
వలదు
చక్రి
సర్వోపగతుం
డెందెందు
వెదకి
చూసిన
అందందే
గలడు...”
అని
చెప్పాడు
ప్రహ్లాదుడు.
భారతీయసంస్కృతి
బోధిస్తున్నది
ఇదియే!
“దైవం,
దైవం,
దైవం...”
అంటున్నావు.
అసలు
నీవే
దైవం.
నీవు
వేరు,
దైవము
వేరు
కాదు.
తనయందున్న
దైవాన్ని
విస్మరిస్తున్నాడు
మానవుడు.
ప్రేమస్వరూపులారా!
మీరు
దేనిని
ఆశించినా,
ఆశించకపోయినా
ప్రేమను
మాత్రం
మీరు
వదలకూడదు.
ప్రేమకు
మించిన
ధనము
మరొకటి
లేదు.
ప్రేమయే
గొప్ప
పెన్నిధి.
ప్రేమను
మరచినవాడు
మానవుడే
కాదు.
తల్లిని,
తండ్రిని
సోదరీ
సోదరులను
ప్రేమిస్తున్నాము.
కాని,
ఇవి
భౌతికమైన
నాటకానికి
సంబంధించిన
ప్రేమలు.
నిజమైన
ప్రేమను
మనం
గుర్తించటానికి
ప్రయత్నించాలి.
దానిని
మనం
వెతుకనక్కర్లేదు.
అది
ఎప్పుడూ
మన
ఇంటనే,
వెంటనే,
జంటనే
కనిపిస్తున్నది.
(ఒక
పుష్పమును
చూపిస్తూ)
ఇది
ఏమిటి?
ఇదొక
పుష్పము.
ఈ
పుష్పము
సామాన్యమైనది
కాదు.
ఇది
భగవంతుని
హృదయంతో
కూడినటువంటిది.
దీనికి
ఎన్నియో
రేకలుంటున్నాయి.
ఈ
రేకలే
భగవంతునియొక్క
లేఖలు.
అన్నింటికీ
ఆధారము
ఒక్కటే.
అదియే
మూలాధారమైన
ఆత్మ.
ఆత్మనే
ప్రేమ
అని
పిలుస్తూ
వచ్చారు.
దానిని
మరొకరీతిగా
పిల్చుటకు
వీలుకాదు.
ఈ
ఆత్మకే
అనేకరకములైన
ప్రేమలు
చేర్చుతున్నారు.
తల్లి,
తండ్రి,
సోదరి,
సోదరుడు...అందరూ
పుష్పముయొక్క
రేకలే!
అందరూ
చేరినదే
కుటుంబము.
4
▾
Meaning
Keep
అయితే,
నీవు
ఒక్క
కుటుంబములో
ప్రేమగా
ఉంటున్నంత
మాత్రమున
చాలదు.
విశ్వకుటుంబీకుడుగా
కావాలి
నీవు.
ఎవరిని
చూసినా
నమస్కారము
చేయాలి.
ఈ
జగత్తులో
కనిపించేవన్నీ
దైవ
స్వరూపములే!
ఈ
కనిపించేవన్నీ
వస్తువులుగా
నీవు
భావిస్తున్నావు.
ఇవన్నీ
దైవస్వరూపములే
అని
గుర్తించు.
ఈ
ప్రపంచములో
దైవత్వము
లేనిది
ఒక్కటీ
మనకు
కానరాదు.
కాని,
మనం
పిచ్చివారమైపోయి
దైవము
ఎక్కడ,
ఎక్కడ
అని
వెతుకుతున్నాము.
ఎక్కడ
చూసినా
కనిపించునది
దైవమే!
సర్వము
దైవస్వరూపమని
భావించటము
గొప్పతనము.
కనిపించేవన్నీ
దైవస్వరూపములే.
సర్వజీవులనూ,
సర్వవస్తువులనూ
దైవస్వరూపాలుగా
మనం
భావించాలి.
వస్తుస్వరూపాన్ని
విస్మరించి
శక్తి
స్వరూపాన్ని
హృదయంలో
పెట్టుకోవాలి.
దైవము
కానటువంటిది
ఏదీ
మనం
అనుభవించటం
లేదు.
ఉదాహరణకు
మనము
నీరు
త్రాగాము.
నీరు
త్రాగటం
వలన
ఏమి
జరిగింది?
దాహం
తీరింది.
కాబట్టి,
నీరు
కూడ
దైవమే
!
పంచ
భూతములు,
పంచేంద్రియాలు,
పంచకోశములూ,పంచప్రాణములూ
అన్నీ
దైవస్వరూపములే!
ఈనాటి
మానవుడు
తన
ఇంద్రియాలను
దుర్వినియోగం
చేసుకుంటున్నాడు.
ఇదే
మానవుడు
చేస్తున్న
పాపము.
మానవతావిలువలంటే
మీరు
ఏమనుకున్నారు?
మానవతావిలువలే
దైవగుణములు.
దైవమునకు
వేరే
గుణములు
లేవు.
దైవమనే
పదమే
పెద్ద
గుణము.
అటువంటి
గుణాతీతుడైన
భగవంతుణ్ణి
గుణములతో
చూచుకొని
మనం
భ్రమిస్తున్నాము.
ప్రేమయే
భగవంతునియొక్క
స్వరూపము
ప్రేమస్వరూపులారా!
నా
నోటితో
ఏమి
పలికినా
ప్రేమయే,
ప్రేమయే!
నాకు
మరొక
పదము
తెలియదు.
ప్రేమకు
మించినది
ఎక్కడా
మనకు
కానరాదు.
అట్టి
ప్రేమను
మనం
ప్రేమించుకుంటూ
పోవాలి.
అటువంటి
ప్రేమకు
మించిన
భగవంతుడు
మరొకడు
లేదు.
“నిర్గుణం
నిరంజనం
సనాతనం
నికేతనం
నిత్య
శుద్ధ
బుద్ధ
ముక్త
నిర్మల
స్వరూపిణం..”
ఈ
పదములన్నీ
మన
తృప్తినిమిత్తమై
పలుకుతున్నామేగాని,
ఇవి
భగవంతునికి
వర్ణనలు
కావు.
భగవంతునికి
ఒక్కటే
గొప్ప
వర్ణన...
అదే
ప్రేమ.
ప్రేమకు
వర్ణనే
లేదు.
కోపమునందుగాని,
తాపమునందుగాని,
కష్టమునందుగాని,
దుఃఖమునందుగాని
ఏ
పరిస్థితియందైనా
ప్రేమ
ప్రేమయే!
మీరందరూ
ప్రేమస్వరూపులే!
ఈ
ప్రేమయే
భగవంతునియొక్క
ఆకారము.
అట్టి
ప్రేమను
మనచెంత
పెట్టుకొని
లౌకికమైనవాటిగురించి
చింతిస్తున్నాము
మనము.
5
▾
Meaning
Keep
His poems 169
Also in his talks
(8)
25 December 1992
The divinity all religions teach is one!
19 August 1996
The Mind Itself Is the Root Cause of Bondage and Mokṣa
28 August 1996
That Which Gives Jñāna Alone Is Vidyā
3 September 1996
The Whole World, the Moving and the Unmoving, Is the Very Form of Brahman
1 January 1998
Happiness and sorrow cannot be parted
14 April 1998
God pervades all
12 January 2004
Honour your mother and father; take their command upon your head
14 August 2006
Follow the Ātma within you
అంగహీనులైన
పిల్లలను
ఆ
ట్రైసికిళ్ళపైన
పెట్టి
తీసుకువెళుతుంటే
నాకెంతో
విచారమైంది.
వారు
దైవస్వరూపులు.
అలాంటి
దైవస్వరూపులను
హీనులుగా
భావించి
వారిని
చులకనగా
చూస్తున్నారు.
అసలు
హీనులైనవారు
లోకములో
ఎక్కడా
కానరారు.
ఆ
హీనమైన
గుణము
మనయందే
ఉన్నది.
భగవంతుడు
గుణాతీతుడు.
అతని
గుణము
ఒక్కటే
ఒక్కటి.
ప్రేమయే
అతని
గుణము.
ప్రేమయే
అతని
స్వరూపము.
ఎవరైనా
ప్రేమతో
సంభాషిస్తే
నాకు
ఎంత
ఆనందమో
చెప్పలేను.
ఆ
ప్రేమ
లేకుండా
నన్ను
వర్ణించటం
నాకు
నచ్చదు.
కనుక
నన్ను
ప్రేమతో
పలుకరించండి.
ప్రేమతో
పలికిన
పలుకులకు
అన్నింటికీ
నేను
తక్షణమే
జవాబిస్తాను.
ప్రేమతో
‘సాయీ’
అని
పిలువు;
‘ఓయీ’
అని
పలుకుతాను.
ప్రేమ
లేనటువంటి
పిలుపు
నన్ను
ఏమాత్రము
కదిలించలేదు.
ప్రేమతో
నన్ను
పలుకరిస్తే
నేను
ఎప్పుడైనా
పలుకుతాను.
ప్రేమకు
మించిన
ప్రాణం
మరొకటి
లేదు.
కనుక
భగవంతుని
మనం
చూడాలనుకున్నా,
అనుభవించాలనుకున్నా
ప్రేమచేతనే
సాధ్యమౌతుంది.
ప్రేమచేతనే
చూడండి.
ప్రేమచేతనే
పలుకరించండి.
ఎంత
ధనమున్నా,
ఎంత
గుణమున్నా
అవి
ప్రేమకు
సాటిరావు.
‘ప్రేమ’
అనే
రెండక్షరాలలో
ఉన్న
మాధుర్యము
ఇంకెక్కడా
కానరాదు.
కాబట్టి,
మీరు
ప్రేమను
ప్రధానంగా
పెట్టుకోండి.
ఎక్కడికి
వెళ్ళినా
ప్రేమయే
మిమ్మల్ని
కాపాడుతుంది.
అడవిలోననున్న
ఆకసముననున్న
పట్టణముననున్న
పల్లెనున్న
గుట్టమీదనున్న
నట్టేటనున్నను
ప్రేమించువానికి
ప్రేమయే
దిక్కు
ఇట్టి
ప్రేమను
మీరు
సంపాదించుకోండి.
ఈ
ప్రేమ
మనస్సు
ఇస్తే
లభిస్తుందిగాని,
ధనము
ఇస్తే
లభించేది
కాదు.
ప్రేమయే
నిజమైన
భక్తి.
ప్రేమ
లేని
‘డివోషన్’
అది
అసలు
‘డివోషన్’
కాదు.
అది
‘డీప్
ఓషన్.’
ఆ
ఓషన్’
ఎలాంటిది?
ఉప్పునీరుతోకూడినది.
కాని
‘డివోషన్’
అనేది
‘స్వీట్
వాటర్’తో
కూడినది.
అనగా
అమృతమయమైనది
ఈ
ప్రేమ.
ఆనందమయమైనది
ఈ
ప్రేమ.
ఇట్టి
పవిత్రమైన
ప్రేమను
వదలి
లౌకికమైన
ప్రేమలను
ఆశించడం
వెఱ్ఱితనం!
6
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులారా!
భక్తి,
భక్తి
అని
ప్రాకులాడే
బదులు
మీ
ప్రేమను
పవిత్రంగా
పెట్టుకోండి.
ప్రేమకు
మించిన
శక్తి
మరొకటి
లేదు.
దానికి
మించిన
ముక్తి
మరొకటిలేదు.
శక్తి,
భక్తి,
ముక్తి,
రక్తి,
అనురక్తి
అన్నీ
ఒక్క
ప్రేమయందే
ఇమిడిఉన్నాయి.
ఈ
గురుపౌర్ణమినాడు
నేను
మీకందించే
అమూల్యమైన
బహుమానము
ఒక్క
ప్రేమ
మాత్రమే!
మీలో
ఈ
ప్రేమయే
లేకుండిన
నేను
ఏది
ఇచ్చినా
దానికి
ఫలితముండదు.
నా
ప్రేమ
పవిత్రమైనది.
ఇట్టి
ప్రేమను
మీరు
అభివృద్ధి
పరచుకోండి.
Previous
←
Satisfying his mother is a son's first duty
Next
The children alone are my property
→