Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1988 · All Good Qualities Are Contained in Bhakti
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
All Good Qualities Are Contained in Bhakti
3 May 1988
1
▾
Meaning
Keep
సంతోషము
తాత్కాలికము,
ఆనందము
శాశ్వతము
హృదయము
ఆనందముతో
కూడినటువంటిది.
దేహభ్రాంతితో
నీవు
దానిని
మూత
వేస్తున్నావు.
అప్పుడు
నీకు
ఆనందము
కలిగించడంలేదు.
ఒక
చిన్న
ఉదాహరణము.
పగలంతాకూడను
సూర్యుని
వెలుతురు
ఉంటున్నాది
కనుక
బల్బు
స్విచ్
వేయటంలేదు.
కాని,
కరెంటు
ఉంటున్నాది.
రాత్రి
చీకటి
కాగానే
బల్బు
స్విచ్
వేసేటప్పటికి
లైటు
వచ్చింది.
బల్బువుంది,
కరెంటువుంది,
స్విచ్
వేయకపోవటంచేత
లైటు
రాలేదు.
స్విచ్
వేయనంతమాత్రమున
కరెంటు
లేదనడానికి
వీలులేదు.
అదే
విధముగా
నీవు
ప్రపంచవాంఛలతో
వుండినపుడు
దైవవాంఛ
అనే
స్విచ్
ఆఫ్
చేస్తున్నావు.
కష్టములు,
నష్టములు
అనే
చీకటి
ఆవరించినప్పుడు
‘దేవుడా!’
అని
స్విచ్
వేస్తున్నావు.
కాబట్టి,
కరెంటు
మాదిరి
ఆనందము
ఎల్లప్పుడు
వుంది.
కాని,
నీవు
దానిని
అనుభవించడానికి
ప్రయత్నించడంలేదు.
ఒక
చిన్న
ఉదాహరణము.
నీకు
ఆకలి
కలుగుతున్నది.
రెండు
చపాతీలు
తింటే
నీకు
సంతోషము
కలుగుతుంది.
ఈ
సంతోషము
ఎంతకాలముంటున్నది?
నీకు
మరల
ఆకలి
కలగనంతవరకు
ఉంటున్నది.
ఆకలి
కలగగానే
సంతోషము
పోతుంది
మరల
తినగానే
సంతోషము
వస్తుంది.
కాబట్టి
ఈ
సంతోషమనేది
పోవటం,
రావటం
జరుగుతుంది.
కనుక
దీనిని
తాత్కాలికము
అన్నారు.
కాని
ఆనందమనేది
శాశ్వతము.
మానవత్వము
దివ్యత్వములో
ఇమిడియుంటున్నది
శరీరానికి
కుడిఎడమలు
అనగా
రైటు,
లెఫ్ట్
అను
విధములుగా
వుంటున్నవి.
అనగా
రైటును
ఫాలో
అవ్వాలి,
లెఫ్ట్‌ను
విడిచిపెట్టాలి.
అందుకోసమనే
రామదాసు
చెప్పాడు.
‘అడుగు
దాటనివ్వను,
నా
రెండు
చేతులను
ఒక్కటిగా
చేశాను.
ఇందులో
రైటులెఫ్ట్లు
లేవు.
నా
గుణములను
ఏకము
చేశాను’.
రామదాసు
అనేక
పాటలను
రాశాడు.
‘స్వామీ!
నేను
ఏది
హృదయముతో
చేశానో,
ఏది
హృదయములేక
చేశానో
తెలియదు.
ఒక్కొక్కతూరి
నా
మనసంతా
అందులో
లీనమైపోతున్నాది.
2
▾
Meaning
Keep
His poems 27
Also in his talks
(8)
20 October 1988
Make Your Life Worthwhile in Nāma-saṅkīrtana!
24 November 1990
Share in Bhagavan's love
27 February 1995
Every atom is the form of God
1 January 1996
The individual's welfare lies within the welfare of society
23 August 1996
Only He Who Bows to God's Command Can Experience Divinity in Full
23 November 1997
The God who fills everything is ‘I’
14 August 1998
Prema Alone Is the Path, Prema Alone the Goal
12 October 1998
The True Place of God's Pādukās Is the Heart Itself
ఒక్కొక్కతూరి
అనేక
విధములుగా
మనస్సు
పరిగెత్తుతూ
ఉంటుండాది.
కాబట్టి
ఈ
పిచ్చికోతివంటి
మనస్సును
నీవే
తీసుకొని
నాకు
శాంతిని
ప్రసాదించుమ’ని
కోరి
వ్రాసిన
పుస్తకములన్నీ
కట్టకట్టి
గోదావరిలో
వేశాడు.
కొన్ని
మునిగిపోయినవి,
కొన్ని
తేలిపోయినవి.
మునిగిపోయినవి
నావి
అనగా
లోకమునకు
సంబంధించినవి.
తేలినవి
మాత్రమే
ఈశ్వరానుగ్రహమనుకొని
తీసుకున్నాడు.
భగవంతుని
చర్యలు
ఎవ్వరూకూడను
అర్థము
చేసుకొనలేరు.
సూరదాసు
భగవంతుని
తత్త్వము
తెలుసుకోవడం
అసాధ్యమనుకున్నాడు.
అప్పుడు
ఈ
విధముగా
వాపోయాడు:
నిను
కనుగొనగలమా
కృష్ణా!
నిను
కనుగొనగలమా!
అణువుకంటె
అతి
సూక్ష్మరూపుడవు
ఘనముకంటె
అతి
ఘననీయుడవు
ఎనుబదినాలుగు
లక్షల
జీవముల
అనయమ్మును
నెడబాయకుందువట
అణురేణు
తృణకాష్టము
మొదలుగ
అఖండ
రూపుడవై
వెలయుచుందువట
ఘనమగు
దొంగలలో
గజదొంగవు
నిను
కనుగొనగలమా
కృష్ణా!
ఎందుకనగా
దొంగలంతా
బయటి
వస్తువులను
మాత్రమే
దొంగలిస్తారు.
కాని
నీవు
హృదయములో
భద్రపరచుకున్నవాటినికూడా
దొంగిలిస్తావు.
‘చిత్తచోరా
యశోదా
కే
బాల్
నవనీత
చోర
గోపాల్’
అని
ఈ
విధముగా
కృష్ణుని
వేడుకున్నాడు.
అంతర్
జగత్తునకు
బాహ్యజగత్తుకు
అవినాభావసంబంధమున్నదని
ప్రతి
వ్యక్తికూడను
గుర్తించవలసిన
విషయము.
ఇందులో
మానవత్వమనేటువంటిది,
దివ్యత్వమనేటువంటిది
భిన్నస్వరూపములుకావు.
అందాన్ని
చూచి
ఆనందించేది,
ఆహారాన్నిచూసి
ఆస్వాదించేది,
బయటి
వస్తువులను
చూసి
పరవసించేది
దేహమా
లేక
ఆత్మనా?
మానవుడు
ఈ
రెండు
విషయములను
తప్పనిసరిగా
విచారించవలసినదే!
3
▾
Meaning
Keep
ఇందులో
మానవత్వమనేటువంటిది
దివ్యత్వములోనే
యిమిడి
యుంటున్నది.
బాహ్యజగత్తుకు
మూలము,
అంతర్జగత్తుకు
ఆది
అయినదే
ఆత్మతత్త్వము.
ఇట్టి
ఆత్మతత్త్వాన్ని
మానవుడు
విస్మరిస్తున్నాడు.
అయితే
భౌతిక
శరీరము
మనసునకు
ఒక
కవచములాంటిది.
కేవలం
పాంచభౌతికమైన
దేహమే
సర్వస్వంగా,
జగత్తునకు
ఆధారముగా
భావించి
అనుసరిస్తూ
వస్తున్నాడు.
ఇది
చాలా
అజ్ఞానము.
మానవునకు
సాధన
అవసరం
మనస్సుయొక్క
తత్త్వము
దేహమునుండి
ఆవిర్భవించింది.
దేహము
అన్నమయము.
అన్నమయమునుండి
ప్రాణమయకోశమునందు
ప్రవేశిస్తుంది.
ప్రాణమయకోశము
మనోమయకోశములో
చేరిపోతున్నాది.
మానవుడు
భుజించే
ఆహారము
మూడు
విధములుగా
మారిపోతున్నది.
స్థూలరూపమైన
పదార్థము
మలరూపములో
విసర్జిస్తున్నాడు.
సూక్ష్మరూపమైన
ఆహారము
కండలుగా
మారిపోతున్నది.
అతిసూక్ష్మమైన
ఆహారము
మనస్సుగా
మారిపోతున్నది.
అదే
విధముగా
త్రాగే
నీరు
స్థూలముగా
మూత్రరూపములో
పోతున్నది.
సూక్ష్మరూపమైనది
రక్తముగా
మారుతున్నది.
అతిసూక్ష్మరూపమైనది
ప్రాణముగా
మారుతున్నది.
మానవుడు
తీసుకున్న
ఆహారము,
నీరు
ప్రాణమయ,
మనోమయ
రూపములను
ధరిస్తున్నవి.
దేహము
పాంచభౌతికము.
నీటిబుడగవంటిది.
అనిత్యము
అశాశ్వతము
అయినటువంటిది.
పుట్టడం,
పెరగడం,
పోషించటం,
అభివృద్ధి
నొందడం,
క్షీణించడం,
నశించటంవంటి
షడ్వికారములు
కలిగినటువంటిది.
ఈ
షడ్వికారమైన
దేహమునుండి
ఆవిర్భవించినటువంటి
ప్రాణము,
మనస్సుకూడను
షడ్వికారస్వరూపములే!
ఏ
విధముగా
దేహము
అనిత్యమో,
అదే
విధముగా
ప్రాణమూ
అనిత్యమే!
మనస్సు
మరింత
అనిత్యమైనటువంటిది.
మనస్సు
క్షణభంగురమైనటువంటిది,
క్షణక్షణమునకు
చలించేది.
కాంతివేగముకంటే
అతివేగిరముగా
పరిగెత్తేటువంటిది.
కాబట్టి,
మనస్సుయొక్క
పరుగును
నియంత్రించడం
ఎవ్వరివల్ల
సాధ్యముకాదు.
జగత్తంతయు
ఈ
మనస్సు
ఆవరించియున్నది.
ఇట్టి
పవిత్రమైన
మనస్సును
విజ్ఞానమయముగా
మార్చుకోవటానికి
ప్రయత్నించటమే
సరియైన
విద్య.
4
▾
Meaning
Keep
కారణం,
ఈ
మనస్సే
మానవత్వాన్ని
దివ్యత్వముగా
మార్చుకునేటువంటి
శక్తి
కలిగివుంటున్నాది.
మానవునకు
సాధన
అవసరం.
‘సాధనమున
పనులు
సమకూరు
ధరలోన’.
Practise
makes
a
man
perfect.
ఈ
సాధనలో
ఏది
సులభమైన
మార్గము?
కర్మమార్గము,
జ్ఞానమార్గము,
యోగమార్గము
ఇవన్నింటియొక్క
సారము
భక్తిమార్గము.
భక్తిలోనే
సర్వ
సద్గుణములు
యిమిడియుంటున్నవి.
విశ్వాసమే
మానవత్వమునకు
పునాది
ధ్యానమంటే
ఏమిటి?
Concentration
is
Meditation
అంటారు.
కాదు
కాదు.
Concentration
is
a
way
of
life.
concentration
లేకుండా
మనము
ఏ
పని
చేయలేము.
రోడ్డుమీద
నడవాలంటే
ఏకాగ్రత
అవసరము,
కారు
డ్రైవు
చేయాలంటే
ఏకాగ్రత
అవసరము,
లేదంటే
యాక్సిడెంట్
అవుతుంది.
Concentration
is
below
the
senses.
ఇది
ఏ
విధముగా
వుంటుండాది?
ఒక
చిన్న
ఉదాహరణము.
ఒక
జాబును
చదువుతున్నాము
లేదా
జాబును
వ్రాస్తున్నాము.
ఈ
వ్రాసి,
చదివే
సమయములో
ఎన్ని
sensesని
ఉపయోగపెడుతున్నాము?
చేతితో
పేపరును
పట్టుకుంటున్నాము.
కంటితో
చూస్తున్నాము.
ఇంకొక
చేతితో
వ్రాస్తున్నాము.
మనస్సుతో
యోచిస్తున్నాము.
బుద్ధితో
విచారణ
చేస్తున్నాము.
ఈ
senses
అయినటువంటి
కళ్ళు,
చేతులు,
మనస్సు,
బుద్ధి
ఇవన్నీ
ఉపయోగపెట్టి,
concentration
చేసినప్పుడే
ఆ
లెటరును
పూర్తిచేయగలుగుతున్నాము.
కాబట్టి
concentration
is
below
the
senses,
meditation
is
beyond
the
senses.
ఈ
రెండింటికిమధ్య
ఒక
బోర్డర్
వున్నది.
ఆ
బోర్డరే
contemplation.
ఈ
concentration
నుండి
contemplation
లోకి
ప్రవేశించి,
contemplation
నుండి
meditation
లోనికి
చేరుకోవాలి.
గంటసేపు
కూర్చుంటున్నాము
కాని
మనసు
నిలిచింది
ఎన్ని
సెకన్లు?
మనస్సును
నిలకడగా
పెట్టలేకుండా
కూర్చుని
టైమును
వృధా
చేస్తున్నాం.
కాబట్టి
యీనాడు
చేస్తున్న
ధ్యానము
సరియైన
ధ్యానముకాదు.
Dont
waste
time.
Time
waste
is
life
waste.
కాబట్టి
మనస్సును
అరికట్టడానికి
వెచ్చించే
కాలమును
నీవు
వృధా
చేయకుండా
పవిత్రమైన
కర్మలను
చెయ్యి.
ఏమిటి
పవిత్రమైన
కర్మలంటే?
5
▾
Meaning
Keep
Goodwork
is
God's
work.
Work
is
worship.
దీనినే
వేదాంతమునందు
‘సర్వకర్మ
భగవత్
ప్రీత్యర్థం’
అన్నారు.
నీ
సంతృప్తియే
నిజమైన
దైవత్వము.
కాబట్టి
దైవత్వము
పొందాలంటే
ముందు
self
confidence
వుండాలి.
అప్పుడే
self
satisfaction
వస్తుంది.
ఈ
self
satisfaction
వచ్చినప్పుడు
self
sacrifice
రావాలి.
అప్పుడే
self
realisation
వస్తుంది.
కాబట్టి
మనము
ముందు
విశ్వాసము
పెంచుకోవాలి.
ఈ
విశ్వాసమే
మానవత్వములో
ప్రధానమైన
దైవత్వము.
విశ్వాసములేకుండా
ఏ
పనికూడను
చేయలేము.
కాని,
దేనిపైన
విశ్వాసము
పెట్టాలో
దానిమీద
పెట్టడంలేదు.
దీనికి
కారణము
మనస్సే!
Previous
←
Humanness Is the United Form of Mind, Word and Deed
Next
The Consciousness Called Divinity Fills Everything
→