Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1987 · Today satsaṅga is what man needs most urgently
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Today satsaṅga is what man needs most urgently
5 September 1987, Oṇam
1
▾
Meaning
Keep
His poems 203
Also in his talks
(2)
1 June 1991
Spiritual Discipline (sadhana)
21 October 1996
In God's Creation Everything Is Pure!
సద్భక్తులందరు
భగవంతుడాయంచు
చెవులకింపుగ
స్మరణ
చేయు
దినము
బీదల
వెతలన్ని
ప్రీతితో
నెరవేర్చి
అన్నదమ్ముల
మాడ్కి
మన్న
దినము
దైవచింతన
చేయు
భక్త
బృందములకు
ప్రీతి
మృష్టాన్నము
పెట్టు
దినము
మహానీయులెవ్రైన
మనకడ
కేతెంచి
చెలిమి
భగవత్కథలు
చెప్పు
దినము
దినము
దినముగాని
తక్కినవన్నియు
తద్దినములె
ఇంతకన్నను
వేరెద్ది
యెరుకపరతు
సాధు
సద్గుణగణ్యులౌసభ్యులార.
ప్రేమస్వరూపులారా!
మనసుకు
శాంతి
అవసరము.
శాంతి
లేక
సుఖములేదు.
అనాదికాలమునుండి
యీ
శాంతి
నిమిత్తమై
మానవుడు
యనేక
విధములైన
ప్రయత్నములు
సల్పుతూ
వచ్చాడు.
కాని
శాంతిని
అందుకోలేకపోతున్నాడు.
కారణమేమిటి?
శాంతికి
మూలాధారమేమిటి?
దేనివలన
మనసుకు
శాంతి
యేర్పడును
అనే
విచారణ
చాలా
పెడమార్గం
పట్టింది.
ప్రాకృత
సంబంధమైన
పంచభూతములయొక్క
సుఖమే
మనసునకు
శాంతి
అనే
పెడమార్గములో
మానవుడు
యీ
శాంతి
నిమిత్తమై
పాటుపడుతూ
వచ్చాడు.
కనులతో
చూడటం,
నోటితో
మాట్లాడటం,
చెవులతో
వినటం,
యీ
మనస్సుతో
అనుభవించటం
యీ
విధమైన
పంచేంద్రియములయొక్క
ప్రసాదమే
మానసిక
శాంతికి
మూలకారణమని
భావిస్తూవచ్చాడు.
ఈ
యింద్రియముల
తృప్తి
నిమిత్తమై
తాను
యనేక
విధములైన
తప్పు
మార్గములను
అనుభవిస్తూవచ్చాడు.
ఈ
ఆనందము
నిమిత్తమై
అధర్మముచే,
అక్రమముచే
అనాచారముచే
యీ
ఆనందమనుభవించుటకు
పూనుకున్నాడు.
వ్యక్తి
నిమిత్తమై,
స్వార్థస్వప్రయోజనముల
నిమిత్తమై
పరులశాంతిని
దోచుకొనుటకు
ప్రయత్నిస్తున్నాడు.
ఈ
విధమైన
ప్రయత్నములచేత
మానవునకుగానీ,
తన
సోదర
మానవులకు
గాని
శాంతి
శాంతిసౌఖ్యములు
కరువైపోయినవి.
ఈవిధమైన
వాంఛలవలన
అహంకారము,
స్వార్థము
పెరుగుతూ
వచ్చాయి.
ఈ
అహంకార
స్వార్థ
ప్రయోజనములచేత
మానవునకు
మానవునకు
మధ్యనున్న
మానవత్వము
మట్టిగరచిపోయింది.
2
▾
Meaning
Keep
ఈమానవత్వానికి
వుండిన
సంబంధబాంధవ్యాలను
పూర్తిగా
దూరం
చేసుకుంటూ
వస్తున్నాడు.
మానవుని
హృదయం
పాలసముద్రమువంటిది.
అట్టి
క్షీరసాగరమునందే
భగవంతుడు
పవళిస్తాడని
పురాణములయొక్క
ప్రమాణము.
క్షీరసాగరముగా
వుండవలసిన
మానవుని
హృదయము
యీనాడు
క్షారసాగరంగా
మారిపోతూ
వచ్చింది.
క్షీరమనగా
తెలుపు
అని.
తెలుపు
అనగా
సాత్విక
భావములతోకూడినదే
మానవుని
హృదయము
అని.
ఈ
సాత్విక
హృదయమునందు
శాంతి
ప్రేమ
సహనము
సానుభూతి
యిత్యాది
పవిత్రమైన
గుణములు
వాసము
చేస్తుంటాయి.
ఈ
క్షీరసాగరమునందు
తిమింగలములు,
మొసళ్లు
యింకా
యనేక
విధములైన
క్రూరమృగములు
నివసిస్తూవున్నాయి.
ఈ
మకర
తిమింగలములే
మనయొక్క
అహంకార
స్వార్థములు.
ఈనాడు
మానవునియందు
యీ
స్వార్థము,
అహంకారము
పెచ్చుపెరిగిపోయినవి.
దేనికైనను
ఒక
హద్దు
వుంటూ
వుండాలి.
'నశ్రేయో
నియమంవినా'
నియమమే
లేకపోయిన
మానవత్వం
నిర్మూలమైపోతుంది.
సూర్యచంద్రాదులకుకాని,
నక్షత్రములకుగాని,
ఋతువులకుగాని
కొన్ని
కొన్ని
హద్దులేర్పరచుకొని
వుంటున్నవి.
ప్రకృతియే
ఒక
హద్దును
అనుసరించి
భగవంతుని
నియమం
ప్రకారము
తాను
జరుగుతూ
వస్తున్నాది.
క్రమము
తప్పక
ప్రతిదినంబును
భాను
డుదయాస్తమయముల
నందనేల
క్షణమైన
విశ్రాంతిగానక
తాపవనుండు
జీవకోటులబ్రోవ
వీవనేల
గగనంబునకు
కాంతి
కైసేయు
తారలు
పగలు
మాత్రము
దాగు
భంగియేల.
ఇవన్నీకూడను
తమ
తమ
క్రమమును
అనుసరిస్తూ
వస్తున్నవి.
పశుపక్ష్యాదులుకూడను
తమతమ
క్రమమును
ఆచరిస్తూ
వస్తున్నవి.
తమ
తమ
యింద్రియములను
తమతమ
స్వాధీనమునందుంచుకుంటున్నది.
కానీ
పవిత్రమైన
మానవుడు,
దివ్యమైన
మానవ
జన్మము,
ఉత్కృష్టమైన
మానవ
జీవితమును
తాను
ఒక
క్రమములో
వుంచుకొనలేకపోతున్నాడు.
పశుపక్షిమృగాదులకే
సంస్కారం
లేదు.
సంస్కారమే
మానవునకు
సరైన
త్రోవను
చూపిస్తుంది.
మానవుని
వెంట
వచ్చునది
సంసారముకాదు.
సంస్కారమే.
అట్టి
సంస్కారమును
మనమీనాడు
కోల్పోతూ
వస్తున్నాము.
పుట్టిన
మృగములంతా
యే
విధముగా
పుట్టునో
అదే
విధమైన
స్థితిలో
మరణిస్తూ
వస్తున్నవి.
క్రూరముగా
పుట్టిన
పులి,
చిరుత
యిత్యాది
మృగములకు
యెన్ని
విధములైన
అభ్యాసములు
చేయించినప్పటికిని
తమ
క్రూరగుణమును
వదలలేకపోతున్నవి.
కాని
మానవుడట్లుకాదు.
కొన్ని
అభ్యాసములచేతను
…న్నినియమములచేతను
తాను
దుర్గుణములను
సద్గుణములుగా
మార్చుకోగలడు.
3
▾
Meaning
Keep
Also in his talks
(3)
29 June 1989
Everything Is God's Gracious Gift
7 September 1996
Advaita Is the Principle of the One Ātma
26 February 1998
The power of saṅkalpas
శ్రేయోహి
జ్ఞానమభ్యాసాత్
జ్ఞానా
ధ్యానం
విశిష్యతే
ధ్యానా
త్కర్మఫలత్యాగస్త్యాగాచ్ఛాన్తిరనన్తరమ్.
మనం
నడచే
నడక,
మాట్లాడే
మాటలు,
చెప్పే
విషయములు,
చేసే
పనులు
యివన్నీకూడను
కేవలము
అభ్యాసమువల్లనే
అభివృద్ధి
గాంచుతున్నవి.
క్రూరుడుగా
పుట్టిన
మానవుడు
పరమ
శాంతిస్వరూపుడుగా
జీవించటానికి
అవకాశముంటుంది.
దారులు
కొట్టి
దోచుకున్న
రత్నాకరుడుకూడను
వాల్మీకి
మహర్షిగా
మారుతూవచ్చాడు.
సద్బోధలచేత,
సత్ప్రవర్తనలచేత,
సత్సంగముచేత
మానవుని
సంస్కారము
అభివృద్ధి
గాంచుతుంది.
ఈనాడు
మానవునికి
సత్సంగము
అత్యవసరము.
మనము
చక్కని
ఆరోగ్యము
పొందవలెనన్న
దీనికి
రెండు
మార్గములు
అనుసరించాలి.
శారీరకమైన
ఆరోగ్యము
మనకు
అత్యవసరము.
లోపలనున్న
మాలిన్యాన్ని
బయటకు
పంపాలి.
బయటనున్న
పవిత్రమైన
పదార్థములను
లోపలికి
పంపాలి.
అప్పుడే
యీ
శరీరము
ఆరోగ్యాన్ని
పొందుతుంది.
అదే
విధముగా
మానసిక
ఆరోగ్యముకూడను
అత్యవసరము-
ఇక్కడ
మనసునందుండిన
దుర్గుణములు,
దురాలోచనలు,
దుష్ప్రవర్తనలు,
దుశ్చింతలు
అనే
మాలిన్యాన్ని
మనము
బయటకు
పంపాలి.
సద్గుణములు,
సదాచారములు,
సత్ప్రవర్తన,
సత్సంగము
అనే
పవిత్రమైన
వాటిని
లోపలకు
చేర్చాలి.
ఆగమార్థం
తు
దేవానాం
గమనార్థం
తు
రాక్షసాం
అన్నారు.
అనగా
ఓ
దేవతలారా
మాలో
ప్రవేశించండి.
ఓ
రాక్షసులారా
నాలో
వుండినవారు
బయటకు
పొండి
అనే
ప్రయత్నము
మనమీనాడు
చెయ్యాలి.
అదేవిధముగనే
హిరణ్యకశిపుని
కుమారుడైన
ప్రహ్లాదుడు
మహాభక్తుడు.
తండ్రి
హరిద్వేషి.
కుమారుడు
హరిప్రియుడు.
ఈ
రెండింటికి
సంబంధము
యేమాత్రం
లేదు.
పరస్పర
విరుద్ధమైన
దానిని
అనుభవిస్తూ
వచ్చారు.
హిరణ్యకశిపుడు
దేవుడులేడని
ప్రహ్లాదుడు
దేవుడు
కలడని.
ఎక్కడ
గలడనేటువంటి
ప్రశ్న.
ఇందుగలడందులేడను
సందేహము
వలదు
అని
ప్రహ్లాదుని
వాదన.
హిరణ్యకశిపుడొక
స్తంభమును
చూపించి
యిందులో
భగవంతుడున్నాడా
అని
ప్రశ్నించాడు.
కలడని
విశ్వసించాడు
ప్రహ్లాదుడు.
ఆ
స్తంభమును
బ్రద్దలుచేశాడు
హిరణ్యకశిపుడు.
నరసింహుడు
ప్రయత్నపూర్వకముగా
లభించాడు.
దీని
అంతరార్థమేమిటి?
మన
దేహమే
ఒక
స్తంభము.
ఈ
దేహభ్రాంతిని
మనము
బ్రద్దలు
చేసినప్పుడే
అందులో
దైవం
ఆవిర్భవిస్తాడు.
కాదయీనాడు
దేహభ్రాంతిని
మనము
దినదినము
అభివృద్ధి
గావించుకుంటూ
వస్తున్నాము.
ఈ
యింద్రియవాంఛలను
మనం
పోషించుకుంటూ
వస్తున్నాము.
కానియిట్టి
పరమభక్తుడైన,
పరిపూర్ణ
విశ్వాసము
కల్గిన
ప్రహ్లాదుడు
హరిని
ప్రేమిస్తూ
వచ్చాడు.
కాని
యిట్టి
పరమభక్తుడైన
ప్రహ్లాదునికి
కుమారుడు
పరమ
దుర్మార్గుడైన
వాడు
పుట్టాడు.
అతనే
విరోచనుడు.
ఈ
విరోచనుడు
నాస్తికుడు.
కాని
అట్టి
నాస్తికుడైన
విరోచనునికి
పుట్టినవాడే
యీనాడు
మనం
చేసుకున్న
పరమకథానిధి.
అతనే
బలిచక్రవర్తి.
ఈ
బలిచక్రవర్తి
ప్రహ్లాదుని
మనుమడు.
బలిచక్రవర్తి
పరమధార్మికుడు.
ప్రజలయొక్క
క్షేమసంతోషములను
తన
కంటిరెప్పవలె
కాపాడుతూ
వచ్చాడు.
ప్రజల
క్షేమమే
తన
క్షేమముగా
విశ్వసించిన
వ్యక్తి.
అట్టి
ప్రేమ
చక్రవర్తియే
ఆనాటి
రాజు.
అతని
కాలమంతయు
సుభిక్షంగా
సాగుతూ
వచ్చింది.
4
▾
Meaning
Keep
Also in his talks
(27)
5 October 1992
What man must seek is real, eternal happiness
23 November 1997
The God who fills everything is ‘I’
5 April 1998
Who can recognise the principle of Śrī Rāma
14 April 1998
God pervades all
26 September 1998
God Is the Very Foundation of the World
28 September 1998
The Five Elements Are the Very Forms of the Paramātma
11 October 1998
Human Life Is the Fruit of Our Resolves
21 November 1999
No sādhana greater than service
26 March 2001
The principle that is the root and base
23 November 2001
Self-confidence is the very stairway to Ānanda
25 December 2001
Though faiths differ, Mādhava is one
16 March 2003
The principle of Prema: the divine power of attraction
21 March 2004
I am you, you are I
11 April 2004
Truth itself is the form of God
15 April 2004
The principle of Prema is Divinity itself
17 October 2004
Develop the Feeling of the One Ātma
22 November 2004
Only When Oneness Is Experienced Does Human Birth Find Its Fulfilment
25 December 2004
Pray for the Sake of God's Prema
8 March 2005
Śivatva is the very consciousness in all beings
23 November 2005
All Are Embodiments of God
26 February 2006
All is full of Brahman
30 March 2006
See only good, do only good, be good
14 April 2006
Fix your mind on Divinity; place your trust in Oneness
2 May 2006
The body itself is the temple; you yourself are God
11 August 2006
Divinity is attained only through Prema for God
13 April 2008
The Name of Rāma is best; the thought of Rāma is enough
24 May 2008
Remembering the Name is the way across
ఎన్ని
సద్గుణములు
వుండినప్పటికిని
మానవునియందు
దుర్గుణములుకూడా
ప్రవేశిస్తూ
వుంటాయి.
ఎక్కడ
చూచినప్పటికిని
రాజ్యములోపల
బలి
చక్రవర్తి
పేరు
ప్రతిష్ఠలు
పెరుగుతూ
వచ్చాయి.
ఈ
కీర్తి
ప్రతిష్ఠలు
అనేక
విధములుగా
వ్యాప్తియైన
తక్షణమే
తనలో
అహంకారము
ప్రవేశించింది.
ఈ
అహంకారమే
మానవుని
అధఃపతనమునకు
ఒక
రాజబాట.
మానవుని
అహంకారమునకవకాశము
లేదు.
దేనిని
చూచి
అహంకారపడుతున్నాడు.
సర్వతఃపాణిపాదం
తత్సర్వతోక్షి
శిరోముఖం
సర్వతః
శ్రుతి
మల్లోకే
సర్వమావృత్య
తిష్ఠతి.
సర్వము
భగవంతుడే
అయినప్పుడు
దేనిని
చూచి
అహంకారము.
తాను
నిమిత్తమాత్రుడు
మాత్రమే.
తనది
దేహముకాదు.
తనది
మనసు
కాదు.
తనది
బుద్ధి
కాదు.
తనయొక్క
అంతః
కరణ
తనది
కాదు.
ఈ
సర్వముకూడను
ఆత్మయొక్క
ప్రతిబింబములే.
ఈనాడు
మనసు-మనసు-మనసు
దీనికి
యనేక
విధములైన
ప్రతిబింబములుంటున్నాయి.
వీటినే
మనో
అంశములని
పిలుస్తారు.
మనసు,
బుద్ధి,
చిత్తము,
అహంకారము
యీ
నాలుగు
మనసుయొక్క
ప్రతిబింబములే.
పేరుకు
నాల్గు
వుంటున్నవిగాని
అన్నిటియందు
మనసు
యేకత్వాన్ని
ధరించింది.
సంకల్పవికల్పములతో
వుండినప్పుడు
యిది
మనస్సని
పిలువబడుతుంది.
నిర్ణయాత్మకమైన
స్థితికి
వచ్చినప్పుడు
యిది
బుద్ధి
అని
పిలువబడుతుంది.
చింతించే
సమయములో
దీనికి
చిత్తము
అని
పేరు.
వ్యక్తిత్వాన్ని
వ్యక్తీకరించే
సమయములో
దీనినే
అహంకారమన్నారు.
ఒక
బ్రాహ్మణుడుంటాడు.
ఆబ్రాహ్మణుడు
ఒక్కడేగాని
వంటవానిని
వంట
బ్రాహ్మణుడని,
పూజచేసేవానిని
పూజారి
బ్రాహ్మణుడని,
పంచాంగము
చెప్పే
బ్రాహ్మణునికి
పంచాంగ
బ్రాహ్మణుడని
అంటారు.
ఇవన్నీ
వృత్తులను
బట్టి
వచ్చే
పేరులు.
అదే
విధముగనే
ఒకే
మనసుకు
తమ
వృత్తులను
బట్టి
పేర్లు
మారుతూ
వచ్చాయి.
సంకల్పములు
చేసే
సమయములో
దీనికి
మనసు
అని
పేరు.
సంకల్పవికల్పాత్మకం
మనః
అన్నారు.
మంచి
చెడ్డలయొక్క
నిర్ణయములోపల
ప్రవేశిస్తుంది
యీ
మనసే.
అప్పుడు
దీనిని
బుద్ధి
అన్నారు.
నిత్యానిత్యవిషయ
పరిశీలనా
జ్ఞానము
కల్గినది.
కనుకనే
యిది
బుద్ధి
అని
పిలువబడుతూ
వచ్చింది.
మానవుని
జీవితమంతయు
యీనాలిగింటిపైనే
ఆధారపడివుంటుంది.
అయితే
యీ
మనసు
యింద్రియములపైన
ఆధారపడివుంటుంది.
ఇంద్రియముల
భోగభాగ్యాలను
అనుభవించటానికి
మనసు
యిష్టపడుతుంది.
ఈ
యింద్రియములు
మనసుతోకూడిన
జీవితమే
సామాన్య
మానవత్వము.
ఇట్టి
మానవత్వమే
సుఖదుఃఖములతోకూడిన
జీవితము.
ఇంద్రియములయొక్క
భోగము
వుండినంతకాలము
మానవునికి
శాంతి
శూన్యమే.
ఇంద్రియముల
ప్రభావము
యేమాత్రం
లేకుండా
దూరం
చేసుకున్నప్పుడే
వానికి
శాంతి.
కనుక
మొట్టమొదట
మనం
చూసే
చూపులు
పవిత్రమైన
చూపులుగా
వుండాలి.
దృశ్యాన్ని
చూచి
కన్నులు
ఆనందిస్తాయి.
ఈ
ఆనందముచేత
మనసుకు
శాంతి
యేర్పడుతుంది
అట్లని
మనసు
ఆశించిన
దృశ్యాన్నంతా
చూడటానికి
ప్రయత్నించరాదు.
ఆ
విధమైన
పెడమార్గం
పట్టడంచేతనే
మనసు
మాలిన్యంగా
మారిపోతుంది.
5
▾
Meaning
Keep
చూడవలసినది
ఒక్కటే.
ఏకత్వమనే
దివ్యత్వాన్ని
మనం
చూడాలి.
అనేకత్వములో
వున్న
దివ్యత్వమైన
యేకత్వాన్ని
మనం
సందర్శించాలి.
ఈ
విధమై
దృశ్యాన్ని
మనము
అభివృద్ధి
పరచుకోవాలి
ప్రహ్లాదుడు
దేనిని
చూచినా
దివ్యత్వంగానే
చూచాడు.
లోపల
వెలుపల
చుట్టూ
సర్వముకూడను
దైవత్వముగానే
దర్శించాడు.
అలాంటి
మానవత్వాన్ని
మనం
అభివృద్ధి
గావించుకునే
నిమిత్తమై
బలిచక్రవర్తి
స్మృతి
నిమిత్తమై
యీనాడు
ఓణం
అనే
పవిత్రమైన
దినము
యేర్పడుతూ
వచ్చింది.
ఓణం
అనగా
దీనికి
మరొక
అర్థము
నూతన
వస్త్రములు
ధరించటమని:
తెల్లవారి
లేచిన
తక్షణమే
అభ్యంగన
స్నానము
చేసి
నూతన
వస్త్రములు
ధరించి,
టెంకాయ
ఆకులు
తీసుకొని
వచ్చి,
కొబ్బరి
ఆకులలోపల
పాయసం
పెట్టి
ఆనందముగా
భుజించటం
ఓణంయొక్క
అంతరార్థము.
కానీ
ఆహార
విహారములతోనే
మనయొక్క
పర్వదినములను
అపవిత్రంగావించరాదు.
కారణమేమనగా
బలిచక్రవర్తి
ప్రజల
ప్రీతిని
చూరగొన్నాడు.
అలాంటి
ప్రభువును
కోల్పోవటంచేత
ప్రజలు
చాలా
దుఃఖిస్తూ
వచ్చారు.
తల్లి
బిడ్డలను
కాపాడుతూ
వస్తున్న
ప్రభువు
వారికి
దూరం
కావటంచేత
ప్రజలు
వియోగాన్ని
భరించుకోలేకపోయారు.
ప్రజలందరు
చాలా
దుఃఖిస్తూ
వచ్చారు.
వారి
దుఃఖమును
చూచిన
రాజు
యీ
బలిచక్రవర్తి
ప్రతి
సంవత్సరంకూడను
మీ
నిమిత్తమై
నేను
వస్తుంటానని
ప్రామిస్
చేశాడు.
కనుక
ప్రజలయొక్క
క్షేమాన్ని,
ప్రజలయొక్క
ఆనందాన్ని,
ప్రజలయొక్క
సౌఖ్యాన్ని
ఆశించి
కోరిన
చక్రవర్తియొక్క
దినమే
యీనాటి
పర్వదినము.
ఆనాటి
ప్రజలు
ఆవిధమైన
ప్రభుభక్తి
కల్గివుండేవారు.
ఆనాటి
ప్రభువుకూడను
ప్రజల
ప్రీతిని
చూరగొన్నవారు.
ఈనాటి
ప్రజలు
ప్రభువుల
మధ్య
యీ
విధమైన
సన్నిహిత
సంబంధ
బాంధవ్యములు
యెక్కడ
చూసినా
కన్పించటము
లేదు.
ఈనాటి
ప్రజలు
స్వార్థము
స్వప్రయోజన
నిమిత్తమై
అహంకారములో
తమ
జీవితాన్ని
వ్యర్థము
గావించుకుంటున్నారు.
ఈనాటి
ప్రభువులుకూడను
తమ
స్వార్థము
స్వప్రయోజనము
నిమిత్తమై
తమ
స్థానం
సంపాదించుకోటానికి
ప్రాకులాడుతున్నారు.
ప్రభువులయందుగాని
ప్రజలయందు
గాని
స్వార్థం
పెచ్చుపెరిగిపోయింది.
కనుకనే
దైవత్వం
శూన్యంగా
కనుపిస్తున్నది.
దివ్యత్వం
లేకపోతే
మానవత్వం
వ్యర్థమని
గుర్తించటానికి
ప్రయత్నించాలి.
ఇవన్నీకూడను
క్షణభంగురాలు.
ఈ
క్షణికమైన
యింద్రియ
సుఖములకై
మన
జీవితాన్ని
వ్యర్థము
గావించరాదు.
ఈయింద్రియానందమును
యెంత
మనము
పొందినప్పటికి
అది
తనివి
తీరేది
కాదు.
అగ్నిలో
కట్టెలు
వేయుకొలది
అగ్ని
మరింతగా
ప్రజ్వరిల్లుతుందేగాని
ఆరిపోటానికి
ప్రయత్నించదు.
కనుక
వాంఛలు
పెరుగుకొలది
మరింత
వానికి
బంధన
యేర్పడుతుందేకాని
వానికి
మోక్షమనేదికాని,
శాంతికాని
చేకూరదు.
కనుకనే
మనము
యీనాడు
క్రమక్రమేణా
యీ
వాంఛలను
తగ్గించుకుంటూ
రావాలి.
ఈ
వాంఛలను
మనమెంత
తగ్గించుకొందుమో
అంత
శాంతి
మనలో
యేర్పడుతుంది.
Less
Luggage
more
comfort.
మన
బాధలు,
మన
కష్టములు,
మన
దుఃఖములు
మన
భ్రాంతులచేతనే
అభివృద్ధి
అవుతున్నాయి.
మన
అశాంతికి
మన
కోరికలే
మూలకారణము.
6
▾
Meaning
Keep
ఈ
కోరికలయొక్క
ఫలితమే
కర్మలయొక్క
ప్రభావము.
ఈ
కర్మలయొక్క
ఫలితమే
మన
సుఖదుఃఖములు.
కనుక
మంచికర్మలను
మనము
ఆచరించాలి.
అందువలననే
వుపనిషత్తులంతాకూడను
తస్మై
నమఃకర్మణా.
కర్మమునకు
నేను
మొదట
నమస్కారం.
మన
సుఖదుఃఖములు
దైవం
కారకుడు
కాడు.
కర్మాధికారి
నీవు.
కర్మఫలప్రదాత
దైవము.
ఎలాంటి
విత్తనము
నాటుకొందువో
అలాంటి
ఫలమే.
కనుక
నీవు
మంచి
మొక్కను
నాటుకుంటే
మంచి
ఫలములే
వస్తాయి.
కనుక
మనము
పవిత్రమైన
కర్మలలో
ప్రవేశించాలి.
వ్యక్తి
సక్రమమైన
మార్గములో
నడచినప్పుడే
కుటుంబములో
శాంతి
వుంటుంది.
ఈవ్యక్తిత్వము
పవిత్రమైనప్పుడే
సమాజము
పవిత్రమైనదిగా
రూపొందుతుంది.
ఈ
సమాజము
పవిత్రమైనప్పుడే
మనం
యొక్క
దేశము
పవిత్రముగా
మారుతుంది.
దేశము
పవిత్రముగా
వుండినప్పుడే
యీ
ప్రపంచమంతా
పవిత్రముగా
వుంటుంది.
కనుక
మొట్టమొదట
వ్యక్తిత్వమనే
దాంట్లో
పవిత్రత
వుండాలి.
ఈ
పవిత్రము
యెప్పుడు
యేర్పడుతుంది.
లోపల
వున్న
మాలిన్యములు
రెండు.
స్వార్థము,
అహంకారము
ఈ
రెండింటిని
మనము
వెలుపల
పారవేయాలి.
కేవలము
వెలుపల
పారవేసినంత
మాత్రమున
చాలదు.
బయట
వున్న
ప్రేమ,
సహనము,
సానుభూతి,
పవిత్రాన్ని
లోపల
చేర్చాలి.
జీవితము
దివ్యమైన
జీవితముగా
రూపొందాలి.
ఆదర్శవంతమైన
రూపముగా
మారాలి.
మన
జీవితం
జీవిస్తున్నాము.
పశుపక్షిమృగాదులవలె
మనం
భుజిస్తున్నాము.
పశుపక్షిమృగాదులవలె
మనము
యింద్రియములయొక్క
ఆనందాన్ని
అనుభవిస్తున్నాము.
ఎక్కడ
మన
పవిత్రత.
ఎప్పుడు
చూచినా
పరులను
నిందించటము
పరులను
విమర్శించటము
పరుల
సుఖము
చూచి
ఓర్వలేకపోవటము.
తన
సౌఖ్యానికి
తను
అహంకారముగా
వుఱ్ఱూతలూగటం
యీ
విధమైన
పశుత్వమే
మానవుని
అధఃపతనము
గావిస్తుంది.
మనసునందు
ఒకటి
మాటయందు
మరొకటి.
ఇదే
మానవత్వాన్ని
పూర్తినిర్మూలంగావిస్తుంది.
ఈనాడు
మానవత్వముందా.
మానవుడుగా
కన్పిస్తున్నాడేగాని
మానవత్వం
శూన్యమైంది.
ఎక్కడకూడా
కన్పించటంలేదు.
ఎక్కడ
చూచినప్పటికినీ
స్వార్థము,
స్వార్థము,
స్వార్థము.
స్వప్రయోజనము.
ఇది
తరతరములనుండి
వేళ్లు
పాకిపోయినవి.
ఈ
హృదయములోపల
పాతుకొనిపోయిన
యీ
స్వార్థాన్ని
పీకి
పారవేయాలి.
మనకు
శాంతము
త్యాగమునందే.
త్యాగమునందే
మనకు
ఆనందము.
త్యాగమే
మనకు
అభయము.
కారణమేమనగా
మనకు
ఆశలుండినంతవరకు
మనకు
చాలా
బాధలే.
చాలా
భయమే.
త్యాగము
చేసినప్పుడు
అభయము.
ఎట్టి
భయముండదు.
అందువలననే
వేదము
నకర్మణా
నప్రజయా
ధనేన
త్యాగేనైకే
అమృతత్వ
మానసు
అన్నారు.
త్యాగములో
వుండిన
ఆనందము,
భోగములో
వుండిన
దుఃఖము
మనము
చక్కగావిచారణచెయ్యాలి.
త్యాగములో
చేసిన
యోగముకూడను
ఒక
భోగముగా
మారుతుంది.
కర్మయందు
అహంకారము,
ఫలమునందాసక్తి
యీ
రెండూ
వదలితే
అదే
త్యాగము.
అదే
యోగము.
మనం
చేసే
కర్మలయందు
అహంకారాన్ని
మనం
అభివృద్ధి
గావించుకోరాదు.
ఇది
నేను
చేసిన
కర్మ
దీని
ఫలితము
నాకే
లభించాలి
అనే
స్వార్థంకూడా
వుండకూడదు.
నీవు
ఒ
చెట్టును
నాటవచ్చు.
7
▾
Meaning
Keep
కానీ
ఆ
ఫలితము
నీకే
లభిస్తుందనే
నమ్మకము
యేమిటి?
నీవు
కొన్ని
నెలలో
మరణించవచ్చు.
కానీ
ఆ
చెట్టులోని
ఫలములు
కొన్ని
సంవత్సరాలకు
నీ
మనుమలు,
కొడుకులు
వచ్చి
భుజించవచ్చు.
కనుక
ఆ
ఫలితము
నీకే
లభించాలని
యేమాత్రం
శాసనం
లేదు.
చేయటమే
నీ
కర్తవ్యము.
కర్తవ్యం
యోగ
ముచ్యతే.
అదే
నిజమైన
యోగము.
కనుకనే
మనము
పవిత్రమైన
కర్తవ్యములు
నిర్వర్తించాలి.
అదే
బలిచక్రవర్తి
చేసిన
మహాత్యాగం.
గురువైన
శుక్రాచార్యుడు
బలి
చేసే
త్యాగాన్ని
అడ్డగించాడు.
చక్రవర్తీ
వచ్చినవాడు
సామాన్యుడుకాడు.
సాక్షాత్తూ
నారాయణుడే
యీ
రూపం
ధరించివచ్చాడు.
అతను
నిన్ను
పరీక్షించే
నిమిత్తమై
వచ్చాడు.
దానికి
బలిచక్రవర్తి
ఆనందించాడు
గురూజీ
సాక్షాత్తు
నారాయణమూర్తే
నావద్దకు
వచ్చి
చేయి
చాచినప్పుడు
నా
చేయి
అతని
చేయి
పైన
పెట్టటం
నాకు
యెంత
అదృష్టము
అన్నాడు.
అదృష్టమనగా
అడిగే
వాని
చేయి
క్రింద
వుంటుంది.
ఇచ్చే
వాని
చేయి
పైన
వుంటుంది.
కనుక
అక్కడ
తన
త్యాగము
ఉన్నతస్థాయిలో
వుంది
అన్నాడు.
కానీ
యీ
బలి
చక్రవర్తి
వినే
స్థితిలో
లేడని
గుర్తించాడు
శుక్రాచార్యుడు.
సూక్ష్మరూపుడై
కలశరంధ్రానికి
అడ్డు
నిలచాడు.
సర్వజ్ఞుడైన
వామనమూర్తి
యీ
శుక్రాచార్యుడు
చేస్తున్న
ట్రిక్
గుర్తించాడు.
ఈ
చేసే
దానానికి
అడ్డు
తగిలేవాడు
మహాపాపి.
తాను
పెట్టకున్న
తగవు
పుట్టదుగాని
ఒరులు
పెట్టుటచూచి
ఓర్వలేరు
దాత
దగ్గర
చేరి
తనముల్లె
పోయినట్టు
జిహ్వతో
చాడీలు
చెప్పుచుంద్రు.
ఇట్టి
వారిని
యేమని
పిలవాలి
అని
ప్రశ్నించుకున్నాడు.
త్యాగము
చేసేవారికి
అడ్డు
తగిలేవారికి
యేమని
పిలవాలి
అని
యోచించుకున్నాడు.
భిక్షుకు
శత్రువు
అని
పేరు
పెట్టవలెనని
నిర్ణయించుకున్నాడు
బెగ్గర్కు
శత్రువు
యెవరు.
అన్నం
అడుక్కోటానికి
పోతాడు.
అక్కడ
యేదైనా
పెడితే
కాచుకుని
వుంటాయి
కుక్కలు.
కనుక
కుక్కలే
యీ
దానము
చేసేవానికి
అడ్డు
తగిలేవారు.
ఈ
యుక్తిని
గుర్తించిన
వామనమూర్తి
ఒక
చిన్న
పుల్ల
తీసుకొని
పొడిచాడు
అడ్డు.
అప్పుడు
శుక్రాచార్యుని
ఒక
కన్ను
పోయింది.
అతని
పేరే
శుక్రాచార్యుడు.
కారణమేమనగా
అతడు
మహాగురువు.
గురువు
సర్వ
ధర్మము
బోధించేవాడు.
సర్వధర్మములు
బోధించే
గురువు
దానమున
కడ్డు
తగలటం
చాలా
చెడ్డది
కదా.
బోధనలో
మాత్రం
గురువుగా
వున్నాడు.
ఆచరణలో
మాత్రం
గుడ్డిగా
వున్నాడు.
కనుక
రెండు
విధములైన
చర్యలలో
తాను
పాల్గొంటున్నాడు.
చెప్పటం
మాత్రం
చెబుతున్నాడు
కాని
చేయుటం
లేదు.
అందువల్లనే
A
man
with
a
dual
mind
is
half
blind
అన్నారు.
మనం
ఒకే
mindగా
వుండాలి.
రెండు
విధములైన
మనసులుగా
వుండరాదు.
కనుక
మనం
చేయవలసినదేదో
యివ్వవలసినదేదో,
చూడవలసినదేదో,
చెప్పవలసినదేదో
అది
హృదయపూర్వకముగా
చెయ్యాలి.
చక్కగా
బుద్ధితో
విచారణ
చేసి
పవిత్రమైనవే
చేయాలి.
పవిత్రమైనవే
నీవు
చూడాలి.
పవిత్రమైనవే
నీవు
చెప్పాలి.
8
▾
Meaning
Keep
భగవంతునికి
లైఫ్
యివ్వటానికైనా
సిద్ధముగా
వుండాలి.
అలాంటి
సర్వసంగ
పరిత్యాగియైనవాడే
యీ
బలిచక్రవర్తి.
తనకు
సర్వస్వము
వుంది.
తనకు
యే
కొదవా
లేదు.
సుఖమునందుగాని
ధనమునందుగాని,
భోగభాగ్యములందు
గాని
యే
విధమైన
కొరత
లేదు.
సర్వమూ
వుండి
త్యాగము
రావటం
చాలా
అదృష్టము.
శ్రీమంతులకు
త్యాగం
రాదు.
అలాంటివారు
మరింత
పిసినారులుగా
మారుతారు.
లోభులుగా
రూపొందుతారు.
కాని
బలిచక్రవర్తి
త్యాగిగా
మారిపోయాడు.
ఇలాంటి
త్యాగానికే
యింత
గొప్ప
కీర్తి
వచ్చింది.
మంచిలోకూడను
చెడ్డ
పుడుతూ
వుంటుంది.
వారి
వంశమంతా
రాక్షసవంశం.
రాక్షసవంశములోకూడను
ప్రహ్లాదుడు,
బలిచక్రవర్తి
పరమభక్తులు
జన్మించారు.
బురదలోకూడను
మంచి
మంచి
పవిత్రమైన
కమలములు
పుడుతూ
వస్తుంటాయి.
నీటియందే
మంచి
చెడ్డలు
వుద్భవిస్తాయి.
మనిషిని
ఆకర్షించే
కమలములు
ఉద్భవిస్తాయి.
మనిషిని
పీల్చి
పిప్పిచేసే
జలగలు
కూడను
అందులోనే
ఉద్భవిస్తాయి.
కనుక
మానవునియందుకూడను
పవిత్రులు,
అపవిత్రులుకూడా
వుంటున్నారు.
పవిత్రులు
మరింత
ఉత్తమోత్తమ
పవిత్రులు
కావాలి.
అపవిత్రులు
పవిత్రములోనికి
ప్రవేశించాలి.
ఇదే
ఆదర్శవంతమైన
జీవితము.
మహానీయుల
చరిత్రలన్నియూకూడను
ఒక
ఆదర్శాన్ని
నిరూపిస్తూ
వచ్చాయి.
వారు
ఆచరించిన
ఆచరణలు
మనం
ఆదర్శముగా
తీసుకోవాలి.
అలాగే
బలిచక్రవర్తి
యీ
రోజు
దర్శనమిచ్చిన
రోజని,
వామనమూర్తి
అవతారమెత్తిన
దినమని
మనము
యేదో
పండుగలు
చేసుకున్నంత
మాత్రమున
ప్రయోజనములేదు.
వామనమూర్తియొక్క
పవిత్రమైన
గుణములు,
పవిత్రమైన
బలిచక్రవర్తియొక్క
త్యాగము
మనలో
ఆవిర్భవించాలి.
ఆ
విధముగా
ఆవిర్భవించినప్పుడే
ఆ
ప్రభువుకు,
ప్రజలకు
సన్నిహిత
సంబంధ
బాంధవ్యమేర్పడిపోతుంది.
అలాంటి
ప్రభువులు,
అలాంటి
ప్రజలు
ఆనాడు
జగత్తులో
వుండేటువంటివారు.
కానీ
యీనాటి
మానవుని
దృష్టి
మంచిని
చెడ్డగా
చెడ్డను
మంచిగా
భావిస్తుంటారు.
ఒక
చిన్న
కథ.
మహారాజు
ఒకనాడు
అభ్యంగనస్నానం
ఆచరించాలని
సంకల్పించుకున్నాడు.
మహారాజు
సర్వకార్యములుకూడను
మహారాణియే
చేసేటువంటిది
ఆరోజులలో
ఈనాటి
శ్రీమంతులంతా
టేబుల్
ముందు
కూర్చుంటే
వంటవాళ్లే
వచ్చి
వడ్డించాలి.
భార్య
ముట్టుకోదు.
కాని
ఆనాడు
భార్యనే
భర్తకు
వడ్డించాలి.
రాణి
అయినాకూడను
రాజుకు
తానే
కొలువుల
చెయ్యాలి.
ఆనాడు
రాణి
యింత
తైలము
చేతిలోనికి
తీసుకుని
మహారాజుకు
అభ్యంగనస్నానము
ఆచరించే
నిమిత్తము
తల
అంటుతూ
వుంది.
ఆమె
తల
అంటుతూ
వుంటే
తలలోపల
యెక్కడో
రెండు
తెల్ల
వెంట్రుకలు
కన్పించాయి
ఆమెకు.
ఆమెకు
విచారం
అధికమైపోయింది.
రాజుగారు
వృద్ధులౌతున్నారు.
జీవితము
దినదినమునకు
తరిగిపోతోంది.
క్షణక్షణమునకూ
యీ
దేహప్రమాణమనేది
తరిగిపోతోంది
అని
తలంటుతూ
తాను
కంటి
నీరు
తుడుచుకుంటూ
వుంది.
ఈ
మహారాజుగారి
గృహము
చుట్టూ
అద్దాలతో
వుండేవి
ఆనాటి
రాజమందిరాలు
తలంటుకుంటున్న
రాజు
ఆమె
కంటినీరు
తుడుచుకోటం
అద్దములో
చూచాడు.
9
▾
Meaning
Keep
అప్పుడు
ప్రశ్నించాడు
రాజు
ఎందుకు
నీవు
కంటిధారలు
కారుస్తున్నావని.
ఆమె
చెప్పటానికి
యేమాత్రం
ధైర్యం
లేక
తాను
కొంత
సందేహిస్తూ
వచ్చింది.
కడపటికి
రాజుయొక్క
వత్తిడిచేత
ఆమె
చెప్పింది.
తమకు
దినదినమునకు
వయసు
పెరిగిపోతున్నది.
ఎంతకాలము
జీవిస్తాము
మనము
యీ
జగత్తులోపలని
తమయొక్క
జీవితము
నిమిత్తమై
నేను
యోచించాను
అన్నది.
ఈ
విషయం
తెల్సిన
తక్షణమే
రాజుకుకూడా
తీవ్రమైన
వైరాగ్యము
పుట్టింది.
ఎంత
కాలం
మనమవిధముగా
భోగభాగ్యాలలో
జీవించటం.
తినటము,
తిరగటము,
నిద్రించటము,
అనుభవించటము
యింతేనా
మన
జీవిత
లక్ష్యము.
చాలు
చాలు
యింక
మన
జీవితానికి.
యింక
మిగిలిన
శేషజీవితాన్ని
దైవ
చింతనతో
మనము
సార్థకము
చేసుకుందామనుకున్నాడు.
ఇద్దరు
అప్పటికప్పుడే
అనుకున్నారు.
మంత్రులను
పిలిపించారు.
రాజ్యము
వారికి
అప్పజెప్పారు.
ఇద్దరూ
అరణ్యానికి
వెళ్లారు.
ఇరువురూ
పోయేటప్పటికి
ప్రజలు
యిలాంటి
పవిత్రమైన
రాజులు
మాకు
చిక్కరు
ఇలాంటి
రాజులనంతా
మనము
దూరము
చేసుకుంటున్నామే
అని
వారుకూడను
అరణ్యానికి
వెళ్లారు
ప్రార్థించారు
రాజును
మీరు
లేకపోతే
మేము
ఆ
రాజ్యములో
జీవించలేమని
ప్రజలు
చాలా
మొరపెట్టుకున్నారు.
ఎందుకోసం
మీరు
రాజ్యం
వదలిపెట్టి
వచ్చారు
ప్రజలపైన
యేమైనా
విరక్తి
కలిగిందా,
ప్రజలెవరైనా
మిమ్మల్ని
బాధపెట్టారా
ప్రజలెవరైనా
మిమ్ము
నిందించారా
దీనికి
కారణం
చెప్పమని
ప్రార్థించారు.
మహారాజు
అతి
శాంతముతో
ప్రేమతో
ప్రజలను
దగ్గరకు
పిలచి
నాయనా!
యేదో
కొంతకాలము
మిమ్మల్ని
యేలినాము.
మిమ్మల్ని
అన్ని
విధాలా
ఆదరించాము.
నా
కర్తవ్యము
నిర్వర్తించుకున్నాను.
శేష
జీవితాన్ని
దైవప్రార్థనతో
సార్థకం
చేసుకోవాలని
అన్నాడు.
ఇంకా
యెంతకాలము
బ్రతకగలను.
యెప్పుడో
యేమో.
ఈ
శరీరము
దినదినమునకు
కృశించిపోతోంది.
ఈ
మాట
వినేటప్పటికి
ఒకతూరి
గొల్లున
యేడ్చారు.
ఈ
ప్రజలుకూడను
ఒక
వైపునకు
పోయి
తపస్సు
చేస్తూ
కూర్చున్నారు.
ఒకనాడు
బ్రహ్మ
ప్రత్యక్షమయ్యాడు
ప్రజలకు.
ప్రజలారా
మీ
కేమి
కావాలని
ప్రశ్నించాడు.
స్వార్థరహితమైన
ప్రజలానాడు
స్వామీ!
మా
రాజుకు
దీర్ఘాయువు
అనుగ్రహించండి
అని
ప్రార్థించారు.
తథాస్తు
అన్నాడు
బ్రహ్మ.
ఈ
ప్రజలు
గంతులు
వేసుకుంటూ
వెళ్లి
మహారాజుకు
చెప్పారు.
మీకు
యింకా
యెంతో
ఆయువు
అందించాడు
బ్రహ్మ.
మీరు
చిరంజీవిగా
వుంటారు.
దీర్ఘాయుష్మంతులుగా
వుంటారు.
కాబట్టి
మీరు
రాజ్యానికి
రావాలి
అని
ప్రార్థించారు.
రాజు
బయలుదేరాడు.
రాజ్యానికి
వస్తున్నాడు.
కాని
రాణి
నేను
రాను
నేను
యిక్కడే
వుంటాను
అంది.
అప్పుడు
ప్రజలు
కొంత
తప్పు
అర్థము
చేసుకున్నారు.
మేము
బ్రహ్మను
మా
మహారాజు
దీర్ఘాయుష్మంతుడు
కావాలని
అడిగాము
కాని
మహారాణికి
మేము
అడుగలేదు.
అందువలన
ఆమెకు
కోపం
వచ్చిందేమోనని
భావించారు.
ఆ
రాణి
అటువంటిది
కాదు
విశాలమైన
హృదయము
కలది.
సరే!
మాకు
రాజు
కదా
ప్రధానమనుకున్నారు
ప్రజలు
రాజు
వచ్చారు.
ఆమె
తపస్సు
దీర్ఘంగా
చేసింది.
ఆమెకుకూడా
బ్రహ్మ
ప్రత్యక్షమయ్యాడు.
అమ్మా
నీవు
దేనిని
ఆశిస్తున్నావు
నీకేమి
కావాలి
అని
ప్రశ్నించాడు.
10
▾
Meaning
Keep
స్వామీ
మీరు
రాజుకు
దీర్ఘాయువు
యిచ్చినది
నిజమేనా,
రాజు
మాత్రం
దీర్ఘాయువుగా
వుండి
రాజును
ప్రేమించే
ప్రజలకు
దీర్ఘాయువు
లేకపోతే
అలాంటి
రాజు
వుండి
ప్రయోజనమేమిటి
కనుక
నా
ప్రజలకుకూడా
దీర్ఘాయువు
అనుగ్రహించండి
అంది
ప్రజలు
పవిత్రులైనవారుగా
వుండినప్పుడే
ప్రభువుకూడను
పవిత్రుడు,
దీర్ఘాయువుగా
వుండాలి
ప్రజలకు
లేని
దీర్ఘాయువు
రాజుకుండి
ప్రయోజనమేమిటి?
ప్రజలు,
ప్రభువు
దీర్ఘాయులుగా
వుండాలని
ఆశీర్వదించమని
కోరింది.
అప్పుడు
యీమె
చేసిన
త్యాగానికి
బ్రహ్మ
ప్రభువు,
ప్రజలు,
నీవు
దీర్ఘాయుష్మంతులై
వుందురుగాక
అని
ఆశీర్వదించాడు.
మనము
త్యాగము
చేయుకొలది
మనకు
భోగములు
మరింత
అధికమవుతూ
వస్తాయి.
ఏ
భోగములు?
దివ్యమైన
భోగములు.
అదే
మనయొక్క
జన్మము.
శృణ్వంతు
పుత్రే
అమృతస్య
పుత్రాః.
మనం
అమృత
పుత్రులు
కావాలి.
అనృత
పుత్రులు
కాకూడదు.
మన
హృదయాన్ని
క్షీరసాగరంగా
మార్చుకోవాలి.
క్షారసాగరంగా
మార్చుకోరాదు.
విశాలమైన
హృదయంగా
మనము
అభివృద్ధిపరచుకోవాలి.
సంకుచిత
భావాలు
చేర్చుకోరాదు.
అప్పుడే
నారాయణుడు
మన
హృదయంలో
నివాసం
చేస్తాడు.
అతనినే
క్షీరసాగరశయనుడు
అన్నారు.
క్షీరసాగరుడంటే
యేమిటి?
నీయొక్క
పవిత్రమైన
హృదయములో
తాను
పవళించి
వుంటున్నాడు
అతనే
మహావిష్ణువు.
భగవంతుని
నివాసమైన
యీమనసును
అపవిత్రమైన
దుర్గుణాలకు
నివాసం
చేసుకోటం
యెంతటి
అపవిత్రము.
ఈ
దుష్టగుణములను,
దుష్టభావములను,
దుష్టసంకల్పములను
మనము
తుడిచి
పారవేయాలి.
పవిత్రమైన
భావాల్ని
చేర్చుకోవాలి.
నిస్వార్థమైన
ప్రేమను
నింపుకోవాలి.
నిర్మలమైన
భావాన్ని
పెంచుకోవాలి.
మన
జీవితాన్ని
భగవంతునికి
త్యాగం
చేయాలి.
అదే
యీ
బలిచక్రవర్తి
చేసిన
పవిత్రమైన
కర్మ
నాటిమొదలు
నేటివరకు
కేరళ
రాజ్యములోపల
యీ
పవిత్రమైన
భావములచేత,
ఉత్తేజమైన
భక్తిశ్రద్ధలచేత
యీ
పండుగ
ఆచరిస్తూ
వస్తున్నారు.
కేరళ
దేశం
చాలా
పవిత్రమైనది
ప్రకృతి
సౌందర్యముతో
తులతూగుతుండేది.
నిరంతరము
కళకళలాడుతూ
కిలకిల
నవ్వుతుండేది.
ఈ
ప్రకృతి
సౌందర్యమంతా
పచ్చనితోరణంగా
వుంటుంది.
యెక్కడ
చూచినప్పటికి
చాలా
సౌందర్యమైన
ప్రకృతిగా
రూపొందుతుంది.
ఆ
సౌందర్యమనేది
భగవంతుని
స్వరూపము.
కనుక
God
is
beauty,
Beauty
is
god
అందువల్లనే
కేరళ
రాజ్యములోపల
మూడు
అవతారములొచ్చినవి.
భగవంతుడు
సాక్షాత్తు
అవతరించటానికి
అది
ఒక
పవిత్రస్థానము.
ఇలాంటి
పవిత్రమైన
స్థానములను
మనము
పవిత్రమైన
భావములతో
సార్థకం
గావించాలి.
కేరళలోపల
భక్తి
ప్రపత్తులు
చాలా
మెండు.
రాజకీయ
మార్గములో
కొన్ని
అటూ
యిటూ
మార్పులు
వచ్చినప్పటికిని
ప్రతి
వ్యక్తియందు
ఒక
దివ్యమైన
భావం
వారిలో
ఆవిర్భవిస్తూ
వుంటాయి.
సంస్కృతికి
సంస్కారమునకు
పుట్టినిల్లు
కేరళ.
ఏదో
కొంతమంది
వుండవచ్చును.
కానీ
కేరళలోపల
ఆధ్యాత్మిక
చిత్తమనేది
వారియొక్క
స్వభావము.
ఎలాంటి
నాస్తికుడైనా
కూడను
యేదో
తనకు
తెలియకుండానే
దైవాన్ని
అనుకొంటూ
వుంటాడు.
ఈ
విధముగా
దైవాన్ని
స్మరిస్తూ
వుంటాడు.
11
▾
Meaning
Keep
బయట
దైవము
లేడని
ఉచ్చరిస్తూ
వుంటాడు
కాని
లోపల
దైవాన్ని
చింతిస్తూ
వుంటాడు
కనుక
కేరళ
రాజ్యము
యిలాంటి
పవిత్రమైన
ఆధ్యాత్మిక
శక్తిచేతను
వాతావరణముచేతను
కూడిన
క్షేత్రము.
కానీ
రాజకీయ
మాలిన్యముచేత
క్రమక్రమేణా
యిలాంటి
పవిత్రతంతా
దిగజారిపోతోంది.
కాని
కేరళ
ప్రజలు
అనాదికాలమునుండి
అభివృద్ధి
గావించుకొన్న
ఆధ్యాత్మిక
తత్వాన్ని
మీరు
అభివృద్ధి
చేసుకుంటూరావాలి.
ఎట్టి
పరిస్థితులయందైనా
మీ
విశ్వాసము
కోల్పోరాదు.
అది
తరతరములనుండి
వచ్చిన
సాంప్రదాయము.
అదే
సంస్కారము.
అదే
మనయొక్క
పవిత్రమైన
ధనము.
ఆ
ధనము
తరిగేటువంటిది
కాదు.
ఆ
ధనము
కరిగేదికాదు.
క్రమక్రమేణా
పెరిగేదే.
కేరళ
ప్రజలారా!
మీరు
యీ
ఆధ్యాత్మిక
చింతను
క్రమక్రమేణా
అభివృద్ధి
గావించుకొని
ప్రచారప్రబోధలచేత
సర్వులకు
ఆదర్శాన్ని
అందిస్తూ
ఆనందించాలని
ఆశీర్వదిస్తూ
నా
ప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
Previous
←
Man's good and bad rest on his own saṅkalpas
Next
Humanness is the blended form of Vijñāna, Prajñāna and Sujñāna
→