Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2004 · Do Not Give Up the Remembrance of the Name!
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Do Not Give Up the Remembrance of the Name!
21 October 2004, Durgāṣṭamī
1
▾
Meaning
Keep
పేకాటలాడుచు
ప్రీతితో
నా
రాత్రి
గడిపినంతనె
అది
జాగరణ
యగునా!
చెరువులో
జాలర్లు
చేపలకొరకునై
పొంచిచూచెడి
దృష్టి
ధ్యానమగునా!
భార్యపై
అలిగి
భర్త
తా
పస్తుండిన
అదియె
గొప్ప
ఉపవాసమగునా!
ప్రేమస్వరూపులారా!
శివరాత్రి
పర్వదినాన
అనేకమంది
కాలమును
సద్వినియోగపరచాలని
రాత్రంతా
పేకాట
ఆడుతుంటారు.
ఒకసారి
ఒక
ఆఫీసరు
నావద్దకు
వచ్చాడు.
నేనతనిని
పలకరించి,
‘రాత్రి
మీరు
కాలమును
ఏవిధంగా
గడిపారు?’
అని
ప్రశ్నించాను.
‘స్వామీ!
నేను
చాలా
ఆనందంగా
కాలం
గడిపాను’,
అని
సమాధానం
చెప్పాడు.
‘ఏమిటి
ఆ
ఆనందము?’
అని
నేనడిగేటప్పటికి,
‘పేకాట
ఆడాను
రాత్రంతా.
నిద్రే
రాలేదు.
హాయిగా
పేకాట
ఆడుతూ
వచ్చాను’,
అని
బదులు
చెప్పాడు.
నేను
మళ్ళీ,
‘నిన్నటి
దినము
శివరాత్రి
కదా!
ఈరీతిగా
కాలము
గడిపితే
శివరాత్రి
ఫలము
ఏవిధంగా
లభించింది?’
అన్నాను.
‘నాకు
ఎట్టి
చింతలూ
రాకపోవడంచేత
నేను
ఆనందమును
అనుభవిస్తున్నట్లు
భావించాను.
ఇదే
నేను
చేసిన
జాగరణ’,
అన్నాడు.
ఉదాహరణకు,
ఒక
జాలరి
చేపల
నిమిత్తమై
చెఱువులో
గాలము
వేసి
అది
ఎప్పుడు
పడుతుందా
అని
చూచే
తత్త్వమును
ఏకాగ్రతగా
భావించాడు.
ఈనాడు
మానవుడు
చేసే
ఏకాగ్రత
సాధనలు,
ధ్యానములు
ఈవిధంగా
ఉన్నాయి.
మరొకడు
సారాయి
త్రాగి,
మేను
మరచి,
తాను
‘తన్మయత్వము
పొందినాను’,
అని
చెప్పాడు.
వేరొకడు
భార్యపై
అలిగి
పస్తుపరుండిన
అది
గొప్ప
ఉపవాసమవుతుందా?
ఇటువంటి
తన్మయత్వములు,
ఏకాగ్రతలు
పొంది
ఆనందిస్తుంటారు
కొంతమంది
వెఱ్ఱివాళ్ళు.
2
▾
Meaning
Keep
దైవచింతనతో
హృదయమును
పరిశుద్ధము
చేయాలి
ఈనాడు
మానవత్వము
ఎంత
పెడమార్గం
పట్టిపోయిందో
ఈ
ఉదాహరణలవలన
మనకు
తెలుస్తుంది.
నిజం
చెప్పాలంటే,
భగవంతుడు
మనకు
దేహమునిచ్చినది
దీని
నిమిత్తం
కాదు.
ఈ
దేహము
మానవత్వము
దివ్యత్వాన్ని
పొందే
నిమిత్తమై
అనుగ్రహింప
బడినదేగాని
పెడమార్గములలో
ప్రవేశపెట్టి
దుర్వినియోగము
చేయుటకు
కాదు.
కావున,
ఈ
దేహమును
ఎంత
పవిత్రముగా
వినియోగించుకోవాలో
మీరే
యోచించుకోండి.
తెల్లవారి
లేచినది
మొదలుకొని
రాత్రి
పరుండునంత
వరకు
మనము
లౌకిక
ప్రవర్తనలో
కాలమును
గడుపుకుంటూ
కట్ట
కడపటికి
నిద్రించే
సమయములోనైనా
దైవాన్ని
స్మరించడానికి
వీలు
లేకుండా
చేసుకుంటున్నాము.
దుర్గంధ
భూయిష్ఠమైన
ఈ
దేహమును
పరిశుభ్రపరచడానికి
భగవచ్చింతన
అనే
సుగంధమును
పూయాలి.
దినమునకు
ఒకటి
రెండు
పర్యాయములైనా
దైవచింతనతో
హృదయాన్ని
పరిశుద్ధపరచుకోవాలి.
ఎన్ని
విధాలుగా
ఈ
దేహమును
లౌకిక
వ్యవహారములలో
ప్రవేశపెట్టినప్పటికీ
దీనికి
ఆనందమనేది
శూన్యమే.
ఆనందమును
పొందాలనుకుంటే
ఏమి
చేయాలి
మనము?
ఈ
దేహమునందున్న
ఇంద్రియములను
పవిత్రమైన
పరమాత్మచింతనలో
ఉంచాలి.
నేత్రములు
పవిత్రమైన
దృశ్యములను
చూడాలి.
కన్నులకు
పవిత్రమైన
కారుణ్యదృష్టిని
చేర్చుకోవాలి.
నాలుకతో
పవిత్రమైన
నామమును
స్మరిస్తూ,
కాలమును
సద్వినియోగపరచాలి.
నా
కాలమును
అన్ని
విధాలుగా
పవిత్రము
చేసుకుంటాను
విద్యార్థులారా!
నా
విషయం
నేను
చెప్పకూడదుగాని,
మీకు
మార్గ
దర్శకంగా
ఉంటుందని
నిత్యమూ
జరిగేది
ఈనాడు
మీకు
చెబుతున్నాను.
రాత్రివేళలందు
నేను
నాలుగు
పర్యాయములు
లేస్తాను.
పన్నెండు
గంటలకు
లేచి,
చక్కగా
బ్రష్
చేసికొని
టంగ్
క్లీనర్‌తో
నాల్గు
వైపులా
క్లీన్
చేస్తాను.
తరువాత
ఒకటిన్నర
గంటలకు
లేస్తాను.
తిరిగి
బ్రష్
చేస్తాను.
తరువాత
మూడు
గంటలకు
ఒకతూరి
మళ్ళీ
లేస్తాను.
అప్పుడు
కూడా
ఈ
బ్రష్
చేసుకొని
నోరు
క్లీన్
చేస్తాను.
ఈవిధంగా,
రాత్రి
నేను
తరచు
లేవడంవలన
నా
రూములో
పండుకొనే
పిల్లలకు
చాలా
కష్టం
వేస్తుంది.
3
▾
Meaning
Keep
కాని,
వారు
దీనిని
కష్టముగా
భావించరు.
పైగా
నాకు
సేవచేయడం
తమ
భాగ్యమని
ఆనందిస్తూ
ఉంటారు.
ఆ
తరువాత
నాల్గున్నర
గంటలకు
నేను
మళ్ళీ
లేస్తాను.
అప్పుడు
తిరిగి
బ్రష్
తీసుకొని
పళ్ళు
చక్కగా
తోముకొని,
టంగ్
క్లీనర్
తీసికొని
నాలుకపైన,
క్రింద,
ఇరుప్రక్కల
క్లీన్
చేస్తాను.
ఈవిధంగా,
నాలుక
క్లీన్‌గా
ఉండినప్పుడే
నాకు
ఆనందము.
పరిశుద్ధమైన
నాలుకతో
పవిత్రతను
అనుభవిస్తుంటాను.
ఎవరైనా
సరే,
నాలుక
క్లీన్‌గా
ఉంచుకున్నవారితో
నేను
పది
నిమిషములకు
బదులు
ఇరవై
నిమిషములు
మాట్లాడుతాను.
అట్లుగాక,
నోరు
సరిగా
కడుక్కోకుండా
దుర్గంధము
వచ్చే
మనిషితో
రెండు
నిమిషాలు
కూడా
నేను
మాట్లాడను.
మనము
నిద్రించే
సమయములో
నాలుకపైన,
క్రింద,
ఇరుప్రక్కల
బ్యాక్టీరియా
చేరతాయి.
అవన్నీ
తీసివేయాలి.
అప్పుడే
మనకు
ఆరోగ్యము
చక్కగా
ఉంటుంది.
మన
ఆరోగ్యమే
కాక
ఇతరులకు
కూడా
ఆరోగ్యమును
అందిస్తుంది.
నాలుకచేత
పవిత్రమైన
మాటలు
మాట్లాడాలి.
ఈవిధమైన
కార్యకర్మలచేత
నేను
కాలమును
సద్వినియోగము
చేస్తున్నాను.
ఈవిధంగా,
నాలుక,
నేత్రములు
పరిశుద్ధము
చేసుకున్న
తరువాత
నేను
బయటకు
పోయేటప్పటికి
నాకు
వంట
చేసే
పిల్లవాడు
రాగిగంజి
తీసికొని
వస్తాడు.
ఆ
రాగిగంజి
నేను
చక్కగా
త్రాగి
ఆనందిస్తాను.
తెల్లవారి
లేస్తూనే
నేను
ఏమీ
పుచ్చుకోను.
రాగిగంజి
తప్ప
టిఫిన్
అని
ఇంకొకటి
ఏదీ
నేను
ముట్టను.
ఆ
గంజి
త్రాగి
తిరిగి
ఆరు
గంటలకు
బాత్రూమ్కు
వెళతాను.
‘గంజి
త్రాగాను
కదా’,
అని
టంగ్
క్లీనర్‌తో
నాలుకను
క్లీన్
చేసుకుంటాను.
తరువాత,
కొంచెం
మంచినీరు
త్రాగి
క్రిందకు
వస్తాను.
‘స్వామి
టిఫిన్
ఏమి
చేస్తున్నారు?’
అని
అనుకుంటారు
అందరూ.
నాకు
టిఫిన్
అంటేనే
ఇష్టము
లేదు.
గ్లాసుడు
చల్లని
నీరుత్రాగి
క్రిందకు
వస్తాను.
తరువాత
భక్తులతో
ఆనందముగా
సంభాషణ
సల్పుతాను.
ఆనందంగా
వారితో
గడిపిన
తరువాత
తిరిగి
పైకి
వెళతాను.
ఈవిధంగా,
నా
దేహమును
పరిశుద్ధము
చేసుకొని
పవిత్రమైన
దేహముతో
పవిత్రమైన
భక్తులతో
నేను
పవిత్రమైన
మాటలు
మాట్లాడుతుంటాను.
ఇంకా
కొంతమందికి
ఇంటర్వ్యూలు
కూడా
ఇస్తాను.
ఈ
ఇంటర్వూలు
ఇచ్చే
సమయంలో
ఒక
విషయం
మీరు
జ్ఞాపకం
పెట్టుకోవాలి.
నేను
ఇంత
పరిశుద్ధముగా
ఇంటర్వ్యూ
రూమ్‌లోకి
వచ్చేసరికి
కొందరు
అక్కడికి
స్మోక్
చేసి
వచ్చి
ఉంటారు.
స్మోక్
చేసినవారిని
నేను
దగ్గరికి
చేర్చను.
4
▾
Meaning
Keep
తక్షణమే
నీవు
బయటికి
పొమ్మంటాను.
అప్పుడా
వ్యక్తియొక్క
భార్య,
‘స్వామీ,
ఆయన
నా
భర్త.
ఆయనను
పంపిస్తే
నేను
ఏమి
మాట్లాడేది?’
అంటుంది.
‘భర్తగాని,
పుత్రుడుగాని
ఎవరైనా
సరే,
దుర్గంధమును
పెట్టుకొని
నా
రూమ్‌లోకి
రాకూడదు.
నీవు
పోయి
చెప్పు.
నోరు
కడుక్కొని
మంచిగా
రమ్మను.
నేను
మాట్లాడుతాను’,
అని
స్పష్టంగా
చెబుతాను.
అప్పుడా
వ్యక్తి
బయటికి
పోయి
క్లీన్
చేసుకొని
తిరిగి
ఇంటర్వ్యూ
రూమ్‌లోకి
వస్తాడు.
నేను
చెప్పినట్లుగా
వారితో
నేను
మంచిగా
మాట్లాడుతాను.
ఈవిధముగా,
నా
కాలమును
అన్ని
విధాలుగా
పవిత్రమైనదిగా
చేస్తుంటాను.
ఈనాడు
అనేకమంది
అనేకరకములైన
దుర్గంధములుండి
కూడను
దానిని
కవర్
చేసుకోవడానికి
ప్రయత్నం
చేస్తుంటారు.
ఆరోగ్యవంతమైన
దేహము,
మంచి
భావములు,
ఇంద్రియ
నిగ్రహములే
శరీరమునకు
తేజస్సును
తెస్తాయి
పార్వతి
ఈశ్వరుని
పెండ్లి
చేసుకోవాలని
ఎన్నో
విధాలుగా
తపస్సు
చేసింది.
అందమైన
దుస్తులు
వేసుకొని,
సుగంధములు
పూసుకుంది.
కాని,
ఈశ్వరుడు
మాత్రం
చలించలేదు.
ఆమె
ముఖము
చూడలేదు.
ఇంక
ఆమె
భరించుకొనలేక
మన్మథుని
సహాయం
కోరింది.
ఈశ్వరుడు
మన్మథునిపై
కోపించి
అతనిని
భస్మం
చేస్తాడు.
అప్పుడు
పార్వతి
తన
సహజమైన
రూపాన్ని
ధరిస్తుంది.
కూర్చొని
తన
మనస్సులో
పరిశుద్ధమైన
‘నిర్గుణం
నిరంజనం
సనాతనం
నికేతనం
నిత్య
శుద్ధ
బుద్ధ
ముక్త
నిర్మలస్వరూపిణం’
అయిన
ఈశ్వరుని
గురించి
ధ్యానం
చేస్తుంది.
ఈశ్వరుడు
ఆమెవైపు
చూస్తాడు.
పార్వతి
తన
సహజరూపమును
ధరించి
ఉన్నది
కదా,
అనుకొని
ఆమెను
హిమవత్పర్వతానికి
తీసికొని
పోతాడు.
ఒక
శుభముహూర్తము
వేళ
పార్వతి
తల్లిదండ్రుల
ఆమోదముతో
ఆమెను
వివాహము
చేసుకుంటాడు.
నా
దేహము
సహజమైనది.
దీనికి
మురికిని
చేర్చకుండా
పవిత్రమైన
భావములచేత
నా
మనస్సును,
దేహమును
నేను
పవిత్రంగా
ఉంచుకుంటాను.
ఇట్టి
సదభ్యాసములు
పరులకు
అందించేందుకు
ఈరకంగా
చేస్తుంటాను.
అందుకొరకు,
నిద్ర
పోయేవారిని
కూడా
నేను
లేపుతుంటాను.
పన్నెండు
గంటలకు
లేచిన
తరువాత
మళ్ళీ
ఒక
గంట,
గంటన్నర
పోయిన
తరువాత
మళ్ళీ
లేపుతాను.
5
▾
Meaning
Keep
పిల్లలకు
కొంచెం
కష్టం
కలుగుతూ
ఉండవచ్చు.
‘అయ్యో,
ఇప్పుడే
పడుకున్నాను.
నిద్ర
వస్తున్నది.
ఎలా
లేచేది?’
అని
వారు
అనుకోవచ్చు.
ఆ
క్షణములో
వారు
అలా
అనుకుంటారుగాని,
తరువాత
అంతా
మరచిపోయి
స్వామికి
తగిన
అనుకూలాలు
చేస్తుంటారు.
కనుక,
దేహమును
మొట్టమొదట
పరిశుద్ధము
చేసుకోవాలి.
బాహ్యంగా
సుగంధ
ద్రవ్యములు,
రంగులు
పులుముకోవడం
వలన
పవిత్రత
రాదు.
ఆరోగ్యవంతమైన
దేహము,
మంచి
భావములు,
ఇంద్రియ
నిగ్రహమువలన
శరీరమునకు
తేజస్సు
వస్తుంది.
ఈవిధంగా,
పరిశుద్ధం
చేసుకున్నవారితో
కలిసి
ఉంటే,
మనకు
కూడా
గౌరవము.
పరిశుద్ధతత్త్వము
పరమాత్మదగ్గర
చోటు
సాధిస్తుంది
ఒకప్పుడు
మార్కండేయుడు
అనే
బాలునికి
ఈశ్వరుడు
కేవలం
పదహారు
సంవత్సరాల
ఆయుష్షు
మాత్రమే
ఇచ్చాడు.
ఆ
బాలుడు
తెల్లవారి
లేచినది
మొదలు
సామాన్యమైన
బాలురవలె
ఆటపాటలలో
నిమగ్నుడై
ఉంటాడు.
‘ఒక
దినమునకు
అతనికి
పదహారు
సంవత్సరములు
నిండుతాయి’,
అని
తెలిసి
తల్లీ
తండ్రీ
కంటిధారలు
కారుస్తుంటారు.
అప్పుడు
మార్కండేయుడు
వారివద్దకు
పరుగెత్తుకొని
వచ్చి,
‘అమ్మా,
ఎందుకు
మీరు
కంటిధారలు
కారుస్తున్నారు?’
అని
ప్రశ్నిస్తాడు.
కుమారుని
దగ్గర
దాపరికమెందుకని
తల్లి
అతనితో,
‘నాయనా!
ఈనాటితో
నీ
దేహమునకు,
నా
దేహమునకు
సంబంధము
తీరిపోతుంది’,
అని
చెబుతుంది.
‘ఏమిటి,
ఇంతకాలము
ఈవిషయం
నాకెందుకు
చెప్పలేదు?’
అని
మార్కండేయుడు
చాలా
కష్టపడ్డాడు.
సరే,
తన
మరణానికి
ఇంకా
కొంత
టైమ్
ఉంది
కదా,
అని
వెళ్ళి
స్నానం
చేసి
ఈశ్వరుని
దేవాలయమునకు
వెళ్ళాడు.
పరిశుద్ధమైన
నాలుకతో
పరిశుద్ధమైన
ఈశ్వరనామమును
స్మరిస్తూ
వచ్చాడు.
సూర్యోదయ
మౌతుందనగా
ఈశ్వరుడు,
పార్వతి
అక్కడ
ప్రత్యక్షమయ్యారు.
పార్వతి
ఈశ్వరుని
అడుగుతున్నది,
‘స్వామీ,
ఎందుకు
మీరు
ఇంకా
ఆలస్యం
చేస్తున్నారు.
ఆ
పిల్లవాడు
చాలా
బాధపడుతున్నాడు.
వాని
తల్లి
దండ్రులు
కూడా
చాలా
దుఃఖిస్తున్నారు.
వారిని
కాపాడండి’,
అని
ప్రార్థించింది.
అప్పుడు
ఈశ్వరుడు,
‘పార్వతీ!
ఈ
బాలుని
మరణము
నుండి
తప్పించాలంటే
నీవు
కూడా
నీ
పాత్ర
పోషించవలసిందే!
6
▾
Meaning
Keep
His poems 58
Also in his talks
(3)
2 June 2003
That is education which liberates
21 August 2004
The children alone are my property
6 May 2005
Only a son worthy of his mother's love can win God's grace
నేను
ప్రాణం
ఇస్తాను.
కాని,
నీవు
ముందు
పోయి
అతని
శరీరమును,
మనస్సును
పరిశుద్ధం
గావించుకొమ్మని
బోధించు’,
అని
చెప్పాడు.
మార్కండేయుడు
ఆవిధముగా
చేసిన
తరువాత
పార్వతి
ఆ
బాలుణ్ణి
ఎత్తి
తన
దగ్గర
కూర్చోబెట్టుకుంది.
అనగా,
పరిశుద్ధ
తత్త్వము
పరమాత్మ
దగ్గర
చోటును
సాధిస్తుంది,
అనేది
ఇందులో
అర్థమౌతుంది.
ఈశ్వరుడు,
‘నాయనా!
చిరంజీవివై
వర్ధిల్లు’
అని
ఆశీర్వదించాడు.
ఇంతలో
ఆ
బాలుని
తల్లిదండ్రులు
తమ
కుమారుడు
ఏమైనాడో
చూద్దామని
అక్కడికి
వచ్చారు.
తమ
కుమారుడు
ఇంకా
జీవించే
ఉండడం
చూసి,
‘నాయనా!
నీ
భక్తిప్రపత్తులవలననే
నీవు
చిరంజీవి
వైనావు.
భగవంతునికి
ఏదీ
ఇవ్వనక్కర్లేదు.
పరిశుద్ధమైన
దేహము,
పవిత్రమైన
మాటలు,
నిర్మలమైన
దృష్టి,
నిస్వార్థమైన
నడత
-
ఇవి
మంచిగా
ఉండినప్పుడు
భగవంతుడు
తప్పక
వశమైపోతాడు.
నాయనా!
నిన్ను
నీవే
కాపాడుకున్నావుగాని,
మా
వశమేమీ
కాలేదు’,
అని
చెప్పారు.
ఈవిధంగా,
శరీరము,
మనస్సు,
వాక్కు
పరిశుద్ధముగా
ఉండినప్పుడు
అవియే
భగవంతుని
ఆకర్షిస్తూ
ఉంటాయి.
కనుక,
భగవంతుని
వశము
చేసుకోవాలంటే,
మనము
చేసే
పూజలు,
పునస్కారములు
ఇవి
కాదు
ముఖ్యం.
నేను
చెప్పే
ప్రతి
ఒక్కటీ
అనుభవపూర్వకమైనదే
నేను
అప్పుడప్పుడు
ఒక
పద్యం
చెబుతుంటాను.
నేను
ఆవిధంగానే
చేసేవాడిని.
కొక్కొరొకోయని
కోడి
కూయగనే
చక్కగా
నిద్రమంచమునుండి
లెమ్ము
పలు
దోముకొని
దేహబాధ
దీర్చుకొని
జలకమాడి
దుస్తులు
ధరించి
చల్ది
భుజించు
హితమైన
వస్తువు
ఎంతయు
నమిలి
మితముగ
భుజించిన
మేలగు
నీకు
బడికేగి
శ్రద్ధగా
పాఠముల్
నేర్చి
అణకువ
గల
బాలుడనిపించుకొనుము
తేమలో
నెప్పుడు
తిరుగంగబోకు
మురికిగుంటల
చెంత
పోబోకుమెపుడు
పరుగుడు
చెడుగుడు
బంతులాటయును
సరియైన
వేళల
సలుపుచునుండు
పైరీతుల
న్నీవు
పరిగణింతువేని
ఆరోగ్యభాగ్యంబు
లనుభవించెదవు
7
▾
Meaning
Keep
అప్పుడు
ఈ
టిఫిన్లు
అవీ
లేవు.
రాత్రి
మిగిలిన
అన్నము
మజ్జిగలో
వేసి
మూసిపెడతారు.
ఆ
నీటితోనే
బాగా
పిసికి
ఇంత
ఉప్పు
వేసుకొని
తినడం...
అదియే
చల్ది.
చాలమంది
తాము
చదువుకునే
టేబులుపైనే
అనేక
పుస్తకాలు
పారవేసుకొని
చాలా
గలీజుగా
ఉంచుకుంటారు.
నాకది
నచ్చదు.
నా
వస్తువులన్నీ
చక్కగా
క్రొత్తవాటివలె
ఉంచుకుంటాను.
ఈసందర్భముగా
ఒక
చిన్న
సంఘటనను
ఉదాహరణగా
చెబుతున్నాను.
నేను
చెప్పే
ప్రతి
ఒక్కటీ
నా
అనుభవముపై
చెబుతాను.
విద్యార్థి
దశలో
నేను
పాసైన
తక్షణమే
నా
క్రింద
తరగతివాళ్ళు
పాసై
వచ్చి
వారు
నా
పుస్తకాలు
తీసికొని
పోతుండేవారు.
ఆనాడు
కొత్త
క్లాసుకు
కొత్త
పుస్తకాలు
తెలియదు.
ప్రతి
నాలుగూ
లేక
ఐదు
సంవత్సరములకు
పాఠ్యపుస్తకాలను
మార్చేసే
వారు.
నేను
నా
పుస్తకములను
ఎల్లప్పుడు
భద్రముగా
పెట్టుకుంటాను.
నా
పుస్తకాలు
కావాలని
ఒక
హరిజన
పిల్లవాడు
వచ్చాడు.
ఆ
అబ్బాయి
చాలా
బీదవాడు.
వాడికి
నా
పుస్తకాలన్నీ
చూపించాను.
ఆ
రోజుల్లో
చిన్నచిన్న
క్లాసులకు
కూడా
భూగోళము,
సివిక్సు,
చరిత్ర
వంటి
పెద్ద
పెద్ద
పుస్తకాలు
ఉండేవి.
ఆ
పిల్లవాడు
నా
పుస్తకాలు
చూసి,
‘ఏమి
రాజూ,
నీవు
పుస్తకాలసలు
ముట్టనే
లేదే!
అన్నీ
కొత్తగా
ఉంటున్నాయే!’
అన్నాడు.
‘నా
అలవాట్లు,
ప్రవర్తనే
వాటిని
అలా
పరిశుద్ధంగా
ఉంచాయి
నాయనా!’
అని
నేను
చెప్పాను.
పుస్తకాలన్నీ
కలిపి
పన్నెండు
రూపాయల
విలువ
గలవి.
ఆ
అబ్బాయి
తానంత
డబ్బు
ఇవ్వలే
నన్నాడు.
అందుకు
నేను,
‘నాయనా!
ఇప్పుడు
నాకు
కావలసినది
ఐదు
రూపాయలు
మాత్రమే.
స్కౌటు
క్యాంపుకు
నన్ను
వాలంటీరుగా
సెలెక్టు
చేశాడు
డ్రిల్లు
టీచరు.
ఆ
క్యాంపులో
పాల్గొనాలంటే,
నాకు
చాలా
ఖర్చౌతుంది.
కాకీ
వస్త్రములు,
బూట్సు
కొనాలి.
నా
దగ్గర
అంత
డబ్బు
లేదు.
తల్లిదండ్రులను
అడగడానికి
నాకిష్టం
లేదు.
నేను
విద్యార్థిని.
విద్యను
సాధించాలిగాని,
విద్య
నిమిత్తమై
తల్లిదండ్రులను
అనేక
రకములుగా
హింసించకూడదు.
8
▾
Meaning
Keep
అందువలన,
నీవు
ఐదు
రూపాయ
లిచ్చి
ఈ
పుస్తకములను
తీసికొని
వెళ్ళు’,
అని
చెప్పాను.
అప్పుడు
ఆ
పిల్లవాడు
చాలా
ఆనందముగా
ఐదు
రూపాయలు
తెచ్చి
ఇచ్చాడు.
ఆనాడు
ఐదు
రూపాయలంటే
రూపాయి
నోట్లు
కాదు.
అంతా
చిల్లర.
జేబుల
నిండుకు
పోసుకొని
నాదగ్గరకు
వచ్చాడు.
అంతా
చేరి
ఇంత
మూట
అయింది.
ఆ
మూటను
నేనెక్కడ
పెట్టేది?
ఆ
చిల్లర
కూడా
ఒక
పాతవస్త్రములో
వేసి
కట్టి
ఇచ్చాడు.
గట్టిగా
మూట
కట్టేటప్పటికి
అది
చిరిగిపోయింది.
అందులోని
నాణెములన్నీ
రూమంతా
పడ్డాయి
ఘల్లు
ఘల్లుమని.
ఆ
చప్పుడు
విని
ఇంటి
యజమానురాలు
లోపలినుండి
వచ్చింది.
‘ఎక్కడ
చిక్కిందిరా
ఈ
డబ్బంతా
నీకు?
నా
పెట్టెలోనుండి
తీశావు
కదా’,
అని
దబాయిస్తూ
రెండు
వేసింది.
అప్పుడా
అబ్బాయి
చెప్పాడు,
‘అమ్మగారూ,
నేనే
ఇచ్చాను
చిల్లర.
పుస్తకాలు
తీసుకున్నాను’,
అని.
అప్పుడామె,
‘దొంగకు
దొంగ
సాక్షిరా’
అని
ఆ
డబ్బంతా
తాను
తీసుకుంది.
రెండవ
దినము
స్కౌటు
పిల్లలంతా
కలిసి
వెళుతున్నారు.
ఎక్కడికి
వెళుతున్నారు?
కడపదగ్గర
ఉన్న
పుష్పగిరికి
వెళుతున్నారు.
కమలాపురంలో
ఉన్నాను
నేనప్పుడు.
అక్కడ
తిరునాళ్ళు
జరుగుతున్నవి.
అక్కడ
నేలంతా
ఇసకే!
పశువులను
తీసికొని
వచ్చారు.
ఎక్కడ
చూసినా
పశువుల
వ్యాపారమే!
నేను
డ్రిల్లు
టీచరుతో
‘రాత్రి
వచ్చి
ఏమి
చేసేది?
తెల్లవారి
వస్తాను’,
అని
చెప్పాను.
చెప్పిన
మాట
తప్పకూడదు
కదా!
తెల్లవారుతూనే
లేచి
నడుచుకుంటూ
నడుచుకుంటూ
వెళ్ళాను.
ఐదు
మైళ్ళు
నడచి
వెళ్ళాను.
తీరా
అక్కడికి
వెళ్ళేటప్పటికి
అందరూ
టిఫిను
తీసుకోవడానికి
వెళ్ళారు.
నాదగ్గర
జేబులో
ఒక్క
కాసు
కూడా
లేదు.
ఏమి
తినేది?
తరువాత
చూద్దాములే
అని
తోటిపిల్లలకు
ఎవ్వరికీ
కనిపించకుండా
తిరిగాను.
నా
క్లాసుమేట్సు
మాత్రం
‘రాజు
వచ్చాడా,
రాజు
వచ్చాడా’,
అని
నాకోసం
వెతుకుతూనే
ఉన్నారు.
వారెవరికీ
కనిపించకుండా
ముఖం
కడుక్కుందామని
దగ్గర్లోనే
ఉన్న
ఒక
సిమెంటు
తొట్టివద్దకు
వెళ్ళాను.
దానిలోని
నీటితో
పశువులను
కడుగుతారు.
నీరంతా
అపరిశుద్ధంగా
ఉంటున్నది.
అయితే,
ఏమి
చేసేది?
ఏదీ
లేనప్పుడు
అదే
గంగ!
అందులోని
నీరు
కొంచెం
త్రాగి
ముఖం
కడుక్కుని
వచ్చాను.
బయటకు
వచ్చి
చూస్తే
ఒక
బండపైన
ఒక
బీడీ
కట్ట,
ఒక
అణా
ఎవరో
మరచిపోయారు.
ఈ
బీడీలు
నాకవసరం
లేదు
కదా!
అందుకని
వాటిని
ఇసుకలో
పూడ్చిపెట్టాను.
9
▾
Meaning
Keep
అణా
కాసు
మాత్రం
తీసుకున్నాను.
చిల్లర
మార్చుకున్నాను.
నాలుగు
బొట్లు
వచ్చాయి.
నాలుగు
బొట్లంటే
ఒక
అణా.
వాటిని
తీసికొని
పోతుంటే,
‘రాజూ!
నీకు
మంచి
లక్
ఉంటున్నాది.
ఈ
బుడబుడకాటా
ఆడు’,
అని
దారి
ప్రక్కనే
ఉన్న
ఒక
వ్యక్తి
పిలిచాడు.
అక్కడ
ఈ
జూదంలో
నేను
ప్రవేశించాను.
నిజానికి
జూదం
ఆడడం
మంచిపని
కాదు.
ఆవిషయమే
నేను
అందరికీ
చెబుతూ
వచ్చాను.
కాని,
ఆ
సమయంలో
తప్పనిసరి
పరిస్థితుల్లో
నేను
ఆడవలసి
వచ్చింది.
ఎందుకంటే,
ఈ
నాలుగు
బొట్లతో
కొంత
సంపాదించవచ్చని.
పేక
ముక్కలలో
కళావరు,
ఇస్పేటు,
డైమండు
అని
పేర్లుంటాయి.
ఒక్కొక్క
పేకముక్కపై
కాసిన
పందెమునకు
దానికి
డబల్
డబల్
వచ్చేసింది.
చూచాను.
పదహారణాలు
అయ్యేంత
వరకూ
ఆడాను.
నాకు
దండిగా
డబ్బు
వస్తున్నదని
ఎక్కువగా
ఆడకూడదు
కదా!
‘నాకింక
చాలు’
అనుకున్నాను.
తృప్తియే
నాకు
ముఖ్యం.
ఒక
బొట్టు
ఇచ్చాను.
బొట్టుకు
మూడు
దోసెలు.
ఒక
దమ్మిడీకి
ఒక
దోసె
ఆనాడు.
ఆవిధంగా
దినానికి
రెండు
బొట్లు
ఖర్చైంది.
అలా
దోసెలు
తిని
స్కౌటులో
నా
డ్యూటీ
చేశాను.
రాత్రికి
మళ్ళీ
రెండు
దమ్మిడీలు
ఇచ్చి
రెండు
దోసెలు
తీసుకున్నాను.
తిరిగి
అక్కడే
పడుకున్నాను.
నాదగ్గర
ఇంకా
చిల్లర
మిగిలింది.
ఆ
చిల్లరను
మూట
కట్టుకొని
తలక్రింద
పెట్టుకున్నాను.
అంత
దూరం
నడిచి
వెళ్ళడం
వలన
బాగా
అలసి
పోయాను.
ఆ
ఇసుక
దిబ్బపై
నున్న
నా
తల
కొంచం
ప్రక్కకు
జరిగింది
నిద్రలో.
నేను
మాత్రం
మైమరచి
పడుకున్నాను.
ఈ
పరిస్థితి
అంతా
ఎవరో
చూశారు.
మెల్లగా
ఆ
చిల్లర
మూటను
తీసుకొని
పోయారు.
తెల్లవారి
లేచి
చూసుకుంటే
మూట
లేదు.
సరే
అనుకొని
నా
పాటికి
నేను
పోతున్నాను.
కాని,
నా
క్లాసు
మేట్సు
ఏడుస్తూ
నా
వెంట
పడి
‘ఒక్క
దోసైనా
తినకూడదా’,
అని
బ్రతిమాలారు.
‘నేనిదివరకే
తిన్నాను.
నా
పొట్ట
నిండింది.
నాకు
ఎవరి
డబ్బూ
అక్కరలేదు’,
అని
ముందుకు
పోయాను.
పెద్దవాళ్ళను
గౌరవించడం,
కుటుంబ
మర్యాదను
కాపాడడం
చిన్నప్పటినుండే
నా
అలవాట్లు
మరొక
చిన్ననాటి
సంఘటన.
ఒకప్పుడు
నా
చేయంతా
వాచింది.
నేను
ఎవరికీ
చెప్పలేదు.
లోపలికి
వెళ్ళి
పాతచొక్కా
ఉంటే
దానిని
తీసికొని
తడిపి
కట్టు
కట్టుకున్నాను.
ఇది
జరిగిన
రెండవ
దినమే
శేషమరాజు
కుమారుడు
ఒకడు
చనిపోయాడు.
10
▾
Meaning
Keep
ఆ
కుర్రవాడు
చనిపోయాడని
పుట్టపర్తికి
టెలిగ్రామ్
ఇస్తే,
గృహం
అబ్బాయి
పుట్టపర్తినుండి
బుక్కపట్నం
వచ్చి,
అక్కడినుండి
కమలాపురం
చేరుకున్నాడు.
ఆయన
వచ్చేటప్పటికి
ఇంట్లోనివారందరూ
కుమారుడు
పోయాడని
బాధ
పడుతున్నారు.
నేను
కూడా
బాధపడుతున్నట్లు
నటించాలి
కదా!
ఎందుకంటే,
నాకు
దుఃఖమనేదే
లేదు.
గృహం
అబ్బాయి
నన్ను
పిలచి,
‘ఏమి
చేయికి
కట్టు
కట్టుకున్నావు?’
అని
అడిగాడు.
‘లేదు
నాయనా!
కేవలం
కీలునొప్పి
వచ్చింది.
అందువలన
నేను
కట్టుకున్నాను’,
అన్నాను.
ప్రక్క
ఇంట్లో
దోసెలమ్మే
ఒక
కోమటమ్మ
ఉండేది.
ఆమె
గృహం
అబ్బాయిని
పిలిచి,
‘ఏమి
వెంకమరాజూ!
నీకేమి
కొరత?
కావలసినంత
ఉంటున్నది
కదా!
అన్నవస్త్రాలకు
లోటు
లేదు
కదా!
ఆ
పిల్లవానిని
ఎందుకింత
అవస్థ
పెడుతున్నారు
మీరు?
ఈ
ఊళ్ళో
త్రాగే
నీరు
కావాలంటే
చాలా
దూరం
పోవాలి.
అక్కడ
ఒక
కాలువ
ఉంటున్నది.
అక్కడినుండి
ఈ
పిల్లవాడు
కావడి
భుజాలపై
మోసుకొని
నీరు
తీసుకు
రావాలి.
చాలా
కష్టపడుతున్నాడు’,
అని
ఏమేమో
చెప్పింది.
గృహం
అబ్బాయి
నన్ను
ప్రక్కకి
పిలిచి,
‘నాయనా!
నీవు
బయలుదేరు.
నావెంట
రా’,
అని
చెప్పాడు.
నేనంటే
ఇంట్లోవారందరికీ
ప్రేమయే!
ప్రతి
ఒక్కరూ
నన్ను
ప్రేమించేవారే!
ఆయన,
‘పుట్టినప్పటి
నుండి
నేను
నిన్ను
ఒక్క
వేటైనా
కొట్టలేదు.
నిన్ను
ఇన్ని
బాధలు
పెడుతున్నారు
ఇక్కడ’,
అని
వాపోయాడు.
నేను
మాత్రం,
‘ఛీ,
ఛీ.
అది
వట్టి
అబద్ధం.
నన్ను
ఎవ్వరూ
బాధలు
పెట్టడం
లేదు’,
అని
సర్ది
చెప్పాను.
కాని,
ఆయన
మనం
వెళ్ళిపోదామని
పట్టుపట్టాడు.
అప్పుడు
నేను
చెప్పాను,
‘నేను
రాలేను.
కష్టం
వచ్చిన
సమయంలో
నేను
రావడం
మంచిది
కాదు.
ఈ
సమయంలో
నేను
వెళ్ళిపోతే
ఇంట్లో
పనిచేసేవారే
లేరు.
ఇప్పుడు
నీవు
నన్ను
తీసుకు
పోవడం
ధర్మం
కాదు.
నీవు
ముందు
పో.
తరువాత
నేను
వస్తాను’,
అని.
అంతేకాని,
శేషమరాజు
కొట్టడం
వల్లనే
చేయి
వాచిందన్న
విషయం
నేను
చెప్పలేదు.
ఈవిధంగా,
పెద్దలను
గౌరవించడం,
కుటుంబ
మర్యాదను
కాపాడడం
చిన్నప్పటి
నుండే
నాకు
అలవాటుగా
ఉండేది.
నా
సమాధానం
విని
ఆయన
కూడా
ఆనాడు
కంటినీరు
కార్చాడు.
‘నాయనా!
చిన్నవారు
పెద్దవారికి
సామాన్యంగా
ఇలాంటి
బోధవాక్యాలు
చెప్పరు.
ఎంత
గొప్ప
గుణమురా
నీది!
నాకు
మంచి
మాటలు
బోధిస్తున్నావా?
11
▾
Meaning
Keep
His poems 506
Also in his talks
(2)
11 September 1998
Speak Gently and Sweetly
21 October 2003
I have come only to reveal your true nature
ఆ
మంచితనమే
నిన్ను
కాపాడుతుంది’,
అని
చెప్పి
ఆయన
వెళ్ళిపోయాడు.
ఆయన
పుట్టపర్తికి
తిరిగి
వెళ్ళిననాటి
నుండి
ప్రతి
దినమూ
ఒక
టెలిగ్రామ్
ఇచ్చేది,
‘నీవు
తక్షణమే
బయల్దేరి
రా’,
అని.
ఆనాడు
కమలాపురంలో
మేముండే
ఇంటిప్రక్కనున్న
దోసెలు
వేసే
కోమటమ్మ
చెప్పిన
విషయాలన్నీ
తన
మనస్సులో
చేర్చుకొని
ఆయన
ఎంతో
బాధపడుతున్నాడు.
ఈలోపల
రెండు,
మూడు
దినాలైపోయింది.
అందరూ
చల్లబడ్డారు.
ఆనాడు
నా
చేతులో
దమ్మిడీ
ఉండేది
కాదు.
ఆ
గ్రామంలోనే
కొట్టే
సుబ్బన్న
అనే
బిజినెస్
మెన్
ఒకాయన
ఉండేవాడు.
ఆయన
దుకాణంలో
క్రొత్తగా
ఒక
మందు
వచ్చింది.
అతను
దానినంతా
అమ్మాలి.
దానిలో
అతనికి
డబ్బంతా
దండిగా
వస్తుంది.
అందుకని
అతను
నన్ను
పిలచి,
‘రాజూ!
ఈ
మందు
గురించి
ప్రజలలో
ప్రచారం
చేసే
బాధ్యత
నీవు
తీసుకోవాలి’,
అన్నాడు.
అప్పుడు
నేను,
‘దీని
సమాచారం
ఏమీ
తెలియకుండా
ఊరికే
మందు
తీసుకోమంటే
ఎలా
తీసుకుంటారు?’
అని
చెప్పి
అన్ని
వివరాలు
అతని
దగ్గర
తీశాను.
ఆ
మందుయొక్క
గుణమును
గురించి
ఒక
పాట
వ్రాశాను.
తరువాత
ఇద్దరు,
ముగ్గురు
పిల్లలను
వెంట
పెట్టుకొని
వీధులలో
ప్రచారం
చేయడం
మొదలు
పెట్టాను.
‘బాలభాస్కర’
అని
ఆ
మందు
పేరు.
దానిని
గురించి
నేను
కట్టిన
పాట
ఇలా
ఉంది
-
దొరికె
దొరికె
బాలభాస్కర
బాలకులారా!
రండి
బాలకులార!
కడుపుబ్బరము
కాళ్ళవాపులు
చేతి
మోదులను
చెడుగులనుండి
అజాగరూక
పోషణనుండి
అజీర్ణ
విరేచనములనుండి
అన్నిటికీ
ఇది
బాగవునండీ
బాలకులారా!
రండి
బాలకులారా!
అది
ఎక్కడ
అని
అడిగేరన్నా!
అదిగదిగో
కొట్టె
సుబ్బన్న
అంగడియందె
దొరుకును
అన్నా
పండిత
శ్రీ
గోపాలాచార్యుల
పావనమైన
టానిక్కన్నా
12
▾
Meaning
Keep
ఆవిధంగా
పాట
కట్టి
ఊరూరా
ప్రచారం
చేసేటప్పటికి
ఆయన
అంగడిలో
మందులంతా
అయిపోయినాయి.
అప్పుడాయన
ఎంతో
ఆనందించి,
‘నాయనా
రాజూ!
నీ
వల్ల
నా
అంగడిలో
మందులంతా
ఖర్చైపోయినాయి’,
అని
ఒక
అణా
ఇవ్వబోయాడు.
అయితే
నేను
దానిని
తిరస్కరించాను.
నాకు
రమేశ్,
సురేశ్
అని
ఇద్దరు
స్నేహితులు
ఉండేవారు.
మేము
ముగ్గురం
ఒకే
డెస్కుపై
కూర్చునే
వారము
-
రమేశ్
ఒక
వైపు,
సురేశ్
ఒకవైపు,
నేను
మధ్యలో.
వాళ్ళిద్దరికీ
నోళ్ళు
విప్పితే
ఒక్క
ముక్క
కూడా
రాదు.
అందువలన,
‘మీరు
పరీక్షల
గురించి
దిగులు
పడకండి.
మీ
తరఫున
కొశ్చెన్స్కి
ఆన్సర్సు
నేను
వ్రాస్తాను.
మీరు
ధైర్యంగా
ఉండండి’,
అని
నేను
వారికి
నచ్చజెప్పాను.
ఎగ్జామినేషన్
హాలులోనికి
మేము
ముగ్గురం
వెళ్ళాము.
వాని
నెంబరు
ఒకటి,
నా
నెంబరు
ఒకటి,
ఇంకొకని
నెంబరు
మరొకటి.
ఒక
నెంబరుకి
మరొక
నెంబరుకి
ఏమీ
సంబంధము
లేదు.
ఒకడు
ఆ
కొసన
కూర్చునేవాడు.
మరొకడు
ఈ
కొసన
కూర్చునేవాడు.
నేను
చెప్పేది
తమకు
చిక్కడం
లేదే,
అని
బాధపడుతున్నారు
వాళ్ళు.
అప్పుడు
నేను
ఒక
పని
చేశాను.
మొట్టమొదట
నా
ఆన్సరు
పేపరు
బిఱ్ఱుబిఱ్ఱున
వ్రాశాను.
తరువాత
ఒకరి
హేండు
రైటింగుతో
ఆన్సరు
షీటులో
వ్రాశాను.
దానిపైన
వాని
పేరు
వ్రాశాను.
రెండవవాని
పేరుతో
వాని
హేండ్
రైటింగుతో
ప్రశ్నలకు
సమాధానాలు
వ్రాశాను.
మూడు
పేపర్లూ
కలిపి
పరీక్షాధికారి
టేబిల్‌పైన
పెట్టాను.
మేము
ముగ్గురం
బయటికి
వెళ్ళిపోయాము.
ఇక,
రిజల్ట్సు
కొరకు
ఎదురు
చూడడం
మొదలు
పెట్టాము.
మూడవ
దినము
రిజల్ట్సు
వచ్చాయి.
ఆ
రోజుల్లో
రిజల్ట్సు
ప్రకటించడానికి
నెలలు
పట్టేవి
కావు.
మా
ముగ్గురికి
కూడా
ఫస్టుక్లాసులు
వచ్చాయి.
నేను,
రమేశ్,
సురేశ్...
ఈ
ముగ్గురికీ
ఫస్టు
క్లాసు.
నేను
ఏమి
సమాధానాలు
వ్రాశానో
అవే
వారి
ఆన్సరు
షీట్స్‌లో
కూడా
ఉండేవి.
అయితే,
వాళ్ళు
నా
దాంట్లోంచి
కాపీ
కొట్టారని
చెప్పడానికి
వీల్లేదు.
వాళ్ళిద్దరూ
ఎక్కడో
దూరంగా
కూర్చొని
ఉన్నారు.
నా
నెంబరు
ఆరు.
ఒకరి
నెంబరు
108.
ఇంకొకరి
నెంబరు
ఇంకా
దూరంగా
ఉండేది.
13
▾
Meaning
Keep
అందువలన,
వాళ్ళు
కాపీ
కొట్టారని
ఎవరు
చెప్పగలరు?
అయితే,
టీచరు
మహబూబ్ఖాన్కి
ఈ
రాజే
వాళ్ళిద్దరికీ
సహాయం
చేస్తున్నాడని
తెలుసు.
మేము
బయటికి
వచ్చేటప్పటికి
ముగ్గురినీ
పట్టుకున్నారు.
రిజల్ట్సు
వచ్చిన
తరువాత
అందరికీ
ఒకటే
ఆశ్చర్యం,
ఆనందం!
ఈవిధముగా,
అక్కడ
అందరికీ
ఆనందమునిచ్చి
పుట్టపర్తికి
వచ్చేశాను.
నా
‘ప్రోపర్టీ’
నా
పిల్లలే
నేను
పుట్టపర్తికి
వచ్చే
ముందు
నా
స్నేహితులిద్దరూ
వెంట
పడి
‘మేము
ఇంటిదగ్గర
ఏమి
చేస్తాము
రాజూ?
మేము
కూడా
నీవెంట
వస్తాము’,
అని
బ్రతిమిలాడారు.
నేను
ఎంత
మాత్రం
ఒప్పుకోలేదు.
‘కావలిస్తే
మీరు
వచ్చి
నన్ను
దింపి
రండి’,
అని
చెప్పాను.
ఈవిధముగా,
విద్యార్థి
దశలో
కాలమునంతా
పవిత్రమైనదిగా
గడుపుతూ
వచ్చాను.
నేను
మాటలు
కూడా
మృదువుగా
మాట్లాడేవాడిని.
ఎంత
మృదువుగా
మాట్లాడే
వాడినంటే,
నేను
మాట్లాడేది
ఎవ్వరికీ
వినిపించేది
కాదు.
సరే,
పుట్టపర్తి
చేరాను.
పుట్టపర్తి
వచ్చేటప్పటికి
నాకు
ఏదో
ఒక
వింత
జబ్బు
చేసింది.
ఏమిటది?
నాకు
మతి
చెడిపోయిందని
అందరూ
అనుకున్నారు.
‘పిచ్చిపట్టింది
రాజుకు’,
అనుకోవడం
మొదలుపెట్టారు.
దీనికి
ఒక
కారణం
ఉంది.
ఎవరికీ
చెప్పకుండా
నాలో
నేనే
మాట్లాడుకునేవాడిని.
ఇలా
వచ్చేటప్పటికి
ఇంట్లోవాళ్ళందరూ
చేరి,
నన్ను
మంచి
వైద్యుని
వద్దకు
తీసుకుని
వెళదామని
నిర్ణయం
చేసుకున్నారు.
ఎక్కడెక్కడకో
నన్ను
తీసికొని
వెళ్ళారు.
చివరకు
ఒక
భూతవైద్యునిదగ్గరకు
తీసుకుని
వెళ్ళారు.
అతడు
నా
తలంతా
గొరిగేశాడు.
దానిపై
కత్తితో
‘ఇంటూ’
మాదిరి
గంట్లు
చేశాడు.
నాలుగు
వైపులా
చర్మాన్ని
లాగాడు.
రక్తం
కారుతున్నది.
ఆ
గాయంపైన
నిమ్మరసం
వేశాడు.
భరించరాని
మంట.
కాని,
దానికి
నేను
ఏమాత్రం
బాధ
పడలేదు.
నవ్వుతూనే
ఉన్నాను.
‘ఏమిటి,
ఇంతగా
హింసించినా
ఈ
కుర్రవాడు
నవ్వుతూనే
ఉన్నాడే’,
అనుకొని
ఇంకా
హింసించాలని
నా
కన్నులకు
కలికం
పూశాడు.
ఇంకా
ఎన్నెన్ని
హింసలో
పెట్టాడు.
అప్పుడు
నావెంట
వెంకమ్మ
వచ్చింది
కదా!
గృహం
అబ్బాయి
ఎంత
వారించినా
ఆమె,
‘నేను
వినను.
నేను
కూడా
రాజువెంట
వస్తాను’,
అని
పట్టుపట్టి
వచ్చింది.
ఆమె
నాకు
అన్నం
వండి
పెట్టేది.
ఆమె
గృహం
అబ్బాయి
దగ్గరకు
వచ్చి,
‘నాన్నా!
రాజుకు
ఇవంతా
చేయించకండి.
14
▾
Meaning
Keep
అతనిని
చాలా
కఠినంగా
హింసిస్తున్నాడు.
అతను
చిన్నపిల్లవాడు,
తట్టుకోలేడు.
చాలా
బాధపడుతున్నాడు.
మీరు
వెంటనే
అతడ్ని
పుట్టపర్తికి
తీసుకువెళ్ళండి’,
అని
బ్రతిమాలింది.
సరే,
నన్ను
పుట్టపర్తికి
తీసుకొని
వచ్చారు.
ఆనాడు
అలా
తల
గొరగడం
జరిగినప్పటి
నుండి
ఈనాటి
వరకూ
ఈ
తలపైన
కత్తెరగాని,
కత్తిగాని
పెట్టలేదు.
జుట్టు
కట్
చేయించలేదు.
అందరూ
‘స్వామి
అందంగా
జుట్టు
కట్
చేయిస్తున్నారేమో’,
అని
అనుకుంటారు.
ఎప్పుడూ
లేదు.
అట్లనే
పెంచుకుంటూ
వస్తున్నాను.
ఈమాదిరి
జుట్టుతో
ఇంతవరకూ
డెబ్బై
ఎనిమిది
సంవత్సరములు
గడిపాను.
రేపు
వచ్చేది
79వ
పుట్టిన
దినము.
ఈనాటి
వరకు
నాకు
పండ్లు
గట్టిగా
ఉన్నాయి.
దృష్టి
చక్కగా
ఉంది.
గతంలో
నేను
ఈ
కాళ్ళతో
నడుస్తుంటే,
పిల్లలందరూ
నాతో
సమానంగా
నడువలేక
పరుగెత్తేవారు.
ఇప్పుడు
కూడా
నేను
నడుస్తాను.
కాని,
డాక్టర్లు
పెట్టిన
నియమం
ఒకటుంది.
ఎందుకంటే,
నా
తుంటి
ఎముకకు
ఆపరేషను
చేశారు
పడిపోయినప్పుడు.
దానిలో
ఇనుపరాడ్
పెట్టి
కుట్టేసారు.
అందువలన
త్వరగా
నడచడానికి
వీల్లేదు.
అయితే,
నా
పనులన్నీ
నేను
చక్కగా
చేసుకుంటున్నాను.
ఏ
ఒక్కటీ
నేను
మానలేదు.
వచ్చిన
వారికి
నేను
ఇంటర్వ్యూలు
ఇస్తున్నాను.
వారికి
ఇవ్వవలసినవి
ఇస్తున్నాను.
తిరుగుతూనే
ఉన్నాను.
ఏ
ఆటంకమూ
లేదు.
ఇంకా
ఇవన్నీ
చెప్పాలనుకుంటే
ఎంతో
ఉన్నది.
ఈనాడు
దుర్గాష్టమి.
ఈవిధంగా,
దేహాన్ని
అన్నివిధాల
కాపాడుకుంటూ
వస్తున్నాను.
రేపు,
ఎల్లుండి
నవమి,
దశమి.
రేపు
పురోహితుల
దగ్గరకు
వెళ్ళాలి.
వారికి
చెప్పవలసినవి
చెప్పి
తదుపరి
మీదగ్గరికి
వస్తాను.
నేనెన్నోసార్లు
చెప్పాను
కదా,
నా
ప్రోపర్టీ
ఏమిటి?
నా
ప్రోపర్టీ
నా
పిల్లలే!
స్టూడెంట్సే
నా
ప్రోపర్టీ.
వారంతా
ఆనందంగా
ఉంటే
నేనెంతైనా
ఆనందంగా
ఉంటాను.
(శ్రీవారి
దివ్యోపన్యాసం
తరువాత
భజన
జరిగింది.
భజన
అయిన
తర్వాత)
ఎంతకాలమైనా
ఈ
నామస్మరణ
మాత్రం
మానకండి.
Previous
←
The Whole World Is Full of Brahman
Next
Foster the Spirit of Sacrifice
→