Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1997 · “Rāmo vigrahavān dharmaḥ”
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
“Rāmo vigrahavān dharmaḥ”
16 April 1997, Śrī Rāma Navamī, Brindavan
1
▾
Meaning
Keep
వేదవేద్యుడైన
భగవంతుడు
దశరథ
కుమారునిగా
జన్మించి
జగత్తునందు
శ్రీరామచంద్రుడై
వర్ధిల్లుచున్నాడని
వాల్మీకి
రచించాడు.
అతడు
సామాన్య
మానవునివలె
సంచరిస్తున్నాడని
కూడా
వర్ణించాడు.
అట్టి
రామునిలో
దేవుణ్ణి
చూశాడు
వాల్మీకి.
కాని,
రాముణ్ణి
మానవునిగా
చూశాడు
రావణుడు.
రాముడు
ధర్మము,
రావణుడు
అధర్మము.
కనుక
రామాయణ
మంతయు
ధర్మాధర్మముల
రణరంగము,
ధర్మాధర్మముల
చదరంగము.
రావణుడు
ఈ
ప్రపంచానికి
ఒక
చక్కని
సందేశాన్ని
అందించాడు.
ఏమిటది?
“ఓ
జనులారా!
మీరు
నావలె
జీవించి
మీ
జీవితాలను
నాశనం
చేసుకోకండి.
ఆశలను
జయించలేక,
వాంఛలను
చంపుకోలేక
నా
వంశాన్నే
నాశనం
చేసుకున్నాను.
కొడుకులను,
సోదరులను,
బంధుమిత్రులను
చంపుకున్నాను.
కడకు
నేను
కూడా
నశించాను”
అన్నాడు.
మంచినడతతో
కూడినప్పుడే
మనిషి
మంచివాడవుతాడు.
రావణుడు
తాను
గొప్పవాడు
కావాలని
ప్రయత్నించాడుకాని,
మంచివాడు
కావాలని
ప్రయత్నించ
లేదు.
రాముడు
మాత్రం
తాను
మంచివాడు
కావాలని
ప్రయత్నించాడుకాని,
గొప్పవాడు
కావాలని
ఆశించలేదు.
ఈనాడు
లోకమునకు
రామచరితము
అత్యవసరం.
ఎందుకనగా
-
కొడుకులు
తండ్రి
ఆజ్ఞను
పాటించడం
లేదు,
తండ్రులు
కొడుకులకు
సరియైన
ఆదర్శాన్ని
అందించడం
లేదు.
శిష్యులు
గురువులను
గౌరవించడం
లేదు,
గురువులు
శిష్యులను
వాత్సల్యంతో
చూడటం
లేదు.
బంధుమిత్రుల
మధ్య
శత్రుత్వం
అభివృద్ధి
అవుతున్నది.
వ్యవసాయ
వ్యాపార
రాజకీయ
రంగములన్నింటియందు
కాలుష్యము
నిండియున్నది.
చివరికి
ఆధ్యాత్మిక
రంగము
కూడా
కలుషిత
మవుతున్నది.
చక్కగా
విచారణ
చేస్తే
స్వార్థమే
దీనికి
మూలకారణమని
స్పష్టమవుతున్నది.
అందరూ
త్రాగే
నీరు
ఒక్కటే.
అందరూ
పీల్చే
గాలి
ఒక్కటే.
అందరి
తలపైన
ఉన్నది
ఒకే
ఆకాశమే.
అందరి
పాదముల
క్రింద
ఉన్నది
ఒకే
భూమియే.
విశ్వమే
ఒక
గృహము.
మానవులందరూ
సోదరులే.
ఇట్టి
ఏకత్వాన్ని
మొట్టమొదట
గుర్తించాలి.
హృదయమే
అయోధ్య
వ్యక్తి
ధర్మమును,
సంఘధర్మమును,
కుటుంబధర్మమును
రాముడు
నిరూపిస్తూ
వచ్చాడు.
ఈ
ధర్మత్రయ
త్రివేణీ
సంగమమే
రామచరితము.
ఈ
త్రివేణీ
సంగమమునందు
స్నాన
మాచరించిన
వారికి
పాపములు
పరిహారమౌతాయి,
శాపములు
నిర్మూలమౌతాయి.
ఈ
దివ్యచరితమును
ప్రతి
మానవుడు
స్మరించాలి,
వరించాలి,
తరించాలి.
రాముని
చరిత్ర
ఇట్టిది,
అట్టిది
అని
వర్ణించుటకు
వీలుకానిది.
సముద్రములోని
తరంగములనైనా
లెక్కించవచ్చునుకాని,
రాముని
గుణగణములను
ఎవ్వరూ
లెక్కించ
లేరు.
రాముడు
అయోధ్యను
పరిపాలించాడు.
అయోధ్య
అనగా
ఏమిటి?
యోధులు,
విరోధులు
చేరరానటువంటి
ప్రదేశము.
2
▾
Meaning
Keep
అదే
మానవ
హృదయం.
అక్కడే
రాముడుంటున్నాడు.
ఈనాటి
మానవహృదయంలో
క్షణక్షణమూ
ఏదో
ఒకవిధమైన
ఆవేదనలు
ఏర్పడుతున్నాయి.
మొట్టమొదట
మానవహృదయం
అయోధ్యగా
మారాలి.
నిర్మలమైనదిగా,
నిశ్చలమైనదిగా,
కలతలు
లేనిదిగా
ఉండాలి.
అప్పుడే
రాముడు
అందులో
ప్రవేశించి
సరియైన
మార్గాన్ని
చూపుతాడు.
రాముడు
తాను
దేవుడైనను
సామాన్య
మానవునివలె
సంచరించాడు.
కనుక
ఈనాడు
సామాన్య
మానవుడు
రామునివలె
సంచరించాలి.
అప్పుడే
నిజమైన
భక్తిప్రపత్తులు
అభివృద్ధి
కాగలవు.
రామతత్వం
పవిత్రమైన
రామతత్వములో
అనేక
రహస్యములు
ఇమిడి
యున్నవి.
కాని
ఈ
రహస్యములను
రాముడు
ఎప్పుడూ
ఎక్కడా
ఎవ్వరికీ
బోధించ
లేదు.
కారణ
మేమిటి?
ఫలము
పక్వమైన
తరువాత
రాలక
తప్పదు.
అదేవిధంగా
ప్రజల
హృదయాలు
పరిపక్వమైతేగాని
తన
బోధ
అర్థం
కాదనే
భావనతో
రాముడు
సామాన్య
మానవునివలె
సంచరించాడు.
కష్టనష్టములను,
నిందానిష్ఠూరములను
ధైర్యసాహసములతో
ఎదుర్కొని
దివ్యత్వాన్ని
ప్రకటించాడు.
తాను
సుఖములకు
పొంగలేదు,
దుఃఖములకు
క్రుంగలేదు.
నిందాస్తుతుల
పట్ల
సమత్వాన్ని
వహించాడు.
“సుఖదుఃఖే
సమేకృత్వా
లాభా
లాభౌ
జయా
జయౌ.”
కాని
ఈనాటి
భక్తులు
సుఖము
కల్గితే
పొంగిపోతున్నారు,
దుఃఖము
కల్గితే
క్రుంగిపోతున్నారు.
దీనికి
మూలకారణ
మేమిటి?
దేహాభిమానమే!
ఈనాడు
మనం
అనేక
సాధనలు
చేస్తున్నాము,
స్తోత్రములు
పఠిస్తున్నాము,
కీర్తనలు
పాడుతున్నాము.
కాని
ఇవన్నీ
కేవలం
బాహ్యమైనవిగానే
గోచరిస్తున్నాయి.
ఎవరికోసం
చేస్తున్నాము?
ఎందుకోసం
చేస్తున్నాము?
అనే
ప్రశ్నలను
ఎవరికి
వారు
వేసుకోవడం
లేదు.
ఒక
గురువువద్ద
ఒక
శిష్యుడుండేవాడు.
ఒకనాడు
అతడు
ఇంటికి
వెళ్ళి,
తన
సాధనకు
ఎట్టి
అంతరాయమూ
కలుగకూడదనే
ఉద్దేశ్యంతో
తలుపులు
మూసుకొని,
గురుస్తోత్రం
చేస్తూ
కూర్చున్నాడు.
అదే
సమయానికి
గురువు
అతని
ఇంటికి
వెళ్ళాడు.
అది
మిట్టమధ్యాహ్నం
కావడంచేత
బయట
ఎండ
మండిపోతున్నది,
క్రింద
కాళ్ళు
కాలిపోతున్నాయి.
దానిని
భరించుకోలేక
గురువు,
“ఒరేయ్
శిష్యా!
శిష్యా!”
అని
గట్టిగా
పిలుస్తూ
తలుపు
తట్టాడు.
“ఎవరు
మీరు?”
అని
ప్రశ్నించాడు
శిష్యుడు.
“నేనురా!
నీ
గురువును”
అన్నాడు.
“నేను
పూజ
చేస్తున్నాను.
దానికి
భంగం
కలుగకూడదు.
కొద్దిసేపు
ఆగండి”
అన్నాడు
శిష్యుడు.
“ఎవరి
పూజ
చేస్తున్నావురా?”
అని
గురువు
ప్రశ్నించగా,
“మీ
పూజనే
చేస్తున్నాను”
అని
జవాబిచ్చాడు.
గురుపూజ
చేస్తూ
గురువునే
ఎండలో
నిలబెట్టాడు!
ఈనాటి
సాధనలు
కూడా
ఈవిధంగానే
ఉన్నాయి.
గురువును
గౌరవించక
గురుపూజ
చేయడ
మెందుకు?
అదేరీతిగా
హృదయంలో
ఉన్న
రామతత్వాన్ని
గుర్తించక
రాముని
ఎంత
పూజించినా
ప్రయోజనం
లేదు.
ఈ
పూజలన్నీ
దేహాభిమానంతో
కూడినవే.
సాధకులు
మొట్టమొదట
ఆత్మాభిమానులు
కావాలి.
ఎన్ని
జన్మలెత్తినప్పటికీ
దేహములు
మారుతుంటాయికాని
మనస్సు
మారదు.
కనుక
మనస్సుతో
చేసే
సాధనలు
మనకు
ముక్తి
నీయలేవు.
మనస్సును
విస్మరించి
ఆత్మను
లక్ష్యంగా
పెట్టుకొని
సాధన
చేయాలి.
అప్పుడే
మానవ
జీవితం
సార్థకమవుతుంది.
3
▾
Meaning
Keep
మిథిలలో
రామలక్ష్మణులు
విశ్వామిత్రుడు
తన
యాగము
పూర్తియైన
తరువాత
రామలక్ష్మణులను
మిథిలాపురమునకు
తీసికొని
వెళ్ళాడు.
మరునాడు
శివధనుర్భంగము
జరుగవలసి
యున్నది.
దాని
తరువాత
ఎలాగూ
అయోధ్యకు
వెళ్ళవలసి
వస్తుంది
గనుక
లక్ష్మణునికి
మొట్టమొదట
మిథిలాపురసౌందర్యమును
తిలకించవలెనన్న
ఆశ
పుట్టింది.
తన
వాంఛను
రామునికి
విన్నవించుకున్నాడు.
అప్పుడు
రాముడు,
“లక్ష్మణా!
మనం
గురువాజ్ఞకు
బద్ధులమై
ఉన్నాము.
గురువాజ్ఞ
లేకుండా
మనం
ఏదీ
చేయడానికి
వీల్లేదు”
అన్నాడు.
ఇరువురూ
విశ్వామిత్రునివద్దకు
వెళ్ళి,
“గురూజీ!
మేము
మిథిలాపురమును
చూడాలని
ఆశిస్తున్నాము”
అన్నారు.
“రామలక్ష్మణులారా!
మీరు
ఈ
జగత్తును
సంరక్షించే
నిమిత్తమై,
జగత్తును
మోహింపజేసే
నిమిత్తమై,
ప్రజల
భ్రమలను
నిర్మూలం
గావించే
నిమిత్తమై
జన్మించారు.
కనుక
మీరు
తప్పక
మిథిలాపురములో
సంచరించి
ప్రజలందరినీ
పవిత్రులను
గావించండి”
అన్నాడు.
గురువాజ్ఞను
తీసుకొని
రామలక్ష్మణులు
మిథిలాపురంలో
వీథుల
వెంట
నడుస్తూ
వెళుతుంటే
ఎక్కడివారక్కడే
నిలచిపోయి
రెప్పవాల్చకుండా
చూడసాగారు.
వీథులలో
ఆడుకొంటున్న
పిల్లలు
పరుగెత్తి
వచ్చి
రామలక్ష్మణుల
చేతులు
పట్టుకొని,
“అన్నగారూ!
ఎక్కడి
నుండి
వచ్చారు?
ఎప్పుడు
వచ్చారు?
దయచేసి
ఒకసారి
మా
ఇంటికి
రండి”
అని
పిలుస్తున్నారు.
రామలక్ష్మణులు
తలలు
వంచుకొని
బజారులో
పోతుంటే
ఒక్కసారి
వారి
కన్నులను
చూడాలని
స్త్రీలు
తహతహలాడారు.
పువ్వులతో
కొడితే
వారేమైనా
తమవైపు
చూస్తారేమో
నన్న
ఆశతో
పువ్వులను
చల్లారు.
కాని
ఎవరెంతగా
చల్లినప్పటికీ
రామలక్ష్మణులు
స్త్రీలనెవ్వరినీ
చూడలేదు,
తలలు
వంచుకొని
నడుస్తూ
వచ్చారు.
ఇదే
రామభక్తులు
చేయవలసిన
ప్రధానమైన
సాధన.
దృష్టిని
అరికట్టుకొన్నవానికి
సృష్టియే
వశమైపోతుంది.
రాముడు
దృష్టిని
అరికట్టుకొన్నవాడు
కనుకనే
భూజాతయైన
సీత
అతని
వశమైపోయింది.
ఇలాంటి
పవిత్రమైన
సందేశాలు
ఎన్నో
రామచరిత్రలో
మనకు
గోచరిస్తాయి.
దశరథుని
స్వప్నం
ఒకనాటి
రాత్రి
దశరథునికొక్క
కల
వచ్చింది.
సముద్రంలో
నీరంతా
ఇంకిపోయినట్లుగా,
చంద్రుడు
క్రిందపడి
ముక్కలు
ముక్కలైపోయినట్లుగా,
మదపుటేనుగు
క్రిందపడి
ప్రాణం
విడిచినట్లుగా,
దానిపైనున్న
సింహాసనము
క్రింద
కూలినట్లుగా
అతనికి
కనిపించింది.
వెంటనే
అతడు
లేచి
కూర్చున్నాడు.
“ఏమిటీ
విచిత్రము!
నాల్గవ
ఝాములో
వచ్చిన
స్వప్నం
నిజమౌతుందంటారు.
ఇది
నాల్గవ
ఝామే
కనుక
ఈ
స్వప్నము
యొక్క
అంతరార్థ
మేమిటో!”
అని
తనలో
తాను
చాల
బాధపడుతున్నాడు.
పడకపై
నుండి
క్రిందికి
దిగి
ప్రక్కనే
ఉన్న
నిలువుటద్దములో
తన
ప్రతిబింబాన్ని
తాను
చూసుకున్నాడు.
తలపై
అక్కడక్కడ
తెల్లవెంట్రుకలు
కనిపించాయి.
అనగా
తనకు
వృద్ధాప్యము
ప్రారంభమైనదని
గుర్తించాడు.
ప్రక్కనే
ఉన్న
జగ్గు
నుండి
కప్పులోకి
నీరు
పోసుకోవడానికి
ప్రయత్నించగా
చేతులు
కాస్త
అదిరాయి.
అంటే
ఇంద్రియశక్తి
కూడా
క్షీణించినదని
గమనించాడు.
“ఇంద్రియశక్తి
ఉన్నంతవరకు
ఈ
రాజ్యాన్ని
పరిపాలించాను.
ఇప్పుడు
నా
ఇంద్రియశక్తి
క్షీణించింది.
కనుక,
నేనింక
రాజ్య
పరిపాలన
చేయుటకు
అనర్హుడను”
అని
భావించాడు.
వెంటనే
తన
గురుదేవులను,
మంత్రులను
పిలిపించాడు.
4
▾
Meaning
Keep
“నేనింత
కాలము
ప్రజలను
కన్నబిడ్డలవలె
పరిపాలించాను.
ప్రజాభీష్టమే
నా
అభీష్టమని
భావించాను.
ఇప్పుడు
నా
ఇంద్రియశక్తి
క్షీణించింది.
కనుక
నా
జ్యేష్ఠపుత్రుడైన
రామునికి
పట్టాభిషేకం
చేయదల్చుకున్నాను”
అన్నాడు.
కాని
ప్రజలు,
మంత్రులు,
“మహారాజా!
మీకింకా
రాజ్యపాలన
చేయగల
శక్తి
ఉన్నది.
కనుక
మీరే
ఇంకా
కొంతకాలం
పరిపాలిస్తే
బాగుంటుంది”
అన్నారు.
ఈ
మాటలు
విని
దశరథుడు
రామునికి
పట్టాభిషేకం
చేయడం
వీరెవ్వరికీ
ఇష్టం
లేదేమో
అనుకున్నాడు
పాపం!
మంత్రులు
వెంటనే,
“మహారాజా!
రాముడు
మహాగుణవంతుడే.
కాని
మీకున్న
అనుభవం
అతనికి
లేదు
కదా!
ముందు
రాముని
యువరాజుగా
చేసి
రాజ్యపాలనలో
అతనికి
మార్గదర్శకత్వం
వహించండి”
అన్నారు.
చూశారా!
ఇంద్రియ
పటుత్వం
లేనివాడు
రాజ్యపాలనకు
అర్హుడు
కాడన్నాడు
దశరథుడు.
కాని
ఈనాటి
నాయకులు
కన్నులు
కనిపించకపోయినా,
చెవులు
వినిపించకపోయినా,
చేతితో
సంతకం
చేయడానికి
వీలుకాకపోయినా
ఇంకా
రాజ్యం
ఏలాలని
ఆశిస్తున్నారు.
లవకుశులు
రాముడు
అయోధ్యను
పరిపాలిస్తున్న
రోజులలో
వాల్మీకి
రామాయణమును
రచించాడు.
దానిని
ప్రపంచానికి
చాటి,
ప్రజల
హృదయాలలో
నాటి
వారిని
పవిత్రులను
గావించాలని
సంకల్పించుకున్నాడు.
రామచరితము
పద్యరూపంలోను,
గద్యరూపంలోను,
గేయరూపంలోను
అన్ని
విధాలుగా
హృదయాన్ని
ఆకర్షిస్తుంది.
ఇందులోని
శ్లోకాలు
శోకనివారణ
గావిస్తాయి.
ఇట్టి
పవిత్రమైన
రామాయణాన్ని
ప్రజలలో
ఏరీతిగా
ప్రచారం
చేయాలని
వాల్మీకి
యోచిస్తూ
కూర్చున్న
సమయంలో
ఋషివేషధారులు,
మధురగాయకులు
అయిన
కుశలవులు
వచ్చి
నమస్కరించి
నిలిచారు.
వీరు
జంటపక్షులు.
వీరి
శక్తిసామర్థ్యములను
వర్ణించుటకు
వీలుకాదు.
ఎవ్వరికీ
వెఱువరు,
వెనుకంజ
వేయరు.
బిడియమనేది
వీరియందు
లేనే
లేదు.
వాల్మీకి
వీరిరువురినీ
చూసి,
“లవకుశులారా!
నేను
ఎంతో
శ్రమించి
నిండు
హృదయంతో,
పవిత్రమైన
భావంతో
ఈ
రామాయణమును
వ్రాశాను.
దీనిని
మీరు
ప్రపంచమునకు
చాటాలి”
అని
ఆదేశించాడు.
లవకుశులు
అత్యంత
వినయంతో
నమస్కరించి,
“గురూజీ!
మాకు
సెలవివ్వండి.
మేము
గ్రామగ్రామమూ,
వీథివీథీ
తిరిగి
ప్రచారం
చేస్తాము”
అన్నారు.
ఒకానొక
ప్రదేశంలో
ఋషులందరూ
సమావేశమై
యుండగా
ఈ
లవకుశులు
వారి
మధ్యకు
వెళ్ళి
కమ్మని
కంఠంతో
పవిత్రమైన
రామకథను
గానం
చేయగా
ఋషులందరూ
ముగ్ధులై
ఆనందబాష్పములు
రాల్చారు.
లవకుశులను
హృదయపూర్వకంగా
ఆశీర్వదిస్తూ
రామాయణమును
ప్రపంచ
మంతటా
ప్రచారం
చేయవలసిందిగా
కోరారు.
రాముని
సమక్షంలో
రామకథాగానం
లవకుశులు
అయోధ్యలో
ప్రవేశించి
రామకథను
శ్రావ్యంగా
గానం
చేస్తుంటే
బజారులో
ఎక్కడివారు
అక్కడే
నిలిచిపోయారు.
వారి
హృదయాలు
ఆనందంతో
నిండిపోయాయి.
ఎక్కడ
ఉన్నాము,
ఏమి
చేస్తున్నామనే
చింతనే
లేదు
వారికి.
అదే
భావసమాధి.
ఆ
సమయంలో
రథము
నెక్కి
అటువైపు
వచ్చిన
రాముడు
కూడా
లవకుశుల
రామకథాగానమును
విని
ముగ్ధుడయ్యాడు.
తన
భవనమునకు
వచ్చి
రామకథా
గానం
చేయవలసిందని
తాను
పిలిచినట్లుగా
లవకుశులకు
చెప్పమని
ఇంటికి
వచ్చిన
తరువాత
మంత్రులను
పంపించాడు.
5
▾
Meaning
Keep
Also in his talks
(1)
5 September 1996
Saccidānanda Is Man's Very Nature!
ఈవిధంగా
సామాన్య
ప్రజల
ముందేగాక
సాక్షాత్తు
శ్రీరామచంద్రుని
సమక్షంలోను
లవకుశులు
రామకథను
గానం
చేశారు.
రామచరితమును
రాముడు
కూడా
విని
ఆనందించాడు.
కుశలవులు
ఎట్టి
జంకుగాని,
బిడియముగాని
లేకుండా
ప్రజల
మధ్యకు
వెళ్ళి
రామకథను
స్వేచ్ఛగా
గానం
చేస్తూ,
ప్రచారం
చేస్తూ
వచ్చారు.
కాని
ఈనాటి
ఆధునిక
యువకులకు
పదిమంది
ముందర
భగవన్నామాన్ని
గానం
చేయాలంటే
బిడియం
అడ్డు
వస్తుంది.
బయటికి
వెళ్ళేటప్పుడు
ఇంత
బొట్టు
పెట్టుకోవాలంటే
అవమానంగా
భావిస్తారు.
రెండు
చేతులూ
ఎత్తి
నమస్కారం
చేయాలంటే
ఏదో
కొంప
కూలినట్లు
బాధపడతారు.
కాని
లవకుశులు
ఇట్టి
దేహాభిమానాన్ని
కూలద్రోసి
ఆత్మాభిమానంతో
రామాయణాన్ని
గానం
చేస్తూ
వచ్చారు.
“పొద్దుపోక
ఊరివారి
సుద్దులంటే
మీరు
సిద్ధమవుదురే
కడు
శ్రద్ధతోడ
ముద్దు
ముద్దుగాను
భగవత్
ముచ్చటలు
చెప్పువేళ
ఒద్దికగ
నుండరే
ఓ
చెవులారా!
పనిమాలి
సినిమాలు
పలుమారు
మీరు
చనిచని
కనియును
తనివి
లేదె
క్షణమైన
దైవసన్నిధి
నిలువగ
కనులారా
కడు
కష్టమటే!”
ఎవరిని
చూడవలసింది?
కన్నుల
నిచ్చినది
ఎందుకోసం?
చెవుల
నిచ్చినది
ఎందుకోసం?
భగవంతుని
చూడాలి.
భగవన్నామాన్ని
స్మరించాలి.
భగవత్సన్నిధి
చేరాలి.
కనుక
ఈనాటి
యువకులు
లవకుశుల
ఆదర్శాన్ని
అనుసరించడానికి
కంకణం
కట్టుకోవాలి.
దేహాభిమానమును
త్యజించి
భగవద్విషయాన్ని
జగత్తులో
ప్రచారం
చేయడానికి
పూనుకోవాలి.
ఆ
నామములో
ఉన్న
మాధుర్యమును,
ఆ
స్మరణలో
ఉన్న
దివ్యత్వమును,
ఆ
చింతనలో
ఉన్న
పవిత్రతను
గుర్తించాలి.
అతడు
నిరంతరము
కల్యాణరాముడే,
నిరంతరము
కోదండరాముడే,
నిరంతరము
పట్టాభిరాముడే.
హృదయమే
అతని
సామ్రాజ్యము.
హృదయంలోనే
తన
పట్టాభిషేకమును
జరిపించుకుంటున్నాడు.
అందువల్లనే
త్యాగరాజు
చెప్పాడు
-
“రామా
కోదండరామా
రామా
పట్టాభిరామా
రామా
కల్యాణరామా
రాఘవా!
రామా
నీకొక్క
మాట,
రామా
నాకొక్క
మూట
రామా
నీ
పాటే
పాట
రామా
నీ
బాటే
బాట
రామా
సీతాపతి,
రామా
నీవే
గతి
రామా
నీకు
మ్రొక్కితి,
రామా
నీ
చేజిక్కితి
రామా
నీ
చింతనె
చాలు,
రామా
నీ
నామమె
మేలు
రామనామమె
మేలు,
రామచింతనె
చాలు
రామచింతనె
చాలు,
రామనామమె
మేలు
రామా
నేను
నీవాడు,
రామా
నాతో
మాటాడు
రామా
కోదండరామా....”
ఈవిధంగా
రామచరితమును,
రాముని
గుణగణములను
కొనియాడుతూ
వచ్చారు
పరమ
భక్తులు.
ఇంత
పవిత్రమైన
చరిత్ర
ఏ
దేశముయందుగాని,
ఏ
భాషయందుగాని
కనిపించదు.
రామాయణము
జరిగి
ఎన్నో
వేల
సంవత్సరములు
గడిచిపోయినప్పటికీ
ఈనాటికీ
ఊరుఊరుయందు,
వాడవాడయందు
రామచింతన
జరుగుచునే
ఉన్నది.
భారతదేశంలో
రామనామం
తెలియనివాడు
కనిపించడు.
ఏ
చిన్న
పల్లెలోనైనా
రామమందిరం
కనిపిస్తుంది.
అయితే
హృదయమందిరమే
మనకు
ప్రధానంకాని
బాహ్యమైన
మందిరాలు
కాదు.
6
▾
Meaning
Keep
Also in his talks
(1)
30 September 1998
God's Prema Is Eternal, Everlasting
భగవంతుడు
హృదయవాసి;
తిరుపతివాసి
కాదు,
భద్రాచలవాసి
కాదు,
వైకుంఠవాసి
కాదు,
కైలాసవాసి
కాదు.
అవన్నీ
బ్రాంచాఫీసులు,
హెడ్ఆఫీసు
హృదయమే.
కనుక
మీరు
భగవంతునికోసం
ఎక్కడా
తిరుగనక్కరలేదు,
నయాపైసా
ఖర్చు
చేయనక్కర
లేదు.
కానీ
ఖర్చు
లేకుండా,
కాలు
గడపదాటకుండా
కైవల్యం
ఒళ్ళో
ఉట్టిపడినట్లుగా
రాముడు
హృదయంలోనే
ఉంటున్నాడు.
మనం
రామజన్మభూమియందు
జన్మించి,
రామజన్మదినమును
జరుపుకుంటున్నప్పటికీ
రామతత్వాన్ని
గుర్తించుకోలేక
పోతున్నాము.
మహనీయుల
జన్మదినములను
జరుపుకోవడం
గొప్పతనం
కాదు,
వారి
ఆదేశములను
ఆచరణలో
పెట్టాలి.
ఆచరణలో
పెట్టడమే
నిజమైన
ఆస్తికత్వము.
ఈనాడు
మనం
హృదయాన్ని
విస్మరించి
శరీరంతో
సాధనలు
చేస్తున్నాము.
అవన్నీ
నిరుపయోగమైన
సాధనలు,
నయాపైసా
విలువలేని
సాధనలు!
“నిమిష
నిమిషమునకు
నీచులూరునెగాని
పునుగు
జవ్వాదీలు
పుట్టబోవు.”
ఇట్టి
దేహముతోనా
మనం
సాధనలు
చేయడం!
ఈ
దేహము
ఎప్పుడు
కూలుతుందో!
ఎప్పుడు
రాలుతుందో!
ఇది
రాలే
లోపలనే,
కూలే
లోపలనే
మనం
దివ్యత్వాన్ని
అనుభవించాలి.
ఇదే
వాల్మీకి
బోధించినది.
అతడు
రత్నాకరుడుగా
ఉన్నప్పుడు
ఎందరి
ప్రాణములనో
తీసాడు.
కాని
చివరికి
రామనామమును
స్మరించేసరికి
తన
దేహాన్ని
మరచిపోయాడు.
అతని
చుట్టూ
పుట్టలు
పెరిగాయి.
అయినా
“రాం,
రాం,
రాం,
రాం,...”
అని
జపిస్తూనే
ఉన్నాడు.
కాని
మనం
ధ్యానం
చేసేటప్పుడు
ఒక
చిన్న
దోమ
వచ్చి
మనమీద
వ్రాలిందంటే
దానిని
కొట్టేస్తాము.
ఒక
చిన్న
దోమ
వ్రాలితేనే
సహించుకోలేని
బలహీనులం
ఇంక
ఏరీతిగా
భగవంతుని
సాధించగలం!
కష్టనష్టములకు
వెఱువక
లక్ష్యాన్ని
భగవంతునిపై
పెట్టుకోవాలి.
“చిక్కిన
సాయిని
వక్కలేయక
చక్కచేసుకోండి
పోయిన
చిక్కదు
పర్తీశుని
ఈ
పాద
సేవనండి
భక్తిని
ఇచ్చి
శక్తిని
పెంచి
ముక్తి
జేర్చునండి
ఇతరుల
మాటలు
ఇంపుగ
నమ్మి
కొంపదీయకండి
రండి,
మేలుకొండి,
మాయను
మరువండి”
ఈవిధమైన
దివ్యభావాన్ని
పెంచుకోవాలి.
ఏ
దానియందైనా
ఎక్కువ
అభిమానం
పెట్టుకోకూడదు.
అయితే
మన
కర్తవ్యాన్ని
మనం
నిర్వర్తించాలి.
ఆనాటి
అయోధ్యావాసు
లందరూ
తమ
కర్తవ్యంపై
లక్ష్యం
పెట్టుకున్నవారేగాని
అధికారం
నిమిత్తమై
అఱ్ఱులు
జాచినవారు
కాదు.
అందువల్లనే
వారు
తరించారు.
రాముడు
వెళ్ళిన
తక్షణమే
వారు
కూడా
అనుసరించారు.
“నీవు
లేని
బ్రతుకు
మాకెందుకు!
నీవే
మా
సర్వస్వము.
కనుక
మమ్మల్ని
కూడా
నీతోపాటు
తీసుకువెళ్ళు
రామా!”
అని
ప్రార్థించారు.
అదే
నిజసంబంధము.
అదే
ఆత్మసంబంధము.
ఆనాటి
రాముణ్ణి
ఈనాడు
మనం
దర్శించుకుంటున్నామంటే,
ఆనాటి
రాముణ్ణి
ఈనాడు
మనం
అనుభవిస్తున్నామంటే
ఇది
మన
అదృష్టమని
గుర్తించాలి.
ఆ
రామతత్వమును
మన
హృదయంలో
ప్రతిష్ఠించుకోవాలి.
“రామో
విగ్రహవాన్
ధర్మః”
ధర్మము,
రాముడు
వేరువేరు
కాదు.
రాముడే
ధర్మము,
రావణుడే
అధర్మము.
ధర్మాధర్మముల
చదరంగమే
ఈ
జీవితము.
అయితే
ధర్మము
రెండు
రకములు.
7
▾
Meaning
Keep
1.స్వధర్మము
2.పరధర్మము.
స్వధర్మమంటే
ఏమిటి?
క్షత్రియధర్మము,
బ్రాహ్మణధర్మము,
శూద్రధర్మము
మున్నగునవి
కాదు.
స్వ
-
అనగా
ఆత్మ.
కనుక
ఆత్మధర్మమే
స్వధర్మము,
దేహధర్మమే
పరధర్మము.
ఆనాడు
దశరథుని
మంత్రులు
ఎనిమిది
మంది.
వారెలాంటి
వారు?
నీతినిజాయతీలతో
కూడిన
వారు,
ఇంద్రియ
నిగ్రహం
కలవారు,
సత్యవాక్పరిపాలకులు.
అలాంటి
మంత్రులు,
వశిష్ఠవామదేవుల
వంటి
గురువులు,
దశరథునివంటి
రాజు
ఉంటే
ఇప్పుడు
కూడా
దేశం
రామరాజ్యంగా
మారిపోతుంది.
దశరథు
డనగా
ఎవరు?
దశేంద్రియములతో
కూడిన
ఈ
దేహమే
ఒక
రథము.
ఇందులో
ఆత్మాభిమానియైన
రాజు
ఉంటున్నాడు.
అతడే
దశరథుడు.
సత్వరజస్తమో
గుణములే
అతని
ముగ్గురు
భార్యలు.
ఈ
ముగ్గురు
భార్యలకు
ధర్మార్థకామ
మోక్షములనే
నల్గురు
కొడుకులు
పుట్టారు.
ధర్మము
రాముడు,
మోక్షము
భరతుడు,
అర్థకామములు
లక్ష్మణశత్రుఘ్నులు.
ఈనాడు
మానవుడు
ధర్మమోక్షములను
విస్మరించి
అర్థకామముల
నిమిత్తమై
ప్రాకులాడుతున్నాడు.
ఇది
రామభక్తికి
సరియైన
లక్షణం
కాదు.
జానెడు
పొట్టకు
పట్టెడన్నం
పెట్టలేడా
భగవంతుడు?
పైరు
నాటినవాడు
నీరు
పోయక
మానడు.
ఇట్టి
నమ్మకాన్ని
అభివృద్ధి
పర్చుకోవాలి.
ఇది
లేకుండా
ఎన్ని
చోట్లకు
తిరిగినా
శాంతి
చిక్కదు.
కారణ
మేమిటి?
ఈ
లోకంలో
ఎక్కడా
శాంతి
లేదు.
దృష్టిని
హృదయంవైపు
మరల్చాలి.
హృదయంలో
మాలిన్యం
నింపుకొని
శాంతి
కావాలంటే
ఎలా
చిక్కుతుంది?
ముందు
ఆ
మాలిన్యాన్ని
ఊడ్చిపారవేయాలి.
గలీజుగా
ఉన్న
చీపురుతో
ఊడ్చితే
ఇల్లు
కూడా
గలీజైపోతుంది.
మన
మనస్సే
ఒక
చీపురు.
ముందు
దానిని
పరిశుద్ధం
గావించుకోవాలి.
అది
భగవదర్పితమైనప్పుడే
పరిశుద్ధ
మవుతుంది.
కనుక
ప్రేమచేత
రామచింతన
చేయండి,
విశ్వాసంచేత
రాముణ్ణి
స్మరించండి.
ప్రేమ,
విశ్వాసములే
మానవుని
ప్రధానమైన
ప్రాణములు.
Previous
←
The greatness of nāmasmaraṇa
Next
Attachment is the disease, detachment is Nirvāṇa
→